ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. శతక భాగస్వామ్యంతో పాక్‌పై నయా చరిత్ర సృష్టించారు. ఓపెనర్లలో ముఖ్యంగా రోహిత్ శర్మ అర్దసెంచరీతో మరోసారి తన ఫామ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. అయితే భారత్ ఇన్నింగ్స్ సందర్బంగా తొమ్మిదో ఓవర్ తొలి బంతికి పాక్ చెత్త ఫీల్డింగ్ పుణ్యమా రోహిత్ ఔట్ కాకుండా తప్పించుకున్నాడు.