
సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని ఫైర్ టెంపుల్‌లో బుధవారం పార్శీలు నూతన సంవత్సర (నవ్‌రోజ్) ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆగస్టు 16న పార్శీలు నవ్‌రోజ్ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. – రాంగోపాల్‌పేట్















