Top Stories
ప్రధాన వార్తలు

అంగన్వాడీ ఆగ్రహ వేడి..
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల, కొండాపురం రైల్వేస్టేషన్ల వద్ద మహాధర్నాకు వెళ్లనివ్వకుండా అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలను నిర్బంధించగా, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేట బోర్డర్లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్ గేట్ వద్ద ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళుతున్న వారిని అడ్డుకుని కిందకు దించేశారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: మాట తప్పి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై అంగన్వాడీలు కన్నెర్ర చేశారు. చంద్రబాబూ.. డౌన్‌డౌన్! కూటమి సర్కారుకు మా సత్తా చూపిస్తాం..! అంటూ కదం తొక్కారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్ గేట్ల వద్ద పోలీసు నిర్బంధాలు.. గృహ నిర్బంధాలు.. నోటీసులు.. రెడ్‌బుక్ రాజ్యాంగంలో సర్కారు అణచివేతలకు వెరవకుండా తరలివచ్చి ఉప్పెనలా విరుచుకుపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్‌లో అంగన్వాడీల ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. ఆంక్షలు, అడ్డంకులను దాటుకుని రాష్ట్రవ్యాప్తంగా భారీగా తరలివచ్చిన అంగన్వాడీలతో సోమవారం విజయవాడలో నిర్వహించిన ‘మహాధర్నా’ దద్ధరిల్లింది. కాగా, పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తామని టీడీపీ –జనసేన కూటమి నేతలు బెదిరించడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఆమె పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్కారు నిర్బంధకాండ.. అంగన్వాడీల మహాధర్నా నేపథ్యంలో కూటమి సర్కారు ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచి వారిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిర్బంధకాండ కొనసాగింది. అంగన్వాడీలను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు సోమవారం రోజు శిక్షణ, రికార్డుల పరిశీలనకు హాజరు కావాలంటూ ప్రభుత్వ యంత్రాంగం హుకుం జారీ చేసింది. అయినప్పటికీ అంగన్వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులను రంగంలోకి దించింది. వైఎస్సార్, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, విజయనగరం తదితర జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. విజయవాడ మహాధర్నాకు వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు ఇచ్చారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలను నిర్బంధించారు. జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేట బోర్డర్లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్ గేట్ వద్ద ప్రైవేట్ వాహనాల్లో వెళుతున్న వారిని అడ్డగించి కిందకు దించేశారు. నాడు న్యాయబద్ధమేనన్న లోకేశ్ గతంలో ఆందోళన నిర్వహించిన సమయంలో అంగన్వాడీలను కలసిన నారా లోకేశ్ వారు అడుగుతున్నవి న్యాయబద్ధమైనవని, కూటమి ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం గతంలో 42 రోజులపాటు సమ్మె చేయడంతో వైఎస్సార్సీపీ హయాంలో ఆరు జీవోలు ఇచ్చిందన్నారు. ఒప్పందం ప్రకారం గతేడాది జూన్‌లోనే వేతనాలు పెంచాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల డిమాండ్లను అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? గత ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచి్చన అనేక హామీలను అమలు చేసిందని ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. అయితే మిగిలిన ఒప్పందాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని ధ్వజమెత్తారు. గ్రాట్యుటీ, మట్టి ఖర్చులు వంటి అనేక హామీలకు కోతలు పెట్టి మభ్య పెడుతోందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అంగన్వాడీల డిమాండ్లు న్యాయమేనని అనిపించిన కూటమి నేతలకు అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? అని నిలదీశారు. నాడొక మాట.. నేడొక మాట కాకుండా హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. నెలాఖరులో జరిగే రివ్యూలు ఆగమేఘాలపై..అంగన్వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరుకాకుండా కుట్రలకు తెరతీసిన కూటమి ప్రభుత్వం నెలాఖరులో జరిగే సమీక్ష కార్యక్రమాలను అప్పటికప్పుడు తెరపైకి తెచ్చింది. అయినా కడప, బద్వేలులోని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు కదం తొక్కారు. 2022లో సుప్రీం కోర్టు గ్రాట్యుటీ విషయంలో అంగన్వాడీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అమలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. మైదుకూరులోని తహసీల్దార్ కార్యాలయం, ప్రొద్దుటూరులోని అర్బన్ సీడీపీవో కార్యాలయం, జమ్మలమడుగు ఐసీడీఎస్ కార్యాలయం, ఎర్రగుంట్ల, కమలాపురం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంగన్వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరు కాకుండా ఉయ్యూరు రూరల్ మండలంలో ఐసీడీఎస్ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అంగన్వాడీలకు శిక్షణ, రివ్యూ పేరుతో సోమవారం పెదవోగిరాల ఎంపీపీ పాఠశాలలో సమావేశం నిర్వహించి మమ అనిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆకునూరు సెక్టర్ రివ్యూ నిర్వహించినట్టు కంకిపాడు ప్రాజెక్టు సీడీపీవో బేబీ సుకన్య తెలిపారు. అంగన్వాడీలను అడ్డుకోవడమే లక్ష్యంగా రివ్యూ నిర్వహించారని ట్రేడ్ యూనియన్ నాయకులు విమర్శించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసుల నిర్బంధకాండను ప్రజా సంఘాలు ఖండించాయి. అక్రమ అరెస్టులపై అంగన్వాడీలు విజయనగరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.ఇవీ ప్రధాన డిమాండ్లు...» అంగన్వాడీలకు నెల వేతనం రూ.26 వేలకు పెంచాలి. » గ్రాట్యుటీ చెల్లింపు హామీని అమలు చేయాలి. » మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలి. » రాజకీయ జోక్యాన్ని అరికట్టి హెల్పర్ల పదోన్నతులపై నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలి. » సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలగించి సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు వర్తింపచేయాలి. » సర్వీసులో ఉంటూ చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు రూ.20 వేలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సమ్మెకాలంలో మృతి చెందిన వారికి కూడా ఇవి వర్తింపజేయాలి. » పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీల అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. అన్ని యాప్‌లను కలిపి ఒకే యాప్‌గా మార్పు చేయాలి. » పెండింగ్‌లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. » మెనూ చార్జీలను పెంచాలి. » ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి. » వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం మూడు నెలలు ఇవ్వాలి. » ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. ఐదు సంవత్సరాల పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రాలలో ఉండేలా జీవో ఇవ్వాలి. ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలనే డిమాండ్‌ను తక్షణం అమోదించి అమలు చేయాలి. రెడ్ బుక్ పాలనపై కళ్లకు గంతలతో నిరసన» రెడ్‌బుక్ పాలన నశించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. హామీలను వెంటనే అమలు చేయాలని నినదించారు. » అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. » తొమ్మిది నెలలుగా హామీలను అమలు చేయకపోవడం, పోలీస్ నిర్బంధాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏలూరు జిల్లా చింతలపూడిలో అంగన్వాడీలు ప్రదర్శన చేపట్టారు. బోసు బొమ్మ సెంటర్లో రాస్తా రోకో చేశారు.

ట్రంప్ శాంతిమంత్రం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి ఎవరి అంచనాలకూ అందకూడదన్న సంకల్పంతో ఉన్నట్టు కనబడుతోంది. సరిగ్గా నెల్లాళ్ల క్రితం ఆయన ఇరాన్‌పై ఆంక్షల తీవ్రతను పెంచారు. అంతే కాదు... తనను చంపటానికి ప్రయత్నిస్తే ఇరాన్ తుడిచిపెట్టుకుపోతుందని తీవ్రంగా హెచ్చరించారు. తనకేం జరిగినా వెనువెంటనే ఇరాన్‌పై దాడి చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చానన్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన హఠాత్తుగా స్వరం మార్చారు. అణు ఒప్పందంపై చర్చలకు రావా లని ఇరాన్‌కు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించి తాజాగా ఒక లేఖ కూడా విడుదల చేశారు. సైనిక చర్య తీసుకుంటే ఇరాన్ భయంకరమైన పరిణామాలు చవిచూసే పరిస్థితి ఏర్పడుతుంది గనుకే చర్చలకు పిలుపునిచ్చానని ట్రంప్ వివరణనిచ్చారు. తొలిసారి అధికారంలోకొచ్చినప్పుడు అంతక్రితం ఒమామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని కాస్తా ట్రంప్ 2018లో ఏకపక్షంగా రద్దుచేశారు. అది కేవలం అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం కాదు. వియన్నాలో 2015 జూలై 14న కుదిరిన ఆ ఒప్పందంపై భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల(అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్)తో పాటు జర్మనీ, యూరప్ యూనియన్(ఈయూ)లు, ఇటుఇరాన్ సంతకాలు చేశాయి. ఆంక్షలు సడలించటానికి అంగీకరించాయి. ఆ సమయంలో కారాలూ మిరియాలూ నూరిన రిపబ్లికన్లు తాము అధికారంలోకొస్తే ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్ సైతం ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించింది. ట్రంప్ ఏక పక్షంగా ఒప్పందం నుంచి వైదొలగినప్పుడు తమతో ఎందుకు చర్చించలేదని భాగస్వామ్య పక్షాలు ప్రశ్నించాయి. తాము మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. జో బైడెన్ హయాంలో పాత ఒప్పందానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారనుకుంటే సాధ్యపడలేదు.ట్రంప్ తాజా ప్రతిపాదనలో చర్చల ప్రస్తావన ఉన్నా నిజానికది మరిన్ని డిమాండ్లు తమముందుంచి లొంగదీసుకోవటానికేనని ఇరాన్ మత నాయకుడు ఆయతొల్లా అలీ ఖమేనీ చేసిన ప్రకటనను కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇరాన్లో తమ కీలుబొమ్మ పాలకుడు మహమద్ రెజా పహ్లావీ (ఇరాన్ షా) 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో పదవీచ్యుతుడైనప్పటినుంచీ అమెరికా ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. ఆనాటినుంచి కొనసాగిన ఆంక్షల పర్వం ఎడతెరిపి లేకుండా నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఆంక్షలు విధించటం కూడా పరిపాటైంది. 1988లో 290 మందితో వెళ్తున్న ఇరాన్ ప్రయాణికుల విమానాన్ని సైనిక విమానంగా భావించి అమెరికా కూల్చివేసింది. తాను విధించిన ఆంక్షల్ని మరింత విస్తృతం చేయటానికి 2006లో భద్రతామండలిలో తీర్మానం చేయించింది. 2012లో ఈ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. పర్యవసానంగా పసిపిల్లలకు పాలడబ్బాలు, ఔషధాలు మొదలుకొని అనేక నిత్యావసర వస్తువులు దొరక్క ఇరాన్ ప్రజానీకం తల్లడిల్లిపోయారు. అకాల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తన ప్రధాన ఆదాయ వనరైన ముడిచమురు ఎగుమతుల్లో సింహభాగం నిలిచిపోవటంతో... అమె రికా బ్యాంకుల్లోవున్న వేలాదికోట్ల విలువైన బంగారం, నగదు డిపాజిట్ల స్తంభించటంతో ఇరాన్ ఎన్నో అగచాట్లు పడింది. అణ్వాయుధాల విషయంలో ఇరాన్ వాదన సమంజసమైనది. అణు కార్య క్రమంపై కేవలం తమతోనే చర్చిస్తే సరిపోదని, పశ్చిమాసియా దేశాలను సైతం భాగస్వాముల్ని చేయాలని ఆ దేశం మొదటినుంచీ కోరుతోంది. ఆ చర్చ అంతిమంగా ఈ ప్రాంతంలో అణ్వస్త్ర నిషేధానికి తోడ్పడాలని వాదిస్తోంది. గత ఒప్పందం రద్దయ్యాక అమెరికా, ఇరాన్‌లమధ్య పర స్పరం అవిశ్వాసం పెరిగిపోయింది. దాన్ని తొలుత తొలగిస్తే తప్ప అడుగు ముందుకు పడదు. ట్రంప్ తాజా ప్రతిపాదనలోని ముఖ్యాంశాలేమిటో ఎవరికీ తెలియదు. ఒబామా హయాంలో కుదిరిన పాత ఒప్పందం ఇరాన్‌కు అనుకూలంగా ఉన్నదని ట్రంప్ ఆరోపించారు. దాన్ని మరింత పకడ్బందీగా మారుస్తామన్నారు. ఖమేనీ స్పందన స్పష్టంగా ఉంది. తాము కేవలం ఇరాన్ అణు కార్యక్రమానికి పరిమితమై మాట్లాడతామని, ఇతర అంశాలు ఒప్పుకోబోమని చెప్పారు. క్షిపణుల తయారీ వ్యవహారంపై మాట్లాడే ఉద్దేశంతోనే అమెరికా స్వరం మార్చిందని ఆయన అభిప్రాయంలా కనబడుతోంది. సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ నిరుడు జూన్‌లో ఇరాన్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాక ఆ దేశం వైఖరి మారింది. అగ్రరాజ్యాలతో చర్చించి 2015 నాటి అణు ఒప్పందం వంటిది కుదుర్చు కోవటానికి తాను సిద్ధమని ఆయన ఇప్పటికే చెప్పారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్‌కు మంచి సంబంధాలే వున్నాయి. ఇరాన్‌తో ఒప్పందానికి తన వంతు కృషి చేస్తానని ఇప్పటికే పుతిన్ హామీ ఇచ్చారు. అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం ఇరాన్ ఇంకా అణ్వస్త్ర తయారీ స్థాయికి ఎదగలేదు. ట్రంప్ తొలి ఏలుబడి నాటికి పశ్చిమాసియాలో ఇరాన్ దాదాపు ఏకాకి. సౌదీ అరేబి యాతో దానికి ఘర్షణ వాతావరణం ఉండేది. ఇప్పుడలా కాదు. ఇరాన్‌తో దాదాపు పశ్చిమాసియా దేశాలన్నిటికీ మెరుగైన సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రపంచ వాణిజ్యాన్ని ఛిద్రం చేస్తున్న యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లతో ఇరాన్‌కు సాన్నిహిత్యముంది. అందువల్ల ఇరాన్‌తో నిజంగా ఒప్పందం కుదిరితే అది ప్రపంచ శాంతికి దోహదపడుతుంది. అయితే ఇరాన్నుంచి ఆశించే ఎలాంటి ఆచరణైనా ఇజ్రాయెల్‌కు కూడా వర్తింపజే సినప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. కాని పక్షంలో ఈ సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉంటుంది.

ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.ద్వాదశి ఉ.9.34 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: ఆశ్లేష రా.2.58 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: ప.3.32 నుండి 5.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.38 నుండి 9.26 వరకు, తదుపరి రా.11.00 నుండి 11.48 వరకు, అమృతఘడియలు: రా.1.28 నుండి 2.07 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.16, సూర్యాస్తమయం: 6.04. మేషం: కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.వృషభం: కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.మిథునం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.కర్కాటకం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.సింహం: కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తిపై సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.కన్య: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు.తుల: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.వృశ్చికం: కష్టానికి ఫలితం కనిపించదు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.ధనుస్సు: మిత్రులతో కలహాలు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.మకరం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. స్థిరాస్తివృద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కుంభం: ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. పనులలో జాప్యం. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి.మీనం: ఆర్థిక ఇబ్బందులు. సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆస్తి కొనుగోలులో ఆటంకాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులకు నలుగురు సభ్యుల కుటుంబం బలైన విషాద సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు, అంతకుముందు తమ ఇద్దరు పిల్లలకు విషం ఇచి్చనట్లుగా అనుమానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (40), కవితారెడ్డి (35) దంపతులు హబ్సిగూడ మహేశ్వర్‌నగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీతరెడ్డి (13), ఐదవ తరగతి చదువుతున్న విశ్వంత్‌రెడ్డి (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి గతంలో నారాయణ కళాశాలలో లెక్చరర్‌గా పని చేశాడు.గత ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సోమవారం రాత్రి సమీపంలో ఉండే బంధువులు ఫోన్ చేస్తే దంపతులు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా చంద్రశేఖర్‌రెడ్డి, కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరి వేసుకుని కని్పంచారు. ఓ గదిలో మంచంపై పిల్లలిద్దరూ చనిపోయి కనిపించారు.దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు, నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీత అబిడ్స్‌లోని ఫిట్జీ స్కూల్లో, విశ్వంత్ హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నట్లు తెలిసింది.

నాడు మా వర్మ... నేడు నీ ఖర్మ!
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్‌కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసిన పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు. తనకు ప్రొటోకాల్ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్రబాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. సీటు త్యాగం చేసిన వ్యక్తికి వెన్నుపోటా!ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ గెలవలేకపోయిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో అధినేత ఓడిపోవడం అప్పట్లో జనసేన వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని పలు సభల్లో చెప్పి బాధపడేవారు. దీంతో 2024 ఎన్నికల్లోనూ ఆయనను ఓటమి భయం వెంటాడింది. అందుకే చివరి వరకూ ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోయారు. రకరకాల సమీకరణాల తర్వాత పిఠాపురం అయితే బాగుంటుందని పొత్తులో ఆ సీటును తీసుకున్నారు. కానీ టీడీపీ శ్రేణులు మొదట దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. టీడీపీ సీటును జనసేనకు ఎలా ఇస్తారని భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. టీడీపీ తరఫున ఆ సీటు దాదాపు ఖరారైన ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే రాజీనామాకు సైతం సిద్ధపడ్డారు. కానీ, చంద్రబాబు పలుమార్లు బుజ్జగించడంతో శాంతించి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేశారు. అధికారంలోకి వచ్చాక ఆయనను ఎమ్మెల్సీ చేస్తామని చంద్రబాబు గట్టిగా హామీ ఇవ్వడంతోనే ఆయన పవన్ కోసం తన సీటు త్యాగం చేశారు. పిఠాపురం టీడీపీ శ్రేణుల్ని బ్రతిమిలాడి ఆయన పవన్ కోసం పని చేయించారు. పవన్ అసెంబ్లీకి వెళ్లడంలో వర్మది కీలక పాత్ర పవన్ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో పవన్‌ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పనిచేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్‌ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంపడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనకే పవన్ అడ్డుపడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వర్మను పవన్ దెబ్బకొట్టడం దారుణమని వాపోతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి.

అమెరికా మార్కెట్లు క్రాష్: కారణం ఇదే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరతీసిన టారిఫ్ వార్ ఆర్థిక అనిశ్చితులకు దారి తీయోచ్చనే ఆందోళనలతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. నాస్డాక్ 4%, ఎస్అండ్పీ 2.5%, డోజోన్స్ 1.3% నష్టాలతో ట్రేడయ్యాయి.టెక్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నాస్డాక్ ఇండెక్స్‌లోని ప్రధాన షేర్లైన ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా షేర్లు 2–14% కుప్పకూలాయి.ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నవంబర్‌లో టెస్లా షేరు ఆర్జించిన లాభాలన్నీ(50%) తుడిచిపెట్టుకుపోయాయి. టారిఫ్‌ల కారణంగా ధరలు పెరుగుతాయనే ఆందోళనలను ట్రంప్ తోసిపుచ్చారు. అయితే ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలను మాత్రం తోసిపుచ్చలేదు.రూపాయి 36 పైసలు డౌన్రూపాయి విలువ నెలరోజుల్లో అతిపెద్ద పతనం చవిచూసింది. డాలర్ మారకంలో సోమవారం 36 పైసలు క్షీణించి 87.31 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి 5 తర్వాత ఒక రోజులో రూపాయికిదే భారీ నష్టం. క్రూడాయిల్ ధరల్లో ఒడిదుడుకులు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయని నిపుణులు తెలిపారు. ఇదీ చదవండి: గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు?

కెనడా తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ
టొరంటో: కెనడా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా గతంలో సేవలందించిన బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు మార్క్ కార్నీను కెనడా ప్రధానమంత్రి పీఠం వరించింది. ప్రస్తుత ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తానని జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో పాలక లిబిరల్ పార్టీ నూతన సారథి కోసం ఎన్నికలు నిర్వహించగా కార్నీ ఘన విజయం సాధించారు. దాంతో తదుపరి ప్రధానమంత్రిగా 59 ఏళ్ల కార్నీ త్వరలో బాధ్యతల స్వీకరించనున్నారు. ట్రంప్ సారథ్యంలోని అమెరికాతో కెనడా వాణిజ్యయుద్ధానికి దిగిన వేళ కెనడా ప్రధాని పగ్గాలు కార్నీ చేపడుతుండటం గమనార్హం. ఆదివారం లిబరల్ పార్టీ సారథ్యం కోసం జరిగిన ఓటింగ్‌లో కార్నీ 1,31,674 ఓట్లు సాధించారు. మొత్తం ఓట్లలో ఏకంగా 85.9 శాతం ఓట్లు కార్నీ కొల్లగొట్టడం విశేషం. గతంలో మహిళా ఉపప్రధానిగా సేవలందించిన క్రిస్టినా ఫ్రీలాండ్ రెండోస్థానంలో సరిపెట్టుకున్నారు. ఈమెకు కేవలం 11,134 ఓట్లు పడ్డాయి. అంటే మొత్తం ఓట్లలో కేవలం 8 శాతం ఓట్లు ఈమెకు దక్కాయి. గవర్నమెంట్ హౌస్ లీడర్ కరీనా గౌల్డ్(4,785 ఓట్లు) మూడో స్థానంతో, వ్యాపా ర అనుభవం ఉన్న నేత ఫ్రాంక్ బేలిస్(4,038) నాలుగో స్థానంతో సరిపెట్టు కున్నారు. మొత్తం 1,51,000 మందికిపైగా పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.పదవీ స్వీకారం ఎప్పుడు ?పార్టీ ఎన్నికల్లో గెలిచినా వెంటనే కార్నీ ప్రధాని పీఠంపై కూర్చోవడం కుదరదు. ట్రూడో ప్రధానిగా రాజీనామా చేసి గవర్నర్ జనరల్‌కు సమర్పించాలి. కెనడా ఒకప్పుడు బ్రిటన్ వలసరాజ్యం కావడంతో ప్రస్తుత బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్–3 సమ్మతితో గవర్నర్ జనరల్.. కార్నీతో నూతన ప్రధానిగా ప్రమాణంచేయిస్తారు. అయితే అక్టోబర్ 20వ తేదీలోపు కెనడాలో సాధారణ ఎన్నికలు చేపట్టాల్సిఉంది. అందుకే కార్నీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగానే ఎన్నికలకు పిలుపిచ్చే వీలుంది.ట్రంప్‌ను నిలువరిద్దాంపార్టీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాక వందలాది మంది మద్దతుదారులనుద్దేశించి కార్నీ ప్రసంగించారు. అమెరికా దిగు మతి టారిఫ్‌ల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ ఇకపై ఏమాత్రం నమ్మలేని దేశం(అమెరికా) మనకు గడ్డు పరిస్థితు లను తీసుకొచ్చింది. అయినాసరే మనం ఈ పరిస్థితిని దీటుగా ఎదుర్కోగలం. అమెరికా దిగుమతి టారిఫ్‌లకు దీటుగా మనం కూడా టారిఫ్‌లు విధిస్తాం. మమ్మల్ని అమెరికా గౌరవించేదాకా ఇవి కొనసాగుతాయి. అమెరికన్లు మా సహ జవనరులు, భూములు, నీళ్లు, ఏకంగా మా దేశాన్నే కోరుకుంటున్నారు. ఏ రూపంలోనూ కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదు. ట్రంప్ గెలవకుండా నిలువరిద్దాం’’ అని వందలాది మంది మద్దతుదారులను ద్దేశించి కార్నీ ప్రసంగించారు.బ్యాంకర్ పొలిటీషియన్కెనడా, బ్రిటన్‌లోని సెంట్రల్ బ్యాంక్‌లకు సారథ్యం వహించి అపార బ్యాంకింగ్ అనుభవం గడించిన మార్క్ కార్నీ ఇప్పుడు కెనడా ప్రధానిగా కొత్త పాత్ర పోషించనున్నారు. బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ హోదాలో 2008లో ఆర్థిక సంక్షోభం నుంచి కెనడాను గట్టెక్కేలాచేసి శెభాష్ అనిపించుకున్నారు. వలసలు, అధికమైన ఆహార, ఇళ్ల ధరలతో ప్రస్తుతం కెనడా సతమవుతున్న వేళ ట్రంప్ టారిఫ్ యుద్ధానికి తెరలేప డంతో కార్నీ తన బ్యాంకింగ్ అనుభవాన్ని పరిపాలనా దక్షతగా మార్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.హార్వర్డ్‌లో ఉన్నత విద్య: 1965 మార్చి 16వ తేదీన వాయవ్య కెనడాలోని ఫోర్ట్‌స్మిత్ పట్టణంలో కార్నీ జన్మించారు. తర్వాత ఆల్బెర్టా రాష్ట్రంలోని ఎడ్మోంటెన్‌లో పెరిగారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 1988లో ఉన్నతవిద్య పూర్తిచేశారు. ఈయనకు ఐస్ హాకీ అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో ఐస్హాకీ బాగా ఆడేవారు. తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ సాధించారు. బ్రిటన్‌కు చెందిన ఆర్థికవేత్త డయానా ఫాక్స్‌ను పెళ్లాడారు. వీళ్లకు నలుగురు కుమార్తెలు. కెనడా పౌరసత్వంతోపాటు ఈయనకు ఐరిష్, బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా పనిచేసినకాలంలో తొలిసారిగా బ్రిటన్ పాస్‌పోర్ట్ సంపాదించారు. గోల్డ్‌మ్యాన్ శాక్స్‌లో దశాబ్దానికిపైగా పనిచేశారు. లండన్, టోక్యో, న్యూయార్క్, టొరంటోలో పనిచేశారు. తర్వాత 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడాలో డిప్యూటీ గవర్నర్‌గా పనిచేశారు.3 శతాబ్దాల్లో తొలిసారిగా: 2013 నుంచి ఏడేళ్లపాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా సేవలందించారు. 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను స్థాపించగా గత 300 సంవత్సరాల్లో ఆ బ్యాంక్‌కు గవర్నర్‌గా ఎన్నికైన తొలి బ్రిటీషేతర వ్యక్తిగా 2013లో కార్నీ చరిత్ర సృష్టించారు. బ్రెగ్జిట్ వేళ బ్రిటన్ ఆర్థికసంక్షోభంలో కూరుకుపోకుండా బ్యాంకర్‌గా కార్నీ సమర్థవంత పాత్ర పోషించారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను వీడాక ఐక్యరాజ్యసమితిలో వాతావరణ మార్పులు, ఆర్థిక అంశాలపై ప్రత్యేక దౌత్యవేత్తగా సేవలందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్

ఇంగ్లండ్ తీరంలో రెండు నౌకలు ఢీ
లండన్: ఇంగ్లండ్ తూర్పు తీరంలో ఆయిల్ ట్యాంకర్, సరుకు నౌక ఢీకొన్న ఘటనలో రెండు ఓడలకు మంటలు అంటుకున్నాయి. హల్ తీరానికి సమీపంలో సోమవారం ఉదయం 9.48 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు నౌకల్లోని మొత్తం 37 మందిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చినట్లు రవాణా శాఖ మంత్రి తెలిపారని స్థానిక ప్రజా ప్రతినిధి గ్రాహం స్టువార్ట్ చెప్పారు. వీరిలో తీవ్రగాయాలతో ఉన్న ఒకరిని ఆస్పత్రిలో చేర్పించారన్నారు. గ్రీస్ నుంచి వచ్చిన అమెరికాకు చెందిన ఎంవీ స్టెనా ఇమాక్యులేట్ పేరున్న ఆయిల్ ట్యాంకర్ గ్రీమ్స్‌బీ పోర్టులో లంగరేసి ఉంది. అదే సమయంలో, స్కాట్లాండ్ నుంచి నెదర్లాండ్స్‌లోని పోటర్‌డ్యామ్ వైపు వెళ్తున్న పోర్చుగల్ సరుకు నౌక సొలొంగ్ దానిని ఢీకొట్టింది. దీంతో, రెండు ఓడల్లో మంటలు చెలరేగాయి. సరుకు ఓడలో సోడియం సైనైడ్ అనే విషపూరిత రసాయన కంటెయినర్లు ఉన్నట్టు సమాచారం. బ్రిటన్ మారిటైం కోస్ట్‌గార్డ్ ఏజెన్సీ ఆ ప్రాంతానికి లైఫ్బోట్లను, రెస్క్యూ హెలి కాప్టర్‌ను పంపించింది. నౌకల్లో నుంచి బయటకు దూకిన వారిని లైఫ్బోట్లలో రక్షించి ఒడ్డుకు చేర్చారు. కాగా, స్టెనా ఇమాక్యులేట్ ఓడలో జెట్–ఏ1 ఇంధనం రవాణా అవుతోందని అమెరికాకు చెందిన మారిటైం మేనేజ్మెంట్ సంస్థ క్రౌలీ తెలిపింది. సరుకు నౌక ఢీకొట్టడంతో ట్యాంకర్ దెబ్బతిని ఇంధనం లీకైంది. దీంతో మంటలు వ్యాపించడంతోపాటు పలుమార్లు పేలుళ్లు సంభవించినట్లు వెల్లడించింది. ట్యాంకర్ నౌకలో ఉన్న మొత్తం 23 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు క్రౌలీ వివరించింది. అమెరికా సైన్యానికి అవసరమైన ఇంధనాన్ని ఈ సంస్థ సరఫరా చేస్తుంది.

‘2027’పై ఇప్పుడే చెప్పను!
దుబాయ్: వరుసగా గత మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరిన భారత జట్టు రెండు టైటిల్స్ నెగ్గి మరో దాంట్లో రన్నరప్‌గా నిలిచింది. ఈ మూడు టోర్నీలు కలిపి 24 మ్యాచ్‌లు ఆడితే ఒక్క వరల్డ్ కప్ ఫైనల్ మినహా మిగతా 23 మ్యాచ్‌లు గెలిచింది. వరుసగా టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ట్రోఫీని సాధించింది. ఇది అసాధారణ ఘనత అని, తమ జట్టు స్థాయిని ప్రదర్శించామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద ఘనత. మా టీమ్ ఎంత బలంగా ఉందో ఇది చూపించింది. ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు వారి మధ్య చక్కటి సమన్వయం, బయటి అంశాలను పట్టించుకోకుండా ఒత్తిడిని అధిగమించి ఇలాంటి విజయాలు సాధించడం అసాధారణం. విజయం సాధించాలనే ఒకే ఒక లక్ష్యంతో అందరూ పని చేశారు’ అని రోహిత్ అన్నాడు. వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు సాధించడం అంత సులువైన విషయం కాదని, దాని వెనక చాలా శ్రమ ఉందని అతను చెప్పాడు. ‘చాలా తక్కువ జట్లు మాత్రమే ఓటమి లేకుండా వరుసగా రెండు ట్రోఫీలు గెలిచాయి. అన్నీ మా వ్యూహాల ప్రకారమే ఆడి సఫలమయ్యాం. వన్డే వరల్డ్ కప్‌లో చాలా అద్భుతంగా ఆడిన తర్వాత కూడా ఫైనల్లో ఓడాం. ఇదే విషయాన్ని కుర్రాళ్లకు చెబుతూ గత రెండు ఫైనల్స్‌కు ముందు చివరి బంతి పడే వరకు పోరాడమని స్ఫూర్తి నింపాం. ఇదే ఫలితాన్ని అందించింది’ అని రోహిత్ వెల్లడించాడు. తమ తుది జట్టులో వైవిధ్యమైన ఆటగాళ్లు ఉండటం విజయానికి కారణమని కూడా అతను విశ్లేషించాడు. ‘1 నుంచి 11వ నంబర్ ఆటగాడి వరకు ఏదో ఒక రూపంలో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ సమష్టితత్వంతో పాటు గెలవాలనే కసి కూడా వారిలో కనిపించింది’ అని రోహిత్ వివరించాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడే విషయంపై తాను ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్య చేయనని, ప్రస్తుతానికి తాజా విజయాలను ఆస్వాదిస్తున్నట్లు రోహిత్ స్పష్టం చేశాడు. ఈ ఫార్మాట్ నుంచి తాను రిటైర్ కావడం లేదని ఆదివారమే మ్యాచ్ అనంతరం అతను వెల్లడించాడు. ‘ప్రస్తుతం అంతా బాగుంది. భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం అప్పుడే లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతానా లేదా అని ఇప్పుడే చెప్పను. దీని గురించి ఈ సమయంలో మాట్లాడటం అనవసరం. నా కెరీర్లో ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లాను. మున్ముందు ఏం జరుగుతుందో ఎప్పుడూ ఆలోచించలేదు. నా సహచరులతో కలిసి క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాను. అది చాలు’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

పోలీస్ అక్క భద్రత.. భరోసా
‘అక్క’ అనే మాటలో ఆప్యాయత మాత్రమే కాదు... ‘భద్రత’ను ఇచ్చే ‘భరోసా’ కూడా ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో తోటిపిల్లలు ఏడిపిస్తుంటే...‘మా అక్కకు చెబుతాను’ అనడం సాధారణం. అవును. అక్క అంటే ఫ్రెండ్ కాని ఫ్రెండ్. ఏ దాపరికాలు లేకుండా మనసులోని మాటను పంచుకునే అమ్మ కాని అమ్మ! ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు. వారితో అన్నీ పంచుకుంటారు. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండే ఆడపిల్లలకు తోడెవరు? చుట్టూ ఎంతోమంది ఉన్నా, వారితో అన్ని విషయాలు పంచుకోలేక ‘నేను ఒంటరిని’ అనే భావన ఎటైనా దారితీయవచ్చు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ‘పోలీస్ అక్క’కు ప్రాణం పోసింది.ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలలో విద్యార్థినులు వేధింపులు, దాడులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది అమ్మాయిలు తమలో తామే కుమిలిపోతూ చివరకు ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ఇలాంటివి నివారించడానికి ‘నేనున్నాను’ అంటూ ముందుకు వచ్చింది పోలీసు అక్క.దత్తత తీసుకుంటారు...ఒక్కో మహిళా కానిస్టేబుల్‌కు ఒక్కో విద్యాలయం, వసతిగృహం బాధ్యతను అప్పగించారు. ‘మీరు అక్కడి విద్యార్థులను దత్తత తీసుకున్నట్లు భావించాలి. వారు మీ కుటుంబ సభ్యులే’ అని ఒకటికి రెండుసార్లు చె΄్పారు. ప్రతినెలా ఒకటో శనివారం మహిళా కానిస్టేబుళ్లు తమకు అప్పగించిన గురుకులానికి వెళతారు. ఆ రోజంతా అక్కడే ఉంటూ విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తారు. సొంత అక్కలా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు.సైబర్‌క్రైమ్, ఉమెన్ ట్రాఫికింగ్, గుడ్‌టచ్–బ్యాడ్‌టచ్, మహిళల భద్రత, చట్టాలు.. మొదలైన విషయాలపై చర్చిస్తారు. రాత్రిపూట అక్కడే బస చేస్తారు. ప్రస్తుతం 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. వీరి పని తీరును ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.ఆ బాధ నుంచే...ఎస్పీగా నిర్మల్ జిల్లాలోనే తొలి పోస్టింగ్ తీసుకున్న జానకీ షర్మిలకు ఇక్కడి బాసర ట్రిపుల్ ఐటీలో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలచి వేసింది. విద్యార్థులకు అండగా నిలవడానికి, తనవంతుగా ఏదైనా చేయాలని, వారిలో భరోసా నింపాలనీ అనుకున్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన ట్రిపుల్‌ఐటీని మూడునెలల పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యల గురించి తెలుసుకుంటూ పరిష్కారంపై దృష్టి పెట్టారు. ప్రతి సీనియర్ ఒక జూనియర్ని గైడ్ చేయాలని సూచించారు. విజేతలుగా నిలిచిన పూర్వ విద్యార్థులు, ట్రెండింగ్ సెలబ్రిటీలు, మోటివేషనల్ స్పీకర్లతో సమావేశాలు, క్రీడాపోటీలు నిర్వహించారు. ఇవి విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపాయి. ధైర్యాన్ని ఇచ్చాయి.పెట్రోలింగ్ బాధ్యతలు...తనలాగే మహిళా పోలీసులు ప్రత్యక్ష పోలీసింగ్ చేయాలని ఎస్పీ జానకీ షర్మిల నిర్ణయించారు. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోనే తొలిసారి మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యక్ష పోలీసింగ్ బాధ్యతలు అప్పగించారు. కేవలం స్టేషన్ లో పనులు చేయడానికి, రిసెప్షనిస్టులుగానే పరిమితమైన ఉమెన్ కానిస్టేబుళ్లు ఇక నుంచి వారానికోసారి పెట్రోలింగ్, డయల్ 100, ఎమర్జెన్సీ, డెయిలీ రూట్ చెకింగ్, వాహనాల తనిఖీలాంటి బాధ్యతలను చేపడతారు. పెట్రోలింగ్‌లో తొలిరోజే సత్తా చాటారు. భైంసా మండలం వట్టోలి గ్రామంలో పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. ‘పోలీసులు ప్రజల్లో కలిసిపోయినప్పుడే... ప్రజలకు భరోసా, భద్రత’ అంటారు. ‘పోలీసు అక్క’లాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఆ మాటకు బలాన్ని ఇస్తాయి.అందుకే... పోలీస్ అక్కఎక్కడైనా మహిళలకు ఇబ్బందులు, అడ్డంకులు ఉంటూనే ఉంటాయి. చాలామంది మహిళలకు కాస్త భరోసా, కాసింత ్రపోత్సాహం ఇస్తే చాలు దేన్నైనా సాధించగలరు. నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా విద్యార్థినులకు అండగా నిలవాలనుకున్నాం. ఇందుకోసమే ‘పోలీస్ అక్క’ కార్యక్రమం చేపట్టాం. ఎన్నోఏళ్లుగా స్టేషన్ లకే పరిమితమైన మహిళా కానిస్టేబుళ్లు సైతం తాము పోలీసులం అని గర్వపడేలా ప్రత్యక్ష పోలీసింగ్ చేసేలా డ్యూటీలను అప్పగించాం.– జానకీ షర్మిల, ఎస్పీ, నిర్మల్– రాసం శ్రీధర్, సాక్షి ప్రతినిధి, నిర్మల్
'కార్తీ' డబ్బింగ్ పనుల్లో బిజీ.. నెక్ట్స్ విడుదలయ్యే సినిమా ఇదే
రోజా కేసులో రోజుకో ట్విస్ట్
హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
అమెరికా మార్కెట్లు క్రాష్: కారణం ఇదే..
ఏఐ అభివృద్ధిలో వివక్ష!
భారత్‌కు ఏఐ నిపుణులు కావలెను
హైదరాబాద్ యూనివర్సిటీతో బయోఫ్యాక్టర్ ఒప్పందం
ఎస్ఎంఈ ఐపీఓలు అంత ఈజీ కాదు
ఐపీఓల జోరుకు బ్రేక్!!
సాఫ్ట్వేర్ నుంచి పర్మాకల్చర్లోకి..!
CT 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు
తమకూ ఏదైనా పదవి రాకపోతుందా అని ప్రాక్టీస్ చేస్తున్నార్సార్!
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా.. అల్లుడిపై మామ ప్రశంసలు
గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు?
ఇతర దేశాలకు ఆడుతున్న టాప్-10 భారత సంతతి క్రికెటర్లు
IPL 2025: బ్రూక్ బాటలో మరో ముగ్గురు విదేశీ స్టార్లు..?
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు
అమృత వల్లే ఇదంతా: సోదరి సంచలన వ్యాఖ్యలు
'కార్తీ' డబ్బింగ్ పనుల్లో బిజీ.. నెక్ట్స్ విడుదలయ్యే సినిమా ఇదే
రోజా కేసులో రోజుకో ట్విస్ట్
హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
అమెరికా మార్కెట్లు క్రాష్: కారణం ఇదే..
ఏఐ అభివృద్ధిలో వివక్ష!
భారత్‌కు ఏఐ నిపుణులు కావలెను
హైదరాబాద్ యూనివర్సిటీతో బయోఫ్యాక్టర్ ఒప్పందం
ఎస్ఎంఈ ఐపీఓలు అంత ఈజీ కాదు
ఐపీఓల జోరుకు బ్రేక్!!
సాఫ్ట్వేర్ నుంచి పర్మాకల్చర్లోకి..!
CT 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు
తమకూ ఏదైనా పదవి రాకపోతుందా అని ప్రాక్టీస్ చేస్తున్నార్సార్!
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా.. అల్లుడిపై మామ ప్రశంసలు
గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు?
ఇతర దేశాలకు ఆడుతున్న టాప్-10 భారత సంతతి క్రికెటర్లు
IPL 2025: బ్రూక్ బాటలో మరో ముగ్గురు విదేశీ స్టార్లు..?
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు
అమృత వల్లే ఇదంతా: సోదరి సంచలన వ్యాఖ్యలు
సినిమా

తన పేరెత్తితేనే కన్నీళ్లు.. ఈ క్యాన్సర్ పోరాటంలో..: బుల్లితెర నటి ఎమోషనల్
సంతోషాన్ని అందరూ పంచుకుంటారు, కానీ కష్టాన్ని కూడా పంచుకున్నవారే అసలైన ఆప్తులు. ఈ విషయంలో తాను చాలా లక్కీ అంటోంది బుల్లితెర నటి హీనా ఖాన్ (Hina Khan). క్యాన్సర్‌తో పోరాడుతున్న తనను ప్రియుడు రాకీ జైస్వాల్ (Rocky Jaiswal) చంటిపాపలా చూసుకుంటున్నాడని చెప్తోంది. తినిపించడం, టాబ్లెట్స్ వేయడం, నడిపించడం.. ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటున్నాడంది. ఇలాంటి ప్రేమికుడు దొరికినందుకు పొంగిపోతోంది.మాటలు సరిపోవురొమ్ము క్యాన్సర్ (స్టేజ్ 3)తో పోరాడుతున్న హీనా ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రయాణంలో అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. అతడి పేరెత్తినప్పుడు తన గురించి చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. నాకోసం ఎంతో చేశాడు. ఎల్లప్పుడూ చేయి పట్టుకునే నడిపించాడు. తనెప్పుడూ అంతే.. నాకోసమే ఆలోచిస్తాడు. ఎంత మంచి మనిషో కదా! తనను తలుచుకుంటేనే సంతోషంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ప్రతి అమ్మాయికి ఇలాంటి అబ్బాయి దొరకాలి.అతడు ప్రేమించినంతగా నేను ప్రేమించలేనురాకీ నాకు 12 ఏళ్లుగా తెలుసు. నా ఫస్ట్ షోలో తొలిసారి అతడిని కలిశాను. ఏడునెలలపాటు ఫ్రెండ్స్‌గా ఉన్నాం. తర్వాత మాది స్నేహం కాదని ప్రేమని తెలుసుకున్నాం. మేము ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదు. కానీ ఓ రోజు ఆత్మీయంగా హగ్ ఇచ్చుకున్నప్పుడు మా మధ్య ఉన్న బంధం బలపడిందని అర్థం చేసుకున్నాం. మేము జంటగా ఎక్కడికైనా వెళ్తూ ఉండేవాళ్లం. నా క్యాన్సర్ అతడిని ఎంతో బాధించింది. నేనెప్పుడూ అతడికి ఒకటే చెప్తుంటాను.. నువ్వు ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమించలేను అని! దానికి అతడు గర్వంగా ఫీలవడు, కనీసం అవునని కూడా ఒప్పుకోడు. నేను ఎక్కువగా ఏం చేశానని? అని అమాయకంగా అడుగుతుంటాడు అని హీనా ఖాన్ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan)చదవండి: ఆటోఇమ్యూన్ వ్యాధి.. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నా: టాలీవుడ్ నటి

ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా.. అల్లుడిపై మామ ప్రశంసలు
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి ముద్దాడింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో భారత స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడారు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు. ఒక వైపు వికెట్స్ పడుతున్నా 34 పరుగుతులతో నాటౌట్‌గా నిలిచి విజయ తీరాలకు చేర్చాడు. దీంతో పాకిస్తాన్ హోస్ట్ చేసిన ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది.అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలవడంపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన అల్లుడు కేఎల్ రాహుల్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు రాహుల్ ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియాకి విష్.. రాహుల్ కమాండ్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ సునీల్ శెట్టిని ప్రశంసిస్తున్నారు. అల్లుడికి మామ సపోర్ట్ చేయడాన్ని చూసి నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ అన్నా రాక్‌స్టార్.. టీమిండియాకు కాబోయే కెప్టెన్ అంటూ ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. 2027లో కేఎల్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ గెలుస్తామంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. అల్లుడికి మామ సపోర్ట్ చేయడం గొప్ప విషయం.. మా నాన్న కూడా నాకు సపోర్ట్ చేయడు అంటూ ఓ నెటిజన్ ఫన్నీగా సునీల్ శెట్టి ట్వీట్‌కు స్పందించాడు. అతియాను పెళ్లాడిన కేఎల్ రాహుల్..బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని కేఎల్ రాహుల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అతియా శెట్టి గర్భంతో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు. సునీల్ శెట్టి తాతగా ప్రమోట్ కానున్నారు. ఏప్రిల్‌లో అతియా శెట్టి, కేఎల్ రాహుల్ తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు. 🇮🇳 INDIA’S WISH !!!! Rahul’s COMMAND …… pic.twitter.com/SbllRkbUgP— Suniel Shetty (@SunielVShetty) March 9, 2025

హీరోయిన్ అంజలితో రిలేషన్? కోన వెంకట్ ఆన్సరిదే..
రచయితగా, నిర్మాతగా రెండు దశాబ్దాలుగా సినీసీమలో కొనసాగుతున్నాడు కోన వెంకట్ (Kona Venkat). ఒకప్పుడు ఎక్కువ హిట్లు అందుకున్న ఆయన ఈ మధ్యకాలంలో జిన్నా, గీతాంజలి మళ్లీ వచ్చింది వంటి చిత్రాలతో పరాజయాల బాట పట్టాడు. హీరోయిన్ అంజలితో నిశ్శబ్ధం, డిక్టేటర్, గీతాంజలి, గీతాంజలి మళ్లీ వచ్చింది, శంకరాభరణం.. ఇలా పలు సినిమాలు చేశాడు. దీంతో దర్శకుడికి, అంజలికి మధ్య ఏదో ఉందన్న రూమర్స్ మొదలయ్యాయి. అంజలిపై సాఫ్ట్ కార్నర్వీరు రిలేషన్లో ఉన్నారని పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్‌పై కోన వెంకట్ స్పందిస్తూ.. అంజలి (Actress Anjali) పై నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. తనను చెల్లిగా, కూతురిగా, స్నేహితురాలిగా.. ఎలా పిలవమన్నా పిలుస్తాను. తన వ్యక్తిగత జీవితం చాలా తక్కువమందికే తెలుసు. తన బాల్యం సంతోషకరంగా సాగలేదు. పేరెంట్స్ దగ్గర కూడా ఎప్పుడూ లేదు. పిన్ని దగ్గరే పెరిగింది. ఆమె కూడా సరిగా చూసుకునేది కాదు.ఆస్తి కబ్జాతనకు ఒక సపోర్ట్ కావాలనిపించింది. తన బాధ చెప్పుకునేందుకు ఓ మనిషి ఉంటే బాగుండనిపించింది. నా కూతురికి ఏదైనా అవసరం ఉందంటే ఎలా నిలబడతానో అంజలికి కూడా ఎల్లప్పుడూ అలాగే నిల్చున్నాను. దాన్ని రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. నేనవేవీ పట్టించుకోను. గీతాంజలి సినిమా సమయంలోనే అంజలి నాకు తొలిసారి పరిచయమైంది. అదే సమయంలో చెన్నైలో తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె పిన్నివాళ్లు అంజలి ఆస్తిని కబ్జా చేశారు. అలాంటి సమయంలో నిస్వార్థంగా తనకు అండగా నిలబడే ఓ స్నేహితుడు అవసరం అనిపించింది. నా చేతుల మీదుగా ఇవ్వమని ఆశపడిందినన్ను ఫ్రెండ్, అన్న, తండ్రి, గురువు, దైవం.. ఏదనుకున్నా పర్లేదు. నేను పోలీసులతో మాట్లాడి తనకు అండగా నిలబడ్డాను. ఆమె తొలిసారి బీఎమ్‌డబ్ల్యూ కారు కొనుకున్నప్పుడు నా చేతుల మీదుగా ఇవ్వమని అడిగింది. సరేనని నా చేతులమీదుగా కారు తాళాలు తన చేతికిచ్చాను. దానికి నేనేదో ఆమెకు కారు గిఫ్ట్ ఇచ్చానని రాసేశారు. మా అనుబంధానికి మీరు ఏ పేరైనా పెట్టుకున్నా నేను పట్టించుకోను అని కోన వెంకట్ చెప్పుకొచ్చాడు.చదవండి: #SSMB29: వాట్ ద ఎఫ్.. రాజమౌళి?

బర్త్ డే పార్టీలో జంటగా సమంత, రాజ్ నిడిమోరు.. మరోసారి డేటింగ్ వార్తలు!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే చెన్నైలో జరిగిన బిహెండ్వుడ్స్ హాల్ ఆప్ ఫేమ్ అవార్డుల వేడుకకలో మెరిసింది. ఈ వేదికపై సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటనకు అవార్డ్ కూడా అందుకుంది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో ప్రత్యేకమైన అవార్డ్‌తో సమంతను సత్కరించారు. అయితే ఈ వేడుకల్లో సిటాడెల్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరు సైతం సందడి చేశారు. సమంతతో కలిసి వేదికపై కనిపించారు.అయితే గత కొన్ని నెలలుగా సమంత- రాజ్ నిడిమోరుపై డేటింగ్ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే పికిల్ బాల్ టోర్నమెంట్లోనూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ సమయంలోనూ సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. తాజాగా మరోసారి సామ్- రాజ్ నిడిమోరు ఓ పార్టీలో మెరిశారు. తన స్నేహితురాలు, డిజైనర్ క్రేషా బజాజ్ పుట్టినరోజు వేడుకలకు సమంత, నిడిమోరు హాజరయ్యారు. దీంతో మరోసారి వీరిద్దరిపై నెట్టింట చర్చ మొదలైంది. నెల రోజుల్లోపే రెండోసారి జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. తాజాగా వీరిద్దరు కలిసి బర్త్ డే పార్టీలో దిగిన ఫోటో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఏదేమైనా సమంత, రాజ్ నిడిమోరు క్లారిటీ ఇస్తే కానీ ఈ వార్చలకు ఇప్పట్లో చెక్ పడేలా లేదు. అయితే తమపై వస్తున్న డేటింగ్ రూమర్స్‌పై ఇప్పటి వరకు సామ్ కానీ, రాజ్ ఎవరూ కూడా స్పందించలేదు.ఇక సినిమాల విషయానికొస్తే సమంత గతేడాది సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీలో కనిపించింది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జోడీగా నటించింది. ప్రస్తుతం సమంత తెలుగులో ఓ మూవీని నిర్మిస్తున్నారు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషిలో నటించింది.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

‘2027’పై ఇప్పుడే చెప్పను!
దుబాయ్: వరుసగా గత మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరిన భారత జట్టు రెండు టైటిల్స్ నెగ్గి మరో దాంట్లో రన్నరప్‌గా నిలిచింది. ఈ మూడు టోర్నీలు కలిపి 24 మ్యాచ్‌లు ఆడితే ఒక్క వరల్డ్ కప్ ఫైనల్ మినహా మిగతా 23 మ్యాచ్‌లు గెలిచింది. వరుసగా టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ట్రోఫీని సాధించింది. ఇది అసాధారణ ఘనత అని, తమ జట్టు స్థాయిని ప్రదర్శించామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద ఘనత. మా టీమ్ ఎంత బలంగా ఉందో ఇది చూపించింది. ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు వారి మధ్య చక్కటి సమన్వయం, బయటి అంశాలను పట్టించుకోకుండా ఒత్తిడిని అధిగమించి ఇలాంటి విజయాలు సాధించడం అసాధారణం. విజయం సాధించాలనే ఒకే ఒక లక్ష్యంతో అందరూ పని చేశారు’ అని రోహిత్ అన్నాడు. వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు సాధించడం అంత సులువైన విషయం కాదని, దాని వెనక చాలా శ్రమ ఉందని అతను చెప్పాడు. ‘చాలా తక్కువ జట్లు మాత్రమే ఓటమి లేకుండా వరుసగా రెండు ట్రోఫీలు గెలిచాయి. అన్నీ మా వ్యూహాల ప్రకారమే ఆడి సఫలమయ్యాం. వన్డే వరల్డ్ కప్‌లో చాలా అద్భుతంగా ఆడిన తర్వాత కూడా ఫైనల్లో ఓడాం. ఇదే విషయాన్ని కుర్రాళ్లకు చెబుతూ గత రెండు ఫైనల్స్‌కు ముందు చివరి బంతి పడే వరకు పోరాడమని స్ఫూర్తి నింపాం. ఇదే ఫలితాన్ని అందించింది’ అని రోహిత్ వెల్లడించాడు. తమ తుది జట్టులో వైవిధ్యమైన ఆటగాళ్లు ఉండటం విజయానికి కారణమని కూడా అతను విశ్లేషించాడు. ‘1 నుంచి 11వ నంబర్ ఆటగాడి వరకు ఏదో ఒక రూపంలో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ సమష్టితత్వంతో పాటు గెలవాలనే కసి కూడా వారిలో కనిపించింది’ అని రోహిత్ వివరించాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడే విషయంపై తాను ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్య చేయనని, ప్రస్తుతానికి తాజా విజయాలను ఆస్వాదిస్తున్నట్లు రోహిత్ స్పష్టం చేశాడు. ఈ ఫార్మాట్ నుంచి తాను రిటైర్ కావడం లేదని ఆదివారమే మ్యాచ్ అనంతరం అతను వెల్లడించాడు. ‘ప్రస్తుతం అంతా బాగుంది. భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం అప్పుడే లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతానా లేదా అని ఇప్పుడే చెప్పను. దీని గురించి ఈ సమయంలో మాట్లాడటం అనవసరం. నా కెరీర్లో ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లాను. మున్ముందు ఏం జరుగుతుందో ఎప్పుడూ ఆలోచించలేదు. నా సహచరులతో కలిసి క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాను. అది చాలు’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

WPL 2025: దంచికొట్టిన హర్మన్.. ధనాధన్ హాఫ్ సెంచరీ
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముంబై ఇండియన్స్.. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మెరుగైన స్కోరు సాధించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్.. హర్మన్‌ప్రీత్ కౌర్ బృందాన్ని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్ముంబై ఓపెనర్లలో అమెలియా కౌర్(5) విఫలం కాగా.. మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్(27) ఫర్వాలేదనిపించింది. వన్‌డౌన్ బ్యాటర్ నాట్ సీవర్-బ్రంట్ 38 పరుగులతో రాణించగా.. హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 33 బంతుల్లోనే 6 ఫోర్ల సాయంతో 54 పరుగులు రాబట్టింది.మిగతా వాళ్లలో అమన్‌జ్యోత్ కౌర్(15 బంతుల్లో 27) దంచికొట్టగా.. సజీవన్ సంజన మెరుపు(6 బంతుల్లో 11, నాటౌట్)లు మెరిపించింది. ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా 4 బంతుల్లోనే 13 పరుగులతో దుమ్ములేపింది. ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు స్కోరు చేసింది.ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారుగుజరాత్ జెయింట్స్ బౌలర్లలో తనూజ కన్వార్, కశ్వీ గౌతం, ప్రియా మిశ్రా, కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. WPL-2025లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. ఎనిమిదింట ఐదు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ పది పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ చెరో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించి.. ఢిల్లీతో కలిసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి.టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్కుఅయితే, పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. అయితే, లీగ్ దశలో గుజరాత్‌కు తాజా మ్యాచ్ రూపంలో ఒకే మ్యాచ్ మిగిలి ఉండగా.. ముంబైకి గుజరాత్‌తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ కూడా మిగిలే ఉంది.ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్‌ను.. తదుపరి మంగళవారం బెంగళూరును ఓడిస్తే పన్నెండు పాయింట్లతో నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. అందుకే గుజరాత్‌ను ఓడించి.. ఆ తర్వాత బెంగళూరు జట్టు పనిపట్టాలని హర్మన్‌సేన పట్టుదలగా ఉంది. ఇక ముంబై ఇండియన్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఫలితాన్ని బట్టి గుజరాత్ భవితవ్యం తేలిపోనుంది.డబ్ల్యూపీఎల్-2025: ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్తుదిజట్లుముంబై ఇండియన్స్:హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ సీవర్- బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కర్, సజీవన సంజన, జి.కమలిని, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, షబ్నం ఇస్మాయిల్, పరుణిక సిసోడియాగుజరాత్ జెయింట్స్బెత్ మూనీ(వికెట్ కీపర్), హర్లిన్ డియోల్, ఆష్లే గార్డ్నర్(కెప్టెన్), డియాండ్రా డాటిన్, కశ్వీ గౌతం, సిమ్రన్ షేక్, ఫోబే లిచ్‌ఫీల్డ్, భార్తి ఫల్మాలి, తనుజ కన్వార్, మేఘనా సింగ్, ప్రియా మిశ్రా. View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20)

CT 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు
పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఎడిషన్ మార్చి 9న దుబాయ్‌లో ముగిసింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్‌తో తలపడ్డ టీమిండియా జయకేతనం ఎగురవేసి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో మూడు.. సెమీస్, ఫైనల్ గెలిచి అజేయంగా ఈ వన్డే టోర్నమెంట్‌ను ముగించింది.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఈ పదకొండు మంది సభ్యుల జట్టులో భారత్ హవా కొనసాగింది. టీమిండియా నుంచి ఈ జట్టులో ఏకంగా ఐదుగురు క్రికెటర్లు స్థానం సంపాదించారు.పాకిస్తాన్‌కు మొండిచేయిమరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి గెలుపన్నదే లేకుండా నిష్క్రమించిన పాకిస్తాన్‌కు మొండిచేయి ఎదురైంది. అంతేకాదు.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్ల నుంచి కూడా ఒక్క ఆటగాడూ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఇక టీమిండియా తర్వాత న్యూజిలాండ్ నుంచి అత్యధికంగా నలుగురు ఐసీసీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా అఫ్గనిస్తాన్ నుంచి ఇద్దరు ఇందులో ఉన్నారు. అయితే, ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టుకు సారథిగా కివీస్ నాయకుడు మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు.నాలుగు వికెట్ల తేడాతో ఓడించికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ పోటీపడగా.. టీమిండియా, కివీస్ సెమీస్ చేరాయి. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్ బరిలో దిగగా.. ఆసీస్, ప్రొటిస్ జట్లు సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి.ఈ క్రమంలో తొలి సెమీస్ మ్యాచ్‌లో భారత్- ఆసీస్‌ను... రెండో సెమీస్‌లో కివీస్ ప్రొటిస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సేన సాంట్నర్ బృందాన్ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో 76 పరుగులతో రాణించిన భారత సారథి రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. మొత్తంగా రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించిన కివీస్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), ఇబ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్), విరాట్ కోహ్లి(ఇండియా), శ్రేయస్ అయ్యర్(ఇండియా), కేఎల్ రాహుల్(ఇండియా), గ్లెన్ ఫిలిప్స్(న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), మిచెల్ సాంట్నర్(కెప్టెన్, న్యూజిలాండ్), మ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్), వరుణ్ చక్రవర్తి(ఇండియా)12వ ఆటగాడు: అక్షర్ పటేల్(ఇండియా)చాంపియన్స్ ట్రోఫీ-2025లో వీరి ప్రదర్శన👉రచిన్ రవీంద్ర- రెండు శతకాల సాయంతో 263 రన్స్. స్పిన్ బౌలర్‌గానూ రాణించిన రచిన్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపిక👉ఇబ్రహీం జద్రాన్- ఒక సెంచరీ సాయంతో 216 పరుగులు. ఇంగ్లండ్‌పై అఫ్గన్ గెలుపొందడంలో కీలక పాత్ర👉విరాట్ కోహ్లి- ఒక శతకం సాయంతో 218 పరుగులు. పాకిస్తాన్‌పై అజేయ సెంచరీ. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల మార్కు అందుకున్న క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు.👉శ్రేయస్ అయ్యర్- రెండు అర్ధ శతకాల సాయంతో 243 రన్స్. టీమిండియా చాంపియన్‌గా నిలవడంతో కీలక మిడిలార్డర్ బ్యాటర్‌గా రాణింపు.👉కేఎల్ రాహుల్- 140 పరుగులు. వికెట్ కీపర్‌గానూ సేవలు.👉గ్లెన్ ఫిలిప్స్- 177 పరుగులు. రెండు వికెట్లు, ఐదు క్యాచ్‌లు.👉అజ్మతుల్లా ఒమర్జాయ్- 126 రన్స్, ఏడు వికెట్లు.👉మిచెల్ సాంట్నర్- 4.80 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉మహ్మద్ షమీ- 5.68 ఎకానమీతో తొమ్మిది వికెట్లు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్.👉మ్యాట్ హెన్రీ- 5.32 ఎకానమీతో పది వికెట్లు👉వరుణ్ చక్రవర్తి- 4.53 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉అక్షర్ పటేల్- 4.35 ఎకానమీతో ఐదు వికెట్లు.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)

Dhoni- Rohit: స్వర్ణయుగం.. ఇద్దరూ ఇద్దరే! నాకు మాత్రం అదే ముఖ్యం!
భారత్ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)కి ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘ కాలం తర్వాత అతడి నాయకత్వంలోనే టీమిండియాకు మళ్ళీ ప్రపంచ కప్ విజయం లభించింది. 1983లో కపిల్ దేవ్(Kapil Dev) నేతృత్వంలోని తొలిసారి వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత్.. 2007 తర్వాత ధోని నాయకత్వంలో వరుసగా మూడు ఐసీసీ టైటిల్స్ సాధించింది. అయితే, సారథిగా ధోని నిష్క్రమణ తర్వాత భారత్ విజయ పరపంపరకి రోడ్‌బ్లాక్ పడింది. పదకొండు సంవత్సరాలు ట్రోఫీ లేకుండా మిగిలిపోయింది. ఇలాంటి కఠిన దశలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ(Rohit Sharma) 2024, 2025లో వరుసగా వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీ లను గెలిపించి భారత్‌కి కొత్త హీరో గా ఖ్యాతి వహించాడు.భారత క్రికెట్‌కు స్వర్ణయుగంవైట్-బాల్ క్రికెట్లో భారతదేశం తిరిగి తమ స్వర్ణ యుగానికి చేరుకుందా అంటే అవుననే చెప్పాలి. 2010ల ప్రారంభంలో ధోని చూపించిన నాయకత్వ లక్షణాలు ఇప్పుడు రోహిత్ శర్మ లో కూడా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ సాధించిన ఐసీసీ ట్రోఫీలను పరిశీలిస్తే ఇది కరక్టే అనిపిస్తుంది. ఎంఎస్ ధోని సహజంగా ఎక్కువగా మాట్లాడాడు. సరిగ్గా అవసరమైనప్పుడు తన నిర్ణయాలు, వ్యక్తిగత సామర్ధ్యం ఏమిటో చూపిస్తాడు. తన స్థాయి ఏమిటో తెలియజేస్తాడు.ఇప్పుడు రోహిత్ శర్మ సరిగ్గా అదే చేసి చూపించాడు. ఇక ట్రోఫీల పరంగా చూస్తే ధోని 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను భారలత్కి అందించాడు.ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వం లో భారత్ 2023లో వన్డే ప్రపంచ కప్ రన్నరప్‌గా నిలిచింది. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచింది. మళ్ళీ ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందింది.అప్పటి భారత జట్టు వెనుకబాటుకి కారణం?2014- 2022 మధ్య భారత్ జట్టు వెనుకడిందని చెప్పవచ్చు. నిజానికి టీమిండియాకు అపారమైన ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నా సరళంగా చెప్పాలంటే, వారు తమ బృందానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారు. ఈ కాలంలో భారత్ జట్టు ఐసీసీ ప్రధాన టోర్నమెంట్లలో నిలకడ గా ఆడి నాకౌట్ దశలకు చేరుకున్నప్పటికీ, ట్రోఫీ లను అందుకోవడంలో విఫలమైంది. ఫైనల్ కి చేరుకున్న జట్లని ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు.ట్రోఫీ గెలిస్తేనే ఆ జట్టు చరిత్రలో విజయం సాధించిన జట్టుగా కీర్తిని గడిస్తుంది. ధోని నాయకత్వంలో భారత్ జట్టు 2007 టీ20 ప్రపంచ కప్ విజయం ఊహించనిది. 2011లో భారత్ భారీ అంచనాల రీతి తగ్గట్టుగా ఆడి సొంత గడ్డ పై ప్రపంచ కప్‌ను సాధించింది. ఈ టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ , హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు భారత్ జట్టు విజయంలో కీలక భూమిక వహించారు.ఇక 2013 నాటికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మలతో కూడిన కొత్త తరం ఆటగాళ్లు భారత జట్టులోకి చేరారు. ఇంగ్లండ్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు ధోని వ్యూహాత్మక ప్రతిభ స్పష్టంగా కనిపించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు కొత్త ఫాస్ట్ బౌలర్ల ఆవిర్భావంతో అప్పుడు జట్టును బలోపేతం చేశారు.కాగా 2017లో విరాట్ కోహ్లీ వైట్-బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, అతడి టెస్ట్ విజయం పరిమిత ఓవర్ల ఆధిపత్యంగా మారలేదు. రెడ్-బాల్ క్రికెట్ పట్ల కోహ్లీకి స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ వైట్-బాల్ టోర్నమెంట్లలో కోహ్లీ అదే విజయ పరంపరను కొనసాగించలేకపోయాడు.రోహిత్ నాయకత్వంలో పునరుజ్జీవనంఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ మళ్ళీ మునుపటి విజయ పరంపరను కొనసాగించే స్థాయికి ఎదిగింది. 2007 పరాజయం తర్వాత ధోని భారత్ జట్టు ని ఎలా పునర్నిమించాడో ఇప్పుడు రోహిత్ తనదైన శైలి లో అదే చేసి చూపించాడు. జట్టు లో ఉత్తేజాన్ని పెంచాడు. ఎక్కడా తలవొగ్గ కుండా దూకుడుగా ఆడటాన్ని అలవాటు చేసాడు.2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, 2021 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన అవమానం, 2022లో ఇంగ్లండ్ చేతిలో జరిగిన సెమీ-ఫైనల్ ఓటమి వంటి హృదయ విదారక సంఘటనలు రోహిత్ మనస్తత్వంలో మార్పును రేకెత్తించాయి. భారత్ జట్టులో తీసుకురావాల్సిన మార్పును సరిగ్గా గుర్తించాడు.నాకు అదే ముఖ్యం2019 ప్రపంచ కప్ లో రోహిత్ ఐదు సెంచరీలు సాధించినప్పటికీ చివరికి ట్రోఫీ గెలువలేకపోవడం బాగా అసంతృప్తిని మిగిల్చింది. రోహిత్ వ్యక్తిగతంగా రాణించినప్పటికీ అది జట్టు విజయానికి దోహదం చేయలేదన్న బాధ అతన్ని కలిచివేసింది. “నేను 2019 ప్రపంచ కప్‌లో వ్యక్తిగతంగా బాగా రాణించాను. కానీ మేము ట్రోఫీ గెలవలేకపోయాం.ఆ సెంచరీల పరంపర, పరుగుల వరద నాకు సంతృప్తి ఇవ్వలేకపోయింది. వ్యక్తిగతంగా 30 లేదా 40 పరుగులు చేసినప్పటికీ ట్రోఫీ గెలిస్తే లభించే ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. అలా చేయడం నాకు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను" అని రోహిత్ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం వ్యాఖ్యానించడం అతని లోని పరిణతికి అద్దం పడుతుంది.విజయం అనేది ఒక వ్యసనం లాంటిది. భారత్ ఐసీసీ వైట్-బాల్ మ్యాచ్‌లలో ఇంతవరకు వరుసగా 24 మ్యాచ్‌లలో 23 గెలించిందంటే మామూలు విషయం కాదు. వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లను కైవసం చేసుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు చారిత్రాత్మక ట్రిపుల్‌పై దృష్టి పెట్టాడు. అంటే 2027 వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియాను విజయపథాన నడిపించాలని భావిస్తున్నాడు. అదే జరిగితే రోహిత్ శర్మ ఎంఎస్ ధోని నాయకత్వ రికార్డుని సమం చేసినట్టే!ఇక ఓవరాల్‌గా కెప్టెన్లుగా ధోని- రోహిత్ రికార్డులు చూస్తే ఇద్దరూ చెరో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచారు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున.. రోహిత్ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు. ఆసియాకప్ టోర్నమెంట్లోనూ రెండుసార్లు టీమిండియాను విజయపథంలో నిలిపారు. ధోని 2010, 2016.. రోహిత్ 2018, 2023లో టైటిల్స్ గెలిచారు. ఇక చాంపియన్స్ లీగ్ ట్రోఫీలో ధోని రెండుసార్లు (2010, 2014).. రోహిత్ ఒకసారి(2013) టైటిల్ సాధించారు.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి!
బిజినెస్

48 గంటల్లో 20000 బుకింగ్స్
మార్చి 5న అల్ట్రావయొలెట్ కంపెనీ తన టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. సంస్థ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన 48 గంటల్లో రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ స్వీకరించింది.అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 48 గంటల్లో 20,000 కంటే ఎక్కువ ప్రీ-బుకింగ్‌లను పొందింది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రారంభ పరిచయ ధరను (రూ. 1.20 లక్షలు) 10000 నుంచి 50000 యూనిట్లకు పెంచింది. అంటే మొదటి 50వేలమందికి మాత్రమే ఆ ధర వర్తిస్తుంది. ఆ తరువాత దీని ధర రూ. 1.45 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరుకుంటుంది.అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి. దీనిని రూ. 999 కు ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫుల్ ఛార్జితో 261 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. కేవలం 100 రూపాయలతో రెండుసార్లు ఛార్జ్ చేయడం ద్వారా 500 కిలోమీటర్ల పరిధిని సాధించగలదని అల్ట్రావయోలెట్ పేర్కొంది.ఇదీ చదవండి: ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదంటే?టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆన్‌బోర్డ్ నావిగేషన్‌తో కూడిన 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు డాష్‌క్యామ్‌లు (ముందు, వెనుక), వైర్లెస్ ఛార్జింగ్, హ్యాండిల్‌బార్ కోసం హాప్టిక్ ఫీడ్‌బ్యాక్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, డ్యూయల్ డిస్క్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి పొందుతుంది.టెస్సెరాక్ట్ అనేది రాడార్ బేస్డ్ ADAS టెక్నాలజీతో కూడిన భారతదేశపు మొట్టమొదటి స్కూటర్. ఇది బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్టేక్ అలర్ట్, కొలిజన్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ఫ్లోటింగ్ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లతో కూడిన డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్ పొందుతుంది. దీని అండర్ సీట్ స్టోరేజ్ 34 లీటర్లు.

గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు?
నిర్దిష్ట ఆదాయం కంటే ఎక్కువ సంపాదన ఉన్నప్పుడు.. మన దేశంలో ట్యాక్స్ చెల్లించాలి. పాత ఆదాయపు పన్ను విధానం ప్రకారం.. ట్యాక్స్ రిబేట్ రూ. 5 లక్షలుగా ఉండేది. కొత్త పన్ను విధానం ప్రకారం ఇది రూ. 12 లక్షలకు చేరింది. ఆదాయపన్ను చట్టం 1961 కింద.. కొత్త, పాత పన్ను విధానాల కింద ఏది ఎంచుకుంటే.. ఆ శ్లాబుల ప్రకారం ట్యాక్స్ చెల్లించాలి.పన్ను మినహాయింపు పరిమితి దాటితే.. ఐటీఆర్ ఫైల్ చేయాలి. కొందరు దీనిని పెడచెవిన పెడుతున్నారు. అంటే ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. అలాంటి వారిని ఇప్పుడు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటికే ట్యాక్స్ కట్టకుండా ఉన్నవారి లిస్ట్ కూడా తయారు చేసుకుంది. సదరు వ్యక్తులకు నోటీసులు కూడా అందుతాయి.ఎవరైతే ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నారో.. వారిపైన సెక్షన్ 148ఏ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు లిస్ట్ చేసిన వారు 2018-19, 2019-20, 2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ చెల్లించకుండా ఉన్నవారు అని తెలుస్తోంది. ఇప్పటికే కొందరికి నోటీసులు పంపినట్లు చెబుతున్నారు.పన్ను కట్టకుండా తప్పించుకునే వారిని గుర్తించడానికి ఏఐఎస్, టీడీఎస్/టీసీఎస్ స్టేట్మెంట్స్, ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్ స్టేట్మెంట్ వంటి వాటిని ఆదాయపన్ను శాఖ తనిఖీ చేస్తుంది. వీటి ద్వారానే ఎవరు పన్ను కడుతున్నారు, ఎవరు కట్టడం లేదనే విషయాలను తెలుసుకుంటుంది. పన్ను ఎగ్గొట్టే వారిని గుర్తించి.. వారికి నోటీసులు జారీ చేస్తుంది.ఇదీ చదవండి: రన్యా రావు కేసు.. దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చంటే?ఎవరైతే పన్ను చెల్లించకుండా.. తప్పించుకుంటున్నారో వారికి నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే కండొనేషన్ ఆఫ్ డిలేకు అప్లై చేసుకుని లేదా వడ్డీతో కలిపి ట్యాక్స్ పూర్తిగా చెల్లించినట్లయితే.. బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

బ్యాంకులకు వరుస సెలవులు: ఎందుకో తెలుసా?
ఈ నెలలో (మార్చి 2025) దాదాపు పది రోజుల కంటే ఎక్కువ బ్యాంకు సెలవులు ఉన్నాయి. కాగా ఈ ఒక్క వారంలోనే వరుస సెలవులు వస్తున్నాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలవులు ఉన్నాయి, ఆ సమయంలో ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయా? అనే వివరాలు తెలుసుకుందాం.మార్చి రెండో వారం కూడా మొదలైపోయింది. ఈ వారంలో 13 నుంచి 16వరకు వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వరుస సెలవులు రావడం చేత.. తప్పకుండా బ్యాంకులకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులను ముందుగానే పూర్తి చేసుకోవచ్చు. ఆలస్యమైనా పరవాలేదు అనుకున్నప్పుడు.. ఎప్పుడు బ్యాంకులు మూసి ఉంటాయి అనే విషయం తెలుసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.➤మార్చి 13 (గురువారం): మార్చి 13న హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ కారణంగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.➤మార్చి 14 (శుక్రవారం): హోలీ పండుగ సందర్భంగా.. త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సెలవు.➤మార్చి 15 (శనివారం): కొన్ని రాష్ట్రాలు మార్చి 14కి బదులుగా మార్చి 15న హోలీని జరుపుకుంటాయి. ఈ జాబితాలో త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్ ఉన్నాయి.➤ మార్చి 16 (ఆదివారం); ఆదివారం కావడం చేత దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది).

ఐఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్స్!
భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (మార్చి 7 నుంచి 13 వరకు) ప్రారంభమైంది. ఇందులో భాగంగా లేటెస్ట్ ఐఫోన్ 16, ఐఫోన్ 15 మోడళ్లపై డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది. ఈ తగ్గింపులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఐఫోన్ 16 సిరీస్ ఆఫర్లుఐఫోన్ 16 బేస్ వేరియంట్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,900 నుంచి 68,999 రూపాయలకు చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ కింద రూ. 4000, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ. 5000 తగ్గింపును పొందవచ్చు. అంటే ఇప్పుడు ఐఫోన్ 16ను రూ. 59,999లకు సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎమ్ఐ కూడా రూ. 10,000 నుంచి ప్రారంభమవుతుంది.కొత్తగా విడుదలైన ఐఫోన్ 16e ధర రూ. 59,900. అయితే ఇది ఇప్పుడు 55,900 రూపాయలకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,900 నుంచి రూ. 78,999కు చేరింది. ఐఫోన్ 16 ప్రో రూ. 1,19,900 నుంచి రూ. 1,08,900కు & ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అసలు ధర రూ. 1,44,900 కాగా, సేల్‌లో భాగంగా రూ. 1,31,900కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, ఇతర ప్రయోజనాలను ఉపయోగించుకుంటే.. వీటి ధరలు మరింత తగ్గుతాయి.ఐఫోన్ 15 సిరీస్ ఆఫర్లుఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 14 వరుసగా రూ. 60,999, రూ. 64,999 & రూ. 50,999 ప్రారంభ ధరలకు అందుబాటులో ఉన్నాయి. సాధారణ డిస్కౌంట్లతో పాటు, కొనుగోలుదారులు నో కాస్ట్ ఈఎమ్ఐ ఎంపికలు, స్టాండర్డ్ ఈఎమ్ఐ ఎంపికలు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, కూపన్ ఆధారిత డిస్కౌంట్లను సేల్‌లో పొందవచ్చు.
ఫ్యామిలీ

పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..?
వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ సామర్థ్యం కూడా తగ్గుతుంటుంది. అది సర్వసాధారణం. అయితే అలా కాకుండా బాడీపై వచ్చే వృద్ధాప్య లక్షణాలకు ఎలా అడ్డుకట్టవేస్తామో అలాగే బ్రెయిన్ సామర్థ్యం వృద్ధాప్యం బారిన పడకుండా ఎలా సంరక్షించుకోవాలనే దిశగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. తాజా అధ్యయనంలో చాలా అవాక్కయ్యేలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంపెడుమంది పిల్లలు ఉంటే బాధ్యతలు ఎక్కువై మతిమరుపు, త్వరితగతి వృద్ధాప్యం బారినపడటం జరుగుతుదనేవారు. కానీ అది అవాస్తమట. పరిశోధన ఏం చెబుతుందో తెలిస్తే.. అసలు ఇదెలా అని విస్తుపోవడం ఖాయం. మరీ పరిశోధనలో వెలుగు చూసిన ఆ షాకింగ్ విషయాలేంటో చూద్దామా..!.ఈ సరికొత్త పరిశోధన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS)లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం పిల్లలను కలిగి ఉన్నవాళ్లకు మెదడు ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుందని తేల్చింది. అందుకోసం శాస్త్రవేత్తలు దాదాపు మూడు వేల మందికిపైగా తల్లిదండ్రుల మెదడు పనితీరుపై పరిశోధనలు చేయగా ఈ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలసట, ఒత్తిడి అనేవి తల్లిదండ్రులైన వాళ్లలో కంటే పిల్లలు లేని తల్లిదండ్రులలోనే ఎక్కువగా కనిపించాయట. పిల్లలు ఉండటం అనేది వ్యక్తిగత జీవితాన్ని సుసంపన్నం చేసి అహ్లదభరితంగా చేస్తుందట. సాధారణంగా పేరెంట్స్ శారీరక శ్రమని పరస్పర సహకారంతో సునాయసంగా అధిగమించగలుగుతారని పరిశోధన నొక్కి చెబుతోంది. ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రుల మెదడు మంచి క్రియెటివిటి కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా పేర్కొంది అధ్యయనం. ఈ పరిశోధనలలో తల్లిదండ్రుల్లో తండ్రిని మినహాయించాయి. ఎందుకంటే వారు శారీరకంగా గర్భం ధరించరు, ప్రసివించరు, తల్లిపాలు ఇవ్వరు కాబట్టి తల్లులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కోన్నారు పరిశోధకులు. అయితే ఈ అధ్యయనంలో దాదాపు 17 వేలకు పైగా పురుషులు కూడా పాల్గొన్నారని అన్నారు.అయితే ఈ పరిశోధన పిల్లల పుట్టుక, వారి పెంపకం, పెరిగిన అదనపు బాధ్యతలు మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నాయి. అయితే లేటు వయసులో తల్లిదండ్రులైన వారిలో తక్కువ మెరుగైన ఫలితాలే కనిపించాయన్నారు. తల్లిదండ్రులుగా వారి పిల్లల బాధ్యతే వారి మెదడుని వృద్ధాప్యం బారిన పడకుండా శ్రీరామరక్షలా కాపాడతుందని అధ్యయనం చెబుతోంది. అంతేగాదు ఈ పరిశోధనకు కీలకమైన శాస్త్రవేత్త అవ్రామ్ హోమ్స్ ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంతలా వారి మెదుడు సురక్షితంగా ఉంటుందని చెప్పడం విశేషం. ఇది వరకు పిల్లల బాధ్యతల కారణంగా జుట్టు ఊడిపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి జరుగతాయని ప్రగాడంగా భావించేవారు అంతా. అయితే అదంతా అవాస్తమని కొట్టిపారేసింది తాజా అధ్యయనం. కానీ ఈ అధ్యయనంలో పాల్గొన్నవారంతా యూకేకి చెందిన వాళ్లే కావడంతో మరిన్ని కచ్చితమైన ఫలితాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరెంట్స్‌పై పరిశోధన చేయాల్సి ఉందని అన్నారు శాస్త్రవేత్తలు. దీంతోపాటు పిల్లల పెంపకం అనేది బ్రెయిన్ వృధ్యాప్యాన్ని ఎలా నివారిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు. ఈ పరిశోధన గనుక నిజమైతై ఒటరితనం, చిత్తవైకల్యం వంటి సమస్యలను ఎలా అధిగమించాలనేందుకు కచ్చితమైన పరిష్కారం కనుగొనేందుకు మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: పదకొండేళ్లకే బీఎస్సీ, 21 ఏళ్లకే పీహెచ్డీ..! మాజీ సీఎం లాలు యాదవ్, ప్రదాని మోదీ..)

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

పదకొండేళ్లకే బీఎస్సీ, 21 ఏళ్లకే పీహెచ్డీ..!
కొందరు చిన్న వయసులోనే అసాధారణ తెలివితేటలు, ప్రతిభ సామర్థ్యంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఈ అసామాన్య వ్యక్తులు అందరిలా కాకుండా చిన్న వయసులోనే పెద్ద పెద్ద డిగ్రీలు పూర్తి చేసి శెభాష్ అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే తథాగత్ అవతార్ తులసి. అతడి అసామాన్య ప్రతిభ గురించి తెలిస్తే నోటమాట రాదు. మరీ అతడి ప్రతిభాపాటవాలేంటో చూద్దామా..!.ఆ అసామాన్యుడే తథాగత్ అవతార్ తులసి. ఆయన సెప్టెంబర్ 9, 1987న బిహార్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తథాగత్ చిన్నప్పటి నుంచి తన అసాధారణ మేథాతో అందర్నీ ఆశ్చర్యపరిచేవాడు. అలా తథాగత్ 9 ఏళ్లకే పాఠశాల విద్యను పూర్తి చేశాడు. 11 ఏళ్లకు బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇక 12 ఏళ్లకే ఎంఎస్సీ పూర్తి చేసి, 21 ఏళ్లకే డాక్టరేట్‌ని పొందాడు. ఆ విధంగా 22 ఏళ్ల వయసుకే ప్రతిష్టాత్మక ఐఐటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్ అయ్యాడు. ఈ అపార ప్రతిభాశాలి పీహెచ్‌డీలో క్వాంటం సెర్చ్ అల్గారిథంపై పరిశోధన చేసి మంచి పేరుతెచ్చుకున్నాడు. అంతేగాదు తథాగత్ ప్రఖ్యాత శాస్త్రవేత్త లవ్ గ్రోవర్తో కలిసి ఒక పరిశోధనా పత్రాన్ని కూడా రచించాడు అయితే అది ఏ జర్నల్‌లోనూ ప్రచురితం కాలేదు. అయితే ప్రస్తుతం ఆయన 2019లో ఐఐటీ బాంబే నుంచి తొలగించబడ్డారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఉద్యోగ పోరాటం చేస్తున్నారు. 2011లో తథాగత్ తీవ్ర జ్వరం బారినపడీ అలెర్జీకి గురయ్యాడు. ఆ అనారోగ్యం చాలా ఏళ్ల పాటు కొనసాగడంతో సుదీర్ఘ సెలవు తీసుకున్నాడు. చివరికి 2013లో ముంబై విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. ఆ కారణాల వల్లే 2019లో తథాగత్ ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోయాడు. తన అనారోగ్య సమస్యల కారణంగా ముంబైలో నివసించడం సాధ్యం కాదని, తనని ప్రత్యేక కేసు కింద IIT ఢిల్లీకి బదిలీ కోసం అభర్థిస్తున్నారు తథాగత్. అందుకోసం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించనున్నట్లు సమాచారం. చివరగా తథాగత్ మాట్లాడుతూ..క్వాంటం కంప్యూటర్ల రంగం పరంగా నాదేశం అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ అంశంపైనే చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నాను. కేవలం 17 ఏళ్ల వయసులో లవ్ గ్రోవర్ మార్గదర్శకత్వంలో దీనిపై పనిచేయడం ప్రారంభించాను. తన పరిశోధన ప్రొఫైల్ ముందు బాగానే ఉంది. ఆ తర్వాత తన అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ పరిశోధనపై ఫోకస్ పెట్టలేకపోయానని వాపోయారు. కానీ ఇప్పుడు తాను క్వాంటం కంప్యూటర్ల రంగానికి తోడ్పాలని కోరుకుంటున్నానని అన్నారు. అదీగాక మన భారతదేశంలో క్వాంటం కంప్యూటర్లపై రూ. 8 వేల కోట్లు ఆంక్షలు ఉన్నాయి. కావున ఆ సమస్యకు చెక్‌పెట్టేలా ఈరంగంలో మంచి విప్లవం తీసుకురాగలనని ధీమాగా చెప్పారు తథాగత్ .సత్కారాలు, అవార్డులు..1994లో, తథాగత అవతార్ తులసిని అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సత్కరించారు. ఆయన సాధించిన విజయానికి బహుమతిగా ఆయనకు కొంత డబ్బుని పారితోషకంగా ఇచ్చారు. కానీ తథాగత్ ఆ డబ్బుని తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆయనకు ఒక మంచి కంప్యూటర్ని బహుమతిగా ఇచ్చారు. అది ఆయనకు మరిన్ని గొప్ప విజయాలను సాధించడానికి సహాయపడింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం తథాగత్ సాధించిన విజయాలకు అబ్బురపడటమే గాక అతడిని ఘనంగా సత్కరించారు కూడా. (చదవండి: అంతా జేమ్స్ బాండ్ హీరో హీరో సెవన్‌గా కీర్తిస్తారు..కానీ ఆయన..!)

బౌద్ధవిహారం: బిహార్‌కి ఆ పేరు ఎలా వచ్చిందంటే..?
బిహార్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? చారిత్రక– పౌరాణిక సాహిత్యంలో ఈ ప్రదేశం ఉంది. కానీ...అప్పట్లో ఈ ప్రదేశం పేరు బిహార మాత్రం కాదు. చాణుక్యుడు పుట్టాడు... కానీ అతడి పేరు రాలేదు. ఆర్యభట్ట పుట్టాడు... అతడి పేరూ రాలేదు. అశోకుడు పాలించాడు... ఆ చక్రవర్తి పేరూ రాలేదు. బుద్ధుడు విహరించిన ఈ ప్రదేశం బుద్ధవిహారగా పేరు తెచ్చుకుంది.. బౌద్ధ విహారాలు... చైత్యాల నిలయం బౌద్ధవిహారగా స్థిరపడింది. స్థానిక భాషల్లో విహార... బిహారగా వాడుకలోకి వచ్చింది. నాడు బుద్ధుడు విహరించిన బుద్ధవిహారయే నేటి మన బిహార్. గంగా తీరాన నడక... నదిలో డాల్ఫిన్ వీక్షణం ఈ టూర్లో బోనస్.నలంద విద్యాలయంనలంద విశ్వవిద్యాలయం మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ్ర΄ాచీన విశ్వవిద్యాలయాల్లో ఒకటి, తొలి రెసిడెన్సియల్ యూనివర్సిటీ ఇదే. ఈ బౌద్ధ మహావిహారకు విద్యాభ్యాసం కోసం క్రీ.శ ఐదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు దేశవిదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. వారు నివసించడానికి ఒక్కొక్కరికి ఒక్కో గది, ఆ గదిలో గోడలకు ఒక వైపు పుస్తకాల అర, మరొక గోడకు దుస్తులు పెట్టుకునే వెసులుబాటు ఉండేవి. ప్రతి గది బయట నీరు వెలుపలకు వెళ్లడానికి నిర్మాణంలోనే పైపుల ఏర్పాటు ఉండేది. పౌర్ణమి రోజు చంద్రుడి వెలుతురు పడి ప్రకాశించే చంద్రశిలలను చూడవచ్చు. క్లాసు రూముల ఏర్పాటు చాలా సమగ్రంగా ఉంటుంది. అందరూ నేల మీదనే కూర్చోవాలి. అయితే ఆచార్యులు కూర్చునే పీఠం వంటి స్థానం, విద్యార్థులు ఒకరికొకరు మూడడుగుల దూరంలో కూర్చునే విధంగా ఉంది నిర్మాణం. భక్తియార్ ఖిల్జీ హయాంలో ఇక్కడ తాళపత్ర గ్రంథాలను రాశి΄ోసి తగుల పెట్టిన చోట ఇటుకలు కూడా నల్లగా మాడి΄ోయి ఉన్న గోడలను చూపిస్తారు గైడ్లు. ఇక్కడ దుకాణాల్లో పెన్నులు నలంద, రాజ్‌గిర్ వంటి బౌద్ధ క్షేత్రాల పేర్లతో ఉంటాయి. టూర్‌కి గుర్తుగా తెచ్చుకోవచ్చు, స్నేహితులుగా బహుమతులుగా ఇవ్వవచ్చు. ఇది పట్నాకు 70 కిలోమీటర్ల దూరాన ఉంది. పట్నా నుంచి బయలుదేరిన తర్వాత నలంద పర్యటన పూర్తి చేసుకుని రాజ్‌గిర్‌కు వెళ్లాలి. నలంద మహావిహారను చూసిన తర్వాత సూర్యమందిర్, చైనా యాత్రికుడు హ్యూయాన్ త్సాంగ్ మందిరాన్ని కూడా చూడాలి. ఈ ఆలయం ఒక చరిత్ర పుస్తకానికి దృశ్యరూపం. వీటి తర్వాత చూడాల్సిన ప్రదేశం ఆర్కియలాజికల్ మ్యూజియం.మహాబోధిగయ బోద్‌గయకు ఆ పేరు రావడానికి కారణం మహాబోధి వృక్షమే. సిద్ధార్థ గౌతముడు ఈ బోధి చెట్టు కింద ధ్యానం చేశాడు. అతడికి జ్ఞానోదయమై బుద్ధుడిగా మారిన ప్రదేశం ఇది. యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ఈ బోధి వృక్షాన్ని చూస్తే ఆశ్చర్యంతోపాటు క్రీస్తు పూర్వం ఐదు వందల ఏళ్ల నాటి వృక్షమా అనే సందేహం కలుగుతుంది. ఆ సందేహంలో అర్థం ఉంది. బుద్ధుని కాలం నాటి మహాబోధి వృక్షం మతహింసలో భాగంగా అగ్నికి ఆహుతై΄ోయింది. ఆ స్థానంలో శ్రీలంక నుంచి తెచ్చి నాటిన మొక్క ఇప్పుడు మహావృక్షమైంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే... శ్రీలంకలోని అనూరాధపురను ΄ాలిస్తున్న రాజు దేవానాం ప్రియ తిస్స బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యాడు. బౌద్ధ పట్ల అవగాహన కోసం అశోక చక్రవర్తిని కోరాడు. అశోకుడు బౌద్ధ ప్రచారంలో భాగంగా తన కూతురు సంఘమిత్ర, కొడుకు మహేంద్రను శ్రీలంకకు పంపించాడు. శ్రీలంకకు వెళ్లేటప్పుడు సంఘమిత్ర ఈ మహాబోధి నుంచి సేకరించిన మొక్కను తీసుకెళ్లి దేవానాం ప్రియ తిస్సకు బహూకరించింది. ఆ మొక్కను అనూరాధ పురలో నాటారు. బోధగయలోని మూలవృక్షం స్థానంలో శ్రీలంక బోధి వృక్షం నుంచి మొక్కను తెచ్చి నాటారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న బోధి వృక్షం. ఈ వృక్షం పక్కనే మహాబోధి ఆలయం ఉంది. బౌద్ధం పరిఢవిల్లుతున్న భూటాన్, థాయ్‌లాండ్ వంటి అనేక దేశాల మోనాస్ట్రీలు కూడా బోద్‌గయలో ఉన్నాయి. వీటిలో వ్యక్తమయ్యే సంపన్నతను చూసినప్పుడు బుద్ధుడు చెప్పిన నిరాడంబరత కోసం బౌద్ధంలో ఆశించకూడదనిపిస్తుంది. ఈ ప్రదేశం బిహార్ రాజధాని నగరం పట్నా నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. గయకు 15 కిలోమీటర్ల దూరం. ఈ టూర్లో చూడాల్సిన మరో ప్రదేశం నిరంజన నది. బుద్ధుడు ధ్యానంలో ఉన్న కాలంలో తరచూ ఈ నదికి వెళ్లేవాడు. స్థానికులు ఫాల్గు నదిగా పిలుస్తారు. వైశాలి గత వైభవంబుద్ధుడు తన జీవితకాలంలో ఎక్కువ కాలం ( మూడు దఫాలు) వైశాలిలో జీవించాడు. తన చివరి బోధనను వెలువరించాడు. బుద్ధుడి అవశిష్టంతో ఇక్కడ ఒక స్థూపాన్ని నిర్మించారు. ఈ ప్రదేశంలో అశోకుడు ఏకసింహం స్థూపాన్ని నిర్మించాడు. మ్యూజియం కూడా ఉంది. ఈ ప్రదేశం ఒకప్పుడు లిచ్ఛవుల రాజధాని. ఆసియా ఖండంలో తొలి రిపబ్లిక్ స్టేట్ కూడా ఇదే. వైశాలి గత వైభవం విశాలమైనదే కానీ ఇప్పుడిక్క బౌద్ధ విశిష్ఠతలు మినహా మరే ప్రత్యేకతలూ కనిపించవు. జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు పుట్టిన ప్రదేశం కూడా ఇదే. చిన్న జైన మందిరం కూడా ఉంది.విక్రమశిల మహావిహారఇది కూడా భక్తియార్ ఖిల్జీ చేతిలో ధ్వంసమైన ప్రాచీన విశ్వవిద్యాలయం. మనదేశంలో ఉన్న ప్రధానమైన బౌద్ధ మహావిహారల్లో మూడు బీహార్లోనే ఉన్నాయి. విక్రమశిల... వందకు పైగా గురువులు, వెయ్యికి పైగా విద్యార్థులతో విలసిల్లిన విద్యాలయం. తత్వం, వ్యాకరణం, ఆధిభౌతికం, తర్కశాస్త్రాలను బోధించేవారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఆసియా ఖండంలో బౌద్ధాన్ని విస్తరించారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ యూనివర్సిటీ శిథిలాలను భద్రపరిచి పునరుద్ధరించే పనిలో ఉంది. చారిత్రక జ్ఞాపకాల గౌరవార్థం ప్రభుత్వం నలంద, విక్రమశిల పేర్లతో కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది. లోకల్ ఆటో రిక్షా, కార్ ట్యాక్సీల వాళ్లతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా చెప్పాలి.ఓదంతపురి చదువుల క్షేత్రంమనదేశంలో ప్రసిద్ధమైన బౌద్ధ మహావిహారలు మూడు. నలంద, విక్రమశిల, ఓదంతపురి విహారలు. నలంద తర్వాత రెండవ విశ్వవిద్యాలయం ఓదంతపురి. ఇది బీహార్ షారిఫ్లో ఉంది. పట్నా– రాజ్‌గిర్ రైల్వేలైన్‌లో వస్తుంది. ఈ మహావిహార కూడా టర్కీ నుంచి వచ్చి భారత్ మీద దాడి చేసిన ఖిల్జీ చేతిలో ధ్వంసమైనదే. ఇక్కడ బౌద్ధ క్షేత్రానికి సంబంధించిన ప్రాధాన్యత తప్ప మరే ప్రత్యేకతలూ లేక΄ోవడంతో పర్యాటకపరంగా సౌకర్యాలు తక్కువ.సారనాథ్ రాజముద్ర బుద్ధుడు తొలి ప్రవచనాన్ని వెలువరించిన ప్రదేశం సారనాథ్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహణలో ఉంది. ఇక్కడి స్థూపం పరిరక్షణ పనులు పూర్తి చేసి పర్యాటకులకు ప్రవేశం కల్పించారు. మనం అధికారిక ముద్రగా స్వీకరించిన నాలుగు సింహాల పిల్లర్ ఇక్కడిదే. అయితే అసలు పిల్లర్‌ని మ్యూజియానికి తరలించారు. నమూనాలు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఈ టూర్‌కి ఐఆర్సీటీసీ ప్యాకేజ్ సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్యాకేజ్‌లో సారనాథ్(ఉత్తరప్రదేశ్), బుద్ధుడు పుట్టిన లుంబిని (నేపాల్), మహాపరినిర్వాణం పొందిన కుశినగర (ఉత్తరప్రదేశ్) కూడా కవర్ అవుతాయి.రాజ్‌గిర్ విశ్వశాంతి కిరణంఇది మహాభారత కాలం నుంచి ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రదేశం. జరాసంధుని రాజ్యం గిరివ్రజ. పాండవ మధ్యముడు భీముడితో జరాసంధుడు యుద్ధం చేసిన ప్రదేశంగా చెబుతారు. జైనులకు కూడా ఇది ప్రముఖ ప్రదేశమే. 24వ తీర్థంకరుడు మహావీరుడు (ముని సువ్రత) పద్నాలుగేళ్లు నలంద, రాజ్గిర్లలో జీవించాడు. మగధ రాజ్యానికి తొలినాళ్లలో రాజధాని ఇదే. రాజగృహ అని పిలిచేవాళ్లు. ఇక్కడ అనేక రాజ్యాల రాజుల సమావేశంలో బుద్ధుడు బౌద్ధాన్ని బోధించాడు. రాజ్‌గిర్ విశ్వశాంతి స్తూపం నుంచి కనిపించే గ్రద్ధకూట పర్వతం మీద బుద్ధుడు కొంతకాలం ధ్యానం చేసుకున్నాడు. సప్తపర్ణి గుహలో బౌద్ధ సమావేశాలు జరిగేవి. సమీపంలోని వేణుబన్ (వెదురు వనం)లో సాంత్వన దేవాడు. శిష్యులు, సామాన్యులతోపాటు మగధ రాజు బింబిసారుడికి కూడా ఇక్కడే బోధనలు చేశాడు. విశ్వశాంతిని కోరుతూ బుద్ధుడు చేసిన బోధనలకు ప్రతీకగా ఆ ప్రదేశంలో తెల్లటి అందమైన శాంతిస్థూపాన్ని నిర్మించారు. ఈ కొండ మీదకు వెళ్లడానికి రోప్‌వే ఉంటుంది. ఈ రోప్‌వే బకెట్ ఒక్కరు మాత్రమే కూర్చునేటట్లు ఉంటుంది. కొండ మీదకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి. (చదవండి: వన్ లెగ్డ్ జీన్స్..! ఇదేం ఫ్యాషన్ ట్రెండ్..)
ఫొటోలు
International View all

అమెరికా ఉత్పత్తులపై 15% టారిఫ్‌లు ప్రకటించిన చైనా
వాషింగ్టన్: చైనా ఉత్పత్తులపై 20 శాతం టారిఫ్‌లు విధిస్తూ అమె

కెనడా తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ
టొరంటో: కెనడా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా గతంలో సేవలందించి

లలిత్ మోదీ పాస్‌పోర్ట్ రద్దు
పోర్ట్ విలా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాజీ వ్యవస్

ఇంగ్లండ్ తీరంలో రెండు నౌకలు ఢీ
లండన్: ఇంగ్లండ్ తూర్పు తీరంలో ఆయిల్ ట్యాంకర్, సరుకు నౌక ఢ

USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?
వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ
National View all

సుప్రీం జడ్జిగా బాగ్చీ నియామకం
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ జాయ్మాల్య బాగ్చ

తమిళులు అనాగరికులు!
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు, తమిళనాడులోని అధికార డీఎంకేకు మధ్

ఈసీ తీరుపై... అన్నీ అనుమానాలే!
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా అవకతవకలు, నకిలీ ఓటర్ కార్డ

మాటలతో హింసిస్తున్నారు.. బెదిరిస్తున్నారు: కోర్టులో రన్యారావు
బెంగళూరు: గోల్డ్ స్మగ్మింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం డీఆర్ఐ క

పట్టపగలే దొంగల ముఠా బీభత్సం.. భారీ దోపిడీ!
పాట్నా: బీహార్ రాష్ట్రంలో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం స్ప
NRI View all

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?
వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

ఈ ఏడాది హెచ్1బీ వీసాలు కష్టమే
సాక్షి, అమరావతి: అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న హెచ్
క్రైమ్

ఆర్థిక ఇబ్బందులకు కుటుంబం బలి!
లాలాపేట (హైదరాబాద్): ఆర్థిక ఇబ్బందులకు నలుగురు సభ్యుల కుటుంబం బలైన విషాద సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు, అంతకుముందు తమ ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (40), కవితారెడ్డి (35) దంపతులు హబ్సిగూడ మహేశ్వర్‌నగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీతరెడ్డి (13), ఐదవ తరగతి చదువుతున్న విశ్వంత్‌రెడ్డి (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి గతంలో నారాయణ కళాశాలలో లెక్చరర్‌గా పని చేశాడు. గత ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.సోమవారం రాత్రి సమీపంలో ఉండే బంధువులు ఫోన్ చేస్తే దంపతులు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా చంద్రశేఖర్‌రెడ్డి, కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరి వేసుకుని కన్పించారు. ఓ గదిలో మంచంపై పిల్లలిద్దరూ చనిపోయి కన్పించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు, నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీత అబిడ్స్‌లోని ఫిట్జీ స్కూల్లో, విశ్వంత్ హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నట్లు తెలిసింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. సజీవదహనమైన తల్లి, కుమారుడు..
కర్ణాటక: చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. సొంతూరులో బంధువులను పలకరించి సంతోషంగా బెంగళూరుకు(Bangalore) వస్తున్న కుటుంబంలో విషాదం చిందింది. తల్లీ కుమారుడు సజీవ దహనమయ్యారు. చింతామణి సమీపంలోని కంచార్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మదనపల్లి రోడ్డులో జోగ్యానహళ్లి–గోపల్లి మధ్య ఆదివారం ఉదయం 10 గంటలప్పుడు దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న బ్యాలెనో కారును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో కారు మంటల్లో కాలిపోయింది. బంధువుకు కొడుకు పుట్టాడని.. వివరాలు.. ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy)(30), ఆయన తల్లి కళావతి (52), ధనుంజయరెడ్డి భార్య శోభారాణి, కొడుకు మాన్విత్ రెడ్డి (3), శోభారాణి తల్లి మహాలక్ష్మీ కారులో బెంగళూరుకు బయల్దేరారు. ధనుంజయరెడ్డి కారు నడుపుతున్నారు. ఆయన తండ్రి గోపాల్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కడప నగరంలోని రాఘవేంద్ర టౌన్ షిప్లో నివాసముంటూ ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తున్నారు. ధనుంజయరెడ్డి, భార్య ఐటీ ఉద్యోగులు కాగా, బెంగళూరు మహదేవపురలో నివాసముంటున్నారు. కడపలో శోభారాణి అన్న సుబ్బారెడ్డికి కొడుకు పుట్టడంతో శనివారం అందరూ వెళ్లి చిన్నారిని చూసి సంతోషంగా గడిపారు. బెంగళూరుకు తిరిగి వస్తుండగా చింతామణి దగ్గర ఎదురుగా బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న శ్రీ భారతి ప్రైవేటు బస్సు వేగంగా కారును ఢీకొట్టింది. కారు రోడ్డు పక్కన పడి మంటల్లో చిక్కుకుంది. అప్పటికే కారులోని వారు బయటకు ఎగిరిపడ్డారు. ధనుంజయరెడ్డి, తల్లి కళావతికి మంటలు అంటుకుని సజీవ దహనమయ్యారు. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు కూడా బోల్తా పడింది. అందులోని కొందరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కారు పూర్తిగా దగ్ధం స్థానికులు చేరుకుని క్షతగాత్రులకు సాయం చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసేటప్పటికి కారు పూర్తిగా దహనమైంది. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి, డీఎస్పీ మురళీధర్, సీఐ వెంకటరమణప్ప తదితరులు పరిశీలించారు. మృతదేహాలకు చింతామణి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. శోభారాణి, కొడుకు మన్విత్, మహాలక్ష్మీలకు ప్రథమ చికిత్స నిర్వహించి బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పతి దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి.

Chittoor: ‘నా భర్తను కొట్టి చంపేశారు’
పుత్తూరు: తన భర్తను కొట్టి చంపేశారని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షంచాలంటూ భార్య ఆక్రందనలతో పుత్తూరు ఆసుపత్రిలో మిన్నంటాయి. పుత్తూరు పట్టణ పరిధిలోని చినరాజుకుప్పం గ్రామంలో ఆదివారం సాయంత్రం గ్రామానికి చెందిన మణికంఠ(29) రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించిన ఓ మహిళ అరుస్తూ వెళ్లి గ్రామస్తులకు తెలిపింది. వెంటనే గ్రామస్తులు 108కు సమాచారం అందించి పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అప్పుడే పుత్తూరులో బస్సు దిగిన మృతుడి భార్యకు విషయం తెలియడంతో ఆసుపత్రిలో భర్త మృతదేహాన్ని చూసిన ఆమె బోరున విలపించింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు... చినరాజుకుప్పం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు కుమారుడు మణికంఠ (29)కు తమిళనాడుకు చెందిన వీకేఆర్‌పురం గ్రామానికి చెందిన జననితో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 5 ఏళ్ల కుమారుడు అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో జనని శుక్రవారం కుమారుడ్ని చూడడానికి పుట్టింటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు పుత్తూరులో బస్సు దిగి గ్రామానికి వెళ్లాల్సి ఉండగా గ్రామస్తులు కనబడి నీ భర్త చనిపోయాడని, పుత్తూరు ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలిపారు. ఎందుకు ఎలా అంటూ ఆరా తీయగా మణికంఠ అతడి చిన్నాన్న వెంకటేశులు ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి తెలిపారని చెప్పారు. ఎవరు, ఎందుకు, ఎలా చంపేశారో తెలియదని, దీనిని పోలీసులే తేలి్చ, దోషులను కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలు జనని ఆక్రోశించింది. మణికంఠ తిరుపతిలోని మహర్షి అభ్యుదయ సేవా సమితిలో పని చేస్తుండగా జనని ప్రస్తుతం గర్భిణి. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

దుర్గమ్మ.. ఈ స్నేహితులపై దయ లేదా..!
నార్కట్‌పల్లి(నల్లగొండ): దైవ దర్శనానికి వెళ్తుండగా నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందారు. నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా ఓల్డ్ అల్వాలకు చెందిన ఐదుగురు స్నేహితులు ప్రవీణ్, సాయికుమార్ గౌడ్, చిల్లాసాగర్ సాయి సందీప్ గౌడ్, హరీష్, మధుకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారి దైవ దర్శనం కోసం ప్రవీణ్ కారులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత1:30గంటల సమయంలో బయలు దేరారు. ఆదివారం తెల్లవారు జామున 5:30గంటల సమయంలో మార్గమధ్యంలోని నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామ శివారులో గల హైదరాబాద్– విజయవాడ జాతీయ ప్రధార రహదారి వద్ద రోడ్డు పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారులో ప్రయాణిస్తున్న కుంచ సాయికుమార్ గౌడ్(32), సాయిసందీప్ గౌడ్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. హరీష్, మధుకర్లకు గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. తెల్లవారు జామున పొగ మంచు కమ్ముకోవడంతోపాటు, నిలిచి ఉన్న లారీకి వెనుక భాగంలో రెడ్ స్టిక్కర్ కూడా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.