Top Stories
ప్రధాన వార్తలు

‘ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా’
తాడేపల్లి : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ మేరకు వైఎస్ జగన్ తన సోషల్ మీడియా అకౌంట్‘ఎక్స్’ ద్వారా వైఎస్సార్సీపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.‘స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు పనిచేయటం హర్షించదగ్గ విషయం. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా.. చంద్రబాబు గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా..కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని..జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు.విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందిస్తున్నాను. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, @ncbn గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 28, 2025 స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం

మయన్మార్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటాం : ప్రధాని మోదీ
ఢిల్లీ : మయన్మార్ (Myanmar earthquake)ను కుదిపేసిన భూకంపంపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మయన్మార్‌ను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. మయన్మార్, థాయ్‌లాండ్‌లను భూకంపం కుదిపేసింది. భూకంపం ధాటికి భవనాలు ఊగాయి. బహుళజాతి భవనాలు నేల మట్టమయ్యాయి. ఓ భవనం కూలడంతో శిథిలాల కింద 50 మంది చిక్కుకున్నారు. నేల మట్టమైన భవనాల కింద వేలాది మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ భూకంపంతో వేలాది భారీ నిర్మాణాలు నేల మట్టమయ్యాయి. భారీ ఆస్తి నష్టం సంభవించింది.Concerned by the situation in the wake of the Earthquake in Myanmar and Thailand. Praying for the safety and wellbeing of everyone. India stands ready to offer all possible assistance. In this regard, asked our authorities to be on standby. Also asked the MEA to remain in touch…— Narendra Modi (@narendramodi) March 28, 2025ముఖ్యంగా మయన్మార్‌లో వరుసగా స్వల్ప వ్యవధిలో రిక్టర్ స్కేలుపై 7.7,6.4 భూకంప తీవ్రత నమోదైంది. ఆ భూకంపంపై ప్రధాని మోదీ ద్రిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. అందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భూకంపం ప్రభావం నేపథ్యంలో మయన్మార్, థాయిలాండ్ దేశాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతుంది. అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. 🚨 Strong 7.7 Earthquake shakes Bangkok: People run out onto the streets, water splashes out of swimming pools.pic.twitter.com/U4nlcRGaT0— Gems (@gemsofbabus_) March 28, 2025భూమి లోపల.. పది కిలోమీటర్ల మేర భూకంపం మయన్మార్ వాయువ్య భాగమైన సాగైంగ్‌కు 16కిలోమీటర్ల దూరంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మయన్మార్‌లో గతంలో కూడా సాగైంగ్‌కు భూకంపాలు సంభవించిన చరిత్ర ఉంది. ఈసారి కూడా అదే ప్రాంతంలో భూకంపం రావడం గమనార్హం.

మయన్మార్‌లో భారీ భూకంపం.. భారత్ సహా పొరుగు దేశాల్లోనూ కంపించిన భూమి
థాయ్‌లాండ్‌లో ఎయిర్పోర్ట్ లాక్డౌన్అన్ని విమానసర్వీలు రద్దుథాయ్లాండ్కు వచ్చే విమానాలు దారి మళ్లింపుథాయ్లాండ్ లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రకటించిన షినవ్రతమయన్మార్, బ్యాంకాక్‌ో కుప్పకూలిన వందల భవనాలుభయంతో రోడ్డపైకి వచ్చిన వేలాది మంది జనంశిథిలాల కింద వేలమంది ఉన్నట్లు అధికారులు ప్రకటనమృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశంబ్యాంకాక్ో మెట్రో రైలు ేసేవలు నిలిపివేతబ్యాంకాక్లో శిథిలాల్లో చిక్కుకున్న పలువురుఓ భవనంలో 50 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడిబ్యాంకాక్లో భవనాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు Over 40 construction workers are reported missing, following the collapse of an under construction high-rise building in the Thai capital of Bangkok, as a result of today’s 7.7 magnitude earthquake in Myanmar. pic.twitter.com/ydkbxExorf— OSINTdefender (@sentdefender) March 28, 2025 భారీ భూకంపంతో మయన్మార్ శుక్రవారం చిగురుటాకులా వణికిపోయింది. ప్రకంపనల ధాటికి బహుళ అంతస్తుల భవనాలు ఊగిపోయి కుప్పకూలిపోయాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు భారీగా సంభవించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ భూకంపం ధాటికి పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లోనూ భారీగా భూమి భారీగా కంపించింది. చైనా, భారత్, లావోస్, బంగ్లాదేశ్‌లోనూ ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది.మయన్మార్‌లో శుక్రవారం మధ్యాహ్నాం 12గం.50ని. ప్రాంతంలో తొలుత భూమి భారీగా కంపించింది. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే మరో రెండుసార్లు కంపించింది. మొదటిసారి రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో.. రెండోసారి 6.4 తీవ్రత.. మూడోసారి 4.9 తీవ్రత నమోదైంది. సెంట్రల్ మయన్మార్‌లోని సగైంగ్‌కు 16 కిలోమీటర్ల దూరంలో.. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర నమోదైంది. మరోసారి భూకంపం వస్తాయన్న హెచ్చరికలు అక్కడి అధికారులు భవనాల నుంచి జనాల్ని ఖాళీ చేయిస్తున్నారు.భూకంపం ధాటికి జనం రోడ్ల మీదకు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. కొందరు తమ ఫోన్లలో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వదిలారు. నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనం కుప్పకూలిపోవడం, ప్రకంపనల ధాటికి పైఅంతస్తుల్లోని స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీరు కిందకు పడడం, నేల మీద ఉన్న పూల్స్లోని నీరు కూడా బయటకు ఉబికిరావడం లాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మండాలెలో ఇర్రవడ్డీ నదిపై ఉన్న చారిత్రక వంతెన అవా బ్రిడ్జి కుప్పకూలిపోయింది.#BREAKING A 7.9-magnitude earthquake struck Myanmar, according to the China Earthquake Networks Center. Neighboring regions, including Thailand and China's Yunnan Province, felt significant tremors. #Myanmar #earthquake pic.twitter.com/qgRHQ7ltjl— 鳳凰資訊 PhoenixTV News (@PhoenixTV_News) March 28, 2025మరోవైపు థాయ్‌లాండ్ ఉత్తర భాగం మొత్తం భూకంపంతో వణికిపోయింది. రాజధాని బ్యాంకాక్‌లో 7.3 తీవ్రతతో భూమి కంపించడంతో భవనాలు ఊగిపోయాయి. ప్రాణభయంతో జనాలు పరుగులు తీసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అక్కడి నష్టం వివరాలపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఇంకోవైపు చైనా సరిహద్దు ప్రావిన్స్‌తో పాటు బంగ్లాదేశ్, లావోస్, భారత్‌లోనూ భూమి కంపించింది. భారత్‌లో మణిపూర్, కోల్‌కతా, మేఘాలయా ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఇటు మయన్మార్, అటు థాయ్‌లాండ్‌లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 🚨 7.7 Magnitude Earthquake Hits Mandalay, MyanmarMultiple buildings destroyed in devastating quake.#Myanmar #Earthquake #แผ่นดินไหว pic.twitter.com/fgQTBlUqjw— Weather Monitor (@WeatherMonitors) March 28, 2025 Under construction building collapses in Myanmar following 7.7 scale #earthquake pic.twitter.com/8yzH8UFvjk— The Raisina Hills (@theraisinahills) March 28, 2025 1930 నుంచి 1956 మధ్య 7 తీవ్రతతో మయన్మార్‌లో భారీ భూకంపాలే సంభవించాయి. అయితే ఈ మధ్య కాలంలో ఇంత శక్తివంతమైన ప్రకంపనలు సంభవించడం ఇదే. చివరిసారిగా.. 206లో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పాత రాజధాని బాగన్‌లో ముగ్గురు మరణించారు. A massive 7.6m earthquake that just hit Thailand minutes ago. This caused a new skyscraper under construction to collapse in downtown Bangkok. https://t.co/0TF79rqqIq pic.twitter.com/RpzLKwQPvW— RyanMatta 🇺🇸 🦅 (@RyanMattaMedia) March 28, 2025 🚨 Strong 7.7 Earthquake shakes Bangkok: People run out onto the streets, water splashes out of swimming pools.pic.twitter.com/U4nlcRGaT0— Gems (@gemsofbabus_) March 28, 2025

భూకంపం ధాటికి.. బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ
బ్యాంకాక్: మయన్మార్ భారీ భూకంపం పొరుగున ఉన్న థాయ్లాండ్పైనా తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఉత్తర భాగం.. ప్రత్యేకించి రాజధాని బ్యాంకాక్ భారీ ప్రకంపనతో వణికిపోయింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. వందల భవనాలు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో.. ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలను ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నేలమట్టమైన బహుళ అంతస్థుల శిథిలాల కింద ఎంత మంది చిక్కుకుని ఉంటారన్న దానిపై అంచనాకి రాలేకపోతున్నారు. మరోసారి భూకంపం వస్తుందన్న అంచనాలతో అధికారులు బ్యాంకాక్‌లో భవనాలను ఖాళీ చేయిన్నారు. మెట్రో, రైలు సేవలు నిలిపివేశారు. ఎయిర్‌పోర్టు దెబ్బ తినడంతో సర్వీసులను నిలిపివేసి లాక్డౌన్ ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం ధాటికి విద్యుత్ సేవలకు, పలు చోట్ల ఇంటర్నెట్కు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రపంచ పర్యాటక నగరం కావడంతో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని త్వరగతిన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని అక్కడ స్థిరపడ్డ తెలుగు వ్యాపారి ఒకరు చెబుతున్నారు. #แผ่นดินไหว#แผ่นดินไหว #bangkok #earthquake #Thailand #Myanmar #disaster pic.twitter.com/lwHeZYNNCo— Siu (@ItsSiuOfficial) March 28, 2025At the time of the #Earthquake, some people were on the MRT and luckily the swaying moment had already stopped at the station. So, everyone ran out quickly while the station floor was swinging. #Thailand #Bangkok #Myanmar #แผ่นดินไหว pic.twitter.com/1XlClCWkfH— कृतिका शर्मा (@Kriti_Sanatani) March 28, 2025Bangkok gempa bumi kuat. Received photos & videos from my brother. His office crack everywhere & heard ada building yang runtuh. Semoga dipermudahkan 🥺 #bangkok pic.twitter.com/L4jXpyRfSh— netaflutar (@Netaflutar) March 28, 2025

MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings).. ఈ రెండూ పర్యాయ పదాలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభం నుంచి చెన్నై ఐకాన్‌గా ఉన్న ధోని.. ‘తలా’గా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ధోనికి ఉన్న క్రేజ్ గురించి మాటల్లో వర్ణించడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు.అతడు మైదానంలో అడుగుపెట్టాడంటే ప్రేక్షకులు ఇంకెవరినీ పట్టించుకోరు. ముఖ్యంగా తలా బ్యాట్‌తో రంగంలోకి దిగాడంటే.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న తమ జట్టు ఆటగాడైనా సరే అవుటై.. ధోనికి ఫినిషింగ్ చేసే అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తారు. అయితే, ఒక్కోసారి ఈ వీరాభిమానం వల్ల ధోని సొంత జట్టు ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెన్నై మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు.ధోని క్రేజ్ వల్ల ఇతర ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని.. దీనికి ‘తలా’నే స్వయంగా స్వస్తి పలకాలని రాయుడు విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు.. ధోని ఒక్కడి చుట్టే జట్టును అభివృద్ధి చేసిన చెన్నై.. కొత్త ఆటగాళ్లకు ఇవ్వాల్సిన స్థాయిలో అవకాశాలు ఇవ్వలేదని అభిప్రాయపడ్డాడు. కేవలం ధోని ఒక్కడినే నమ్ముకున్న చెన్నై యాజమాన్యం.. అతడి నిష్క్రమణ తర్వాత ఇబ్బందులపాలు కాకతప్పదని చెప్పుకొచ్చాడు.రచిన్ రవీంద్రపై విమర్శలుకాగా ఐపీఎల్-2025లో చెన్నై శుభారంభం చేసిన విషయం తెలిసిందే. సొంతమైదానం చెపాక్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచి ఈ సీజన్లో బోణీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో భాగంగా యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్)తో కలిసి ధోని క్రీజులో ఉన్నాడు.పందొమ్మిదవ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోని రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఈ క్రమంలో మరుసటి ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాది రచిన్ సీఎస్కేను గెలుపుతీరాలకు చేర్చాడు. దీంతో చెన్నై మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.ఈ నేపథ్యంలో చెన్నై విజయానికి సంతోషిస్తూనే రచిన్‌ను కొంతమంది పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ధోనికి ఫినిషింగ్ చేసే అవకాశం ఇవ్వలేదంటూ అతడిని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఇక సీఎస్కే తదుపరి మ్యాచ్‌లో ఇదే వేదికపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో శనివారం తలపడనుంది.బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!ఈ నేపథ్యంలో ధోని క్రేజ్ గురించి అంబటి రాయుడు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా విచిత్రమైన విషయం. చాలా మంది సీఎస్కే కంటే ముందు ధోని అభిమానులు. కానీ వారి అభిమానం వల్ల కొత్త ఆటగాళ్లు చాలాసార్లు ఇబ్బంది పడాల్సివస్తోంది.ధోని రాగానే బిగ్గరగా అరుస్తారు. వేరే వాళ్లకు అది అసౌకర్యంగా ఉంటుంది. ఫ్రాంఛైజీ అతడి చుట్టూనే జట్టును నిర్మించింది. చాలా ఏళ్లుగా అతడినే హైలైట్ చేస్తూ వస్తోంది. అందుకే ‘తలా’గా అతడు ప్రసిద్ధి పొందాడు.చెన్నై ఫ్రాంఛైజీకి కూడా తిప్పలు తప్పవుఅతడంటే చాలా మందికి పిచ్చి ప్రేమ. అందుకే తమ జట్టు ఆటగాళ్లనే అవుట్ కావాలని కోరుకుంటూ ఉంటారు. దీంతో చాలా మంది ప్లేయర్లు ఇబ్బంది పడ్డారు. వాళ్లు బయటకు వచ్చి చెప్పకపోవచ్చు కానీ ఇదే సత్యం. దీనికి ధోని మాత్రమే చెక్ పెట్టగలడు.ఆయన బయటకు వచ్చి.. ‘వీళ్లంతా మన వాళ్లే.. నాలాగే బ్యాటింగ్ చేసేందుకు వస్తారు. వాళ్లను కూడా నాలాగే ఆదరించండి’ అని చెప్పాలి. లేదంటే.. చెన్నై ఆటగాళ్లకే కాదు.. భవిష్యత్తులో చెన్నై ఫ్రాంఛైజీకి కూడా తిప్పలు తప్పవు.స్టేడియం నిండిపోవడానికి, జనాన్ని పోగు చేయడానికి ధోని క్రేజ్ ఉపయోగపడుతుంది. ఫ్రాంఛైజీ కూడా ఎప్పుడూ అతడి మీదే ఫోకస్ ఉంచుతుంది. బ్రాండ్ వాల్యూ కోసం అలా చేస్తుంది. కానీ .. ఆ తర్వాత.. ధోని జట్టుతో లేకుంటే.. అప్పుడు పరిస్థితి ఏమిటి?.. కాబట్టి వాళ్లు కాస్త విశాలంగా ఆలోచించాలి’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: అది ప్రపంచంలోనే బెస్ట్ వికెట్.. వాళ్లు అద్భుతంగా ఆడారు: కమిన్స్

బ్రిటన్ వీడనున్న బిలియనీర్?: కారణం ఇదే..
చాలామంది ధనవంతులు పన్ను మినహాయింపులు కల్పించే దేశాలలో స్థిరపడటానికి మక్కువ చూపిస్తారు. ఇప్పటికే కొంతమంది బ్రిటన్‌లో స్థిరపడ్డారు. అయితే అక్కడి ప్రభుత్వం.. ఇప్పటి వరకు అమలులో ఉన్న 'నాన్-డోమ్' పన్ను విధానాన్ని రద్దు చేసే దిశగా ఆలోచిస్తోంది. ఇదే జరిగితే ప్రముఖ పారిశ్రామికవేత్త 'లక్ష్మీ మిత్తల్' (Lakshmi Mittal) యూకే వీడనున్నారు.నాన్-డోమ్ పన్ను విధానం అమలులో ఉన్నంత వరకు.. ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ పన్ను విధానాన్ని రద్దు చేస్తే.. ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సుమారు రెండు శతాబ్దాలకంటే ఎక్కువ కాలంగా ఈ పన్ను విధానం బ్రిటన్‌లో అమలులో ఉంది. కానీ ఇప్పుడున్న అక్కడి ప్రభుత్వం ఈ పన్ను విధానానికి మంగళం పాడనుంది.యూకేలో కొత్త పన్ను విధానం అమలులోకి వస్తే, ధనవంతులు.. పన్ను విధించని యూఏఈ, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాలలో ఎదో ఒకదానికి వెళ్లే అవకాశం ఉంది.లక్ష్మి మిత్తల్ విషయానికి వస్తే.. స్టీల్ టైకూన్‌గా ప్రసిద్ధి చెందిన ఈయన యూకేలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరు. గత సంవత్సరం సండే టైమ్స్ రిచ్ లిస్ట్‌లో 14.9 బిలియన్ ఫౌండ్లతో ఏడవ స్థానంలో నిలిచారు. ఈయనకు లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్‌లో ఒక భవనం, స్విస్ రిసార్ట్ పట్టణం సెయింట్ మోరిట్జ్‌లో ఒక ఛాలెట్తో సహా యూరప్, యుఎస్, ఆసియా అంతటా విలువైన ఆస్తులు ఉన్నాయి. అంతే కాకుండా ఈయన దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం.

భావ ప్రకటన స్వేచ్ఛ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: వాక్ స్వాతంత్ర్యం.. భావ ప్రకటన స్వేచ్ఛపై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court Of India) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో.. అందునా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి భాగమని.. ప్రాథమిక హక్కులను పరిరక్షించడం న్యాయస్థానాల విధి అని స్పష్టం చేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది.రెచ్చగొట్టేలా పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హీపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం.. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ(Freedom of Expression) అంతర్భాగమని, ఆ హక్కును గౌరవించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గుజరాత్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఈ కేసులో ఎలాంటి నేరం లేకపోయినా అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంలోనే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.సినిమాలు, కవిత్వం.. సాహిత్యం, వ్యంగ్యం.. మనుషుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు.. ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం ఎలా సాధ్యమవుతుంది?. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో.. విభిన్న అభిప్రాయాలను.. ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదు. ఒకవేళ ఆ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సివస్తే.. అవి సహేతుకంగా ఉండాలే గానీ.. ఊహాజనితంగా కాదు. ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువమంది వ్యతిరేకించినా సరే.. ఆ వ్యక్తి భావ ప్రకటనా హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే. భావ స్వేచ్ఛ ప్రకటన, వాక్ స్వాతంత్య్రం(Freedom of Speech) అనేవి ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం న్యాయస్థానాల విధి. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి. అంతిమంగా.. ఆర్టికల్ 19(1)ను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదే’’ అని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. జరిగింది ఇదే..గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి(Imran Pratapgarhi) గతేడాది డిసెంబరులో 46 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఓ పెళ్లి వేడుక మధ్యలో ఆయన నడిచివస్తుండగా పూలవర్షం కురిపిస్తూ.. బ్యాక్‌గ్రౌండ్ ఓ పద్యం వినిపించారు. అయితే, ఆ పద్యంలో పదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, అవి మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయన్న ఫిర్యాదుతో గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ హైకోర్టులో ఇమ్రాన్‌కు ఊరట లభించలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్‌కు ఊరట ఇచ్చింది.

‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ
నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. భీష్మ(2020) తర్వాత ఆయనకు ఆ స్థాయి విజయం లభించలేదు.దీంతో మళ్లీ భీష్మ దర్శకుడు వెంకీ కుడుములనే నమ్ముకున్నాడు. ఆయన దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్’(Robinhood Review) అనే సినిమాతో నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి చిత్రంతో నితిన్ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రామ్ (నితిన్) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్‌హుడ్’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్(షైన్ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్ రాబిన్‌ని పట్టుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు. రాబిన్‌కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు.(Robinhood Review). అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు? సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్‌హుడ్ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్‌హుడ్ సడెన్‌గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..రాబిన్‌హుడ్ కథ అంటే ధనవంతుల నుంచి దొంగిలించి పేదవాళ్లకు పంచే ఒక నీతిగల దొంగ స్టోరీ అందరికి తెలిసిందే. తెలుగు సినిమాల్లో ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. కానీ ప్రతి సినిమా దానికి తగ్గట్టుగా కొత్త రంగు, రుచి జోడించి ప్రేక్షకులను అలరించింది. రాబిన్‌హుడ్ కూడా టైటిల్‌కి తగ్గట్టే రాబిన్‌హుడ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం. కథ పరంగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది కనిపించదు. శారీరక బలం కంటే, మానసిక బలాన్ని ఎక్కువగా నమ్ముకునే హీరో.. దొంగతనం చేసి అవసరం ఉన్నవాళ్లకు పంచడం..కథ ఇదే లైన్లో సాగుతుంది. ఇక్కడ హీరో అనాథ పిల్లల కోసం దొంగతనం చేస్తుంటాడు. ఆ పాయింట్ వినగానే అందరికి రవితేజ ‘కిక్’ గుర్తొస్తుంది. కానీ పూర్తిగా ‘కిక్’ థీమ్‌ని అనుసరించలేదు. ( ఇదీ చదవండి: Mad Square Movie Review: 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ)కథలో డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. చివరకు వాటి మధ్య ఉన్న సంబంధం రివీల్ అవుతుంది. ఈ ట్విస్టులు సాధారణ ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి. ఫస్టాప్ మొత్తం ఫన్‌జోన్‌లో సాగుతుంది. హీరో చిన్నప్పుడే ఎందుకు దొంగగా మారాల్సి వచ్చిందో తెలియజేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులను బురిడి కొట్టించే సీన్లన్ని పాత సినిమాను గుర్తు చేస్తాయి. హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథనం కామెడీతో పరుగులు పెడుతుంది. వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలల్లో కామెడీ బాగా పండింది(Robinhood Review)ముఖ్యంగా నీరా దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు జాన్ స్నో చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. విలన్ చుట్టూ సాగే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. కథనం కూడా కొంతవరకు ఊహకందేలా సాగుతుంది. కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నప్పటికీ.. రాబిన్ అసలు రుద్రకోండకు ఎందుకు వచ్చాడనేది తెలిసిన తర్వాత మళ్లీ రొటీన్ మూడ్‌లోకి వెళ్లిపోతాం. అదే సమయంలో వచ్చిన అదిదా సర్ప్రైజ్ సాంగ్ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ‘ట్రూత్ ఆర్ డేర్’ సీన్ ఒకటి నవ్వులు పంచుతుంది. డేవిడ్ వార్నర్ పాత్ర మినహా క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. అయితే వార్నర్ పాత్రను సరైన ముగింపు ఇవ్వకుండా.. పార్ట్ 2 కూడా ఉంటుందని హింట్ ఇచ్చేశారు. ఎవరెలా చేశారంటే..రాబిన్‌హుడ్ పాత్రలో నితిన్ చక్కగా నటించాడు. అతని కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో పలు సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీలీల పాత్ర పరిమితంగా ఉన్నప్పటికీ, తెరపై చాలా అందంగా కనిపించింది. నటనపరంగా ఆమెకు పెద్దగా స్కోప్ ఉన్న పాత్రమేది కాదు. దేవదత్త పాత్ర మొదట్లో భయపెట్టేలా అనిపించినా, చివర్లో కాస్త నీరసంగా మారి ప్రేక్షకులను నిరాశపరిచింది.రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్‌ల కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరు తమదైనశైలీలో నటించి నవ్వులు పూయించారు.డేవిడ్ వార్నర్ స్క్రీన్‌పై చాలా తక్కువ సమయం కనిపించినప్పటికీ, అతని ఎంట్రీతో థియేటర్లలో విజిల్స్ మారుమోగేలా అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. శుభలేక సుధాకర్, షైన్ చాం టాకోతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవి ప్రకాశ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలు వినడానికి బాగున్నా..తెరపై చూస్తే అంతగా ఆకట్టుకోలేవు. కథలో వాటిని ఇరికించినట్లుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు భారీగానే ఖర్చు చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమాను చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు.

రేవంత్ వ్యాఖ్యలు.. న్యాయ వ్యవస్థకు సవాలే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయ వ్యవస్థకు సవాల్ విసిరారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోవని, ఉప ఎన్నికలు రావని ఆయన శాసనసభ సాక్షిగా వ్యాఖ్యానించారు. ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఒక విధంగా భరోసా ఇచ్చినట్లే. అదే టైమ్‌లో ఉప ఎన్నికలకు వెళ్లడానికి కాంగ్రెస్ వెనుకంజ వేస్తోందన్న సంకేతం కూడా ఇచ్చినట్లయింది. ప్రజలలో వ్యతిరేకత ఉందంటూ బీఆర్ఎస్, బీజెపిలు చేస్తున్న ప్రచారానికి ఊతమిచ్చినట్లవుతుంది.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న బలహీనతలు, న్యాయ వ్యవస్థ లోపాలను బహిర్గతం చేశాయి. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోని న్యాయ వ్యవస్థ ఇప్పుడు మాత్రం ఎలా తీసుకుంటుందన్నది ఆయన ప్రశ్న కావచ్చు. ఇది హేతుబద్దంగానే కనిపిస్తున్నా నైతికతే ప్రశ్నార్థకం. శాసనసభలో జరిగే చర్చలకు రక్షణ లేదా ఇమ్యూనిటి ఉన్నప్పటికీ, రేవంత్ వ్యాఖ్యల వీడియోని సుప్రీం కోర్టులో ప్రదర్శిస్తే న్యాయమూర్తులు ఎలా స్పందిస్తారన్నది అప్పుడే చెప్పలేం. వారు సీరియస్‌గా తీసుకోకపోతే ఫర్వాలేదు. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదముంది.అత్యున్నత న్యాయస్థానం రేవంత్ వ్యాఖ్యలనే సాక్ష్యంగా తీసుకుంటే అది పెద్ద సంచలనమవుతుంది. బీఆర్ఎస్ అధినేత, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించిన మాట నిజం. వారిలో కొందరికి మంత్రి పదవులు ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చి మంత్రి అయ్యారు. దానికి మూల కారణం ఓటుకు నోటు కేసు కావడం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును పొందడం కోసం ఆయనకు రూ.ఏభై లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడినట్లు కేసు నమోదు అయిన సంగతి విదితమే. టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలోనే ఉండేవారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆయన కుట్రపన్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించే వారు.తొలి ఎన్నికలలో టీఆర్ఎస్కు 63 సీట్లే ఉండేవి. ఈ క్రమంలో రాజకీయంగా పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనంలోకి తీసుకుని కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించారు. దానిపై టీడీపీ పక్షాన రేవంత్ కాని, ఇతరత్రా మరికొందరు కాని హైకోర్టుకు వెళ్లారు. అయినా పెద్దగా ఫలితం రాలేదు. రెండో టర్మ్‌లో కూడా కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకువచ్చారు. ఫలితంగా కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోయింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రయ్యారు. శాసనసభ పక్షాల విలీనం పేరుతో కథ నడిపారు. మొత్తం ఎమ్మెల్యేలు ఒకసారి పార్టీ మారకపోయినా, స్పీకర్లు అధికార పార్టీ వారే కనుక ఇబ్బంది లేకుండా సాగిపోయింది.2014 టర్మ్‌లో ఏపీలో సైతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకోవడమే కాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. అయినా స్పీకర్ వారెవ్వరిపై అనర్హత వేటు వేయలేదు. ఈ నేపథ్యంలో ఈ ఫిరాయింపులపై ఫిర్యాదులు అందినా, అసెంబ్లీ గడువు ముగిసే టైమ్‌కు కూడా న్యాయ స్థానాలు తేల్చలేదు. తెలంగాణలో అప్పటికి, ఇప్పటికి ఒక తేడా ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్లోకి జంప్ చేయడంతో విలీనం కథ నడిచింది. రాజ్యసభలో కూడా నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీ ఇలాగే విలీనం చేసుకుంది. నిజానికి న్యాయ వ్యవస్థ ఈ ఫిరాయింపుల మూలానికి వెళ్లి ఉంటే బాగుండేది.అలా చేయకపోవడంతో ఆయా రాష్ట్రాలలో ఇది ఒక అంతులేని కథగా మారింది. కేసీఆర్ జమానాలో జరిగిన దానికి, రేవంత్ హయాంలో జరిగిన ఫిరాయింపులకు తేడా ఉంది. ఆనాడు సామూహిక ఫిరాయింపులన్నట్లుగా బీఆర్ఎస్ చూపింది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం కాంగ్రెస్‌కు బలహీన పాయింట్ కావచ్చు. మొత్తం 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే పది మంది మాత్రమే పార్టీ మారారు. వీరి ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలు ఉన్నప్పటికీ, వాటిని కోర్టులలో నిగ్గు తేల్చేసరికి పుణ్యకాలం ముగిసి పోవచ్చు. తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు నోటీసు ఇచ్చి ఏడాది అయిపోయినా దానికి సమాధానం ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.సుప్రీం వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ నేతలు కచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోతాయని, ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత టి.రాజయ్య ఏకంగా ఎన్నికల ప్రచారమే ఆరంభించారట. దాంతో రేవంత్ అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడానికి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. కాని ఈ స్టేట్ మెంట్ ఆయనను ఆత్మరక్షణలోకి కూడా నెట్టినట్లయింది. ఉప ఎన్నికలకు వెనుకాడుతున్నారన్న సంకేతం కాంగ్రెస్‌కు ఎంతవరకు ప్రయోజనమన్న ప్రశ్న వస్తుంది. 2014-2023 వరకు బీఆర్ఎస్ ఏ సంప్రదాయాలు అమలు చేసిందో వాటినే తామూ పాటిస్తున్నామని ఆయన అంటున్నారు. గతంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని అడిగారు. దీనికి న్యాయ వ్యవస్థతో పాటు రాజకీయ పార్టీలు బదులు ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అంటున్నారని కూడా రేవంత్ చెప్పారు. కాని కొందరు పార్టీ మారినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.అయితే పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వంటివారు తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. అభివృద్ది పనుల కోసం సీఎంను కలిసి వచ్చామని కాంగ్రెస్ లో చేరినవాళ్లు అంటున్నారని కూడా రేవంత్ చెప్పారు. తాను మాట్లాడేది సబ్ జ్యుడీస్ అవుతుందన్న వాదనను ఆయన తోసిపుచ్చుతూ శాసనసభలో మాట్లాడితే రక్షణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుల విషయంలో గతంలో ఏ సీఎం కూడా ఇంత నేరుగా అసెంబ్లీలో ఈ విషయాలు మాట్లాడలేదు. బీఆర్ఎస్ చేసిన పనే తాము చేశామని, అప్పుడు లేని కొత్త నిబంధనలు ఇప్పుడు వస్తాయా అని ఆయన ప్రశ్నించారు. నిజమే. బీఆర్ఎస్కు ఈ వ్యవహారంలో నైతిక అర్హత లేదు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ కూడా అదే రీతిలో ఫిరాయింపులను ఎంకరేజ్ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కుంటున్నది చర్చనీయాంశం.కోర్టు నేరుగా ఎమ్మెల్యేలను అనర్హులుగా చేస్తూ తీర్పు ఇస్తే తప్ప, కేవలం స్పీకర్ ల నిర్ణయానికే వదలివేసే పరిస్థితి ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఎవరూ అనుకోవడం లేదు. పూర్వం నుంచి ఈ ఫిరాయింపుల సమస్య ఉంది. దానిని అరికట్టాలని రాజ్యాంగ సవరణలు తెచ్చినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. న్యాయ వ్యవస్థ కూడా ఆయా రాష్ట్రాలలో ఆయా రకాలుగా ఫిరాయింపులపై స్పందిస్తున్నదన్న అభిప్రాయం కూడా ఉంది. అధికారం ఎటు ఉంటే అటు వైపు పరుగులు తీసే ప్రజాప్రతినిధులు, వారిని ప్రోత్సహించే రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడడం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్లు అవుతుందేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

పరిస్థితులు ఎలా ఉన్నా గెలవడం అంటే ఇదే..! వైరల్‌గా ఆనంద్ మహీంద్రా పోస్ట్
పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకంటూటారు. అవి యువతకే కాదు, ఉద్యోగులకు, సాధారణ గృహిణులకు స్థైర్యాన్ని, స్పూర్తిని అందించేలా ఉంటాయి. మనకే ఇంత పెద్ద కష్టం ఏమో!.. అనే అజ్ఞానం నుంచి బయటపడేసేలా ప్రేరణాత్మకంగా ఉంటాయి. ఈసారి కూడా ఆనంద్ అలాంటి స్ఫూర్తిని కలిగించే వీడియోని షేర్చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఓ ఉద్యోగి ఎలా వ్యవహరించాలో తెలియజెప్పే స్టోరీ ఇదీ..!.సమస్యలనేవి వస్తూనే ఉంటాయి. అయితే అవి ఏ రూపంలో వచ్చినా మనం ధైర్యం, ఆశ కోల్పోకూడదు. అదే చెబుతోంది ఈ రాజ్‌కుమార్ దాబీ గాథ. అతడు మహీంద్రా గ్రూప్ ఉద్యోగి. సేల్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతను 2014లో కంటిశుక్లంకి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు. దాంతో అప్పటి నుంచి నెమ్మదినెమ్మదిగా దృష్టిని కోల్పోవడం ప్రారంభించాడు. అలా ఇప్పుడాయన 5% దృష్టిని మాత్రమే కలిగి ఉన్నారు. అయినా ఆయన అధైర్యపడలేదు. అపుడెలా ఉద్యోగంలో డైనమిక్‌గా పనిచేశారో అలానే దూసుకుపోతున్నారు. తన సహోద్యోగులతో సమానంగా పనిచేస్తారాయన. ఆ టైంలో కూడా ఆయన సుమారు 5 మందికి పైగా తన విభాగంలో శిక్షణ ఇచ్చారు. అతడి సీనియర్ ఉద్యోగులు సైతం రాజ్‌కుమార్ దాబీ విల్పవర్కి అబ్బురపడటమే కాదు అతడి పనిని మెచ్చుకుంటున్నారు కూడా. అంతేగాదు అతను ఇలాంటి స్థితిలో కూడా మంచిగా అమ్మకాలు జోరందుకునేలా చేశాడని చెబుతున్నారు వారంతా. అతడు కంపెనీని తన కుటుంబంలా భావించి..వర్క్ గురించి తన కింద ఉద్యోగులకు తర్ఫీదు ఇస్తాడు. ఫలితంగా అతడు వాళ్ల నుంచి ప్రేమ ఆప్యాయతలో కూడిన ప్రోత్సహాం అందుకుంటాడు. అందువల్లే అతడు ఈ ఆకస్మిక వైకల్యాన్ని అధిగమించి ఉద్యోగంలో కొనసాగుతున్నాడు. అతడు తనకు సడెన్‌గా వచ్చిపడిన ఈవైకల్యానికి చింతిస్తూ కూర్చోలేదు. కేవలం పరిష్కారం దిశగా, తాను చేయగలిగే పనిపై దృష్టిసారించాడు. అదే అతడిని తన ఉద్యోగంలో యథావిధిగా కొనసాగిలే చేసింది. పని అనేది తన అభిరుచిగా భావించి చేసేవారికి తిరిగే ఉండదు అనేందుకు రాజ్‌కుమార్ దాబీనే ఉదాహరణ. ఆ వ్యక్తి తన కంపెనీలో సహోద్యోగిగా కొనసాగడం గర్వంగా భావిస్తున్నా అంటూ అతడికి సంబంధించిన వీడియోని కూడా జత చేసి పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. నెటిజన్లు కూడా ఇది స్పూర్తిదాయకమైన కథ, కార్యాలయంలో గుర్తింపు ఎలా తెచ్చుకోవాలో ఇతడిని చూస్తే క్లియర్‌గా తెలుస్తుందని కొందరూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకూడదు, అదే మనల్ని ముందుకు సాగేలా ధైర్యం అందిస్తుంది అంటూ పోస్టులు పెట్టారు. Often, the #MondayMotivation you need is right next to you, on your home turf…Dhanyavaad, Thank you, Rajkumar Dabi, for making me so proud to be your colleague. You inspire us every single day…pic.twitter.com/2UcBnqQxjc— anand mahindra (@anandmahindra) March 24, 2025 (చదవండి: 'విల్‌పవర్' అంటే ఇది..ఏకంగా వీల్‌చైర్‌తో బంగీ జంప్..! వీడియో వైరల్)
నారాయణ పేట జిల్లాలో విచిత్రం
నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ - వీడియో
‘చంద్రబాబు, పవన్‌లు ఇప్పుడు ఎక్కడున్నారు?’
నాన్న ఇచ్చిన గిఫ్ట్.. ప్రపంచంలో టాప్ 10లోకి..
కోట్లాది రూపాయల స్కాంలో 'పుష్ప 2' డబ్బింగ్ ఆర్టిస్ట్
నా సోదరి మరణం తీవ్రంగా కలచివేసింది: మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
‘ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా’
మయన్మార్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటాం : ప్రధాని మోదీ
నేరుగా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కేంద్రంతో దక్షిణాది రాష్ట్రాలు అమీ తుమీ!
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
మయన్మార్‌లో భారీ భూకంపం.. భారత్ సహా పొరుగు దేశాల్లోనూ కంపించిన భూమి
'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ
రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ
మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం.. నీళ్ల బకెట్లో వేసి కన్నతల్లే చంపేసింది
IPL 2025 LSG vs SRH: ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి..
‘ఆర్థికాభివృద్ధికి ఈ రెండే కీలకం’
‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ
భావ ప్రకటన స్వేచ్ఛ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సుప్రీం కోర్టు తీర్పు.. కూటమి సర్కార్‌కు చెంపపెట్టు
నారాయణ పేట జిల్లాలో విచిత్రం
నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ - వీడియో
‘చంద్రబాబు, పవన్‌లు ఇప్పుడు ఎక్కడున్నారు?’
నాన్న ఇచ్చిన గిఫ్ట్.. ప్రపంచంలో టాప్ 10లోకి..
కోట్లాది రూపాయల స్కాంలో 'పుష్ప 2' డబ్బింగ్ ఆర్టిస్ట్
నా సోదరి మరణం తీవ్రంగా కలచివేసింది: మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
‘ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా’
మయన్మార్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటాం : ప్రధాని మోదీ
నేరుగా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కేంద్రంతో దక్షిణాది రాష్ట్రాలు అమీ తుమీ!
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
మయన్మార్‌లో భారీ భూకంపం.. భారత్ సహా పొరుగు దేశాల్లోనూ కంపించిన భూమి
'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ
రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ
మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం.. నీళ్ల బకెట్లో వేసి కన్నతల్లే చంపేసింది
IPL 2025 LSG vs SRH: ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి..
‘ఆర్థికాభివృద్ధికి ఈ రెండే కీలకం’
‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ
భావ ప్రకటన స్వేచ్ఛ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సుప్రీం కోర్టు తీర్పు.. కూటమి సర్కార్‌కు చెంపపెట్టు
సినిమా

నేరుగా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. చాలా చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ.. మరికొన్ని మాత్రం నేరుగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. అలా ఇప్పుడో హిందీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎప్పుడు రాబోతుంది?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'జ్యూయల్ థీఫ్'. టైటిల్ చూడగానే అర్థమైందనుకుంటా. మనీ హైస్ట్ లా ఇందులోనూ రెడ్ సన్ అనే రూ.500 కోట్ల విలువైన డైమండ్ కొట్టేయాలని హీరోకి విలన్ పనిఅప్పజెబుతాడు. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.వార్, పఠాన్ తదితర చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ పెంచుకున్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి నిర్మాత. రాబీ గ్రేవాల్, కుకీ గులాటీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25 నుంచి ఇది నేరుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తాజాగా ప్రకటించారు.(ఇదీ చదవండి: సల్మాన్ చేతికి 'రామ్ జన్మభూమి' వాచ్.. రేటు ఎంతంటే?)

పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి పూజ చేసిన శోభా శెట్టి.. ఎందుకంటే?
శోభా శెట్టి (Shobha Shetty).. కొంతకాలం క్రితం వరకు ఈమెను కార్తీకదీపం మోనితగానే గుర్తుపెట్టుకున్నారు జనాలు. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్‌తో శోభా శెట్టిగానూ గుర్తింపు తెచ్చుకుంది. షోలో తను లవ్‌లో ఉన్నట్లు తెలిపింది. యశ్వంత్ రెడ్డి (Yashwanth)తో ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. గతేడాది జనవరిలో తాంబూలాలు మార్చుకోగా మే నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. 11 నెలలు కావొస్తున్నా ఇంకా పెళ్లెప్పుడనేది చెప్పడం లేదు శోభ.తాజాగా శోభ.. ప్రియుడితో కలిసి పూజ చేసింది. దాదాపు 16 కలశాలు పెట్టి మధ్యలో శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేసింది. పూజ చేయడానికి గల కారణం గురించి శోభ మాట్లాడుతూ.. కొత్తింట్లోకి వచ్చి ఎనిమిది నెలలవుతోంది. అప్పుడు పూజ చేసి ఇంటికి గుమ్మడికాయ కట్టాం. దిష్టి తాకి అదిప్పుడు పాడైపోయింది. అందుకే పంతులుగారిని పిలిచి పూజ చేశాం. దీనివల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి. యశ్వంత్ ఎక్కువగా నమ్మడు. కానీ మా అత్తమ్మ, నేను ఎక్కువ నమ్ముతాం. అందుకే పూజ చేశాం అని శోభా శెట్టి చెప్పుకొచ్చింది.చదవండి: 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ

'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ
టైటిల్ : మ్యాడ్ స్క్వేర్నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్, తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర హారిక, సాయి సౌజన్యసమర్పకులు: ఎస్. నాగ వంశీఎడిటింగ్: నవీన్ నూలిదర్శకత్వం, కథ: కల్యాణ్ శంకర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో, తమన్‌సినిమాటోగ్రఫీ: శామ్దత్విడుదల: మార్చి 28, 2025'మ్యాడ్ స్క్వేర్'తో(Mad Square) మరోసారి నవ్వులు పూయించేందుకు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ థియేటర్స్‌లోకి వచ్చేశారు. 2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా ఉంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. నేడు (మార్చి 28) సినిమా విడుదలైంది. కాలేజీ నేపథ్యంతో పరిచయం అయిన కొందరు స్నేహితులు వారి చదువులు పూర్తి అయిన తర్వాత మళ్లీ ఒకచోట కలిస్తే వారి అల్లరి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లో చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థి పారిపోయే సంఘటన నుంచి మ్యాడ్ పార్ట్-1 కథ మొదలవుతుంది. ఫైనల్‌గా ఆ విద్యార్థి RIEలోనే చదివి తీరుతాననే నిర్ణయంతో కథ ముగుస్తుంది. ఇప్పుడు లడ్డు గాడి పెళ్లితో మ్యాడ్ స్క్వేర్ కథ ప్రారంభమౌతుంది. కాలేజీ నుంచి తమ చదవులు పూర్తి చేసిన తర్వాత వారు ఏం చేశారనేది మ్యాడ్ స్క్వేర్‌లో ఫుల్ ఫన్‌తో దర్శకుడు చూపించాడు.కథేంటంటే..ఈ కథలో పెద్దగా లాజిక్స్ అంటూ ఏమీ ఉండవ్.. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. అశోక్ (నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్), దామోదర్(సంగీత్ శోభన్),లడ్డు(విష్ణు) నలుగురు స్నేహితులు ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత విడిపోతారు. కానీ, లైఫ్‌లో సెటిల్ కాకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లడ్డు(విష్ణు) పెళ్లి నుంచి ఈ సినిమా అసలు కథ మొదలౌతుంది. స్నేహితులకు చెప్పకుండా లడ్డు పెళ్లికి రెడీ అయిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అతని మిత్రులు వేడక సమయంలో సడెన్‌గా ఎంట్రీ ఇస్తారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ఫన్ మొదలౌతుంది. లడ్డుకు ఎలాగైనా పెళ్లి చేయాలని తండ్రి మురళీధర్ గౌడ్ ఎదురు కట్నం ఇచ్చి సంబంధం సెట్ చేస్తాడు. ఈ క్రమంలో ఆ పెళ్లి చెడిపోకూడదని లడ్డూ ఫ్యామిలీ పడే పాట్లు నవ్వులు తెప్పిస్తాయి. ఫ్రెండ్ పెళ్లి ఘనంగా చేయాలని దామోదర్, అశోక్, మనోజ్ అనేక ప్లాన్స్ వేస్తుంటారు. వారి హంగామాకు తోడు పెళ్లికూతురు ఫ్యామిలీ నుంచి లడ్డూకు ఎదురయ్యే అవమానాలు కడుపుబ్బా నవ్విస్తాయి. తన స్నేహితులు చేసే తుంటరి పనుల వల్ల ఆ పెళ్లిలో చాలా గందరగోళం నెలకొంటుంది. పెళ్లి జరుగుతున్నంత సేపు ఎక్కడ ఆ కార్యక్రమం ఆగిపోతుందో అనే భయంతో లడ్డు ఉంటాడు. సరిగ్గా పెళ్లి అవుతుందని సమయంలో లడ్డు స్నేహితులతో పాటు వచ్చిన ఒక వ్యక్తితో పెళ్లికూతురు వెళ్లిపోతుంది. ఈ విషయం తెలిశాక లడ్డూ ఇంట్లో జరిగే పంచాయితీ, అక్కడ మ్యాడ్ గ్యాంగ్ చేసే అతి ఫుల్‌గా నవ్విస్తుంది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న లడ్డు కోసం కాస్త రిలాక్స్ ఇవ్వాలని వారందరూ గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. వారు ఎంట్రీ ఇచ్చాక గోవా మ్యూజియంలో విలువైన లాకెట్‌ను గోవాలో పెద్ద డాన్‌గా ఉన్న మ్యాక్స్ (సునీల్) మనుసులు దొంగలిస్తారు. దానిని లడ్డు బ్యాచ్ చేశారని పోలీసులు అనుమానిస్తారు. దీంతో వారిపై నిఘా ఉంచుతారు. అయితే, ఒక ఘటనలో ఆ లాకెట్ లడ్డు చేతికి దొరుకుతుంది. దీంతో దానిని తిరిగి తెచ్చివ్వాలని లడ్డు తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేస్తాడు. ఈ కేసును చేధించేందుకు ఒక ఐపీఎస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. లడ్డు బ్యాచ్‌లో ఉన్న ఆ అధికారి ఎవరు..? లడ్డుని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరో అబ్బాయితో ఎందుకు వెళ్లిపోయింది...? వారిద్దరూ కూడా గోవాకే ఎందుకు వెళ్తారు..? చివరిగా ఆ లాకెట్ కథ ఏంటి.. ఎవరి వద్ద ఉంటుంది..? ఫైనల్‌గా లడ్డును తన స్నేహితుడే జైలుకు ఎందుకు పంపుతాడు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?మ్యాడ్ స్క్వేర్ విడుదలకు ముందే నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కథ గురించి పెద్దగా ఏమీ ఉండదని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే కథ బలం ఉండదు. కానీ, నవ్వులతో వంద శాతం ఎంటర్టైన్ చేస్తారు. ప్రతి సీన్లో వరుస పంచ్‌లతో నవ్విస్తారు. డీడీ, లడ్డు గ్యాంగ్ కావాల్సినంత హంగామా చేస్తారు. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశంలో వారు వినోదాన్ని పంచుతారు. పార్ట్-1లో కాలేజి క్యాంపస్‌ను ఎంచుకున్న దర్శకుడు.. పార్ట్‌లో లడ్డు గాడి పెళ్లి, గోవా కాన్సెప్ట్‌ను ప్రధానంగా ఎంచుకున్నాడు. యువతను ఆకట్టుకునేలా ఫుల్ పంచ్‌లతో సినిమా ఉంటుంది. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు దర్శకుడు కల్యాణ్ శంకర్. కాలేజీలో మొదలైన స్నేహం.. ఆ తర్వాత కూడా ఎంత మధురంగా ఉంటుందో లడ్డు కథతో దర్శకుడు చెప్పాడు. (ఇదీ చదవండి: ‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ)ఈ కథలో ప్రధాన పాత్రధారులైన మనోజ్, అశోక్, దామోదర్ల పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని మ్యాడ్ అనే టైటిల్ పెట్టి హిట్ కొట్టాడు. ఇప్పుడు దానికి లడ్డుగాడి కథన కలిపి మ్యాడ్ స్క్వేర్ చేశాడని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో కథ గోవా షిఫ్ట్ అయ్యాక ఇంకాస్త స్పీడ్ పెంచాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా లడ్డు పెళ్లితో ఫుల్ ఎంటర్టైన్ చేస్తే రెండో భాగం కాస్త ఫన్ నెమ్మదిస్తుంది. మ్యాక్స్ గ్యాంగ్ చేసే దొంగతనం మ్యాడ్ గ్యాంగ్‌కు చుట్టుకోవడం. ఆపై లడ్డూ తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేయడం.. ఆయన్ని ఎలాగైనా కాపాడాలని డీడీ, లడ్డూ, అశోక్, మనోజ్ చేసే ప్రయత్నాలు సెకండాఫ్‌లో ఉంటాయి.సునీల్, లడ్డు ఫాదర్ మురళీధర్ మధ్య సీన్స్ బాగున్నాయి. సత్యం రాజేష్ పోలీసు పాత్ర నుంచి వచ్చే ప్రతి సీన్ కాస్త ఫోర్స్డుగా ఉంటుంది. సినిమాలో హిట్ సాంగ్ స్వాతిరెడ్డి కూడా సరైన పాయింట్లో లేదు అనిపిస్తుంది. ప్రియాంక జవల్కార్ను కామియో రోల్ ఇచ్చారు. కానీ, అంత ఎట్రాక్ట్ అనిపించలేదు. లడ్డు మీద వరుస పంచ్‌లు పడుతున్నా సరే సినిమాను ఫుల్ స్వింగ్‌లో నడిపించాడని చెప్పవచ్చు. అక్కడక్కడ మినహాయిస్తే.. విసుగు లేకుండా ప్రతి సన్నివేశంలో ఫుల్ వినోదం ఉంటుంది. రెండు గంటలపాటు బాగా ఎంజాయ్ చేసే థియేటర్ నుంచి ప్రేక్షకుల బయటకు వస్తారని చెప్పవచ్చు.ఎవరెలా చేశారంటే..?మ్యాడ్-1లో చాలా పాత్రలు ఉంటాయి.. అక్కడ అన్ని క్యారెక్టర్స్‌కు ప్రాధాన్యత ఉంటుంది. కానీ, ఇందులో కొన్నింటికి తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నార్నె నితిన్ తనదైన స్టైల్లో సెట్ అయిపోయాడు. లడ్డూగా విష్ణు తన నటన తీరుతో నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాకు ప్రధాన బలం లడ్డునే అని చెప్పవచ్చు. సంగీత్ శోభన్ డీడీగా తన వేగం ఎక్కడా తగ్గనివ్వకుండా పంచ్ డైలాగ్స్ పేలుస్తూనే ఉంటాడు. ఎక్కడా కూడా తన ఎనర్జీ తగ్గకుండా మెప్పిస్తాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ సైలెంట్‌గా లవర్ బాయ్‌లా తన ఫెయ్యిల్యూర్ స్టోరీ చెబుతూ చుట్టేస్తూ ఉంటాడు. రఘుబాబు, మురళీధర్ గౌడ్లు తమ పాత్రల పరిధి మేరకు నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ మరోసారి అతిథి పాత్రలో కనిపించింది కొద్దిసేపు మాత్రమే అయినప్పటికీ ప్రేక్షకులతో విజిల్స్ వేపించేలా చేశాడు. మ్యాక్స్ పాత్రలో సునీల్ విలనిజమే కాకుండా కామెడీని కూడా పండించాడు. శుభలేఖ సుధాకర తన పాత్ర పరిమితిమేరకు పర్వాలేదు. మ్యాడ్ స్క్వేర్ కథలో పెద్దగా బలం లేకున్నప్పటికీ దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన విధానం బాగుంది. కానీ, సంభాషణల విషయంలో బలవంతంగా నవ్విద్దాం అనేలా కొన్ని సీన్లు ఉన్నాయి. పాటల విషయంలో భీమ్స్ ఇంకాస్త శ్రద్ధ పెట్టింటే బాగుండు. తమన్ బీజీఎమ్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి సూపర్ అనిచెప్పవచ్చు. నిర్మాణం పరంగా ఉన్నంతమేరకు బాగుంది. నిర్మాతలు సూర్యదేవర హారిక, సాయి సౌజన్యలకు మ్యాడ్ స్క్వేర్ మంచి విజయాన్ని ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు.

ఆస్కార్ నామినేషన్.. ఇండియాలో రిలీజ్‌కు నోచుకోని చిత్రం
యూకే నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన సినిమా సంతోష్ (Santosh Movie). బ్రిటీష్ ఇండియన్ ఫిలిం మేకర్ సంధ్యా సూరి తెరకెక్కించిన ఈ మూవీ భారత్‌లో రిలీజ్‌కు నోచుకోవడం లేదు. పలు సున్నితమైన అంశాలను చూపించడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందని చిత్రయూనిట్ వెల్లడించింది. కొన్ని సన్నివేశాలను తీసేయమని కోరిందని, అది ఇష్టం లేకపోవడం వల్లే భారత్‌లో దీన్ని విడుదల చేయడం లేదని పేర్కొంది.ఎంతో ప్రయత్నించా..దీని గురించి సంధ్యా సూరి (Sandhya Suri) మాట్లాడుతూ.. సినిమాలో చూపించిన సమస్యలు భారత్‌కు కొత్తేమీ కాదు. వీటి గురించి గతంలోనూ ఎన్నో సినిమాల్లో ప్రస్తావించారు. అయినప్పటికీ మా సినిమా రిలీజ్‌కు ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు. బహుశా మా సినిమాలో హీరో లేకపోవడం నచ్చట్లేదేమో! ఈ మూవీని భారత్‌లో రిలీజ్ చేయడం నాకెంతో అవసరం. దీనికోసం అన్నిరకాలుగా ప్రయత్నించాను. కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు. మా చిత్రంలో కొన్ని సన్నివేశాలు తొలగించమని సీబీఎఫ్సీ కోరింది. వారు చెప్పినట్లు చేస్తే కథ తీవ్రత తగ్గిపోతుంది. సినిమాను దెబ్బతీయడం ఇష్టం లేక రిలీజ్ చేయడం లేదు. ఇది మాకెంతో బాధగా ఉంది అని పేర్కొంది.ఆస్కార్ నామినేషన్చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మహిళ కథ ఇది. వితంతువు పోలీసుగా మారి.. దళిత అమ్మాయి హత్య కేసును ఎలా ఛేదిస్తుందన్నది సినిమాలో చూపించారు. కుల వివక్ష, అంటరానితనం, అధికారుల క్రూరత్వం, లైంగిక వేధింపులను ప్రస్తావించారు. ఈ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అలాగే యూకే నుంచి అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్‌కు అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. డిసెంబర్లో షార్ట్ లిస్ట్ అయినప్పటికీ అవార్డు అందుకోలేకపోయింది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన శెహానా గోస్వామి ఉత్తమ నటిగా ఏషియన్ ఫిలిం అవార్డు గెలుచుకుంది.చదవండి: మలయాళంలో బిగ్గెస్ట్ ఓపెనింగ్.. ఎల్ ఎంపురాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు చోటు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల మహిళల సీనియర్ జట్టుకు సంబంధించిన వార్షిక కాంట్రాక్టులను విడుదల చేసింది. అయితే, పురుషుల సీనియర్ టీమ్ సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కాస్త జాప్యం జరుగుతోందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లోనే బీసీసీఐ ఈ అంశంపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా.. టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌తో శనివారం సమావేశం కానున్నట్లు సమాచారం. కాగా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను A+, A, B, C గ్రేడ్లుగా విభజించి వార్షిక వేతనాలు అందచేస్తోన్న విషయం తెలిసిందే. రోహిత్, కోహ్లిల కొనసాగింపు!కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ గ్రేడ్ అయిన A+లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కేవలం వన్డే, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాబట్టి వీరిని A+ గ్రేడ్ నుంచి తప్పించాలని బోర్డు నిర్ణయించినట్లు గతంలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన తాజా సమాచారం ప్రకారం.. ఈ ముగ్గురితో పాటు బుమ్రాను A+ గ్రేడ్‌లోనే కొనసాగించనున్నారు.అంతేకాదు..టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఈసారి ప్రమోషన్ దక్కనుంది. B గ్రేడ్ నుంచి అతడిని A గ్రేడ్‌కు ప్రమోట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. క్రమశిక్షణారాహిత్యం వల్ల సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి ఈ జాబితాలో చేరనున్నాడు.అంతేకాదు.. టాప్ గ్రేడ్‌లో అతడిని చేర్చేందుకు బీసీసీఐ నాయకత్వ బృందం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు అతడికి ఈ మేర రిటర్న్‌గిఫ్ట్ లభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రేయస్ మాదిరి అనూహ్యంగా సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం బీసీసీఐ ఇంకా గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది.టాప్ క్లాస్‌లో అతడి పేరుఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ తిరిగి వార్షిక కాంట్రాక్టు దక్కించుకోబోతున్నాడు. అది కూడా టాప్ క్లాస్‌లో అతడి పేరు చేరనుంది. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు’’ అని పేర్కొన్నాయి.తొలిసారి వీళ్లకు చోటుఇక ఈసారి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కొత్తగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా బీసీసీఐ కాంట్రాక్టు దక్కించుకోవాలంటే.. ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా తరఫున మూడు టెస్టులు లేదంటే.. ఎనిమిది వన్డేలు.. లేదా పది అంతర్జాతీయ టీ20లు ఆడి ఉండాలి. తద్వారా మరుసటి ఏడాది సదరు ఆటగాళ్లకు బోర్డు వార్షిక కాంట్రాక్టు ఇస్తుంది.ఇక బీసీసీఐ A+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లు, A గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. కోటి వార్షిక జీతంగా ఇస్తుంది.గతేడాది కాలానికి (2023-24) గానూ బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టుల జాబితాగ్రేడ్- A+: రోహిత్ శర్మ,విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాగ్రేడ్- A: రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాగ్రేడ్- B: సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్గ్రేడ్- C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్ణోయి, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్,రజత్ పాటిదార్.

Kavya Maran: క్యాచ్ డ్రాప్.. చిన్న పిల్లలా కేరింతలు.. కానీ పాపం ఆఖరికి!
సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మరోసారి బ్యాటింగ్ పవర్ చూపిస్తుందనుకుంటే.. ఆరెంజ్ ఆర్మీకి నిరాశే మిగిలింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో మ్యాచ్.. ఈసారి మూడు వందలు పక్కా అని మురిసిపోయిన అభిమానులు.. రైజర్స్ కనీసం 200 పరుగుల స్కోరు దాటకపోవడంతో ఉసూరుమన్నారు.ఈసారి బౌలర్లను నమ్ముకుందాంపర్లేదు.. ఈసారి బౌలర్లను నమ్ముకుందాం.. నామమాత్రపు స్కోరును మన కెప్టెన్ కమిన్స్ మామ, షమీ భయ్యా, హర్షల్ అన్న.. జంపా మావ కాపాడుతారులే అని సరిపెట్టుకున్నారు. కానీ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కట్టడి చేయడంలో వీళ్లంతా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఫలితంగా రైజర్స్ ఓటమిపాలు కాగా.. ఆరెంజ్ ఆర్మీ హృదయం ముక్కలైంది.లీగ్ మ్యాచ్.. అందులోనూ ఈ సీజన్లో రెండోదే అయినప్పటికీ హోం గ్రౌండ్లో రైజర్స్.. తమదైన శైలి బ్యాటింగ్‌ను.. ప్రత్యర్థి తమపైనే ప్రయోగించి సఫలం కావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇక ఈ మ్యాచ్ ఆసాంతం అభిమానులు కూడా భావోద్వేగ డోలికల్లో తేలిపోయారు.కావ్యా మారన్ ఎమోషనల్ రోలర్కోస్టర్ఓసారి సంతోషం.. మరోసారి బాధ.. ఆఖరికి ఓటమి.. ఇలా ప్రతి సమయంలో తమ భావాలను వ్యక్తం చేస్తూ కెమెరాలకు చిక్కారు. సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ (Kavya Maran) కూడా ఇందుకు అతీతం కాదు. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి ముగిసేంత వరకు ఆమె హావభావాలను కెమెరా కన్ను ఒడిసిపట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వీక్షకులను ఆకర్షించాయి.ట్రవిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను లక్నో ఫీల్డర్లు డ్రాప్ చేసినప్పుడు చిన్నపిల్లలా గంతులేసిన కావ్య.. అతడు అవుట్ కాగానే బుంగమూతి పెట్టుకుంది. హెన్రిచ్ క్లాసెన్ రనౌట్ కాగానే ఆమె కోపం కట్టలుతెంచుకుంది. ఇక లక్ష్య ఛేదనలో లక్నో సూపర్‌స్టార్ నికోలస్ పూరన్ పవర్ ప్లేలోనే విశ్వరూపం చూపించడంతో.. కావ్య తీవ్ర నిరాశకు గురైంది.Kavya maran has more expressions than all bollywood heroines combined 🔥❤️Kavya maran >>heroines pic.twitter.com/IWzfyIQZI7— Mask 🎭 (@Mr_LoLwa) March 27, 2025 తమ బౌలింగ్‌ను చితక్కొడుతూ పూరన్ ఉప్పల్‌లో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో కావ్య నెత్తికి చేతులు పెట్టుకుంది. సాధారణంగా తమ బ్యాటర్ల నుంచి వచ్చే ఈ పవర్ఫుల్ ఇన్నింగ్స్.. ప్రత్యర్థి నుంచి రావడం చూడలేక ముఖం తిప్పేసుకుంది. అప్పుడు ఇలా ఆనందంఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక గత మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై రైజర్స్ ఘన విజయం సాధించగా.. కావ్యా ఆనందంతో గంతులేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.An epic run-fest goes the way of @SunRisers 🧡The Pat Cummins-led side registers a 4️⃣4️⃣-run win over Rajasthan Royals 👏Scorecard ▶ https://t.co/ltVZAvInEG#TATAIPL | #SRHvRR pic.twitter.com/kjCtGW8NdV— IndianPremierLeague (@IPL) March 23, 2025లక్నోతో మ్యాచ్ విషయానికొస్తే..కాగా గురువారం ఉప్పల్‌లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ(6)తో పాటు గత మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదిన ఇషాన్ కిషన్ (0) ఈసారి పూర్తిగా విఫలమయ్యాడు. మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 47) తనదైన షాట్లతో కాసేపు అలరించగా.. నితీశ్ రెడ్డి(28 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించాడు.అయితే, జోరు మీదున్న హెన్రిక్ క్లాసెన్ (17 బంతుల్లో 26) రనౌట్ కాగా.. తుపాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన అనికేత్ వర్మ (13 బంతుల్లో 36)కు దిగ్వేశ్ రాఠీ చెక్ పెట్టాడు. శార్దూల్ ఠాకూర్ ఫోర్ఆఖర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఆవేశ్ ఖాన్ అతడికి కళ్లెం వేశాడు. ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో రైజర్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులే చేయగలిగింది.లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు.. లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు రైజర్స్ పేసర్ మహ్మద్ షమీ.. ఐడెన్ మార్క్రమ్(1)ను ఆదిలోనే అవుట్ చేసి షాకిచ్చాడు.పూరన్‌ను పూనకాలుఅయితే, మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52), నికోలస్ పూరన్ (26 బంతుల్లో 70) ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో రైజర్స్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి అర్ధ శతకాలతో దుమ్ములేపారు. ఈ క్రమంలో 16.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 193 పరుగులు చేసిన లక్నో.. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: IPL 2025: నికోలస్ పూరన్ ఫాస్టెస్ట్ ఫిప్టీ! వీడియో వైరల్

మా బెస్ట్ ఇవ్వలేకపోయాం.. గెలిచినందుకు సంతోషం: పంత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరైన రైజర్స్‌కే షాకిస్తూ.. సొంతమైదానంలోనే కమిన్స్ బృందానికి చుక్కలు చూపించింది. బిగ్ రిలీఫ్ఇటు బౌలర్లు.. అటు బ్యాటర్లు.. సమిష్టి ప్రదర్శనతో రాణించగా.. లక్నో కెప్టెన్‌గా టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌కు తొలి గెలుపు దక్కింది. ఈ నేపథ్యంలో విజయానంతరం పంత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘నిజంగా మాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే ఫలితం ఇది. గెలిచినప్పుడు పొంగిపోయి.. ఓడినపుడు కుంగిపోయే రకం మేము కాదు. జట్టుగా మా నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెడతాం. మా మెంటార్ ప్రతిసారీ ఇదే చెబుతారు. మన పరిధిలో ఉన్న అంశాల గురించి మాత్రమే ఆలోచించాలని.. వాటి ద్వారా లబ్ది పొందేందుకు అత్యుత్తమ మార్గాలు అన్వేషించాలని అంటారు. ఈరోజు నేను అదే చేశాను.మా బెస్ట్ ఇవ్వలేకపోయాం.. పర్లేదు గెలిచాంమా బౌలర్లు ప్రిన్స్, ఠాకూర్ అద్భుతంగా ఆడారు. ఇక పూరన్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడిని మూడో స్థానంలో ఆడిస్తే బాగుంటుందని అనుకున్నాం. తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఈరోజు అతడు అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.మా జట్టు మొత్తం రాణించింది. మా స్థాయికి తగ్గ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాం. అయినప్పటికీ గెలుపొందినందుకు సంతోషంగా ఉంది’’ అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో లక్నో తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. విశాఖపట్నంలో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. వికెట్ కీపర్‌గా పంత్ చేసిన తప్పిదం కారణంగా భారీ మూల్యమే చెల్లించుకుంది.రైజర్స్ దూకుడుకు లక్నో బౌలర్ల కళ్లెం ఈ నేపథ్యంలో తాజాగా తదుపరి సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ఆడిన లక్నో ఉప్పల్ మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. సొంత గ్రౌండ్లో రైజర్స్ బ్యాటింగ్ సత్తా ఏమిటో తెలిసీ పంత్ ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే, కెప్టెన్ నమ్మకాన్ని లక్నో బౌలర్లు నిలబెట్టారు.రైజర్స్ పవర్ హిట్టర్లు అభిషేక్ శర్మ(6), ఇషాన్ కిషన్(0)లను శార్దూల్ ఠాకూర్ వెనువెంటనే పెవిలియన్‌కు పంపగా.. ప్రమాదకర బ్యాటర్లు ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 47)ను అవుట్ చేసిన ప్రిన్స్ యాదవ్.. హెన్రిచ్ క్లాసెన్(26)ను రనౌట్‌గా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో అనికేత్ వర్మ(13 బంతుల్లో 36) మెరుపులు మెరిపించగా.. దిగ్వేశ్ రాఠీ అతడిని అవుట్ చేశాడు.అయితే, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి స్కోరును 200 దాటించే ప్రయత్నం చేయగా.. ఆవేశ్ ఖాన్ అతడి దూకుడుకు కళ్లెం వేశాడు. ఈ క్రమంలో రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో శార్దూల్ (4/34) నాలుగు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నికోలస్ పూరన్ తుపాన్ ఇన్నింగ్స్‌ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52) లక్నోకు శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్(1) మరోసారి విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్ తుపాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం 26 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో డేవిడ్ మిల్లర్ (7 బంతుల్లో 13), అబ్దుల్ సమద్ (8 బంతుల్లో 22) ధనాధన్ బ్యాటింగ్‌తో అజేయంగా నిలిచి లక్నోను విజయతీరాలకు చేర్చారు.ఐపీఎల్-2025: సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో👉వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్👉టాస్: లక్నో.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 190/9 (20)👉లక్నో స్కోరు: 193/5 (16.1)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై లక్నో గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శార్దూల్ ఠాకూర్ (4/34).చదవండి: IPL 2025: 13 బంతుల్లో విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ నయా హీరో! ఎవరీ అనికేత్? Hyderabad conquered ✅Win secured ✅#LSG get their first 𝐖 of #TATAIPL 2025 with a comfortable victory over #SRH 💙Scorecard ▶ https://t.co/X6vyVEvxwz#SRHvLSG | @LucknowIPL pic.twitter.com/7lI4DESvQx— IndianPremierLeague (@IPL) March 27, 2025

వారెవ్వా ఇయాలా
క్రీడాభిమానులకు ఫిలిప్పీన్స్ దేశం గుర్తుకు రాగానే ముందుగా వారి మదిలో మెదిలేది దిగ్గజ బాక్సర్ మ్యానీ పకియావ్ పేరు. రానున్న రోజుల్లో ఈ స్టార్ బాక్సర్ సరసన అభిమానులు మరో పేరు కూడా ప్రస్తావిస్తారంటే అతిశయోక్తి కాదు. ఖరీదైన టెన్నిస్ క్రీడలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక్కసారిగా అందరి దృష్టిలో పడిన ఆ యువతార ఎవరో కాదు 19 ఏళ్ల అలెగ్జాండ్రా ఇయాలా... స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ ఫిలిప్పీన్స్ టీనేజర్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ఇయాలా సెమీఫైనల్ చేరుకునే క్రమంలో ముగ్గురు గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్‌ను ఓడించడం విశేషం. జెస్సికా పెగూలాతో జరిగే సెమీఫైనల్లో ఇయాలా విజయం సాధిస్తే... నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన మయామి ఓపెన్‌లో ‘వైల్డ్ కార్డు’తో అడుగు పెట్టి ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. ఫ్లోరిడా: అనామకురాలిగా బరిలోకి దిగి రౌండ్ రౌండ్‌కూ సంచలన విజయాలు సాధిస్తున్న ఫిలిప్పీన్స్ టీనేజర్ అలెగ్జాండ్రా ఇయాలా...మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 140వ ర్యాంకర్ ఇయాలా 6–2, 7–5తో ప్రపంచ రెండో ర్యాంకర్, ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన పోలాండ్ స్టార్ ప్లేయర్ ఇగా స్వియాటెక్‌ను బోల్తా కొట్టించింది. 1 గంట 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇయాలా ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిది సార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. 19 ఏళ్ల ఇయాలా గత ఏడేళ్లుగా స్పెయిన్‌లోని రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. ఈ టోర్నీలో ‘వైల్డ్ కార్డు’తో అడుగు పెట్టిన ఇయాలా రెండో రౌండ్లో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై 7–6 (7/2), 7–5తో గెలుపొందగా... మూడో రౌండ్లో 6–4, 6–2తో ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ఐదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)ను కంగుతినిపించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇయాలాకు పదో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) నుంచి ‘వాకోవర్’ లభించింది. ‘నమ్మశక్యంగా లేదు. నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. నా జీవితంలోనే ఇది గొప్ప విజయం’ అని ఇయాలా వ్యాఖ్యానించింది. సెమీఫైనల్లో ఐదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)తో ఆడనున్న ఇయాలా విజయం సాధిస్తే... మయామి ఓపెన్‌లో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగి ఫైనల్ చేరుకున్న తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్)తో పావోలిని (ఇటలీ) తలపడుతుంది.
బిజినెస్

న్యూట్రోజెనా ప్రచారకర్తగా శ్రద్ధా కపూర్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ ఉత్పత్తుల సంస్థ కెన్వ్యూ తమ స్కిన్‌కేర్ బ్రాండ్ న్యూట్రోజెనా కింద కొత్తగా హైడ్రోబూస్ట్ సన్‌స్క్రీన్ ఎస్పీఎఫ్ 50 ఉత్పత్తిని ఆవిష్కరించింది.శక్తివంతమైన ఫలితాలను అందించేందుకు అధునాతన ఫార్ములేషన్స్‌తో దీన్ని రూపొందించినట్లు కెన్వ్యూ మార్కెటింగ్ వీపీ మనోజ్ గాడ్గిల్ తెలిపారు. తమ కొత్త ప్రచారకర్తగా బాలీవుడ్ నటి 'శ్రద్ధా కపూర్'ని నియమించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా బ్యూటీ విత్ నో కాంప్రమైజ్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.న్యూట్రోజెనా 'బ్యూటీ విత్ నో కాంప్రమైజ్'లో చేరడంపై శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ.. నేను ఉపయోగించిన బ్రాండ్ న్యూట్రోజెనాతో భాగస్వామిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. అందం, చర్మ సంరక్షణ సరళంగా ఉండాలి కానీ ప్రభావవంతంగా ఉండాలి. మహిళలు ఎంతగానో ఉపయోగకరమైన ఉత్పత్తులను అందిస్తూ ముందుకు సాగుతున్న న్యూట్రోజెనాతో చేరడం సంతోషంగా ఉందని అన్నారు.

జీతాల పెంపు.. కంపెనీపై ఉద్యోగుల అసంతృప్తి
ఈ సంవత్సరం జీతాల పెంపుపై గూగుల్ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని, ఇటీవల జరిగిన అన్ని వర్గాల సమావేశంలో వారు ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేసినట్లు బిజినెస్ ఇన్సైడర్ వెల్లడించింది. కంపెనీ బలమైన ఆర్థిక పురోగతిని నమోదు చేసినప్పటికీ.. జీతాల పెరుగుదల మాత్రం స్వల్పంగానే ఉందని పేర్కొన్నారు.మంగళవారం (మార్చి 25) కంపెనీలో జరిగిన ఒక సమావేశంలో జీతాల పెంపు విషయం చర్చకు దారితీసింది. ఇందులో చాలామంది తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై కంపెనీ గ్లోబల్ కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ వైస్ ప్రెసిడెంట్ 'జాన్ కేసీ' స్పందిస్తూ.. 2025లో 80 శాతం కంటే ఎక్కువ మంది సిబ్బందికి వేతనాలు గత సంవత్సరంతో పోలిస్తే పెరిగాయని అన్నారు.నాన్-టెక్నికల్ విభాగంతో పాటు కొన్ని విభాగాల్లోని వారు మాత్రమే తక్కువ పెంపును పొందినట్లు స్పష్టం చేశారు. తక్కువ పెంపును పొందిన ఉద్యోగులకు.. మరింత మెరుగైన వేతనం అందించాలని కంపెనీ యోచిస్తున్నట్లు జాన్ కేసీ వెల్లడించారు. ఈ పెంపు మంచి పనితీరును కనపరిచినవారిని ప్రోత్సహించేలా ఉంటుందని అన్నారు.ఇదీ చదవండి: ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది 15 రోజులే!.. ఎందుకంటే?

ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది 15 రోజులే!
మార్చి 2025 ముగుస్తోంది. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్‌లో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేస్తాయి, ఎన్ని రోజులు క్లోజ్‌లో ఉంటాయనే జాబితాను (Bank Holidays) విడుదల చేసింది. వచ్చే నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు తప్పకుండా ఈ సెలవుల జాబితాను తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.ఏప్రిల్‌లో బ్యాంక్ హాలిడేస్➤1 ఏప్రిల్: యాన్యువల్ బ్యాంక్ క్లోజింగ్➤5 ఏప్రిల్: బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు (తెలంగాణ/ హైదరాబాద్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤6 ఏప్రిల్: ఆదివారం (శ్రీరామనవమి)➤10 ఏప్రిల్: మహావీర్ జయంతి (గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, తెలంగాణలోని బ్యాంక్‌లకు సెలవు)➤12 ఏప్రిల్: రెండవ శనివారం➤13 ఏప్రిల్: ఆదివారం➤14 ఏప్రిల్: అంబేద్కర్ జయంతి ➤15 ఏప్రిల్: బెంగాలీ నూతన సంవత్సరం, భోగ్ బిహు (అసోం, పశ్చిమ్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤18 ఏప్రిల్: గుడ్ ఫ్రైడే (ఛండీగఢ్, త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤20 ఏప్రిల్: ఆదివారం➤21 ఏప్రిల్: గరియా పూజ (త్రిపురలోని బ్యాంక్‌లకు సెలవు)➤26 ఏప్రిల్: నాల్గవ శనివారం➤27 ఏప్రిల్: ఆదివారం➤29 ఏప్రిల్: పరశురామ జయంతి (హిమాచల్ ప్రదేశ్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤30 ఏప్రిల్: బసవ జయంతి, అక్షయ తృతీయ (కర్ణాటకలోని బ్యాంక్‌లకు సెలవు)బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది).

కోహ్లీ లేకపోతే.. టీసీఎస్ లేదు
ప్రపంచంలోనే టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటి.. 6,00,000 మంది ఉద్యోగులు.. దాదాపు 46 దేశాల్లో కార్యకలాపాలు.. సృజనాత్మక పనితనానికి పెట్టింది పేరు.. ఐటీ పరిశ్రమలో దిగ్గజ కంపెనీగా వెలుగొందుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గురించి తెలియనివారుండరు. టాటా గ్రూప్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రతన్ టాటా, జేఆర్డీ టాటాలు. టీసీఎస్‌ను స్థాపించడం కూడా వారిలో ఒకరి ఆలోచనే అని చాలామంది అనుకుంటారు. కానీ భారతదేశాన్ని ఐటీ రంగంలో ప్రపంచంలో ముందుంచేలా చేసిన టీసీఎస్ స్థాపన ఆలోచన ఒక పాకిస్థానీదని తక్కువ మందికే తెలిసుంటుంది. ఆ విశేషాలు ఏమిటో చూసేద్దాం.భారత ఐటీ పితామహుడుమార్చి 2025 నాటికి రూ.12.92 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన ప్రపంచ ఐటీ పరిశ్రమలో టాప్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పుట్టుకకు ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన ‘భారత ఐటీ పితామహుడు’గా పిలువబడే ఫకీర్ చంద్ కోహ్లీ అనే వ్యక్తి. ఆయన చేసిన కృషి టీసీఎస్‌ను ఇండియాలో ఐటీ పవర్ హౌజ్‌గా మార్చేందుకు కారణమైంది. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భారత్ కేంద్రంగా మారేందుకు తోడ్పడింది.అప్పటి భారత్.. ఇప్పటి పాకిస్థాన్‌లో పుట్టి..భారత్-పాకిస్థాన్ విభజనకు ముందు 1924లో (అప్పుడు పాకిస్థాన్ భారత్‌లోనే ఉండేది) ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఫకీర్ చంద్ కోహ్లీ జన్మించారు. అతని విద్యాభ్యాసం లాహోర్‌లో జరిగింది. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో డిగ్రీలు పొందారు. కెనడాలో క్వీన్స్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి సిస్టమ్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు.టీసీఎస్ పుట్టిందిలా..కోహ్లీ 1951లో భారతదేశానికి తిరిగి వచ్చి టాటా ఎలక్ట్రిక్ కంపెనీలో చేరారు. తాను కంప్యూటర్ ఆధారిత ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాలను ఆధునీకరించడంలో నిష్ణాతుడు. దాంతో త్వరగా సంస్థలో ఎదిగారు. అతడి వినూత్న విధానాలు అప్పటి టాటా గ్రూప్ ఛైర్మన్ జేఆర్డీ టాటా దృష్టిని ఆకర్షించాయి. ఆయన కొత్త వెంచర్‌కు నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కోహ్లీలో చూశారు. ఒకరోజు భవిష్యత్తులో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందనే ఆలోచనను జేఆర్డీతో పంచుకుంటూ.. అందుకుగల కారణాలను కోహ్లీ విశ్లేషించారు. దాంతో 1968లో టీసీఎస్ ఆవిర్భవించింది. కోహ్లీ దాని సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కంపెనీకి తొలి సీఈఓగా నియామకం అయ్యారు.కొత్త శిఖరాలకు టీసీఎస్భారత సాంకేతిక మౌలిక సదుపాయాలు అంతగా లేని సమయంలో సాఫ్ట్వేర్ సర్వీసుల్లో దేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని కోహ్లీ ఊహించారు. ఆయన నాయకత్వంలో టీసీఎస్ ఒక మోస్తరు కార్యకలాపాల నుంచి దేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా అభివృద్ధి చెందింది. సాఫ్ట్వేర్ ఎగుమతులకు మార్గదర్శకంగా నిలిచింది. ప్రపంచ వేదికపై దేశాన్ని విశ్వసనీయ సంస్థగా నిలిపింది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి దిగ్గజ సంస్థలతో అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కోహ్లీ వ్యూహాత్మక దూరదృష్టి ఎంతో తోడ్పడింది. ఇది టీసీఎస్‌ను కొత్త శిఖరాలకు చేర్చింది. 2003 నాటికి కంపెనీ బిలియన్ డాలర్ల(రూ.8,300 కోట్లు) ఆదాయాన్ని సాధించడంలో సహాయపడింది.నాస్కామ్కు అధ్యక్షుడు, ఛైర్మన్‌గా..భారతదేశం అభివృద్ధి చెందాలంటే బలమైన ఐటీ ఎకోసిస్టమ్ అవసరమని ఆయన అర్థం చేసుకున్నారు. భారతదేశపు ప్రముఖ ఐటీ అడ్వకసీ సంస్థ(న్యాయ కార్యకలాపాలు నిర్వహణ) నాస్కామ్కు 1995-1996 కాలంలో అధ్యక్షుడిగా, ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ ఐటీ విధానాలను రూపొందించడంలో, పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.ఇదీ చదవండి: ఆర్థిక తారతమ్యాల భారతం!పద్మభూషణ్‌తో సత్కారంకోహ్లీ ప్రభావం కార్పొరేట్ విజయాలకే పరిమితం కాలేదు. టాటా సన్స్ ప్రస్తుత ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సహా భావి నాయకులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. 1999లో పదవీ విరమణ చేసిన తరువాత కూడా వయోజన అక్షరాస్యత, ప్రాంతీయ ల్యాంగ్వేజీ కంప్యూటింగ్ వంటి సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైలైట్ చేశారు. 2002లో భారతదేశపు మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నారు. వినియోగదారుల హక్కుల కార్యకర్త, న్యాయవాది స్వర్ణ్ కోహ్లీని వివాహం చేసుకున్న ఆయనకు ముగ్గురు సంతానం. తరతరాలకు స్ఫూర్తినిచ్చే వారసత్వాన్ని మిగిల్చిన ఆయన 2020 నవంబర్ 26న తన 96వ ఏట కన్నుమూశారు.
ఫ్యామిలీ

బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి
ఇటీవల ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది అంటూ తెగ నెట్టింట ఫిట్నెస్ మంత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. పాపం కొందరు ఫాలో అయ్యి వర్కౌట్ అవ్వాక ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు మరిన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు తాజగా ఓ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ తన విభిన్నమైన వెల్నెస్ రోటీన్ని నెట్టింట షేర్ చేశాడు. అది చూసి నెటిజన్లు బాబోయ్ మరీ ఇంత మంచి అలవాట్లా..అని విస్తుపోతున్నారు. నో ఛాన్స్ అదంతా వర్కౌట్ అయ్యే అవకాశం లేదని కామెంట్లు కూడా చేస్తున్నారు. మరీ అంత విచ్రితంగా అనిపించినా.. అతడి వెల్నెస్ రొటీన్ ఏంటో చూద్దామా..!.29 ఏళ్ల ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఆష్టన్ హాల్తన తీవ్రైమన ఆరోగ్య స్ప్రుహ కారణంగా నెట్టింట వైరల్‌గా మారాడు. అతడి ఫిట్నెస్ మంత్ర చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అతడి స్ట్రిట్ ఫిట్నెస్ రొటీన్ ఎలా ఉంటుందంటే..అత్యంత క్రమశిక్షణాయుతమైన జీవనశైలి అతడిది. హాల్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ఉదయం 3:52 ప్రారంభమైమార్నింగ్ 9.30 గంటలకు ముగుస్తుంది. హాల్ నిద్రపోయేటప్పుడు తన నోటికి మౌత్ట్యాప్ వేసుకుంటాడు. ఇది గురకను నివారస్తుందనేది అతడి నమ్మకం. ఆ తర్వాత 7.30 నుంచి 8.30 గంటల వరకు స్విమ్మింగ్ పూల్‌లో గడిని తదనంతరం బ్రేక్‌ఫాస్ట్‌గా అరటిపళ్లు తీసుకుంటాడు.ఆ తర్వాత అదే అరటిపండు తొక్కలను ముఖానికి రుద్దుకుంటాడు. ఆ తర్వాతమ బ్రాండెడ్ మినరల్ వాటర్, గిలకొట్టన పచ్చిగుడ్లు, అవకాడో టోస్ట్ వంటివి అతడి ఆహారాలు. ఈ వెరైటీ దినచర్యకు గానూ హాల్ నెట్టింట వైరల్‌గా మారాడు. ఇది సాధ్యమయ్యేది కాదనేది నెటిజన్ల వాదన. అంతేగాదు సోషల్ మీడియాలో బ్రో బిజీ లైప్ ఇవన్నీ కష్టం అని కామెంట్ చేస్తూ పోస్టుల పెడుతున్నారుహాల్ అనుసరించే కొన్ని మంచి వెల్నెస్ ట్రెండ్లు..మౌత్ ట్యాపింగ్మౌత్ ట్యాపింగ్ అనేది రాత్రిపూట నోటిని మూసి ఉంచడానికి ఉపయోగించే ప్రత్యేక టేప్. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రసిద్ధ వెల్నెస్ ట్రెండ్ ముక్కు ద్వారా శ్వాస తీసుకునేలా చేస్తుంది. అలాగే పీల్చే గాలి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా అలర్జీ కారకాలు, శిధిలాలు లేదా విషపదార్థాలు ఊపిరితిత్తులకు చేరక మునుపే ఫిల్టర్ అవుతాయి. అంతేగాదు తేలికపాటి స్లీప్ అప్నియా ఉంటే మౌత్ ట్యాపింగ్ హెల్ప్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు. ముఖాన్ని ఐస్ వాటర్‌లో ముంచడం..చల్లటి నీటిలో ముఖాన్ని ముంచడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఒత్తిడి హర్మోన్ స్థాయిని తగ్గిస్తుందట. నాడీ వ్యవస్థపై ప్రశాంతత ప్రభావాన్ని చూపుతుంది. చల్లటి నీరు రక్త నాళాలను ఇరుకుగా చేయడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. చర్మ కణాలకు ఆక్సిజన్ పోషకాలను అందిస్తుంది. ప్రకాశవంతమైన రంగుని అందించడంలో హెల్ప్ అవుతుందట. అంతేగాదు ఈ మంచులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయట. ఇవి మొటిమల రంధ్రాల పరిమాణాన్ని తగ్గిస్తాయట. అదే సమయంలో వాపు వంటివి దరిచేరనీయదు అని చెబుతున్నారు నిపుణులు.చర్మంపై అరటి తొక్క ప్రభావంఅరటిపండ్లు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియంల శక్తివంతమైన వనరు. మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి. చర్మంపై అరటి తొక్కను రుద్దడం వల్ల మాయిశ్చరైజర్‌గా పనిచేసి చర్మాని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ముడతలు తగ్గుతాయి. గీతలు లేకుండా చేస్తుంది. అలాగే కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గిస్తుందని చెబుతున్నారు చర్మ నిపుణులుమార్నింగ్ వ్యాయామంఉదయం వ్యాయామం ప్రత్యేకమైన జీవక్రియ ప్రభావాలను కలిగి ఉంటుంది. అధ్యయనాల ప్రకారం, వ్యాయామం చేసే సమయంలో శరీరం జీవక్రియ ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంది. ఉదయం వ్యాయామాలు కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా గ్లూకోజ్ టాలరెన్స్‌ను మెరుగుపరిచి అలసటను తగ్గిస్తుంది. అంతేగాదు శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది కూడా. అలాగే బాడీని ఫిట్‌గా ఉంచడమే కాకుండా మంచి నిద్రను, మెరుగైన ఏకాగ్రత అందిస్తుంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: చిరాకుగా ఉన్నా..చిద్విలాసంగా ఉన్నా..చిరుతిండికే ఓటు..!)

స్నాప్‌చాట్ క్రియేటర్ కనెక్ట్ ప్రోగ్రామ్! జెన్ జెడ్ స్టోరీ టెల్లర్స్‌కి అవకాశల వెల్లువ..
భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్లను శక్తిమంతం చేసేలా హైదరాబాద్‌లో తొలి స్నాప్‌చాట్ క్రియేటర్ కనెక్ట్‌ను ప్రారంభించింది. ఇది లోకల్ టాలెంట్‌ని ప్రోత్సహించడమే గాక పరిశ్రమ సహకారాలతో కంటెంట్ క్రియేటర్ల తమ డిజిటల్ కథలను మరింత మెరుగుపరుచుకునేలా చేస్తుంది. అందులో భాగంగా స్నాప్ చాట్ హైదరాబాద్‌లోని ప్రముఖ క్రియేటర్ ఏజేన్సీలు టమాడా మీడియా, చాయ్‌బిస్కెట్ - ముటినీ, NRGY+, సిల్లీ మాంక్స్, వాక్డ్ అవుట్ మీడియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనివల్ల ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లకు మద్దతు లబించడమే గాక తదుపరి తరం ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ఒక వేదిక అవుతుంది కూడా. Savvy on Snap వంటి కంటెంట్ ఎనేబుల్మెంట్ ప్రోగ్రామ్‌ల ద్వారా, భాగస్వాములు తమ Snapchat కమ్యూనిటీలకు ఉత్తమ పాప్ సంస్కృతిని తీసుకురావడంలో సహాయపడటానికి అవసరమైన స్నాప్ కన్సల్టింగ్ మద్దతు తోపాటు తగు వనరులను అందిస్తుంది. అంతేగాదు ఈ ప్లాట్‌ఫాం కంటెంట్క్రియేటర్లు లాభాలు ఆర్జించేలా రివార్డ్ ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తోంది. ఇక్కడ క్రియేటర్లు తమ కథను ప్రేక్షకులను నిమగ్నం చేసేలా నిర్మించడం అనేది కీలకం. అదే వారికి ఆదాయాలను తెచ్చిపెడుతుంది. ఈ మేరకు స్నాప్ ఇంక్ డాట్ కంటెంట్, ఏఆర్ భాగస్వామ్యాల డైరెక్టర్ మాట్లాడుతూ..ఈ హైదరాబాద్ కంటెంట్ క్రియేటర్లకు నిలయం. ఇక్కడ మా మొట్టమొదటి Snapchat క్రియేటర్ కనెక్ట్ IPని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది జెన్ జెడ్ క్రియేటర్లు, వినియోగదారులకు కేంద్రంగా మారుతుంది. ట్రెండ్‌కి తగ్గ దృశ్యామన కళ పట్టుకోవడం, కుటుంబల లేదా స్నేమితుల అంతర్గత ఇతి వృత్తంగా ఉన్నవి తదతరాలకు Snapchat పెద్దపీట వేస్తుంది. పాప్ సంస్కృతిలో ఇది సరికొత్త మార్పుకి సంకేతమవుతుంద. భారతదేశం అంతటా ఉన్న కంటెంట్ క్రియేటర్లు ఈ స్నాప్‌చాట్ వేదికపై భాగస్వామ్యం అవుతారు. వారికి కావాల్సిన సహాయసహకారాలను తామందిస్తామని చెప్పారు సాకేత్ ఝా సౌరభ్.స్నాప్‌చాట్‌లో నేచురల్ స్టార్ అరంగేట్రంటాలీవుడ్ హీరో నాని ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత సందడి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో తన మూవీ HIT: ది థర్డ్ కేస్ స్నాప్‌చాట్‌లో సహజంగా ప్రామాణికంగా ఉండటం గురించి మాట్లాడారు. అంతేగాదు స్నాప్‌చాట్ ఈ చిత్రం కోసం కొత్త మూవీ లెన్స్‌ను కూడా ప్రారంభించింది. ఈ ఇంటరాక్టివ్ AR లెన్స్ అభిమానులను యాక్షన్‌కు దగ్గరగా తీసుకువస్తుంది, పైగా సినీ ప్రపంచంలోకి అడుపెట్టేందుకు వీలు కల్పిస్తుంది. ఇక హీరో నాని మాట్లాడుతూ..కథ చెప్పడం ఎల్లప్పుడూ కనెక్ట్వ్గానే ఉంటుంది. యువ క్రియేటర్లు కథలు ఎలా చెబుతారు, తాజా ట్రెండ్ ఎలా ఉంటుంది తదితారాలు హైదరాబాద్ క్రియేటర్ కమ్యూనిటీతో తీసుకురావాలన్నా ఆలోచన బాగుంది. ఈ కార్యక్రమంలో భాగమవ్వడం మరింత అద్బుతంగా ఉంది. అంతేగాదు స్నాప్‌చాట్ ప్లాట్‌ఫామ్ క్రియేటర్లకు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి కొత్త మార్గాలను అందిస్తున్నాయని అన్నారు.చివరగా ఈ కార్యక్రమం నయని పావని, శ్వేత నాయుడు, నైనికా అనసురు, ప్రణవి, అనుష రత్నం వంటి 50 మందికి పైగా అగ్ర సృష్టికర్తలను టాలెంట్ ఏజెన్సీలు, బ్రాండ్లు, పరిశ్రమ భాగస్వాములు పాల్గన్నారు. నిపుణుల నేతృత్వంలోని చర్చలలో భాగంగా, తమడ మీడియా నుంచి రాహుల్ తమడ క్రియేటర్ అనుభవాలు, వృద్ధి స్నాప్‌చాట్‌లో విజయంపై అనుభవాలను పంచుకున్నారు. అయితే చాయ్‌బిస్కెట్ నుంచి అనురాగ్ స్నాప్‌లో చిత్రాల భాగస్వామ్యం గురించి నొక్కి చెప్పారు. అందుకు సంబంధించిన కీలక ఉదాహరణలు, విజయగాథలను హైలైట్ చేశారు. స్నాప్‌చాట్ సాధనాలు - లెన్సులు, స్పాట్లైట్, స్టోరీస్ - క్రియేటర్ల ఆవిష్కరణ సామర్థ్యాన్ని మెరుగుపరచి, ప్రేక్షకులను ఎలా నిమగ్నమయ్యేలా చేస్తాయో ఈ కార్యక్రమానికి హజరైనవారికి వివరించారు నిర్వాహకులు.(చదవండి: ప్రియాంక చోప్రా..ఫ్రీడమ్ సెలబ్రేషన్..ఓ బిడ్డకు తల్లి అయితే తిప్పలు తప్పవు..!)

అందం, వికారం పక్కపక్కనే ఉంటాయా..? షాక్‌లో చిత్రకారుడు
అతను ఓ చిత్రకారుడు. అతనికి ఓ అందమైన నగుమోము, వికారమైన మోము చిత్రాలు గీయాలనుకున్నాడు. ముందుగా అతను ఓ అందమైన నగుమోము గల ఓ చిత్రం గీయడానికి నిర్ణయించుకున్నాడు. చాలాకాలానికి అతను అనుకున్నట్టే ఓ అందమైన అయిదేళ్ళ చిన్నవాడొకడు కనిపించాడు. ఆ పసివాడి పెద్దల అనుమతితో వాడి బొమ్మ గీశాడు. ఆ చిత్రం ఎంతో అందంగా ఉంది. ఆ తర్వాత వికారస్వరూపమోము కోసం వెతకడం మొదలుపెట్టాడు. చాలా కాలమే పట్టింది. అతనిలో విసుగు మొదలైంది. అయినా ప్రయత్నం మానలేదు. ఉన్నట్లుండి అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఎక్కడెక్కడో వెతకడమెందుకు ఒక జైలుకి వెళ్తే తాననుకున్న వికారస్వరూపుడు తారసపడతాడనుకున్నాడు. దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత అతను అనుకున్నట్టే ఒక జైలులో ఓ వికారమైన మోముగల ఒక వ్యక్తి కనిపించాడు. దాంతో అప్పటి దాకా అతనిలో ఉన్న నీరసం, విసుగు మటుమాయమయ్యాయి. ఉత్సాహం ఉ΄ప్పొంగింది. జైలు అధికారి అనుమతితో ఆ వికారస్వరూపుడి బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. గీస్తున్నంతసేపు ఆ వికారస్వరూపుడిని మాటల్లో పెట్టాడు. అతని ఊరు, పేరు, పెద్దల వివరాలు ఇలా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అతను చెప్పిన వివరాలన్నీ విన్న తర్వాత చిత్రకారుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎందుకంటే అతను మరెవరో కాదు, అందమైన చిన్నవాడనుకుని కొన్నేళ్ళ క్రితం గీసిన ఆ కుర్రాడే ఇప్పుడీ వికారస్వరూపుడు. కాలక్రమంలో ఆ అందమైన చిన్నోడు అనేక నేరాలూ ఘోరాలు చేసి ఇప్పుడిలా వికారస్వరూపుడిగా మారి తనముందున్నాడు. ఈ నిజం తెలిసి చిత్రకారుడి నోటి వెంట మాట లేదు. ప్రతి మనిషిలోనూ అందమూ, వికారమూ ఉంటాయి. అయితే అతన్ని ఒకసారి అందంగానూ, మరోసారి వికారంగానూ చూపేది అతనున్న పరిస్థితులే!– యామిజాల జగదీశ్ (చదవండి: సహజ యోగం..సమతుల్య జీవనం..!)

సహజ యోగం.. సమతుల్య జీవనం..!
మానవుల ఆధ్యాత్మిక ప్రయాణంలో స్త్రీ పాత్ర అత్యంత కీలకమైనది. పురుషులు నిత్యజీవితంలో తమ చుట్టూ ఉండే స్త్రీలను గౌరవించడం ద్వారా తమ సూక్ష్మ శరీరం లోపల శక్తి కేంద్రాలను లేదా షట్చక్రాలను చైతన్యవంతం చేసుకోవచ్చు. తల్లిని గౌరవించినప్పుడు అతని లోపల శ్రీ గణేశుని సుగుణాలు స్థిరపడడం వలన మూలాధార చక్రము చైతన్య వంతం అవుతుంది. అలానే తల్లితో ఉండే అనుబంధం చక్కగా ఉన్నప్పుడు ఎడమవైపు హృదయ చక్రం చైతన్యవంతం అవుతుంది. తన సోదరీమణులను గౌరవించినప్పుడు, ఎడమవైపు విశుద్ధి చక్రం చైతన్య వంతం అవుతుంది. తన భార్యను గౌరవించినప్పుడు ఆమె తన ఇంటికి గృహ లక్ష్మి కాబట్టి ఎడమవైపు నాభీ చక్రం చైతన్య వంతం అవుతుంది. అలానే భార్యతో అతని సంబంధం చక్కగా ఉన్నప్పుడు ఎడమవైపు హృదయ చక్రం చైతన్యవంతం అవుతుంది. పరస్త్రీలను తల్లి వలె లేదా సోదరి వలె గౌరవించినప్పుడు ఆజ్ఞా చక్రం చైతన్యవంతం అవుతుంది. కాబట్టి పురుషులు తమ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం స్త్రీలను గౌరవించవలసిన ఆవశ్యకతను తెలుసుకొని తదనుగుణంగా నడుచుకోవాలి.ఎప్పుడైతే ఒక స్త్రీ తన సంపూర్ణ శక్తులను ధరించి ఉపయోగిస్తుందో అప్పుడు ఆమె చాలా శక్తివంతమై భీకరంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడూ వాదిస్తూ, కొట్లాడుతూ, విమర్శిస్తూ, చౌకబారుగా ప్రవర్తిస్తుందో, అప్పుడు ఆమె శక్తులన్నీ వృధా అయిపోతాయి. ఆమె కావాలనుకుంటే పురుషులకంటే ఎక్కువగా పని చేయగలదు. అయితే మొట్టమొదటగా ఆమె ఎంతో నమ్రతతోను, అణకువతోనూ, హుందాతనంతోను, చక్కటి అవగాహనతోను, వాత్సల్యపూరితంగా ఉండి తనలోగల శక్తులను గౌరవించుకుంటూ, శాంతిని నెలకొల్పటం నేర్చుకోవాలి. ఒక కవచం వలే రక్షణను కల్పించటం స్త్రీ యొక్క బాధ్యత. కవచం కత్తి యొక్క పనిని చేయలేదు. అలానే కత్తి కవచం చేసే పనిని చేయలేదు. అయితే ఆ రెండింటిలో ఏది గొప్ప? కవచమే గొప్ప. ఎందుచేతనంటే అది కత్తి యొక్క దెబ్బను తట్టుకోవాలి కాబట్టి. కత్తి విరుగుతుందేమో కానీ, కవచం మాత్రం విరగదు. అలా స్త్రీలు వారి శక్తులను గుర్తించి అందులో స్థిరపడాలి. నమ్రత అనేది ఆ శక్తికి ఒక గొప్ప ఇరుసు లాంటిది. ఎంతో నమ్రతా భావంతో, విధేయతతో ఆ శక్తులను తమ లోనికి గ్రహించుకుని వారు అందులో స్థిరపడాలి. మనం రోజూ పేపర్లో కానీ టీవిలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎన్నోహింసాత్మక, అనైతిక కార్యక్రమాలను చూస్తున్నాము. వాటి ప్రభావం చిన్న పిల్లల మీద, స్త్రీల మీద పడి సమాజం నాశనమవుతోంది. సహజయోగ మార్గాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని ఆచరించడం ద్వారా మహిళలు అటువంటి సమాజంలో పరివర్తన తీసుకు రాగలరు.ప్రపంచ వ్యాప్తంగా సహజ యోగా ధ్యాన సాధన చేస్తున్న మహిళలు అందరూ శ్రీ మాతాజీ నిర్మలా దేవి అనుసరించిన, ప్రబోధించిన స్త్రీ ధర్మాలను ఆచరిస్తూ ఉత్తమ కుటుంబ సభ్యులుగా తమ తమ దైనందిన జీవితంలో ప్రశాంతమైన, సమతుల్య జీవనం గడుపుతున్నారు.– డా. పి. రాకేష్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా (చదవండి: కాశీ కంటే పురాతన క్షేత్రం: 'వృద్ధాచల క్షేత్రం'..!)
ఫొటోలు
International

హౌతీ దాడుల ‘సిగ్నల్’ ముచ్చట్లు లీక్.. ట్రంప్ రియాక్షన్ ఇదే..
వాషింగ్టన్: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై దాడి వ్యూహాలను రహస్యంగా ‘సిగ్నల్’ యాప్ గ్రూప్చాట్లో చర్చిస్తూ పొరపాటున ఒక సీనియర్ పాత్రికేయుడిని ఆ గ్రూప్‌లో చేర్చుకున్న ఉదంతంలో అసలు ఆ గ్రూప్‌లో ఏం చర్చించారన్న వివరాలు బహిర్గతమయ్యాయి. సీనియర్ పాత్రికేయుడు జెఫ్రీ గోల్డ్బర్గ్ ఎడిటర్–ఇన్–చీఫ్‌గా ఉన్న ‘ది అట్లాంటిక్’ మేగజైన్ ఈ వివరాలను బుధవారం స్క్రీన్షాట్ల రూపంలో బయటపెట్టింది.ఈ గ్రూప్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్, విదేశాంగ మంత్రి రూబియో, ఆర్థిక మంత్రి స్కాట్, రక్షణమంత్రి పీట్ హెగ్సెత్, హోంల్యాండ్ సెక్యూరిటీ సలహాదారు స్టీఫెన్ మిల్లర్సహా 19 మంది సభ్యులుగా ఉన్నారు. మార్చి 15వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటల నుంచి ఏ సమయంలో ఎక్కడెక్కడ ఏ రకం బాంబులు, యుద్ధవిమానాలు, డ్రోన్లతో దాడిచేసేది రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చాటింగ్‌లో పేర్కొన్నారు. దాడులను ప్రశంసిస్తూ మిగతావాళ్లు అమెరికా జెండాలు, పిడికిలి గుర్తు, ఎమోజీలను పోస్ట్‌చేశారు.సభ ముందుకు నిఘా అధికారులులీకేజీ ఉదంతంపై ఉన్నతస్థాయి విచారణలో భాగంగా సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తదితరులు బుధవారం పార్లమెంట్ దిగువ సభలో ఇంటెలిజెన్స్ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్నారు. దేశం ఎదుర్కొంటున్న ముప్పులపై వార్షిక సమీక్షలో భాగంగా వీళ్లంతా వివరణ ఇచ్చుకోనున్నారు. ఇప్పటికే వీళ్లంతా మంగళవారం ఎగువసభ సెనేట్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. లీకేజీపై కొందరు డెమొక్రటిక్ పార్టీ సెనేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. లీకేజీని అధ్యక్షుడు ట్రంప్ అతిచిన్న పొరపాటుగా అభివర్ణించారు. గతంలో డెమొక్రటిక్ నాయకురాలు హిల్లరీ క్లింటన్ విదేశాంగ మంత్రిగా ఉన్న కాలంలో సొంత ఈ–మెయిల్ వాడినందుకే అత్యంత సున్నిత సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదముందని తీవ్ర వివాదం రేపిన రిపబ్లికన్లు ఇప్పుడు లీకేజీ ఘటన అత్యంత అప్రాధాన్యమైన అంశమని కొట్టిపారేయడం గమనార్హం.

గ్రీన్‌ల్యాండ్‌కు జేడీ వాన్స్ పర్యటన.. పొలిటికల్ టెన్షన్
వాషింగ్టన్: డెన్మార్క్‌లో స్వయంప్రతిపత్తి గల ‘గ్రీన్‌ల్యాండ్’ను కొనేందుకు సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ డెన్మార్క్ ప్రభుత్వానికి మరింత కోపం తెప్పించేలా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రవర్తించారు. అనధికార పర్యటనలో భాగంగా గ్రీన్‌ల్యాండ్‌కు వాన్స్ భార్య ఉషా గురువారం వెళ్లి శనివారం తిరిగిరానున్నారు. అయితే భార్యతో వెళ్లాలని తాను నిర్ణయించుకున్నానని వాన్స్ మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రీన్‌ల్యాండ్ అంశాన్ని ప్రస్తావించారు.ఈ క్రమంలో వాన్స్ మాట్లాడుతూ..‘భార్య ఒక్కతే ఆనందంగా ఉంటే సరిపోతుందా. నేను కూడా ఆమెతోపాటు గ్రీన్‌ల్యాండ్‌కు వెళ్తా. గ్రీన్‌ల్యాండ్ పర్యటనలో భాగంగా అక్కడి వాయవ్య పిటిఫిక్ భూభాగంలోని అమెరికా వైమానిక స్థావరాన్ని సందర్శిస్తా. అధ్యక్షుడు ట్రంప్ తరఫున మాట్లాడుతున్నా. గ్రీన్‌ల్యాండ్ ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే గ్రీన్‌ల్యాండ్ భద్రత అనేది పరోక్షంగా యావత్ ప్రపంచ భద్రతకు సంబంధించింది’ అని అన్నారు.దీంతో డెన్మార్క్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘ప్రైవేట్‌గా లేదంటే ప్రభుత్వం తరఫున ఎవరినీ మా దేశంలోకి అనుమతిస్తూ ఆహ్వానాలు పంపలేదు’ అని గ్రీన్‌ల్యాండ్ సర్కార్ ఫేస్బుక్లో ఒక పోస్ట్పెట్టింది. ‘పిలవకుండా వచ్చి మమ్మల్ని అనవసర ఒత్తిడికి గురిచేయాలని అనుకుంటున్నారు’ అని డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టే ఫ్రెడెరిక్సన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సిసిమియట్ పట్టణంలోని అవన్నాటా క్విమిసెర్సూ శునకాల స్లెడ్జ్ బండ్ల పరుగుపోటీని, గ్రీన్‌ల్యాండ్ సంస్కృతి, సంప్రదాయాలను స్వయంగా వీక్షించేందుకు అక్కడ పర్యటిస్తానని ఉషా గతంలో చెప్పడం తెలిసిందే. గ్రీన్‌ల్యాండ్‌లో లిథియం వంటి ఖనిజ నిల్వలు అపారం. వీటిని దక్కించుకునేందుకు ట్రంప్ కుయుక్తులు పన్నారని డెన్మార్క్ ప్రభుత్వం గతంలోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ విషయంలో డెన్మార్క్‌కు నాటో సభ్య దేశాలు సైతం మద్దతు పలికాయి. JD Vance announces he’s going to Greenland with his wife Usha.Nobody wants her or you there, bro.pic.twitter.com/IowQstwafx— Art Candee 🍿🥤 (@ArtCandee) March 25, 2025

యుద్ధం తక్షణం ఆపండి!
కైరో: ఏడాదిన్నరకు పైగా సాగుతున్న యుద్ధంతో విసిగిపోయిన పాలస్తీనియన్లు హమాస్ ఉగ్ర సంస్థపై కన్నెర్రజేశారు. ఇజ్రాయెల్‌తో యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. హమాస్‌కు వ్యతిరేకంగా అతి పెద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. ‘హమాస్ గెటౌట్’ అంటూ వీధుల్లోకి వచ్చి మరీ నినాదాలతో హోరెత్తించారు. ‘యుద్ధాన్ని ఆపండి’, ‘పాలస్తీనా పిల్లలు బతకాలనుకుంటున్నారు’, ‘మేమెందుకు చావాలి? మాకు చావాలని లేదు’, ‘మా పిల్లల రక్తం అంత చౌకైనది కాదు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘‘ప్రజలు అలసిపోయారు. గాజాపై హమాస్ అధికారాన్ని వదులుకోవడమే యుద్ధానికి పరిష్కారమైతే అలాగే కానివ్వండి. ప్రజలను కాపాడేందుకు హమాస్ ఎందుకు అధికారాన్ని వదులుకోదు?’’ అంటూ నిలదీశారు. ‘ప్రజలు హమాస్‌ను గద్దె దించాలనుకుంటున్నారు’ అంటూ నినాదాలు చేశారు. మంగళవారం మొదలైన నిరసనలు బుధవారం గాజాలో మరిన్ని ప్రాంతాలకు పాకాయి! టెలిగ్రాం ద్వారా ఆందోళనకు పిలుపులు అందుకున్న ప్రజలు భారీగా నిరసనల్లో పాల్గొన్నారు. వారి సంఖ్య వేలల్లోనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హమాస్, ఇజ్రాయెల్‌తో పాటు యుద్ధానికి తెర దించడంలో విఫలమవుతున్న అరబ్ దేశాలపైనా నిరసనకారులు మండిపడ్డారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి అనంతరం గాజాలో ఇదే అతి పెద్ద ఆందోళన. జాబాలియా, బెయిట్ లహియా తదితర చోట్ల జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘‘ఇవేమీ రాజకీయ నిరసనలు కావు. మా జీవితాలకు సంబంధించిన విషయమిది’’ అని బెయిట్ హనూన్కు చెందిన మొహమ్మద్ అబూ సకర్ అన్నాడు. ఆయన ముగ్గురు పిల్లల తండ్రి. తామంతా నిత్యం ప్రాణభయంతో వణికిపోతున్నామంటూ ఆవేదన వెలిబుచ్చాడు. అందుకే మరో దారిలేక నిరసనలకు దిగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ‘‘ఈ హత్యాకాండకు, సొంత గడ్డపైనే శరణార్థులుగా బతకాల్సిన దుస్థితికి అడ్డుకట్ట వేసి తీరతాం. అందుకు ఎంతటి మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని ప్రకటించాడు. రెండు నెలల కాల్పుల విరమణ అనంతరం గాజాపై ఇజ్రాయెల్ తిరిగి భారీ బాంబు దాడులు ప్రారంభించడం తెలిసిందే. నిరసన ప్రదర్శనలపై హమాస్ ఉక్కుపాదం మోపింది. ముసుగులు ధరించిన సాయుధ హమాస్ మిలిటెంట్లు తుపాకులు, లాఠీలతో నిరసనకారులపై విరుచుకుపడ్డారు. అనేక మందిని కొట్టారని సమాచారం. 17 నెలల పై చిలుకు ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం గాజాను శిథిలావస్థకు చేర్చింది. మార్చి 2న గాజాకు సహాయ సామగ్రి పంపిణీని ఇజ్రాయెల్ మళ్లీ అడ్డుకోవడంతో పరిస్థితులు మరింత దిగజారాయి.

భారరహిత స్థితిలో బంతాట
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ ఎస్)లో వ్యోమగామి అనగానే మనకు ఠక్కున గుర్తొ చ్చేది ఒక్కటే. వందల కోట్ల వ్యయంతో అక్కడికెళ్లిన వ్యోమగామి ఎక్కువగా ప్రయోగాల్లో మునిగితేలుతా రని భావిస్తాం. అందుకు భిన్నంగా బేస్‌బాల్ ఆడుతూ కనిపించి అవాక్కయ్యేలా చేశారు జపాన్ వ్యోమగామి కొయిచి వకాటా. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంబంధిత ‘స్పేస్ బేస్‌బాల్’ వీడియోను తాజాగా ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేశారు. అంతరిక్షంలో భారర హిత స్థితిలో ఒంటరిగా ఉండకుండా సరదాగా బంతితో ఒక్కరమే ఎలా ఆడుకోవచ్చో వకాటా ఆడి చూపించారు. బేస్‌బాల్‌ను మంచి పిచ్ చూసుకుని విసిరి వెంటనే మళ్లీ ఆయనే బాల్ దూసుకెళ్తున్న దిశలో అంతకంటే వేగంగా కదిలి మళ్లీ బాల్‌ను బ్యాట్‌తో బాదారు. బ్యాట్‌తో కొట్టడంతో వ్యతిరేక దిశలో వెళ్తున్న బంతిని మళ్లీ ఆయనే ఇటు చివరకు దూసుకొచ్చి ఒడుపుగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘‘ జపాన్‌లో బేస్‌బాల్ ఎంఎల్‌బీ సీజన్ మొదలైంది. మైక్రోగ్రావిటీ స్థితిలో మనకు బేస్‌బాల్ టీమ్ మొత్తంతో పనిలేదు. ఒక్కరమే ఆట ఆడకోవచ్చు. బాల్ వేసేది మనమే. దానిని కొట్టేది మనమే. చివరకు పట్టేదీ మనమే’’ అని వకాటా రాసుకొచ్చారు. భారరహిత స్థితిని ఎలా ఆస్వాదించాలో, కేవలం ఒక్కరున్నా బేస్‌బాల్‌ను ఎలా ఆడాలో ఆయన చూపించిన విధం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. చాలా మంది మెచ్చుకు న్నారు. అంతరిక్ష వాతావరణాన్ని క్రీడాస్థలిగానూ వినియోగించువచ్చని ఆయన నిరూపించారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. ‘‘అంతరిక్ష క్రీడాకారుడు’’ అంటూ మస్క్ పొగిడారు. దాదాపు 20 సంవత్సరాలపాటు వ్యోమగామిగా కొనసాగిన వకాటా 2024లో రిటైర్ అయ్యారు. ఐదుసార్లు ఐఎస్ఎస్కు వెళ్లి మొత్తంగా 500 రోజులపాటు అక్కడ గడిపారు. ఎక్స్‌పిడీషన్39లో భాగంగా అక్కడికెళ్లిన ప్పుడు ఐఎస్ఎస్కు కమాండర్‌గా చేసిన తొలి జపాన్ వ్యోమగామిగా రికార్డ్ నెలకొల్పారు. జపాన్ ఏరోస్పే స్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా)లో వ్యోమగామిగా సేవలందించారు. pic.twitter.com/AGzg4O21St— Elon Musk (@elonmusk) March 25, 2025
National

Amit Shah: భారతదేశం ధర్మశాల కాదు
న్యూఢిల్లీ: భారతదేశం ధర్మశాల కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. దేశానికి ముప్పు కలిగించేవారు ఇక్కడికి వచ్చి తిష్ట వేస్తామంటే సహింబోమని హెచ్చరించారు. విదేశాల నుంచి పర్యాటకులుగా లేదా విద్య, వైద్యం, వ్యాపారం, పరిశోధనల కోసం ఎవరైనా వస్తామంటే సాదరంగా ఆహా్వనించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ, దేశంలో విధ్వంసం సృష్టించడానికి వచ్చేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడేవారిపై కన్నేసి ఉంచుతామన్నారు. కీలకమైన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు–2025 గురువారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ప్రమాదకరమైన ఉద్దేశాలతో దేశానికి వచ్చేవారిని కచి్చతంగా అడ్డుకుంటామని తెలిపారు. అందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఇది ధర్మశాల కాదన్నారు. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన వారిని అనుమతించబోమన్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా మారడానికి వచ్చేవారిని స్వాగతిస్తామన్నారు. ప్రతిపాదిత ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంతో దేశ భద్రత మరింత పటిష్టంగా మారుతుందని అమిత్ షా వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార రంగానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మన దేశాన్ని సందర్శించే ప్రతి ఒక్కరి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ చట్టం అవసరమని తెలియజేశారు.బెంగాల్‌పై ధ్వజంపశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదార్లను ముద్దు చేస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. బెంగాల్ ప్రభుత్వం భూమిని అప్పగించకపోవడం వల్ల భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో 450 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం నిలిచిపోయిందని చెప్పారు. అక్కడ కంచె నిర్మించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడల్లా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అలజడి సృష్టిస్తున్నారని, మతపరమైన నినాదాలు చేస్తున్నారని విమర్శించారు. చొరబాటుదార్లపై తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తుండడం వల్లే కంచె నిర్మాణం పెండింగ్‌లో ఉండిపోయిందని అన్నారు. ఏమిటీ బిల్లు? → ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు–2025 ప్రకారం.. నకిలీ పాస్‌పోర్టు లేదా నకిలీ వీసాతో ఇండియాలోకి ప్రవేశించినా, ఇక్కడ నివసిస్తున్నా, బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల దాకా జరిమానా విధించవచ్చు. → తమ వద్ద బస చేస్తున్న విదేశీయుల వివరాలను హోటళ్లు తప్పనిసరిగా ప్రభుత్వానికి అందజేయాలి. విద్యాసంస్థలు, హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్‌లలో కూడా విదేశీయులు ఉంటే ఆ సమాచారాన్ని యాజమాన్యాలు ప్రభుత్వానికి తెలియపర్చాలి. → చెల్లుబాటు అయ్యే పాసుపోర్టు లేదా ట్రావెల్ డాక్యుమెంట్ లేకుండా ఇండియాలోకి ప్రవేశిస్తే ఐదేళ్ల దాకా జైలు శిక్ష లేదా రూ.5 లక్షల దాకా జరిమానా విధించవచ్చు. ఒక్కోసారి ఈ రెండు శిక్షలు కలిపి విధించవచ్చు.

భార్యను ముక్కలు చేసి.. సూట్‌కేసులో కుక్కి..
సాక్షి, బెంగళూరు: జీవిత భాగస్వామిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరకడం వంటి కిరాతక నేరాలు దేశంలో అక్కడక్కడా జరుగుతున్నాయి. అలాంటి ఘోరం బెంగళూరులోనూ చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి ముక్కలుగా ఖండించి సూట్‌కేసులో పెట్టి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులోని హుళిమావు పరిధిలోని దొడ్డకమ్మనహళ్లిలో జరిగింది.రెండేళ్ల కిందటే పెళ్లి.. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ (37) అనే వ్యక్తి తన భార్య గౌరి సాంబేకర్ (32)ను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి సూట్‌కేసులో నింపేశాడు. రెండేళ్ల క్రితం రాకేశ్, గౌరికి వివాహం జరిగింది. నెల రోజుల క్రితమే దొడ్డకమ్మనహళ్లిలోని ఇంటికి మారారు. ఇద్దరు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కింద ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటున్నారు... గురువారం ఏం జరిగిందో కానీ హత్య చేసి, మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన గౌరి తల్లిదండ్రులు తమ ఊళ్లోని సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారమిచ్చారు. ఆ పోలీసులు వెంటనే హుళిమావు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఇంటికి వెళ్లి తాళాలు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బాత్రూంలో సూట్‌కేసులో గౌరి మృతదేహం ముక్కలై కనిపించడంతో కంగుతిన్నారు. ఆమె హత్యకు ఇంకా కారణాలు తెలియరాలేదు. నిందితుడు రాకేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆగ్నేయ డీసీపీ సారా ఫాతిమా, క్లూస్ టీం చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

భార్య అలా బెదిరించినా సరే విడాకులు తీసుకోవచ్చు!
విడాకులు తీసుకోవడానికి సంబంధిత చట్టాలు.. అందులోని సెక్షన్లు కారణాలేంటన్నదానిపై స్పష్టత ఇచ్చాయి. అయితే సందర్భం దొరికినప్పుడల్లా ఆ సెక్షన్ల విస్తృత పరిధిపై తమ తీర్పులు.. ఆదేశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటాయి న్యాయస్థానాలు. ఈ క్రమంలోనే తాజాగా విడాకులకు సంబంధించిన బాంబే హైకోర్టు ఓ సంచలన తీర్పు వెల్లడించింది.ముంబై: జీవిత భాగస్వామి ఇద్దరిలో ఎవరైనా సరే బలవన్మరణానికి పాల్పడతానని బెదిరించినా.. లేదంటే అలాంటి ప్రయత్నం చేసినా.. అది హింస కిందకే వస్తుందని, హిందూ వివాహ చట్టం, 1955 లోని సెక్షన్ 13(1)(ia) ప్రకారం విడాకులు మంజూరు చేయొచ్చని బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది.తన భార్య ఆత్మహత్య చేసుకుంటానంటోందని.. తనను,తన కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని బెదిరిస్తోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఇక ఆమెతో కలిసి కాపురం చేయలేనని.. తనకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టును కోరాడు. అక్కడి అతనికి ఊరట దక్కగా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది.ఆమె కేవలం తాను చనిపోయి భర్త కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని మాత్రమే బెదిరించడం లేదు.. బలవన్మరణానికి పాల్పడతానని చెబుతోంది కూడా. జీవిత భాగస్వాముల్లో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే అది అవతలి వాళ్లను హింసించడమే అవుతుంది. కాబట్టి విడాకులు మంజూరు చేయొచ్చు అని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ న్యాయమూర్తి ఆర్ఎం జోషి తీర్పు వెల్లడించారు.మహారాష్ట్రకు చెందిన సదరు వ్యక్తికి 2009లో వివాహం జరిగింది. ఆ జంటకు ఓ పాప. అయితే భార్య తరఫు బంధువుల రాకతో తమ కాపురం కుప్పకూలిందని విడాకుల పిటిషన్లో పేర్కొన్నాడతను. గర్భంతో ఉన్న భార్య తనను వీడి వెళ్లిపోయిందని.. అప్పటి నుంచి తిరిగి రాలేదు. అయితే కొంతకాలం తర్వాత తప్పుడు కేసులతో ఆమె అతన్ని బెదిరించసాగింది. ఈ క్రమంలోనే సూసైడ్ చేసుకుని.. ఆ నేరాన్ని భర్త కుటుంబంపై నెట్టేస్తానని బెదిరించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను కోర్టుకు సమర్పించిన భర్త చివరకు ఫ్యామిలీ కోర్టు నుంచి కిందటి నెలలో విడాకులు పొందగలిగాడు. భార్య ఆ తీర్పును సవాల్ చేయగా.. బాంబే హైకోర్టు తాజాగా ఆ తీర్పును సమర్థించింది.

‘నేను పెళ్లి చేసుకోలేదు.. బతికిపోయా’, మీరట్ ఘటనపై బాగేశ్వర్ బాబా
లక్నో: ‘థ్యాంక్ గాడ్. నేను పెళ్లి చేసుకోలేదు. లేదంటే’.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసుపై బాగేశ్వర్ బాబాగా ప్రచారంలో ఉన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రేమించి పెళ్లాడిన భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను ప్రియుడు సాహిల్ సాయంతో కట్టుకున్న భార్య ముస్కాన్ దారుణంగా హత్య చేసి,ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకుంది. అనంతరం, ప్రియుడి సాయంతో ముస్కాన్ తన భర్త సౌరభ్ రాజ్ మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి శరీర భాగాన్ని బులుగు రంగు ప్లాస్టిక్ డ్రమ్ములో దాచి పెట్టి పైన సిమెంటుతో కప్పిపెట్టారు.దారుణం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుల్ని కటకటాల్లోకి నెట్టారు. ఈ నేపథ్యంలో సౌరభ్ రాజ్ ఘటనపై ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి స్పందించారు. ప్రియుడి సాయంతో భర్తను హతమార్చిన ఘటనను ఉదహరించారు. ‘ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తల్లి దండ్రులు వారి పిల్లల్ని సరిగ్గా పెంచలేదు. వారి పెంపకంలో లోపాలు కనిపిస్తున్నాయి. అందుకే తల్లిదండ్రులు వారి పిల్లలకు విలువల్ని నేర్పించాలి. ఇందుకోసం శ్రీరామ చరిత్మానస్ బోధనలను పాటించాలని సూచించారు.#WATCH | Meerut, UP | On the Meerut murder case, Bageshwar Dham's Dhirendra Shastri said, "The Meerut case is unfortunate. In the present society, the declining family system, the advent of Western culture and married men or women engaged in affairs are destroying families...… pic.twitter.com/ULalTXvTj5— ANI (@ANI) March 27, 2025 ‘ప్రస్తుతం మనదేశంలో బ్లూ డ్రమ్ బాగా పాపులరైంది. చాలా మంది భర్తలు షాక్‌లో ఉన్నారు. థ్యాంక్ గాఢ్.నేను పెళ్లి చేసుకోలేదు’ అని నవ్వుతూ ప్రతిస్పందించారు. మీరట్ ఘటన దురదృష్టకరం. క్షీణిస్తున్న కుటుంబ వ్యవస్థ, పాశ్చాత్య సంస్కృతి, వివాహిత స్త్రీ, పురుషుల వ్యవహారాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. అందుకే ఉన్నతవంతమైన కుటుంబాన్ని నిర్మించేందుకు ప్రతి భారతీయుడు శ్రీరామచరిత్మానస్‌ను ఆచరించాలని కోరారు.
NRI

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం.. నీళ్ల బకెట్లో వేసి కన్నతల్లే చంపేసింది
మైలార్‌దేవ్‌పల్లి: నీళ్ల బకెట్లో పడి 14 రోజుల పసికందు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే చిన్నారిని తల్లే నీటి బకెట్లో వేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మైలార్దేపల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ గురువారం వివరాలు వెల్లడించారు. తమిళనాడు ప్రాంతానికి ముదిలాని మణి, ఆరోగ్య విజ్జి(30) భార్యాభర్తలు అలీనగర్‌లోని ఓ కంపెనీలో పని చేస్తూ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.వీరికి ఒక కుమారుడు, 14 రోజుల కుమార్తె ఉన్నారు. మణికి రెండు కిడ్నీలు పాడైపోవడంతో అతడి చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. దీంతో గత కొన్నాళ్లుగా ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో పాప జన్మించడంతో ఆమె పోషణ విషయమై ఆరోగ్య విజ్జి ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న భర్త పనికి వెళ్లిన సమయంలో విజ్జి తన కుమార్తెను బాత్రూమ్లోని నీటి బకెట్లో పడేసి హత్య చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించింది. గురువారం నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

రెండు బీర్లు.. ఒక క్వార్టర్
శంకరపట్నం: మద్యం దుకాణంలో రోజుకు రూ.లక్షల్లో గిరాకీ.. కౌంటర్లో డబ్బు బాగానే ఉంటుందని భావించిన ఓ దొంగ.. దుకాణం మూశాక చోరీకి దిగాలని భావించాడు. అర్ధరాత్రి వచ్చి కష్టపడి పైకప్పు రేకు కోసి, లోపలికి దిగాడు. ఆశగా కౌంటర్ తెరిస్తే రూపాయి కూడా లేకపోవడంతో నిరాశ చెందాడు. ఖాళీ చేతులతో వెళ్లడం ఎందుకని ఒక క్వార్టర్, రెండు బీర్లను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ క్రాస్‌రోడ్డు సమీపంలోని మద్యం దుకాణంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనపై వైన్స్ యజమాని, పోలీసుల కథనం ప్రకారం.. మొలంగూర్ క్రాస్ రోడ్డు సమీపంలోని మద్యం దుకాణంలో బుధవారం రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించారు. సమయం ముగిశాక సిబ్బంది కౌంటర్లోని డబ్బులు తీసుకుని వైన్స్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగ దుకాణం పైకప్పు రేకులను కోసి దుకాణంలోకి చొరబడ్డాడు. కౌంటర్లో డబ్బు లేకపోవడంతో రెండు బీర్లు, క్వార్టర్ సీసా, సీసీ ఫుటేజీ హార్డ్‌డిస్క్ తీసుకెళ్లాడు. గురువారం వైన్స్ తెరవగా.. పైకప్పు కోసి ఉండడాన్ని గమనించి వ్యాపారి శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ రవి, క్లూస్‌టీం వివరాలు సేకరించారు. ఈ వైన్స్‌లో గతంలోనూ దొంగలు పైకప్పు తొలగించి చోరీకి దిగారని, దీంతో ఇనుపరాడ్లు వేశానని, అయినా రేకు కోసి దొంగ లోపలకు దిగాడని యజమాని వాపోయాడు.

భవనం కూలిన ఘటనలో ఒకరి మృతి
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగిన బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో విషా దం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమించి శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చిన కార్మికుడు చల్లా కామేశ్వరరావు (48).. ఆస్పత్రికి తరలించిన కాసేపటికే మృతి చెందాడు. తల, ఉదర భాగం మినహా నడుం కింది భాగంలో అవయవాలన్నీ శిథిలాల కింద నలిగిపోవడంతో ప్రాణాలు వదిలాడు. మరో కార్మికుడు పడిసర ఉపేందర్ ఆచూకీ కోసం శిథిలాల కింద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కూలిన ఐదు స్లాబులను క్రేన్లతో డ్రిల్ చేస్తూ, కట్టర్లు, గ్యాస్ వెల్డింగ్‌తో ఇనుమును తొలగిస్తున్నారు. అయితే ఉపేందర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బ్రిడ్జి సెంటర్లో, ఘటనాస్థలం వద్ద ఆందోళన చేశారు. సహాయక చర్యల్లో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఇంటి యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహాయక చర్యలను భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు.

మ్యాడ్ లాంటి సినిమాలు ఆరోగ్యానికి మంచిది- నాగచైతన్య
‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ట్రైలర్ బాగుంది. నేను ‘మ్యాడ్’ సినిమాలోని కామెడీ సీన్స్ చూస్తూ ఒత్తిడిని దూరం చేసుకుంటుంటాను. ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి చాలా మంచిది. డల్‌గా ఉన్నప్పుడు ‘మ్యాడ్’ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా సూచించాలనేది నా అభిప్రాయం’’ అని హీరో అక్కినేని నాగచైతన్య చెప్పారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజ్ అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మ్యాడ్ స్క్వేర్’ లాంటి సినిమాలు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేలా చేస్తాయి. ఫ్రెండ్షిప్ని స్ట్రాంగ్ చేస్తాయి. కొత్త ఫ్రెండ్స్‌ని పరిచయం చేస్తాయి. కామెడీ చేయడం అనేది చాలా కష్టం. నార్నే నితిన్, రామ్, సంగీత్‌లలో ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఇంత నవ్వించగలిగారు. నాగవంశీ, నా ప్రయాణం ‘ప్రేమమ్’ సినిమాతో మొదలైంది. దర్శకులకు, నటులకు ఎంతో ధైర్యాన్నిస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు వంశీ. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. ‘మ్యాడ్ 2’ మాత్రమే కాదు.. ‘మ్యాడ్ 100’ కూడా రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.