Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

India Closes Airspace For All pakistan Flights1
పాక్‌ విమానాలకు భారత గగనతలం మూసివేత.. నెక్ట్స్‌ జరిగేది ఇదేనా?

ఢిల్లీ: పాకిస్తాన్‌ను మరింత ఇబ్బంది పెట్టేలా భారత్‌ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్‌ గగనం తలంలో పాక్‌ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. దీంతో పాకిస్థాన్‌ నుంచి భారత్‌ మీద నుంచి కాకుండా ఇతర దేశాల గగనం తలం నుంచి గమ్య స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, భారత విమానాలకు పాకిస్తాన్ గగనతల మూసివేయడంతో ప్రతి చర్యగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ ఆంక్షలు మే 24 వరకు కొనసాగనున్నాయి. అయితే ఈ గడువు మున్ముందు పరిస్థితులపై ఆధారపడి ఉండనుంది. భారత గగన తలంపై పాక్‌ విమానాల నిషేధం విధిస్తూ.. కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ‘భారత్‌ గగనం తలంపై పాక్‌ విమానాలు నిషేదం. వాటిల్లో పాక్‌ రిజిస్టర్డ్‌ విమానాలు, అలాగే పాక్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, లేదంటే లీజుకు తీసుకున్న విమానాలకు భారత గగనతల ప్రవేశం లేదు. ఇందులో సైనిక విమానాలూ ఉన్నాయి’ అని కేంద్రం విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది. మరోవైపు భారత్‌ తీసుకుంటున్న వరుస నిర్ణయాలపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పాక్‌కు చెందిన విమానాలు భారత్ గగనతలం మీద నుంచి ప్రయాణించకూడదన్న ఆదేశాలు అమల్లో ఉండగా.. ఇప్పుడు అధికారికంగా గగనతలాన్ని మూసివేస్తూ భారత్‌ ప్రకటన చేయడంపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చర్య వల్ల దక్షిణ ఆసియా, ఓషియానియా ప్రాంతాలకు వెళ్లే పాక్ విమానాలు భారత గగన తలం మీద నుంచి పొరుగు దేశాల మీద నుంచి తిరిగి ప్రయాణించాల్సి వస్తుంది. ఆ ఫలితం పాక్‌ విమానయాన రంగంపై పడనుంది. విమానం ప్రయాణ సమయం పెరగడం, ఫ్లైట్‌ ఛార్జీలు పెరగడం, విమాన ఇంధన ధరలు పెరగడం, విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తగ్గడం వంటి ప్రతికూల ప్రభావం పడనుంది. వెరసీ పాక్‌ మరిన్ని ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోంది. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైపోయిన పాకిస్తాన్ విమానయాన సంస్థలకు తాజా భారత నిర్ణయంతో అదనపు భారం పడనుంది.

Chandrababu Govt Negligence Taken Lives Of 7 People At Simhachalam Tragedy2
దైవ సాక్షిగా.. 'మళ్లీ భక్తులే బలి'

‘మా పిల్లలు.. బంధువులను ప్రభుత్వమే చంపేసింది! చందనోత్సవం పుణ్యమా అంటూ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు పాల్జేసింది. మా కుటుంబాలలో విషాదం నింపింది...!’ ‘దగ్గరుండి బంధువులందరితో తెలుగుదేశంకు ఓటు వేయించాడు. ఆ ప్రభుత్వమే మా కొడుకు.. కోడలిని పొట్టనబెట్టుకుంది. ఇంటి దిక్కును కోల్పోయాం...!’‘చేతికి అందివచ్చిన కుమారుడికి త్వరలోనే పెళ్లి చేయాలనుకున్నా...!’ ‘నాకు పెద్ద దిక్కు అనుకున్న అన్నయ్య నన్ను వదిలి వెళ్లిపోయాడు..!’ కేజీహెచ్‌ మార్చురీ వద్ద మృతుల బంధువుల ఆక్రోశం ఇదీ!సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కూటమి సర్కారు పాపాలు భక్తులకు యమపాశాలుగా మారుతున్నాయి! తిరుపతిలో తొక్కిసలాట ఘటన మరువక ముందే.. సింహాచలంలో మరో విషాదం చోటు చేసుకుంది. నాడు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో మృత్యువాత పడగా.. నేడు వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం సింహాచలం వచ్చిన వారు నిర్జీవులుగా మారారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఏర్పాట్లలో సర్కారు నిర్లక్ష్యం ఏడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది! అత్యంత నాసిరకంగా, కాలమ్స్‌ లేకుండా ఫ్లైయాష్‌తో కట్టిన గోడ గాలివానకు కూలిపోయి భక్తులను సజీవ సమాధి చేసింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండగా వీరిలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువ దంపతులున్నారు. చనిపోయిన వారిలో అంబాజీపేటకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు(29), పత్తి దుర్గా స్వామినాయుడు (30), విశాఖ వాసులు ఎడ్ల వెంకటరావు(58), పిల్లా ఉమా మహేశ్వరరావు(30), పిల్లా శైలజ (27), గుజ్జారి మహాలక్ష్మి, పైలా వెంకట రత్నం(45) ఉన్నారు. తమవారి ప్రాణాలు తీసేందుకే నాణ్యత లేని గోడ కట్టారని బాధిత కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. ఈ విషాదం అందరినీ కలచి వేస్తుండగా విశాఖ ఎంపీ శ్రీభరత్‌ ఏమాత్రం చలించకుండా చందనోత్సవ దర్శనం చేసుకుని చల్లగా జారుకోవడంపై ప్రజలు మండిప­డుతున్నారు. తనకేమీ పట్టనట్లుగా ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ విడిచి పత్తా లేకుండా పోయారు. ప్రచారం ఘనం.. ఏర్పాట్లు శూన్యంఏడాదికోసారి జరిగే సింహాచలం చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్లు ఈసారి భక్తులకు చుక్కలు చూపించాయి. కొండపైకి వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరి­స్థితి ఏర్పడింది. ఇక దర్శనానికి 5 నుంచి 8 గంటల పాటు క్యూ­లైన్లలో నరకయాతన అనుభవించారు. చందనోత్సవం వేడుకను తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేయగా నిర్వహణ ఏర్పాట్ల కోసం ఐదుగురు మంత్రులతో కమిటీని నియమించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అప్పన్న నిజరూప దర్శనం వేళ.. ఏర్పాట్లలో డొల్లతనం బయట పడింది. చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్ల విషయంలో మంత్రుల కమిటీ నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఏటా చందనోత్సవం రోజు వర్షం పడడం సాధారణం అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా వారం క్రితం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురి ప్రాణాలను బలి తీసుకుంది. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లైయాష్‌ ఇటుక వాడవచ్చా? నీరు దిగేందుకు వీలుగా గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్‌ డిజైన్‌ ఇచ్చిందెవరు? అక్కడ ఉన్న షాపులు తొలగించమని ఎవరు చెప్పారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఘటనాస్థలంలో శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం వెదుకుతున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపైనే దృష్టిపవిత్ర చందనోత్సవం సమయంలో సైతం సింహాచలం దేవాలయానికి ప్రభుత్వం ఈవోను నియ­మించకపోవడం గమనార్హం. కేవలం ఇన్‌చార్జి ఈవోతో ఇంత భారీ కార్యక్రమాన్ని ముగించేందుకు సిద్ధమైంది. ఇన్‌చార్జి ఈవోను డమ్మీగా మార్చి ప్రభుత్వ పెద్దలు ఇష్టారీతిలో వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాసుల జారీ మొదలుకుని.. టికెట్ల అమ్మకాలు, చందనోత్సవం కోసం చేపట్టిన వివిధ కాంట్రాక్టు పనులన్నింటిలోనూ అధికార పార్టీ నేతలు జోక్యం చేసు­కున్నారు. వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపై దృష్టి సారించి సాధారణ భక్తుల భద్రతను గాలికొదిలేసినట్లు స్పష్టమవుతోంది.హడావుడిగా తాత్కాలిక గోడకేశ ఖండనం, గాలి గోపురానికి వెళ్లే భక్తులు నడిచేందుకు ఆలయం పక్కన దారి ఉంది. అక్కడి నుంచి కిందకు వెళ్లేందుకు ఉన్న మెట్ల మార్గం పక్కనే గోడ నిర్మాణం జరుగుతోంది. వాస్తవానికి ఈ గోడకు బదులుగా గతంలో రిటైనింగ్‌ వాల్‌ ఉంది. పై నుంచి మట్టి ఊడిపడితే కింద వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ రిటైనింగ్‌ వాల్‌ కాపాడేది. అయితే, ప్రసాద్‌ స్కీమ్‌లో భాగంగా పాత రిటైనింగ్‌ వాల్‌ స్థానంలో కొత్త రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాల్సి ఉంది. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి సమయం పడు­తుందని చందనోత్సవం సందర్భంగా హడావుడిగా తాత్కాలిక గోడను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తాత్కాలిక గోడ నిర్మాణ పనులు నాలుగు రోజుల్లో పూర్తి చేశారు. పునా­దులు, కాంక్రీట్, స్టీల్, రెయిన్‌ఫోర్స్‌మెంట్‌ స్ట్రక్చర్‌ లేకుండా కేవలం ఫ్లైయాష్‌ బ్రిక్స్‌తో భారీ గోడను నిర్మించేశారు. ఇటుకకు ఇటుకకు మధ్య కనీసం సిమెంటు లేకుండా ఇసుక ఎక్కువ పాలు వేసి అత్యంత నాసిరకంగా నిర్మించారనే విషయం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. పాత రిటైనింగ్‌ వాల్‌ ఉండి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని.. కనీసం గోడ నిర్మాణ సమయంలో ప్రభుత్వం నాణ్యతను పరిశీలించినా ఇంత పెను ప్రమాదం జరిగి ఉండేది కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ తాత్కాలిక గోడే కదా అనే నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపంతో నాసిరకంగా నిర్మించడంతో చిన్నపాటి వర్షానికే కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయారు.మృతుల ఫైల్‌ ఫొటోలు ముందస్తు జాగ్రత్తలేవి?లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రమాదం జరిగిన తరువాత కూడా సహాయక చర్యలు అందించడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ వైపు రూ.300 టికెట్ల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఒక్క సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచలేదు. ప్రమాదం జరిగిందన్న విషయం భక్తుల హాహాకారాలు చేస్తే గానీ అధికారుల దృష్టికి వెళ్లలేదు. భారీగా భక్తులు తరలివచ్చే కార్యక్రమాలకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అంబులెన్సులు, పారా మెడికల్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించలేదు. దుర్ఘటన తెల్లవారుజామున సుమారు 3.05 గంటలకు జరగగా అధికారులు 3.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తరువాత ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రప్పించారు. అప్పటికే దారుణం జరిగిపోయింది. ఇటుకల కింద ఏడుగురు భక్తులు సమాధి అయిపోయారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్దపీట!ఒకవైపు ఆలయ ఇన్‌చార్జి ఈవోను డమ్మీని చేసి అన్ని నిర్ణయాలను కలెక్టరేట్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇంటి నుంచే ప్రభుత్వం అమలు చేసింది. ఎవరికి ఎన్ని వీఐపీ టికెట్లు ఇవ్వాలనే విషయాన్ని వారే నిర్ణయించారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలకు ఎన్ని కావాలంటే అన్ని పాస్‌లు కేటాయించారు. వారికి మాత్రమే కారు పాస్‌లు మంజూరు చేశారు. బీజేపీ నేతలకు సైతం వీఐపీ, రూ.1,500 టికెట్లు దక్కలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణ భక్తులు రూ.300, రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసేందుకు బ్యాంకులు, కౌంటర్ల వద్దకు వెళితే లేవని తిప్పి పంపేశారు. అప్పటికే ఆ టికెట్లను తమ వారి కోసం టీడీపీ నేతలు తీసేసుకున్నారు. సాధారణ భక్తులు దేవస్థానం బస్సుల్లోనే కొండపైకి చేరుకోవాల్సి వచ్చింది. బస్సులు తగినంతగా లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల పాటు వేచి చూడలేక పలువురు నడక మార్గంలో ఘాట్‌ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. ఘాట్‌ రోడ్‌లో నడక దారిలో కిలోమీటరు మేర బారులు తీరి కనిపించారు. ఇన్‌చార్జి ఈవోనే దిక్కు...!ఏటా చందననోత్సవంతోపాటు గిరి ప్రదక్షి­ణకు భక్తులు పోటెత్తు­తారు. అప్పన్న నిజరూప దర్శన వేడుకను తిలకించేందుకు ఉత్త­రాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఈవోదే ప్రధాన బాధ్యత. అయితే చందనో­త్సవం వేళ రెగ్యులర్‌ ఈవోను ప్రభు­త్వం నియమించలేదు. రెగ్యులర్‌ ఈవోగా ఉన్న వి.త్రినాథరావు 3 నెలలు సెలవులో వెళ్లారు. అప్పటి నుంచి ఇన్‌చార్జి ఈవోగా కె.సుబ్బారావు కొనసాగుతు­న్నారు. ఏప్రిల్‌ 30న చంద­నోత్సవం ఉందని తెలిసినా రెగ్యులర్‌ ఈవోను నియమించపో­వడం ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతుల వివరాలు..పవిత్ర క్షేత్రాల్లో వరుస అపచారాలుపవిత్ర పుణ్యక్షేత్రాల్లో 11 నెలలుగా వరుసగా చోటు చేసుకుంటున్న అపచా­రాలు, అనూహ్య ఘటనలు భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ వారి భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్ట బయలు చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రభుత్వమే ‘కల్తీ’ ప్రచారానికి తెర తీయడం మొదలు.. వైకుంఠ ఏకాదశి ఏర్పా­ట్లలో వైఫల్యం కారణంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు భక్తులు మరణించడం.. టీటీడీ గోశాలలో గోవుల మృతి ఘటనను కప్పిపు­చ్చుతూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించడం.. దశాబ్దాలుగా హైందవ ధర్మం, దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన కాశీ నాయన ఆశ్రమాన్ని ప్రభుత్వమే నేలమట్టం చేయడం.. శ్రీకూర్మం గుడిలో తాబేళ్లు చనిపోవడం లాంటి ఘటన­లన్నీ భక్తుల మనోభావాలను కలచి వేస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు సర్కారు కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో పలు ఆలయాలను నేల కూల్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఓ గోడ కూడా కట్టలేక అప్పన్న సాక్షిగా భక్తుల ప్రాణాలను బలి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలుసాక్షి, న్యూఢిల్లీ: సింహాచ­లం క్షేత్రం వద్ద చోటుచేసు­కున్న దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు మనో­ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని స్పందిస్తూ ‘విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో జరిగిన ప్రాణనష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తాం’ అని ప్రకటించారు.రాహుల్‌ విచారంఈ ఘటనపై కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Need To Take: Dhoni Blunt As Ever As CSK IPL 2025 Playoff Hope Fade Away3
వాళ్లిద్దరు అద్భుతం.. అతడు గొప్ప ఫీల్డర్‌.. కానీ అక్కడే వెనుకబడ్డాం: ధోని

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) ప్రయాణం ముగిసిపోయింది. పంజాబ్‌ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓడిన తర్వాత ధోని సేన అధికారికంగా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.పంజాబ్‌తో మ్యాచ్‌లో తమ బ్యాటర్లు మెరుగ్గానే ఆడారని.. అయితే, కనీసం ఇంకో 15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ఈరోజు తొలిసారి మా బ్యాటర్లు స్కోరు బోర్డుపై మెరుగైన సంఖ్యను ఉంచారు. కానీ ఇలాంటి పిచ్‌పై ఇది సరిపోదు.ఆఖరి నాలుగు బంతులు వృథా చేశాంమా వాళ్లు ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేది. అదే విధంగా మేము కీలక సమయాల్లో కీలక క్యాచ్‌లు జారవిడవడం కూడా ప్రభావం చూపింది.ఏదేమైనా ఈరోజు బ్రెవిస్‌, సామ్‌ అద్భుతంగా ఆడి విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, మేము దురదృష్టవశాత్తూ ఆలౌట్‌ అయ్యాము. ఆఖరి నాలుగు బంతులు వృథా చేశాం. అంతకంటే ముందు మా వాళ్లు నలుగురు అవుట్‌ అయ్యారు.అతడొక పోరాట యోధుడుఇలాంటి కీలక పోరులో ఒక్క బంతి ఆడటం కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పుతుంది’’ అని ధోని పేర్కొన్నాడు. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో అద్భుత అర్థ శతకంతో మెరిసిన సామ్‌ కరన్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడొక పోరాట యోధుడు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా కచ్చితంగా రాణిస్తాడు.అయితే, దురదృష్టవశాత్తూ పిచ్‌ దృష్ట్యా అతడికి ఎక్కువగా ఛాన్సులు ఇవ్వలేకపోయాం. కానీ ఈరోజు మా సొంతమైదానంలో టోర్నీలోనే అత్యుత్తమ వికెట్‌ మీద ఆడి తానేంటో నిరూపించుకున్నాడు.అతడొక అద్భుతమైన ఫీల్డర్‌ కూడామేము ఇంకొక్క పదిహేను పరుగులు చేసి ఉంటే బాగుండేది’’ అని ధోని అన్నాడు. అదే విధంగా అద్భుత ఫీల్డింగ్‌ నైపుణ్యాలు కనబరిచిన డెవాల్డ్‌ బ్రెవిస్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘మిడిలార్డర్‌లో తను మొమెంటమ్‌ తీసుకువచ్చాడు.చిన్న అవకాశం దొరికినా బంతిని బౌండరీకి తరలించాలని చూస్తాడు. అంతేకాదు.. అతడొక అద్భుతమైన ఫీల్డర్‌ కూడా. జట్టులో సరికొత్త ఉత్సాహం నింపుతున్నాడు. అతడి ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాము. భవిష్యత్తులో అతడొక విలువైన ఆస్తిగా మారతాడు’’ అని ధోని ఈ సౌతాఫ్రికా యువ బ్యాటర్‌పై ప్రశంసలు కురిపించాడు.Brilliant Brevis catch: Composure. Presence of mind & Athleticism at its best 🫨Watch 🔽🎥#TATAIPL | #CSKvPBKS— IndianPremierLeague (@IPL) April 30, 2025 సీఎస్‌కేకే ఇదే తొలిసారికాగా చెపాక్‌ స్టేడియంలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసింది చెన్నై. ఓపెనర్లు షేక్‌ రషీద్‌ (11), ఆయుశ్‌ మాత్రే (7) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన సామ్‌ కరన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.మొత్తంగా 47 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతడికి తోడుగా డెవాల్డ్‌ బ్రెవిస్‌ (32) రాణించాడు. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. ఈ క్రమంలో 19.2 ఓవర్లో 190 పరుగులు చేసి చెన్నై జట్టు ఆలౌట్‌ అయింది.ఇక ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నైని ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకొనేలా చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో బేబీ ఏబీడీ బ్రెవిస్‌ అద్భుతమైన క్యాచ్‌లతో మెరిశాడు. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (54) ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టాడు.అయితే, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శశాంక్‌ సింగ్‌ (23) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద అద్భుత రీతిలో అందుకున్న బ్రెవిస్‌ అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. బౌండరీ లైన్‌కు తాకే ప్రమాదం ఉండటంతో బంతిని మూడుసార్లు గాల్లోకి లేపి ఆ తర్వాత సురక్షితంగా క్యాచ్‌ పట్టాడు. కాగా గతేడాది కూడా చెన్నై టాప్‌-4కు చేరలేదన్న విషయం తెలిసిందే. ఇలా వరుసగా రెండు సీజన్లలో చెన్నై ప్లే ఆఫ్స్‌ చేరకపోవడం ఇదే తొలిసారి.చదవండి: క్రికెట్‌ నీకు రెండో ఛాన్స్‌ ఇచ్చింది.. కానీ.. Hat-trick 👌Powerful start with the bat 🔥Captain's knock 🫡The Battle of Kings goes the @PunjabKingsIPL way again this season ❤Scorecard ▶ https://t.co/eXWTTv7Xhd #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/Yk1SOZOzip— IndianPremierLeague (@IPL) April 30, 2025

