Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Telangana High Court Hearing An Interim Petition In Margadarshi Case1
రామోజీ ఉన్నా, లేకున్నా విచారణ కొనసాగించాల్సిందే.. మార్గదర్శి కేసులో ఆర్‌బీఐ

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి మధ్యంతర పిటిషన్‌పై విచారణ జరిగింది. విచారణలో ఏపీ ప్రభుత్వం , తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి, ఆర్‌బీఐ వాదనలు వినిపించాయి. విచారణ సందర్భంగా రామోజీ మృతి చెందారు.. విచారణ అవసరం లేదని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తెలంగాణ సర్కార్‌ సైతం దాదాపు ఇదే వాదనలు వినిపించింది.అదే సమయంలో మార్గదర్శి సెక్షన్‌ 45(ఎస్‌)ను ఉల్లంఘించింది. రామోజీ ఉన్నా, లేకున్నా విచారణ కొనసాగించాల్సిందేనని ఆర్‌బీఐ పట్టుబట్టింది. ప్రాసిక్యూషన్‌ ఎదుర్కోవాల్సిందేనని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ మార్చి7కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

Champions Trophy 2025: Afghanistan, Australia Match Ended In No Result Due To Rain, Australia Qualified For Semi Finals2
Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ రద్దు.. సెమీస్‌కు ఆస్ట్రేలియా

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 గ్రూప్‌-బిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (ఫిబ్రవరి 28) జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. మ్యాచ్‌ మధ్యలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. ఫలితంగా ఆస్ట్రేలియా గ్రూప్‌-బి నుంచి సెమీస్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్‌ సెమీస్‌ అవకాశాలు దాదాపుగా గల్లంతయ్యాయి. ఏదైనా అద్భుతం జరిగి రేపటి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్‌ భారీ విజయం సాధిస్తే తప్ప, ఆఫ్ఘనిస్తాన్‌ సెమీస్‌కు చేరలేదు. ఈ మ్యాచ్‌ రద్దు కావడం సౌతాఫ్రికాకు పరోక్షంగా కలిసొచ్చింది. రేపటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడినా సౌతాఫ్రి​కా సెమీస్‌కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా మరీ దారుణంగా మాత్రం ఓడకూడదు. ఒకవేళ అలా జరిగి సౌతాఫ్రికా రన్‌రేట్‌ మైనస్‌లోకి పడిపోతే మాత్రం ఆఫ్ఘనిస్తాన్‌ సెమీస్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో 4 పాయింట్లు (0.475), సౌతాఫ్రికా ఖాతాలో 3 పాయింట్లు (2.140), ఆఫ్ఘనిస్తాన్‌ ఖాతాలో 3 పాయింట్లు (-0.990) ఉన్నాయి. ఈ గ్రూప్‌లో ఉన్న మరో జట్టు ఇంగ్లండ్‌ ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్‌ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి..!క్రిక్‌బజ్‌ లెక్కల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌ సెమీస్‌కు చేరాలంటే రేపటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్ చేస్తే సౌతాఫ్రికాను కనీసం 207 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లండ్‌ సెకెండ్‌ బ్యాటింగ్‌ చేస్తే 11.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది (రెండు సందర్భాల్లో మొదటి ఇన్నింగ్స్ టోటల్‌ 300 పరుగులు అనుకుంటే).ఇలా జరగకపోతే మాత్రం రేపటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడినా సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుకుంటుంది. రేపటి మ్యాచ్‌ కూడా వర్షం​ కారణంగా రద్దైనా సౌతాఫ్రికానే సెమీస్‌కు చేరుకుంటుంది.కాగా, గ్రూప్‌-ఏ నుంచి ఇదివరకే సెమీస్‌ బెర్తలు ఖారారైన విషయం తెలిసిందే. ఈ గ్రూప్‌ నుంచి మరో మ్యాచ్‌ జరగాల్సి ఉన్నా భారత్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ గ్రూప్‌లో మిగిలిన మ్యాచ్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ మార్చి 2వ తేదీన జరుగుతుంది.మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. సెదిఖుల్లా అటల్‌ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (63 బంతుల్లో​ 67; ఫోర్‌, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా, ఒమర్‌జాయ్‌.. ఇబ్రహీం జద్రాన్‌ (22), రహ్మత్‌ షా (12), కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది (20), రషీద్‌ ఖాన్‌తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్‌ ముందు ఫైటింగ్‌ టోటల్‌ను ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్‌ (0), మహ్మద్‌ నబీ (1), గుల్బదిన్‌ నైబ్‌ (4), నూర్‌ అహ్మద్‌ (6) నిరాశపరిచారు. ఆసీస్‌ బౌలర్లలో బెన్‌ డ్వార్షుయిష్‌ 3, స్పెన్సర్‌ జాన్సన్‌, ఆడమ్‌ జంపా తలో 2, ఎల్లిస్‌, మ్యాక్స్‌వెల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.అనంతరం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్‌ ఆగిపోయింది. మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి ఆసీస్‌ 12.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 109 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్‌ (20) ఔట్‌ కాగా.. ట్రవిస్‌ హెడ్‌ (59), స్టీవ్‌ స్మిత్‌ (19) క్రీజ్‌లో ఉన్నారు. షార్ట్‌ వికెట్‌ ఒమర్‌జాయ్‌కు దక్కింది.

Shivakumar might emerge as Congresss Eknath Shinde BJP3
‘డీకే.. మరో ఏక్‌నాథ్‌ షిండే’

బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం, ​ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్.. శివరాత్రికి కోయంబత్తూరులో సద్గురు(జగ్గీ వాసుదేవ్) ఏర్పాటు చేసిన ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఇది అటు జాతీయ కాంగ్రెస్ కు, ఇటు కర్ణాకట కాంగ్రెస్ లో సైతం హీట్ పుట్టించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు కొందరు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ అంటే డీకేకు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీకే.. బీజేపీలో చేరడానికి సన్నాహాలు ఏమైనా చేస్తున్నారా అనే వాదన కూడా వినిపించింది. ఆ ఈవెంట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కావడంతో దీనికి మరింత బలపడింది.అయితే తాజాగా కర్ణాటక బీజేపీ.. డీకే శివకుమార్ మరో మహారాష్ట్ర ఏక్ నాథ్ షిండే కానున్నారంటూ వ్యాఖ్యానించడం కూడా కాంగ్రెస్ లో మరింత అలజడి రేపింది. మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏక్ నాథ్ షిండే సహకరించిన విషయాన్ని ఆర్ అశోక ప్రస్తావించారు. అదే బాటలో డీకే శివకుమార్ కూడా నడిచి కాంగ్రెస్ ను చీల్చుతారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బలమైన నేతగా ఉన్న డీకే.. ఆ పార్టీని కూల్చడం జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు.దీనిపై డీకే శివకుమార్ స్పందించారు.. ఇది బీజేపీ గేమ్ ప్లాన్ అంటూ మండిపడ్డారు. తాను కాంగ్రెస్ వాదినని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను వీడనని స్పష్టం చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తానని డీకే పేర్కొన్నారు.

Buggana Rajendranath satires the Chandrababu government over AP budget4
AP Budget 2025: చంద‍్రబాబు సంపద సృష్టిపై బుగ్గన సెటైర్లు

సాక్షి,తాడేపల్లి : ఏపీ బడ్జెట్‌ బుక్‌లో కలర్‌ ఎక్కువ.. కంటెంట్‌ తక్కువ అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సెటైర్లు వేశారు. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా.. కాగ్‌ కరెక్టా? కూటమి నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. అప్పుల లెక్కలపై కూటమి సర్కార్‌ చేస్తున్న సర్కస్‌ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. కూటమి సర్కార్‌ బడ్జెట్‌ను మసిపూసి మారేడుకాయ చేసింది. బడ్జెట్‌లో అప్పుల లెక్కలు మాయం చేశారు. 9నెలల్లోనే రికార్డ్‌ స్థాయిలో లక్షా 30వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవెన్యూ లోటు ఉంటుంది. సూపర్‌ సిక్స్‌లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. సంపద ఎక్కడ సృష్టించారో నిజాయితీగా చెప్పగలరా? సంపద సృష్టి అంటే ఇదేనా. స్థూల ఉత్పత్తిపై కూటమి సర్కార్‌ పచ్చి అబద్ధాలు చెప్పింది. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులకే దిక్కులేదు.గతేడాది అన్నదాత సుఖీభవకు రూ.4,500కోట్లు కేటాయించారు.గతేడాది అన్నదాత సుఖీభవ ఎవరికైనా వచ్చిందా? రెండేళ్లు అన్నదాత సుఖీభవకు రూ.21వేల కోట్లు అవసరం. అన్నదాత సుఖీభవకు కేటాయించింది రూ.6300కోట్లే. హామీల అమలుకు టైమ్‌ టేబులంటూ ఏమీలేదు. రాష్ట్ర బడ్జెట్ కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అన్నట్టుగా ఉంది. బడ్జెట్ ప్రసంగం నెగటివ్ మాటలతో మాట్లాడారు. అరాచకం, విధ్వంసం అంటూ మొత్తం 35 సార్లు అన్నారు.సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ముందు తెగ హడావుడి చేశారు. ఇప్పటికీ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోన్‌రెడ్డి తన హయాంలో కేలండర్‌ పెట్టి మరీ సంక్షేమ పథకాలు ఇచ్చారు చంద్రబాబు ఎక్కువ ఇస్తాననేసరికి జనం నమ్మారు. కానీ చంద్రబాబు మళ్ళీ జనాన్ని మోసం చేశారు. సంవత్సరం కాకముందే లక్షన్నర కోట్లు అప్పు చేశారు. ప్రజల మీద ఎక్కువ పన్నుల భారం వేయకూడదని చాణక్యుడు చెప్పాడు. కానీ చంద్రబాబు అధిక భారాలు వేస్తూ చాణక్యుడి పేరు వాడటం హాస్యాస్పదం. మా ప్రభుత్వాన్ని హేళన చేస్తూ మాట్లాడారు.మధ్యలో దళారులు లేకుండా సంక్షేమం అందిస్తే బటన్ నొక్కుడు అంటూ హేళన చేశారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేశారు. ఎన్నికల టైం వచ్చేసరికి మా కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇస్తామని చంద్రబాబు హామీలు ఇచ్చారు. తీరా అధకారంలోకి వచ్చాక ఏదీ అమలు చేయటం లేదు.కూటమి ప్రభుత్వంలో పెట్టే కేసులు పెరిగాయి. ప్రజల్లో అసంతృప్తులు బాగా పెరిగాయి. గ్రామాల్లో ప్రజలు అప్పుల పాలయ్యారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు. అధికారంలోకి వచ్చాక సంపద సృష్టి తర్వాతనే ఇస్తామంటున్నారు.రూ.4,500 కోట్లు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వకుండానే ఇచ్చేసినట్టు చెప్పారు. ఏ రైతుకైనా అన్నదాత సుఖీభవ డబ్బులు ఇచ్చారా?. కార్పోరేషన్ల అప్పుల్లో కూడా తప్పడు లెక్కలు చూపెట్టారు. వస్తుందో రాదో తెలియని ఆదాయాన్ని ఇప్పుడు లెక్కల్లో చూపించి ఖర్చు పెడతామంటున్నారు.ఒక విధానం, ఒక టైంటేబుల్ అనేదే లేదు. ఎవరో రాసిచ్చిన లెక్కలు చదవటం తప్ప బడ్జెట్‌లో ఇంకేం లేదు. రాష్ట్ర అభివృద్ధిని దేశ అభివృద్ధితో పోల్చాలేగానీ, గత ప్రభుత్వాలతో పోల్చుతారా?. అసెంబ్లీలో ఉత్సాహం, ఊపు ఎవరిలోనూ కనపడలేదు.గత బడ్జెట్‌లో పెట్టి కూడా ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదు. ఉచిత బస్సు, ఉచిత గ్యాసు ఊసేలేదు.తల్లికివందనం కింద ఎంతమందికి ఇచ్చేదీ క్లారిటీ లేదు. 55 లక్షల మంది పిల్లలకి మాత్రమే ఇచ్చేలా బుక్‌లో రాశారు. అంటే మిగతావారి పరిస్థితి ఏంటి?.గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ ప్రస్తావనే లేదు.రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ కొనుగోళ్ళు లేక ప్రయివేటు వారికి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పత్తి, మిర్చి, కంది, మినుముల ధర మా హయాంతో పోల్చితే ఇప్పుడు సగానికి సగం తగ్గింది. ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయింది.ఈ ప్రభుత్వంలో‌ కనీసం వారి సమస్యలు వినే పరిస్థితే లేదు. మా హయాంలో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు 31 లక్షల మందికి ఇచ్చాం.ఈ ప్రభుత్వం ఇప్పటికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఉన్నవి తొలగిస్తున్నారు.అమరావతి కోసం రూ.76 వేల కోట్లు అప్పు చేశారు.మేము చేస్తే అప్పు, మీరు చేస్తే నిప్పా?. స్థూల ఉత్పత్తి బాగుంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి కదా?. మరి ఆ పెరిగిన ఆదాయం ఎందుకు కనపడటం లేదు?. సంపద సృష్టిస్తామనే వారు మా హయాంలో కంటే తక్కువ ఆదాయాన్నే రాష్ట్రానికి సమకూర్చారు. మీది P4 ఐతే మాది W4. అంటే సంక్షేమం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? లేక ఇంటిలిజెన్స్ ఆర్టిఫిషియలో అర్థం కావటం లేదు. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఉంటుందా?

Bollywood Actress Urvashi Rautela Performs Marriages to Orphans5
డాకు మహారాజ్‌ బ్యూటీ గొప్ప మనసు .. ఏకంగా 251 మంది అమ్మాయిలకు!

ఈ ఏడాది డాకు మహారాజ్‌తో అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా దబిడి దిబిడి సాంగ్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్‌లో మెరిసిన ముద్దుగుమ్మ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ఇటీవల తన పుట్టిన రోజును కూడా సెలబ్రేట్ చేసుకుంది.‍అయితే తన పుట్టిన రోజు సందర్భంగా ఊర్వశి రౌతేలా తన మంచి మనసును చాటుకుంది. ఊర్వశి రౌతేలా ఫౌండేషన్ తరఫున అనాథలైన అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించింది. ఈ మహోన్నత కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆశీర్వదించారు. దాదాపు 251 జంటలకు సామూహిక వివాహం జరిపించనట్లు ఊర్వశి రౌతేలా వెల్లడించారు. అంతేకాదు తానే స్వయంగా వారికి భోజనాలు కూడా వడ్డించింది బాలీవుడ్ భామ. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశి చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.During Mahashivratri & her birthday Urvashi Rautela facilitated the marriages of 251 underprivileged orphaned girls along with PM @narendramodi ji & President @rashtrapatibhvn ji 🙏🏻 #NarendraModi #UrvashiRautela #DroupadiMurmu #UrvashiRautelaFoundation #BageshwarDhamSarkar pic.twitter.com/ySjcwnkI9X— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) February 28, 2025

Microsoft is finally shutting down Skype in May6
నాడు బీభత్సం.. నేడు ఫెయిల్‌.. ఇకపై ఆ సేవలకు మైక్రోసాఫ్ట్‌ గుడ్‌బై?

ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (microsoft) కీలక నిర్ణయం తీసుకోనుంది. 2000 దశకంలో సంచలనం సృష్టించిన వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్‌కు (skype) స్వస్తి పలకనుంది. వెలుగులోకి వచ్చిన పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది మే నెలలో స్కైప్‌ను షట్‌ డౌన్‌ చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ప్రముఖ టెక్‌ బ్లాగ్‌ ఎక్స్‌డీఏ కథ మేరకు..‘స్కైప్‌ ప్రివ్యూలో ఓ హిడెన్ మెసేజ్ కనిపించింది. అందులో, మే నెల నుంచి స్కైప్‌ అందుబాటులో ఉండదు. మీ కాల్స్, చాట్స్ చేసుకునేందుకు వీలుగా మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ ఉంది. అంతేకాదు, మీ మిత్రులు ఇప్పటికే టీమ్స్‌కి మారారు’ అని ఉన్నట్లు పేర్కొంది. అయితే,స్కైప్‌ షట్‌ డౌన్‌పై మైక్రోసాప్ట్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. స్కైప్‌ చరిత్రస్కైప్‌ తొలిసారిగా 2003లో ప్రారంభమైంది. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అందుకే, 2011లో మైక్రోసాఫ్ట్ దీనిని 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. స్కైప్‌కి పోటీగా ఐమెసేజ్‌,వాట్సాప్‌,జూమ్‌ వంటి యాప్స్‌ పుట్టుకొచ్చాయి. దీంతో స్కైప్‌ ప్రాచుర్యం తగ్గిపోయింది. కోవిడ్‌-19 సమయంలో స్కైప్‌ మళ్లీ పాపులర్ అవుతుందనుకున్నారు. కానీ జూమ్‌, గూగుల్‌ మీట్స్‌ స్థాయిలో స్కైప్‌ ఆకట్టుకోలేకపోయింది. అందుకే స్కైప్‌ను మైక్రోసాఫ్ట్‌ షట్‌డౌన్‌ చేయనుందని వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు పేర్కొన్నాయి.స్కైప్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ (Microsoft Teams) అనే వీడియో ఫ్లాట్‌ఫారమ్‌ను వినియోగంలోకి తెచ్చింది.టీమ్స్‌పై ఫోకస్‌ స్కైప్‌ను షట్‌డౌన్‌ చేయాలనే ఆలోచనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ తన ఫోకస్‌ అంతా మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌పై పెట్టింది.స్కైప్‌ కంటే ఎక్కువ ఫీచర్లను మైక్రోసాఫ్ట్‌టీమ్స్‌లో జోడించింది. ఇటీవల కోపైలెట్‌ ఏఐ ఫీచర్లను జోడించింది. ఇలా మైక్రోసాఫ్ట్‌ స్కైప్‌ను పూర్తిగా నిలిపివేస్తోందా? లేక వేరే రూపంలో తెరపైకి తెస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.

Jos Buttler Steps Down From England White Ball Captaincy, Following Their Exit From CT 20257
ఇంగ్లండ్‌ కెప్టెన్సీకి జోస్‌ బట్లర్‌ రాజీనామా

ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి (England White Ball Captaincy) జోస్‌ బట్లర్‌ (Jos Buttler) రాజీనామా చేశాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో (Champions Trophy) ఇంగ్లండ్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన నేపథ్‌యంలో బట్లర్‌ ఈ నిర్ణయం​ తీసుకున్నాడు. సౌతాఫ్రికాతో రేపు (మార్చి 1) జరుగబోయే మ్యాచ్‌ ఇంగ్లండ్‌ వైట్‌ బాల్‌ కెప్టెన్‌గా బట్లర్‌కు చివరిది. 2022 జూన్‌లో బట్లర్‌ ఇంగ్లండ్‌ ఫుల్‌ టైమ్‌ వైట్‌ బాల్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇయాన్‌ మోర్గాన్‌ నుంచి బట్లర్‌ బాధ్యతలు స్వీకరించాడు. బట్లర్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌ 2022 టీ20 వరల్డ్‌కప్‌ గెలిచింది. బట్లర్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌ వన్డేల్లో దారుణంగా విఫలమైంది. బట్లర్‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ 12 మ్యాచ్‌ల్లో గెలిచి 22 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో బట్లర్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ ఏడో స్థానంలో నిలిచి, సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించింది. వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత బట్లర్‌ నేతృత్వంలో ఇంగ్లండ్‌ 17లో 13 వన్డేలు ఓడింది.ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ చేసినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. అనంతరం రెండో మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌ పూర్తయిన వెంటనే బట్లర్‌ రాజీనామా విషయమై హింట్‌ ఇచ్చాడు. తాజాగా అధికారికంగా తన రాజీనామాను ప్రకటించాడు. భారత్‌ సిరీస్‌లోనూ ఘోర పరాభవంబట్లర్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు భారత పర్యటనలోనూ దారుణంగా విఫలమైంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో (క్లీన్‌ స్వీప్‌) కోల్పోయింది. భారత​్‌తో సిరీస్‌లు ముగిసిన వెంటనే బట్లర్‌పై విమర్శలు తారాస్థాయికి చేరాయి. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని పెద్ద ఎత్తును డిమాండ్లు వినిపించాయి.వ్యక్తిగతంగానూ దారుణంగా విఫలమవుతున్న బట్లర్‌పరిమిత ఓవర్లలో జట్టును విజయవంతంగా నడిపించలేకపోయిన బట్లర్‌.. వ్యక్తిగతంగానూ దారుణంగా విఫలమయ్యాడు. బట్లర్‌ బ్యాట్‌ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్‌ జాలువారి చాలాకాలం అయ్యింది. భారత్‌ పర్యటనలో.. ప్రస్తుతం ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ బట్లర్‌ తేలిపోయాడు. ఫామ్‌ లేమితో సతమతమవుతున్న బట్లర్‌ గాయాలతోనూ వేధించబడుతున్నాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌, 2024 టీ20 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. బట్లర్‌ నాయకత్వంలో టైటిల్‌ నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఇంగ్లండ్‌ తదుపరి వైట్‌ బాల్‌ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్‌ను నియమించాలని ఆ దేశ అభిమానలు కోరుకుంటున్నారు.

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package8
ఎల్‌పీయూ విద్యార్థికి రూ.1.03 కోట్ల ప్యాకేజీ

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

LTIMindtree Links Salary Hikes to New Competency Test9
ఐటీ కంపెనీ కొత్త రూల్‌.. పరీక్ష పాసైతేనే జీతం పెంపు

ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల వేతన పెంపులు (Salary Hikes) క్లిష్టంగా మారుతున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కో నిబంధనను తెస్తున్నాయి. తాజాగా ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree) సంస్థ కొత్త సామర్థ్య ఆధారిత మదింపు వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మేనేజర్‌ స్థాయి ఉద్యోగుల వేతన పెంపును సామర్థ్య పరీక్ష ఉత్తీర్ణతకు లింక్‌ చేసింది. కంపెనీ వార్షిక అప్రైజల్‌ కసరత్తులో భాగమైన ఈ చొరవ లక్ష్యం మేనేజర్లు తమ పాత్రలలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని కలిగి ఉండేలా చేయడమే.కాంపిటెన్సీ టెస్ట్‌మిడిల్, సీనియర్ లెవల్ మేనేజర్లకు తప్పనిసరిగా నిర్వహించే ఈ కాంపిటెన్సీ టెస్ట్‌లో కోడింగ్, మ్యాథమెటిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ సహా పలు నైపుణ్యాలను అంచనా వేస్తారు. బృందాలకు నాయకత్వం వహించడానికి, సంస్థ ఎదుగుదలను నడిపించడానికి అవసరమైన సాంకేతిక, నిర్వహణ సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈ పరీక్ష రూపొందించారు. నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న టీమ్ లీడ్ లు, లీడ్ ఆర్కిటెక్ట్ లను కలిగి ఉన్న పీ3, పీ4, పీ5 బ్యాండ్ ల్లోని మేనేజర్ లు వేతన పెంపునకు అర్హత పొందడానికి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.చొరవ వెనుక హేతుబద్ధతశరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమలో పోటీతత్వంతో ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సామర్థ్య ఆధారిత అప్రైజల్ వ్యవస్థను అమలు చేయాలని ఎల్‌టీఐ మైండ్‌ట్రీ కంపెనీ నిర్ణయం తీసుకుంది. సామర్థ్య పరీక్ష ఉత్తీర్ణతను వేతన పెంపునకు అనుసంధానించడం ద్వారా, కంపెనీ తన మేనేజర్లకు తాజా నైపుణ్యాలు, పరిజ్ఞానం ఉందని నిర్ధారించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం శ్రామిక శక్తి మొత్తం సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా నిరంతర అభ్యాసం, అభివృద్ధికి కంపెనీ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది.పరిశ్రమ ప్రభావంఎల్‌టీఐమైండ్‌ట్రీ తీసుకున్న ఈ నిర్ణయం బహుశా భారత ఐటీ పరిశ్రమలో ఇదే మొదటిది కావచ్చు. పనితీరు మదింపులలో నైపుణ్యాల ఆధారిత మదింపుల ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ, ఇతర కంపెనీలు అనుసరించడానికి ఇది ఒక ఉదాహరణను ఏర్పరుస్తుంది. వేతన పెంపునకు సామర్థ్య పరీక్షను తీసుకురావడం మెరిటోక్రసీపై కంపెనీ దృష్టిని, అత్యుత్తమ సంస్కృతిని పెంపొందించే వైఖరిని తెలియజేస్తోంది.ఇది చదివారా? ఇన్ఫోసిస్‌ లేఆఫ్‌లలో మరో ట్విస్ట్‌..ఉద్యోగుల రియాక్షన్‌ఎల్‌టీఐమైండ్‌ట్రీ తీసుకొచ్చిన కొత్త అప్రైజల్ వ్యవస్థపై ఉద్యోగుల నుంచి మిశ్రమ ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. అయితే నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంక, సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని కల్పించడాన్ని కొంత మంది ఉద్యోగులు అభినందిస్తున్నారు. అదనపు ఒత్తిడి, వేతనాల పెంపుపై ప్రభావం పడుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష నిష్పాక్షికంగా ఉండేలా రూపొందించామని, అందుకు వారు సిద్ధం కావడానికి తగిన సహకారం, వనరులను అందిస్తామని ఎల్‌టీఐమైండ్‌ట్రీ తమ ఉద్యోగులకు హామీ ఇచ్చింది.

Who is Manav Sharma,Latest update on Uttar Pradesh techie row10
మా గోడు వినండి..భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భర్త కథ

లక్నో: కట్టుకున్న భార్య (wife) రాచిరంపాన పెడుతోందంటూ జీవితాల్ని అర్థాంతరంగా జీవితాల్ని ముగుస్తున్న భర్తల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే బెంగళూరులో అతుల్‌ సుభాష్‌, కర్ణాటకలో ఓ కానిస్టేబుల్‌ తిప్పన్న.. రాజస్థాన్‌లో ఓ డాక్టర్‌ అజయ్‌.. ఇలా రోజుకొక ఉదంతం వెలుగులోకి వస్తోంది. ఇదిలా ఉండగానే.. ఉత్తరప్రదేశ్‌లో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.ప్రముఖ టెక్‌ కంపెనీ టీసీఎస్‌ (tcs)లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న 25ఏళ్ల మానవ్‌ శర్మ(manav sharma) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 24న తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అయితే,మరణానికి ముందు మానవ్‌ శర్మ ఆవేదనతో కూడిన ఆరు నిమిషాల 50 సెకన్ల నిడివిగల ఓ వీడియోను రికార్డ్‌ చేశాడు. ఆ వీడియోలో తన వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని, తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఇదే విషయంలో తనకు, తన భార్యకు గొడవలు జరిగేవని అన్నారు. అయినా తనలో మార్పు రాలేదన్నారు. మగాళ్లకు రక్షణే లేదామానవ్‌ శర్మ ఏడుస్తూ.. దేశంలో మహిళలను రక్షించేలా చట్టాలు ఉన్నట్లు.. పురుషులను రక్షించేలా చట్టాలు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. పురుషుల గురించి ఆలోచించండి’ అని న్యాయస్థానాల్ని వేడుకున్నాడు. పురుషులకు రక్షణ కల్పించకపోతే.. వారు అంతమవుతారని హెచ్చరించారు. కోడలి నిర్వాకం వల్లే ఈ సందర్భంగా తన మణికట్టుపై కత్తికోసుకున్న గుర్తులను చూపిస్తూ అంతకుముందు తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు శర్మ వెల్లడించాడు. నా మరణానంతరం నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దని అర్జిస్తూ వీడియోను ముగించాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యపై సమాచారం అందుకున్న శర్మ తండ్రి సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మరణానికి తన కోడలు కారణమని ఆరోపించారు.అన్నీ అవాస్తవాలేమానవ్‌ శర్మ ఆత్మహత్యపై ఆయన సతీమణి ఖండించారు. నా భర్త మద్యానికి బానిసయ్యారు. అతిగా మద్యం సేవించి పలుమార్లు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. మూడు సార్లు నేనే రక్షించా. మద్యం సేవించిన తరువాత నాపై దాడి చేసేవారు. ఇదే విషయాన్ని తన అత్తమామల దగ్గర ప్రస్తావించినా వారు పట్టించుకోలేదు.అవన్నీ పెళ్లికి ముందే.. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసంవివాహేతర సంబంధంపై మీడియా ఆమెను ప్రశ్నించగా..అవన్నీ పెళ్లికి ముందే. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసం’అని అన్నారు. ఈ సందర్భంగా వాట్సాప్‌ చాట్‌ను బహిర్ఘతం చేశారు. ఆ చాట్‌లో దీదీ, దయచేసి ఏదో ఒకటి చేయండి. తనను తాను చంపుకుంటాడు అని తన భర్త సోదరికి(వదిన) మెసేజ్‌ చేసింది. బదులుగా అతన్ని ఒంటరిగా ఉండనివ్వండి. నిద్రపోండి’ అని బదులిచ్చినట్లు గమనించవచ్చు.ఇప్పటి వరకూ జరగని అరెస్టులుమానవ్‌ శర్మ ఆత్మహత్యపై ఆగ్రా ఏఎస్పీ వినయక్‌ గోపాల్‌ మాట్లాడారు. ‘మాకు ఆగ్రాలోని మిలటరీ హాస్పిటల్‌లో మానవ్ మృతదేహం ఉందనే సమాచారం వచ్చింది. మానవ్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. అతని ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు. బాధితుడు రికార్డ్‌ చేసిన వీడియోను గుర్తించాం. అందులో తన భార్యతో విభేదాలు, ఇతర సమస్యల కారణంగా ప్రాణాలు తీసుకున్నట్లు గుర్తించామని’ చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను  ఈ మహా శ

title
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌

మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

title
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్‌ క్లియర్‌

వాషింగ్టన్‌:  ఫిబ్రవ

title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

Advertisement

వీడియోలు

Advertisement