Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

US Secretary Of State Marco Rubio Dials S Jaishankar, Pak PM1
పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా!

వాషింగ్టన్‌ : జమ్మూకశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడి అంశంపై పాకిస్తాన్‌కు అమెరికా షాకిచ్చింది. మతిలేని చర్యను వెనకేసుకు రావొద్దని హెచ్చరించింది. పహల్గాం దాడి విషయంలో చేపట్టే దర్యాప్తులో భారత్‌కు సహకరించాలని సూచించింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్‌ - పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాక్‌ ప్రధాని హహబాద్‌ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.ఫోన్‌ సంభాషణలో రూబియో.. ఉగ్రవాదంపై భారత్‌ తీసుకునే ప్రతి చర్యలో అమెరికా పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. అదే సమయంలో పహల్గాంలో 26 మంది ప్రాణాలు తీసిన అమానుష చర్యపై భారత్‌ చేపట్టే దర్యాప్తుకు సహకరించాలని సూచించినట్లు సమాచారం.జైశంకర్‌తో మాట్లాడిన సమయంలో మార్కో రూబియో పహల్గాం దాడి బాధితులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై జరిపే పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముందు నుంచి పహల్గాం ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని భారత్‌ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ విషయంలో ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతి భద్రతలను కాపాడుకోవడానికి పాకిస్తాన్‌తో కలిసి పనిచేయాలని భారత్‌ కృషి చేయాలని కోరారు. అందుకు ప్రతిస్పందనగా ఎక్స్‌ వేదికగా జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో దాడికి పాల్పడ ఉగ్రవాదుల్ని, వాళ్లను పెంచి పోషిస్తున్న వారిని, పహల్గాం ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన వారిని న్యాయం ముందు నిలబెట్టాలి’ అని పేర్కొన్నారు. రుబియో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌తో జరిపిన సంభాషణల్లో పాకిస్తాన్‌ పహల్గాం దాడిని ఖండించాలని, దర్యాప్తులో సహకరించాలని కోరారు. ఈ దాడిపై పాకిస్తాన్ బాధ్యత వహించాలని, భారత్‌తో నేరుగా సంభాషణలు పునరుద్ధరించి శాంతి దిశగా కృషి చేయాలని సూచించినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరి తాజా పరిణామలపై భారత్‌ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Israel Largest Wildfires Rage Outside Jerusalem2
ఇజ్రాయెల్‌లో భీకర కార్చిచ్చు.. జెరూసలెంను కమ్మేసిన పొగ

జెరూసలెం శివారులోని అడవుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో వేలాది మంది తమ నివాసాలను ఖాళీ చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. కార్చిచ్చు కారణంగా 13 మంది గాయపడినట్లు సమాచారం. ప్రాణనష్టంపై వివరాలు ఇంకా తెలియరాలేదు. వాతావరణం పొడిగా ఉండటం, బలమైన గాలులతో ఈ మంటలు వేగంగా చెలరేగుతున్నాయి.మంటలకు సంబంధించిన వీడియోలు, రోడ్లపై పలువురు తమ వాహనాలు విడిచి.. పరుగులు పెడుతున్నా దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. జెరూసలెం చుట్టుపక్కల కొండలపై దట్టమైన పొగ అలముకుంది. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దేశ చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా అధికారులు చెబుతున్నారు.ఈ మంటలు జెరూసలెం నగరానికి చేరుకోవచ్చని ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఇప్పటికే హెచ్చరికాలు జారీ చేశారు. రహదారులపై దట్టమైన పొగ కమ్ముకోవడంతో టెల్‌ అవీవ్‌, జెరూసలెంను కలిపే రహదారిని మూసేశారు. సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. మంటలు చెలరేగుతున్న ప్రాంతాలలోని పర్యాటక ప్రదేశాలను మూసివేశారు.📹1-The fires are spreading over increasingly larger areas as Israeli firefighting units are unable to bring them under control. https://t.co/Ls6gBs07h0📹2-A major highway of the occupying state was closed after #wildfires engulfed it with flames & smoke, forcing drivers &… pic.twitter.com/Ena9kmPjOS— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) May 1, 2025

Need To Take: Dhoni Blunt As Ever As CSK IPL 2025 Playoff Hope Fade Away3
వాళ్లిద్దరు అద్భుతం.. అతడు గొప్ప ఫీల్డర్‌.. కానీ అక్కడే వెనుకబడ్డాం: ధోని

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) ప్రయాణం ముగిసిపోయింది. పంజాబ్‌ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓడిన తర్వాత ధోని సేన అధికారికంగా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.పంజాబ్‌తో మ్యాచ్‌లో తమ బ్యాటర్లు మెరుగ్గానే ఆడారని.. అయితే, కనీసం ఇంకో 15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ఈరోజు తొలిసారి మా బ్యాటర్లు స్కోరు బోర్డుపై మెరుగైన సంఖ్యను ఉంచారు. కానీ ఇలాంటి పిచ్‌పై ఇది సరిపోదు.ఆఖరి నాలుగు బంతులు వృథా చేశాంమా వాళ్లు ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేది. అదే విధంగా మేము కీలక సమయాల్లో కీలక క్యాచ్‌లు జారవిడవడం కూడా ప్రభావం చూపింది.ఏదేమైనా ఈరోజు బ్రెవిస్‌, సామ్‌ అద్భుతంగా ఆడి విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, మేము దురదృష్టవశాత్తూ ఆలౌట్‌ అయ్యాము. ఆఖరి నాలుగు బంతులు వృథా చేశాం. అంతకంటే ముందు మా వాళ్లు నలుగురు అవుట్‌ అయ్యారు.అతడొక పోరాట యోధుడుఇలాంటి కీలక పోరులో ఒక్క బంతి ఆడటం కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పుతుంది’’ అని ధోని పేర్కొన్నాడు. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో అద్భుత అర్థ శతకంతో మెరిసిన సామ్‌ కరన్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడొక పోరాట యోధుడు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా కచ్చితంగా రాణిస్తాడు.అయితే, దురదృష్టవశాత్తూ పిచ్‌ దృష్ట్యా అతడికి ఎక్కువగా ఛాన్సులు ఇవ్వలేకపోయాం. కానీ ఈరోజు మా సొంతమైదానంలో టోర్నీలోనే అత్యుత్తమ వికెట్‌ మీద ఆడి తానేంటో నిరూపించుకున్నాడు.అతడొక అద్భుతమైన ఫీల్డర్‌ కూడామేము ఇంకొక్క పదిహేను పరుగులు చేసి ఉంటే బాగుండేది’’ అని ధోని అన్నాడు. అదే విధంగా అద్భుత ఫీల్డింగ్‌ నైపుణ్యాలు కనబరిచిన డెవాల్డ్‌ బ్రెవిస్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘మిడిలార్డర్‌లో తను మొమెంటమ్‌ తీసుకువచ్చాడు.చిన్న అవకాశం దొరికినా బంతిని బౌండరీకి తరలించాలని చూస్తాడు. అంతేకాదు.. అతడొక అద్భుతమైన ఫీల్డర్‌ కూడా. జట్టులో సరికొత్త ఉత్సాహం నింపుతున్నాడు. అతడి ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాము. భవిష్యత్తులో అతడొక విలువైన ఆస్తిగా మారతాడు’’ అని ధోని ఈ సౌతాఫ్రికా యువ బ్యాటర్‌పై ప్రశంసలు కురిపించాడు.Brilliant Brevis catch: Composure. Presence of mind & Athleticism at its best 🫨Watch 🔽🎥#TATAIPL | #CSKvPBKS— IndianPremierLeague (@IPL) April 30, 2025 సీఎస్‌కేకే ఇదే తొలిసారికాగా చెపాక్‌ స్టేడియంలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసింది చెన్నై. ఓపెనర్లు షేక్‌ రషీద్‌ (11), ఆయుశ్‌ మాత్రే (7) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన సామ్‌ కరన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.మొత్తంగా 47 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతడికి తోడుగా డెవాల్డ్‌ బ్రెవిస్‌ (32) రాణించాడు. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. ఈ క్రమంలో 19.2 ఓవర్లో 190 పరుగులు చేసి చెన్నై జట్టు ఆలౌట్‌ అయింది.ఇక ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నైని ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకొనేలా చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో బేబీ ఏబీడీ బ్రెవిస్‌ అద్భుతమైన క్యాచ్‌లతో మెరిశాడు. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (54) ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టాడు.అయితే, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శశాంక్‌ సింగ్‌ (23) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద అద్భుత రీతిలో అందుకున్న బ్రెవిస్‌ అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. బౌండరీ లైన్‌కు తాకే ప్రమాదం ఉండటంతో బంతిని మూడుసార్లు గాల్లోకి లేపి ఆ తర్వాత సురక్షితంగా క్యాచ్‌ పట్టాడు. కాగా గతేడాది కూడా చెన్నై టాప్‌-4కు చేరలేదన్న విషయం తెలిసిందే. ఇలా వరుసగా రెండు సీజన్లలో చెన్నై ప్లే ఆఫ్స్‌ చేరకపోవడం ఇదే తొలిసారి.చదవండి: క్రికెట్‌ నీకు రెండో ఛాన్స్‌ ఇచ్చింది.. కానీ.. Hat-trick 👌Powerful start with the bat 🔥Captain's knock 🫡The Battle of Kings goes the @PunjabKingsIPL way again this season ❤Scorecard ▶ https://t.co/eXWTTv7Xhd #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/Yk1SOZOzip— IndianPremierLeague (@IPL) April 30, 2025

failed Soviet Venus lander will fall back to Earth4
దూసుకొస్తున్న కాస్మోస్ 482

సోవియట్ యూనియన్ ఎప్పుడో అర్ధ శతాబ్దం క్రితం ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘కాస్మోస్ 482’ త్వరలో భూమిపై కూలబోతోంది. మే నెల 8-11 తేదీల మధ్య అది భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. శుక్ర గ్రహాన్ని పరిశోధించడానికి 1972 మార్చి 31న సోవియట్ ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. వాస్తవానికి ‘కాస్మోస్ 482’ ఓ లాండింగ్ మాడ్యూల్. 495 కిలోల ల్యాండరును శుక్రగ్రహంపై దింపడం ఈ మిషన్ ఉద్దేశం. సాంకేతిక లోపం తలెత్తి ప్రయోగం విఫలమవడంతో ‘కాస్మోస్ 482’ స్పేస్ క్రాఫ్ట్ ముందుకు ప్రయాణించడానికి అవకాశం లేక భూకక్ష్యలోనే ఇరుక్కుపోయింది. గత 53 సంవత్సరాలుగా అది భూమి కక్ష్యలోనే పరిభ్రమిస్తోంది. ఇప్పుడు కూలే సమయం ఆసన్నమవడంతో శాస్త్రవేత్తలు దాని ఆర్బిటల్ ఎత్తును నిరంతరాయంగా గమనిస్తున్నారు. అంతరిక్ష నౌక కచ్చితంగా ఏ తేదీన భూమిపై కూలుతుందో త్వరలో తెలుస్తుంది. మే 8-11 తేదీల్లో ‘కాస్మోస్ 482’ భూమిపై కూలవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ... ‘సూర్యుడి క్రియాశీలత’ ప్రభావంతో సదరు తేదీలకు కాస్త ముందుగా గానీ, లేదా ఆ తర్వాత గానీ నౌక కూలే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే సూర్యుడి క్రియాశీలత అధికంగా ఉంటే భూమి ఎగువ వాతావరణం త్వరగా వేడెక్కి వ్యాకోచిస్తుంది. ఫలితంగా దిగువ కక్ష్యలో పరిభ్రమించే వస్తువులను భూ వాతావరణం త్వరితగతిన లాక్కుంటుంది. అంటే ‘కాస్మోస్ 482’ అంతరిక్ష నౌక మనం అనుకున్న సమయం కంటే ముందుగానే కూలిపోవచ్చు. 52 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల్లో కూలవచ్చు!భూ వాతావరణంలోకి అనియంత్రిత ప్రవేశం’ కనుక ‘కాస్మోస్ 482’ స్పేస్ క్రాఫ్ట్ భూమిపై ఏ ప్రాంతంలో కూలిపోతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ ప్రస్తుతం నౌక కక్ష్యను పరిశీలిస్తే భూమిపై 52 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 52 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య గల సువిశాల ప్రదేశంలో... అంటే ఉత్తరాన బ్రిటన్ మొదలుకొని దక్షిణాన న్యూజిలాండ్ దాకా ఎక్కడైనా అది కూలవచ్చు. భూమిపై జలావరణమే అధికం కనుక నౌక నేలపై కాకుండా సముద్రాల్లో కూలిపోయే అవకాశాలే ఎక్కువ. సముద్ర ప్రదేశాలు కాకుండా భూభాగంపై లేదా జనావాస ప్రాంతాలపై అది కూలిపోయే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ ఓ అంశం శాస్త్రవేత్తలను కొంచెం కలవరపెడుతోంది. ‘కాస్మోస్ 482’కు ఓ విశిష్టత ఉంది. అది ‘వెనెరా’ మిషన్ ల్యాండర్ల తరహా అంతరిక్ష నౌక. శుక్ర గ్రహంపై దిగేటప్పుడు అక్కడి కఠినాతి కఠినమైన అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర పీడనాన్ని తట్టుకునేలా ‘కాస్మోస్ 482’ను రూపొందించారు. సాధారణంగా ఖగోళ వస్తువులు భూవాతావరణంలోకి ప్రవేశించాక గాలి ఒరిపిడికి మండిపోయి చిన్న శకలాలుగా రాలిపోతాయి. వాటిలోని పెద్ద, బరువైన భాగాలు మాత్రమే భూమిని తాకుతాయి. డిజైన్ ప్రత్యేకత దృష్ట్యా ‘కాస్మోస్ 482’ మాత్రం భూ వాతావరణంలోకి ప్రవేశించినా ధ్వంసం అవదు. సముద్రాల్లో కాకుండా అది భూభాగంపై కూలిపోవడమంటూ సంభవిస్తే... ఏమాత్రం చెక్కు చెదరకుండా 495 కిలోల ‘కాస్మోస్ 482’ ధడేల్మని ‘ఒకే ముక్క’గా నేల రాలుతుంది! అలా చిన్న ఉల్క మాదిరి ప్రభావం చూపుతుంది. శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తున్న అంశం ఇదే. - జమ్ముల శ్రీకాంత్

Imd Issues Rain Alert To Telangana And Andhra Pradesh5
తెలుగు రాష‍్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 21 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 17 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను అధికారులు జారీ చేశారు.కోస్తాంధ్రలో ఒక్కసారిగా మారిన వాతావరణంకోస్తాంధ్రలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వాతావరణంలో భిన్నమైన మార్పులు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో విపరీతమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక కొన్ని చోట్ల కురిసిన అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

India Closes Airspace For All pakistan Flights6
పాక్‌ విమానాలకు భారత గగనతలం మూసివేత.. నెక్ట్స్‌ జరిగేది ఇదేనా?

ఢిల్లీ: పాకిస్తాన్‌ను మరింత ఇబ్బంది పెట్టేలా భారత్‌ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్‌ గగనం తలంలో పాక్‌ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. దీంతో పాకిస్థాన్‌ నుంచి భారత్‌ మీద నుంచి కాకుండా ఇతర దేశాల గగనం తలం నుంచి గమ్య స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, భారత విమానాలకు పాకిస్తాన్ గగనతల మూసివేయడంతో ప్రతి చర్యగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ ఆంక్షలు మే 24 వరకు కొనసాగనున్నాయి. అయితే ఈ గడువు మున్ముందు పరిస్థితులపై ఆధారపడి ఉండనుంది. భారత గగన తలంపై పాక్‌ విమానాల నిషేధం విధిస్తూ.. కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ‘భారత్‌ గగనం తలంపై పాక్‌ విమానాలు నిషేదం. వాటిల్లో పాక్‌ రిజిస్టర్డ్‌ విమానాలు, అలాగే పాక్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, లేదంటే లీజుకు తీసుకున్న విమానాలకు భారత గగనతల ప్రవేశం లేదు. ఇందులో సైనిక విమానాలూ ఉన్నాయి’ అని కేంద్రం విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది. మరోవైపు భారత్‌ తీసుకుంటున్న వరుస నిర్ణయాలపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పాక్‌కు చెందిన విమానాలు భారత్ గగనతలం మీద నుంచి ప్రయాణించకూడదన్న ఆదేశాలు అమల్లో ఉండగా.. ఇప్పుడు అధికారికంగా గగనతలాన్ని మూసివేస్తూ భారత్‌ ప్రకటన చేయడంపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చర్య వల్ల దక్షిణ ఆసియా, ఓషియానియా ప్రాంతాలకు వెళ్లే పాక్ విమానాలు భారత గగన తలం మీద నుంచి పొరుగు దేశాల మీద నుంచి తిరిగి ప్రయాణించాల్సి వస్తుంది. ఆ ఫలితం పాక్‌ విమానయాన రంగంపై పడనుంది. విమానం ప్రయాణ సమయం పెరగడం, ఫ్లైట్‌ ఛార్జీలు పెరగడం, విమాన ఇంధన ధరలు పెరగడం, విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తగ్గడం వంటి ప్రతికూల ప్రభావం పడనుంది. వెరసీ పాక్‌ మరిన్ని ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోంది. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైపోయిన పాకిస్తాన్ విమానయాన సంస్థలకు తాజా భారత నిర్ణయంతో అదనపు భారం పడనుంది.

Parenting Tips: Mayabazaar Lessons To Teach Children7
పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్‌' పాఠాలు..!

పిల్లలకు చెప్పాల్సిన పాఠాలు ‘మీరు ఉద్దండ పండితులేగాని ఉండాల్సిన బుద్ధి మాత్రం లేదయ్యా’ అంటాడు శకుని. ర్యాంకులు వేరు... కామన్‌సెన్స్‌ వేరు... ఈ సంగతి పిల్లలకు ఎవరు చెప్పాలి? ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అంటాడు ఇదే శకుని. ఈ చిట్కా చెప్పడానికి పెద్దలకు తీరిక ఎక్కడిది? అస్మదీయులు ఎవరో తస్మదీయులు ఎవరో తెలుసుకోకపోతే పిల్లల అడుగులు పడేదెలా? హాయ్‌ హాయ్‌ నాయకా.. హోయ్‌ హోయ్‌ నాయకా... నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉంటాయి? తెలుగువారికి మాత్రమే ఉన్న వ్యక్తిత్వ వికాస సర్వస్వం ‘మాయాబజార్‌’ సినిమా. ఈ సెలవుల్లో పెద్దలు పిల్లలతో ఈ సినిమా చూడాలి. వివరించాలి. ‘మాయాబజార్‌’1957లో విడుదలైన గొప్ప తెలుగు చిత్రం. భారతంలోని పాత్రలకు కొద్దిపాటి కల్పన జత చేసి మలచిన ఈ సినిమా ఎందుకు ఇంతకాలం ఆదరణ పొందుతూ ఉందంటే అది ఎప్పుడూ ఒకేలా ఉండే మానవ స్వభావాలను చిత్రించింది కనుక. నేడు ఎదురుపడే మనుషులు ఎలా ఉంటారో ఈ సినిమాలో పాత్రలు అలా ఉంటాయి. అందుకే వాటితో తమను తాము ఐడెంటిఫై చేసుకున్న ప్రేక్షకులు ఎన్నో సాఠాలు నేర్చుకుంటారు. అర్థం చేసుకుంటారు. పిల్లలకు ఈ సినిమా గొప్ప వినోదంగా ప్రారంభమవుతుంది. ఐదేళ్ల వయసు పిల్లల నుంచి ఈ సినిమాను ఎంజాయ్‌ చేస్తారు. చూసేకొద్దీ ఎదిగే కొద్దీ వారికి సినిమా కొత్తగా అర్థమై మరింతగా నచ్చుతుంది. ఈ సినిమాకు ఫ్యాన్స్‌ అయిపోతారు. అలా తరతరాలుగా ఫ్యాన్స్‌ అయ్యేలా చేసుకుందీ సినిమా. గతంలో ప్రతి వేసవిలో ఈ సినిమా రీరిలీజ్‌ అయ్యేది. ఇప్పుడు ఓటిటీల్లో... యూట్యూబ్‌లో కలర్‌లో ఉంది. పిల్లలతో ఒకటికి రెండుసార్లు చూసి వారికి చెప్పాల్సిన పాఠాలు చాలానే ఉంటాయి. 1. బాల అభిమన్యు తన విలువిద్య గురించి ఇలా అంటాడు: అత్తయ్యా... నువ్వు జడవకుండా నుంచో... నీ ముక్కుకు తగలకుండా నత్తును కొడతాను. పిల్లలకు చెప్పాలి: నత్తు అంటే ముక్కుకు పెట్టుకునే ఆభరణం. విలువిద్య నేర్చుకుని ఎవరైనా సరే పండునో కాయనో కొట్టగలరు... కాని ముక్కుకు తగలకుండా నత్తును కొడతానంటున్నాడంటే విలువిద్య చాలా గొప్పగా నేర్చుకున్నాడన్న మాట. మనం చదివినా, ఆటల్లో ప్రవేశించినా, కళల్లో ఉన్నా ఆ స్థాయి పరిణితి సాధించాలి. అభిమన్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి. 2. శ్రీకృష్ణుడు ‘సత్యపీఠం’ తీసుకువస్తాడు. అలాగే ‘ప్రియదర్శిని’ కూడా చూపిస్తాడు. పిల్లలకు చెప్పాలి ‘సత్యపీఠం’ ఆనాటి లై డిటెక్టర్‌. మన పూర్వికులు శాస్త్రపరంగా గొప్ప ప్రయోగాలు చేశారు. ఊహలు చేశారు. శాస్త్రజ్ఞుల ఊహలో లేని కాలంలో ‘సత్యపీఠం’ ఊహ చేయడం మనవారి గొప్పతనం. అలాగే వీడియో కాల్‌ చేసుకునేలా ల్యాప్‌టాప్‌లాంటి ‘ప్రియదర్శిని’ని చూపించారు. సైన్స్‌ దృష్టికోణం నుంచి పురాణాలు చూస్తే చాలా ఇంటెరెస్టింగ్‌ విషయాలు తెలుస్తాయని చె΄్పాలి. 3. శకుని పాచికలు వేస్తూ అంటాడు: ఈ పాచికలతో ఎవరినైనా సర్వనాశనం చేయగలను. పిల్లలకు చె΄్పాలి: జూదం వ్యసనం. అందులో మోసం ఉంటుంది. నష్టం ఉంటుంది. ఒక్కసారి వ్యసనాల్లో దిగితే తిరిగి రావడం కష్టం. నేటి రోజుల్లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ కూడా అలాంటి వ్యసనమే. బెట్టింగ్‌ యాప్‌లు కూడా వ్యసనమే. ఆల్కహాల్, డ్రగ్స్‌ కూడా వ్యసనాలే. వ్యసనాల వల్ల పాండవులు రాజ్యాలను కోల్పోయారు. అందువల్ల ఎప్పుడూ వ్యసనాల జోలికిపోకూడదు. 4. శర్మ, శాస్త్రి వచ్చి లక్ష్మణ కుమారుణ్ణి పొగుడుతూ ‘పురోగమించుట వారికి తెలుసు... తిరోగమించుట తమకు తెలుసు’ అంటారు. పిల్లలకు చెప్పాలి: గొప్పలు చెప్పుకోవడం, పొగడ్తలకు పడిపోవడం అల్పుల లక్షణం అని, లక్ష్మణ కుమారుడు అలాంటి వాడని చెప్పాలి. మనకు ఎంత ప్రతిభ ఉన్నా గొప్పలు చెప్పుకోకూడదని నేర్పాలి. లేని ప్రతిభ ఉన్నట్టుగా కల్పించి చెప్పి అభాసుపాలు కాకూడదని చెప్పాలి. మన బలహీనతను వాడుకుంటూ కొందరు చుట్టూ చేరి మోసం చేసి పబ్బం గడుపుతారనీ అలాంటి వారిని గుర్తించి దూరం ఉండాలి చెప్పాలి. 5. రాజ్యం పోయాక సుభద్ర వస్తే బలరాముని ఇంట్లో పరాభవం పిల్లలకు చెప్పాలి: కొందరు మనుషులు అభిమానాన్ని బట్టి గాక స్థితిని బట్టి గౌరవిస్తారని, మనం కష్టంలో ఉంటే వారు అసలు రూపు చూపిస్తారని అలాంటి వారిని చూసి జాలి పడాలి తప్ప బాధ పడకూడదని నేర్పాలి. డబ్బుకు అతీతమైన విద్యాబుద్ధులు, వ్యక్తిత్వం శాశ్వతమని, వాటికే లోకంలో విలువ, గౌరవం అని చె΄్పాలి. 6. ఘటోత్కచుడి ప్రవేశం పిల్లలకు చెప్పాలి: మన దేశంలో అడవుల్లో జీవించేవారు ఉంటారని వారిని గిరిజనులు, ఆదివాసీలు అంటారనీ వారి కట్టు, బొట్టు, భాష, యాస, ఆచారాలు వేరని... మనం నాగరికులం అయినంత మాత్రాన వారిని చిన్నచూపు చూడకూడదని. వారెంతో మంచివారని, అడవులు వారి ఆధారం అని వాటిని నరికి లాక్కుని వారికి హాని కలిగించడం తప్పు అని నేర్పాలి. ‘అస్మదీయులు’ అంటే ఫ్రెండ్స్‌ అనీ, ఆదివాసీలకు మనం అస్మదీయులుగా ఉండాలని చె΄్పాలి. 7. దుష్ట చతుష్టయం పిల్లలకు చెప్పాలి: దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు... వీరు నలుగురిని దుష్ట చతుష్టయం అంటారని చతుష్టయం అంటే నాలుగు అని చెప్పాలి. చెడు ఆలోచనలు చేసేవారితో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవాళ్లం అవుతామని చెడ్డపనులు చేయడం వల్ల ప్రమాదంలో పడతామని హెచ్చరించాలి. 8. గింబళి, గిల్పం కావాలని డిమాండ్‌ పిల్లలకు చెప్పాలి: స్నేహితులైనా, బంధువులైనా న్యాయమైన సాయం, కోరిక కోరితే నెరవేర్చాలని, అదే మన మంచితనం సాకుగా తీసుకుని గొంతెమ్మ కోరికలు కోరితే వారికి బుద్ధి చె΄్పాలని నేర్పాలి. ‘కంబళి’, ‘తల్పం’ కాదని ‘గింబళి’, ‘గిల్పం’ కోరిన శర్మ, శాస్త్రులకు చిన్నమయ్య బుద్ధి చెప్పే దృశ్యాలు పిల్లలకు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి. 9. శాకంబరీదేవి ప్రసాదం– వివాహ భోజనంబు పిల్లలకు చెప్పాలి: తెలుగువారి భోజనానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ప్రతి ప్రాంతానికీ సమూహాలకు వారివైన ఆహార అలవాట్లు ఉంటాయని, వాటిని గౌరవించాలని మన ఆహారపు అలవాట్లను పాటించాలని నేర్పించాలి. గోంగూరను శాకంబరీ దేవి ప్రసాదం అంటారని తెలుగువారికి గోంగూర ఇష్టమని చెప్పాలి. భక్ష్యాలు, చిత్రాన్నాలు, పానీయాలు, కూరగాయలు అంటే ఏమిటో వాటి తేడాలేమిటో చెప్తే సరదా పడతారు. 10. చినమాయను పెనుమాయ పిల్లలకు చెప్పాలి: ఏ పనైనా నిజాయితీగా చేస్తే ఫలితం ఉంటుందని.. మాయతో కపటంతో శశిరేఖను లక్ష్మణ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని కౌరవులు భావిస్తే శ్రీకృష్ణుడు, ఘటోత్కచుడు పెనుమాయతో ఆ పెళ్లిని పెటాకులు చేశారని... తగిన శాస్తి జరిగిందని... చెడ్డవాళ్లు ఎప్పటికీ ఓడిపోతారని, మంచితనంతో ఉంటేనే గెలుస్తామని బోధించాలి.(చదవండి: అందరికీ కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్‌ ఎలా ఉండాలంటే..?)

HIT3: The Third Case Twitter Review And Public Talk In Telugu8
HIT3 X Review: ‘హిట్‌ 3’ ట్విటర్‌ రివ్యూ

నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన 'హిట్: ది థర్డ్ కేస్'(HIT3) సినిమా ఎట్టకేలకు నేడు(మే 1) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో మూడో చిత్రమిది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో సినిమా పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ లంచనాల మధ్య మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. హిట్‌ 3 కథేంటి? ఎలా ఉంది? నాని ఖాతాలో మరో హిట్‌ పడిందా లేదా తదితర అంశాలను ఎక్స్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో హిట్‌ 3(HIT3 Review) సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.కొంతమంది నెటిజన్స్‌ సినిమా మొదటి సగం అద్భుతంగా ఉందని, నాని నటన, రొమాంటిక్ ఎపిసోడ్‌లు ఆకట్టుకున్నాయని ప్రశంసింస్తే..మరికొంతమంది ఈ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోలేదని, గత హిట్ సినిమాలతో పోలిస్తే ఈ భాగం సాధారణంగా ఉందని అభిప్రాయపడ్డారు. సినిమా రెండో సగం కథలో మెరుగైన ఆలోచనలు, ఎగ్జిక్యూషన్ లోపించాయని కొందరు విమర్శించారు. అయినప్పటికీ, నాని పాత్రలో కొత్త జోన్‌లో కనిపించాడని, అతని నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చాలామంది కొనియాడారు. #Hit3 is a very violent action crime thriller that has moments that work well but at the same time portions that are too run of the mill and narrated on the slower side.The first half is pretty average and predictable till the pre-interval which starts to engage. The second…— Venky Reviews (@venkyreviews) April 30, 2025 హిట్ 3' ఒక వయలెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌.కొన్ని సీన్స్‌ భాగా వర్కౌట్‌ అయ్యాయి.అదే సమయంలో కొన్ని రోటీన్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఫస్టాఫ్‌ రొటీన్‌గా, ఊహించదగిన విధంగా ఉంటుంది. ప్రీ-ఇంటర్వెల్ వరకు, అక్కడ నుండి ఆసక్తికరంగా మారుతుంది. రెండవ సగం స్క్విడ్ గేమ్ నుండి ప్రేరణ పొందిన సెటప్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే, ముందుగా చెప్పినట్లు కథనం ఊహించదగిన విధంగా ఉంటుంది, తక్కువ ట్విస్ట్‌లతో మరియు మాస్ మూమెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. నిర్మాణ విలువలు మరియు సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తాయి. సంగీతం ప్రభావవంతంగా లేదు . నాని అద్భుతంగా నటించాడు అంటూ ఓ నెటిజన్‌ ఈ సినిమాకు 2.75 రేటింగ్‌ ఇచ్చాడు.#Hit3One time watch for NaNiHighlights __________NaNi’s performance Cinematography Climax Negatives__________Forceful violenceNo twists and turnsUneven screenplayBGM— praneeth nukala (@praneethnukala) May 1, 2025 హిట్‌ 3 ఒక్కసారి చూడొచ్చు. నాని నటన, సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్‌ ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్‌ అయితే.. వయెలెన్స్‌ బలవంతగా ఇరికించడం, ట్విస్టులు,మలుపులు లేకపోవడం, స్క్రీన్‌ప్లే, బీజీఎం మైనస్‌ పాయింట్స్‌ అని మరో నెటిజన్‌ అభిప్రాయ పడ్డాడు#HIT3 #HIT3Review RAW..BLOODY..🎯🎯🎯🎯Not for family audiences or kids. What an actor @NameisNani . He is growing as multitalented, big box office star. Best of #Nani movie I have ever watched. Totally new experience 👏🏼👏🏼Strictly NO Kids ⛔️⛔️***BLOCKBUSTER***— Karthik (@meet_tk) April 30, 2025#HIT3 rating : ⭐⭐🌟3/5!!@NameisNani show🔥 an Griping action pack thriller, #SrinidhiShetty and #nani chamestry good overall an watchable.#hit3review #HIT3FromMay1st pic.twitter.com/guu9TKRMsS— its cinema (@iitscinema) April 30, 2025 ఇది నాని షో. గ్రిస్పింగ్‌ యాక్షన్‌ప్యాక్‌ థ్రిల్లర్‌. శ్రీనిధి శెట్టి, నాని కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. ఓవరాల్‌గా హిట్‌3 థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా అంటూ మరో నెటిజన్‌ 3 రేటింగ్‌ ఇచ్చాడు.First half Good Second Half & Pre climax 💥💥💥💥💥💥💥💥💥💥💥. #HIT3 pic.twitter.com/8074TXw1v1— Vishnu Varthan Reddy (@RVVR9999) May 1, 2025#hit3review – Gritty & violent thriller with flashes of brilliance. First half dull, second half picks up with Squid Game vibes. Nani excels, but predictable plot, excess violence & weak music pull it down. Not for families.Rating: 2.75/5#Nani #HIT3TheThirdCase #HIT3 #hit3 pic.twitter.com/98Rk6J9tUs— Tha Cinema (@tha_cinema) May 1, 2025#HIT3Review:Positives• Nani🔥💥💥• The Final Act🥵👿• Concept😮• Sailesh's Screenplay👌• Cameos💥Suspenses🙌Investigation💥Final Verdict: An Engaging Suspense Thriller that serves its Purpose.#HIT3 | #NANI | #HIT3TheThirdCase #castesensuspic.twitter.com/eDn379ICBk— IndianCinemaLover (@Vishwa0911) May 1, 2025

Aspect Bullion launching gold and silver vending machines next few months9
వెండింగ్‌ మెషిన్ల ద్వారా బంగారం కొనుగోలు

దేశవ్యాప్తంగా వచ్చే 12–18 నెలల్లో 50 వరకు బంగారం, వెండి వెండింగ్‌ మెషిన్లను ఏర్పాటు చేయనున్నట్టు యాస్పెక్ట్‌ బులియన్‌ అండ్‌ రిఫైనరీ ప్రకటించింది. ఈ వెండింగ్‌ మెషిన్ల ద్వారా బంగారం, వెండి కాయిన్లను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. వెండింగ్‌ మెషిన్‌ వద్దే అప్పటికప్పుడు ధరలను కస్టమర్లు చూసుకోవచ్చని.. రియల్‌టైమ్‌ మార్కెట్‌ ధరలు అక్కడ కనిపిస్తాయని పేర్కొంది. వేగంగా, భద్రంగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఈ వెండింగ్‌ మెషిన్లు ఉంటాయని.. మూడు నిమిషాల్లోనే కొనుగోలును పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్‌ కార్డు సహా పలు రకాల పేమెంట్‌ ఆప్షన్లను వినియోగించుకోవచ్చని తెలిపింది.వెండింగ్‌ మెషిన్‌ ఎలా పని చేస్తుందంటే..గోల్డ్ కాయిన్ వెండింగ్ మెషిన్లు సాధారణ వెండింగ్ మెషీన్ల మాదిరిగానే పనిచేస్తాయి. కానీ బంగారం విలువ కారణంగా అదనపు భద్రతను కల్పిస్తారు. అందులో భాగంగా వినియోగదారుల వెరిఫికేషన్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.మెషిన్‌లో ముందుగా వినియోగదారులు తమకు కావాల్సిన బంగారు నాణెం బరువు, రకాన్ని ఎంచుకుంటారు.నగదు, క్రెడిట్/డెబిట్ కార్డు లేదా మొబైల్ బ్యాంకింగ్ (యూపీఐ, క్యూఆర్ కోడ్లు మొదలైనవి) ద్వారా చెల్లింపులు చేయవచ్చు.కొన్ని యంత్రాలకు గుర్తింపు ధ్రువీకరణ అవసరం అవుతుంది. ముఖ్యంగా అధిక మొత్తంలో చేసే లావాదేవీల కోసం ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వంటి కేవైసీ (నో యువర్ కస్టమర్) పద్ధతులను ఉపయోగిస్తారు.చెల్లింపు అయినట్లు ధ్రువీకరించిన తరువాత మెషిన్‌లోని స్టోరేజ్‌ కంపార్ట్‌మెంట్‌ నుంచి బంగారు నాణేన్ని రిలీజ్‌ చేస్తుంది.ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫారంలను నోటిఫై చేసిన కేంద్రంకొన్ని యంత్రాల ద్వారా బంగారు కడ్డీలు కూడా పొందే వీలుంటుంది. దానికి సంబంధించిన వివరాలను ముందుగానే వినియోగదారులకు తెలియజేస్తుంది.పంపిణీ సమయంలో భద్రతకోసం సీసీటీవీ మానిటరింగ్, ట్యాంపరింగ్ ప్రూఫ్ మెకానిజమ్స్, వెయిట్ సెన్సర్లను అమరుస్తారు.యంత్రాల్లో యాంటీ-థెఫ్ట్ అలారంలు, రియల్-టైమ్ ఇన్వెంటరీ ట్రాకింగ్ విధానం కూడా ఉంటుంది.బంగారం కొనుగోలు రుజువు కోసం ఈ-రశీదులు కూడా పొందవచ్చు.

Today is World Labor Day10
May Day శ్రమైక జీవనం

కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలు, దౌర్జన్యాలు... ఒంటి చేత్తో తోసిరాజని....పనిలో తమను తాము నిరూపించుకున్నారు మహిళా కార్మికులు.కార్మికలోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణగా నవీన శక్తిలా ముందుకు వచ్చారు మహిళా కార్మికులు.శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిబింబం అయ్యారు.‘ఈ రంగంలో మహిళలు పనిచేయలేరు’ అనుకునే రంగాలలోకి వచ్చి అ΄ోహలను బద్దలు కొట్టారు.‘పురుషులకు ఎక్కడా తీసిపోము’ అని నిరూపించారు. నిరూపిస్తూనే ఉన్నారు. అయితే... ఇది నాణేనికి ఒక కోణం మాత్రమే. మరో కోణంలో చూస్తే మహిళా ఉద్యోగులు, కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.కోల్‌కత్తాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య మన దేశంలో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించిన చర్చను ముందుకు తెచ్చింది. వివిధ సర్వేల ప్రకారం మూడింట ఒకవంతు మంది మహిళలు పనిప్రాంతంలో ఏదో ఒక రకమైన శారీరక హింసను ఎదుర్కొంటున్నారు.మహిళా సిబ్బందికి వారి పనిప్రాంతంలో ప్రమాదాలు పెరిగాయి. చాలాప్రాంతాల్లో సీసీటీవీ నిఘా లేదు. సరైన నిఘా, రిపోర్టింగ్‌ యంత్రాంగం లేక΄ోవడంతో అనుచిత ప్రవర్తన, వేధింపులు పెరిగాయి.ప్రాంథమిక భద్రతా చర్యల గురించి చాలా సంస్థలలో మహిళా ఉద్యోగులకు అవగాహన కలిగించడం లేదు.గార్మెంట్‌ ఫ్యాక్టరీలలో ఎక్కువమంది కార్మికులు మహిళలే. అయితే పురుషులతో ΄ోల్చితే వారికి తక్కువ వేతనం ఇస్తున్నారు. వేతన అసమానతలతో పాటు పనిప్రాంతంలో ప్రమాదాలు, పురుషాధిపత్య వేధింపులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలలో మహిళాకార్మికులకు మౌలిక సదుపాయాల కొరత ఉంది.‘బిజినెస్‌ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌’ రిపోర్ట్ మన దేశంలో గార్మెంట్‌ ఫ్యాక్టరీలలో మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చింది. నిజానికి ‘ఇది కేవలం గార్మెంట్‌ పరిశ్రమలకు సంబంధించిన రిపోర్ట్ మాత్రమే’ అనుకోనక్కర్లేదు. చిన్నా, పెద్ద తేడాలతో ఎన్నో పరిశ్రమలలో వేరు వేరు రూపాల్లో ఇదే పరిస్థితి ఉంది.కోవిడ్‌ మహమ్మారి ఉమెన్‌ హెల్త్‌ వర్కర్‌లకు ప్రమాదాలు తెచ్చింది. విధి నిర్వహణలో చనిపోయిన వారు కూడా ఉన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు.చదవండి: ప్రిన్స్‌ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్‌నిరాశ పడే పరిస్థితులు రావచ్చు, భద్రతాపరమైన సమస్యలు ఉండవచ్చు....ఒకటి, రెండు అని కాదు....సవాలక్ష సమస్యలు ఎదురైనా మహిళా శ్రామిక శక్తి వెనక్కి తగ్గడం లేదు.ఎందుకంటే వారు...చరిత్ర వింటూ వచ్చారు. మరో చరిత్ర నిర్మించాలనుకుంటున్నారు. ఇదీ చదవండి: Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement