Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Kharge Rahul Special Parliament Request to Modi on Pahalgam1
ఐక్యత చాటాల్సిన తరుణమిది.. మోదీకి ఖర్గే, రాహుల్‌ లేఖ

న్యూఢిల్లీ: పహల్గాం దాడి నేపథ్యంతో ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. ఇటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వేర్వేరు ఈ ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi)కి లేఖలు రాశారు.2025 ఏప్రిల్ 22న పహల్గాం ఘటన(Pahalgam Incident)లో అమాయక పౌరులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడి జరిగింది. ఈ తరుణంలో ఐక్యత, సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. అందుకే పార్లమెంట్‌ ఉభయ సభలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించండి. తద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే మన సమిష్టి సంకల్పానికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుంది అని ఖర్గే(Kharge) తన లేఖలో ప్రస్తావించారు.Congress President and Leader of the Opposition in the Rajya Sabha Shri Mallikarjun Kharge has written to the PM last night requesting that a special session of both Houses of Parliament be convened at the earliest to demonstrate a collective will to deal with the situation… pic.twitter.com/v3F5unn6I8— Jairam Ramesh (@Jairam_Ramesh) April 29, 2025ఇక తన లేఖలో రాహుల్‌ గాంధీ.. ప్రియమైన ప్రధానిగారూ.. పహల్గాం ఉగ్రదాడితో ప్రతీ భారతీయుడు రగిలిపోతున్నాడు. ఇలాంటి క్లిష్టతరుణంలో ఉగ్రవాదానికి మనమెంత వ్యతిరేకమో చాటిచెప్పాల్సిన అవసరం ఉంది. ఐక్యత ప్రదర్శించాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. అది పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల మాత్రమే సాధ్యపడుతుందని ప్రతిపక్షంగా మేం భావిస్తున్నాం. ఇక్కడే ప్రజాప్రతినిధులు తమ ఐక్యతను, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించగలరు. కాబట్టి వీలైనంత త్వరగా సమావేశం నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అని రాహుల్‌ గాంధీ(Rahul gandhi) రాశారు. My letter to PM Modi requesting a special session of both houses of Parliament to be convened at the earliest. At this critical time, India must show that we always stand together against terrorism. pic.twitter.com/7AIXGqBqTl— Rahul Gandhi (@RahulGandhi) April 29, 2025ఇదిలా ఉంటే.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీల మధ్య రెండు దఫాలుగా జరిగాయి. ఇక తరువాత జులైలో వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో ప్రతిపక్ష విజ్ఞప్తికి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.పహల్గాం దాడి తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో.. విపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

YS Jagan Wishing speedy recovery For KTR2
బ్రదర్‌ కేటీఆర్‌.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) త్వరగా కోలుకోవాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. బ్రదర్‌ కేటీఆర్‌.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. ఇక, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు ఆయనకు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో రికవరీ అవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పలువురు నేతలు, అభిమానులు కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.Wishing you a speedy recovery, brother. Get well soon! @KTRBRS— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2025 Picked up a slip disc injury during a gym workout session. Have been advised a few days of bed rest and recovery by my doctorsHope to be back on my feet soon— KTR (@KTRBRS) April 28, 2025

Security concerns 48 Resorts And Tourist Sites Shut Down In Kashmir3
కశ్మీర్‌లో స్లీపర్‌సెల్స్‌ యాక్టివ్‌.. ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం దాడి ఘటనతో అక్కడ భారత ఆర్మీ హైఅలర్ట్‌లో ఉంది. మరోవైపు.. కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 48 టూరిస్టు కేంద్రాలను జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం మూసివేసింది.వివరాల ప్రకారం.. పహల్గాం దాడి అనంతరం కశ్మీర​్‌ లోయలో స్లీపర్‌సెల్స్‌ యాక్టివేట్‌ అయినట్లు నిఘావర్గాలు తెలిపాయి. దీంతో, కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. అనంతరం, కశ్మీర్‌లో ఉన్న 48 టూరిస్టు కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది. కశ్మీర్‌ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 టూరిస్టు కేంద్రాల్లో వీటిని మూసివేస్తున్నట్లు పేర్కొన్న అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకులను పాశవికంగా హతమార్చిన ఘటనపై చర్చించేందుకు జమ్ముకశ్మీర్‌ శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఉగ్రదాడి మృతులకు సంతాపసూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించింది. పాశవికదాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది.దానికి ముందు సీఎం ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ..‘బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్‌ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు.

Kutami Revenge Another Case against PSR Anjaneyulu4
రెడ్‌బుక్‌ ఎఫెక్ట్‌: పీఎస్ఆర్ ఆంజనేయులిపై మరో కేసు

విజయవాడ, సాక్షి: వైఎస్సార్‌సీపీ హయాంలో పని చేసిన అధికారులపై కూటమి సర్కార్‌ రెడ్‌బుక్‌ ప్రయోగం మామూలుగా జరగడం లేదు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముంబై నటి జత్వానీ కేసులో ఆయనకు బెయిల్‌ లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో.. ఆయన బయటకు రాకుండా ఉండేందుకు మరో కేసు నమోదు చేయించింది. గతంలో.. ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్న సమయంలో గ్రూప్ 1 పరీక్షలలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కొత్త అభియోగాలను తెరపైకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో విజయవాడ సూర్యారావు పేట పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదు అయ్యింది. సీఎస్‌తో ఆదేశాలు జారీ చేయించి మరీ విచారణ జరిపిస్తోంది. ఆంజనేయులిపై కూటమి కుట్రలను వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి ఖండిస్తోంది. తమ హయాంలో పని చేసిన అధికారులను లక్ష్యంగా చేసుకుని.. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ మరీ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ఇతర నేతలు ఖండిస్తూ వస్తున్నారు. ఇదీ చదవండి: ఫేక్‌న్యూస్‌ ఫ్యాక్టరీలతో చంద్రబాబు చేస్తోంది ఇదే!

IPL 2025, RR VS GT: Yashasvi Jaiswal Becomes Fifth Fastest To Score 2000 Runs In IPL5
RR VS GT: ఓ పక్క వైభవ్‌ విధ్వంసకాండ కొనసాగుతుండగా, జైస్వాల్‌ రికార్డుల్లోకెక్కాడు

ఐపీఎల్‌ 2025లో నిన్న (ఏప్రిల్‌ 28) గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ విధ్వంసకాండ ఓ పక్క కొనసాగుతుండగానే రాయల్స్‌ మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ రికార్డుల్లోకెక్కాడు.ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసిన జైస్వాల్‌.. రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చడంతో పాటు ఆ జట్టు తరఫున 2000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా, ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఐదో బ్యాటర్‌గా, రాజస్థాన్‌ తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్‌ అరంగేట్రం నుంచి (2020) రాజస్థాన్‌ రాయల్స్‌కే ఆడుతున్న జైస్వాల్‌.. 62 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీల సాయంతో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు ముందు రాయల్స్‌ తరఫున సంజూ శాంసన్‌ (3966), జోస్‌ బట్లర్‌ (3055), అజింక్య రహానే (2810), షేన్‌ వాట్సన్‌ (2372) 2000 పరుగులు పూర్తి చేశారు.ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లుక్రిస్‌ గేల్‌- 48 ఇన్నింగ్స్‌ల్లోషాన్‌ మార్ష్‌- 52రుతురాజ్‌ గైక్వాడ్‌- 57కేఎల్‌ రాహుల్‌- 60యశస్వి జైస్వాల్‌- 62మ్యాచ్‌ విషయానికొస్తే.. గుజరాత్‌ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్‌ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) సునామీ శతకంతో విరుచుకుపడటంతో రాయల్స్‌ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓ పక్క వైభవ్‌ విధ్వంసకాండ కొనసాగుతుండగానే జైస్వాల్‌ తన సహజ శైలిలో చెలరేగుతూ రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రియాన్‌ పరాగ్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.అంతకుముందు శుభ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో​ 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు‌), సాయి సుదర్శన్‌ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్‌) సత్తా చాటడంతో గుజరాత్‌ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

Nawaz Sharif Warns Pakistan PM Shehbaz Sharif Over India6
భారత్‌తో జాగ్రత్త.. పాక్‌ ప్రధానికి నవాజ్‌ షరీఫ్‌ హెచ్చరిక

లాహోర్‌: పహల్గాం అమానవీయ ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల సమసిపోవాలంటే దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని తమ్ముడు, పాక్‌ ప్రధాని షెహబాజ్‌కు నవాజ్‌ సలహా ఇచ్చారు.పాకిస్తాన్‌ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. లాహోర్‌లో నవాజ్‌ షరీఫ్‌తో షహబాజ్‌ ఆదివారం భేటీ అయ్యారు. పహల్గాం దాడి తర్వాత భారత్‌ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తన ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. సింధూ నదీజలాల ఒప్పందం నుంచి భారత్‌ వైదొలిగిన విషయాలను వెల్లడించారు. భారత్‌ తీరు వల్లే ఉద్రిక్తతలు పెరిగాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవాజ్‌ షరీఫ్‌ స్పందించి.. దూకుడుగా వ్యవహరించకుండా, భారత్‌తో శాంతి పునరుద్ధరణ కోసం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని తన తమ్ముడికి సూచించినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. షరీఫ్‌ కుమార్తె, పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి మర్యమ్‌ సైతం ఇంతవరకు ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ విషయంలో భారత్‌ కఠిన చర్యలు తీసుకుంది. దీనిపై దాయాది దేశం అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ పరిణామాల నడుమ పాకిస్తాన్‌(Pakistan) రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్‌ ఆసిఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్‌ ప్రతీకార దాడి చేపడుతుందని, త్వరలోనే ఇది జరిగే అవకాశం ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతీకార దాడి జరగనున్న విషయం కాబట్టి.. మా బలగాలను అప్రమత్తం చేశాం. దాడుల జరిగే పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ మేరకు చర్యలు తీసుకున్నామని అన్నారు. అయితే, తన అంచనాలకు దారి తీసిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. భారత్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని తెలిపారు. ఈ విషయమై పాక్‌ అత్యంత అప్రమత్తంగా ఉందని, తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఉందని భావిస్తే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పేర్కొన్నారు.

Director Sampath Nandi TO Big Chance To Dimple Hayathi In Sharwanand Movie7
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌

చిత్రపరిశ్రమలో రాణించాలంటే హిట్లు తప్పనిసరి.. అలా అయితేనే ఇక్కడ నిలదొక్కుకుంటారు. ముఖ్యంగా ఈ రూల్‌ హీరోయిన్లకు ఎక్కువగా వర్తిస్తుంది. ఫ్లాప్‌ ఇచ్చిన హీరోయిన్స్‌కు మళ్లీ అవకాశాలు రావడం కాస్త కష్టమే.. ఒకట్రెండు హిట్లు కొట్టి ఆ తర్వాత ప్లాపులు రావడంతో చాలామంది హీరోయిన్స్‌ కనిపించకుండా పోయారు. అయితే, ఆ జాబితాలోకి డింపుల్ హయతి(Dimple Hayathi) కూడా చేరిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్‌ తలుపుతట్టింది. మళ్లీ తన గ్లామర్‌తో ప్రేక్షకులకు దగ్గర కానుంది. ఈ ప్రాజెక్ట్‌ హిట్‌ అయితే, మళ్లీ పలు సినిమాల్లో తప్పకుండా అవకాశాలు రావచ్చని చెప్పవచ్చు.హీరో శర్వానంద్‌(Sharwanand) కెరీర్‌లో తొలి పాన్‌ ఇండియా సినిమాకు అంతా సిద్ధమైంది. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా సంపత్‌నంది దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఈ మూవీ ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మరో కీలకమైన పాత్ర కోసం డింపుల్‌ హయాతిని దర్శకుడు సంపత్‌నంది ఎంపిక చేశారు. 2022, 2023లో (ఖిలాడీ, రామబాణం) వరుసగా ఫ్లాపులిచ్చిన డింపుల్ హయతికి మళ్లీ ఛాన్సులు దక్కలేదు. ఈ గ్యాప్‌లో రోజూ జిమ్‌కు వెళ్లి తన గ్లామర్‌ను కాపాడుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ మరింత స్లిమ్‌గా అయింది. రెగ్యూలర్‌గా తన గ్లామర్‌ ఫోటోలను సోషల్‌మీడియాలో విడుదల చేస్తూ ఎప్పుడూ ప్రేక్షకులతో టచ్‌లో ఉంటూ వచ్చింది. అలా ఇప్పడు ఛాన్సులు దక్కించుకుంది.1960లో ఉత్తర తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని మేకర్స్‌ ప్రకటించారు. షూటింగ్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తామని ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. View this post on Instagram A post shared by Dimple 🌟 (@dimplehayathi)

Deputy Collector Audio Causing Uproar: Andhra pradesh8
డిప్యూటీ కలెక్టర్‌ని.. టీడీపీ కోసం ఎంతో చేశా

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘నేను టీడీపీ సానుభూతిపరుడిని.. పార్టీ కోసం ఎంతో పనిచేశా. అయినా భూ వివాదంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పీఆర్వో మధు బెదిరించారు. అధికారిలా కాదు.. కనీసం మనిషిలా కూడా చూడలేదు’ అంటూ ఓ డిప్యూటీ కలెక్టర్‌ వాపోయాడు. ఈమేరకు ఓ ఆడియో కలకలం సృష్టిస్తోంది. సదరు డిప్యూటీ కలెక్టర్‌ గతంలో తాడికొండ ఎమ్మార్వోగా, కలెక్టర్‌ కార్యాలయంలో ఏవోగా పనిచేశారు.ప్రస్తుతం సెక్రటేరియేట్‌లో పని చేస్తున్నారు. ఆయన సమీప బంధువు విడాకులు తీసుకోవడంతో వారికి సంబంధించిన భూమిపై వివాదం నెలకొన్నట్లు తెలిసింది. చేబ్రోలు మండలంలోని సుమారు రూ.5 కోట్ల విలువ చేసే ఈ భూమి తనకు చెందేలా చూడాలని ఒక మహిళ.. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిని ఆశ్రయించినట్లు సమాచారం. ఆయన ఆదేశాల మేరకు పీఆర్వో మధు సదరు డిప్యూటీ కలెక్టర్‌ను పెమ్మసాని కార్యాలయానికి పిలిపించుకున్నట్లు తెలిసింది. అక్కడ మధు మరో న్యాయవాదితో కలిసి తనను బెదిరించారంటూ డిప్యూటీ కలెక్టర్‌ ఓ వ్యక్తితో ఫోన్‌లో వాపోయారు. మినిస్టరే డీల్‌ చేయమన్నారంటూ బెదిరించారు! ‘నేను ఐదేళ్లు తాడికొండ ఎమ్మార్వోగా, రెండేళ్లు పెదకాకాని, ఒకటిన్నరేళ్లు వినుకొండ ఎమ్మార్వోగా పనిచేశా. తాడికొండలో ఉన్న టీడీపీ యంత్రాంగం మొత్తానికి నేను తెలుసు. టీడీపీకి ఎంత సేవ చేశానో అందరికీ తెలుసక్కడ. నేను డిప్యూటీ కలెక్టర్‌ కాకపోయి ఉంటే.. టీడీపీ నాయకులు నన్ను ఎమ్మార్వోగా అక్కడికి తీసుకెళ్లి ఉండేవారు. శ్రావణ్‌కుమార్‌ నా గురించి చెబుతారు. జీవీ ఆంజనేయులు నరసరావుపేట ఆర్డీవోగా నన్ను వేయాలని ఎన్నో సార్లు లోకేశ్‌ను అడిగారు. నన్ను ఎక్కడా.. ఎవరూ అగౌరవపరచలేదు. కానీ మధు(పెమ్మసాని పీఆర్వో) చాంబర్‌లో కూర్చోబెట్టి వ్యంగ్యంగా మాట్లాడారు. మినిస్టర్‌గారు ఉంటే ఇలా ఉండేది కాదన్నాను నేను. కానీ మినిస్టరే డీల్‌ చేయమన్నారంటూ పదేపదే బెదిరించారు. దీంతో నేను ఆ వారమంతా మెంటల్‌గా డిస్టర్బ్‌ అయ్యాను.నా హోదాకు గౌరవం ఇవ్వకపోగా.. కనీసం మనిషిలా కూడా చూడలేదు’ అంటూ డిప్యూటీ కలెక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ ఘటన జరిగి చాలా రోజులయ్యింది. కానీ డిప్యూటీ కలెక్టర్‌ ఆడియో తాజాగా వైరల్‌ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. కేంద్ర సహాయ మంత్రికి తెలియకుండా ఒక చిరుద్యోగి.. డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి వ్యక్తిని బెదిరించే అవకాశం లేదని.. అంతా ఆయనకు తెలిసే జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఆడియో టేపు కలకలం సృష్టించడంతో.. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు పలువురు రంగంలోకి దిగారు. పెమ్మసానికి తెలియకుండా జరిగి ఉంటుందని.. ఆయన సోదరుడు మీతో మాట్లాడతారని.. ఈ విషయాలను మరెక్కడా బయటపెట్టవద్దని డిప్యూటీ కలెక్టర్‌ను కోరారు. ఆడియోలోని వాయిస్‌ తనది కాదని చెప్పాలంటూ డిప్యూటీ కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

India alone App Store ecosystem facilitated Rs 44447 crore in 20249
యాప్‌ స్టోర్‌.. ఏడాదిలో రూ.44 వేల కోట్ల విక్రయాలు

టెక్‌ దిగ్గజం యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా గతేడాది రూ.44,447 కోట్ల విలువ చేసే డెవలపర్ల బిల్లింగులు, విక్రయాలు (ఉత్పత్తులు, సేవలు) నమోదయ్యాయి. యాపిల్‌కి కమీషన్లులాంటివి లేకుండా ఇందులో 94 శాతం భాగం నేరుగా డెవలపర్లు, వ్యాపార సంస్థలకే లభించింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (అహ్మదాబాద్‌)కి చెందిన ప్రొఫెసర్‌ విశ్వనాథ్‌ పింగళి నిర్వహించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.నివేదికలోని అంశాల ప్రకారం గత అయిదేళ్లలో భారతీయ డెవలపర్లకు అంతర్జాతీయంగా వచ్చే ఆదాయాలు రెట్టింపయ్యాయి. ఫుడ్‌ డెలివరీ, ట్రావెల్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర రంగాలకు చెందిన యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. గతేడాది భారతీయ డెవలపర్ల ఆదాయాల్లో దాదాపు 80 శాతం వాటా ఇతర దేశాల్లోని యూజర్ల నుంచే వచ్చింది. ఏడాది పొడవున యాప్‌ స్టోర్‌ నుంచి 75.5 కోట్ల సార్లు మన డెవలపర్ల యాప్‌లను యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.ఇదీ చదవండి: వ్యాపార ‘పద్మా’లు..భారతదేశంలోని డెవలపర్ల సృజనాత్మకత, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో యాప్ స్టోర్ కీలక పాత్ర పోషిస్తుంది. యాపిల్ వ్యాపార నమూనాలో ‘ఫ్రీ’మియం(ఉచితం) యాప్‌లు, పెయిడ్ యాప్‌లు, ఇన్-యాప్ పర్చేజ్‌లు లేదా సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన యాప్‌లు వంటి వివిధ మానిటైజేషన్ విధానాలు ఉన్నాయి. ఇది డెవలపర్లను వారి లక్ష్యాలకు అనుగుణంగా టార్గెటెడ్‌ ఆడియన్స్‌ను ఎంచుకునేందుకు వీలు కల్పిస్తుంది.

When Broken Bones Dont Set Properly Diagnosing NonHealing Fractures10
Bone Fractures: కట్టుకట్టినా సెట్టవ్వలేదా..?

అది రోడ్డు ప్రమాదాలు గానీ, ఇంట్లో ఎత్తు నుంచి పడిపోవడంగానీ బాత్‌రూమ్‌లో జారిపడటం గానీ జరిగినప్పుడు మొదట అందరూ అడిగేది... ఎవరివైనా ఎముకలు విరిగాయా అని. ఇంగ్లిష్‌లో ఫ్రాక్చర్‌ అని పిలిచే ఈ ఎముకలు విరిగినప్పుడు ఆపరేషన్‌తో విరిగిన ఎముకల్ని దగ్గర చేయడం, ప్లేట్స్‌ వేయడం, సిమెంట్‌ కట్టు వేసి అతికించడానికి ప్రయత్నించడం వంటి వైద్య ప్రక్రియల్ని అనుసరిస్తూ ఉంటారు. విరిగిన ఎముకల్ని దగ్గరగా వచ్చేలా సెట్‌ చేసినప్పుడు చాలామందిలో సరిగ్గా అతుక్కునే ఎముకలు కొందరిలో అంతగా సెట్‌ కాకపోవచ్చు. దాంతో ఎముకలు సరిగా సెట్‌ కాలేదనీ, అతుక్కోలేదనీ కొందరు ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి కేసులనే ఫెయిల్యూర్‌ ఆర్థోపెడిక్స్‌ అని సాధారణ ప్రజలు చెబుతున్నప్పటికీ... వాస్తవానికి ఇలా సరిగా సెట్‌ కాని సందర్భాల్లో దీన్ని ‘నాన్‌ యూనియన్‌ ఆఫ్‌ ఫ్రాక్చర్‌’గా చెబుతున్నారు. ఇలా సరిగా అతకనప్పుడు ఎముకలు ఉన్న సదరు అవయవం సరిగా పనిచేయకపోవడం, నొప్పి రావడంతో పాటు కొన్నిసార్లు ఆ కండిషన్‌ ప్రాణాంతకం కావడం అనే ముప్పు కూడా రావచ్చు. ఇలా ఎముకలు సరిగా అతకని సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన చికిత్సల వంటి పలు అంశాల గురించి తెలుసుకుందాం. వాటంతట అవే అతుక్కునే ఎముకలు...విరిగిన ఎముక సరిగా అతకకపోవడం జరిగినప్పుడు అందుకు కారణాలూ, అందులో ఇన్‌వాల్వ్‌ అయిన అంశాలూ ఎన్నో ఉండవచ్చు. ఉదాహరణకు ఒక ఎముక రెండుగా విరిగినప్పుడు దాన్ని సరిగా కూర్చలేకపోతే (సెట్‌ చేయలేకపోతే) ఆ కండిషన్‌ను ‘ఇన్‌సఫిషియెంట్‌ రిడక్షన్‌’ అంటారు. అలాంటి పరిస్థితుల్లో విరిగిన ఎముక చక్కగా అతకదు. ఫలితంగా పూర్తిగా, సరిగా నయం కాదు. ఆ పరిస్థితినే ‘నాన్‌యూనియన్‌’ అంటారు.ఏదైనా ఎముక విరిగినప్పుడు వాటిని సరిగా అమర్చి పెట్టి అలా కాలానికి వదిలేస్తే అవి వాటంతట అవే కుదురుకుని చక్కగా అతుక్కునే శక్తిని ప్రకృతి ఎముకకు ఇచ్చింది. అందుకే విరిగిన ఎముకను సరిగా సెట్‌ చేసి (అమర్చి) అలా వదిలేస్తే కాలం గడిచే కొద్దీ ఎముక దానంతట అదే నయమవుతుంది. ఇందుకు కావల్సినదల్లా ఆ విరిగిన ఆ ఎముక ముక్కల్ని సరిగా కూర్చడం / పేర్చడంలో నైపుణ్యమే. అయితే కొన్ని సందర్భాల్లో కాస్తంత ప్రత్యేక శ్రద్ధ, కొద్దిపాటి చికిత్స మాత్రం అవసరమవుతాయి. అందుకే చాలా సందర్భాల్లో అత్యంత నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స జరగకపోయినా ఎముకలు కుదురుకుంటాయి. ఎముకకు ఉన్న ఈ గుణం మూలానే కొన్నిచోట్ల సంప్రదాయ వైద్యం పేరిట ఎముకలను సెట్‌ చేసేవారూ ఎముకల్ని అతకగలుగుతుంటారు. తనంతట తానే అతుక్కునే సామర్థ్యం ఎముకకు ఉన్నప్పటికీ నిపుణులైన వైద్యుల అవసరం ఎందుకు అవసరమంటే... విరిగిన ఎముకలకు కట్టు కట్టి పూర్తిగా సెట్‌ అయ్యేందుకు వదలాలంటే విరిగిన ప్రదేశంలో అవి సరిగా అమరేటట్లుగా ఉంచడమన్నది చాలా ప్రధానం. ఇది సరిగా జరగక΄ోతే విరిగిన ఎముక సరిగా (ఖచ్చితంగా) అతుక్కోకపోవచ్చు లేదా నయం కావడమన్నది చాలా ఆలస్యంగా జరగవచ్చు. ఇలా ఎముక అతుక్కోవడంలో జాప్యం జరిగితే దాన్ని ‘డిలేయ్‌డ్‌ యూనియన్‌’ అంటారు. ఈ పరిస్థితిని కొందరు ఎదుర్కొంటారు. ఇక కొందరిలో ఎముక సరిగా అతకనే అతకదు. ఈ పరిస్థితిని ‘నాన్‌ యూనియన్‌’ అంటారు.డిలేయ్‌డ్‌ యూనియన్‌ / నాన్‌ యూనియన్‌కు కారణాలుఎముక విరిగిన చోట కణజాలం కూడా తీవ్రంగా దెబ్బతినడం. ఎముక విరిగిన చోట మృదు కణజాలానికి కోలుకోలేనంత నష్టం జరగడం. ఎముక సరిగా అతకని ప్రాంతానికి తగినంత రక్తసరఫరా జరగకపోవడం. ఎముక సరిగా అతకని ప్రాంతంలో ఇన్ఫెక్షన్‌ రావడం. విరిగిన ఎముకను తగినంత సేపు కదలకుండా ఉంచక΄ోవడం, స΄ోర్టు తగినంతగా లభించక΄ోవడం (ఇన్‌సఫిషియెంట్‌ స్ప్లింటేజ్‌). రెండు ఎముకలు అతుక్కునేలా తగినంత ఒత్తిడి (కంప్రెషన్‌) కలిగించక΄ోవడం (ఒక ఎముక మరో ఎముకపై జారకుండా ఉండేలా... ఒకదానితో మరొకటి సరిగ్గా అమరిపోయేలా లేదా కలిసిపోయేలా ఉపయోగించే గరిష్ఠ ఒత్తిడిని కంప్రెషన్‌ అంటారు). ఎముక అతుక్కోకపోవడానికి కారణాలుఎముక అసలే అతుక్కోక΄ోవడాన్ని నాన్‌యూనియన్‌ అంటారు. సాధారణంగా ఆలస్యంగా అతుక్కోడానికి కారణమయ్యే అంశాలే ఎముక అసలు అతుక్కోక΄ోవడానికీ చాలావరకు కారణం కావచ్చు. దానితోపాటు మరికొన్ని కారణాలూ ఉండవచ్చు. అవేమిటంటే... ∙క్యాలస్‌ బ్రిడ్జ్‌ ఏర్పడకపోవడం : రెండు ఎముకలు అతికించేందుకు దగ్గర చేసినప్పుడు వాటి మధ్య కొంత గ్యాప్‌ రావడం. దీని గురించి ఇంగ్లిష్‌లో చె΄్పాలంటే... టూ లార్జ్‌ స్పేస్‌ ఫర్‌ ఫార్మేషన్‌ ఆఫ్‌ క్యాలస్‌ బ్రిడ్జ్‌గా దీన్ని పేర్కొంటారు... అంటే ఎముక అతుక్కునే ముందర రెండు ముక్కల మధ్య ఒక బ్రిడ్జ్‌లాంటిది ఏర్పడుతుంది. దాన్నే ‘క్యాలస్‌ బ్రిడ్జ్‌’ అంటారు. గ్యాప్‌ రావడం వల్ల అది ఏర్పడదు. ఇంటర్‌΄ పొజిషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌ టిష్యూ : అతుక్కోవాల్సిన రెండు ఎముకల మధ్య మృదుకణజాలం అడ్డుగా రావడం వల్ల ఎముక అతుక్కోదు. ఇలా జరగడాన్ని ఇంటర్‌పొజిషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌ టిష్యూ గా పేర్కొంటారు. అవసరమైన పరీక్షలు విరిగిన ఎముక సరిగా అతుక్కుందా లేక సరిగా అతుక్కోలేదా లేదా అతుక్కునే ప్రక్రియ ఆలస్యం అవుతోందా అన్న విషయాన్ని నిర్ధారణ చేయడానికి ఎక్స్‌–రే పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్స రహిత విధానాలుఇందులో సర్జరీ లేకుండానే క్యాల్షియమ్‌ సప్లిమెంటేషన్‌ ఇవ్వడం, తొడుగులు