Top Stories
ప్రధాన వార్తలు

ప్రణయ్ కేసులో ఒకరికి ఉరి.. ఆరుగురికి జీవితఖైదు
నల్లగొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది. అమృత వర్షిణి-ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను అంతమొందించాడు.👉ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.👉2018లో ప్రణయ్- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు. 👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది. 👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది. 👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)గా ఉన్నారు. 👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్ చేసింది.👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు👉నిందితుల్లో అస్ఘర్ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్ హత్య స్కెచ్‌ను అస్ఘర్ అమలు పరిచాడు.

ఏంటి సీనియర్ మరీ ఇలా చేశారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు అవసరాన్ని బట్టి మారిపోతుంటాయి. ప్రజలకోసం ఇలా మాటమారిస్తే ఓకే కానీ.. ఆయనెప్పుడు రాజకీయాల కోసమే ఇలా చేస్తూంటారు. కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న ఉపన్యాసాలను పరిశీలిస్తే.. పొంతన లేకుండా కనిపిస్తాయి. ఒకపక్క దేశం మొత్తమ్మీద నియోజకవర్గాల పునర్విభజన కోసం రంగం సిద్ధమవుతూంటే.. దానిపై ఆయన తన స్పష్టమైన నిర్ణయం చెప్పకుండా కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇదెలా ఉందంటే.. కడుపు నొప్పి అంటే తలనొప్పికి మందు ఇచ్చినట్లుగా ఉంది!. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాదిలో సీట్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ సక్రమంగా చేపట్టని కారణంగా పెరుగుదల ఎక్కువ ఉందని.. ఫలితంగా వారికి అక్కడ ఎక్కువ పార్లమెంటరీ స్థానాలు అందుబాటులోకి వస్తున్నాయన్న భావన చాలామందిలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలు అధిక జనాభాతో వచ్చే ముప్పును ముందుగానే గుర్తించి నియంత్రణ సమర్థంగా నిర్వహించినందుకు ఇక్కడి సీట్లలో పెద్దగా మార్పుల్లేకుండా పోనున్నాయి. 👉ఈ అంశంపై తమిళనాడు, కర్ణాటక, తలంగాణ ముఖ్యమంత్రులు ఇప్పటికే తమ అభ్యంతరాలను వ్యక్తం చేయగా.. చంద్రబాబు మాత్రం దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఒకడుగు ముందుకేసి నియోజకవర్గాల పునర్విభజన ఇదే పంథాలో సాగితే దక్షిణాది తిరగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం ఇప్పటికే ఎక్కువగా ఉందని.. సీట్లు పెరిగితే వారి ఆధిపత్యం మరింత పెరిగిపోతుంది. పార్లమెంటులోని ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లను 753కు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దక్షిణాదిలో ప్రస్తుతం 129 సీట్లు ఉండగా.. డీలిమిటేషన్ తరువాత అత్యధికంగా 144 స్థాయికి చేరవచ్చు. ఏపీ, తెలంగాణల్లో చెరో మూడు సీట్లే పెరిగే అవకాశం ఉంటుంది. కేరళలో ఒక సీటు తగ్గుతుందట!. తమిళనాడులో రెండు సీట్లే పెరుగుతాయి. కర్ణాటకలో మాత్రం ఎనిమిది సీట్లు ఎక్కువ కావచ్చు. ఫలితంగా కొత్తగా ఏర్పాటయ్యే సీట్లను కలుపుకుని చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం ప్రస్తుతమున్న 24 శాతం నుంచి నుంచి 19 శాతానికి పడిపోనుంది. 👉డీలిమిటేషన్ పూర్తి అయితే ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 48 స్థానాలు పెరిగి మొత్తం సంఖ్య 128 స్థానాలకు చేరనుంది. బీహార్ పార్లమెంటరీ స్థానాలు కూడా 40 నుంచి 70కి చేరతాయి. మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 47 అవుతాయి. ఈ రకమైన పరిస్థితి వల్ల ఉత్తరాది గుత్తాధిపత్యం అధికం అవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదిక కాకుండా 1971 నాటి లెక్కలు తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. కొందరు మేధావులు విస్తీర్ణం ప్రాతిపదికగా డీలిమిటేషన్ చేస్తే ఈ సమస్య కొంత తగ్గవచ్చని అభిప్రాయపడుతున్నారు. నిజానికి దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులలో సీనియర్ చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రం దీనిపై విభిన్నంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్, బీహారు రాష్ట్రాలు ఎక్కువమంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయని, ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని చంద్రబాబు సూచిస్తున్నారు. 2026 డీలిమిటేషన్ వల్ల లోక్‌సభ సీట్లలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంత నాయకులు అంతా బాధ పడుతుంటే చంద్రబాబు జనాభాను పెంచండని చెప్పి అసలు సమస్య జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. 👉గతంలో.. ఇదే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉత్తరాది రాష్ట్రాలు సరిగా పనిచేయడం లేదని, అందువల్ల వాటికి అధిక నిధులు ఇవ్వరాదని చెప్పేవారు. బాగా పనిచేస్తున్న ఏపీ తదితర రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసేవారు. ఆ రాష్ట్రాలలో జనాభా నియంత్రణ లేకపోవడాన్ని ఆక్షేపించేవారు. కాని అన్ని అంశాలలో మాదిరే చంద్రబాబు ఇక్కడ కూడా యు టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. 👉కేంద్రంలోని బీజేపీని గట్టిగా నిలదీసే పరిస్థితిలో లేరు. ఎన్డీయే ప్రభుత్వం తెలుగుదేశం సీట్లపై ఆధారపడి ఉన్నా, చంద్రబాబు ఎందువల్లో ఎక్కువగా భయపడుతున్నారేమో అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అందుకే ధైర్యంగా డీలిమిటేషన్లో ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టంపై గొంతెత్తలేకపోతున్నారని అంటున్నారు. పైగా ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను పెంచి దేశాన్ని కాపాడుతున్నాయని చెబుతున్నారు. ఇది ఒక రకంగా ఆంధ్రతో సహా దక్షిణాదిని అవమానించడమే కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 👉జనాభా పెంచే విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలట. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే ఉంది కనుక, వారికి ఎక్కడ అసంతృప్తి వస్తుందో అని ఆయన మాట్లాడకపోగా అర్జంట్‌గా పిల్లలను కనండని చెబితే ఏమి చేయాలి? నిజంగానే ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా జనాభాను పెంచితే ఎవరు పోషించాలి? చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసే హామీలను నమ్మి ప్రజలు ఎలా మోసపోతున్నారో అంతా గమనిస్తున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. ఓ పాతికేళ్లకు దక్షిణాదిలో జనాభాను పెంచినా, అప్పటికి ఉత్తరాదిలో ఇంకా జనాభా పెరిగిపోతుంది కదా!. అందువల్ల ఆయన చెబుతున్న తర్కంలో హేతుబద్దత కనిపించదు. ఉత్తరాది, దక్షిణాది మధ్య ఒక సమతుల్యత రావడం అవసరం కాదా? దానిని వదలి ఉత్తరాది రాష్ట్రాల వారు దేశాన్ని కాపాడుతున్నారట.. అంటే దక్షిణాది వారు కాపాడడం లేదని చెప్పడమా?. తమిళనాడు సీఎం డిమాండ్‌పై చంద్రబాబు మాత్రం స్పందించడం లేదు. వచ్చే ఏడాది పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందని అంతా చెబుతుంటే, ఇప్పుడు పిల్లలను కని జనాభాను పెంచండి అని అనడంవల్ల ఏమి ప్రయోజనం ఉంటుందో చంద్రబాబే చెప్పాలి. ఏది ఏమైనా.. కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాలకన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడడంలో చంద్రబాబు పాత్ర తీసుకోకపోతే చరిత్ర ఆయనను క్షమిస్తుందా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్
మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) గెలవాలన్న న్యూజిలాండ్ ఆశలపై టీమిండియా నీళ్లు చల్లింది. పాతికేళ్ల క్రితం ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుని 2025 ఫైనల్లో కివీస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతమని కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సహచర ఆటగాళ్లను అభినందించాడు. ఈ టోర్నమెంట్ తమకు చేదు-తీపిల కలయికగా మిశ్రమ అనుభూతిని మిగిలచ్చిందని పేర్కొన్నాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన ఈ మెగా వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. ఈ క్రమంలో లీగ్ దశలో మూడింటికి మూడూ గెలిచి సెమీస్‌కు చేరిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆసీస్‌పై గెలుపొందింది. మరోవైపు.. గ్రూప్ దశలో కేవలం టీమిండియా చేతిలో ఓడిన కివీస్.. సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్లో భారత్‌ను ఢీకొట్టింది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. అయితే, 49వ ఓవర్ వరకు ఫలితం తేలకుండా న్యూజిలాండ్ బౌలర్లు అడ్డుపడటం... ఆఖరి వరకు పట్టుదలగా పోరాడిన తీరును ప్రస్తావిస్తూ సాంట్నర్(Mitchell Santner) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆఖర్లో మాకు మిశ్రమ అనుభూతి లభించింది. అయితే, ఫైనల్లో పటిష్ట జట్టు చేతిలో ఓడిపోయినందువల్ల పెద్దగా బాధపడాల్సిన పనిలేదు.మ్యాచ్ ఆసాంతం మేము టీమిండియాను సవాల్ చేయగలిగాం. అది మాకు సంతృప్తినిచ్చింది. ఒకటీ రెండు చిన్నతప్పుల వల్ల మ్యాచ్ మా చేజారింది. ఏదేమైనా ఈ జట్టును చూసి నేను గర్విస్తున్నాను. టోర్నీ ఆసాంతం మా వాళ్లు అద్భుతంగా ఆడారు. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో మా జట్టు సమతూకంగా ఉంది. ఇలాంటి జట్టుకు కెప్టెన్‌గా ఉండటం అంత తేలికేమీ కాదు. నాకైతే ఈ టోర్నీ అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది.ముందుగా చెప్పినట్లు మేము బలమైన జట్టు చేతిలో ఓడిపోయాం. ఇంకో 20 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో!.. అయితే, రోహిత్ శర్మ(Rohit Sharma) తన అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు. ఫైనల్ వరకు మా ఆటతీరు అద్బుతంగా సాగింది. టైటిల్ పోరులోనూ మేము ఆఖరి వరకు పోరాడటం గర్వకారణం’’ అని 33 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సాంట్నర్ తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.కాగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సాంట్నర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రచిన్ రవీంద్ర(37),గ్లెన్ ఫిలిప్స్(34) ఫర్వాలేదనిపించగా.. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో కివీస్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు స్కోరు చేసింది.భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేసి రెండేసి వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకోగా.. పేసర్లలో షమీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనను దూకుడగా ఆరంభించిన భారత్ 49 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది.ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(83 బంతుల్లో 76, 7 ఫోర్లు, మూడు సిక్సర్లు) అద్భుత అర్ధ శతకం సాధించగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) రాణించారు. కివీస్ బౌలర్లలో మైకేల్‌బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్‌రెండేసి వికెట్లు కూల్చగా.. రచిన్ రవీంద్ర, కైలీ జెమీసన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. సిరీస్ ఆసాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్ శర్మ

Mark Carney: అమెరికాలో కెనడా విలీనం.. ఏనాటికీ కాబోదు
ఆర్థిక మేధావి, కెనడాకు కాబోయే ప్రధాని మార్క్ కార్నీ.. బాధ్యతలు చేపట్టకముందే అమెరికాతో కవ్వింపు చర్యలకు దిగుతున్నారా?!. రాబోయే రోజుల్లోనూ డొనాల్డ్ ట్రంప్‌తో ఢీ అంటే ఢీ అనేందుకు ఆయన సిద్ధమవుతున్నారా?. తాజా విక్టరీ స్పీచ్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామంటున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు.. మార్క్ కార్నీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.అధికార లిబరల్ పార్టీ ఆదివారం మార్క్ కార్నీ(Mark Carney)ని తమ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది. సుమారు 86 శాతం సభ్యుల ఓట్లతో.. భారీ మెజార్టీతో ఆయనకు విజయం కట్టబెట్టింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విక్టరీ స్పీచ్‌లో కార్నీ ఏమన్నారంటే.. అమెరికా కెనడా కాదు. కెనడా ఏనాటికీ.. ఏ రూపంలోనూ అమెరికాలో భాగం కాబోదు. ఇతర దేశాలతో మేం(కెనడా) ఏ రకమైనా పోరాటం కోరుకోవడం లేదు. కానీ, .. అవతలివాళ్లు స్నేహ హస్తం వదులుకోవాలనుకుంటే మాత్రం.. మేమూ అందుకు సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి.. అమెరికన్లు ఎలాంటి తప్పు చేయకూడదనే నేను కోరుకుంటున్నా. అది వాణిజ్యంలో అయినా.. హకీలో అయినా.. కెనడాదే పైచేయి అనే విషయం మరిచిపోకూడదు’’ అని అన్నారాయన.ఇదీ చదవండి: కెనడా కొత్త ప్రధాని.. మామూలోడు కాదండోయ్!ఈ క్రమంలో అమెరికాపై కెనడా ప్రతీకార సుంకాల(US Canada Tariff Hikes) విధింపు కొనసాగుతుందని ప్రకటించారాయన. ‘‘అమెరికన్లు మమ్మల్ని కాస్త గౌరవించాలి. వాణిజ్య ఒప్పందాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అమలు చేయాలి’’ అని కోరారు. అలాగే.. తన విజయ ప్రసంగంలో దేశ ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడిన ఆయన.. కెనడాను ఎనర్జీ సూపర్ పవర్‌గా తీర్చిదిద్దుతానని, అందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా సిద్ధమని ప్రతిజ్ఞ చేశారు.ఇదిలా ఉంటే కార్నీ తాజా వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వడం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. ఏమాత్రం రాజకీయ, పాలనానుభవం లేని మార్క్ కార్నీ దూకుడుగా కాకుండా ఆచితూచీ అడుగులేయాలని సూచిస్తున్నారు. లేకుంటే.. పరిస్థితులు చేజారిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

'రష్మిక'కు రక్షణ కల్పించాలంటూ అమిత్ షాకు 'కుల' పెద్దల లేఖ
పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్న కన్నడ బ్యూటీ 'రష్మిక మందన్న'కు రక్షణ కల్పించాలని ఆమె కులానికి (కొడవ) చెందిన సంఘం వారు రంగంలోకి దిగారు. ఈమేరకు వారు కేంద్రానికి లేఖ కూడా రాశారు. రీసెంట్గా 'ఛావా' సినిమా సక్సెస్ మీట్లో రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట భగ్గుమన్నాయి. బాలీవుడ్ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'నేను హైదరాబాద్ నుంచి వచ్చాను.. నాపై ఇక్కడి వారు చూపుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.' అని చెప్పడంతో కర్ణాటకలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సొంతూరును మరిచిపోయి ఇలా మాట్లాడటం ఏంటి అంటూ ఆమెపై కన్నడ అభిమానులు ఫైర్ అయ్యారు.రష్మికకు రక్షణగా 'కుల' పెద్దలుసౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్న రష్మికకు భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర్లకు 'కొడవ నేషనల్ కౌన్సిల్' (సీఎన్సీ) లేఖ రాసింది. రష్మిక చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేగడంతో కర్ణాటకలోని ఒక ఎమ్మెల్యేతో పాటు కన్నడ అనుకూల వర్గానికి చెందిన వారు ఆమెపై బెదిరింపులకు దిగారని (సీఎన్సీ) పేర్కొంది. దీంతో నటికి భద్రత కల్పించాలని 'కొడవ' బోర్డు కోరింది. తమ తెగకు చెందిన రష్మిక తన కృషి, ప్రతిభతో భారతీయ చిత్ర పరిశ్రమలో అఖండ విజయాన్ని సాధించిందని బోర్డు చైర్మన్ ఎన్.యు. నాచప్ప లేఖలో పేర్కొన్నారు. దేశంలోనే గొప్ప నటులుగా గుర్తింపు ఉన్న అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకుందని గుర్తుచేశారు. ఆమెకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టే తన అభిప్రాయాన్ని పంచుకుందన్నారు. కానీ, ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో ఆమెలో భయం పెరిగిందని ఆయన అన్నారు. తాను వెనుకబడిని వర్గానికి చెందిన మహిళ కాబట్టే టార్గెట్ చేసి బెదిరిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న కూడా ఫిర్యాదు చేసిందని నాచప్ప తెలిపారు. కర్ణాటకలో కొడవ వర్గం ప్రజలు ఓబీసీ కిందకు వస్తారు. రష్మిక మందన్న సామాజిక వర్గం 'కొడవ' అని తెలిసిందే.ఎమ్మెల్యే బెదిరింపులురష్మికపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 'రవి గనిగ' ఫైర్ అయ్యారు. బాలీవుడ్లో ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడతూ ఆయన ఒక ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. జీవితాన్ని ఇచ్చిన ఇండస్ట్రీని ఆమె తక్కువ చేసిందని తెలిపారు. ఈ విషయం రష్మిక తెలుసుకోవాలని కోరారు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు కూడా ఆమె అంగీకరించలేదని ఆయన ఆరోపించారు. రష్మిక మందన్నకు సరైన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే రవి పిలుపునిచ్చారు. ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనని వారిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాంటి వారి నట్లు, బోల్టులు ఎలా సరిచేయాలో తమకు తెలుసని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొడవ సామాజిక వర్గం వారు రష్మిక మందన్నకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆమెకు రక్షణ కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కొడవ వర్గం లీడర్ ఒక లేఖ రాశారు.

బాబు, పవన్ రాజకీయం.. వర్మకు వెన్నుపోటు!
ఎప్పటిలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మాట తప్పారు. చంద్రబాబు మాట మీద నిలబడితే వింతకానీ మాట తప్పితే వింతేముంది. తనది నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు కానీ.. ఈ అనుభవం వెన్నుపోట్లలోనే ఎక్కువగా ఉంటుందన్నది చరిత్ర తెరిచి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.దీనికి తాజా ఉదాహరణ కావాలా?. పిఠాపురం ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి.. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మనే తీసుకుందాం. ‘నీకెందుకు వర్మా నీ రాజకీయ భవిష్యత్ నా చేతిలో ఉంది.. మొదటి ఛాన్స్ లోనే నీకు ఎమ్మెల్సీ ఖాయం.. ముందు నువ్వు పవన్‌ను గెలిపించి చూడు.. నీ ఫ్యూచర్ ఎక్కడో ఉంటుంది’ అని ఎన్నికల సమయంలో చంద్రబాబు వేలాది మంది జనం సమక్షంలో చెప్పారు.. అదే తరుణంలో పవన్ సైతం తనకు వర్మ రాజకీయ భవిష్యత్ కన్నా పెద్ద పనేం లేదని.. ఆయన్ను ఒక స్థాయిలో పెట్టడమే తన ముందున్న కర్తవ్యం అన్నారు. ఇలా ఇద్దరు పెద్ద మనుషులు మాటిచ్చారు.దీంతో, ఇక తనకు తిరుగులేదని వర్మ కూడా నిన్న మొన్నటివరకూ దిలాసాగా ఉన్నారు. తీరా చూస్తే ఎమ్మెల్యేల కోటాలో వచ్చిన మూడుకు మూడు ఎమ్మెల్సీలను కావలి గ్రీష్మ.. బీద రవిచంద్ర.. బీటీ నాయుడులకు ఇచ్చిన చంద్రబాబు.. వర్మకు మాత్రం దెబ్బేశారు. అదేంటి తన ఫ్యూచర్ కోసం ఇద్దరు హామీలు ఇచ్చారు కానీ ఒక్కరు కూడా తన గురించి ఆలోచించలేదా అని వర్మ.. ఆయన వర్గీయులు లోలోన మదనపడుతున్నారు. కానీ, ఈ విషయం ఎక్కడా బయటకు అనలేని పరిస్థితి.ఇదిలా ఉండగా తన గెలుపు వెనుక వెన్నుదన్నుగా నిలిచిన వర్మను పవన్ కళ్యాణ్ కూడా కావాలనే పట్టించుకోవడం మానేశారా.. అది తెలుగుదేశం పార్టీ వ్యవహారం కదా మధ్యలో నేనెందుకు దూరడం అని దూరంగా ఉన్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే తన పార్టీకి దక్కిన ఎమ్మెల్సీని అన్నయ్య నాగబాబుకు ఇచ్చి.. అక్కడితో పవన్ సైలెంట్ అయ్యారు తప్ప తన కోసం పని చేసిన వర్మను పట్టించుకోలేదు. వాస్తవానికి పవన్‌లో ఈ ఆలోచన ఉండుంటే అయన చంద్రబాబుకు గట్టిగా చెప్పి వర్మకు అవకాశం ఇప్పించవచ్చు. కానీ, పవన్ ఆపని చేయలేదు.అప్పట్లో మాటైతే ఇచ్చేసారు కానీ మాటను నిజం చేసే విషయంలో పెద్దగా సీరియస్‌గా లేరు. అందుకే వర్మను ఆయన మానాన ఆయన్ను వదిలేశారు. మరోవైపు చంద్రబాబు కూడా పిఠాపురంలో పవన్ ఫిక్స్ అయిపోతున్న తరుణంలో వర్మను ఎందుకు ఇంకా మోయడం అని పక్కన పెట్టారా అనే సందేహాలు కూడా ఉన్నాయ్.. ఏదైతేనేం పవన్‌ను గెలుపు తీరానికి చేర్చిన వర్మ రేవులో తాడిచెట్టు మాదిరిగా ఒంటరిగా మిగిలిపోయారు.. చంద్రబాబు బాగా వాడుకుని వదిలేసిన వారి జాబితాలో తాజాగా చేరిపోయారు.-సిమ్మాదిరప్పన్న.

రూ.550 కోట్లతో కూతురి పెళ్లి.. దివాలా తీసిన వ్యాపారవేత్త
ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. అలాంటి ఘటన ఒకటి బడా పారిశ్రామికవేత్త విషయంలో నిజమయ్యింది. ఒకప్పుడు ఉక్కు పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా ప్రమోద్ మిట్టల్‌కు గొప్పపేరుండేది. విలాసవంతమైన జీవనశైలికి బ్రాండ్అంబాసిడర్గా ఉండే మిట్టల్ సుమారు రూ.24,000 కోట్ల అప్పు తీర్చలేక దివాలా తేశారు. ఒక్కప్పుడు తన కూతురి పెళ్లికి ఏకంగా రూ.550 కోట్లు ఖర్చు చేసి వార్తల్లో నిలిచిన ఆ వ్యక్తి ఎందుకు ఇంతలా దిగజారిపోయారు. అందుకుగల కారణాలను ఈ కథనంలో తెలుసుకుందాం.భారతీయ ఉక్కు దిగ్గజం, ప్రపంచంలోని అతిపెద్ద ఉక్కు మైనింగ్ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ఛైర్మన్, దేశంలోని స్టీల్ పరిశ్రమలో ఎన్నో విజయాలు సాధించి ‘స్టీల్ మాగ్నెట్’గా పేరు తెచ్చుకున్న లక్ష్మీ మిట్టల్ సోదరుడే ఈ ప్రమోద్ మిట్టల్. మైనింగ్, మెటల్స్ రంగంలో లక్ష్మీ మిట్టల్ అత్యంత సంపన్నుల్లో ఒకరిగా కొనసాగుతుండగా, ప్రమోద్ అదృష్టం మరో మలుపు తిరిగింది. బిలియనీర్‌గా, ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ప్రమోద్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగించారు. 2013లో తన కుమార్తె సృష్టి మిట్టల్ పెళ్లి కోసం రూ.550 కోట్లు వెచ్చించి వార్తల్లో నిలిచారు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఈ వివాహ కార్యక్రమంలో రుచికరమైన వంటకాలు, విస్తారమైన అలంకరణలు, హైప్రొఫైల్ అతిథులు పాల్గొన్నారు.బోస్నియా కోక్ ఉత్పత్తిదారు గ్లోబల్ ఇస్పాత్ కోక్స్నా ఇండస్ట్రీస్ లుకావాక్ (జీఐకేఐఎల్) చేసిన అప్పులకు హామీదారుగా ప్రమోద్ మిట్టల్ పాత్ర ఉందని అధికారులు తెలిపారు. ఇది దాని ఆర్థిక బాధ్యతలను తీర్చడంలో విఫలమైంది. దాంతో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్న ప్రమోద్ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. మోసం ఆరోపణలపై 2019లో బోస్నియాలో తనను అరెస్టు చేశారు. రూ.24,000 కోట్లకు పైగా అప్పులతో ప్రమోద్ దివాలా తీసినట్లు 2020లో లండన్ కోర్టు ప్రకటించింది. తుజ్లాలోని కంటోనల్ కోర్టు జీఐకేఐఎల్ నష్టపరిహారంగా దాదాపు 11 మిలియన్ యూరోలను డిపాజిట్ చేయాలని ప్రమోద్ను ఆదేశించింది. దాంతో అతని ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి.ఇదీ చదవండి: 100 మంది ఐటీ ఉద్యోగులు ర్యాలీ.. కారణం..ప్రమోద్ మిట్టల్ వ్యవహారం నేర్పే ఆర్థిక పాఠాలు..మితిమీరిన అప్పులు: మిట్టల్ ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణం మితిమీరిన అప్పులు చేయడం. తిరిగి చెల్లించే సామర్థ్యానికి మించి రుణాలు తీసుకోవడం వ్యక్తులకు, వ్యాపారాలకు దివాలాకు దారితీస్తుంది.వివేకవంతమైన ఖర్చు: తన కుమార్తె వివాహానికి విచ్చలవిడిగా ఖర్చు చేయడం, సంపదను ప్రదర్శించడం, అదుపులేని దుబారా వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యమివ్వడం కీలకం.రిస్క్ మేనేజ్మెంట్: జీఐకేఐఎల్ కేసులో మిట్టల్ చేసినట్లుగా రుణాలకు హామీదారుగా వ్యవహరించడం సరికాదు. అవతలి పక్షం అప్పులు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హామీలకు కట్టుబడి ఉండేముందు ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.ఫైనాన్షియల్ ప్లానింగ్: అపారమైన సంపద ఉన్నప్పటికీ పేలవమైన ఆర్థిక ప్రణాళిక, ఆకస్మిక నిల్వలు లేకపోవడం దివాలాకు దారితీస్తుంది. అత్యవసర నిధిని నిర్వహించేటప్పుడు ఆస్తులను వైవిధ్యపరచడం చాలా ముఖ్యం.

ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ చివరి అభ్యర్థి పేరును ప్రకటించారు. బీజేపీ తరఫున పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు పేరును ఖరారు చేశారు. తద్వారా గత ఎన్నికల టైం నుంచి పార్టీలో కొనసాగుతున్న లుకలుకలకు అధిష్టానం చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో.. చంద్రబాబు తన మార్క్ రాజకీయం నడిపించారు. ఒరిజినల్ బీజేపీ నేతలకు సీట్లు దక్కకపోవడంతో సంఘ్‌పరివార్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కారు. ఎమ్మెల్యే, ఎంపీ సీటు దక్కుతుందని ఆయన ఆశించినా.. అది నెరవేరలేదు. సామాజిక సమీకరణాలను కూడా పట్టించుకోకపోవడంతో బీజేపీ అధిష్టానం తప్పు చేసిందనే చర్చ విపరీతంగా నడిచింది. అయితే ఆ తప్పును వీర్రాజు ఎంపిక ద్వారా అధిష్టానం ఇప్పుడు సరిద్దుకున్నట్లు కనిపిస్తోంది. తొలుత ప్రచారంలో చాలామంది పేర్లు వినిపించినప్పటికీ.. సోము వీర్రాజు వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సినియారిటీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పవర్ బ్యాలెన్స్ చేసేందుకు ఆయన సామాజిక వర్గాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. మూడు టీడీపీ తీసుకుంది. ఒకటి జనసేన(కొణిదెల నాగబాబు), మరొకటి బీజేపీకి కేటాయించింది.

SLBC: నేడు మరో రెండు మృతదేహాలు వెలికితీత!
సాక్షి, మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు 17వ రోజు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని ఒక్కొక్కరికిగా గుర్తిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఆదివారం ఎట్టకేలకు ఒక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఎత్తు, చేతి కడియం తదితర ఆనవాళ్లను బట్టి పంజాబ్‌కు చెందిన టీబీఎం ఆపరేటర్ గుర్‌ప్రీత్‌సింగ్ (40)గా గుర్తించారు. గురుప్రీత్ సింగ్ మృతదేహాం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. నేడు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది.గత నెల 22న ఎస్ఎల్బీసీ సొరంగంలో చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా ఎనిమిది మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సొరంగంలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం టీబీఎం ఆపరేటర్ గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు తెలిపారు.సహాయచర్యల్లో భాగంగా సొరంగం లోపల పేరుకుపోయిన మట్టి, టీబీఎం యంత్రం దిగువన డాప్లర్ సంకేతాలతో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ (స్నిఫర్స్) కూడా పలువురి ఆనవాళ్లను పసిగట్టాయి. దీంతో, శనివారం రాత్రి సహాయక బృందాలు టీబీఎం ఎడమవైపు భాగంలో తవ్వుతుండగా ఆరు అడుగుల లోతులో మొదట కుడిచేతి వేళ్లు, చేతి కడియం కనిపించాయి. అధికారుల సూచనల మేరకు గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని జాగ్రత్తగా వెలికితీశారు. ఇంజినీర్ ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటూ ఇటూ మరో ముగ్గురి జాడ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈరోజు మరో ఇద్దరి జాడ లభించే అవకాశం ఉందని సహాయ బృందాలు తెలిపాయి. మిగిలినవారు సొరంగం చిట్టచివరి భాగం వద్ద టీబీఎం కట్టర్ సమీపంలో చిక్కుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.మూడేళ్లుగా గుర్‌ప్రీత్‌సింగ్ విధులు ఎస్ఎల్బీసీ సొరంగంలో మృతదేహం లభ్యమైన గుర్‌ప్రీత్‌సింగ్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని తరన్‌తరాన్. రాబిన్స్ సంస్థలో 2022 నుంచి టీబీఎం ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రాజేందర్ కౌర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాపిల్లలు స్వస్థలంలో ఉండగా.. గుర్‌ప్రీత్‌సింగ్ మూడేళ్లుగా దోమలపెంటలోని రాబిన్స్ క్యాంపులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగాక బంధువులు వచ్చి కొన్ని రోజులు వేచిచూశారు. ఆచూకీ తెలియకపోవడంతో స్వస్థలానికి వెళ్లిపోయారు.

పదకొండేళ్లకే బీఎస్సీ, 21 ఏళ్లకే పీహెచ్డీ..!
కొందరు చిన్న వయసులోనే అసాధారణ తెలివితేటలు, ప్రతిభ సామర్థ్యంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఈ అసామాన్య వ్యక్తులు అందరిలా కాకుండా చిన్న వయసులోనే పెద్ద పెద్ద డిగ్రీలు పూర్తి చేసి శెభాష్ అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే తథాగత్ అవతార్ తులసి. అతడి అసామాన్య ప్రతిభ గురించి తెలిస్తే నోటమాట రాదు. మరీ అతడి ప్రతిభాపాటవాలేంటో చూద్దామా..!.ఆ అసామాన్యుడే తథాగత్ అవతార్ తులసి. ఆయన సెప్టెంబర్ 9, 1987న బిహార్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తథాగత్ చిన్నప్పటి నుంచి తన అసాధారణ మేథాతో అందర్నీ ఆశ్చర్యపరిచేవాడు. అలా తథాగత్ 9 ఏళ్లకే పాఠశాల విద్యను పూర్తి చేశాడు. 11 ఏళ్లకు బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇక 12 ఏళ్లకే ఎంఎస్సీ పూర్తి చేసి, 21 ఏళ్లకే డాక్టరేట్‌ని పొందాడు. ఆ విధంగా 22 ఏళ్ల వయసుకే ప్రతిష్టాత్మక ఐఐటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్ అయ్యాడు. ఈ అపార ప్రతిభాశాలి పీహెచ్‌డీలో క్వాంటం సెర్చ్ అల్గారిథంపై పరిశోధన చేసి మంచి పేరుతెచ్చుకున్నాడు. అంతేగాదు తథాగత్ ప్రఖ్యాత శాస్త్రవేత్త లవ్ గ్రోవర్తో కలిసి ఒక పరిశోధనా పత్రాన్ని కూడా రచించాడు అయితే అది ఏ జర్నల్‌లోనూ ప్రచురితం కాలేదు. అయితే ప్రస్తుతం ఆయన 2019లో ఐఐటీ బాంబే నుంచి తొలగించబడ్డారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఉద్యోగ పోరాటం చేస్తున్నారు. 2011లో తథాగత్ తీవ్ర జ్వరం బారినపడీ అలెర్జీకి గురయ్యాడు. ఆ అనారోగ్యం చాలా ఏళ్ల పాటు కొనసాగడంతో సుదీర్ఘ సెలవు తీసుకున్నాడు. చివరికి 2013లో ముంబై విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. ఆ కారణాల వల్లే 2019లో తథాగత్ ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోయాడు. తన అనారోగ్య సమస్యల కారణంగా ముంబైలో నివసించడం సాధ్యం కాదని, తనని ప్రత్యేక కేసు కింద IIT ఢిల్లీకి బదిలీ కోసం అభర్థిస్తున్నారు తథాగత్. అందుకోసం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించనున్నట్లు సమాచారం. చివరగా తథాగత్ మాట్లాడుతూ..క్వాంటం కంప్యూటర్ల రంగం పరంగా నాదేశం అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ అంశంపైనే చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నాను. కేవలం 17 ఏళ్ల వయసులో లవ్ గ్రోవర్ మార్గదర్శకత్వంలో దీనిపై పనిచేయడం ప్రారంభించాను. తన పరిశోధన ప్రొఫైల్ ముందు బాగానే ఉంది. ఆ తర్వాత తన అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ పరిశోధనపై ఫోకస్ పెట్టలేకపోయానని వాపోయారు. కానీ ఇప్పుడు తాను క్వాంటం కంప్యూటర్ల రంగానికి తోడ్పాలని కోరుకుంటున్నానని అన్నారు. అదీగాక మన భారతదేశంలో క్వాంటం కంప్యూటర్లపై రూ. 8 వేల కోట్లు ఆంక్షలు ఉన్నాయి. కావున ఆ సమస్యకు చెక్‌పెట్టేలా ఈరంగంలో మంచి విప్లవం తీసుకురాగలనని ధీమాగా చెప్పారు తథాగత్ .సత్కారాలు, అవార్డులు..1994లో, తథాగత అవతార్ తులసిని అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సత్కరించారు. ఆయన సాధించిన విజయానికి బహుమతిగా ఆయనకు కొంత డబ్బుని పారితోషకంగా ఇచ్చారు. కానీ తథాగత్ ఆ డబ్బుని తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆయనకు ఒక మంచి కంప్యూటర్ని బహుమతిగా ఇచ్చారు. అది ఆయనకు మరిన్ని గొప్ప విజయాలను సాధించడానికి సహాయపడింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం తథాగత్ సాధించిన విజయాలకు అబ్బురపడటమే గాక అతడిని ఘనంగా సత్కరించారు కూడా. (చదవండి: అంతా జేమ్స్ బాండ్ హీరో హీరో సెవన్‌గా కీర్తిస్తారు..కానీ ఆయన..!)
హీరోయిన్ అంజలితో రిలేషన్? కోన వెంకట్ ఆన్సరిదే..
Amrutha Pranay Case Verdict : పీవోడబ్లూ సంధ్య స్పందన ఇదే!
ఓటీటీలో సైన్స్ ఫిక్షన్ సినిమా.. ఇన్‌స్టా ఫేమ్ 'అమృత చౌదరి'కి ఫ్యాన్స్ ఫిదా
ఛాంపియన్స్‌గా భారత్.. చిన్నపిల్లాడిలా గంతులేసిన గవాస్కర్! వీడియో
పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..?
ఐపీఎల్లో పొగాకు, మద్యం ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం?
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు
బాబు, పవన్ రాజకీయం.. వర్మకు వెన్నుపోటు!
ఘోర రోడ్డు ప్రమాదం.. సజీవదహనమైన తల్లి, కుమారుడు..
స్వల్పంగా పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..
మా స్పిన్నర్లు అద్భుతం.. అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు: రోహిత్
CT 2025 Final: రవీంద్ర జడేజా రిటైర్మెంట్..?
ఏదో ఒక్క నిరుద్యోగులకు మాత్రమే ద్రోహం చేసినట్లు మాట్లాడుతున్నారేంటి సార్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
వైట్ జాకెట్స్... ఈ ‘చాంపియన్స్’కే ఎందుకు!
నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి
కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ
#SSMB29: వాట్ ద ఎఫ్.. రాజమౌళి?
ఈ ఏడాది హెచ్1బీ వీసాలు కష్టమే
రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..
హీరోయిన్ అంజలితో రిలేషన్? కోన వెంకట్ ఆన్సరిదే..
Amrutha Pranay Case Verdict : పీవోడబ్లూ సంధ్య స్పందన ఇదే!
ఓటీటీలో సైన్స్ ఫిక్షన్ సినిమా.. ఇన్‌స్టా ఫేమ్ 'అమృత చౌదరి'కి ఫ్యాన్స్ ఫిదా
ఛాంపియన్స్‌గా భారత్.. చిన్నపిల్లాడిలా గంతులేసిన గవాస్కర్! వీడియో
పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..?
ఐపీఎల్లో పొగాకు, మద్యం ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం?
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు
బాబు, పవన్ రాజకీయం.. వర్మకు వెన్నుపోటు!
ఘోర రోడ్డు ప్రమాదం.. సజీవదహనమైన తల్లి, కుమారుడు..
స్వల్పంగా పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..
మా స్పిన్నర్లు అద్భుతం.. అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు: రోహిత్
CT 2025 Final: రవీంద్ర జడేజా రిటైర్మెంట్..?
ఏదో ఒక్క నిరుద్యోగులకు మాత్రమే ద్రోహం చేసినట్లు మాట్లాడుతున్నారేంటి సార్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
వైట్ జాకెట్స్... ఈ ‘చాంపియన్స్’కే ఎందుకు!
నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి
కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ
#SSMB29: వాట్ ద ఎఫ్.. రాజమౌళి?
ఈ ఏడాది హెచ్1బీ వీసాలు కష్టమే
రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..
సినిమా

పార్టీలో ఫుల్ హ్యాపీగా సితార-నమ్రత-చరణ్
రీసెంట్ టైంలో పెళ్లిళ్లు చాలా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర సెలబ్రిటీల వరకు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో నిర్మాత మహేశ్వర్ రెడ్డి కుమారుడు నితీశ్ రెడ్డి పెళ్లి దుబాయిలో జరిగింది. దీనికి టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలేంటంటే?)దుబాయిలో జరిగిన పెళ్లికి చిరంజీవి, ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాగార్జున కుటుంబాలు వెళ్లాయి. తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్ లో రిసెప్షన్ జరగ్గా.. నమ్రత-సితార, రామ్ చరణ్-ఉపాసన దంపతులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని నమ్రత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కొత్త జంట నితీష్-కీర్తిని ఆశీర్వదించింది.అయితే పార్టీలంటే ముందుండే మహేశ్ బాబు మాత్రం రాజమౌళితో తీస్తున్న సినిమా షూటింగ్ వల్ల వీటిని మిస్ అవుతున్నాడు. ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలోని కొండల్లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించి లీకైన ఓ వీడియో క్లిప్ కూడా తెగ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల హడావుడి నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం థియేటర్లలోకి 'కోర్ట్', 'దిల్ రుబా' అనే తెలుగు చిత్రాలతో పాటు 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' అనే డబ్బింగ్ మూవీ రిలీజ్ అవుతోంది. మరోవైపు 'యుగానికి ఒక్కడు' ఈ వారమే రీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)ఇవి కాకుండా ఓటీటీల్లోకి కేవలం 9 సినిమాలు-వెబ్ సిరీసులు మాత్రమే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో అఖిల్ 'ఏజెంట్', రామం రాఘవం, రేఖాచిత్రం చిత్రాలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏయే మూవీస్ ఏ ఓటీటీల్లోకి రాబోతున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 10-16 వరకు)సోనీ లివ్ఏజెంట్ (తెలుగు సినిమా) - మార్చి 14అమెజాన్ ప్రైమ్వీల్ ఆఫ్ టైమ్ 3 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మార్చి 13బీ హ్యాపీ (హిందీ మూవీ) - మార్చి 14ఒరు జాతి జాతికమ్ (మలయాళ సినిమా) - మార్చి 14నెట్ ఫ్లిక్స్అమెరికన్ మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మార్చి 10హాట్ స్టార్పొన్ మ్యాన్ (మలయాళ సినిమా) - మార్చి 14మోనా 2 (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 14జీ5వనవాస్ (హిందీ సినిమా) - మార్చి 14సన్ నెక్స్ట్రామం రాఘవం (తెలుగు మూవీ) - మార్చి 14 ఆహారేఖాచిత్రం (తెలుగు సినిమా) - మార్చి 14ఆపిల్ టీవీ ప్లస్డోప్ థీప్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14(ఇదీ చదవండి: గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ)

ఓటీటీలో రచిత గ్లామరస్ సినిమా.. మొత్తం 'ఫైర్' అయిపోతారు
కోలీవుడ్‌లో సెన్సేషనల్ చిత్రంగా నిలిచిన సినిమా 'ఫైర్' ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమాలో రచిత మహాలక్ష్మి గ్లామర్ డోస్ పెంచడంతో ఈ చిత్రం పేరు నెట్టింట వైరల్ అయింది. 'ఫైర్' చిత్రంలోని ఒక పాటలో ఆమె మితిమీరిన రొమాన్స్ సీన్లతో అదరగొట్టేసింది. ఇంకేముంది ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేశాయి. తెలుగు, తమిళ్, కన్నడ సీరియల్స్‌లో బాగా గుర్తింపు ఉన్న ఆమెకు ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఛాన్స్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలో రచిత నటించిన తాజా చిత్రం 'ఫైర్' ఫిబ్రవరి 14న విడుదల అయింది.'ఫైర్' చిత్రంలో బాలాజీ మురుగదాస్, చాందిని తమిళరసన్, రచిత మహాలక్ష్మి, సాక్షి అగర్వాల్ నటించారు. జెఎస్కే సతీష్ కుమార్ దర్శకత్వం వహించారు. క్రైమ్,థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కాస్త ఫర్వాలేదని టాక్ తెచ్చుకుంది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. మార్చి 14న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. అయితే, తమిళ్లో పాపులర్ అయిన టెంట్కొట్టా (Tentkotta)లో స్ట్రీమింగ్ కానుంది. రచిత మహాలక్ష్మి ఇచ్చిన గ్లామర్ ట్రీట్‌కు భారీ ధరను చెల్లించి ఫైర్ చిత్రాన్ని ఆ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో టెంట్కొట్టా ఓటీటీ సబ్ స్క్రైబర్స్ కూడా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.తెలుగులో రచితతెలుగులో 2013-2016 సమయంలో టెలికాస్ట్ అయిన స్వాతి చినుకులు సీరియల్లో నీలా పాత్రలో ఆమె నటించింది. 2020లో చిట్టితల్లి అనే సిరీయల్లో శకుంతల పాత్రలో మెప్పించింది. అయితే, ఆమె నటించిన కొత్త సినిమా తెలుగులో జనవరి 24న విడుదలైంది. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "తల్లి మనసు". ఈ సినిమాను వి శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మించారు.

డేటింగ్లో 'చాహల్'.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు ఆమెతో పాటు ఎంట్రీ
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్, నటి ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు నిజమే అయినప్పటికీ అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే, చహల్ మరో యువతితో డేటింగ్లో ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఆర్జే మహ్వాష్తో(RJ Mahvash) డేటింగే వల్లే చహల్ కాపురంలో చిచ్చు మొదలైందని పుకార్లు కూడా వచ్చాయి. కొద్దిరోజుల క్రితమే వాటిని మహ్వాష్ తిప్పికొట్టింది. అవన్నీ రూమర్స్ మాత్రమేనని ఆమె పేర్కొంది. అయితే, తాజాగా వారిద్దరూ కలిసి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సందడి చేశారు. దీంతో మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నారు.ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ఇండియా అందుకుంది. ఇంతటి సంబరంలో కూడా యుజ్వేంద్ర చహల్, ఆర్జే మహ్వాష్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వారిద్దరూ ప్రేక్షకుల గ్యాలరీలో సందడిగా కనిపించారు. చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలను షోషల్‌మీడియాలో కొందరు షేర్ చేశారు. గతంలో వీళ్లిద్దరూ రెస్టారెంట్లో కనిపించిగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇలా మరోసారి సన్నిహితంగా కనిపించడంతో వారిద్దరిపై వస్తున్న డేటింగ్ వార్తలు నిజమేననే అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఒక సందర్భంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ కూడా ఈ జంటతో ముచ్చటించారు. ఆయన కూడా చహల్, మహ్వాష్ ఫోటోలను షేర్ చేశారు.ఆర్జే మహ్వాష్ సినీ నటి మాత్రమే కాదు.. ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు నిర్మాతగా ఉన్నారు. నిర్మాణ కార్యక్రమంలో ఉన్న ఆ చిత్రం త్వరలో విడుదల కానుంది. అయితే, ఆమెకు రేడియో జాకీగా మొదట బాగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు క్రికెటర్ యుజ్వేంద్ర చహల్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో ఆమె పేరు ట్రెండ్ అవుతుంది.Following separation from actress-choreographer #DhanashreeVerma, cricketer #YuzvendraChahal was spotted with #RJMahvash watching #INDvsNZ Champions Trophy final in Dubai. pic.twitter.com/j5cjTXcdvL— Cinemania (@CinemaniaIndia) March 9, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ
భారత క్రికెట్ జట్టు ఏడాది తిరగకముందే మరో ఐసీసీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా టీమిండియా నిలిచింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు.. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. అయితే ఈ మెగా టోర్నీలో భారత తరపున అత్యంత కీలకమైన ప్రదర్శన చేసిన ఆటగాడు ఎవరంటే? కొంతమంది ఫైనల్లో 76 పరుగులు చేసిన రోహిత్ శర్మ పేరు చెబుతుంటే.. మరి కొంతమంది పాక్‌పై సెంచరీ, సెమీస్‌లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లి పేరు చెబుతున్నారు. వీరిద్దరూ కాకపోతే కేవలం మూడు మ్యాచ్‌ల్లో 9 వికెట్ల వికెట్లు పడగొట్టిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేరును ఎంచుకుంటున్నారు.. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం.. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) అందరికంటే అద్బుతంగా ఆడాడని ప్రశించాడు. అయ్యర్ ఒక సైలెంట్ హీరో అని హిట్‌మ్యాన్ కొనియాడాడు.సూపర్ శ్రేయస్..అవును.. ఈ మెగా టోర్నీ అసాంతం శ్రేయస్ అయ్యర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి అతడు ముందుకు వచ్చి ఆదుకున్నాడు. మిడిలార్డర్లో భారత జట్టు వెన్నెముకగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ఔటయ్యాక అక్షర్ పటేల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 61 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒకవేళ ఈ భాగస్వామ్యం రాకపోయింటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఓవరాల్‌గా శ్రేయస్ 5 మ్యాచ్‌ల్లో 243 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్లో భారత్ తరపున అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు."శ్రేయస్ అయ్యర్ మాకు సైలెంట్ హీరో. అతడు మిడిలార్డర్లో చాలా కీలకమైన ఆటగాడు. ఈ మ్యాచ్‌లో నేను ఔటయ్యాక అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్‌తో భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ తన వంతు పాత్ర పోషించాడు. అతడు ఒత్తిడిలో ఇంకా అద్బుతంగా ఆడుతాడని" రోహిత్ శర్మ పేర్కొన్నాడు.అప్పుడు వేటు.. ఇప్పుడు ప్రమోషన్కాగా గతేడాది అయ్యర్ తన కెరీర్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో అయ్యర్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అంతేకాకుండా అతడు జాతీయ జట్టుకు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి పని అయిపోయింది అంతా భావించారు. కానీ అయ్యర్ మాత్రం పడిలేచిన కేరటంలా తిరిగొచ్చాడు.దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో అతడిని సెలక్టర్లు తిరిగి జాతీయ జట్టులోకి తీసుకున్నారు. తన రీ ఎంట్రీలో అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలో అతడికి తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. త్వరలోనే బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
గత కొన్ని రోజులుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు శుభం కార్డ్ పడింది. ఈ మెగా టోర్నీ విజేతగా భారత్(Teamindia) నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన రోహిత్ సేన.. ఫైనల్లోనూ అదే జోరును కనబరిచి పుష్కరకాలం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని తిరిగి భారత్‌కు తీసుకొచ్చింది. భారత్ చివరగా 2013లో ధోని సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోగా.. మళ్లీ రోహిత్ శర్మ నాయకత్వంలో తిరిగి సాధ్యమైంది. ఇక ఛాంపియన్స్‌గా నిలిచిన భారత్ ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా న్యూజిలాండ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.విజేతకు ఎంతంటే?ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్‌గా నిలిచిన టీమిండియాకు 2.4 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) అందుకుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన కివీస్‌కు 1.12 మిలియన్ డాలర్ల (రూ.9.72కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. సెమీఫైనల్లో ఓటిమిపాలైన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లకు 560,000 డాలర్లు (రూ.4.86కోట్లు) లభించాయి. ఐదో, ఆరో స్ధానాల్లో నిలిచిన జట్లు 350,000 డాలర్లు(రూ. 3 కోట్లు పైగా).. ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లు 140,000 డాలర్లు(రూ. సుమారు 1.2 కోట్లు) దక్కించుకున్నాయి. గ్రూపు స్టేజిలో విజయం సాధించిన జట్టుకు 34,000 డాలర్లు (సుమారు రూ. 33 లక్షలు) అందనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గోన్నందకు ప్రతీ జట్టుకు 125,000 డాలర్లు(రూ.కోటి) ఐసీసీ అందజేయనుంది. అంటే ఈ మెత్తాన భారత్‌కు రూ. 21 కోట్లపైనే అందింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత జట్టు అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను తిరిగి ముద్దాడింది. ఈ విజయంతో 25 ఏళ్ల కిందట కివీస్ చేతిలో ఎదురైన పరాభావానికి భారత జట్టు బదులు తీర్చుకుంది. ఈ మెగా టోర్నీలో అద్వితీయమైన ప్రదర్శన కనబరిచిన రోహిత్ సేన.. మరోసారి 140 కోట్లమంది భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. తొలుత బౌలర్లు అదరగొట్టగా.. అనంతరం బ్యాటర్లు తమ పని తాము చేసుకుపోయారు. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.రోహిత్ మాస్.. రాహుల్ క్లాస్లక్ష్య చేధనలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లను హిట్‌మ్యాన్ టార్గెట్ చేశాడు. పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురిపించాడు. 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అయితే సెంచరీ చేరువలో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మరోసారి వెన్నముకగా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 48, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.టీమిండియా వరల్డ్ రికార్డు..కాగాభారత్కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. ఈ క్రమంలో టీమిండియా ఓ ప్రపంచరికార్డును తమ పేరిట లిఖించుకుంది. మూడు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా.. ఆ తర్వాత 2013, 2025లో ఈ మెగా టోర్నీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా, భారత్ పేరిట సంయుక్తంగా ఉండేది. కానీ ఈ విజయంతో ఆసీస్‌ను మెన్ బ్లూ అధిగమించింది. అదేవిధంగా వరుసగా రెండు ఐసీసీ టోర్నీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్స్‌గా నిలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. టీ20 ప్రపంచకప్-2024లో ఆజేయంగా విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒక్క మ్యాచ్‌లో కూడా టీమిండియా ఓడిపోలేదు.చదవండి: #Rohit Sharma: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..

రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..
విశ్వవేదికపై మరోసారి భారత జెండా రెపరెపలాడింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత క్రికెట్ జట్టు నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడింది.ఈ విజయంతో ఏడాది తిరగకముందే మరో ఐసీసీ టైటిల్ భారత్ ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన వన్డే రిటైర్మెంట్ వస్తున్న వార్తలకు రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హిట్‌మ్యాన్.. ఇప్పటిలో రిటైర్ అయ్యే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు.ఇప్పుడే కాదు.."చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం. రాహుల్ మానసికంగా దృఢంగా ఉంటాడు.సరైన షాట్లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్‌ను ముగించగలిగాడు. అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్ బౌలింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్‌పై అలాంటి బౌలర్ కావాలని అంతా కోరుకుంటారు. మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. దూకుడుగా బ్యాటింగ్ చేసేందుకు నన్ను కోచ్ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్‌నుంచి రిటైర్ కావడం లేదు.ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను. సుదీర్ఘమైన క్రికెట్ ఆడినవారికి ఇంకా ఆడాలని ఉంటుంది. అయితే ఇది యువ ఆటగాళ్లపై ప్రభావం చూపుతోంది అని 38 ఏళ్ల రోహిత్ పోస్ట్‌మ్యాచ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా రోహిత్, కోహ్లి ఇద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగే అవకాశముంది.భారత్ ఆల్‌రౌండ్ షో..ఈ ఫైనల్ పోరులో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 34 నాటౌట్) కీలక నాక్స్ ఆడారు. కివీస్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర, జెమీసన్ చెరో వికెట్ సాధించింది.చదవండి:మా స్పిన్నర్లు అద్భుతం.. ఆ ఇద్దరు సూపర్.. అతడు నాణ్యమైన బౌలర్: రోహిత్
బిజినెస్

మహిళలకూ కావాలి సమగ్ర బీమా
సంరక్షకులుగా, కుమార్తెలుగా, మాతృమూర్తులుగా తమ కుటుంబాల సంక్షేమం కోసం మహిళలు సమాజంలో ఎంతో కీలకమైన, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుంటారు. అయితే ఈ బాధ్యతలను నిర్వర్తించడంలో వారు సాధారణంగానే తమ సొంత ఆర్థిక, వైద్య భద్రత విషయాలను అంతగా పట్టించుకోరు. అందుకే చాలా మంది మహిళలకు తగినంత బీమా భద్రత లేకపోవడమో లేదా పూర్తిగా తమ జీవిత భాగస్వామి లేదా బంధువు బీమాపైనో ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటోంది. జీవిత కాలం ఎక్కువగా ఉండటం, కెరియర్లో అంతరాయాలు, భారీ ఆరోగ్య సంరక్షణ ఖర్చుల్లాంటి ప్రత్యేక ఆరోగ్య, ఆర్థిక సవాళ్లెన్నో మహిళలకు ఉంటాయి. అందుకే వారి స్వాతంత్య్రానికి, స్థిరత్వానికి తగినంత బీమా రక్షణ ఉండటం ఎంతో అవసరం.కీలకంగా బీమా ..సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కాలం జీవించినప్పటికీ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిమితుల కారణంగా సుదీర్ఘ కాలం పాటు మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం ఉండకపోవచ్చు. సమగ్రమైన బీమా కవరేజీ ఉంటే సముచితమైన ఆరోగ్య సంరక్షణ పొందడానికి అవకాశాలు గణనీయంగా మెరుగుపడగలవు. 2023, 2024 మధ్య కాలంలో చూస్తే 15 నుంచి 49 ఏళ్ల వరకు వయస్సున్న మహిళల్లో 30 శాతం మందికి ఎటువంటి ఆరోగ్య బీమా గానీ ఆర్థిక రక్షణ కవచం గానీ లేదని వెల్లడైంది. ఇలా చాలా మంది మహిళలు తమ సొంత అవసరాలను పక్కన పెట్టి కుటుంబ అవసరాలకే ప్రాధాన్యమిస్తుంటారు. ఆర్థిక పరిమితుల వల్ల నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతుంటారు.మెటర్నిటీ, కుటుంబ భద్రతప్రసవానికి పూర్వ పరీక్షలు, ప్రసవ వ్యయాలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువుల వైద్య అవసరాలకు అవసరమైన కీలక ఆర్థిక సహాయాన్ని మెటర్నిటీ ఇన్సూరెన్స్ అందిస్తుంది. పిల్లల కోసం సన్నద్ధమవుతున్న యువ జంటలకు ఇలాంటి పాలసీలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. శిశుజననం, సంబంధిత ఖర్చుల విషయంలో ఆర్థికంగా సన్నద్ధంగా ఉండేందుకు ఇవి సహాయకరంగా ఉంటాయి. చాలా మంది మహిళలు సాధారణంగా ఉద్యోగాలు చేసే సంస్థ ఇచ్చే బీమాపైనో లేదా జీవిత భాగస్వామి బీమాపైనో ఆధారపడుతుంటారు. కానీ సొంతంగా పాలసీ ఉంటే మరింత ఆర్థిక భద్రత ఉంటుంది. కెరియర్ మార్పుల వల్ల లేదా జీవితంలో మార్పుల వల్ల కవరేజీపై ప్రభావం పడే పరిస్థితుల్లో ఇదెంతో అండగా ఉంటుంది.రిటైర్మెంట్, దీర్ఘకాలిక సంరక్షణ ప్రణాళికమహిళలు సాధారణంగా పెద్ద వయస్సులోని బంధువుల బాగోగులను చూసుకునే సంరక్షకుల పాత్రను కూడా పోషిస్తూ ఉంటారు. ఇది భావోద్వేగాలపరంగా, ఆర్థికంగా భారంగా ఉండొచ్చు. దీర్ఘకాలిక సంరక్షణ బీమా అనేది వైద్య వ్యయాలను, ఆర్థిక ఒత్తిళ్లను అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. సంరక్షకులు అలాగే వారిపై ఆధారపడిన వారికి కూడా మెరుగైన సహాయం లభించేలా తోడ్పడుతుంది. అంతేగాకుండా, జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ త ర్వాత కూడా స్థిరమైన, మెరుగైన జీవితాన్ని సాగించేలా మహిళలు పెన్షన్ ప్లాన్లు లేదా యాన్యుటీ ఆధారిత బీమా పాలసీలను తప్పక పరిశీలించాలి.వైకల్యం, ఆదాయ భద్రతపిల్లల సంరక్షణ కోసం కావచ్చు లేదా వయస్సు పైబడుతున్న తల్లిదండ్రుల సంరక్షణ కోసం కావచ్చు చాలా మంది మహిళలకు కెరియర్లో అంతరాయాలు ఏర్పడుతుంటాయి. దీనితో వారు పని చేసే కంపెనీల నుంచి బీమా ప్రయోజనాలు పరిమితంగానే ఉండొచ్చు. అలాగే దీర్ఘకాలిక పొదుపు కూడా తగ్గుతుంది. అనారోగ్యం లేదా ప్రమాదం బారిన పడి పని చేసే పరిస్థితి లేనప్పుడు కూడా స్థిరమైన ఆదాయం లభించేలా డిజేబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఆర్థిక భద్రతను అందిస్తుంది. జీవితపు అనిశ్చితుల్లోనూ ఆర్థిక భద్రత ఉండేందుకు ఈ రక్షణ ఉపయోగపడుతుంది.స్థిరమైన భవిష్యత్తుకు రక్షణ కవచంమహిళలు తమ ఆర్థిక స్వతంత్రత, ఆరోగ్య సంరక్షణ భద్రతకు తప్పక ప్రాధాన్యమివ్వాలి. వీలైనంత ముందుగా సమగ్ర బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, అనూహ్య ఆర్థిక కష్టాల నుంచి రక్షణను, దీర్ఘకాలికంగా స్థిరత్వాన్ని పొందేందుకు వీలవుతుంది. క్రియాశీలకమైన చర్యలు తీసుకోవడం ద్వారా అనుకోని సవాళ్ల నుంచి మహిళలు తమను, తమ కుటుంబాలను రక్షించుకోవచ్చు.స్వతంత్రంగా నిర్ణయాలుతొలినాళ్లలోనే బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మహిళలు ఆర్థిక ప్రణాళికల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. చిన్న వయస్సులోనే బీమా తీసుకోవడం వల్ల ప్రీమియంల భారం తక్కువగా ఉంటుంది. అలాగే ప్రీ–ఎగ్జిస్టింగ్ కండీషన్స్‌కి సంబంధించిన ఎక్స్‌క్లూజన్స్ కూడా తగ్గుతాయి. యుక్తవయస్సులోని చాలా యువతులకు తమ తల్లిదండ్రుల హెల్త్ ఇన్సూరెన్స్‌తో కవరేజీ లభిస్తుంది. అయితే, స్వతంత్ర పాలసీకి మారడం వల్ల, డిపెండెంట్ కవరేజీ వయో పరిమితిని దాటిన తర్వాత కూడా నిరంతరాయ కవరేజీ, అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.ఇదీ చదవండి: ఈటీఎఫ్‌లు–ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం?స్మార్ట్ ఆర్థిక ప్రణాళికఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ, 80డీ కింద జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఆ రకంగా చూస్తే ఇవి ఆర్థికంగా స్మార్ట్ పెట్టుబడి సాధనాలుగా కూడా ఉంటాయి. వీలైనంత ముందుగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టిన మహిళలకు తక్కువ ప్రీమియంలతో ఎక్కువ కవరేజీ, తద్వారా దీర్ఘకాలం పాటు ఆర్థిక భద్రత ప్రయోజనాలు లభిస్తాయి. మెటర్నిటీ కేర్, డెలివరీ, ఫెర్టిలిటీ చికిత్సలు సహా మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన ఆరోగ్యసంరక్షణ అవసరాలను తీర్చే విధంగా బీమా పాలసీలు ఉంటాయి. మూడేళ్ల పాటు లైఫ్ కవరేజీ సహా సరోగేట్ తల్లులకు పూర్తి కవరేజీ ఉండాలని బీమా రంగ నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) నిర్దేశిస్తోంది.-అమితాబ్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్

ఈటీఎఫ్‌లు–ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం?
ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం ఏంటి? – దీప్తిఈ రెండు సాధనాల మధ్య సూక్ష్మమైన వ్యత్యాసమే ఉంది. ఈ రెండూ కూడా ప్యాసివ్ పెట్టుబడుల కోసం రూపొందించినవే. ఇండెక్స్‌ను (నిఫ్టీ50, సెన్సెక్స్ తదితర) ప్రతిఫలిస్తూ పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో వ్యయాలు చాలా తక్కువ. చూడ్డానికి ఈ రెండు ఒకే విధంగా ఉన్నప్పటికీ, వాటిల్లో పెట్టుబడుల పరంగా వ్యత్యాసం ఉంటుంది. ధరల అస్థిరతల భయం లేకుండా ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఇండెక్స్ ఫండ్స్ వీలు కల్పిస్తాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా సులభంగా, పెట్టుబడులను ఆటోమేట్ చేసే సాధనమే ఇండెక్స్ ఫండ్స్. ఈటీఎఫ్‌లు అలా కాదు. ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ అవుతుంటాయి. వీటిని మీరే స్వయంగా కొనుగోలు చేసుకోవాలి. అందుకోసం ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలుండాలి. కొనుగోళ్లపై బ్రోకర్, ఇతర చార్జీలు చెల్లించాలి. దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ఇండెక్స్ పండ్స్ సులభమైన ఎంపిక. వీటిని తరచుగా పర్యవేక్షించుకోనక్కర్లేదు. సిప్ రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలుండి, మార్కెట్ కదలికలను అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టే వారికి ఈటీఎఫ్‌లు అనుకూలం.ఇదీ చదవండి: బిజినెస్‌లో గుజరాతీల సక్సెస్ సీక్రెట్స్.. ‘ఎక్స్’ పోస్ట్ వైరల్నేను ఒకే అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ పరిధిలో (ఏఎంసీ) ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్ నుంచి, మరో ఈక్విటీ పథకంలోకి సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) ద్వారా పెట్టుబడులను మార్చుకోవాలని అనుకుంటున్నాను. దీనిపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పడుతుందా? – శ్రీకాంత్ ఎన్వీఈఎల్ఎస్ఎస్ పథకం నుంచి మరో ఈక్విటీ పథకంలోకి ఎస్టీపీ చేసుకుంటే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఆ రెండు ఒకటే ఏఎంసీ పరిధిలో ఉన్నా సరే ఈ నిబంధనే వర్తిస్తుంది. ఇన్వెస్టర్ ఎస్టీపీ ద్వారా ఒక ఈక్విటీ పథకంలోని పెట్టుబడులను క్రమంగా మరో ఈక్విటీ పథకంలోకి మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. మధ్యలో బ్యాంక్ ఖాతా అవసరం ఉండదు. కానీ, పన్ను పరంగా చూస్తే ప్రతీ ఎస్టీపీ బదిలీని ఉపసంహరణగానే చట్టం కింద పరిగణిస్తారు. తిరిగి తాజా పెట్టుబడి కింద చూస్తారు. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. మూడేళ్ల కాలం ముగిసిన యూనిట్లనే ఎస్టీపీ ద్వారా బదిలీ చేసుకోగలరు. ఉపసంహరణపై వచ్చిన లాభం ఒక ఆర్థిక సంత్సరంలో రూ.1.25 లక్షలు మించితే, అదనపు మొత్తంపై 12.5 శాతం పన్ను పడుతుంది. పన్ను పడకుండా ఎస్టీపీ చేసుకోవాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఉపసంహరణ, బదిలీ అన్నది రూ.1.25 లక్షలు మించకుండా చూసుకోవాలి.- ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్

ఈ ఏడాది మరో 500 నగరాల్లో సర్వీసులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది మరో 500 నగరాల్లో సర్వీసులను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు రైడ్ సేవల సంస్థ ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో 50 పైచిలుకు నగరాల్లో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. తదుపరి తమిళనాడు, కర్ణాటకలో, ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లోను విస్తరించనున్నట్లు పవన్ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 33 లక్షల రైడ్లు నమోదవుతున్నాయన్నారు. ఇందులో 15 లక్షలు టూ–వీలర్ల విభాగంలో, 13 లక్షలు త్రీ–వీలర్ సెగ్మెంట్లో, 5 లక్షల రైడ్స్ కార్ల విభాగంలో ఉంటున్నాయని పవన్ చెప్పారు. గతేడాదే తాము ఫోర్ వీలర్ల విభాగంలోకి ప్రవేశించినా, గణనీయంగా వృద్ధి నమోదు చేశామని తెలిపారు. తాము కమీషన్ ప్రాతిపదికన కాకుండా ప్లాట్‌ఫాం యాక్సెస్ ఫీజు విధానాన్ని అమలు చేయడం వల్ల కెప్టెన్లకు (డ్రైవర్లు) ఆదాయ అవకాశాలు మరింతగా ఉంటాయని పవన్ చెప్పారు. కంపెనీ వద్ద గణనీయంగా నిధులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనేదీ లేదన్నారు. ప్రస్తానికి కార్యకలాపాల విస్తరణపైనే ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు.

గ్రాన్యూల్స్ ఇండియాకు ఎఫ్‌డీఏ అక్షింతలు
ముంబై: ఫార్ములేషన్స్ ప్లాంటులో నిర్వహణ లోపాలకు గాను గ్రాన్యూల్స్ ఇండియాను అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ తీవ్రంగా ఆక్షేపించింది. ఔషధాలను నిల్వ చేయడంలో, యంత్ర పరికరాల పరిశుభ్రత, నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిరూపించడంలో విఫలమైనట్లు వ్యాఖ్యానించింది. తెలంగాణలోని మేడ్చల్–మల్కాజిగిరి తయారీ ప్లాంటులో గతేడాది ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 6 వరకు నిర్వహించిన తనిఖీలకు గాను కంపెనీ సీఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటికి ఎఫ్‌డీఏ ఈ మేరకు హెచ్చరిక లేఖ పంపింది. ఔషధాలు కలుషితం కాకుండా నివారించే ఫిల్టర్లు ఉన్నప్పటికీ, వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల అవి నిరుపయోగంగా మారాయని తనిఖీల్లో తేలినట్లు పేర్కొంది. తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వకు ఉపయోగించే బిల్డింగ్‌ల నిర్వహణ సరిగ్గా లేదని వ్యాఖ్యానించింది. ఎయిర్ ప్యూరిఫికేషన్ యూనిట్లు, డక్ట్లు, ఫ్లోర్‌ల్లాంటి నిర్దిష్ట ప్రదేశాల్లో పక్షుల రెట్టలు, ఈకలు కనిపించినట్లు పేర్కొంది. దిద్దుబాటు చర్యలపై సంతృప్తి కలిగేంత వరకు కంపెనీ సమర్పించే కొత్త ఔషధాల దరఖాస్తులకు అనుమతులను నిలిపివేయొచ్చని పేర్కొంది.
ఫ్యామిలీ

ఇంధన స్పృహ కలిగిన ఇల్లులా ఆరోగ్యకరంగా మార్చేద్దాం..!
ఇంటిని మరింత పర్యావరణ అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని చేసే ఆలోచనల్లో లైటింగ్ ఒకటి. అందుకు సరైన ఉపకరణాలను వాడటం, సరైన వెంటిలేషన్‌ను నిర్ధారించడం వంటి సాధారణ మార్పులు, ఇంధన శక్తిని పొదుపు చేయడానికి పాటించాల్సిన పద్ధతులు పెద్ద తేడాను కలిగిస్తాయి. ఇంధన స్పృహ కలిగిన ఇల్లు ఆరోగ్యకరమైన వాతావరణానికి, మరింత సౌకర్యవంతమైన జీవనశైలికి దోహదం చేస్తుంది. పాతకాలం బల్బుల కంటే ఎల్ఈడీ లైట్లు 80 శాతం వరకు తక్కువ విద్యుత్తును ఉపయోగిస్తాయి. ఎక్కువ కాలం వెలుగునిస్తాయి. దీంతో బల్బులను త్వరగా మార్చనక్కర్లేదు. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.కరెంట్ వినియోగం ఎక్కువ ఉండే వంట గదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామ్మల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా.. అని ఆలోచన చేయడమే కాకుండా, ఆచరణలో పెట్టవచ్చు.రోజూ కరెంట్‌తో నడిచే పరికరాలను వారంలో రెండు, మూడుసార్లు విరామమిచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు.ఇంటికి కరెంట్ వాడకం ఎంత అవసరం అనేది ముందు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. దీని వల్ల కరెంట్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు.ఇంటికి కరెంట్ వాడకం ఎంత అవసరం అనేది ముందు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. దీని వల్ల కరెంట్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు.కరెంట్ వినియోగం ఎక్కువ ఉండే వంట గదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామ్మల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా.. అని ఆలోచన చేయడమే కాకుండా, ఆచరణలో పెట్టవచ్చు.గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపివేయడం అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో కుటుంబ సభ్యులకూ అవగాహన కల్పించాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ విద్యుత్తును ఆదాచేయడంలో ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేలా మన ప్రవర్తన ఉండాలి. సోలార్ విద్యుత్తును ఉపయోగించడం వల్ల ఇతర ఇంధన శక్తిని కొనుగోలును తగ్గించవచ్చు. సోలార్, గ్యాస్ ఆధారిత వాటర్ హీటర్లను ఉపయోగించడం వల్ల కూడా విద్యుత్తు వినియోగాన్ని తగ్గించినవారవుతారు. కార్బన్ ఫుట్ ప్రింట్స్‌ను తగ్గిస్తూ, చిన్న చిన్న మార్పులతో పర్యావరణ అనుకూలంగా ఉంటే డబ్బు, సమయాన్ని ఆదాచేయడమే కాదు రేపటి తరాలకు కూడా మేలు చేసినవారవుతారు. -ఎన్.ఆర్(చదవండి:

నగరాన్ని తలపించే హైటెక్ నౌక..!
సర్వాంగ సుందరంగా సకల సౌకర్యాలతో ఉండే రాజప్రాసాదం నీటిలో తేలియాడితే ఎలా ఉంటుందంటే, అది అచ్చం ‘సోమ్నియా’లాగే ఉంటుంది. సోమ్నియా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నౌక మాత్రమే కాదు, అద్దాల గోడలతో నిండిన అద్భుత నిర్మాణం. లాటిన్లో సోమ్నియా అంటే ‘కల’ అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే ఈ నౌక ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది. ఇందులో మొత్తం విలాసవంతమైన 39 అపార్ట్మెంట్లను ఆరు డెక్‌లలో నిర్మించారు. సుమారు పదివేలమంది వరకు ఇందులో ఉండొచ్చు. పెద్ద రెస్టరెంట్లు, లాబీ, స్పా, బార్లు, సూపర్ మార్కెట్లు, బొటిక్, ఫిట్నెస్ సెంటర్లు, టెన్నిస్ కోర్టు, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్‌పూల్, కాక్టెయిల్ లాంజ్ సహా సమస్త సౌకర్యాలను ఈ నౌకలో ఏర్పాటు చేశారు. ఈ నౌక యజమాని మలేషియాలో అత్యంత ధనవంతుడైన రాబర్ట్ కుయోక్ అని సమాచారం. రాబర్ట్ తన విహార యాత్రల కోసం కస్టమైజ్డ్ యాట్‌లను తయారు చేసే డచ్ కంపెనీతో దీనిని తయారు చేయించుకుంటున్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి.. కాని, అధికారికంగా ఇంకా ఈ నౌక యజమాని ఎవరనేది వెల్లడి కాలేదు.(చదవండి: భారీ కీటకం.. దాంతోనే వంటకం..! ఎక్కడంటే..?)

సండే వెరైటీగా రొయ్యల దోసెలు, కాజు రవ్వ వడ చేసేయండిలా..!
ఈ ఆదివారం చిన్న పెద్ద అంతా ఇంట్లోనే సందడిగా ఉంటారు. ఆదివారం అంటే ఆటవిడుపులా అనిపిస్తుంది అందరికి. అమ్మపై భారం వేయకుండా..అందరూ తలో చేయి వేసి ఈ సండే ఇలా వెరైటీ వంటకాలు ట్రై చేసి మరింత ఖుషీగా ఉండండి. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసేయాలో చూసేయండి మరీ..!.రొయ్యల దోసెలుకావలసినవి: సోయా పాలు– 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్– 2 టీ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు– 2 లేదా 3 టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి– అర టీ స్పూన్ పసుపు– కొద్దిగా ఉప్పు– తగినంత రొయ్యలు– 250 గ్రాములు (శుభ్రం చేసుకుని హాఫ్ బాయిల్ చేసుకుని, పక్కన పెట్టుకోవాలి) మిరియాల పొడి– పావు స్పూన్ కొత్తిమీర తురుము– కొద్దిగా కరివేపాకు– కొద్దిగా పచ్చిమిర్చి– 2 (చిన్నగా తరగాలి) గరం మసాలా– 1 టీ స్పూన్ దోసెల పిండి– రెండు మూడు కప్పులు గుడ్లు– రెండు లేదా మూడు (అభిరుచిని బట్టి) నూనె– సరిపడాతయారీ: ముందుగా కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, కొద్దిగా ఉప్పు, కారం వేసుకుని దోరగా వేయించుకోవాలి. అనంతరం దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, గరిటెతో తిప్పుతూ అర నిమిషం పాటు వేయించాలి. తర్వాత మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, మరికొద్దిగా కారం వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు సోయా పాలు పోసి మూత పెట్టి, చిన్న మంట మీద ఉడికించాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గరపడుతున్న సమయంలో రొయ్యలు వేసుకుని, ఒకసారి రుచి చూసి, సరిపడా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుకోవాలి. ఆ మిశ్రమం మరింత దగ్గర పడిన తర్వాత ఆ కళాయి దించి పక్కన పెట్టుకుని, స్టవ్ మీద దోసెల పెనం పెట్టుకోవాలి. దానిపై దోసెలు వేసుకుని, ఒక్కో దోసెపై ఒక్కో గుడ్డు కొట్టి, అభిరుచిని బట్టి పసుపు సొనను కదిలించకుండా ఉడికించి, ఆపైన కొద్దికొద్దిగా రొయ్యల కర్రీ, కొత్తిమీర తురుము వేసుకుని, దోసెను ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. కాజు రవ్వ వడ..కావలసినవి: జీడిపప్పు– అర కప్పు రవ్వ– కప్పు అల్లం తురుము– టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుము– 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి– 1 (చిన్నగా తరగాలి) ఉప్పు– తగినంత కరివేపాకు– 1 రెమ్మ (చిన్నచిన్నగా తుంచి వేసుకోవాలి) కుకింగ్ సోడా– అర టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్ తరుగు– కొద్దిగా పెరుగు– అర కప్పు పైనే నూనె– డీప్ ఫ్రైౖ కి సరిపడాతయారీ: ముందుగా జీడిపప్పును పొడిపొడిగా మిక్సీ పట్టుకోవాలి. దానిలో రవ్వ, అల్లం తురుము, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కుకింగ్ సోడా, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసుకుని, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో పెరుగు కొద్దికొద్దిగా పోసుకుంటూ, ముద్దలా చేసుకోవాలి. అనంతరం చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని, వడల్లా ఒత్తుకుని, నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చట్నీలో లేదా సాస్‌లో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.

సమ్మర్ కష్టాలకు స్మార్ట్‌గా చెక్పెట్టేద్దాం ఇలా..!
‘అయ్యో వచ్చే వేసవి.. తెచ్చే తిప్పలు’ అనే మాటలకు ఇకపై స్మార్ట్‌గా చెక్ పెట్టొచ్చు. మండే ఎండల నుంచి తప్పించుకోవడానికి చల్లదనం కోసం, ప్రజలు రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. ఆ చిట్కాల్లో ఈ గాడ్జెట్లనూ చేర్చి, సమ్మర్‌కు స్మార్ట్‌గా, కూల్‌గా మార్చేయచ్చు. ఇందుకోసం ఉపయోగపడే కొన్ని లేటెస్ట్ గాడ్జెట్ల వివరాలు మీకోసం...సన్‌స్క్రీన్ టెస్టర్ వేసవిలో మీ చర్మానికి రక్షణ ఉందా? లేదా? అని ఈ బుల్లి సన్‌స్క్రీన్ టెస్టర్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. చిన్న పెన్‌డ్రైవ్‌లా కనిపించే ఈ పరికరం, నిజానికి ఒక ప్రత్యేకమైన కెమెరా. వేసవిలో ఒళ్లంతా చెమటలు పట్టిన తర్వాత, ఈత కొట్టినప్పుడు, రుమాలుతో ముఖం తుడుచుకున్నప్పుడు, రాసుకున్న క్రీమ్స్ చర్మంపై అక్కడక్కడ మిస్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న కెమెరాలో నుంచి చూసినట్లయితే, సన్‌స్క్రీన్ క్రీమ్ రక్షణ తొలగిపోయిన ప్రదేశాలను డార్క్‌గా చూపిస్తుంది. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్, అల్ట్రా పోర్టబుల్. దీని ధర రూ.10,311 మాత్రమే!స్మార్ట్ వాటర్ బాటిల్వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి చాలామంది తరచుగా నీళ్లు తాగటం మరచిపోతుంటారు. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్‌తో మీరు హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు. ఈ బాటిల్ మీరు నీటిని తీసుకోవడాన్ని ట్రాక్ చేస్తుంది. అంతే కాకుండా, అవసరమైనప్పుడల్లా మిమ్మల్ని చల్లబరచడానికి మంచి కూలింగ్ వాటర్‌ను అందిస్తుంది. అలాగే వ్యాయామాలు, హైకింగ్లు, బీచ్ డేస్‌కి తీసుకెళ్లడానికి ఈ వాటర్ బాటిల్ చాలా అనువుగా ఉంటుంది. ఇలాంటి బాటిల్స్ మార్కెట్లో చాలానే దొరుకుతున్నాయి. రివ్యూలను చూసి తీసుకోవటం మంచిది. క్యాప్ విత్ ఫ్యాన్వేసవిలో చాలామంది ఉపయోగించే క్యాప్స్ కూడా స్మార్ట్‌గా మారాయి. ఈ క్యాప్స్‌కు అటాచబుల్ మిని ఫ్యాన్ వస్తుంది. ముఖానికి కప్పుకొనే చోట ఈ ఫ్యాన్ ఉంటుంది. దీనికి సోలార్ ప్యానెల్స్ సహాయంతో పవర్ సరఫరా అవుతుంది. క్యాప్ ఎండకు ఎక్స్పోజ్ కాగానే ఆటోమేటిక్‌గా ఈ ఫ్యాన్లు పనిచేస్తాయి. వీటిల్లో కొన్ని చార్జబుల్ స్టయిల్ మోడల్స్‌లోనూ లభిస్తున్నాయి. కంపెనీల్లో క్వాలిటీ బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, కొనుగోలు చేసుకోవచ్చు.చేతిలోనే ఫ్యాన్స్విసనకర్రలను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోగలిగినట్లే, ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. స్మార్ట్‌ఫోన్ , పవర్ బ్యాంకు మాదిరిగానే ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా పాకెట్లో లేదా హ్యాండ్‌బ్యాగులో పెట్టుకోవచ్చు. మండుటెండల్లో ఇవి ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తాయి. మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్స్కు తోడు రీచార్జబుల్ బ్యాటరీలు వీటిలో ఉంటాయి. వీటిలో కొన్ని యూఎస్బీ పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మినీ ఫ్యాన్స్‌లోనూ వివిధ రకాలు, స్టయిల్స్ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు కాస్త నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మంచిది. (చదవండి: 'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడు అడుగుపెట్టారో..)
ఫొటోలు
National View all

ఘోర రోడ్డు ప్రమాదం.. సజీవదహనమైన తల్లి, కుమారుడు..
కర్ణాటక: చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి వద్ద ఘోర రోడ్డు ప్రమ

మాజీ మంత్రి కారు డ్రైవర్ అరెస్టు
దొడ్డబళ్లాపురం: జువెలరీ షాప్‌ల యజమానులు, పలువురు వ్యాపారులు,

మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. కాంగ్రెస్ నేతల్లో టెన్షన్!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

అన్ని భాషలు సమానం... హిందీ మరింత సమానం!
దేశంలో ఇప్పుడు హిందీ వివాదం రగులుకుంది.

బడ్జెట్ సమావేశాలు: రాజ్యసభ నుంచి వాకౌట్
Parliament Live Updates March 10th: పార్లమెంట్ మలి(రెండో) విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
NRI View all

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?
వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి.

ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన

విశాఖకు ఎన్నారై మహిళ ఎందుకొచ్చింది?.. ఆ రూమ్‌లో ఏం జరిగింది?
విశాఖ సిటీ: విశాఖలో ఖాకీ క్రైమ్ కథా చిత్రం..
International View all

USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?
వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

Mark Carney: అమెరికాలో కెనడా విలీనం.. ఏనాటికీ కాబోదు
ఆర్థిక మేధావి, కెనడాకు కాబోయే ప్రధాని మార్క్ కార్నీ..

కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
ఒట్టావా: కెనడాలో తొమ్మిదేళ్ల జస్టిన్ ట్రూడో(Justin Trudeau)

నీవల్లే కరోనా!.. చైనాకు అమెరికా కోర్టు జరిమానా
వాషింగ్టన్: డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా భారీ షాకిచ్చింది

స్వామి నారాయణ్ ఆలయంపై...విద్వేష దాడి
న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికాలో హిందూ ఆలయాలను లక్ష్యంగా చే
క్రైమ్

SRSP Canal: కడసారి చూపుకోసం కదిలొచ్చిన గ్రామస్తులు
సాక్షిప్రతినిధి, వరంగల్: తన కళ్లెదుటే కుటుంబం మొత్తం నీటిలో పడి మృత్యుఒడికి చేరి అంత్యక్రియలకు వెళ్తుంటే ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. భర్త, ఇద్దరు పిల్లలు చనిపోవడంతో ఇక తనకు దిక్కెవరంటూ దిక్కులు పిక్కటిళ్లేలా రోదించింది. తన ముద్దుల చిన్న కొడుకు, మనమడు, మనుమరాలు ఇక లేరని తెలిసి.. వారి మృతదేహాలను శ్మశాన వాటికకు తీసుకెళ్తుంటే వృద్ధ దంపతులు బోరున విలపించారు.తాము ఇక ఎవరి కోసం బతకాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. శనివారం వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలోని ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో మృతి చెందిన సోమారపు ప్రవీణ్ కుమార్, తన పిల్లలు చైత్ర, ఆర్యవర్ధన్ అంత్యక్రియలు ఆదివారం వారి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. ‘నాకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకు నేనే తలకొరివి పెట్టాల్సిన దుస్థితిని తీసుకొచ్చావా దేవుడా’ అంటూ మృతుడి తండ్రి సారంగపాణి రోదనలు మిన్నంటాయి. అంతిమ యాత్రలో చివరగా ముగ్గురికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు గ్రామం మొత్తం కదిలొచ్చింది.‘అర్ధ గంటలో ఇంట్లో ఉంటానంటివి గద బిడ్డో....అంటూ’ప్రవీణ్‌కుమార్‌తో చదువుకున్న అతడి స్నేహితులు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కడసారి చూపుకోసం మేచరాజుపలి్లకి తరలిచ్చారు. కేరళ నుంచి యుగేంధర్, హైదరాబాద్ నుంచి బెల్లు శ్రీను, నాళ్లం హరికిషన్ ప్రసాద్ తదితరులు వచ్చారు. అంతిమయాత్రలో ముగ్గురిని ఒకేసారి శ్మశాన వాటికకు తీసుకెళ్తుంటే గ్రామం మొత్తం బోరుమంది. తండ్రి, పిల్లల మృతదేహాలకు పలువురు నాయకులు పూలమాల ఝవేసి నివాళులరి్పంచారు.

ప్రాణం తీసిన పల్లిగింజ
సాక్షిప్రతినిధి, వరంగల్: పల్లిగింజ తిన్న చిన్నారికి అదే యమపాశమైంది.. గొంతులో గింజ ఇరుక్కుని శ్వాస ఆడక బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండెల వీరన్న–కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు అక్షయ్ (18 నెలలు) ఉన్నాడు. గురువారం ఇంటి ఎదుట పల్లీలు ఆరబెట్టగా ఆడుకుంటున్న అక్షయ్ గింజ తిన్నాడు. దీంతో గింజ గొంతులో ఇరుక్కుని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. చిన్నారి మృతదేహంమీద పడి తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయ బిడ్డా అంటూ బోరున విలపించారు.

బాలికపై అత్యాచారం?
సాక్షి, విశాఖపట్నం: సంగివలస అనిల్ నీరుకొండ ఆస్ప త్రిలో చికిత్సకు వచ్చిన మానసిక వికలాంగురాలైన బాలికపై శనివారం రాత్రి అత్యాచారం జరిగిన ఘటనతో ఈ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. బాధితురాలితో పాటు అత్యాచార ఘటనకు పాల్పడిన నిందితుడు(35) ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతం కావడం గమనార్హం. సంఘటన శనివారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య జరిగినా ఆస్పత్రి సిబ్బంది ఆదివారం వరకు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. సంఘటన జరిగిన తర్వాత నిందితుడిని ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ గదిలో ఉంచారు. అత్యాచారానికి గురైన బాలిక ఆదివారం ఉదయం వరకు రక్తస్రావంతో బాధపడుతున్నట్టు తెలిసింది. అత్యాచార సమాచారం అందుకున్న మీడియా ఆస్పత్రి వద్ద ఆరా తీయడంతో భీమిలి పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు ఆస్పత్రిలోకి రాక ముందే బాధితురాలి కుటుంబ సభ్యులతో ఆస్పత్రి యాజమాన్యం చర్చలు జరిపి రాజీకి వచ్చినట్టు తెలిసింది. తరువాత మధురవాడ జోన్ ఏసీపీ అప్పలరాజు ఆస్పత్రి వద్దకు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆస్పత్రి సిబ్బంది మీడియాను ఏమార్చి నిందితుడిని ఆటోలో జాతీయరహదారి వరకు తరలించి అక్కడ నుంచి ఒడిశాకు పంపించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికపై అత్యాచారం జరిగినట్టు ఆధారాలు లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు ఉంటే తప్ప ఏమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. ఇదిలా ఉండగా నిందితుడు బాధితురాలిని మూడో ఫ్లోర్ నుంచి ఆరో ఫ్లోర్‌కు తీసుకువెళ్లినట్టు తెలిసింది. సంఘటన జరిగినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.సంగివలస అనిల్ నీరుకొండ ఆస్పత్రి యాజమాన్యం తరచూ విశాఖ, విజయనగరం, ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం కోసం ఇక్కడకు తీసుకొస్తుంటారు. ప్రస్తుతం అత్యాచార బాధితురాలు, నిందితుడు ఇదే విధంగా చికిత్స కోసం మల్కన్‌గిరి నుంచి వచ్చారు. అత్యాచారయత్నమే జరిగింది.. ఆస్పత్రి సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ మల్కన్‌గిరి నుంచి వచ్చిన 25 మందికి చికిత్స తరువాత శనివారం డిశ్చార్జ్ చేశామన్నారు. చీకటి పడటంతో ఆదివారం పంపించడానికి గానూ వారిని ఆరో ఫ్లోర్లో ఉంచామన్నారు. బాధితురాలు వాష్ రూమ్‌లోకి వెళ్లగా నిందితుడు ఆమె వెంట వెనకే వెళ్లాడన్నారు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో మిగిలిన వారు అతనికి దేహశుద్ధి చేసి తమకు అప్పగించారన్నారు.

Hyderabad: నవ వధువు ఆత్మహత్య
బాలానగర్(హైదరాబాద్): నవవధువు ఆత్మహత్య(Newly Married WomanNewly Married WomanNewly Married Woman) చేసుకున్న సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్(Balanagar Police Station) పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా, తర్లా మండలం నందిగామకు చెందిన ఈశ్వరరావుతో గత ఫిబ్రవరి 6న గంటా విజయ గౌరీ (23)కి వివాహం జరిగింది. నూతన దంపతులు బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాల్‌రెడ్డి నగర్లో నివాసం ఉంటున్నారు. ఈశ్వరరావు ఉద్యోగం నిమిత్తం డ్యూటీకి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి విజయగౌరి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ ఇన్స్పెక్టర్ టి.నరసింహరాజు తెలిపారు. ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య చైతన్యపురి: ప్రేమించాలంటూ ఓ యువకుడు వేధించడంతో యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా పాతర్లపాడుకు చెందిన బీమగోని కృష్ణయ్య, మన్నెమ్మ దంపతుల చిన్న కుమార్తె గంగోత్రి (22) చైతన్యపురిలోని తన సోదరి నివాసంలో ఉంటోంది. పాతర్లపాడుకు చెందిన కేశబోయిన మహేష్ అనే వ్యక్తి తనను ప్రేమించాలంటూ గత ఆరునెలలుగా గంగోత్రిని వేధిస్తున్నాడు. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పి తనకు భయంగా ఉందని వాపోయింది. తను ఎక్కడికి వెళ్లినా వెంబడించి వేధిస్తున్నాడని తెలిపింది. ఈ క్రమంలో శనివారం ఉదయం గంగోత్రి రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు పిలిచినా పలకకపోవడంతో చుట్టుపక్కల వారి సహాయంతో తలుపు గడియ పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయి కనిపించింది. మహేష్ వేధింపుల వల్లే గంగోత్రి ఆత్మహత్య చేసుకుందని తండ్రి కృష్ణయ్య ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.