విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఎప్పటికీ తీరని సమస్యలు కొలువై ఉంటే... సీజనల్‌గా ఎదురయ్యే ఇబ్బందులు వాటికి తోడవుతున్నాయి. ఇవన్నీ విభిన్న వర్గాలవారికి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పాలకులు వాటి పరిష్కారంలో తగిన శ్రద్ధ చూపడంలేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లాలో రహదారి... తాగునీటి... సాగునీటి వంటి సమస్యలు ఎప్పటికీ సజీవంగా ఉండేవే. తాజాగా జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న ఇక్కట్ల వల్ల రైతాంగం పడుతున్న కష్టాలు అన్నీ... ఇన్నీ కావు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడా రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలకపక్షానికి పెత్తనమిస్తే అమాయక రైతులు అవస్థలు పడుతున్నారు.
పంట నష్ట పరిహారమూ అందలే...
జిల్లాలో గత ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావం కారణంగా 6 మండలాలను కరువు ప్రాం తాలుగా గుర్తించారు. రెండు నెలల క్రితం పరిహారం నిధులు కూడ విడుదల అయ్యా యి. అయితే పంట నష్ట పరిహారం ఇప్పటికీ పూర్తి స్థాయిలో రైతులకు అందలేదు.
ఊరువాడా బెల్టుషాపులే...
పల్లె, పట్టణమన్న తేడా లేదు... ప్రతీ గ్రామంలోనూ బెల్టు షాపులున్నాయి. ఎక్సైజ్‌శాఖాధికారులు రోజూ ఏదో ఒకచోట అక్రమంగా మద్యం అమ్ముతున్నారంటూ కేసులు నమోదు చేయడం చూస్తుంటే వీటి తీవ్రత ఎంతాలా ఉందో వేరే చెప్పనవసరం లేదు. అధికారంలోకి వస్తే బెల్టు తీస్తామని చెప్పిన పాలకులు కూడా వీటిని నిర్మూలించలేక చేతులెత్తేశారు. వీటివల్ల గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. దీనిపై 1100కు ఫోన్ చేస్తే బెల్టు షాపుల వల్ల కలుగుతున్న ఇబ్బందేమిటి. అధార్ కార్డు నెంబరు ఇవ్వండంటూ అ డుగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్ల టో ల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసేందుకు ఎవరూ సాహసించడంలేదు.
ఆస్పత్రుల్లో అవే సమస్యలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల కొరత వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగి బంధువులే వార్డు బాయ్‌ల అవతారం ఎత్తాల్సివస్తోంది. వార్డుల నుంచి రోగులను వైద్య పరీక్షలకు తీసుకు వెళ్లాలంటే రోగి బంధువులే స్టెచర్‌పై, వీల్ చైర్‌పై తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ తంతు నిత్యం జరిగేదే. కానీ పరిష్కారం కావట్లేదు. జిల్లాలో డెంగీ వ్యాధి కోరలు చాస్తోంది. ముఖ్యంగా 15 ఏళ్లు లోపు పిల్లలే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. జిల్లాలో 46 వరకు డెంగీ కేసులు నమోదుకాగా ఇందులో 20 వరకు పిల్లలే ఉండడం గమనార్హం. ఒక్క విజయనగరంలోనే 10 వరకు డెంగీ కేసులు నమోదు అయ్యాయి. ఇక వైరల్ జ్వరాల సంగతి లెక్కేలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2.90 లక్షలమంది వైరల్ జ్వరాలతో వచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే 3.10 లక్షల వరకు కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటోంది. దానిని చక్కదిద్దే ప్రయత్నం కానరావడంలేదు.
గిరిజనులకు అలవాటుగా మారిన డోలీ
గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ డోలీయే దిక్కవుతోంది. చాలా గ్రామాలకు రోడ్లు లేని కారణంగా అంబులెన్సువంటి వాహనాలు అన్ని చోట్లకు రాకపోవడంతో డోలీలో తరలించాల్సి వస్తోంది. దీనివల్ల సకాలంలో వైద్యం అందక మాత, శిశు మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో బెడ్‌లు లేకపోవడం వల్ల బాలింతలు నేలపైనే చికిత్స పొందాల్సిన దుస్థితి. ప్రభుత్వ ఆస్పత్రులకు ఇచ్చే మందుల బడ్జెట్‌లో ప్రభుత్వం కోత విధించడంతో పూర్తిస్థాయి మందులు రాక చీటీలతోనే డాక్టర్లు సరిపెడుతున్నారు.
కస్తూర్బా పిల్లలకు కాస్మొటిక్ సమస్య
కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు ప్రతీ నెల కాస్మోటిక్ చార్జీలు ఇచ్చేవారు. నాలుగు నెలలుగా వాటిని ఇవ్వకపోవడం వల్ల విద్యార్థినులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment