
అనారోగ్యం బాధిస్తుంది.. మిమ్మల్ని.. మిమ్మల్ని ప్రేమించేవారిని కూడా.. అనారోగ్యం జోలికి పోకండి! పోనివ్వకండి! ( ఫోటో : రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)

ప్లాస్టిక్ నాశనం లేనిది!.. నిప్పు కాల్చజాలదు.. నీళ్లు తడుప జాలదు.. గాలి కదుప జాలదు.. అని తెలీదు పాపం! ఏదో ప్రయత్నిస్తున్నారు. (ఫోటో : మహ్మద్ రఫి, తిరుపతి)

చేతులకు మట్టంటకుండా పని చేయమని అంటారు.. పెద్ద మనషులు కదా! కాళ్లకు మట్టంటకుండా పని చేస్తారు.. ( ఫోటో : అజీజ్, మచిలీపట్నం)

తెలుగులో మాట్లాడుకుంటున్నారా? సారు!.. ఏమీ అర్థమైతలేదు గదు.. ( ఫోటో : నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్)

కొత్త పంపు సెట్టు.. డబ్బా నిండా పెట్రోల్ నింపి పెట్టు (ఫోటో : విజయ్ క్రిష్ణ, అమరావతి)

ఏ కుంచె నుంచి జాలువారెనో మరి.. ఈ చిత్రం మదిని దోచినది (ఫోటో : విజయ్ క్రిష్ణ, అమరావతి)

జగనన్న సైన్యం కదిలింది.. ఇక విజయమే మిగిలింది( ఫోటో : భాషా, అనంతపురం)

ఈ మలుపు జీవితాన్ని ఏ మలుపు తిప్పునో!.. ( ఫోటో : వీరేష్, అనంతపురం)

రైతన్నల కష్టం నేలపాలైంది.. చేనులో పంట పండింది.. రైతన్నల జీవితంలోనే!.. ( ఫోటో : వీరేష్, అనంతపురం)

మెట్రో బండి.. మెట్రో బండి.. పైన, పైన తిరిగేనండి! ( ఫోటో : కే రమేశ్ బాబు, హైదరాబాద్)

వేమన పద్యాలు.. మానవ జీవితాలకు నేపథ్యాలు.. ( ఫోటో : ఎమ్ రవికుమార్, హైదరాబాద్ )

సినిమా టెక్కెట్ల కోసం కాదు గురు.. పోలీస్ పరీక్ష కోసం ఈ అగచాట్లు (ఫోటో : సోమ సుభాష్, హైదరాబాద్)

మీ గుండెని గుండ్రాయిలా గట్టిగా ఉంచాలంటే!.. మందు మీ ఒళ్లును ఒంచండి! ( ఫోటో : శ్రీశైలం, హైదరాబాద్)

ఇంకేం.. ఇంకేం.. ఇంకేం.. కావాలే!... ఏం వద్దు సార్ మీ ఇద్దరితో ఓ సెల్ఫీ కావాలి( ఫోటో : ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్)

వేల వేల పువ్వల్లో! నిండి మురిసింది ఈ నేల ( ఫోటో : వేణుగోపాల్, జనగాం)

ప్లాస్టిక్ నిషేదం! ద రిలేషన్ షిప్ బెట్ విన్..నిషేదం అండ్ వాడకం ఈజ్ లైకే జలుబు అండ్ దగ్గు. అర్థం కాకపోతే క్షమించండి. అసలు అర్థమే లేదనుకుంటే మన్నించండి. (ఫోటో : థశరద్ రజ్వా, కొత్తగూడెం)

బండిని తోయాలంటే అలా!.. లాగాలంటే ఇలా! (ఫోటో : రాజు రాధారపు, ఖమ్మం)

మహిళల్ని వేధించినోడు పాడెక్కాల్సిందే.. ( ఫోటో : హుశ్శేన్, కర్నూల్)

మబ్బుల చీల్చిన రవి కిరణం.. చీకటి వెలుగుల ఆటే కదా ప్రతి దినం ( ఫోటో : హుశ్శేన్, కర్నూల్)

