Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Naidu supports TTD Chairman BR Naidu and Venkaiah Chowdhury1
భక్తులు పోతేనేం.. మనోళ్లు భద్రమే..!

‘సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు...! అయితేనేం..! మనోళ్లు సేఫ్‌ కదా...! ఇక కేస్‌ క్లోజ్‌ చేద్దాం..’... సీఎం చంద్రబాబు తేల్చి చెప్పేశారు!!‘ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆడిన ఆగ్రహం డ్రామా అవసరం లేదు.. ఇక చాల్లే.. తగ్గు..!’... ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు సంకేతం ఇచ్చారు!! ‘అయితే ఓకే అంటూ ముందస్తు వ్యూహం ప్రకారం పవన్‌ గప్‌చుప్‌...!’’‘అయినాకానీ పవన్‌ జోరుకు బ్రేకులు వేయమని బీఆర్‌ నాయుడుకు ఆదేశం..!’‘ఎవరో చెబితే మేం చేస్తామా?.. క్షమాపణలు చెప్పాలనడంపై బీఆర్‌ నాయుడు ప్రతి స్పందన!!సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యంతోనే తిరుపతిలో ఎన్నడూలేని విధంగా తొక్కిసలాట సంభవించి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని సర్వత్రా తీవ్ర ఆగ్రహావే­శాలు వ్యక్తమ­వు­తు­న్నాయి. సీఎం చంద్రబాబే ప్రధాన ముద్దాయి అని యావత్‌ భక్త కోటి మండిపడుతుండటంతో సర్కారు వైఫల్యాలను కప్పిపు­చ్చేందుకు ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతో రంగంలోకి దిగారు. ఈ దుర్ఘటన తమను కలచి వేసిందని మొసలి కన్నీళ్లు కారుస్తూ తిరుపతిలో హై డ్రామాకు తెర తీశారు. సీఎం చంద్రబాబు అధికా­రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు... చిందులు తొక్కినట్టు వీడియో కెమె­రాల ఎదుట కపట నాట­కాన్ని రక్తి కట్టించారు. కానీ చంద్రబాబు కుయుక్తులు బెడిసి కొట్టాయి. ఇవి కచ్చి­తంగా సర్కారీ హత్యలే­నని యావత్‌ ప్రజానీకం తేల్చి చెప్పింది. దీంతో కొందరు అధికారులపై చర్యలు తీసు­కుని విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నిం­చారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అదే సమయంలో గతంలో తాము చెప్పినట్లుగా రాజ­కీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేయని టీటీడీ అధికా­రులపై చర్యలకు ఉపక్రమించడం చంద్రబాబు కుట్రలకు నిదర్శనం. వైఫల్యానికి కారకులైన తన అస్మదీయ అధికారులపై మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోకుండా వారిని కాపాడుతుండటం గమ­నార్హం. ఈ పరిణామాలన్నీ ఒక్కటే స్పష్టం చేస్తు­న్నాయి.. తిరుపతి దుర్ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్య­మేనని నిగ్గు తేలుస్తు­న్నాయి. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పి ఈ డ్రామాలో తన వంతు పాత్రను రక్తి కట్టించారు. పనిలో పనిగా టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అందుకు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ససే­మిరా అనడం గమనార్హం. సీఎం ఆదే­శాల మేరకే ఆయన ఇలా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ఆయన మాట మార్చి­నా పవన్‌ కళ్యాణ్‌ సూచనను మొదట తిరస్కరించడం సోషల్‌ మీడి­యాలో వైరల్‌గా మారింది. ఇక సీఎం చంద్ర­బాబు సమక్షంలోనే టీటీడీ చైర్మన్, ఈవో పరస్పర ఆరోపణ­లతో అసలు విష­యాన్ని బయట పెట్టారు. తిరుమల ఆలయ వ్యవహా­రాల్లో టీటీడీ, ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లో ఏమాత్రం సమన్వయం లేదని తేల్చి చెప్పారు. ఈ నిర్వాకాలు, వైఫల్యాల కారణంగానే తొక్కి­­సలాట చోటు చేసుకుని అమాయక భక్తులు మృత్యువాత పడినట్లు చంద్రబాబు సమీక్ష సాక్షిగా నిర్ధారణ అయింది.చైర్మన్, అదనపు ఈవో సేఫ్‌తిరుపతిలో భక్తుల దుర్మరణం దుర్ఘటనకు బాధ్యు­లైన అస్మదీయ అధికారులను టీడీపీ కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా వెనకేసుకొచ్చింది. చంద్ర­బాబు సామాజి­కవ­ర్గానికి చెందిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. టీటీడీ చరిత్రలో కనీవిని ఎరుగని విషాదానికి బాధ్యత వహించి టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు రాజీనామా చేయాలి. ఆయన సమ్మతించకపోయినా ప్రభుత్వమే ఆయ­నతో రాజీనామా చేయించాలి. కానీ ఆయన్ను చంద్ర­­­బాబు పల్లెత్తు మాట అనలేదు. ఎన్నికల్లో టీడీ­పీకి బాకాగా పని చేసిన టీవీ5 చానల్‌కు బీఆర్‌ నాయుడు అధినేత కావడం దీనికి ప్రధాన కారణం. ఇక శ్రీవారి ఆలయం దర్శనాలు, సౌకర్యాల కల్పనకు ప్రధాన బాధ్యత వహించాల్సింది తిరు­మల అదనపు ఈవో వెంకయ్య చౌదరే! తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లు కూడా శ్రీవారి ఆలయ దర్శనం టికెట్ల కోసమే. అయినా వెంకయ్య చౌదరిని ప్రభుత్వం కనీసం బదిలీ చేయలేదు. అస్మదీయ అధికారులకు రక్షణవైకుంఠ ఏకాదశి క్యూలైన్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత టీటీడీ విజిలెన్స్‌ డీఎస్పీ ఎన్‌టీ రామ్‌­కు­మార్‌దే. అయినా సరే ఆయనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. టీటీడీ విజిలెన్స్‌ విభాగంలో ఆయన ప్రధాన రింగ్‌ మాస్టర్‌గా వ్యవ­హ­రిస్తున్నారు. తొక్కిసలాట సంభవించిన ప్రాంతాలు తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తాయి. ఆ ప్రాంత డీఎస్పీ వెంకటనారాయణపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇదే అదనుగా సహకరించని అధికారులపై వేటుతిరుపతిలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధ్యులైన అనుకూల అధికారులను కాపాడుతున్న సీఎం చంద్రబాబు మరోవైపు నిబంధనల ప్రకారం నడుచుకుంటూ తమకు సహకరించని అధికారు­లకు పొగబెడుతున్నారు. ఇదే అదనుగా గతంలో అక్రమ కేసుల నమోదుకు తమకు సహకరించని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. టీటీడీ విజిలెన్స్‌ ప్రధాన అధికారి (సీవీఎస్‌ఓ) శ్రీధర్‌ను ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. వైఎస్సార్‌­సీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయాలంటూ శ్రీధర్‌పై కూటమి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తోంది. అయితే ఎలాంటి ప్రాథమిక ఆధా­రాలు లేకుండా కేసుల నమోదుకు ఆయన తిరస్కరించడంతో తిరుపతి దుర్ఘటనను అడ్డం పెట్టుకుని ప్రభు­త్వం శ్రీధర్‌ను బదిలీ చేసింది. మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయ దర్శనా­లతో ఏమాత్రం సంబంధంలేని తిరుపతి జేఈవో గౌతమిని ప్రభు­త్వం బదిలీ చేసింది. అదే రీతిలో డీఎస్పీ రమణ­కుమార్, క్యూలైన్ల నిర్వహణతో సంబంధం లేని టీటీడీ గోశాల డైరెక్టర్‌ హర్‌నాథ్‌రెడ్డిని సస్పెండ్‌ చేసింది.బీఆర్‌ నాయుడు, వెంకయ్య చౌదరిపై మంత్రుల ఫిర్యాదు.. వారించిన బాబుమంత్రులు అనగాని సత్య ప్రసాద్, ఆనం రాంనారా­యణరెడ్డి గురువారం సీఎం చంద్రబాబు తిరుపతిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనే టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీరుపై ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు ఆ విషయాలు తరువాత మాట్లాడ­దామంటూ దాటవేశారు. బీఆర్‌ నాయుడు, వెంకయ్య చౌదరి ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోబోనని సంకేతాలిచ్చారు. ఈవో బదిలీకి రంగం సిద్ధం..టీటీడీ ఈవో శ్యామలరావును బదిలీ చేయాలని ప్రభు­త్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే వెంటనే బదిలీ చేస్తే ఆయనతోపాటు తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కూడా బదిలీ చేయాల్సి ఉంటుంది. అందుకే కొద్ది రోజుల తరువాత శ్యామల­రావుని బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈవోకు అవమానం...!టీటీడీ ఈవో శ్యామ­ల­రావును సాగనంపేందుకు సిద్ధమైన టీడీపీ కూటమి ప్రభు­త్వం ఆయనకు పొగబెడు­తోంది. తాజాగా సీఎం చంద్రబాబు తిరు­పతిలో నిర్వహించిన సమావేశంలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఈవోను అందరి ఎదుట ఏక వచనంతో సంబోదిస్తూ తీవ్రంగా అవమానించారు. ఇక వైకుంఠ ఏకా­దశి సందర్భంగా తిరుమల ఆలయానికి వచ్చిన ఈవో శ్యామల­రావును చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉద్దేశపూర్వ­కంగానే అగౌరవపరిచేలా వ్యవహరించడం గమ­నార్హం. ఆలయంలో ఆయనతో ఎవరూ మాట్లాడకుండా, కనీస గౌరవం ఇవ్వకుండా మానసి­కంగా వేధిస్తు­న్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు దన్నుతోనే ఆయన సామాజిక­వర్గానికి చెందిన టీటీడీ చైర్మన్, అదనపు ఈవో ఇలా వ్యవహరి­స్తున్నట్లు టీటీడీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Punjab AAP MLA Gurpreet Gogi gunshot mysterious circumstances2
ఆప్‌ ఎ‍మ్మెల్యే మృతి కేసులో ట్విస్ట్‌

ఛండీగఢ్‌: లూథియానా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మృతి కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. గుర్తు తెలియనిక్తులుల్పులు జరపడంతో ఆయన మృతి చెందినట్లు తొలుత కథనాలు వెడ్డాయి. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం మరోలా చెబుతున్నట్లు పోలీసులు ప్రకటించారు.అర్ధరాత్రి ఆప్‌(AAP) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగి మృతి చెందడం అక్కడ సంచలనంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి బుల్లెట్‌ గాయాల పాలైన ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఎమ్మెల్యే మృతి చెందినట్టుగా వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే.. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఎవరూ కాల్చలేదు.. ఆ టైంలో ఆయన గదిలో ఒంటరిగానే ఉన్నారని.. అది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కావొచ్చని చెబుతున్నారు. తుపాకీని గురుప్రీత్‌ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి బుల్లెట్‌ గాయమైందని పోలీసులను వాంగ్మూలం ఇచ్చారు. శవ పరీక్ష(autopsy) నివేదిక వచ్చాక ఘటనపై మరింత స్పష్టత రావొచ్చని అధికారులు అంటున్నారు. ఇక, 2022లో ఆప్‌లో చేరిన గురుప్రీత్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో లూథియానా వెస్ట్‌ నుంచి పోటీ చేసి మాజీ మంత్రి భరత్‌ భూషణ్‌ అషూని ఓడించారు. తాజాగా శుక్రవారంనాడు ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండ వాటినిక సంబంధించిన వివరాలను తన ఫేస్‌బుక్‌ ఖాతాలోనూ పోస్ట్‌ చేశారు.Breaking: AAP MLA from Ludhiana West, Gurpreet Gogi, has died from a gunshot wound to the head. He was at his home when the incident occurred and was taken to DMC Hospital, where he was declared dead. The cause of death and further details are awaited. pic.twitter.com/7FfIafyksZ— Gagandeep Singh (@Gagan4344) January 10, 2025

Special Train Delay of Sankranti Train3
సంక్రాంతి రద్దీ.. ప్రయాణికులకు చుక్కలే!

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి రద్దీ మొదలైంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగర వాసులు సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్‌ రైళ్లలో రిజర్వేషన్‌లు పూర్తిగా నిలిచిపోయి రిగ్రేట్‌ దశకు చేరాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్ నుంచి కాకినాడ, తిరుపతి, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తుండగా.. అరకొరగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు ఏ మాత్రం ప్రయాణికుల డిమాండ్‌లను భర్తీ చేయడం లేదు. మరోవైపు అన్ని ప్రత్యేక రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అతికష్టంగా బెర్తులు సంపాదించి రైలెక్కినా గంటల తరబడి పట్టాలపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు మధ్యాహ్నం 12 దాటినా విశాఖకు చేరుకోలేకపోయామని కూకట్‌పల్లికి చెందిన కృష్ణారావు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి శబరిమలకు నడిచే రైళ్లు కూడా అయ్యప్ప భక్తులకు నరకం చూపుతున్నాయి. రెండు రోజులు గడిచినా హైదరాబాద్‌ నుంచి శబరిమలకు, తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చార్జీలు కూడా ‘ప్రత్యేకమే’.. ⇒నగరం నుంచి ప్రతి రోజు సుమారు వందకు పైగా రెగ్యులర్‌ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 2.5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం రోజుకు మరో 50 వేల మంది అదనంగా బయలుదేరే అవకాశం ఉంది. ఈ డిమాండ్‌ మేరకు అదనపు రైళ్లు లేవు. కొన్ని రైళ్లలో బెర్తులు, అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కానీ ఈ రైళ్లలో చార్జీలు కూడా ఎక్కువే. సాధారణ చార్జీలపై 25 శాతం వరకు అదనపు చార్జీలు విధిస్తారు. అయినప్పటికీ మరో గత్యంతరం లేక ప్రత్యేక రైళ్లను ఆశ్రయించే ప్రయాణికులకు రైళ్లలో పడిగాపులు తప్పడం లేదు. ⇒ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పట్టాలపై రైళ్ల ఒత్తిడి పెరిగిందని, దీంతో సకాలంలో సిగ్నల్స్‌ లభించకపోవడం వల్ల జాప్యం చోటుచేసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ఆలస్యం ప్రయాణికుల పండగ సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. కనిష్టంగా 3 నుంచి గరిష్టంగా 12 గంటల వరకు కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గతంలో ఇలాంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెల్లువెత్తినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. సంక్రాంతి సందర్భంగా బయలుదేరిన ప్రయాణికులు భోగి పండగ రోజు కూడా సొంత ఊళ్లకు చేరుకోలేకపోయారు. ప్రస్తుతం మరోసారి అదే పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. ఆర్టీసీ సైతం అదే బాటలో.. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సుల పేరిట 50 శాతం అదనపు దోపిడీకి దిగింది. ఏపీతో పాటు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కూడా 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతోంది. చివరకు దివ్యాంగుల పాస్‌లను అనుమతించకుండా ఇష్టారాజ్యంగా చార్జీలు విధిస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 6 వేలకు పైగా అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎల్‌బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్‌ తదితర ప్రాంగణాలుప్రయాణికులతో సందడిగా మారాయి.ప్రైవేట్‌ బస్సుల దోపిడీ.. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అడ్డగోలుగా దారి దోపిడీకి పాల్పడుతున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విశాఖకు లగ్జరీ రూ.1800 వరకు ఉంటుంది. ఇప్పుడు ఆ చార్జీ రూ.3000 వరకు చేరింది. అలాగే ఏసీ బస్సుల్లో రూ.2500 నుంచి ఏకంగా రూ.5000 వరకు పెరిగినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ కలిసి వెళితే చార్జీల కోసమే రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోందని ఏఎస్‌రావు నగర్‌కు చెందిన మల్లికార్జున్‌రావు చెప్పారు. అలాగే.. హైదరాబాద్‌ నుంచి కాకినాడ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు సైతం ప్రైవేట్‌ బస్సుల దోపిడీ విమాన చార్జీలను తలపిస్తోంది.

DYCM Pawan Kalyan Serious Comments On BR Naidu4
అహం దెబ్బతిన్న డిప్యూటీ సీఎం?

తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ఇంకో నలభైమంది గాయపడిన ఘటన కూటమిలో కాకరేపుతోంది. ఘటన జరిగిన మరుక్షణం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బయటకు వచ్చి ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పి మొత్తం అంశాన్ని తాను హైజాక్ చేసారు. అటు చంద్రబాబు ఆ అంశాన్ని నీరుగార్చి చిన్నదిగా చేసి చూపడానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే పవన్ ఏకంగా బహిరంగంగానే క్షమాపణ చెప్పడమే కాకుండా టీటీడీ చైర్మన్, ఈవో మరికొందరు పెద్దలు దీనికి బాధ్యత వహించాలి అని బాణం సంధించారు. అయితే.. దీనికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాత్రం తలబిరుసుతో మాట్లాడుతూ.. ఎవరో ఏదో అన్నారని తానెందుకు స్పందించాలి? అని ప్రశ్నిస్తూనే.. క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? అంటూ బాధ్యతా రహితంగా మాట్లాడారు. పవన్ అక్కడితో ఊరుకోకుండా టీటీడీ చైర్మన్ భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందే అని మరోసారి పిఠాపురంలో డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. టీటీడీ చైర్మన్ విషయంలో పట్టుబట్టినట్లుగా ఉన్న పవన్ ను పదే పదే ఆయన్ను సారీ చెప్పడం కోసం డిమాండ్ చేస్తున్నారు. . ఇదంతా ఒకేగానీ పవన్ ఉన్నఫళంగా టీటీడీ విషయంలో ఇంతగా ఎందుకు పట్టుదలతో ఉన్నారు?. ఆయనకు ఏమైనా ఆత్మాభిమానం గట్రా దెబ్బతిన్నదా ?.. మోదీ సభలో ప్రాధాన్యం తగ్గిందా ?వాస్తవానికి మొన్నటి విశాఖ సభలో ఉంటేగింటే మోదీ తరువాతి ప్రాధాన్యం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుకు .. రెండో స్థానంలో ఉన్న పవన్‌కు దక్కాలి. కానీ 24 మంది మంత్రుల్లో ఒకరైన లోకేష్ కు అధిక ప్రాధాన్యం దక్కడం పవన్‌కు నచ్చలేదని అంటున్నారు. కేవలం కేబినెట్లో మంత్రిగా ఉన్న లోకేష్‌ను తనతో సమానంగా మోదీ సమక్షంలో కూర్చోబెట్టి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అంటే మున్ముందు తనతో సమానంగా.. ఇంకా చెప్పాలంటే తనకు పోటీగా.. లోకేష్ ను తయారు చేస్తూ అవకాశం ఉంటె తనను తొక్కేసేందుకు చంద్రబాబు ఏమాత్రం వెనుకాడడు అని ఇప్పటికే గుర్తించిన పవన్ తన సహజశైలిలో ముందుకు వెళ్తున్నట్లు భావిస్తున్నారు. తనను తొక్కేసి లోకేష్‌ను ఎలివేట్ చేసే ప్లాన్లకు తానెందుకు తలొగ్గాలి.. అసలు కూటమి విజయంలో తనదే కీలకపాత్ర అని నమ్ముతున్న పవన్ ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్న తప్పులు.. ఆ పార్టీ నాయకులు చేస్తున్న దందాలు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అవకాశం దొరికితే మున్ముందు ఇలాంటి అంశాలను బహిరంగంగానే ఖండించి తన వాయిస్ బలంగా వెళ్లేలా చూసుకుని సొంత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. మున్ముందు పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు కాలికింద చెప్పులా ఉంటారా? చెప్పులోని రాయిలా మారతారా? చూడాలి..:::సిమ్మాదిరప్పన్న

BCCI now wants KL Rahul to play IND vs ENG ODIs before Champions Trophy: Report5
IND vs ENG: బీసీసీఐ యూ టర్న్‌..! కేఎల్‌ రాహుల్‌కు నో రెస్ట్‌?

భారత క్రికెట్‌ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో వైట్‌బాల్‌ సిరీస్‌లకు సిద్దమవుతోంది. ఈ వైట్‌బాల్‌ సిరీస్‌లలో భాగంగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలుత ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. జనవరి 22న ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.అనంతరం ఫిబ్రవరి 6 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ మొదలవుతోంది. ఈ సిరీస్‌ల కోసం రెండు వెర్వేరు జట్లను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ సోమవారం(జనవరి 13) ప్రకటించే అవకాశముంది. అయితే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ విశ్రాం‍తి ఇవ్వాలని సెలక్టర్లు భావించారు.కానీ ఇప్పుడు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 దృష్ట్యా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాహుల్‌ను ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-2 అనంతరం స్వదేశానికి చేరుకున్న రాహుల్‌ విశ్రాంతి తీసుకుంటున్నాడు.విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఈ కర్ణాటక ఆటగాడు.. తిరిగి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. కాగా రాహుల్‌కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. వన్డే ఫార్మాట్‌లో భారత్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాహుల్‌ ఎనిమిదో స్ధానంలో కొనసాగుతున్నాడు.ఇప్పటివరకు 77 వన్డేలు ఆడిన రాహుల్‌.. 49.15 సగటుతో 2851 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 18 అర్ధ సెంచరీలు, ఏడు సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా మిడిలార్డర్‌లో భారత్‌కు వెన్నెముకగా రాహుల్‌ ఉంటాడు.తన వన్డే కెరీర్‌లో రాహుల్‌ 5 స్ధానంలో బ్యాటింగ్‌ వచ్చి ఏకంగా 1269 పరుగులు చేశాడు. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి సైతం ఆడనున్నారు. అయితే ఈ సిరీస్‌కు భారత పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా గాయం కారణంగా దూరం కానున్నాడు.భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య టీ20 సిరీస్‌ షెడ్యూల్‌..జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా​)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య వన్డే సిరీస్‌ షెడ్యూల్‌..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్‌)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్‌)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్‌ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత షెడ్యూల్‌..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్‌ (దుబాయ్‌)ఫిబ్రవరి 23- పాకిస్తాన్‌ (దుబాయ్‌)మార్చి 2- న్యూజిలాండ్‌ (దుబాయ్‌)చదవండి: 'కోహ్లి వల్లే యువీ ముందుగా రిటైరయ్యాడు'.. ఉతప్ప సంచలన వ్యాఖ్యలు

rrr Ram Charan Game Changer First Day Collection6
'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. ఫ్యాన్స్‌లో నిరాశ

రామ్‌ చరణ్‌ (Ram Charan), శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన పొలిటికల్‌ డ్రామా చిత్రం 'గేమ్‌ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే కాస్త నెగటివ్‌ టాక్‌ రావడంతో అభిమానుల్లో నిరాశ ఎదురైంది. దీంతో కలెక్షన్స్‌ పరంగా కూడా ఈ చిత్రం అనుకున్నంతగా రాబట్టలేదని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ రివ్యూ)'గేమ్‌ ఛేంజర్' (Game Changer)చిత్రం సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే, తొలిరోజు కేవలం రూ. 51 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గ్రాస్‌ పరంగా అయితే సుమారు రూ. 80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.42 కోట్లు రాబట్టినట్లు సమాచారం. హిందీ వర్షన్‌లో అయితే రూ. 7 కోట్లతోనే ఈ చిత్రం సరిపెట్టుకుంది. తమిళ్‌ రూ.2.1 కోట్లు, కన్నడ రూ. 10 లక్షలు, మలయాళం రూ. 5 లక్షలు వరకు గేమ్‌ ఛేంజర్‌ రాబట్టింది. Sacnilk ప్రకారం గేమ్ ఛేంజర్ దేశవ్యాప్తంగా 17,161 షోలలో 9.39 లక్షల టిక్కెట్లను బుక్‌ మై షో విక్రయించింది. కేవలం ముందస్తు బుకింగ్‌లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 26.8 కోట్లు ఈ చిత్రం ఆర్జించింది.గేమ్ ఛేంజర్ చిత్రంలో అప్పన్న, రామ్‌ నందన్‌ పాత్రలతో రామ్‌ చరణ్‌ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అప్పన్న పాత్రకు ఆయన 100 శాతం న్యాయం చేశారు. ఎవరైనా సరే చరణ్‌ నటనను మెచ్చుకుని తీరాల్సిందే అనేలా చక్కగా నటించారు. ఇప్పటికే అప్పన్న పాత్రకు సోషల్‌ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్‌ను మెగాస్టార్‌ చిరంజీవి అభినందించారు. నిర్మాత దిల్‌ రాజుతో పాటు దర్శకుడు శంకర్‌, ఎస్‌.జె. సూర్య, కియారా అద్వానీ, అంజలికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆపై సాయి దుర్గాతేజ్‌, ఉపాసన కూడా చరణ్‌ నటనకు ఫిదా అయ్యారు. ఆయన్ను ప్రశంసిస్తూ ట్వీట్స్‌ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మ‌ల‌యాళ థ్రిల్ల‌ర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌)ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలోగా వచ్చిన తొలి చిత్రం గేమ్ ఛేంజర్. 2019లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ (VVR) చిత్రంతో సోలోగా బాక్సాఫీస్‌ వద్ద బరిలోకి దిగాడు. ఇందులో కూడా హీరోయిన్‌ కియారా అద్వానీ కావడం విశేషం. అయితే, అప్పట్లో మొదటిరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 34 కోట్ల నెట​్‌ సాధించింది. గ్రాస్‌ పరంగా రూ. 68 కోట్ల వరకు ఓపెనింగ్‌ను క్రియేట్‌ చేసింది. అయితే, 2022లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం మాత్రం రూ. 133 కోట్ల నెట్‌ రాబట్టింది. కానీ, గ్రాస్‌ పరంగా రూ. 232 కోట్లతో ఇండస్ట్రీ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

Us President Elect Donald Trump Given Unconditional Discharge In Hush Money Case7
ట్రంప్‌ దోషే కానీ... శిక్షేమీ విధించట్లేదు

న్యూయార్క్‌: హష్‌ మనీ కేసులో అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు శిక్ష నుంచి బేషరతుగా మినహాయింపు ఇస్తున్నట్టు (అన్‌కండిషనల్‌ డిశ్చార్జ్‌) న్యూయార్క్‌ కోర్టు ప్రకటించింది. మన్‌హాటన్‌ జడ్జి జువాన్‌ ఎం.మర్చన్‌ శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. ట్రంప్‌ దోషేనని ఆయన పునరుద్ఘాటించారు. అయినా ముందే ప్రకటించిన మేరకు ట్రంప్‌కు శిక్ష గానీ, జరిమానా గానీ విధంచడం లేదని స్పష్టం చేశారు. ‘‘అధ్యక్షునిగా ట్రంప్‌కు సంక్రమించబోయే అపరిమితమైన అధికారాలు, న్యాయపరమైన రక్షణలు శిక్ష నుంచి మినహాయింపు కల్పిస్తాయే తప్ప కోర్టు తీర్పును అడ్డుకోజాలవు. అధ్యక్షునిగా ఆయన పాలన పగ్గాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఒకవైపు. చట్టానికి ఎవరూ అతీతులు కారాదన్న ప్రజల ఆకాంక్షలు మరోవైపు. ఈ రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తూ ఇలా తీర్పు ఇవ్వాల్సి వచ్చింది’’ అని వివరించారు. దాంతో, ఇది తనకో దారుణమైన అనుభవమంటూ ట్రంప్‌ వాపోయారు. తన ఫ్లోరిడా నివాసం నుంచే లాయర్‌తో కలిసి ఆయన వర్చువల్‌గా విచారణలో పాల్గొన్నారు. తాను నిర్దోషినని పదేపదే వాదించారు. ‘‘ఈ కేసు నాపై రాజకీయ వేధింపుల్లో భాగం. ఇదంతా నా ప్రతిష్టను దెబ్బ తీసే ప్రయత్నం. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించా’’ అని చెప్పుకొచ్చారు. ఆయన లాయర్‌ సైతం అదే వాదన విన్పించారు. కానీ న్యాయమూర్తి వాటిని ఆలకించలేదు. దాంతో అమెరికా చరిత్రలో దోషిగా తేలి మరీ అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న తొలి నేతగా ట్రంప్‌ నిలిచారు. తీర్పుపై ప్రాసిక్యూటర్లు కూడా అభ్యంతరం తెలపలేదు. అయితే శిక్ష నుంచి తప్పించుకునేందుకు న్యాయవ్యవస్థపైనే ట్రంప్‌ పదేపదే దారుణ రీతిలో దాడికి దిగారంటూ ఆక్షేపించారు. ఇలాంటి కేసులో సాధారణంగా కనీసం నాలుగేళ్ల జైలు శిక్ష పడుతుంది. హష్‌ మనీ కేసు కారణంగా అమెరికా చరిత్రలో క్రిమినల్‌ అభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షునిగా కూడా ట్రంప్‌ నిలవడం తెలిసిందే. ఏమిటీ కేసు? శృంగార చిత్రాల తార స్టార్మీ డేనియల్స్‌తో తన లైంగిక సంబంధాలపై నోరు విప్పకుండా 2016 అధ్యక్ష ఎన్నికల వేళ ప్రచార విరాళాల నుంచి ఆమెకు అక్రమంగా 1.3 లక్షలు డాలర్లు చెల్లించారని ట్రంప్‌పై ఆరోపణలొచ్చాయి. దీనికి సంబంధించి ఆయనపై ఏకంగా 34 రకాల అభియోగాలు నమోదయ్యాయి. వాటన్నింట్లోనూ ట్రంప్‌ దోషేనని ఆరు వారాల విచారణ అనంతరం 12 మంది జడ్జిల ధర్మాసనం గత మేలో తేల్చింది. నవంబర్లోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా ట్రంప్‌ రెండోసారి అధ్యక్షునిగా గెలిచారు. ఈ నేపథ్యంలో క్రిమినల్‌ విచారణ నుంచి తనకు రక్షణ ఉంటుందని ఆయన వాదించారు. కానీ అలాంటిదేమీ ఉండబోదని న్యాయమూర్తి ఇటీవలే తేల్చారు. అయితే, ‘‘జనవరి 10న శిక్ష విధిస్తా. కాకపోతే బేషరతుగా వదిలేస్తూ నిర్ణయం తీసుకుంటా’’ అని చెప్పారు. ఆ తీర్పును అడ్డుకునేందుకు ట్రంప్‌ చివరిదాకా విఫలయత్నం చేశారు. గురువారం రాత్రి హుటాహుటిన సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. తీర్పు ప్రక్రియను ఆలస్యం చేసేలా జడ్జిని ఆదేశించలేమంటూ న్యాయమూర్తులు 5–4 మెజారిటీతో తీర్పు వెలువరించారు. ఆయనపై దాఖలైన నాలుగు క్రిమినల్‌ కేసుల్లో ఇదొకటి. అమెరికా అధ్యక్షునిగా జనవరి 20న ట్రంప్‌ రెండోసారి ప్రమాణస్వీకారం చేయనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా మూడు కేసులు విచారణకు వచ్చే అవకాశం లేదు.

Indian rupee recently hit an all time low against the US dollar reaching around Rs 868
రూపాయి ఢమాల్‌.. నేల చూపులకు కారణాలు

అమెరికా డాలర్‌(Dollar)తో పోలిస్తే భారత రూపాయి తాజాగా ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. శుక్రవారం సెషన్‌లో సుమారు రూ.86.04కు దిగజారింది. రూపాయి విలువ ఇంత భారీగా పడిపోవడంతో భారత ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. ఇలా రూపాయి పడిపోవడానికి గల కారణాల్లో కొన్నింటిని కింద తెలుసుకుందాం.బలపడుతున్న డాలర్అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాల కారణంగా అమెరికా డాలర్ బలపడుతోంది. ఈ నిర్ణయం వల్ల డాలర్‌కు డిమాండ్‌ అధికమవుతుంది. రూపాయి(Rupee)తో సహా ఇతర కరెన్సీలతో పోలిస్తే ఇది మరింత ఖరీదైనదిగా మారింది.ఎఫ్‌పీఐల విక్రయాలురెండు-మూడు నెలల కొందట ఇండియన్‌ మార్కెట్‌ జీవితకాల గరిష్టాలను తాకింది. దాంతో దాదాపు అన్ని స్టాక్‌ల వాల్యుయేషన్ పెరిగింది. అప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ప్రాఫిట్‌ బుక్‌ చేస్తున్నారు. దాంతోపాటు సురక్షితమైన అమెరికా ట్రెజరీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల(Equity Market) నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. ఇది గణనీయమైన మూలధన ప్రవాహానికి దారితీసింది. దాంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది.పెరుగుతున్న ముడిచమురు ధరలుభారతదేశం ముడి చమురు ప్రధాన దిగుమతిదారు. పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరలు దిగుమతుల ఖర్చును పెంచాయి. ఈ దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. దాంతో రూపాయి విలువ మరింత తగ్గుతుంది.వాణిజ్య లోటుభారతదేశ వాణిజ్య లోటు పెరుగుతోంది. అంటే దేశం చేసే ఎగుమతుల కంటే దిగుమతులు పెరుగుతున్నాయి. ఈ అసమతుల్యత వల్ల దిగుమతులకు చెల్లించడానికి ఎక్కువ డాలర్లు అవసరం అవుతుంది.దేశీయ ఆర్థిక కారకాలువృద్ధి మందగించడం, లిక్విడిటీ లోటు వంటి సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది. ఫారెక్స్(Forex) మార్కెట్లో దూకుడుగా జోక్యం చేసుకునే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సామర్థ్యానికి ఇవి అడ్డంకిగా మారాయి.ఆర్‌బీఐ జోక్యంఫారెక్స్ మార్కెట్లో అధిక అస్థిరతను అరికట్టడానికి, రూపాయికి మద్దతు ఇవ్వడానికి ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటోంది. అయితే రూపాయి స్థిరమైన పడిపోతున్న తరుణంలో ఆర్‌బీఐ మరింత చాకచక్యంగా వ్యహహరించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: యూపీఐ ద్వారా క్రెడిట్‌ కార్డు చెల్లింపు ఎలాగంటే..రూపాయి బలహీనతతో కలిగే ప్రభావాలుఅధిక దిగుమతి ఖర్చులు: దిగుమతులకు పెరిగిన ఖర్చులు, ముఖ్యంగా ముడి చమురు దేశీయ ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయి.కార్పొరేట్ మార్జిన్లు: డాలర్ డినామినేషన్‌ అప్పులు చెల్లించే కంపెనీలపై భారం పడుతుంది. ఇది లాభాల మార్జిన్లను తగ్గిస్తుంది.ఇన్వెస్టర్ల సెంటిమెంట్: నిరంతర కరెన్సీ బలహీనత విదేశీ ఇన్వెస్టర్లను పెట్టుబడులు పెట్టకుండా నిరోధిస్తుంది. మూలధనం రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.ఆర్థిక ఒత్తిడి: దిగుమతులకు పెరుగుతున్న ఖర్చులు, విదేశీ రుణ సేవలు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి.

Telegu Cultural Dancers Will Perform In Maha Kumbh Mela9
మహా కుంభమేళాలో తెలుగు కీర్తి

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక కుంభమేళా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు సర్వం సన్నద్దమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌ త్రివేణి సంగమంలో ఈనెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగరాజ్‌ వేదికగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపూరి, సిత్రియా తదితర నాట్యాలతో పాటు సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా 160 మంది నృత్యకాళాకారులను ఎంపిక చేశారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉండటం విశేషం. పద్మశ్రీ, ఎస్‌ఎన్‌ఏ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి, పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆనంద శంకర్‌ జయంత్, కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీపికా రెడ్డి, ఎస్‌ఎన్‌ఏ అవార్డు గ్రహీత కళాకృష్ణ మహా కుంభమేళాలో నృత్య ప్రదర్శన చేయనున్నారు. ‘శివోహం’తో ఆనంద ‘శివోహం’ ఇతివృత్తంతో లక్షలాది మంది భక్తులను అలరించనున్నారు పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర్‌ జయంత్‌. దశబ్థాలుగా భరతనాట్యంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న ఆనంద శంకర్‌ జయంత్‌ 144 ఏళ్ల మహా కుంభమేళాలో తెలుగు వారిలో తొలి ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘గణేశ తాళనం, స్కంధ మయుర, దేవీ ఉపాసకం, శివోహం’లపై 45 నిమిషాల పాటు 17మంది నృత్య కళాకారులతో కలిసి ఆమె నాట్యమాడనున్నారు. ఇటువంటి మహోత్సవాల్లో ప్రదర్శన ఇవ్వడం అనేది జన్మధన్యంగా భావిస్తున్నారు భారతనాట్య నృత్య కళాకారిణి ఆనంద శంకర్‌ జయంత్‌. ‘శివసతాయం’తో దీపికా రెడ్డి ‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశా’అనే మాట ముమ్మాటికీ నిజం అంటారు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్‌ పర్సన్‌’దీపికా రెడ్డి. నాట్యమే ఊపిరిగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ఆమె తన ప్రదర్శనను ఇవ్వనున్నారు. ‘శివ సతాయం’అనే థీంతో దాదాపు 50 నిమిషాల పాటు 12మంది నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. ఈ నృత్యం ద్వారా గంగ అవతరణ, గంగ ద్వారా అందరికీ మంచి జరగాలనే కాన్సెప్ట్‌తో ఈనెల 26వ తేదీన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘శివపల్లవి’తో కళాకృష్ణ తెలుగు సాంప్రదాయ నృత్యాలైన ఆంధ్ర నాట్యం, పేరిణి వంటి వాటిలో ప్రపంచస్థాయిలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న కళాకారుడు కళాకృష్ణ. ఎస్‌ఎన్‌ఏ అవార్డుతో పాటు, రాష్ట్రప్రభుత్వం పలు అవార్డులతో ఆయనను సత్కరించింది. 24.02.2025 న మహా కుంభమేళాలో ‘శివపల్లవి’థీంతో ఐదుగురుతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. గంగ, పంచముఖస్త్రోత్రాలు, నీలకంఠ మహాదేవ కీర్తన ఈ మూడు అంశాలను 30 నిమిషాల్లో కళ్లకు కట్టినట్లుగా తన అపారమైన అనుభవంతో కుంభమేళాలో భక్తులను అలరించనున్నారు. ‘నమామి గంగే’తో పద్మజా రెడ్డి కూచిపూడి నృత్యంతో కళాప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి ఈ మహాకుంభా మేళాలో నృత్యప్రదర్శన చేయనున్నారు. దాదాపు 3వేలకు పైగా ప్రదర్శనలు ఇచి్చన పద్మజా రెడ్డి ‘ప్రణవ్‌’ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా అనేక మందికి నృత్యాన్ని పరిచయం చేస్తున్నారు. 10.02.2025న 30 నృత్యకళాకారులతో కుంభమేళాలో ‘నమామి గంగే’అనే థీంతో ప్రదర్శన చేయనున్నారు. ఇటీవల కాలంలో గంగానది కలుíÙతానికి గురైంది, గంగను ఎలా పరిరక్షించుకోవాలి, భావితరాలకు గంగ ప్రాముఖ్యతను వివరించాలనే అంశాలపై సుమారు గంట పాటు ‘నమామి గంగే’అనే ఇతివృత్తంతో అక్కడ ప్రదర్శన ఇవ్వనున్నారు.

This is the reason for frequent stampedes10
ప్రచార పిచ్చి.. పాలనా వైఫల్యం

సాక్షి, అమరావతి: తన పరిపాలన గురించి గొప్పగా అతిశయోక్తులు చెప్పుకునే చంద్రబాబు.. వాస్తవంలో మాత్రం చేతులెత్తేసి చోద్యం చూడడం మినహా ఏమీ చేయలేరని మరోసారి స్పష్టమైంది. తిరు­పతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృత్యువాత పడటం, పలువురు క్షతగాత్రులవ్వడమే ఇందుకు నిదర్శనం. పాలనా వైఫల్యానికి, అసమర్థతకు ఇదో మచ్చుతునక. ఇదొక్కటే కాదు చంద్రబాబు హయాంలో అడుగడుగునా వ్యవస్థల వైఫల్యం కనిపిస్తుంది. ఇటీవలే బుడమేరు వరద నిర్వహణలో విఫలమై విజయవాడను ముంచేసి, లక్షలాది కుటుంబాలను రోడ్డుపాలు చేశారు. అంతకు ముందు 2015లో గోదావరి పుష్కరాల్లో తన ప్రచార పిచ్చితో తొక్కిసలాటకు కారణమై 29 మంది నిండు ప్రాణా­లను బలి తీసుకున్నారు. గత ఎన్నికల సమయంలోనూ కందుకూరు, గుంటూరులో జరిగిన తొక్కి­సలాటలో ప్రజల ప్రాణాలను హరించారు. విజయ­వాడలో జరిగిన కృష్ణా నది బోటు ప్రమాదంలో 21 మంది మృత్యువాత పడటానికి కారకుడయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నిర్వహణా లోపాలు మలుపు మలుపులో కనిపిస్తాయి. ఈ లో­పాల ఖరీదు పదుల సంఖ్యలో ప్రాణాలు పోవడం. పాలనా పరమైన సమర్థత లోపించడం వల్లే ఆయన హయాంలో తరచూ ప్రమాదాలు, తొక్కిస లాటలు జరుగుతున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏమాత్రం ప్రణాళిక ఉన్నా, నిర్వహణా సామర్థ్యం ఉన్నా.. ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదు. వేలాది, లక్షలాది మంది వస్తారనే ముందస్తు సమాచారం ఉన్నా.. తరచూ జరిగే కార్యక్రమాలే అయినా తొక్కిసలాటలు జరగడానికి కారణం వ్యవస్థలు నీరుగారి పోవడమేనని చెబుతున్నారు. వైంకుఠ ద్వార దర్శనం 10 రోజులు ఉండగా, తొలి మూడు రోజులకు ఒకేసారి టికెట్లు ఇవ్వాలనుకో­వడంలోనే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది.అధికార యంత్రాంగాన్ని విచ్చలవిడిగా రాజకీయ ప్రయోజ­నాల కోసం వినియోగిస్తుండడంతో వారు తమ అసలైన కర్తవ్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు. తిరుమల యంత్రాంగాన్ని తన రాజకీయ ప్రాపకం కోసం వాడుకుని, అసలు పని చేయలేని పరిస్థితి కల్పించ­డం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని చెబుతున్నారు. నాడు ప్రచార పిచ్చితో 29 మంది బలిచంద్రబాబు ప్రచార పిచ్చి, నిర్వహణా సామర్థ్యం లోపం వల్ల 2015 జూలై 14న గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘోర ఘటనలో పుష్కర స్నానాల కోసం వచ్చిన 29 మంది మృత్యువాత పడ్డారు. పుష్కర ఘాట్‌లో కుటుంబంతో కలిసి స్నానానికి వచ్చిన చంద్రబాబు కోసం వేలాది మంది భక్తులను గంటల తరబడి క్యూలైన్లలో నిలిపివేశారు. తర్వాత ఒక్కసారిగా అందరినీ వదలడంతో తొక్కిసలాట జరిగింది. తన కుటుంబం పుష్కర స్నానం చేసే దృశ్యాలను ఒక అంతర్జాతీయ టెలివిజన్‌ చానల్‌ కోసం వీడియో షూట్‌ చేయించుకుంటూ వేలాది మంది భక్తులను క్యూలైన్లలో కుక్కిపడేశారు. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌ మృత్యుఘోషగా మారింది. కృష్ణా నదిలో బోటు బోల్తా.. 21 మంది మృతి2017 నవంబర్‌ 13న విజయవాడ–ఇబ్రహీంపట్నం మధ్య కృష్ణా నదిలో బోటు మునిగిపోయి 21 మంది మృతి చెందారు. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అత్యంత బాధ్యతా­రాహిత్యంగా కృష్ణా నదిలో బోట్ల విహారానికి అనుమతిచ్చింది. నదీ ప్రవాహం, ఒరవడి గురించి ఏమాత్రం అవగాహన లేకుండా కేవలం టూరిజం పేరుతో జరిగే ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ బోటు ప్రమాదానికి కారణమయ్యారు. డ్రోన్‌ షో కోసం ఎనిమిది నిండు ప్రాణాలు బలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన స్వార్థం కోసం ఇరుకురోడ్డులో రోడ్‌షోలు నిర్వహించి జనాన్ని బలి తీసుకున్నారు. 2022 డిసెంబర్‌ 29న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్‌షో నిర్వహించినప్పుడు జరిగిన తొక్కిసలాటలో డ్రెయిన్‌లో పడిపోయి ఎనిమిది మంది చనిపోయారు. జనం ఎక్కువగా వచ్చినట్టు చూపించుకునేందుకు ప్రధాన కూడలిలో కాకుండా ఇరుకు రోడ్డులోకి తన వాహనాన్ని తీసుకెళ్లి అక్కడ డ్రోన్‌ విజువల్స్‌ తీస్తుండగా ఈ దారుణం జరిగింది. కేవలం చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు సైతం తేల్చారు.కానుకల పంపిణీ పేరుతో..గత ఏడాది జనవరి 1న గుంటూరు జేకేసీ కాలేజీలో స్థానిక టీడీపీ నాయకుడు ఉయ్యూరు శ్రీనివాస్‌ నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. చంద్రబాబు చేతుల మీదుగా కానుకలు పంపిణీ చేస్తారని విపరీతంగా ప్రచారం చేసి భారీగా జనాన్ని తీసుకువచ్చారు. కానీ చంద్రబాబు పది మందికి కానుకలు ఇచ్చి వెళ్లిపోగా, ఆ తర్వాత వాటి కోసం జనం ఎగబడడంతో తోపులాట జరిగి ముగ్గురు చనిపోయారు. కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా జనాన్ని రప్పించి వారి ప్రణాలు పోవడానికి కారకుడిగా మిగిలారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
NRI View all
title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

Advertisement

వీడియోలు

Advertisement