Imd Issues Rain Alert To Telangana And Andhra Pradesh4
తెలుగు రాష‍్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 21 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 17 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను అధికారులు జారీ చేశారు.కోస్తాంధ్రలో ఒక్కసారిగా మారిన వాతావరణంకోస్తాంధ్రలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వాతావరణంలో భిన్నమైన మార్పులు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో విపరీతమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక కొన్ని చోట్ల కురిసిన అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ISI Mohammad Asim Malik Appointed as Pakistan New National Security Adviser5
భయపెట్టిన భారత్.. పాక్‌ సైన్యంలో పెను మార్పులు

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాకిస్తాన్‌ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో పాక్‌ సైన్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.పాకిస్తాన్‌ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మహ్మద్‌ అసిమ్‌ మాలిక్‌ను ఆ దేశ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ (ఎన్ఎస్‌ఏ)గా నియమిస్తూ పాక్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 2024 సెప్టెంబర్‌ నుంచి ఐఎస్‌ఐ చీఫ్‌గా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ మహ్మద్‌ అసిమ్‌ మాలిక్‌కు ఎన్‌ఎస్‌ఏగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడితో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేలా భారత్‌ సామ, ధాన ,బేధ దండోపాయలను ఉపయోగిస్తోంది. వరుస కఠిన నిర్ణయాలతో అంతకంత దెబ్బతీస్తూనే ఉంది. ఈ క్రమంలో భారత ప్రధాని మోదీ బీహార్‌ వేదికగా బహిరంగంగా ఉగ్రమూకలకు హెచ్చరికలు జారీ చేశారు. పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని, వారిని పెంచి పోషిస్తున్నది ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే వెలికి తీసి మట్టిలో కలిపేస్తామన్నారు. అందుకు ఊతం ఇచ్చేలా ప్రధాని మోదీ నివాసంలో రక్షణశాఖ, భారత సైన్యంలో త్రివిధ దళాలతో జరిపిన కీలక సమావేశంలో సైన్యానికి ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చారు. ఉగ్రవాదం అణచివేతలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాక్‌ సైన్యంలో ఆందోళన మొదలైంది. భారత్‌.. తమపై ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని పాక్‌ మంత్రులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీనికి తోడు ఆ దేశ సైన్యాధిపతి జనరల్‌ సయీద్‌ అసిమ్‌ మునీర్‌ ఆచూకీ గల్లంతైంది. భారత్‌ దెబ్బకు దెబ్బ తీయొచ్చనే ఊహాగానాల నడుమ మునీర్‌ దేశం విడిచి భార్య పిల్లలతో పరాయి దేశంలో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం కొనసాగుతున్న వరుసర పరిణామలు, యుద్ధ భయాలతో పాక్‌ సైన్యంలో సైతం భయాందోళనలు మొదలయ్యాయి. బతికుంటే బలుసాకు తిని బతుకొచ్చు.. భారత్‌తో తలపడలేమనే సంకేతాలిస్తూ రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్‌ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులకు రాజీనామ చేశారు. ఈ క్రమంలో రక్షణ పరంగా పాక్‌ ప్రధాని,రాష్ట్రపతులకు సలహాలు, పాక్‌ సైన్యం, ఇతర దర్యాప్తు, ఇంటెలిజెన్స్‌ సంస్థల్ని సమన్వయం చేసేలా అసిమ్‌ మాలిక్‌కు పాక్‌ ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఏ అడ్వైజర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

Indian Bank to auction Ganta Srinivas Rao Assets6
వేలానికి గంటా ఆస్తులు..!

సాక్షి, అమరావతి: ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా అనే సంస్థ భారీగా రుణం తీసుకుని తిరిగి చెల్లించని వ్యవహారంలో రుణానికి హామీగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన బంధువుల ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియన్‌ బ్యాంక్, కోఠి స్ట్రెస్డ్‌ అసెట్స్‌ మేనేజ్‌మెంట్‌ బ్రాంచ్‌ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, బకా­యిలు వసూలు చేసేందుకు మే 21 మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య మూడు స్థిరాస్తుల వేలం ప్రక్రియ జరగనుంది. ఇప్పటికి రూ.463 కోట్లు...2016 నాటికి రూ.141 కోట్లు ఉన్న రుణ బకాయిలు, 2025 ఏప్రిల్‌ 27 నా­టికి వడ్డీ, పెనాల్టీలు కలిపి రూ.463.01 కోట్లకు పెరిగినట్టు బ్యాంకు తెలి­పింది. ఈ రుణాలకు గంటాతో పాటు పరుచూ­రి రాజారావు, పీవీ భాస్కరరావు, పరుచూరి వెంకయ్య, ప్రభాకరరావు, కొండయ్య బాలసుబ్రమణ్యం, నార్ని అమూల్య, ప్ర­త్యూష ఎస్టేట్స్, ప్ర­త్యూష గ్లోబల్‌ ట్రేడ్స్‌ హామీదారులుగా ఉన్నారు.ఇప్పుడైనా ముడిపడేనా..!గంటా కుటుంబం ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా పేరుతో విశాఖపట్నం లక్ష్మీ టాకీస్‌ సమీ­పంలో ఒక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీలో యాక్టివ్‌ డైరెక్టర్లుగా గంటా సమీప బంధు­వు పరుచూరి వెంకట భాస్కరరావు, ఆయన సో­ద­రులు రాజారావు, వెంకయ్య ప్రభాకరరావులు­న్నారు. విస్తరణ పేరుతో కంపెనీ డాబాగార్డెన్స్‌ శారదావీధిలోని ఇండియన్‌ బ్యాంకు నుంచి భారీ రుణాలు తీసుకుంది. ఈ రుణ బకాయిలకు సంబంధించి 2016 నుంచి డిమాండ్‌ నోటీసులు పంపడం, వేలం ప్రకటనలు, రిజర్వ్‌ ధరల పెంపు మా­త్రమే జరుగుతుండగా, వేలం మాత్రం జర­గడం లేదు. గంటా రాజకీయంగా తనకున్న పలుకుబడిని ఉపయోగించుకొని వేలాన్ని నిలుపుదల చేయించడం పరిపాటిగా మారిపోయింది. వేలం వేయనున్న ఆస్తులు..ప్రత్యూష అసోసియేట్స్‌ పేరిట విశాఖపట్నంలోని గంగులువారి వీధిలో ఉన్న 274.65 చదరపు అడుగుల వాణిజ్య భవనం.ప్రత్యూష ఎస్టేట్స్‌కు చెందిన ద్వారకానగర్‌ శ్రీ శాంత కాంప్లెక్స్‌లోని 1250 చదరపు అడుగుల రెండు ప్లాట్లు. వుడా లేఅవుట్‌లోని అయిదు ప్లాట్లుఈ ఆస్తులకు బ్యాంకు రూ.3.39 కోట్ల రిజర్వ్‌ ధరను నిర్ణయించింది. ‘ఉద్దేకపూర్వక రుణ ఎగవేతదారుడిగా’ ప్రకటించాలని డిమాండ్లుమరోవైపు రుణం తిరిగి చెల్లించే ఉద్దేశం గంటాకు లేదని, అతడిని ‘ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా’ ప్రకటించాలని బ్యాంకింగ్‌ యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి. – ఇండియన్‌ బ్యాంక్‌ ప్రకటన ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా రూ.463 కోట్ల ఎగవేతల నేపథ్యం రుణానికి తనఖాగా గంటా తదితరుల ఆస్తులు

HIT3: The Third Case Twitter Review And Public Talk In Telugu7
HIT3 X Review: ‘హిట్‌ 3’ ట్విటర్‌ రివ్యూ

నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన 'హిట్: ది థర్డ్ కేస్'(HIT3) సినిమా ఎట్టకేలకు నేడు(మే 1) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో మూడో చిత్రమిది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో సినిమా పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ లంచనాల మధ్య మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. హిట్‌ 3 కథేంటి? ఎలా ఉంది? నాని ఖాతాలో మరో హిట్‌ పడిందా లేదా తదితర అంశాలను ఎక్స్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో హిట్‌ 3(HIT3 Review) సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.కొంతమంది నెటిజన్స్‌ సినిమా మొదటి సగం అద్భుతంగా ఉందని, నాని నటన, రొమాంటిక్ ఎపిసోడ్‌లు ఆకట్టుకున్నాయని ప్రశంసింస్తే..మరికొంతమంది ఈ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోలేదని, గత హిట్ సినిమాలతో పోలిస్తే ఈ భాగం సాధారణంగా ఉందని అభిప్రాయపడ్డారు. సినిమా రెండో సగం కథలో మెరుగైన ఆలోచనలు, ఎగ్జిక్యూషన్ లోపించాయని కొందరు విమర్శించారు. అయినప్పటికీ, నాని పాత్రలో కొత్త జోన్‌లో కనిపించాడని, అతని నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చాలామంది కొనియాడారు. #Hit3 is a very violent action crime thriller that has moments that work well but at the same time portions that are too run of the mill and narrated on the slower side.The first half is pretty average and predictable till the pre-interval which starts to engage. The second…— Venky Reviews (@venkyreviews) April 30, 2025 హిట్ 3' ఒక వయలెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌.కొన్ని సీన్స్‌ భాగా వర్కౌట్‌ అయ్యాయి.అదే సమయంలో కొన్ని రోటీన్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఫస్టాఫ్‌ రొటీన్‌గా, ఊహించదగిన విధంగా ఉంటుంది. ప్రీ-ఇంటర్వెల్ వరకు, అక్కడ నుండి ఆసక్తికరంగా మారుతుంది. రెండవ సగం స్క్విడ్ గేమ్ నుండి ప్రేరణ పొందిన సెటప్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే, ముందుగా చెప్పినట్లు కథనం ఊహించదగిన విధంగా ఉంటుంది, తక్కువ ట్విస్ట్‌లతో మరియు మాస్ మూమెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. నిర్మాణ విలువలు మరియు సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తాయి. సంగీతం ప్రభావవంతంగా లేదు . నాని అద్భుతంగా నటించాడు అంటూ ఓ నెటిజన్‌ ఈ సినిమాకు 2.75 రేటింగ్‌ ఇచ్చాడు.#Hit3One time watch for NaNiHighlights __________NaNi’s performance Cinematography Climax Negatives__________Forceful violenceNo twists and turnsUneven screenplayBGM— praneeth nukala (@praneethnukala) May 1, 2025 హిట్‌ 3 ఒక్కసారి చూడొచ్చు. నాని నటన, సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్‌ ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్‌ అయితే.. వయెలెన్స్‌ బలవంతగా ఇరికించడం, ట్విస్టులు,మలుపులు లేకపోవడం, స్క్రీన్‌ప్లే, బీజీఎం మైనస్‌ పాయింట్స్‌ అని మరో నెటిజన్‌ అభిప్రాయ పడ్డాడు#HIT3 #HIT3Review RAW..BLOODY..🎯🎯🎯🎯Not for family audiences or kids. What an actor @NameisNani . He is growing as multitalented, big box office star. Best of #Nani movie I have ever watched. Totally new experience 👏🏼👏🏼Strictly NO Kids ⛔️⛔️***BLOCKBUSTER***— Karthik (@meet_tk) April 30, 2025#HIT3 rating : ⭐⭐🌟3/5!!@NameisNani show🔥 an Griping action pack thriller, #SrinidhiShetty and #nani chamestry good overall an watchable.#hit3review #HIT3FromMay1st pic.twitter.com/guu9TKRMsS— its cinema (@iitscinema) April 30, 2025 ఇది నాని షో. గ్రిస్పింగ్‌ యాక్షన్‌ప్యాక్‌ థ్రిల్లర్‌. శ్రీనిధి శెట్టి, నాని కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. ఓవరాల్‌గా హిట్‌3 థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా అంటూ మరో నెటిజన్‌ 3 రేటింగ్‌ ఇచ్చాడు.First half Good Second Half & Pre climax 💥💥💥💥💥💥💥💥💥💥💥. #HIT3 pic.twitter.com/8074TXw1v1— Vishnu Varthan Reddy (@RVVR9999) May 1, 2025#hit3review – Gritty & violent thriller with flashes of brilliance. First half dull, second half picks up with Squid Game vibes. Nani excels, but predictable plot, excess violence & weak music pull it down. Not for families.Rating: 2.75/5#Nani #HIT3TheThirdCase #HIT3 #hit3 pic.twitter.com/98Rk6J9tUs— Tha Cinema (@tha_cinema) May 1, 2025#HIT3Review:Positives• Nani🔥💥💥• The Final Act🥵👿• Concept😮• Sailesh's Screenplay👌• Cameos💥Suspenses🙌Investigation💥Final Verdict: An Engaging Suspense Thriller that serves its Purpose.#HIT3 | #NANI | #HIT3TheThirdCase #castesensuspic.twitter.com/eDn379ICBk— IndianCinemaLover (@Vishwa0911) May 1, 2025

failed Soviet Venus lander will fall back to Earth8
తొలి ఫొటో... కాస్మోస్ 482 అంతరిక్ష నౌక నమూనా

సోవియట్ యూనియన్ ఎప్పుడో అర్ధ శతాబ్దం క్రితం ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘కాస్మోస్ 482’ త్వరలో భూమిపై కూలబోతోంది. మే నెల 8-11 తేదీల మధ్య అది భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. శుక్ర గ్రహాన్ని పరిశోధించడానికి 1972 మార్చి 31న సోవియట్ ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. వాస్తవానికి ‘కాస్మోస్ 482’ ఓ లాండింగ్ మాడ్యూల్. 495 కిలోల ల్యాండరును శుక్రగ్రహంపై దింపడం ఈ మిషన్ ఉద్దేశం. సాంకేతిక లోపం తలెత్తి ప్రయోగం విఫలమవడంతో ‘కాస్మోస్ 482’ స్పేస్ క్రాఫ్ట్ ముందుకు ప్రయాణించడానికి అవకాశం లేక భూకక్ష్యలోనే ఇరుక్కుపోయింది. గత 53 సంవత్సరాలుగా అది భూమి కక్ష్యలోనే పరిభ్రమిస్తోంది. ఇప్పుడు కూలే సమయం ఆసన్నమవడంతో శాస్త్రవేత్తలు దాని ఆర్బిటల్ ఎత్తును నిరంతరాయంగా గమనిస్తున్నారు. అంతరిక్ష నౌక కచ్చితంగా ఏ తేదీన భూమిపై కూలుతుందో త్వరలో తెలుస్తుంది. మే 8-11 తేదీల్లో ‘కాస్మోస్ 482’ భూమిపై కూలవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ... ‘సూర్యుడి క్రియాశీలత’ ప్రభావంతో సదరు తేదీలకు కాస్త ముందుగా గానీ, లేదా ఆ తర్వాత గానీ నౌక కూలే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే సూర్యుడి క్రియాశీలత అధికంగా ఉంటే భూమి ఎగువ వాతావరణం త్వరగా వేడెక్కి వ్యాకోచిస్తుంది. ఫలితంగా దిగువ కక్ష్యలో పరిభ్రమించే వస్తువులను భూ వాతావరణం త్వరితగతిన లాక్కుంటుంది. అంటే ‘కాస్మోస్ 482’ అంతరిక్ష నౌక మనం అనుకున్న సమయం కంటే ముందుగానే కూలిపోవచ్చు. 52 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల్లో కూలవచ్చు!భూ వాతావరణంలోకి అనియంత్రిత ప్రవేశం’ కనుక ‘కాస్మోస్ 482’ స్పేస్ క్రాఫ్ట్ భూమిపై ఏ ప్రాంతంలో కూలిపోతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ ప్రస్తుతం నౌక కక్ష్యను పరిశీలిస్తే భూమిపై 52 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 52 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య గల సువిశాల ప్రదేశంలో... అంటే ఉత్తరాన బ్రిటన్ మొదలుకొని దక్షిణాన న్యూజిలాండ్ దాకా ఎక్కడైనా అది కూలవచ్చు. భూమిపై జలావరణమే అధికం కనుక నౌక నేలపై కాకుండా సముద్రాల్లో కూలిపోయే అవకాశాలే ఎక్కువ. సముద్ర ప్రదేశాలు కాకుండా భూభాగంపై లేదా జనావాస ప్రాంతాలపై అది కూలిపోయే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ ఓ అంశం శాస్త్రవేత్తలను కొంచెం కలవరపెడుతోంది. ‘కాస్మోస్ 482’కు ఓ విశిష్టత ఉంది. అది ‘వెనెరా’ మిషన్ ల్యాండర్ల తరహా అంతరిక్ష నౌక. శుక్ర గ్రహంపై దిగేటప్పుడు అక్కడి కఠినాతి కఠినమైన అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర పీడనాన్ని తట్టుకునేలా ‘కాస్మోస్ 482’ను రూపొందించారు. సాధారణంగా ఖగోళ వస్తువులు భూవాతావరణంలోకి ప్రవేశించాక గాలి ఒరిపిడికి మండిపోయి చిన్న శకలాలుగా రాలిపోతాయి. వాటిలోని పెద్ద, బరువైన భాగాలు మాత్రమే భూమిని తాకుతాయి. డిజైన్ ప్రత్యేకత దృష్ట్యా ‘కాస్మోస్ 482’ మాత్రం భూ వాతావరణంలోకి ప్రవేశించినా ధ్వంసం అవదు. సముద్రాల్లో కాకుండా అది భూభాగంపై కూలిపోవడమంటూ సంభవిస్తే... ఏమాత్రం చెక్కు చెదరకుండా 495 కిలోల ‘కాస్మోస్ 482’ ధడేల్మని ‘ఒకే ముక్క’గా నేల రాలుతుంది! అలా చిన్న ఉల్క మాదిరి ప్రభావం చూపుతుంది. శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తున్న అంశం ఇదే. - జమ్ముల శ్రీకాంత్

Aspect Bullion launching gold and silver vending machines next few months9
వెండింగ్‌ మెషిన్ల ద్వారా బంగారం కొనుగోలు

దేశవ్యాప్తంగా వచ్చే 12–18 నెలల్లో 50 వరకు బంగారం, వెండి వెండింగ్‌ మెషిన్లను ఏర్పాటు చేయనున్నట్టు యాస్పెక్ట్‌ బులియన్‌ అండ్‌ రిఫైనరీ ప్రకటించింది. ఈ వెండింగ్‌ మెషిన్ల ద్వారా బంగారం, వెండి కాయిన్లను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. వెండింగ్‌ మెషిన్‌ వద్దే అప్పటికప్పుడు ధరలను కస్టమర్లు చూసుకోవచ్చని.. రియల్‌టైమ్‌ మార్కెట్‌ ధరలు అక్కడ కనిపిస్తాయని పేర్కొంది. వేగంగా, భద్రంగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఈ వెండింగ్‌ మెషిన్లు ఉంటాయని.. మూడు నిమిషాల్లోనే కొనుగోలును పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్‌ కార్డు సహా పలు రకాల పేమెంట్‌ ఆప్షన్లను వినియోగించుకోవచ్చని తెలిపింది.వెండింగ్‌ మెషిన్‌ ఎలా పని చేస్తుందంటే..గోల్డ్ కాయిన్ వెండింగ్ మెషిన్లు సాధారణ వెండింగ్ మెషీన్ల మాదిరిగానే పనిచేస్తాయి. కానీ బంగారం విలువ కారణంగా అదనపు భద్రతను కల్పిస్తారు. అందులో భాగంగా వినియోగదారుల వెరిఫికేషన్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.మెషిన్‌లో ముందుగా వినియోగదారులు తమకు కావాల్సిన బంగారు నాణెం బరువు, రకాన్ని ఎంచుకుంటారు.నగదు, క్రెడిట్/డెబిట్ కార్డు లేదా మొబైల్ బ్యాంకింగ్ (యూపీఐ, క్యూఆర్ కోడ్లు మొదలైనవి) ద్వారా చెల్లింపులు చేయవచ్చు.కొన్ని యంత్రాలకు గుర్తింపు ధ్రువీకరణ అవసరం అవుతుంది. ముఖ్యంగా అధిక మొత్తంలో చేసే లావాదేవీల కోసం ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వంటి కేవైసీ (నో యువర్ కస్టమర్) పద్ధతులను ఉపయోగిస్తారు.చెల్లింపు అయినట్లు ధ్రువీకరించిన తరువాత మెషిన్‌లోని స్టోరేజ్‌ కంపార్ట్‌మెంట్‌ నుంచి బంగారు నాణేన్ని రిలీజ్‌ చేస్తుంది.ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫారంలను నోటిఫై చేసిన కేంద్రంకొన్ని యంత్రాల ద్వారా బంగారు కడ్డీలు కూడా పొందే వీలుంటుంది. దానికి సంబంధించిన వివరాలను ముందుగానే వినియోగదారులకు తెలియజేస్తుంది.పంపిణీ సమయంలో భద్రతకోసం సీసీటీవీ మానిటరింగ్, ట్యాంపరింగ్ ప్రూఫ్ మెకానిజమ్స్, వెయిట్ సెన్సర్లను అమరుస్తారు.యంత్రాల్లో యాంటీ-థెఫ్ట్ అలారంలు, రియల్-టైమ్ ఇన్వెంటరీ ట్రాకింగ్ విధానం కూడా ఉంటుంది.బంగారం కొనుగోలు రుజువు కోసం ఈ-రశీదులు కూడా పొందవచ్చు.

Today is World Labor Day10
May Day శ్రమైక జీవనం

కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలు, దౌర్జన్యాలు... ఒంటి చేత్తో తోసిరాజని....పనిలో తమను తాము నిరూపించుకున్నారు మహిళా కార్మికులు.కార్మికలోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణగా నవీన శక్తిలా ముందుకు వచ్చారు మహిళా కార్మికులు.శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిబింబం అయ్యారు.‘ఈ రంగంలో మహిళలు పనిచేయలేరు’ అనుకునే రంగాలలోకి వచ్చి అ΄ోహలను బద్దలు కొట్టారు.‘పురుషులకు ఎక్కడా తీసిపోము’ అని నిరూపించారు. నిరూపిస్తూనే ఉన్నారు. అయితే... ఇది నాణేనికి ఒక కోణం మాత్రమే. మరో కోణంలో చూస్తే మహిళా ఉద్యోగులు, కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.కోల్‌కత్తాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య మన దేశంలో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించిన చర్చను ముందుకు తెచ్చింది. వివిధ సర్వేల ప్రకారం మూడింట ఒకవంతు మంది మహిళలు పనిప్రాంతంలో ఏదో ఒక రకమైన శారీరక హింసను ఎదుర్కొంటున్నారు.మహిళా సిబ్బందికి వారి పనిప్రాంతంలో ప్రమాదాలు పెరిగాయి. చాలాప్రాంతాల్లో సీసీటీవీ నిఘా లేదు. సరైన నిఘా, రిపోర్టింగ్‌ యంత్రాంగం లేక΄ోవడంతో అనుచిత ప్రవర్తన, వేధింపులు పెరిగాయి.ప్రాంథమిక భద్రతా చర్యల గురించి చాలా సంస్థలలో మహిళా ఉద్యోగులకు అవగాహన కలిగించడం లేదు.గార్మెంట్‌ ఫ్యాక్టరీలలో ఎక్కువమంది కార్మికులు మహిళలే. అయితే పురుషులతో ΄ోల్చితే వారికి తక్కువ వేతనం ఇస్తున్నారు. వేతన అసమానతలతో పాటు పనిప్రాంతంలో ప్రమాదాలు, పురుషాధిపత్య వేధింపులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలలో మహిళాకార్మికులకు మౌలిక సదుపాయాల కొరత ఉంది.‘బిజినెస్‌ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌’ రిపోర్ట్ మన దేశంలో గార్మెంట్‌ ఫ్యాక్టరీలలో మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చింది. నిజానికి ‘ఇది కేవలం గార్మెంట్‌ పరిశ్రమలకు సంబంధించిన రిపోర్ట్ మాత్రమే’ అనుకోనక్కర్లేదు. చిన్నా, పెద్ద తేడాలతో ఎన్నో పరిశ్రమలలో వేరు వేరు రూపాల్లో ఇదే పరిస్థితి ఉంది.కోవిడ్‌ మహమ్మారి ఉమెన్‌ హెల్త్‌ వర్కర్‌లకు ప్రమాదాలు తెచ్చింది. విధి నిర్వహణలో చనిపోయిన వారు కూడా ఉన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు.చదవండి: ప్రిన్స్‌ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్‌నిరాశ పడే పరిస్థితులు రావచ్చు, భద్రతాపరమైన సమస్యలు ఉండవచ్చు....ఒకటి, రెండు అని కాదు....సవాలక్ష సమస్యలు ఎదురైనా మహిళా శ్రామిక శక్తి వెనక్కి తగ్గడం లేదు.ఎందుకంటే వారు...చరిత్ర వింటూ వచ్చారు. మరో చరిత్ర నిర్మించాలనుకుంటున్నారు. ఇదీ చదవండి: Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement