
పొలం పనుల్లోనూ.. నువ్వు సగం నేను సగం. ఫొటో: బాషా, అనంతపురం

చినుకు పడింది.. అదను వచ్చింది.. పొలం పదును చేయాల్సిందే మరి. ఫొటో: బాషా, అనంతపురం

పలక బలపం దూరం.. చిట్టి చేతులకు ఎంత కష్టం. ఫొటో: వీరేష్, అనంతపురం

బడిబాట మరచి.. ఆవుదూడతో భిక్షాటన. ఫొటో: రూబెన్, గుంటూరు

దేవుడు ఫొటో తీస్తే.. ఫ్లాష్ వెలిగేదిలాగే మరి! ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

ప్రార్థన ముందు.. ఆపై ఇఫ్తార్ విందు. ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

వేడి వేడిగా హలీం.. వడివడిగా వడ్డిద్దాం. ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

రంజాన్ వెలుగులు.. మక్కా మసీదు తళుకులు. ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

ప్రార్థనలకు సర్వం సిద్ధం.. ఆవో భాయీజాన్. ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

పొద్దుట నుంచి ఉపవాసం.. తినేద్దాం హలీం. ఫొటో: కంది భజరంగ ప్రసాద్, నల్లగొండ

పిల్లల ప్రాణాలతో చెలగాటం.. బురద పక్కనే భోజనం. ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

ఇక్కడ బడికి వెళ్లాలంటే.. సర్కస్ ఫీట్లే. ఫొటో: ఆర్.రాజు, ఖమ్మం

వానా వానా వల్లప్పా.. స్కూలుకు ఇంక సెలవప్పా. ఫొటో: రూబెన్, గుంటూరు

తరగతి గదీ మాదే.. ఇక్కడ పనీ మాదే. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

బడి తీసేశారు.. నేనొచ్చేస్తున్నానోచ్! ఫొటో: శ్రీనివాస్, నెల్లూరు

సర్కారీ బడిలో.. ఇదీ స్వచ్ఛభారతం.. ఇక్కడే భోజనం. ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

భూముల్లో జల కళ.. పల్లెలకు పని కళ. ఫొటో: హుస్సేన్, కర్నూలు

అల్లాటప్పా గూడు కాదిది.. నా సొరంగం! ఫొటో: రమేష్, కడప

గోదారిలో మృత్యుశకటం.. ఎలాగోలా బయటకు తీద్దాం. ఫొటో: ప్రసాద్, రాజమండ్రి

రామతీర్థం బ్రహ్మోత్సవం.. సాగరం వద్ద జనోత్సవం. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

క్యూలైన్లు ఇంతే తల్లీ.. ఏడవకు చిట్టి చెల్లీ. ఫొటో: మోహనకృష్ణ, తిరుమల

కొల్లేరు బతుకు ఛిద్రం.. వలసలే ఇక గత్యంతరం. ఫొటో: రియాజుద్దీన్, తాడేపల్లిగూడెం

బడి ముందుకు నీళ్లు.. పిల్లలకు పాట్లు. ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ

ముద్దులొలికే చిన్నారి.. ఏ తల్లి వదిలేసిందో మరి! ఫొటో: భగవాన్, విజయవాడ

ఫైర్ సిబ్బంది.. ఎంత ఇబ్బంది. ఫొటో: మోహనకృష్ణ, తిరుమల

చినుకు చిందేస్తే.. యూనిఫాం గొడుగులు తెరవాల్సిందే. ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

ఒకవైపు బడిబాట.. మరోవైపు బతుకు బాట. ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

కొంగలకూ ఉంది క్రమశిక్షణ.. మరి మనకేదన్నా! ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

వలలో చిక్కాం.. ఇక తప్పించుకునే దారి లేదా! ఫొటో: భగవాన్, విజయవాడ

ఇట్టే చేస్తాం యోగా.. చూడండి బాగా. ఫొటో: భగవాన్, విజయవాడ

బిడ్డలు ఎటెల్లిపోనారో.. తల్లుల ఆక్రోశం. ఫొటో: మహ్మద్ నవాజ్, విశాఖపట్నం

ఇంకా చెదరని హుద్హుద్ ఆనవాళ్లు.. మొదలు విరిగిన మోళ్లు. ఫొటో: మహ్మద్ నవాజ్, విశాఖపట్నం

దేశం కాని దేశం.. ఇదిగో యోగాసనం. ఫొటో: మోహనరావు, విశాఖపట్నం

కరిమబ్బు కమ్మింది.. నేలతల్లి మురిసింది. ఫొటో: మహ్మద్ నవాజ్, విశాఖపట్నం

నిన్ను మోయాల్సింది ఇలాగా చిన్నా! ఫొటో: మహ్మద్ నవాజ్, విశాఖపట్నం

చిటపట చినుకులు.. చిన్నారుల కేరింతలు. ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

వైద్యపట్టా అందిన వేళ.. కన్నతండ్రితో తీపి జ్ఞాపకం. ఫొటో: వరప్రసాద్, వరంగల్

అమ్మా ఇటివ్వు ఫోను.. నే సెల్ఫీ తీసుకుంటా! ఫొటో: మోహనరావు, విశాఖపట్నం