వంటి ఉపకరణాలను అమర్చడం వంటి ప్రక్రియలను అవలంబిస్తారు. చికిత్సఎముకలు సరిగా అతుక్కోకపోవడం లేదా ఆలస్యంగా అతుక్కోవడం వంటి సమస్య ఎదురైనప్పుడు అందుకు కారణమైన అంశాలను చూడాల్సి ఉంటుంది. కారణాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఎముక అతుక్కోవడంలో ఆలస్యం జరిగినప్పుడు ఎముక పెరిగేలా బోన్‌గ్రాఫ్ట్‌ వంటి ప్రక్రియలను కూడా అవలంబించాల్సి రావచ్చు. శస్త్రచికిత్సఎముక సరిగా అతకని చోట బాధితులకు అవసరమైన శస్త్రచికిత్సను చేయడం. ఎముకలు అతకని పరిస్థితి నివారణ ఇలా... ఇక ఎముక సరిగా అతకకపోవడం వంటి పరిస్థితిని నివారించడానికి... ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే... ఎముక ఫ్రాక్చర్‌ అయిన వ్యక్తికి పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తప్పనిసరిగా మానేయాలి. డాక్టర్‌ చెప్పిన చికిత్స ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాలి. అన్ని పోషకాలు అందేలా అన్ని ΄ోషకాలు ఉన్న ఆహారాన్ని వేళకు తింటుండాలి. పొగతాగేవారు, స్థూలకాయులు, మధుమేహం (డయాబెటిస్‌) సమస్య ఉన్నవారిలో నాన్‌–యూనియన్‌కు అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉంటూ డాక్టర్‌ చెప్పే అని సూచనలనూ పాటించాల్సి ఉంటుంది.అతుక్కోని భాగాలు ఏవంటే...నిజానికి శరీరంలోని ఏ ఎముక అయినా సరిగా అతుక్కోక΄ోవడానికి ఆస్కారం ఉంది. అయితే మన శరీరంలో కొన్ని ఎముకలు మాత్రం ఒకపట్టాన అతుక్కోకుండా ఇబ్బంది పెడుతుంటాయి. అందుకు పలు అంశాలు కారణమవుతుంటాయి. ఉదాహరణకు మిగతా ఎముకలతో ΄ోలిస్తే ఆ ఎముకలకు రక్తసరఫరా సరిగా ఉండక΄ోవడం వంటివి. అందుకే ఆ ఎముకల విషయంలో తరచూ ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఎముకలు లేదా ఫ్రాక్చర్లు ఏవంటే... లాటెరల్‌ కాండైల్‌ హ్యూమరస్‌ ఫ్రాక్చర్‌: మోచేతిలో బయటవైపు ఉండే ఎముక విరిగితే దాన్ని లాటరల్‌ కాండైల్‌ హ్యూమరస్‌ ఫ్రాక్చర్‌ అంటారు. ఇది సరిగ్గా అతుక్కోవడంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు.ఫీమోరల్‌ నెక్‌ ఫ్రాక్చర్‌: తుంటి ఎముకలో తొడలో ఉండే కాలి ఎముక సరిగ్గా ఓ గిన్నెలాంటి భాగంలో బంతిలా కూర్చుంటుంది. ఈ బంతికీ, మిగతా ఎముకకూ మధ్య ఉండే సన్నటి భాగం (నెక్‌) విరిగినప్పుడు అది అంత త్వరగా సెట్‌ కాకపోవచ్చు. ఫిఫ్త్‌ మెటాటార్సల్‌ (జోన్స్‌ ఫ్రాక్చర్‌)అరికాలిలో ఉండే ఎముకల్లో ఒకటైన ఈ ఎముక ఫ్రాక్చర్‌ అయినప్పుడు అతుక్కోవడం ఒకింత కష్టం కావచ్చు.టాలస్‌ ఫ్రాక్చర్‌చీలమండ ఎముకల మధ్య ఉండే ఎముకకు అయిన ఫ్రాక్చర్‌. స్కేఫాయిడ్‌ ఫ్రాక్చర్‌మణికట్టుపై బరువు పడినప్పుడు అయిన ఫ్రాక్చర్‌లు. సరిగా అతుక్కోకపోవడమన్నది చాలా కొద్దిమందిలోనే... ఫ్రాక్చర్‌ అయినవాళ్లలో కేవలం ఒక శాతం కేసుల్లోనే ఎముక అసలు అతుక్కోక΄ోవడం (నాన్‌–యూనియన్‌) జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితి చాలావరకు కాళ్ల ఎముకల విషయంలోనే ఎక్కువ. ఎందుకంటే కాలి ఎముక విరిగాక మళ్లీ కాళ్లు కదిలించాల్సి వచ్చినప్పుడు తగిలిన చోటే మళ్లీ మళ్లీ దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ కండిషన్‌ పునరావృతమయ్యే అవకాశాలెక్కువ. ఎముక సరిగా అతకకపోయినా (నాన్‌యూనియన్‌లోనైనా) లేదా ఆలస్యంగా అతికినా (డిలేయ్‌డ్‌ యూనియన్‌లో) కనిపించే సాధారణ లక్షణాలివి... ఎముక విరిగిన చోట (ఫ్రాక్చర్‌ ప్రాంతంలో) నొప్పి తగ్గక΄ోవడం లేదా అదేపనిగా నొప్పి వస్తుండటం. ఎముక విరిగిన శరీర భాగాన్ని మునుపటిలా ఉపయోగించలేక΄ోవడం. ఎముక ఫ్రాక్చర్‌ అయిన చోట వాపు (స్వెల్లింగ్‌) రావడం. విరిగిన ఎముకకు సంబంధించిన కీలు (జాయింట్‌)ను కదల్చలేక΄ోవడం. విరిగిన ఎముక సరిగా అతుక్కోక కాస్త అటు ఇటు కదులుతుండటం. విరిగిన ఎముకలు అతుక్కోవడంలో ఎదురయ్యే సమస్యలివి... విరిగిన ఎముక నయమయ్యే సమయంలో ఇతరత్రా అనేక సమస్యలు ఎదురుకావచ్చు. అసలు ఒక ఎముక అతుక్కోనేలేదని ఎప్పుడు చెప్పవచ్చంటే... ∙మూడు నుంచి ఆర్నెల్ల తర్వాత కూడా విరిగిన ఎముక అతుక్కోకుండా ఉంటే దాన్ని ఎముక అతుక్కోవడంలో ఆలస్యం (డిలేయ్‌డ్‌ యూనియన్‌)గా చెప్పవచ్చు. ఒకవేళ ఆర్నెల్ల తర్వాత కూడా అతుక్కోకపోతే దాన్ని ‘నాన్‌యూనియన్‌’గా పేర్కొనవచ్చు. ∙ఒక చోట ఎముక అతకడంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతోందంటే అక్కడ ఎముక అతుక్కోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అర్థం. జాప్యం తీవ్రంగా ఉందంటే దాన్ని కొంతమేర అతకని ఎముక (నాన్‌యూనియన్‌)గానే పరిగణించాల్సి ఉంటుంది. ∙రెండుగా విరిగిన భాగాలు ఒకదానితో ఒకటి అతుక్కుపోయినప్పటికీ అది సరిగా ఖచ్చితమైన రీతిలో కూర్చినట్లుగా అతుక్కోక΄ోతే దాన్ని ‘మాల్‌యూనియన్‌’ అంటారు. సాధారణంగా ఎముక సరిగ్గా రెండు ముక్కలుగా విరిగినప్పుడు దాన్ని సరిగా కూర్చుండబెట్టినప్పుడు సరిగానే అతుక్కుంటుంది. అయితే కొన్నిసార్లు దెబ్బ చాలా బలంగా పడి కొన్ని ఎముక విరిగిన చోట ముక్కలుగా అయి΄ోవడం వల్ల అతికించే ప్రక్రియలో ఖచ్చితంగా కూర్చలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. దాని వల్ల ఎముక నిడివి కాస్త తగ్గవచ్చు. దీన్ని ‘ఇన్‌సఫిషియెంట్‌ రిడక్షన్‌’గా పేర్కొంటారు. పైన వివరించిన పరిస్థితులు ఏవైనప్పటికీ విరిగిన ఎముక సరిగా అతకక΄ోయినా లేదా అతుక్కోవడంలో ఆలస్యం జరిగినా బాధితులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. డాక్టర్‌ బాలవర్థన్‌ రెడ్డిసీనియర్‌ కన్సల్టెంట్‌ఆర్థోపెడిక్‌ సర్జన్‌ (చదవండి: ఎనర్జిటిక్‌ హేమంగి..! న్యూక్లియర్‌ సైన్స్‌లో..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement