1/13
ఆదిపురుష్ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా కృతీ సనన్
2/13
రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతీ సనన్ నటించిన చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
3/13
లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతునిగా దేవదత్తా, లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.
4/13
ఇటీవలే ట్రైలర్‌తో రచ్చ లేపిన ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుమలలో ఘనంగా జరిగింది.
5/13
ఈ కార్యక్రమంలో ప్రభాస్ తెల్ల వస్త్రాలు ధరించగా, జానకిగా నటించిన కృతీ సనన్ నలుపురంగు చీరలో మెరిసింది.
6/13
ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ.. నా కెరీర్ తెలుగులో మొదలైంది. 9 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేస్తున్నా
7/13
జానకి పాత్ర చేసే అవకాశం రావడం అదృష్టం. అందుకు ఓం రౌత్, ప్రభాస్‌లకు కృతజ్ఞతలు. నా జీవితంలో ఆదిపురుష్ ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
8/13
ఆదిపురుష్ సెట్స్‌లో ప్రశాంత వాతావరణం ఉండేది. రామాయణం చేస్తున్నామన్న ఆలోచన అందరిలో ఉండేది, అందుకే నిశ్శబ్ధంగా ఉండేవారు.
9/13
ప్రభాస్ విషయానికి వస్తే అతడు స్వీట్ పర్సన్. ఆయన కళ్లల్లో ఓ ప్రశాంతత ఉంటుంది. రాఘవుడు పాత్ర ప్రభాస్ తప్ప మరొకరు చేయలేరు అని పేర్కొంది.
10/13
ఈ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా అనకూడదు. రామాయణం అనాలి. ఇందులో నటించడం నా అదృష్టం. స్టేజ్ మీద తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తా అన్నాడు.
11/13
ఇక నుంచి ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చాడు. తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానన్నాడు.
12/13
ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కేవలం బాణసంచా కోసమే అరకోటి ఖర్చు చేశారట. ఈవెంట్ నిర్వహణకు రెండున్నర కోట్ల పైచిలుకు వెచ్చించినట్లు తెలుస్తోంది.
13/13
ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో జూన్ 16న విడుదల కానుంది.