
ఎత్తేస్తాం.. ఎగిరి దూకేస్తాం.. అనంతపురం మార్కెట్లో హమాలీల హైజంప్ ఫొటో: భాషా(అనంతపురం)

పీపీ.. డుం డుం.. ఏలూరులో ఓ దుకాణం ముందుకు సుందరంగా ముస్తాబై వచ్చిన డూడు బసవన్న ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

చిరుతిళ్లకోసం చిన్నారులు.. గుంటూరులో ఓ మున్సిపల్ పాఠశాల వద్ద చిరుతినుబండారాలోకోసం చిన్నారుల వత్తిడి క్యూ. ఫొటో: రూబెన్స్, గుంటూరు

తేజోమయ ధ్యాన బుద్ధుడు.. గుంటూరు జిల్లా అమరావతిలోసాయం వేల బుద్దుడిలా కనపించాడు. ఫొటో: రూబెన్, గుంటూరు

చెన్నై వరద బాధితులకు సహాయం నిమిత్తం ప్రత్యేక బృందంతో బయలుదేరేందుకు సిద్ధమైన ప్రత్యేక విమానం. ఫొటో: దశరథ్ రజ్వా, కుత్బుల్లాపూర్ జోన్, హైదరాబాద్

పైపులకెంతదాహమో.. ఫిలింనగర్ లోని బీజేఆర్ నగర్ బస్తీలో ఒకే పైపులైనుకు బిగించి నల్లపైపులు.. ఫొటో: దయాకర్, తూనుగుంట్ల, ఖైరతాబాద్

చిల్లుపెట్టేస్తా.. నగరంలో దాహంతో ఉన్న ఓ పావురం బొట్టుబొట్టును ఒడిసిపట్టిందిలా. ఫొటో లవణ్ కుమార్, హైదరాబాద్

బాలీజీ చుట్టూ ఆవుల భజన.. చిలుకూరు బాలాజీ ఆలయంలో కొందరు వ్యక్తులు ఆవులతో ప్రదక్షిణలు చేయించారు.ఫొటో: లవణ్ కుమార్, హైదరాబాద్

పరుగెత్తండ్రోయ్.. ఓయూలో బీఫ్ పెస్టివల్ నిషేధం సందర్భంగా పోలీసుల రాకతో సీ హాస్టల్ వద్ద విద్యార్థుల పరుగోపరుగు.. ఫొటో: మోహన చారీ, హైదరాబాద్

నారూటే..సపరేటు.. గచ్చిబౌలీలో రాంగ్ రూట్లో వెళుతున్న ట్రాఫిక్ పోలీసు ఫొటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

మాలాగే నీట్‌గా.. గౌలిగూడాలో బ్రహ్మకుమారీస్ సంస్ధకు చెందిన ఇంజినీర్లు, సైంటిస్టులు కలిసి ఇలా చీపురుపట్టి స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఫొటో: రాకేశ్, అబిడ్స్, హైదరాబాద్

అమ్మా ఈ బరువెట్లా.. తిలక్ నగర్లోని బడిఈడు ఉన్న తన కూతురుని రిక్షా ఎక్కించుకెళుతున్న చెత్త సేకరణ కార్మికురాలు ఫొటో: రవికుమార్ మరికంటి, చిక్కడపల్లి

బాలుడినే కాదు.. బార్బర్ని కూడా.. ముషిరాబాద్ లోని వాటర్ వర్క్స్ కార్యాలయం ఎదుట తమ షాపులో ఖాళీ సమయాల్లో కులవృత్తి నేర్చుకుంటున్న పవన్ ఫొటో: రవికుమార్ మరికంటి, చిక్కడపల్లి

మేం తినేస్తామంతే.. పెద్దకూర పండుగను ఓయూలో నిషేధించినా ఆత్మగౌరవం పేరిట ఎన్ఆర్ఎస్ హాస్టల్ వద్ద నిర్వహించుకున్నారు. ఫొటో: రవీందర్ వర్దెల్లి, తార్నాక

కాలుజారిందో కందిపోవడం ఖాయం.. రోడ్డుపై డీజిల్ అయిపోవడంతో ఓ బైకిస్టు ఇలా కాలితో నెడుతూ ఆటో డ్రైవర్ కు సహాయం చేశాడు. అయితే, ఇది డేంజర్.ఫొటో: సతీష్, హైదరాబాద్

ప్రధానికి పచ్చనిహారం.. వనస్థలిపురం వైదేహినగర్ వద్ద మాజీ ప్రధాని నెహ్రూ విగ్రహం కనిపించకుండా పెరిగిన పిచ్చితీగలు. ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

సాయంవేళ బంగారమాయే.. సూర్యస్తమయ వేళ బంగారు వర్ణంతో ఆకాశం మెరుస్తుండగా పక్షి రెక్కల సందడి. ఫొటో: సన్నీ సింగ్, శంషాబాద్ జోన్

సాయంవేళ బంగారమాయే.. సూర్యస్తమయ వేళ బంగారు వర్ణంతో ఆకాశం మెరుస్తుండగా పక్షి రెక్కల సందడి. ఫొటో: సన్నీ సింగ్, శంషాబాద్ జోన్

బడిబయట బాలలు.. బహిర్బూమికి చిన్నారుల పాట్లు. ఫొటో: రవికుమార్, కడప

తాత త్వరగా పోనీయ్.. ఖమ్మం రహదారిలో తాత మనువరాలి రిక్షా ప్రయాణం. ఫొటో: రాజు రాడారపు, ఖమ్మం