ఆకలి తీరాలంటే అన్నం తినాలి.. కష్టం విలువ తెలియాలంటే! అన్న క్యాంటిన్ ముందు గంటల తరబడి నిలబడాలి.. ( ఫోటో : శ్రీనివాస్, కర్నూల్ )

తమ్ముడు తలకిందులుగా వేలాడితే ఏమొస్తాది! నాతో రా బ్యాట్ మెన్ సినిమాకు పోదాం! ( ఫోటో : మురళీమోహన్, మహబూబాబాద్)

ఈ అమ్మాయిలకు ఏమైంది!.. మూడు ఫోటోలు.. ఆరు సెల్ఫీలతో డిగ్రీ పూర్తయింది ( ఫోటో : దేవేంద్ర, మెదక్)

కొత్తగా ఉంది కదా అని చూడ్డానికి వస్తే!.. మాతోనే బండి తోయిస్తావా.. ( ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

ప్లకార్డులు చూసి కాకపోయినా! మా అమాయకమైన ముఖాలు చూసైనా! ఈ సూత్రాలు పాటించండయ్యా! ( ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

హలో.. హలో.. మైక్ టెస్టింగ్ 123.. నేను కనబడుతున్నానా! ( ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

సీఎం హెలికాఫ్టరా మజాకా! వాటర్ ట్యాంక్‌ను తగలినట్టు కనిపిస్తోందా! కాదు.. అలా అనిపిస్తుందంతే! ( ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

తడిసిపోయావా! పర్లేదులే.. వెనకాల నేను తడవకుండా ఉంటాను ( ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్ )

తుమ్మెదకిది ఆహ్వానం.. మకరందం తొలిచి.. పువ్వు గుండెలో కొత్త ఊసులు మలిచే అపురూపమైన దృశ్యం (ఫోటో : సతీష్ కుమార్, పెద్దపల్లి)

జీవితమనే జగన్నాటకాన్ని చూస్తూ మారని ఈ ప్రజలు.. మీ నాటకాన్ని చూసి టైం పాస్ చేస్తారు.. జీవితంలో ఒక్క మంచి మార్పు కూడా పాస్ చేయరు ( ఫోటో : గరగ ప్రసాద్, రాజమండ్రి)

అవ్వా ఏట్లుంది.. ఏమో! నాయనా నాకు చదువు రాదు. కొంచెం చదివి పెట్టు.. నాకెక్కడ చదవనీకి వచ్చు.. చేత్తో పట్టుకొమ్మని ఇచ్చినరు.. తూచ్.. నువ్వట్లడగకూడదు. ( ఫోటో : కే సతీష్, సిద్దిపేట)

అభిమానం గుండెల్లో ఉంది అందుకే.. ఎనభై ఏళ్ల వయసులోనూ నీ దగ్గరకు రప్పించింది ( ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)

ఓట్లు వేసే వాళ్లకు శిక్షణ ఇస్తున్నారు.. అట్లే! వేయించుకునే వాళ్లకు కూడా మంచిగా శిక్షణ ఇస్తే బాగుండు! ( ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)

కాళ్లకు ఏదో! తగిలింది ఉండరా!.. పెద్దదే తగిలినట్లుంది. మొత్తం నాకేరో! (ఫోటో : యాకయ్య, సూర్యాపేట)

మనిషి కట్టిన ఇంటి ముందు.. ప్రకృతి పరిచిన పచ్చటి పరుపు ( ఫోటో : చక్రపాణి, విజయవాడ)

మురికి చేయటం కొందరికే తెలుసు.. దాన్ని శుభ్రం చేయటం కొంత మందికి మాత్రమే తెలుసు.. ( ఫోటో : చక్రపాణి, విజయవాడ)

సూర్యుడికి అలుపొచ్చి సెలవన్నాడు.. కార్మికులు మాత్రం రేపొచ్చి కలువు అన్నారు.. ( ఫోటో : కొల్లజు శివ, యాదాద్రి)