

తెలుగులోకి ఎప్పటికప్పుడు బోలెడంతమంది హీరోయిన్లు వస్తూనే ఉంటారు.

అలా 2009లో 'బోణీ' సినిమాతో కృతి కర్బందా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈమె పుట్టినరోజు నేడు (అక్టోబర్ 29). ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.

దీని తర్వాత పవన్ కల్యాణ్ 'తీన్‌మార్' చిత్రంలో ఓ హీరోయిన్‌గా చేసింది.

సినిమా ఘోరమైన ఫ్లాప్ అవడంతో స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ రాలేదు.

కానీ మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ తదితర మిడ్ రేంజ్ మూవీస్ చేసింది.

'బ్రూస్ లీ' సినిమాలో రామ్ చరణ్‌కి అక్కగా నటించింది. అయినా సరే కలిసి రాలేదు.

అంతే ఇక పూర్తిగా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. వరసగా హిందీ సినిమాలే చేస్తూ వచ్చింది.

ఏ మాత్రం వంక పెట్టడానికి లేనంత అందంగా ఉండే కృతికి తెలుగులో ఎందుకో పెద్దగా కలిసిరాలేదు.

బాలీవుడ్‌కి వెళ్లిపోయిన తర్వాత అక్కడే నటుడు పులకిత్ సామ్రాట్‌తో ప్రేమలో పడింది.

నాలుగైదేళ్లు ప్రేమించుకున్న తర్వాత వీళ్లిద్దరూ ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకున్నారు.

ప్రస్తుతం ఒకటి రెండు హిందీ సినిమాలు చేస్తున్నప్పటికీ ఫోకస్ అంతా ఫ్యామిలీ లైఫ్ మీదే పెట్టేసినట్లుంది.


