
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
సాన్ డియాగో: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. సాన్ డియాగో లో ఓ దుండగుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది. మరోవైపు దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సాన్ డియాగో పోలీసులు సూచించారు.
BREAKING: Two #SDPD Officers have been shot tonight. Their condition is unknown. Keep them in your prayers
— San Diego Police (@SanDiegoPD) 29 July 2016