అటకెక్కిన ‘బయోమెట్రిక్’
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: విధులకు ఎప్పుడు హాజరయ్యారో, ఎప్పుడు విధుల నుంచి బయటకు వెళ్లారో తెలియజేసే బయోమెట్రిక్ మిషన్ అటకెక్కింది. దీంతో సకాలంలో ఉద్యోగానికి రావల్సిన సిబ్బంది ఇష్టానుసారం విధులకు హాజరవుతున్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం కోసం కేంద్రాస్పత్రిలో ఏర్పా టు చేసిన బయోమెట్రిక్ పరికరం మరమ్మతుల్లో ఉంది. దీంతో వైద్య సిబ్బంది ఎంచక్కా నచ్చిన సమయానికి విధులకు వస్తుండడం లేదంటే డుమ్మా కొట్టడం చేస్తున్నారు. కేంద్రాస్పత్రిలో బయోమెట్రిక్ పరికరం ఏర్పాటు చేసినప్పటినుంచి తరచూ అది పాడవుతూనే ఉంది.
పతి రెండు నెలల కు ఒకసారి పరికరం మూలకు చేరుతుండడంతో అది కేంద్రాస్పత్రి సిబ్బం ది పనే అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్నాహ్నం 2గంటల వర కు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి. మధ్యాహ్నం 2 గంటలకు హాజరైన వారు రాత్రి 8గంటల వరకు విధుల్లో ఉండాలి. అదేవిధంగా రాత్రి 8గంటలకు హాజరైన వారు ఉదయం 6 గంటల వర కు విధులు నిర్వహించాలి. బయోమెట్రిక్ లేని సమయంలో వైద్య సిబ్బంది విధులకు డుమ్మా కొట్టేవారు. ముఖ్యంగా ఉదయం విధులు నిర్వహించే వైద్య సిబ్బంది ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియ ని పరిస్థితి ఉండేది. 11 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్లిపోయిన సం దర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది వైద్యులు తమ సొంత క్లినిక్‌లలో ఓపీ చూసుకుని 11 గంటలకు విధులకు వచ్చేవారు.
ఈనేపథ్యంలో ఏడాదిన్నర క్రితం వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం కోసం అప్పటి అదనపు జాయింట్ కలెక్టర్ ఎం.రామారా వు ఆదేశాల మేరకు ఆస్పత్రి అధికారులు కేంద్రాస్పత్రిలో బయెమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేశారు. బయో మెట్రిక్ విధానంలో వైద్య సిబ్బం ది ప్రతి ఒక్కరూ విధులకు వచ్చినప్పుడు తిరిగి వెళ్లినప్పుడు పరికరంపై చేతి వేలిని పెట్టాలి. దీని వల్ల ఉద్యోగి ఏ సమయంలో వచ్చారో, ఏ సమయంలో వెళ్లారో నమోదవుతుంది. దీంతో సమయానికి రాని వారిపై చర్యలు తీసుకోవచ్చు. అయితే పరికరం ఎప్పటికప్పుడు పాడవుతుండడంతో వైద్యసిబ్బందికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మళ్లీ విధులకు డుమ్మా కొడుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా బయోమెట్రిక్ పాడైందని బాగు చేయించడానికి ఇచ్చామని చెప్పారు.