తొలిమంచులోనా.. కరీంనగర్ రహదారిపై కమ్మిన మంచుపొగ. ఫొటో: స్వామి, కరీంనగర్

అమ్మ ఉంటే చాలు.. అంబేద్కర్ స్టేడియం వద్ద తల్లితో చిన్నారులు. ఫొటో: స్వామి, కరీంనగర్

గొంతెండి గుండెపగిలే.. నీళ్లులేక నెర్రెలు బారిన మంజీరా. ఫొటో: సతీశ్ పాండు, మెదక్

ఇదే నా ఉయ్యాల.. పోలీయో ప్రచార ప్లెక్సీతో బుడతడి ఉయ్యాలజంపాల. ఫోటో సతీశ్ పాండు, మెదక్

లారెక్కి వస్తానో.. ట్రాలీ లారీపై తీసుకొస్తున్న కొత్త బస్సు. ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

చిన్నారులూ ఇదేంపని.. రామగిరి హైస్కూల్ ఆవరణలో ఆరుబయటే మూత్ర విసర్జన. ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

బండిపాయే.. బైకొచ్చే.. భుజాన నాగలితో రైతు.. పట్టు జారిందో అంతే ఇక. ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

దీవించమ్మా.. గోమాతకు భక్త శ్రద్దలతో పూజలు. ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

వెలుగుల వైఎస్ఆర్.. తారాజువ్వల వెలుగుల్లో వైఎస్ఆర్ విగ్రహంఫొటో: వెంకటరమణ, నెల్లూరు

తడిసిముద్దయ్యాయి.. వరదలకు తడిసిన స్కూల్ బ్యాగులను ఎండబెడుతున్న దృశ్యం. ఫొటోలు: వెంకటరమణ, నెల్లూరు

వెలుగుల కార్తీకం.. నిజమాబాద్ లో భక్తుల కార్తీక దీపాలు. ఫొటో: మురళీమోహన్, నిజమాబాద్

ఆంధ్రాలో అమ్మకానుక.. ప్రకాశం జిల్లాలో తమిళ సీఎం జయలలిత గ్రైండర్ల విక్రయాలు. ఫొటో: ప్రసాద్, ఒంగోలు

ప్రేమంటే ఇదేరా.. పక్షుల ప్రేమ పలకరింత. ఫొటో: ప్రసాద్ గరగ, రాజమండ్రి

శంభోశివశంకర.. శ్రీకాకుళంలో కార్తీక మహోత్సవంలో శివనాట్యం. ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

నీవే దిక్కని నమ్మితిని.. వర్షపుదాడికి గజేంద్రుడి సాయం. ఫొటో: మోహన కృష్ణ, తమిళనాడు.

సెల్ లో బందిస్తా.. అమ్మవారి వాహనసేవను రికార్డింగ్. ఫొటో: మాధవరెడ్డి, తిరుమల

వెలుగుల కోనేరు.. దీపాల వెలుగులో పద్మావతి ఆలయంఫొటో: మాధవరెడ్డి, తిరుమల

జననేత సంతాపం.. కల్తీ మద్యం మృతులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం. ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ

వన్ స్నాప్ ప్లీజ్.. సమంతతో సెల్ఫీ తీసుకుంటున్న బాలుడు. ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ

పిల్లగడ్డిమోపులు.. బాలోత్సవ్ కార్యక్రమంలో చిన్నారులు ఆటాపాట. ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ

ఆయన సీఎంగారమ్మ.. సీఎం చంద్రబాబు తలపై సీతాకోక చిలుకను తీస్తున్న గార్డు. ఫొటో: భగవాన్, విజయవాడ

సంస్కృతి నిలబెడతాం.. దేశీయ సాంప్రదాయంతో బుడ్డిబుడ్డి చిన్నారులు. ఫొటో: భగవాన్, విజయవాడ.

మా ఆటోలతో మేం: తమ ఆటోల ముందు గర్వంగా నిల్చున్న మహిళలు. ఫొటో: భగవాన్, విజయవాడ

సెల్లుంటే సెల్ఫీలే.. జాలిగా బోటుపై సెల్ఫీ దిగుతున్న యువతులుఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

నీటిలో నడిచేస్తా: ఎయిర్ బెలూన్ లో నీటిపై చిన్నారి నడక. ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

ఎట్లున్నవ్ అవ్వా.. నర్సీపట్నంలో ముసలవ్వకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలకరింత. ఫొటో: ఎండీ నవాజ్, వైజాగ్

రోడ్డెక్కితే ఆటోతప్పదు.. ఆటోల్లో వెళుతున్న విదేశీ నావికులు. ఫొటో: మోహన్ రావు, వైజాగ్

కరెంటు మనిషి.. కనీస రక్షణ చర్యలు లేకుండా విద్యుత్ స్తంభాలకు పెయింటింగ్. ఫొటో: మోహన్ రావు, వైజాగ్

పంచ్ పడిందో.. విజయనగరంలోని ఆనందగజపతి కళాక్షేత్రంలో కరాటే విన్యాసం. ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం

పట్టుజారొద్దు.. విజయనగరంలో ఎంఆర్ కాలేజీలో విద్యార్థినులు కబడ్డీ. ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం

ఒకరికిఒకరు.. వరంగల్ లో తమ టీవీఎస్ వాహనంపై వెళుతున్న సంచారులుఫోటో: ప్రసాద్, వరంగల్

బతుకీడవాలింతే.. హన్మకొండలో బ్రతుకుదెరువుకోసం పేదోళ్ల విన్యాసాలుఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

స్టెప్పేస్తే టాప్ లేచిపోద్ది.. హన్మకొండలో జరిగిన ఓ ర్యాలీలో డ్యాన్స్ చేస్తున్న హిజ్రా. ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్