Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Pranay Case Final verdict: Nalgonda SC/ST Court Sensational Judgement1
ప్రణయ్‌ కేసులో ఒకరికి ఉరి.. ఆరుగురికి జీవితఖైదు

నల్లగొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్‌(24)ను దారుణంగా చంపిన సుభాష్‌ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది. అమృత వర్షిణి-ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్‌ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్‌ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్‌ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను అంతమొందించాడు.👉ఆరేళ్లకు పైగా ప్రణయ్‌ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్‌ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.👉2018లో ప్రణయ్‌- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్‌ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు. 👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్‌(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది. 👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది. 👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్‌), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్‌ ఓనర్‌)గా ఉన్నారు. 👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్‌ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్‌ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్‌ చేసింది.👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు👉నిందితుల్లో అస్ఘర్‌ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్‌ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్‌ హత్య స్కెచ్‌ను అస్ఘర్‌ అమలు పరిచాడు.

KSR Comments On Chandrababu Delimitation Stand2
ఏంటి సీనియర్‌ మరీ ఇలా చేశారు?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు అవసరాన్ని బట్టి మారిపోతుంటాయి. ప్రజలకోసం ఇలా మాటమారిస్తే ఓకే కానీ.. ఆయనెప్పుడు రాజకీయాల కోసమే ఇలా చేస్తూంటారు. కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న ఉపన్యాసాలను పరిశీలిస్తే.. పొంతన లేకుండా కనిపిస్తాయి. ఒకపక్క దేశం మొత్తమ్మీద నియోజకవర్గాల పునర్విభజన కోసం రంగం సిద్ధమవుతూంటే.. దానిపై ఆయన తన స్పష్టమైన నిర్ణయం చెప్పకుండా కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇదెలా ఉందంటే.. కడుపు నొప్పి అంటే తలనొప్పికి మందు ఇచ్చినట్లుగా ఉంది!. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాదిలో సీట్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. యూపీ, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ సక్రమంగా చేపట్టని కారణంగా పెరుగుదల ఎక్కువ ఉందని.. ఫలితంగా వారికి అక్కడ ఎక్కువ పార్లమెంటరీ స్థానాలు అందుబాటులోకి వస్తున్నాయన్న భావన చాలామందిలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలు అధిక జనాభాతో వచ్చే ముప్పును ముందుగానే గుర్తించి నియంత్రణ సమర్థంగా నిర్వహించినందుకు ఇక్కడి సీట్లలో పెద్దగా మార్పుల్లేకుండా పోనున్నాయి. 👉ఈ అంశంపై తమిళనాడు, కర్ణాటక, తలంగాణ ముఖ్యమంత్రులు ఇప్పటికే తమ అభ్యంతరాలను వ్యక్తం చేయగా.. చంద్రబాబు మాత్రం దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఒకడుగు ముందుకేసి నియోజకవర్గాల పునర్విభజన ఇదే పంథాలో సాగితే దక్షిణాది తిరగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం ఇప్పటికే ఎక్కువగా ఉందని.. సీట్లు పెరిగితే వారి ఆధిపత్యం మరింత పెరిగిపోతుంది. పార్లమెంటులోని ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లను 753కు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దక్షిణాదిలో ప్రస్తుతం 129 సీట్లు ఉండగా.. డీలిమిటేషన్‌ తరువాత అత్యధికంగా 144 స్థాయికి చేరవచ్చు. ఏపీ, తెలంగాణల్లో చెరో మూడు సీట్లే పెరిగే అవకాశం ఉంటుంది. కేరళలో ఒక సీటు తగ్గుతుందట!. తమిళనాడులో రెండు సీట్లే పెరుగుతాయి. కర్ణాటకలో మాత్రం ఎనిమిది సీట్లు ఎక్కువ కావచ్చు. ఫలితంగా కొత్తగా ఏర్పాటయ్యే సీట్లను కలుపుకుని చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం ప్రస్తుతమున్న 24 శాతం నుంచి నుంచి 19 శాతానికి పడిపోనుంది. 👉డీలిమిటేషన్ పూర్తి అయితే ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 48 స్థానాలు పెరిగి మొత్తం సంఖ్య 128 స్థానాలకు చేరనుంది. బీహార్‌ పార్లమెంటరీ స్థానాలు కూడా 40 నుంచి 70కి చేరతాయి. మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 47 అవుతాయి. ఈ రకమైన పరిస్థితి వల్ల ఉత్తరాది గుత్తాధిపత్యం అధికం అవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదిక కాకుండా 1971 నాటి లెక్కలు తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. కొందరు మేధావులు విస్తీర్ణం ప్రాతిపదికగా డీలిమిటేషన్ చేస్తే ఈ సమస్య కొంత తగ్గవచ్చని అభిప్రాయపడుతున్నారు. నిజానికి దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులలో సీనియర్ చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రం దీనిపై విభిన్నంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్, బీహారు రాష్ట్రాలు ఎక్కువమంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయని, ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని చంద్రబాబు సూచిస్తున్నారు. 2026 డీలిమిటేషన్ వల్ల లోక్‌సభ సీట్లలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంత నాయకులు అంతా బాధ పడుతుంటే చంద్రబాబు జనాభాను పెంచండని చెప్పి అసలు సమస్య జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. 👉గతంలో.. ఇదే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉత్తరాది రాష్ట్రాలు సరిగా పనిచేయడం లేదని, అందువల్ల వాటికి అధిక నిధులు ఇవ్వరాదని చెప్పేవారు. బాగా పనిచేస్తున్న ఏపీ తదితర రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసేవారు. ఆ రాష్ట్రాలలో జనాభా నియంత్రణ లేకపోవడాన్ని ఆక్షేపించేవారు. కాని అన్ని అంశాలలో మాదిరే చంద్రబాబు ఇక్కడ కూడా యు టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. 👉కేంద్రంలోని బీజేపీని గట్టిగా నిలదీసే పరిస్థితిలో లేరు. ఎన్డీయే ప్రభుత్వం తెలుగుదేశం సీట్లపై ఆధారపడి ఉన్నా, చంద్రబాబు ఎందువల్లో ఎక్కువగా భయపడుతున్నారేమో అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అందుకే ధైర్యంగా డీలిమిటేషన్‌లో ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టంపై గొంతెత్తలేకపోతున్నారని అంటున్నారు. పైగా ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను పెంచి దేశాన్ని కాపాడుతున్నాయని చెబుతున్నారు. ఇది ఒక రకంగా ఆంధ్రతో సహా దక్షిణాదిని అవమానించడమే కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 👉జనాభా పెంచే విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలట. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే ఉంది కనుక, వారికి ఎక్కడ అసంతృప్తి వస్తుందో అని ఆయన మాట్లాడకపోగా అర్జంట్‌గా పిల్లలను కనండని చెబితే ఏమి చేయాలి? నిజంగానే ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా జనాభాను పెంచితే ఎవరు పోషించాలి? చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసే హామీలను నమ్మి ప్రజలు ఎలా మోసపోతున్నారో అంతా గమనిస్తున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. ఓ పాతికేళ్లకు దక్షిణాదిలో జనాభాను పెంచినా, అప్పటికి ఉత్తరాదిలో ఇంకా జనాభా పెరిగిపోతుంది కదా!. అందువల్ల ఆయన చెబుతున్న తర్కంలో హేతుబద్దత కనిపించదు. ఉత్తరాది, దక్షిణాది మధ్య ఒక సమతుల్యత రావడం అవసరం కాదా? దానిని వదలి ఉత్తరాది రాష్ట్రాల వారు దేశాన్ని కాపాడుతున్నారట.. అంటే దక్షిణాది వారు కాపాడడం లేదని చెప్పడమా?. తమిళనాడు సీఎం డిమాండ్‌పై చంద్రబాబు మాత్రం స్పందించడం లేదు. వచ్చే ఏడాది పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందని అంతా చెబుతుంటే, ఇప్పుడు పిల్లలను కని జనాభాను పెంచండి అని అనడంవల్ల ఏమి ప్రయోజనం ఉంటుందో చంద్రబాబే చెప్పాలి. ఏది ఏమైనా.. కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాలకన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడడంలో చంద్రబాబు పాత్ర తీసుకోకపోతే చరిత్ర ఆయనను క్షమిస్తుందా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Bittersweet Loss He Took It Away From Us: Santner On NZ Loss vs IND CT Final3
అతడు మా నుంచి మ్యాచ్‌ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్‌ కెప్టెన్‌

మ‌రోసారి చాంపియ‌న్స్ ట్రోఫీ(ICC Champions Trophy) గెల‌వాల‌న్న న్యూజిలాండ్ ఆశ‌ల‌పై టీమిండియా నీళ్లు చ‌ల్లింది. పాతికేళ్ల క్రితం ఎదురైన ప‌రాభవానికి ప్ర‌తీకారం తీర్చుని 2025 ఫైన‌ల్లో కివీస్‌ను ఓడించి విజేత‌గా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతమని కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సహచర ఆటగాళ్లను అభినందించాడు. ఈ టోర్నమెంట్ తమకు చేదు-తీపిల కలయికగా మిశ్ర‌మ అనుభూతిని మిగిల‌చ్చింద‌ని పేర్కొన్నాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన ఈ మెగా వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌.. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. ఈ క్రమంలో లీగ్ దశలో మూడింటికి మూడూ గెలిచి సెమీస్‌కు చేరిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆసీస్‌పై గెలుపొందింది. మరోవైపు.. గ్రూప్ దశలో కేవలం టీమిండియా చేతిలో ఓడిన కివీస్‌.. సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్లో భారత్‌ను ఢీకొట్టింది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. అయితే, 49వ ఓవర్ వరకు ఫలితం తేలకుండా న్యూజిలాండ్ బౌలర్లు అడ్డుపడటం... ఆఖరి వరకు పట్టుదలగా పోరాడిన తీరును ప్రస్తావిస్తూ సాంట్నర్(Mitchell Santner) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆఖర్లో మాకు మిశ్రమ అనుభూతి లభించింది. అయితే, ఫైనల్లో పటిష్ట జట్టు చేతిలో ఓడిపోయినందువల్ల పెద్దగా బాధపడాల్సిన పనిలేదు.మ్యాచ్ ఆసాంతం మేము టీమిండియాను సవాల్ చేయగలిగాం. అది మాకు సంతృప్తినిచ్చింది. ఒకటీ రెండు చిన్నతప్పుల వల్ల మ్యాచ్ మా చేజారింది. ఏదేమైనా ఈ జట్టును చూసి నేను గర్విస్తున్నాను. టోర్నీ ఆసాంతం మా వాళ్లు అద్భుతంగా ఆడారు. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో మా జట్టు సమతూకంగా ఉంది. ఇలాంటి జట్టుకు కెప్టెన్‌గా ఉండటం అంత తేలికేమీ కాదు. నాకైతే ఈ టోర్నీ అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది.ముందుగా చెప్పినట్లు మేము బలమైన జట్టు చేతిలో ఓడిపోయాం. ఇంకో 20 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో!.. అయితే, రోహిత్ శర్మ(Rohit Sharma) తన అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు. ఫైనల్ వరకు మా ఆటతీరు అద్బుతంగా సాగింది. టైటిల్ పోరులోనూ మేము ఆఖరి వరకు పోరాడటం గర్వకారణం’’ అని 33 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సాంట్నర్ తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.కాగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సాంట్నర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రచిన్‌ రవీంద్ర(37),గ్లెన్‌ ఫిలిప్స్‌(34) ఫర్వాలేదనిపించగా.. డారిల్‌ మిచెల్‌(63), మైకేల్‌ బ్రాస్‌వెల్‌(53 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో కివీస్‌ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు స్కోరు చేసింది.భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసి రెండేసి వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక వికెట్‌ దక్కించుకోగా.. పేసర్లలో షమీ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనను దూకుడగా ఆరంభించిన భారత్‌ 49 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది.ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(83 బంతుల్లో 76, 7 ఫోర్లు, మూడు సిక్సర్లు) అద్భుత అర్ధ శతకం సాధించగా.. శ్రేయస్‌ అయ్యర్‌(48), కేఎల్‌ రాహుల్‌(33 బంతుల్లో 34 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్‌) రాణించారు. కివీస్‌ బౌలర్లలో మైకేల్‌బ్రాస్‌వెల్‌, మిచెల్‌ సాంట్నర్‌రెండేసి వికెట్లు కూల్చగా.. రచిన్‌ రవీంద్ర, కైలీ జెమీసన్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్‌ శర్మ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకోగా.. సిరీస్‌ ఆసాంతం రాణించిన రచిన్‌ రవీంద్రకు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కింది.చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్‌ శర్మ

Will Trump Canada-US Merge Possible New PM Mark Carney Says This4
Mark Carney: అమెరికాలో కెనడా విలీనం.. ఏనాటికీ కాబోదు

ఆర్థిక మేధావి, కెనడాకు కాబోయే ప్రధాని మార్క్‌ కార్నీ.. బాధ్యతలు చేపట్టకముందే అమెరికాతో కవ్వింపు చర్యలకు దిగుతున్నారా?!. రాబోయే రోజుల్లోనూ డొనాల్డ్‌ ట్రంప్‌తో ఢీ అంటే ఢీ అనేందుకు ఆయన సిద్ధమవుతున్నారా?. తాజా విక్టరీ స్పీచ్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామంటున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)నకు.. మార్క్‌ కార్నీ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.అధికార లిబరల్‌ పార్టీ ఆదివారం మార్క్‌ కార్నీ(Mark Carney)ని తమ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది. సుమారు 86 శాతం సభ్యుల ఓట్లతో.. భారీ మెజార్టీతో ఆయనకు విజయం కట్టబెట్టింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విక్టరీ స్పీచ్‌లో కార్నీ ఏమన్నారంటే.. అమెరికా కెనడా కాదు. కెనడా ఏనాటికీ.. ఏ రూపంలోనూ అమెరికాలో భాగం కాబోదు. ఇతర దేశాలతో మేం(కెనడా) ఏ రకమైనా పోరాటం కోరుకోవడం లేదు. కానీ, .. అవతలివాళ్లు స్నేహ హస్తం వదులుకోవాలనుకుంటే మాత్రం.. మేమూ అందుకు సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి.. అమెరికన్లు ఎలాంటి తప్పు చేయకూడదనే నేను కోరుకుంటున్నా. అది వాణిజ్యంలో అయినా.. హకీలో అయినా.. కెనడాదే పైచేయి అనే విషయం మరిచిపోకూడదు’’ అని అన్నారాయన.ఇదీ చదవండి: కెనడా కొత్త ప్రధాని.. మామూలోడు కాదండోయ్‌!ఈ క్రమంలో అమెరికాపై కెనడా ప్రతీకార సుంకాల(US Canada Tariff Hikes) విధింపు కొనసాగుతుందని ప్రకటించారాయన. ‘‘అమెరికన్లు మమ్మల్ని కాస్త గౌరవించాలి. వాణిజ్య ఒప్పందాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అమలు చేయాలి’’ అని కోరారు. అలాగే.. తన విజయ ప్రసంగంలో దేశ ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడిన ఆయన.. కెనడాను ఎనర్జీ సూపర్‌ పవర్‌గా తీర్చిదిద్దుతానని, అందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా సిద్ధమని ప్రతిజ్ఞ చేశారు.ఇదిలా ఉంటే కార్నీ తాజా వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వడం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. ఏమాత్రం రాజకీయ, పాలనానుభవం లేని మార్క్‌ కార్నీ దూకుడుగా కాకుండా ఆచితూచీ అడుగులేయాలని సూచిస్తున్నారు. లేకుంటే.. పరిస్థితులు చేజారిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

Rashmika Mandanna Support Her Community Council5
'రష్మిక'కు రక్షణ కల్పించాలంటూ అమిత్ షాకు 'కుల' పెద్దల లేఖ

పాన్‌ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతున్న కన్నడ బ్యూటీ 'రష్మిక మందన్న'కు రక్షణ కల్పించాలని ఆమె కులానికి (కొడవ) చెందిన సంఘం వారు రంగంలోకి దిగారు. ఈమేరకు వారు కేంద్రానికి లేఖ కూడా రాశారు. రీసెంట్‌గా 'ఛావా' సినిమా సక్సెస్‌ మీట్‌లో రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట భగ్గుమన్నాయి. బాలీవుడ్‌ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'నేను హైదరాబాద్‌ నుంచి వచ్చాను.. నాపై ఇక్కడి వారు చూపుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.' అని చెప్పడంతో కర్ణాటకలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సొంతూరును మరిచిపోయి ఇలా మాట్లాడటం ఏంటి అంటూ ఆమెపై కన్నడ అభిమానులు ఫైర్‌ అయ్యారు.రష్మికకు రక్షణగా 'కుల' పెద్దలుసౌత్‌ ఇండియాతో పాటు బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్న రష్మికకు భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర్‌లకు 'కొడవ నేషనల్ కౌన్సిల్' (సీఎన్‌సీ) లేఖ రాసింది. రష్మిక చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేగడంతో కర్ణాటకలోని ఒక ఎమ్మెల్యేతో పాటు కన్నడ అనుకూల వర్గానికి చెందిన వారు ఆమెపై బెదిరింపులకు దిగారని (సీఎన్‌సీ) పేర్కొంది. దీంతో నటికి భద్రత కల్పించాలని 'కొడవ' బోర్డు కోరింది. తమ తెగకు చెందిన రష్మిక తన కృషి, ప్రతిభతో భారతీయ చిత్ర పరిశ్రమలో అఖండ విజయాన్ని సాధించిందని బోర్డు చైర్మన్ ఎన్.యు. నాచప్ప లేఖలో పేర్కొన్నారు. దేశంలోనే గొప్ప నటులుగా గుర్తింపు ఉన్న అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకుందని గుర్తుచేశారు. ఆమెకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టే తన అభిప్రాయాన్ని పంచుకుందన్నారు. కానీ, ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో ఆమెలో భయం పెరిగిందని ఆయన అన్నారు. తాను వెనుకబడిని వర్గానికి చెందిన మహిళ కాబట్టే టార్గెట్ చేసి బెదిరిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న కూడా ఫిర్యాదు చేసిందని నాచప్ప తెలిపారు. కర్ణాటకలో కొడవ వర్గం ప్రజలు ఓబీసీ కిందకు వస్తారు. రష్మిక మందన్న సామాజిక వర్గం 'కొడవ' అని తెలిసిందే.ఎమ్మెల్యే బెదిరింపులురష్మికపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే 'రవి గనిగ' ఫైర్‌ అయ్యారు. బాలీవుడ్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడతూ ఆయన ఒక ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. జీవితాన్ని ఇచ్చిన ఇండస్ట్రీని ఆమె తక్కువ చేసిందని తెలిపారు. ఈ విషయం రష్మిక తెలుసుకోవాలని కోరారు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు కూడా ఆమె అంగీకరించలేదని ఆయన ఆరోపించారు. రష్మిక మందన్నకు సరైన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే రవి పిలుపునిచ్చారు. ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనని వారిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాంటి వారి నట్లు, బోల్టులు ఎలా సరిచేయాలో తమకు తెలుసని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొడవ సామాజిక వర్గం వారు రష్మిక మందన్నకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆమెకు రక్షణ కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కొడవ వర్గం లీడర్‌ ఒక లేఖ రాశారు.

CM Chandrababu Not Given MLC Seat To TDP SVSN Varma6
బాబు, పవన్‌ రాజకీయం.. వర్మకు వెన్నుపోటు!

ఎప్పటిలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మాట తప్పారు. చంద్రబాబు మాట మీద నిలబడితే వింతకానీ మాట తప్పితే వింతేముంది. తనది నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు కానీ.. ఈ అనుభవం వెన్నుపోట్లలోనే ఎక్కువగా ఉంటుందన్నది చరిత్ర తెరిచి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.దీనికి తాజా ఉదాహరణ కావాలా?. పిఠాపురం ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి.. జనసేన అధినాయకుడు పవన్‌ కళ్యాణ్‌ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మనే తీసుకుందాం. ‘నీకెందుకు వర్మా నీ రాజకీయ భవిష్యత్ నా చేతిలో ఉంది.. మొదటి ఛాన్స్ లోనే నీకు ఎమ్మెల్సీ ఖాయం.. ముందు నువ్వు పవన్‌ను గెలిపించి చూడు.. నీ ఫ్యూచర్ ఎక్కడో ఉంటుంది’ అని ఎన్నికల సమయంలో చంద్రబాబు వేలాది మంది జనం సమక్షంలో చెప్పారు.. అదే తరుణంలో పవన్ సైతం తనకు వర్మ రాజకీయ భవిష్యత్ కన్నా పెద్ద పనేం లేదని.. ఆయన్ను ఒక స్థాయిలో పెట్టడమే తన ముందున్న కర్తవ్యం అన్నారు. ఇలా ఇద్దరు పెద్ద మనుషులు మాటిచ్చారు.దీంతో, ఇక తనకు తిరుగులేదని వర్మ కూడా నిన్న మొన్నటివరకూ దిలాసాగా ఉన్నారు. తీరా చూస్తే ఎమ్మెల్యేల కోటాలో వచ్చిన మూడుకు మూడు ఎమ్మెల్సీలను కావలి గ్రీష్మ.. బీద రవిచంద్ర.. బీటీ నాయుడులకు ఇచ్చిన చంద్రబాబు.. వర్మకు మాత్రం దెబ్బేశారు. అదేంటి తన ఫ్యూచర్ కోసం ఇద్దరు హామీలు ఇచ్చారు కానీ ఒక్కరు కూడా తన గురించి ఆలోచించలేదా అని వర్మ.. ఆయన వర్గీయులు లోలోన మదనపడుతున్నారు. కానీ, ఈ విషయం ఎక్కడా బయటకు అనలేని పరిస్థితి.ఇదిలా ఉండగా తన గెలుపు వెనుక వెన్నుదన్నుగా నిలిచిన వర్మను పవన్ కళ్యాణ్‌ కూడా కావాలనే పట్టించుకోవడం మానేశారా.. అది తెలుగుదేశం పార్టీ వ్యవహారం కదా మధ్యలో నేనెందుకు దూరడం అని దూరంగా ఉన్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే తన పార్టీకి దక్కిన ఎమ్మెల్సీని అన్నయ్య నాగబాబుకు ఇచ్చి.. అక్కడితో పవన్ సైలెంట్ అయ్యారు తప్ప తన కోసం పని చేసిన వర్మను పట్టించుకోలేదు. వాస్తవానికి పవన్‌లో ఈ ఆలోచన ఉండుంటే అయన చంద్రబాబుకు గట్టిగా చెప్పి వర్మకు అవకాశం ఇప్పించవచ్చు. కానీ, పవన్ ఆపని చేయలేదు.అప్పట్లో మాటైతే ఇచ్చేసారు కానీ మాటను నిజం చేసే విషయంలో పెద్దగా సీరియస్‌గా లేరు. అందుకే వర్మను ఆయన మానాన ఆయన్ను వదిలేశారు. మరోవైపు చంద్రబాబు కూడా పిఠాపురంలో పవన్ ఫిక్స్ అయిపోతున్న తరుణంలో వర్మను ఎందుకు ఇంకా మోయడం అని పక్కన పెట్టారా అనే సందేహాలు కూడా ఉన్నాయ్.. ఏదైతేనేం పవన్‌ను గెలుపు తీరానికి చేర్చిన వర్మ రేవులో తాడిచెట్టు మాదిరిగా ఒంటరిగా మిగిలిపోయారు.. చంద్రబాబు బాగా వాడుకుని వదిలేసిన వారి జాబితాలో తాజాగా చేరిపోయారు.-సిమ్మాదిరప్పన్న.

Rise and Fall of Pramod Mittal he spent an Rs 550 cr on his daughter wedding7
రూ.550 కోట్లతో కూతురి పెళ్లి.. దివాలా తీసిన వ్యాపారవేత్త

ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. అలాంటి ఘటన ఒకటి బడా పారిశ్రామికవేత్త విషయంలో నిజమయ్యింది. ఒకప్పుడు ఉక్కు పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా ప్రమోద్ మిట్టల్‌కు గొప్పపేరుండేది. విలాసవంతమైన జీవనశైలికి బ్రాండ్‌అంబాసిడర్‌గా ఉండే మిట్టల్ సుమారు రూ.24,000 కోట్ల అప్పు తీర్చలేక దివాలా తేశారు. ఒక్కప్పుడు తన కూతురి పెళ్లికి ఏకంగా రూ.550 కోట్లు ఖర్చు చేసి వార్తల్లో నిలిచిన ఆ వ్యక్తి ఎందుకు ఇంతలా దిగజారిపోయారు. అందుకుగల కారణాలను ఈ కథనంలో తెలుసుకుందాం.భారతీయ ఉక్కు దిగ్గజం, ప్రపంచంలోని అతిపెద్ద ఉక్కు మైనింగ్ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ఛైర్మన్, దేశంలోని స్టీల్‌ పరిశ్రమలో ఎన్నో విజయాలు సాధించి ‘స్టీల్‌ మాగ్నెట్‌’గా పేరు తెచ్చుకున్న లక్ష్మీ మిట్టల్‌ సోదరుడే ఈ ప్రమోద్‌ మిట్టల్‌. మైనింగ్, మెటల్స్ రంగంలో లక్ష్మీ మిట్టల్ అత్యంత సంపన్నుల్లో ఒకరిగా కొనసాగుతుండగా, ప్రమోద్ అదృష్టం మరో మలుపు తిరిగింది. బిలియనీర్‌గా, ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ప్రమోద్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగించారు. 2013లో తన కుమార్తె సృష్టి మిట్టల్ పెళ్లి కోసం రూ.550 కోట్లు వెచ్చించి వార్తల్లో నిలిచారు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఈ వివాహ కార్యక్రమంలో రుచికరమైన వంటకాలు, విస్తారమైన అలంకరణలు, హైప్రొఫైల్ అతిథులు పాల్గొన్నారు.బోస్నియా కోక్ ఉత్పత్తిదారు గ్లోబల్ ఇస్పాత్ కోక్‌స్నా ఇండస్ట్రీస్ లుకావాక్ (జీఐకేఐఎల్‌) చేసిన అప్పులకు హామీదారుగా ప్రమోద్‌ మిట్టల్‌ పాత్ర ఉందని అధికారులు తెలిపారు. ఇది దాని ఆర్థిక బాధ్యతలను తీర్చడంలో విఫలమైంది. దాంతో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్న ప్రమోద్‌ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. మోసం ఆరోపణలపై 2019లో బోస్నియాలో తనను అరెస్టు చేశారు. రూ.24,000 కోట్లకు పైగా అప్పులతో ప్రమోద్‌ దివాలా తీసినట్లు 2020లో లండన్ కోర్టు ప్రకటించింది. తుజ్లాలోని కంటోనల్ కోర్టు జీఐకేఐఎల్‌ నష్టపరిహారంగా దాదాపు 11 మిలియన్ యూరోలను డిపాజిట్ చేయాలని ప్రమోద్‌ను ఆదేశించింది. దాంతో అతని ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి.ఇదీ చదవండి: 100 మంది ఐటీ ఉద్యోగులు ర్యాలీ.. కారణం..ప్రమోద్ మిట్టల్ వ్యవహారం నేర్పే ఆర్థిక పాఠాలు..మితిమీరిన అప్పులు: మిట్టల్ ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణం మితిమీరిన అప్పులు చేయడం. తిరిగి చెల్లించే సామర్థ్యానికి మించి రుణాలు తీసుకోవడం వ్యక్తులకు, వ్యాపారాలకు దివాలాకు దారితీస్తుంది.వివేకవంతమైన ఖర్చు: తన కుమార్తె వివాహానికి విచ్చలవిడిగా ఖర్చు చేయడం, సంపదను ప్రదర్శించడం, అదుపులేని దుబారా వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యమివ్వడం కీలకం.రిస్క్‌ మేనేజ్‌మెంట్‌: జీఐకేఐఎల్‌ కేసులో మిట్టల్ చేసినట్లుగా రుణాలకు హామీదారుగా వ్యవహరించడం సరికాదు. అవతలి పక్షం అప్పులు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హామీలకు కట్టుబడి ఉండేముందు ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.ఫైనాన్షియల్ ప్లానింగ్: అపారమైన సంపద ఉన్నప్పటికీ పేలవమైన ఆర్థిక ప్రణాళిక, ఆకస్మిక నిల్వలు లేకపోవడం దివాలాకు దారితీస్తుంది. అత్యవసర నిధిని నిర్వహించేటప్పుడు ఆస్తులను వైవిధ్యపరచడం చాలా ముఖ్యం.

Somu Veerraju Name Announced As AP BJP MLC Candidate8
ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ చివరి అభ్యర్థి పేరును ప్రకటించారు. బీజేపీ తరఫున పార్టీ సీనియర్‌ నేత సోము వీర్రాజు పేరును ఖరారు చేశారు. తద్వారా గత ఎన్నికల టైం నుంచి పార్టీలో కొనసాగుతున్న లుకలుకలకు అధిష్టానం చెక్‌ పెట్టే ప్రయత్నం చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో.. చంద్రబాబు తన మార్క్‌ రాజకీయం నడిపించారు. ఒరిజినల్‌ బీజేపీ నేతలకు సీట్లు దక్కకపోవడంతో సంఘ్‌పరివార్‌ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కారు. ఎమ్మెల్యే, ఎంపీ సీటు దక్కుతుందని ఆయన ఆశించినా.. అది నెరవేరలేదు. సామాజిక సమీకరణాలను కూడా పట్టించుకోకపోవడంతో బీజేపీ అధిష్టానం తప్పు చేసిందనే చర్చ విపరీతంగా నడిచింది. అయితే ఆ తప్పును వీర్రాజు ఎంపిక ద్వారా అధిష్టానం ఇప్పుడు సరిద్దుకున్నట్లు కనిపిస్తోంది. తొలుత ప్రచారంలో చాలామంది పేర్లు వినిపించినప్పటికీ.. సోము వీర్రాజు వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సినియారిటీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పవర్‌ బ్యాలెన్స్‌ చేసేందుకు ఆయన సామాజిక వర్గాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ ఆయన నామినేషన్‌ దాఖలు చేస్తారని సమాచారం. ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. మూడు టీడీపీ తీసుకుంది. ఒకటి జనసేన(కొణిదెల నాగబాబు), మరొకటి బీజేపీకి కేటాయించింది.

SLBC Tunnel Rescue operation continue On 10th March live updates9
SLBC: నేడు మరో రెండు మృతదేహాలు వెలికితీత!

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు 17వ రోజు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని ఒక్కొక్కరికిగా గుర్తిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఆదివారం ఎట్టకేలకు ఒక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఎత్తు, చేతి కడియం తదితర ఆనవాళ్లను బట్టి పంజాబ్‌కు చెందిన టీబీఎం ఆపరేటర్‌ గుర్‌ప్రీత్‌సింగ్‌ (40)గా గుర్తించారు. గురుప్రీత్‌ సింగ్‌ మృతదేహాం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. నేడు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది.గత నెల 22న ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా ఎనిమిది మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సొరంగంలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం టీబీఎం ఆపరేటర్‌ గుర్‌ప్రీత్‌సింగ్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు తెలిపారు.సహాయచర్యల్లో భాగంగా సొరంగం లోపల పేరుకుపోయిన మట్టి, టీబీఎం యంత్రం దిగువన డాప్లర్‌ సంకేతాలతో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. కేరళకు చెందిన క్యాడవర్‌ డాగ్స్‌ (స్నిఫర్స్‌) కూడా పలువురి ఆనవాళ్లను పసిగట్టాయి. దీంతో, శనివారం రాత్రి సహాయక బృందాలు టీబీఎం ఎడమవైపు భాగంలో తవ్వుతుండగా ఆరు అడుగుల లోతులో మొదట కుడిచేతి వేళ్లు, చేతి కడియం కనిపించాయి. అధికారుల సూచనల మేరకు గురుప్రీత్‌ సింగ్‌ మృతదేహాన్ని వెలికితీశారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని జాగ్రత్తగా వెలికితీశారు. ఇంజినీర్‌ ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటూ ఇటూ మరో ముగ్గురి జాడ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈరోజు మరో ఇద్దరి జాడ లభించే అవకాశం ఉందని సహాయ బృందాలు తెలిపాయి. మిగిలినవారు సొరంగం చిట్టచివరి భాగం వద్ద టీబీఎం కట్టర్‌ సమీపంలో చిక్కుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.మూడేళ్లుగా గుర్‌ప్రీత్‌సింగ్‌ విధులు ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో మృతదేహం లభ్యమైన గుర్‌ప్రీత్‌సింగ్‌ స్వస్థలం పంజాబ్‌ రాష్ట్రంలోని తరన్‌తరాన్‌. రాబిన్స్‌ సంస్థలో 2022 నుంచి టీబీఎం ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రాజేందర్‌ కౌర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాపిల్లలు స్వస్థలంలో ఉండగా.. గుర్‌ప్రీత్‌సింగ్‌ మూడేళ్లుగా దోమలపెంటలోని రాబిన్స్‌ క్యాంపులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగాక బంధువులు వచ్చి కొన్ని రోజులు వేచిచూశారు. ఆచూకీ తెలియకపోవడంతో స్వస్థలానికి వెళ్లిపోయారు.

Tathagat Avatar Tulsi: BSc At 11 PhD At 21 Became IIT Professor At 2210
పదకొండేళ్లకే బీఎస్సీ, 21 ఏళ్లకే పీహెచ్‌డీ..!

కొందరు చిన్న వయసులోనే అసాధారణ తెలివితేటలు, ప్రతిభ సామర్థ్యంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఈ అసామాన్య వ్యక్తులు అందరిలా కాకుండా చిన్న వయసులోనే పెద్ద పెద్ద డిగ్రీలు పూర్తి చేసి శెభాష్‌ అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే తథాగత్ అవతార్ తులసి. అతడి అసామాన్య ప్రతిభ గురించి తెలిస్తే నోటమాట రాదు. మరీ అతడి ప్రతిభాపాటవాలేంటో చూద్దామా..!.ఆ అసామాన్యుడే తథాగత్ అవతార్ తులసి. ఆయన సెప్టెంబర్ 9, 1987న బిహార్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తథాగత్‌ చిన్నప్పటి నుంచి తన అసాధారణ మేథాతో అందర్నీ ఆశ్చర్యపరిచేవాడు. అలా తథాగత్‌ 9 ఏళ్లకే పాఠశాల విద్యను పూర్తి చేశాడు. 11 ఏళ్లకు బీఎస్సీ బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశాడు. ఇక 12 ఏళ్లకే ఎంఎస్సీ పూర్తి చేసి, 21 ఏళ్లకే డాక్టరేట్‌ని పొందాడు. ఆ విధంగా 22 ఏళ్ల వయసుకే ప్రతిష్టాత్మక ఐఐటీలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ప్రొఫెసర్‌ అయ్యాడు. ఈ అపార ప్రతిభాశాలి పీహెచ్‌డీలో క్వాంటం సెర్చ్ అల్గారిథంపై పరిశోధన చేసి మంచి పేరుతెచ్చుకున్నాడు. అంతేగాదు తథాగత్‌ ప్రఖ్యాత శాస్త్రవేత్త లవ్ గ్రోవర్‌తో కలిసి ఒక పరిశోధనా పత్రాన్ని కూడా రచించాడు అయితే అది ఏ జర్నల్‌లోనూ ప్రచురితం కాలేదు. అయితే ప్రస్తుతం ఆయన 2019లో ఐఐటీ బాంబే నుంచి తొలగించబడ్డారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఉద్యోగ పోరాటం చేస్తున్నారు. 2011లో తథాగత్‌ తీవ్ర జ్వరం బారినపడీ అలెర్జీకి గురయ్యాడు. ఆ అనారోగ్యం చాలా ఏళ్ల పాటు కొనసాగడంతో సుదీర్ఘ సెలవు తీసుకున్నాడు. చివరికి 2013లో ముంబై విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. ఆ కారణాల వల్లే 2019లో తథాగత్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగం కోల్పోయాడు. తన అనారోగ్య సమస్యల కారణంగా ముంబైలో నివసించడం సాధ్యం కాదని, తనని ప్రత్యేక కేసు కింద IIT ఢిల్లీకి బదిలీ కోసం అభర్థిస్తున్నారు తథాగత్‌. అందుకోసం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించనున్నట్లు సమాచారం. చివరగా తథాగత్‌ మాట్లాడుతూ..క్వాంటం కంప్యూటర్ల రంగం పరంగా నాదేశం అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ అంశంపైనే చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నాను. కేవలం 17 ఏళ్ల వయసులో లవ్ గ్రోవర్ మార్గదర్శకత్వంలో దీనిపై పనిచేయడం ప్రారంభించాను. తన పరిశోధన ప్రొఫైల్‌ ముందు బాగానే ఉంది. ఆ తర్వాత తన అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ పరిశోధనపై ఫోకస్‌ పెట్టలేకపోయానని వాపోయారు. కానీ ఇప్పుడు తాను క్వాంటం కంప్యూటర్ల రంగానికి తోడ్పాలని కోరుకుంటున్నానని అ‍న్నారు. అదీగాక మన భారతదేశంలో క్వాంటం కంప్యూటర్లపై రూ. 8 వేల కోట్లు ఆంక్షలు ఉన్నాయి. కావున ఆ సమస్యకు చెక్‌పెట్టేలా ఈరంగంలో మంచి విప్లవం తీసుకురాగలనని ధీమాగా చెప్పారు తథాగత్‌ .సత్కారాలు, అవార్డులు..1994లో, తథాగత అవతార్ తులసిని అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సత్కరించారు. ఆయన సాధించిన విజయానికి బహుమతిగా ఆయనకు కొంత డబ్బుని పారితోషకంగా ఇచ్చారు. కానీ తథాగత్‌ ఆ డబ్బుని తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆయనకు ఒక మంచి కంప్యూటర్‌ని బహుమతిగా ఇచ్చారు. అది ఆయనకు మరిన్ని గొప్ప విజయాలను సాధించడానికి సహాయపడింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం తథాగత్‌ సాధించిన విజయాలకు అబ్బురపడటమే గాక అతడిని ఘనంగా సత్కరించారు కూడా. (చదవండి: అంతా జేమ్స్‌ బాండ్‌ హీరో హీరో సెవన్‌గా కీర్తిస్తారు..కానీ ఆయన..!)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
డాక్టర్‌ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!

డొమినికన్ రిపబ్లిక్‌లో  కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

title
న్యూయార్‌లో ఘనంగా తెలుగువారి సంబరాలు.

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి.

title
ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన

title
విశాఖకు ఎన్నారై మహిళ ఎందుకొచ్చింది?.. ఆ రూమ్‌లో ఏం జరిగింది?

విశాఖ సిటీ: విశాఖలో ఖాకీ క్రైమ్‌ కథా చిత్రం..

Advertisement

వీడియోలు

Advertisement