Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Myanmar Thailand Bangkok Earthquake March 29 2025 Live Updates1
Earthquake Updates: ఎటు చూసినా విషాదమే!

Earthquake Live Rescue OP Updates👉అఫ్గాన్‌లో భూకంపంరిక్టర్‌ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదుఉదయం 5.16 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు తెలిపిన నేషనల్ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ👉భూకంప బాధితులకు భారత్‌ ఆపన్న హస్తం15 టన్నుల సహాయక సామగ్రిని మయన్మార్‌కు పంపించిన భారత్గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్స్, ఆహార పొట్లాలు, సోలార్‌ లైట్లు, ఔషధాలను మిలిటరీ విమానంలో పంపించినట్లు వెల్లడించిన విదేశాంగశాఖ 👉మయన్మార్‌లో మళ్లీ భూకంపంమయన్మార్‌ను వణికించిన మరో భూకంపంసహాయక చర్యలు కొనసాగుతుండగానే గతరాత్రి మళ్లీ భూకంపం4.2 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలునిన్నటి భూకంపం ధాటికి 200 మంది మరణించినట్లు ప్రకటించిన అధికారులుఇంకా భారీగా మృతులు ఉండే అవకాశంవెయ్యి మంది మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్న అమెరికా భూకంపం సర్వే సంస్థ👉 థాయ్‌లాండ్‌లో కొనసాగుతున్న ఎమర్జెన్సీథాయ్‌లాండ్‌లో భూకంపంతో అత్యవసర పరిస్థితి ప్రకటనఉత్తర థాయ్‌లాండ్‌లో తీవ్ర నష్టంరాజధాని బ్యాంకాక్‌ అతలాకుతలంకొనసాగుతున్న శిథిలాల తొలగింపు భారీ సంఖ్యలో మృతులు ఉండే అవకాశం👉హృదయ విదారకం మయన్మార్, థాయ్‌లాండ్‌ల్లో హృదయవిదారకంగా భూకంప దృశ్యాలు పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద నుంచి హాహాకారాలు స్కూల్స్‌, ఆఫీసులు, ఆస్పత్రులు.. ఇలా అన్ని కుప్పకూలిన వైనంశిథిలాల నడుమ తమవారి కోసం కన్నీటి మధ్యే వెదుక్కుంటున్న జనం కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు 👉మయన్మార్‌, థాయ్‌లాండ్‌ను కుదిపేసిన భారీ భూకంపంకుప్పకూలిన భవనాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టంఇంకా శిథిలాల కిందే పలువురు.. కొనసాగుతున్న సహాయకచర్యలుమయన్మార్‌లో ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటనథాయ్‌లాండ్‌లో భారతీయుల సహాయార్థఇండియన్‌ ఎంబసీ హెల్ప్‌లైన్‌థాయ్‌లాండ్‌లో హెల్ఫ్‌లైన్‌ నెంబర్‌ +66618819218ఊహించని ప్రకృతి వికృతి చర్య.. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్‌ పాలిట భారీ భూకంపం గోరుచుట్టుపై రోకటిపోటుగా మారింది.టిబెట్‌ పీఠభూమి ప్రాంతంలో సంక్లిష్టమైన టెక్టానిక్‌ ఫలకాలపై ఉన్నందున మయన్మార్‌కు భూకంప ముప్పు ఎక్కువే. ఇక్కడ హెచ్చు తీవ్రతతో కూడిన భూకంపాలు పరిపాటి. భూమి పై పొరలోని ఇండో, బర్మా టెక్టానిక్‌ ఫలకాలు సమాంతరంగా కదలడమే తాజా భూకంపానికి కారణమని సైంటిస్టులు తేల్చారు. భూ ఫలకాల అంచులను ఫాల్ట్‌గా పిలుస్తారు. లక్షలాది ఏళ్ల కింద భారత ఉపఖండం ఆసియాను ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డ సాగయింగ్‌ ఫాల్ట్‌గా పిలిచే పగుళ్ల వెంబడే తాజా భూకంపం చోటుచేసుకుంది. ఇక్కడ టెక్టానిక్‌ ఫలకాలు ఏటా 0.7 అంగుళాల చొప్పున పరస్పర వ్యతిరేక దిశలో కదులుతున్నాయి. ఫలితంగా పుట్టుకొచ్చే ఒత్తిడి భూకంపాలుగా మారుతుంటుంది. ఇక్కడ దశాబ్దానికి ఒక్క భారీ భూంకంపమన్నా నమోదవుతుంటుంది. మయన్మార్‌లో గత వందేళ్లలో 6కు మించిన తీవ్రతతో 14కు పైగా భూకంపాలు నమోదయ్యాయి. 1946లో 7.7, 1956లో 7.1 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. 1988 నాటి భూకంపానికి వేలాది మంది బలయ్యారు. 2011, 2016ల్లో కూడా 6.9 తీవ్రతతో భూకంపాలొచ్చాయి. 👉ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకుల్లా వణికిపోయిన థాయ్‌లాండ్, మయన్మార్‌మార్చి 28 శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇటు మయన్మార్‌లో.. 7.4 తీవ్రతతో సంభవించిన ప్రకంపనలు అటు థాయ్‌లాండ్‌లోనూ భారీ విధ్వంసం సృష్టించాయి. మయన్మార్‌లో 6.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించగా తర్వాత కూడా మరో నాలుగైదు ప్రకంపనాలు వణికించాయి. ఇటు మయన్మార్‌లో.. అటు థాయ్‌ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భవనాలు కళ్లముందే పేకమేడల్లా కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

Karnataka Elderly Couple Loses Lakhs To Cyber Fraud Next Did This2
మా వల్ల కావట్లేదు.. ఎవరి దయ మీదా బతకాలనుకోవడం లేదు

బెంగళూరు: వీడియో కాల్‌ చేసి.. ఆపై నగ్నఫొటోలున్నయంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య తరచూ చూస్తున్నదే. అయితే అలాంటి సైబర్‌ నేరంలో చిక్కుకుని.. వాళ్ల బెదిరింపులకు భయపడి వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పైగా అప్పటికే రూ.50 లక్షలు చెల్లించిన ఆ జంట.. ఇంకా చేసేది లేక ఈ ఘాతుకానికి దిగింది.బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా బీడి గ్రామంలో గ్రామంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి డియోగో నజరత్‌(83), పావీయా నజరత్‌(79) దంపతులు నివాసం ఉంటున్నారు. గత రెండు రోజులుగా ఇంటినుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో స్వసహయ సంఘం మహిళలు వెళ్లి చూడగా.. విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న నందగడ పోలీసులు వచ్చి పరిశీలించారు. డియోగో గొంతు, మణికట్టు వద్ద కత్తి కోసిన గాయం కనిపించింది. ఘటన స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించింది. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం కోసం బీమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ‘‘నా వయసు 82 ఏళ్లు.. నా భార్య వయసు 79 సంవత్సరాలు. ఈ వయసులో మాకు ఆదుకోవడానికి ఎవరూ లేరు. సమాజంలో ఎంతో గౌరవంగా ఇంతకాలం బతికాం. కానీ, ఇప్పుడు ఈ వేధింపులు భరించలేకపోతున్నాం. ఎవరిని సాయం అడిగి.. ఎవరి దయ మీదా బతకాలనీ అనుకోవడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని డియోగో స్వదస్తూరితో రాసిన లేఖ అది. నెల రోజులుగా వేధింపులు.. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా కీలక విషయాలు వెలుగు చూశాయి. దంపతులను సైబర్‌ నేరగాళ్లు నెల రోజులుగా వేధిస్తున్నారు. తాము పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. మా వద్ద మీ నగ్న చిత్రాలున్నయంటూ ఫోన్‌లో బెదిరించారు. అడిగినంత డబ్బులు ఇవ్వకంటే ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాలలో వైరల్‌ చేస్తామంటూ బెదిరించారు. ఆ వేధింపులు తాళలేక రూ.50 లక్షలు చెల్లించారు. అయినా మరింత నగ­దు కావాలని ఒత్తిడి చేశారు. దీంతో బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. పావీయా నిద్ర­మాత్రాలు మింగి ఆత్మహత్య చేసుకుంది. డియాగో డెత్‌నోట్‌ రాసి చాకుతో గొంతు కోసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన స్థలాన్ని బెళగావి జిల్లా ఎస్పీ పరిశీలించి కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు.లేఖలో.. సుమిత్రా బిర్రా, అనిల్‌ యాదవ్‌ అనే ఇద్దరి పేర్లను డియాగో ప్రస్తావించారు. తాను న్యూఢిల్లీ నుంచి టెలికామ్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నానని సుమిత్రా , అనిల్ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుగా పరిచయం చేసుకుని మరీ బెదిరింపులకు దిగారట. నగ్నఫోల్‌కాల్స్‌ ఉన్నాయని.. సిమ్‌ కార్డ్‌ దుర్వినియోగం కింద చట్టపరమైన చర్యలు ఉంటాయని బెదిరించారట. అయితే.. అప్పటికే రూ.50 లక్షలు చెల్లించామని.. ఇంకా కావాలని డిమాండ్‌ చేశారని.. బంగారం మీద రుణం కూడా తీసుకుని చెల్లించామని లేఖలో డియాగో వాపోయాడు. స్నేహితుల వద్ద నుంచి తెచ్చిన అప్పును తన భార్య నగలు అమ్మి చెల్లించాలని సూసైడ్‌ నోట్‌లో కోరిన డియాగో.. తమ ఇద్దరి మృతదేహాలను మెడికల్‌ కాలేజీకి అప్పగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

Hatya movie ott review: Tollywood3
'హత్య' మూవీ రివ్యూ.. ఇది కదా అసలు నిజం!

టైటిల్‌: హత్య; నటీనటులు: ధన్యా బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్, రఘు, భరత్‌ తదితరులు. నిర్మాత: ప్రశాంత్‌ రెడ్డి; కథ–స్క్రీన్ ప్లే–దర్శకత్వం: శ్రీవిద్య బసవ; సంగీతం: నరేశ్‌ కుమరన్.పి సినిమాటోగ్రఫీ: అభిరాజ్‌ నాయర్‌; ఎడిటర్‌: అనిల్‌ కుమార్‌ .పి; ఓటీటీ: అమెజాన్ ప్రైమ్‌ వీడియో.అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతున్న ‘హత్య’ సినిమా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కల్పిత కథ అని మేకర్స్‌ ప్రకటించినప్పటికీ... ఈ సినిమాలోనిపాత్రలు, స్థలాలు, హత్య ఘటన, కేసు దర్యాప్తు ప్రక్రియ అన్నీ కూడా సంచలనం అయిన ప్రముఖ రాజకీయ నాయకుడు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసును పోలి ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించి దర్శక–నిర్మాతలు లోతైన పరిశోధన చేసి, దాగి ఉన్న పలు విషయాలను సేకరించినట్లుగా సినిమా చూసినవారికి అనిపించడం సహజం.ఈ హత్యకు సంబంధించిన అసలు నిజాలు చెప్పేలా కథ ఉండటంతో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయిన వెంటనేపాపులర్‌ అయింది... నిజంగా ఏం జరిగింది? అనేదానికి ఈ సినిమా నిజమైన నమూనానా? హత్య వెనక ఉన్న నిజమైన హంతకులను ఈ సినిమా బయటపెట్టిందా? జరిగిన విషయాన్ని ఎలా తారుమారు చేసి, ప్రచారం చేస్తున్నారో ఈ సినిమా చూపించిందా? ‘హత్య’ సినిమా బయటపెట్టిన నిజాలు ఏంటి? ఇంతకీ ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీస్‌ని ఇష్టపడేవారు, వివేకానంద రెడ్డి హత్య కేసుని ఫాలో అవుతున్నవారు చూడాల్సిన చిత్రం ఇది.ఇంతకీ ఈ చిత్ర కథేంటంటే...ఇల్లందులో రాజకీయ నాయకుడు ధర్మేంద్ర రెడ్డి (రవి వర్మ) దారుణ హత్యకు గురవుతాడు. అయితే తొలుత ఆయన మరణం గుండెపోటు వల్ల జరిగిందని వార్తలు వస్తాయి. కానీ ధర్మేంద్ర గొడ్డలి వేటుతో హత్యకు గురయ్యాడని నిర్ధారణ అవుతుంది. ఈ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ రెడ్డి (భరత్‌) నిజాయితీ గల ఐపీఎస్‌ అధికారి సుధ (ధన్యా బాలకృష్ణ)కి అప్పగిస్తాడు. ఆమె తన టీమ్‌తో కలిసి ధర్మేంద్ర రెడ్డి హత్య కేసు విచారణ మొదలుపెడుతుంది. అజాత శత్రువు అయిన ధర్మేంద్ర రెడ్డిని అంత దారుణంగా నరికి చంపింది ఎవరు? ధర్మేంద్రకు, సలీమా (పూజా రామచంద్రన్‌)కు ఉన్న సంబంధం ఏంటి? పొలిటికల్‌ ఎజెండాతో ఈ హత్య చేశారా?\ఆర్థిక సమస్యలే కారణమా? ధర్మేంద్ర కుమార్తె కవితమ్మ (హిమబిందు)ను తప్పుదోవ పట్టించింది ఎవరు? చిన్నాన్న హత్య కేసులో నిజాలను నిగ్గు తేల్చడానికి సీఎం కిరణ్‌ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? గత ప్రభుత్వం దగ్గర అమ్ముడుపోయిన కొంతమంది అధికారులు ఈ కేసును ఎలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు? అనేక ఒత్తిడిలను తట్టుకొని ఐపీఎస్‌ అధికారి సుధ ఈ మర్డర్‌ మిస్టరీని ఎలా ఛేదించింది? కేసు విచారణ చివరి దశలో ఉన్న సమయంలో ఏం జరిగింది? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ‘హత్య’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కథంతా కల్పితమే అని చిత్రబృందం పేర్కొన్నప్పటికీ.. సినిమాప్రారంభంలోనే ఇది వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. దర్శకురాలు శ్రీవిద్య బసవ ఎంతో రీసెర్చ్‌ చేసి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆమె రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నాయి. సినిమాప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. జేసీ ధర్మేంద్ర ఎవరన్నది చెబుతూ కథను మొదలుపెట్టారు దర్శకురాలు. ధర్మేంద్ర హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూపించారు. సుధ విచారణలో ఒక్కో కొత్త విషయం బయటకు వస్తుంటే.. ‘ఇది కదా అసలు నిజం’ అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సలీమా, ధర్మేంద్రల మధ్య లవ్‌స్టోరీ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. దర్శకురాలు ఎంతో పకడ్బందీగా రీసెర్చ్‌ చేసి, లవ్‌స్టోరీ చెప్పినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మంచి ఎమోషన్‌ పండించారు.ఎవరెలా చేశారంటే..ధర్మేంద్ర రెడ్డిపాత్రలో రవి వర్మ ఒదిగిపోయారు. ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ధన్యా బాలకృష్ణ తనపాత్రకు న్యాయం చేశారు. సలీమాగా ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో పూజా రామచంద్రన్‌ మెప్పించారు. భరత్, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌... మిగిలిన నటీనటులు వారిపాత్రల్లో మెప్పించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నరేశ్‌ కుమరన్ .పి అందించిన నేపథ్య సంగీతం,పాటలు సినిమాకు ప్లస్‌ అయ్యాయి. అభిరాజ్‌ నాయర్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

Chittoor TDP MLA Followers Attack YSRCP Leader Murali Details Here4
Chittoor: ఎమ్మెల్యే గురజాల అనుచరుల వీరంగం

చిత్తూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ, జనసేన శ్రేణులు రెచ్చిపోతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లిలో వైఎస్సార్‌సీపీ నేత మురళీరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. గత రాత్రి మరళి ఇంటిపైకి వెళ్లిన ముప్పై మంది టీడీపీ గుండాలు వీరంగం సృష్టించారు. మురళిపై దాడికి పాల్పడింది చిత్తూరు ఎమ్మెల్యే గురజాల అనుచరుడిగా సీసీ ఫుటేజీ ద్వారా బయటపడింది. గురజాలకు దగ్గరి మనిషి అయిన సాధు దిలీప్‌ నాయుడు, అతని అనుచరులు మురళిరెడ్డిపై దాడికి పాల్పడినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది. తమ రాజకీయం మాత్రమే చెల్లాలంటూ వాళ్లు ఆయన్ని బెదిరించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న చిత్తూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ‘‘చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రౌడీ రాజకీయలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం చేయించారు. సీపీఫుటేజీ ఆధారంగా వెంటనే నిందితులను అరెస్ట్‌ చేయాలి. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని విజయానందరెడ్డి హెచ్చరించారు.

Shardul Thakur is showing his strength for Lucknow Supergiants5
వద్దనుకున్నవాడే... ఆపద్బాంధవుడయ్యాడు!

ఐపీఎల్‌ 2024లో భాగంగా హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో లక్నో సూపర్‌ జెయింట్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను అభిమానులు అంత త్వరగా మరచిపోలేరు. మొదట బ్యాటింగ్‌ చేసిన లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేస్తే... ఛేదనలో చెలరేగిపోయిన రైజర్స్‌ 9.4 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోకుండా 167 పరుగులు చేసి విజయం సాధించింది!దూకుడే మంత్రంగా సాగుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... ఈ సీజన్‌లో రాజస్తాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ 286 పరుగులతో విజృంభించింది. రెండో మ్యాచ్‌లో లక్నోతో తలపడాల్సి రావడంతో మరింత భారీ స్కోరు ఖాయమే అని అభిమానులంతా అంచనాకు వచ్చేశారు. అందుకు తగ్గట్లే రైజర్స్‌కు మొదట బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కింది. ఇంకేముంది మరోసారి పరుగుల వరద ఖాయం అనుకుంటే... ఒకే ఒక్కడు హైదరాబాద్‌ జోరుకు అడ్డుకట్ట వేశాడు!! ఐపీఎల్‌ వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయని ఆ ప్లేయర్‌... అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రైజర్స్‌ జోరుకు కళ్లెం వేశాడు. ప్రమాదకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మతో పాటు క్రితం మ్యాచ్‌ సెంచరీ హీరో ఇషాన్‌ కిషన్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపి ఆరెంజ్‌ ఆర్మీని నిలువరించాడు. చివర్లో మరో రెండు వికెట్లు తీసిన అతడే భారత సీనియర్‌ ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌. అనూహ్య అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటున్న శార్దుల్‌పై ప్రత్యేక కథనం... జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 80కి పైగా మ్యాచ్‌లు ఆడిన అనుభవం... మీడియం పేస్‌తో పాటు లోయర్‌ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేయగల నైపుణ్యం... తాజా రంజీ ట్రోఫీలో అటు బంతితో పాటు ఇటు బ్యాట్‌తో చక్కటి ప్రదర్శన చేసినప్పటికీ... శార్దుల్‌ ఠాకూర్‌ను ఐపీఎల్‌ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్దుల్‌పై ఏ జట్టు ఆసక్తి కనబర్చలేదు. దీంతో కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమవుతున్న ఈ ఆల్‌రౌండర్‌కు... భారత మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ నుంచి పిలుపు వచ్చిoది. ‘ప్రయత్నాలు విడిచిపెట్టకు. నిన్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రిప్లేస్‌మెంట్‌గా నువ్వు టీమ్‌లో చేరితే తొలి మ్యాచ్‌ నుంచే బరిలోకి దిగాల్సి ఉంటుంది’ అని లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌ జహీర్‌ ఖాన్‌ చెప్పిన మాటలతో శార్దుల్‌ తనను తాను టి20 ఫార్మాట్‌కు సిద్ధం చేసుకున్నాడు. లక్నో పేసర్‌ మొహసిన్‌ ఖాన్‌ గాయంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌కు దూరం కావడంతో... అతడి స్థానంలో ప్రత్యామ్నాయంగా శార్దుల్‌ను జట్టులోకి తీసుకున్నారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న శార్దుల్‌ తొలి మ్యాచ్‌ నుంచే తనదైన ముద్ర వేశాడు. తొలి మ్యాచ్‌లో 2 ఓవర్లే... విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన పోరులో శార్దుల్‌ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. భారీ స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే శార్దుల్‌ 2 వికెట్లు పడగొట్టి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఇన్నింగ్స్‌ మూడో బంతికి మెక్‌గుర్క్‌ను ఔట్‌ చేసిన ఈ ముంబైకర్‌... ఐదో బంతికి అభిõÙక్‌ పొరెల్‌ను బుట్టలో వేసుకున్నాడు. దీంతో భారీ ఛేదనలో ఢిల్లీ ఆరంభంలోనే తడబడింది. అయితే ఆ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌... శార్దుల్‌ను సరిగ్గా వినియోగించుకోలేదు. 2 ఓవర్ల తర్వాత అతడికి అసలు తిరిగి బౌలింగే ఇవ్వలేదు. దీంతో పంత్‌ సారథ్యంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం కాగా... రెండో మ్యాచ్‌లో హైదరాబాద్‌పై దాన్ని పునరావృతం కానివ్వకుండా చూసుకున్నాడు. దాని ఫలితమే శార్దుల్‌ ఐపీఎల్లో తన అత్యుత్తమ గణాంకాలు (4/34) నమోదు చేసుకోవడంతో పాటు లీగ్‌లో 100 వికెట్ల మైలురాయిని సైతం దాటాడు. షార్ట్‌బాల్‌తో అబిషేక్‌కు బైబై చెప్పిన శార్దుల్‌... తదుపరి బంతికే ఇషాన్‌ను కీపర్‌ క్యాచ్‌గా పెవిలియన్‌ బాట పట్టించాడు. చివర్లో మరోసారి బౌలింగ్‌కు వచి్చన అతడు... అభినవ్‌ మనోహర్, మొహమ్మద్‌ షమీని ఔట్‌ చేశాడు. రైజర్స్‌కు కళ్లెం... హిట్టర్లతో దట్టంగా ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగినట్లు శార్దుల్‌ వెల్లడించాడు. ‘రైజర్స్‌ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచి భారీ షాట్లు ఆడుతూ మ్యాచ్‌ను లాగేసుకుంటున్నారు. అలాంటిది వారిపై ఒత్తిడి పెంచితే ఫలితాలు రాబట్టవచ్చు అని ముందే అనుకున్నా. చాన్స్‌ తీసుకోవాలనుకున్నా.ఫ్లాట్‌ పిచ్‌పై ఆరంభంలోనే ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకోవడం సన్‌రైజర్స్‌ ప్లేయర్లకు అలవాటు. అలాంటిది వారిని భారీ స్కోరు చేయకుండా మొదట్లోనే అడ్డుకోవాలని భావించా. నా ప్రణాళికలకు తగ్గట్లే బౌలింగ్‌ చేశాను. మెరుగైన ఫలితాలు రావడం ఆనందంగా ఉంది. నేనెప్పుడు వ్యక్తిగత ప్రదర్శనను పట్టించుకోను. జట్టు విజయంలో నా వంతు పాత్ర ఉండాలని భావిస్తా’ అని శార్దుల్‌ అన్నాడు. ఐపీఎల్‌లోని అన్నీ జట్లలో బౌలింగ్‌ లైనప్‌ బలహీనంగా ఉందని విమర్శలు మూటగట్టుకున్న లక్నో... ఇప్పుడు శార్దుల్‌ మ్యాజిక్‌తో ముందుకు సాగుతోంది. లీగ్‌లో మున్ముందు కూడా ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నుట్లు ఈ ఆల్‌రౌండర్‌ వెల్లడించాడు. జహీర్‌ ఫోన్‌ కాల్‌తో.. ఐపీఎల్‌ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకోకపోవడంతో... శార్దుల్‌ దేశవాళీల్లో మరింత పట్టుదలగా ఆడాడు. 2024–25 రంజీ సీజన్‌లో ముంబై జట్టు తరఫున ఈ ఆల్‌రౌండర్‌ 35 వికెట్లు తీయడంతో పాటు లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి 500 పైచిలుకు పరుగులు చేశాడు. ‘రంజీ నాకౌట్‌ మ్యాచ్‌ల సమయంలో జహీర్‌ ఖాన్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో సాధన కొనసాగించా. వేరే జట్లు కూడా సంప్రదించినప్పటికీ... జహీర్‌ ముందు ఫోన్‌ చేయడంతో అతడి మాటకు విలువ ఇచ్చి లక్నో జట్టులో చేరేందుకు అంగీకరించా’ అని శార్దుల్‌ చెప్పాడు. ఐపీఎల్‌ వేలంలో కొనుగోలు ఏ జట్టు కొనుగోలు చేసుకోక పోవడంతో ఏమాత్రం నిరుత్సాహానికి గురికాని శార్దుల్‌... మరింత క్రమశిక్షణతో తన బౌలింగ్‌ అ్రస్తాలను పెంచుకొని ఫలితాలు రాబడుతున్నాడు. –సాక్షి, క్రీడావిభాగం

Health benefits of Ugadi Pachadi6
6 రుచులు... 6 ఆరోగ్య లాభాలు

ఉగాది పచ్చడిని సేవించే ఆచారం శాలివాహన శకారంభం నుంచి మొదలైనట్లుగా చరిత్రకారులు చెబుతారు. సంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని కొత్త మట్టికుండలోతయారు చేస్తారు. ఉగాది పచ్చడిలో వేపపూత, మామిడి పిందెలు, చింతపండు, ఉప్పు, మిరియాల పొడి, బెల్లం, అరటిపండు ముక్కలు ఉపయోగిస్తారు. వీటి వల్ల ఉగాది పచ్చడి ఆరురుచుల సమ్మేళనంగా తయారవుతుంది. ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలు, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం....బెల్లం, అరటి పండ్లు– తీపిబెల్లం తీపిగా ఉంటుంది. ఎండ వేడిమి వల్ల కలిగే అలసటను పోగొట్టి, తక్షణ శక్తినిస్తుంది. బెల్లాన్ని అరటిపండుతో కలిపి తీసుకోవడం శ్రేష్ఠమని ఆయుర్వేదం చెబుతోంది. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలను అరటిపండు నిరోధిస్తుంది.చింతపండు– పులుపుఉగాది పచ్చడి తయారీకి పాత చింతపండు ఉపయోగించడం మంచిది. పాత చింతపండు ఉష్ణాన్ని, వాత దోషాలను తగ్గిస్తుంది. బడలికను పోగొడుతుంది. జఠరశక్తిని పెంచుతుంది. మూత్రవిసర్జన సజావుగా సాగేందుకు దోహదపడుతుంది. వేసవిలో చింతపండు రసం తీసుకోవడం వల్ల ఉష్ణదోషాలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది.ఉప్పురుచులకు రారాజులాంటిది ఉప్పు. ఉప్పులేని పప్పులు, కూరలు, పచ్చళ్లు రుచించవు. ఆహారంలో అనునిత్యం ఉపయోగించే ఉప్పు త్రిదోషాలను– అంటే, వాత పిత్త కఫ దోషాలు మూడింటినీ పోగొడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, ఉప్పును మోతాదులోనే వాడాలి.మామిడి పిందెలు– వగరుమామిడి కాయలు ముదిరితే పులుపుగా ఉంటాయి గాని, పిందెలు వగరుగా ఉంటాయి. మామిడి పిందెల వగరుదనం లేకుంటే, ఉగాది పచ్చడికి పరిపూర్ణత రాదు. మామిడి పిందెలలో విటమిన్‌–సి పుష్కలంగా ఉంటుంది. మామిడి పిందెలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని త్రిదోషాలను హరించి, శక్తిని కలిగిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.వేపపూలు– చేదువసంతారంభంలో వేపపూలను తినే ఆచారం దాదాపు అన్నిప్రాంతాల్లోనూ ఉంది. దీనిని ‘నింబకుసుమ భక్షణం’ అంటారు. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిలో వేపపూలను ఉపయోగించడం మన తెలుగువాళ్లకే చెల్లింది. వేపపూలు కఫదోషాన్ని, క్రిమిదోషాలను పోగొడతాయి. జీర్ణకోశ సమస్యలను నివారిస్తాయి.మిరియాల పొడి–కారంమిరియాలను నేరుగాను, పొడిగాను వంటకాల్లో తరచుగా వినియోగిస్తూనే ఉంటాం. మిరియాలు రుచికి కారంగా ఉన్నా, శరీరానికి చాలా మేలు చేస్తాయి. మిరియాలు కఫదోషాన్ని, విష దోషాలను హరిస్తాయి. చర్మవ్యాధులను అరికట్టడమే కాకుండా, జీర్ణశక్తిని, శరీరంలోని జీవక్రియలను పెంచుతాయి. అందుకే సంప్రదాయ ఆయుర్వేద ఔషధాల్లో మిరియాలను విరివిగా ఉపయోగిస్తారు.

Siddharth Luthra gets huge fees for defending in 4 cases7
పార్టీ కేసులకు ప్రజాధనం లూథ్రాకు రూ.2.86 కోట్లు అర్పణం

సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తమ ఆస్థాన న్యాయవాది సిద్దార్థ లూథ్రాకు పెద్ద మొత్తంలో ఫీజుల సంతర్పణ చేశారు. వ్యక్తిగతంగా, పార్టీపరంగా కష్ట కాలంలో తనకు అండగా నిలిచినందుకు సొంత సొమ్ము కాకుండా.. ప్రజల సొమ్మును గురుదక్షిణగా చెల్లించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై నమోదు చేసిన నాలుగు వేర్వేరు కేసుల్లో వాదనలు వినిపించినందుకు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.86 కోట్లను ఫీజు రూపంలో చెల్లించింది. ఇందులో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులోనే ఆయనకు ఏకంగా రూ.1.25 కోట్లు చెల్లించింది. ఇందులో ఒక్క రోజు హాజరై వాదనలు వినిపించినందుకు రూ.75 లక్షలు చెల్లించారు. ఇదే కేసులో పలు తేదీల్లో హాజరై వాదనలు వినిపించినందుకు మరో రూ.50 లక్షలను ఫీజుల రూపంలో లూథ్రాకు చెల్లించారు. అలాగే తాడేపల్లి, కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి నమోదైన కేసులో వాదనలు వినిపించినందుకు ఆయనకు రూ.60 లక్షలు ఇచ్చారు. రఘురామకృష్ణంరాజు కేసులో చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో వాదించినందుకు లూథ్రాకు రూ.65 లక్షలు చెల్లించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వాదనలు వినిపించినందుకు రూ.10 లక్షలు చెల్లించారు. ఇలా మొత్తం 2.60 కోట్లు చెల్లించారు. దీనికి క్లర్కేజ్‌ (క్లర్కుకు చెల్లించాలంటూ) 10 శాతం అదనంగా అంటే రూ.26 లక్షలు కలిపి మొత్తం రూ.2.86 కోట్లు చెల్లించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. నామమాత్రంగా వాదనలు వినిపించి, వాయిదాలు కోరిన కేసుల్లోనూ ఆయనకు లక్షల్లో ఫీజులు చెల్లించడం విశేషం. లూథ్రా క్లర్కు సంపాదించిన రూ.26 లక్షలను ఇంత తక్కువ సమయంలో సంపాదించడం హైకోర్టులో 90% మంది న్యాయవాదులకు దుర్లభమైన పని.కేసు చిన్నదైనా, పెద్దదైనా.. ఆయనకే సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అయిన సిద్దార్థ లూథ్రా దాదాపు దశాబ్ద కాలంగా చంద్రబాబుకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నా­రు. సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టు.. ఇలా ఎక్కడైనా చంద్రబాబుకు కష్టం వస్తే అక్కడ లూథ్రా ప్రత్యక్షమవుతారు. చిన్న కేసయినా, పెద్ద కేసయినా లూథ్రాకే ఇచ్చేవారు. ఇందుకు అనుగుణంగానే చంద్రబాబు, టీడీ­పీపై లూథ్రా ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయినప్పుడు లూథ్రానే రంగంలోకి దిగారు. బాబు తరఫున రోజుల తరబడి వాదనలు వినిపించారు. స్కిల్‌ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై పక్కా ఆధారాలుండటంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. ఆయన వాదన ఏసీబీ కోర్టు ముందు నిలవలేదు. తర్వాత హైకోర్టులో ఆయన వాదన చెల్లలేదు. తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడా చంద్రబాబు తరఫున లూథ్రానే కీలక పాత్ర పోషించారు. అక్కడా చంద్రబాబు విజయం సాధించలేకపోయారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లూథ్రానే బయట ఉండి మొత్తం వ్యూహరచన చేశారు. ఇందుకు ఆయనకు కోట్ల రూపాయల మేర ఫీజులు చెల్లించారన్న విషయం అందరికీ తెలిసిందే.

Rasi Phalalu: Daily Horoscope On 29-03-2025 In Telugu8
ఈ రాశి వారు కొత్త పనులు చేపడతారు.. బంధువుల కలయిక

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: అమావాస్య సా.5.04 వరకు, తదుపరి చైత్ర శుద్ధ పాడ్యమి, నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.8.21 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ఉ.6.49 నుండి 8.17 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.26 నుండి 7.37 వరకు, అమృతఘడియలు: ప.3.48 నుండి 5.16 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.01, సూర్యాస్తమయం: 6.08.మేషం: పనులు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శనం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.వృషభం: కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.మిథునం: పరిచయాలు పెరుగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.కర్కాటకం: వ్యయప్రయాసలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ధనవ్యయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.సింహం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.తుల: కొత్త వ్యక్తుల పరిచయం. ఆహ్వానాలు రాగలవు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.వృశ్చికం: రుణఒత్తిడులు. ఇంటాబయటా సమస్యలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప మార్పులు.ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.మకరం: ఆహ్వానాలు అందుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.కుంభం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.మీనం: కొత్త పనులు చేపడతారు. బంధువుల కలయిక. విందువినోదాలు. ప్రయత్నాలు అనుకూలం. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

Digital Media Overtook TV By 17percent Growth9
టీవీని దాటేసిన డిజిటల్‌ మీడియా

న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటల్‌ మీడియా జోరుగా వృద్ధి చెందుతోంది. 2024లో సాంప్రదాయ టీవీ మాధ్యమాన్ని కూడా దాటేసి మీడియా, వినోద రంగంలో (ఎంఅండ్‌ఈ) అతి పెద్ద సెగ్మెంట్‌గా ఆవిర్భవించింది. మొత్తం ఆదాయాల్లో 32 శాతం వాటాను దక్కించుకుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–ఈవై నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2026లో ప్రకటనలపై ఆదాయాలపరంగా రూ. 1 లక్ష కోట్ల మార్కును అధిగమించే తొలి ఎంఅండ్‌ఈ విభాగంగా డిజిటల్‌ మీడియా నిలవనుంది. దేశీ ఎంఅండ్‌ఈ రంగం వచ్చే మూడేళ్లలో 7 శాతం వృద్ధితో రూ. 3 లక్షల కోట్ల స్థాయిని దాటుతుందని నివేదిక వివరించింది. 2024లో దేశీ ఎంఅండ్‌ఈ రంగం రూ. 2.5 లక్షల కోట్ల స్థాయికి చేరుకోగా, స్థూల దేశీయోత్పత్తిలో 0.73 శాతం వాటాను దక్కించుకుంది. ‘ఈ పరిశ్రమ 2025లో 7.2 శాతం వృద్ధి చెంది రూ. 2.7 లక్షల కోట్లకు, ఆ తర్వాత 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2027 నాటికి రూ. 3.1 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుంది‘ అని నివేదిక వివరించింది. వినూత్న వ్యాపార విధానాల దన్ను.. ఈ భారీ వృద్ధికి వినూత్న వ్యాపార విధానాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పరిశ్రమలో స్థిరీకరణ తదితర అంశాలు తోడ్పడనున్నాయి. దేశీ ఎంఅండ్‌ఈ రంగం 2023లో 8.3 శాతం పెరగ్గా గతేడాది 3.3 శాతం (సుమారు రూ. 8,100 కోట్లు) వృద్ధి చెందింది. సబ్‌్రస్కిప్షన్‌ ఆదాయాలు తగ్గడం, భారత్‌కి యానిమేషన్‌.. వీఎఫ్‌ఎక్స్‌ ఔట్‌సోర్సింగ్‌ వర్క్‌ తగ్గిపోవడం వంటి అంశాలు ఇందుకు కారణం. మరోవైపు, ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లు సహా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లపై ప్రకటనలు, ప్రీమియం.. డిజిటల్‌ అవుటాఫ్‌ హోమ్‌ (ఓఓహెచ్‌) మీడియాకు డిమాండ్‌ పెరగడంతో పరిశ్రమ అడ్వరై్టజింగ్‌ ఆదాయాలు 8.1 శాతం పెరిగాయి. డిజిటల్‌ మీడియా (17 శాతం) లైవ్‌ ఈవెంట్లు (15 శాతం), ఓఓహెచ్‌ మీడియా (10 శాతం) ఈ వృద్ధికి దోహదపడ్డాయి. డిజిటల్‌ వినియోగం వేగవంతమవుతుండటం, వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతుండటం తదితర అంశాల నేపథ్యంలో భారతీయ మీడియా, వినోద రంగం కీలక పరివర్తన దశలో ఉందని ఫిక్కీ చైర్మన్‌ (మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కమిటీ) కెవిన్‌ వాజ్‌ చెప్పారు. దీనితో కంటెంట్‌ క్రియేటర్లు, ప్రకటనకర్తలు, టెక్నాలజీ ఆవిష్కర్తలకు అపార అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు.

Local body by elections postponed again due to TDP leaders activities10
అదే దౌర్జన్యం.. అడుగడుగునా బెదిరింపుల పర్వం

సాక్షి, పుట్టపర్తి/సాక్షి, భీమవరం/నరసరావుపేట రూరల్‌/కారంపూడి/ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార కూటమి నేతలు బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డగింతలను నమ్ముకునే ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు, హెచ్చరి­కలు, గొడవల కారణంగా గురువారం ఏడు చోట్ల వాయిదా పడిన ఎన్నికలు... శుక్రవారం కూడా వాయిదా పడ్డాయి. అధికార పార్టీ నేతల నిర్వాకంతో ఉమ్మడి అనంతపురం జిల్లా గాండ్లపెంట, రామగిరి, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి, యలమంచిలిలో ఎంపీపీ, పల్నాడు జిల్లా నరసరావుపేట, కారంపూడిలో వైస్‌ ఎంపీపీ, వైఎస్సార్‌ జిల్లా గోపవరంలో ఉప సర్పంచ్‌ పదవులకు శుక్రవారం ఎన్నిక నిర్వహించలేకపో­యారు.గురువారం రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 40 స్థానాల్లో (ఒక రెబల్‌తో కలిపి) తన హవాను చాటుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిదా పడిన ఏడు చోట్ల శుక్రవారం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు ఎన్నిక నిర్వహించే కార్యాలయం వద్దకు రాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీ­సులు ఇందుకు వారికి సహకరించారు. వాస్తవానికి కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే తిరిగి నిర్వహిస్తున్న నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టంగా ఎన్నికలు సాగాల్సి ఉంది. అయితే ఈ స్థానాలు కూడా వైఎస్సార్‌సీపీ వశమైతే ప్రజల్లో కూటమి పట్ల వ్యతి­రేకత మరింత ప్రబలుతుందని అధికార పార్టీ పెద్దలు బెంబేలెత్తిపోయారు. అడ్డుకో­వా­లంటూ స్థానిక నేతలకు కనుసైగ చేశారు. దీంతో శుక్రవారం కూడా ఉప ఎన్నికలు నిర్వహించలేకపోయారు. టీడీపీ నేతల దౌర్జన్యకాండ..టీడీపీ నేతల దాష్టీకంతో శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలు తిరిగి వాయిదా పడ్డాయి. నిర్ణీత సమయంలోగా మూడింట రెండు వంతుల సభ్యులు హాజరు కాకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలంలో ఏడుగురు సభ్యులకు గాను ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. రామగిరిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు రెండు రోజులుగా టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రక­టిం­చారు. దీంతో రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికా­రులు ప్రకటించారు. ఎన్నిక సజావుగా జరిగితే వైఎస్సార్‌సీపీకి ఎంపీపీ పదవులు దక్కుతా­యని భావించి గాండ్లపెంటలో టీడీపీ కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, రామగిరిలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తన­యుడు శ్రీరామ్‌ ఎన్నిక జరగకుండా గురువా­రం ఆటంకాలు సృష్టించిన విషయం తెలిసిందే.ఉప ఎన్నికల వాయిదా.. ఎంపీపీ: 4 వైస్‌ ఎంపీపీ: 2 ఉప సర్పంచ్‌: 1 మొత్తం: 7 పశ్చిమలో కూటమి అధికార మదంపశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఏకపక్షం కావాల్సిన అత్తిలి, యలమంచిలి ఎంపీపీ ఎన్నికలను రెండో రోజైన శుక్రవారం కూడా కూటమి నేతలు తమ అధికార మదాన్ని చూపించి అడ్డుకున్నారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు, అత్తిలిలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెరవెనుక నుంచి తంతు నడిపించారు. సమావేశం ఉందని చెప్పి మండలంలోని ఉపాధి హామీ పథకం కూలీలు, డ్వాక్రా మహిళలను అత్తిలికి తరలించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంటి వద్ద మహిళలను మోహరించారు. ఒక్కొక్కరికి రూ.500 నగదు, బిర్యానీ ప్యాకెట్‌ ఇస్తామని చెప్పి ఉంచారు. కొందరు టీడీపీ కార్యకర్తలు కారుమూరి నివాసం చుట్టూ మోటారు సైకిళ్లపై హల్‌చల్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను కవ్వించే ప్రయత్నాలు చేశారు. 13 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు గురువారం రాత్రి రహస్య ప్రదేశంలో ఉండిపోయారు. శుక్రవారం ఉదయం మండల పరిషత్‌ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల్లో పాల్గొనా­లని భావించారు. అయితే ఎంత ప్రయ­త్నించినా వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎక్కడున్నదీ తెలియకపోవడంతో ఏ రోడ్డు నుంచైనా వచ్చే­స్తారని ఉదయం నుంచి అత్తిలి గ్రామానికి వచ్చే రోడ్లన్నింటినీ కూటమి నేతలు దిగ్బంధించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామానికి వచ్చే బస్సులు, ఆటోలు, ఇతర అన్ని వాహనాలను తనిఖీ చేసి వైఎస్సార్‌సీపీ సభ్యులు లేరని నిర్ధారించుకున్న తర్వాతే వదిలారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు కూటమి మూకలు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు చేష్టలుడిగి చూడటం గమనార్హం. ఈ నేపథ్యంలో తమ సభ్యులను పోలీసు రక్షణతో ఎన్నికలకు హాజరు పర్చేందుకు మాజీ మంత్రి కారుమూరి పోలీస్‌ అధికారులను ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు.పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల నిర్వాకంపల్నాడు జిల్లా నరసరావు­పేట, కారంపూడి మండల పరిషత్‌ ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక రెండోసారీ వాయిదా పడింది. టీడీపీ నేతల దౌర్జన్యం కారణంగా కోరం లేకపోవడంతో ఈ రెండు చోట్ల ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నరసరావుపేటలో కేవ­లం నలుగురు ఎంపీటీసీ సభ్యులు, కారంపూడిలో ఒకే ఒక్కరు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు రాకుండా టీడీపీ నేతలు ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. దీంతో కోరం లేదన్న విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబుకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించి ఎన్నికను వాయిదా వేశారు. తదుపరి ఎన్నికల తేదీని తర్వాత ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. బలం లేకపోయినా సరికొత్త నాటకంపశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలో ఎన్నిక ప్రారంభానికి ముందే కూటమి నాయ­కులు నాటకీయ పరిణా­మాలకు తెరలేపారు. గుంపర్రు ఎంపీటీసీ సభ్యురాలు కంభాల సత్యశ్రీ కనిపించడం లేదని ఆమె కుమార్తె ఫిర్యాదు చేసిందంటూ పోలీసులు వచ్చి సత్యశ్రీని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కూటమి నాయకులు ఆమె కుమార్తె ద్వారా సత్యశ్రీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. తాను ప్రాణం పోయినా వైఎస్సార్‌సీపీని వీడేది లేదని ఆమె స్పష్టం చేయడంతో పోలీసులు తిరిగి ఆమెను మండల పరిషత్‌ కార్యాలయా­నికి తీసుకు వచ్చి దించడం గమనార్హం.అనంతరం నిర్ణీత సమ­యానికి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికకు వైఎస్సార్‌సీపీ నుంచి 12 మంది, కూటమికి చెందిన నలుగురు సభ్యులు హాజ­రయ్యారు. అటెండెన్స్‌ ప్రక్రియ పూర్త­య్యాక కూటమి సభ్యులు లేచి తమను వైఎస్సార్‌సీపీ సభ్యులు భయభ్రాంతులకు గురి­చే­స్తున్నారని, ఎన్నిక ఏ విధంగా జరిపిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. సంగతి తేల్చాలంటూ ఘర్షణ వాతావరణం, గందరగోళ పరిస్థితులు సృష్టించారు. ఈ నేపథ్యంలో తనకు గుండెల్లో దడగా ఉందంటూ రిటర్నింగ్‌ అధి­కారి ఎం.శ్రీనివాస్‌ బయటకు వెళ్లిపో­యారు. శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నిక నిర్వహించడానికి సరైన వాతావరణం లేనందున వాయిదా వేస్తున్నట్టు ఎంపీడీఓ ఎ.ప్రేమా­న్విత్‌ ప్రకటించారు. తమకు పూర్తి సంఖ్యాబలం ఉండగా కూటమి సభ్యులను భయపెట్టాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నించినా వారు స్పందించలేదు. వాళ్లలో వాళ్లే గొడవ పడుతూ హైడ్రామావైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులపై దౌర్జన్యం, దాడులకు దిగటంతో ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ సభ్యులు హైడ్రామాకు తెర తీశారు. ఎన్నికల కార్యాలయంలో.. పథకం ప్రకారం టీడీపీకి చెందిన 7వ వార్డు సభ్యురాలు కాచన రామలక్షుమ్మ, ఉప సర్పంచ్‌ అభ్యర్థి మండ్ల రమాదేవి వాగ్వాదానికి దిగారు.ఒకరినొకరు ద్వేషించుకున్నారు. వీరు గొడవ పడుతుండగానే 8వ వార్డు సభ్యురాలు గాయత్రి ఎన్నికల అధికారి వద్ద ఉన్న మినిట్స్‌ బుక్‌ను లాక్కొని చించేశారు. ఈ సందర్భంగా 5వ వార్డు సభ్యుడు ఆదినారాయణరెడ్డి కుర్చీలు విసిరేశాడు. టీడీపీ సభ్యులైన వీరంతా కలిసి పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చేశారు. ఇంతలోనే ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి తనకు గుండెపోటు వచ్చిందని కుర్చీలో కూర్చుండిపోయారు. అంబులెన్స్‌ను పిలిపించి ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కాగా, స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకే ఇక్కడ ఈ హైడ్రామా చోటుచేసుకుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement