Top Stories
ప్రధాన వార్తలు

పాకిస్థాన్, భారత్ సరిహద్దులకు వెళ్లకండి.. అమెరికా పౌరులకు హెచ్చరిక
వాషింగ్టన్: పాకిస్థాన్ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరులు ఎవరూ పాకిస్థాన్‌కు వెళ్లొద్దు అంటూ తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఎక్కువ.. టెర్రరిస్టులు దాడులు జరిపే ప్రమాదం ఉందని హెచ్చరించింది.అమెరికా తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్‌లో దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇదే సమయంలో.. పాకిస్థాన్ వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే భారత సరిహద్దు ప్రాంతాలకు, బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లకు మాత్రం అస్సలు వెళ్లొద్దని హెచ్చరించింది. ఆయా ప్రావిన్స్‌లలో టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లేవారూ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.అలాగే.. మార్కెట్లు, రవాణా కేంద్రాలు తదితర ఏరియాలలో పౌరులను, పోలీసులను, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు.. పాక్ నుంచి భారత్‌లో అడుగుపెట్టేందుకు ఉన్న ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని, సరిహద్దులు దాటి భారత్ లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి అని పేర్కొంది. ముందు వీసా తీసుకున్నాకే బార్డర్ వద్దకు వెళ్లాలని, వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదని వివరించింది.ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(trump) సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. భద్రతా కారణాల రీత్యా.. పాక్ పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నట్టు సమాచారం. ఇక, డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.🇺🇸 The US warns against travel to Pakistan, citing terrorism risks. A "Do Not Travel" advisory applies to areas near the India-Pakistan border, the LoC, Balochistan, and Khyber Pakhtunkhwa due to threats of violence and armed conflict. pic.twitter.com/q2dLj1pkDa— Eye On News (@EyeOnNews24) March 9, 2025

జనసేన నేత వీరంగం.. వైద్యురాలిపై దౌర్జన్యం
సాక్షి, కాకినాడ జిల్లా: అధికారం చేతిలో ఉంది కదా అని కూటమి నేతలు బరితెగిస్తున్నారు. జనసేన నాయకుడు రెచ్చిపోయాడు. ప్రత్తిపాడు సిహెచ్సీ వైద్య సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయాలంటూ వేలు చూపిస్తూ వైద్యులకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు వార్నింగ్ ఇచ్చాడు.రోగులకు వైద్యం చేస్తున్న సమయంలో డాక్టర్ శ్వేతకు తమ్మయ్యబాబు ఫోన్ చేశారు. ఆయనెవరో తెలియదని.. వేరొకరికి వైద్యం చేస్తున్నానని వైద్యురాలు చెప్పారు. ఫోన్లో మాట్లాడడానికి వైద్యురాలు నిరాకరించడంతో తమ్మయ్య బాబు.. నేరుగా ఆసుపత్రికి వచ్చి డాక్టర్ శ్వేతతో పాటుగా అక్కడున్న వైద్య సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. జ్ఞానం ఉందా?.. నోర్మూయ్ అంటూ వైదురాలిపై అరుపులతో వీరంగం సృష్టించారు.

యువరాజ్, రాయుడు విధ్వంసం..సెమీస్‌కు చేరిన టీమిండియా
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ టీ20-2025 టోర్నీలో ఇండియన్ మాస్టర్స్ టీమ్ మరో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాయ్‌పూర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో టీమిండియా తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో సౌరబ్ తివారీ(37 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్స్‌లతో 60), అంబటి రాయుడు(35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో మెరవగా.. ఆఖరిలో కెప్టెన్ యువరాజ్ సింగ్ విధ్వంసం సృష్టించాడు.విండీస్ బౌలర్లను యువీ ఉతికారేశాడు. కేవలం 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేసి ఆజేయగా నిలిచాడు. వీరితో పాటు గుర్క్రీత్ సింగ్ మానన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లలో బెన, కార్టర్, టేలర్ తలా వికెట్ సాధించారు.అనంతరం భారీ లక్ష్య చేధనలో విండీస్ ఆఖరి వరకు పోరాడింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్లు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో డ్వైన్ స్మిత్(34 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 79), విలియమ్ పెర్కిన్స్(52) హాఫ్ సెంచరీలు సాధించాడు.లెండల్ సిమిన్స్( 13 బంతుల్లో 1 ఫోరు, 5 సిక్స్‌లతో 38) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో వెస్టిండీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ మూడు వికెట్లు పడగొట్టగా.. పవన్ నేగి రెండు, ఇర్ఫాన్ పఠాన్ ఒక్క వికెట్ సాధించారు.చదవండి: Champions Trophy final: 'అతడు 20 ఓవర్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే'

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు
ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్(Jagdeep Dhankar) అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అయితే, ఛాతి నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు ఛాతి నొప్పితో బాధపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, తెల్లవారుజామున 2 గంటలకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యబృందం తెలిపింది. ఇక, ధన్కర్ అస్వస్థత విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. Vice President Jagdeep Dhankhar was admitted to the cardiac department at AIIMS Delhi in the early morning. He is stable and under observation: AIIMS Hospital Sources— ANI (@ANI) March 9, 2025

చంద్రబాబు క్షుద్ర రాజకీయం
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచార కుట్రకు టీడీపీ కూటమి ప్రభుత్వం మరోమారు తెరతీసింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మేన్ రంగన్న అనారోగ్యంతో మరణిస్తే, ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రం పన్నుతోంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసు పరిధిలోకి రాష్ట్ర పోలీసులను జొప్పించడం ద్వారా చంద్రబాబు తన కుయుక్తులను చాటుకున్నారు. ఇందుకోసం ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం కూటమి ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం. నాడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 2019 మార్చి 14న వైఎస్ వివేకా హత్యకు గురవ్వగా, ప్రస్తుతం అదే చంద్రబాబు ప్రభుత్వంలో రంగన్న మరణించారన్న వాస్తవాలను కప్పిపుచ్చుతూ తిమ్మిని బమ్మి చేసేందుకు బరి తెగిస్తున్నారు. వాస్తవంగా ఇందుకు బాధ్యత వహించాల్సింది టీడీపీ ప్రభుత్వం. కానీ అందుకు విరుద్ధంగా వివేకా హత్య వెనుక ఉన్న కుట్రను కప్పి పుచ్చేందుకే ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రంగన్నను తొలుత పులివెందుల ఆసుపత్రికి, అనంతరం కడపలోని రిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఈ సహజ మరణానికి రాజకీయ రంగు పులమాలన్న ఆలోచన రావడం ఒక్క చంద్రబాబు ముఠాకే సాధ్యమైంది. ఎవరికైనా, ఏమైనా సందేహాలు ఉంటే ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి నివేదించాలి. ఇంకోవైపు న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రంగన్నతోపాటు గత ఐదేళ్లలో సంభవించిన మరికొన్ని సహజ మరణాలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించారు. తద్వారా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పరోక్షంగానైనా సరే రాష్ట్ర పోలీసులకు అప్పగించాలన్నది చంద్రబాబు కుతంత్రమని స్పష్టమవుతోంది. తద్వారా తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వైఎస్సార్సీపీపై దు్రష్పచారం చేసే కుట్రను అమలు చేయాలన్నది అసలు ఉద్దేశం. అందుకే కుట్ర పూరితంగా గురువారం బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డితో అసెంబ్లీలో మాట్లాడించి, ఆ రాత్రికే సిట్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. రెడ్‌బుక్ కుట్రలను అమలు చేసేందుకే ప్రత్యేకంగా వైఎస్సార్ జిల్లా ఎస్పీగా నియమించిన ఇ.జి.అశోక్కుమార్తోనూ అదే రాత్రి హడావుడిగా మాట్లాడించారు. మంత్రివర్గ సమావేశం వేదికగా కుట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి మండలి సమావేశంలో అజెండా అంశాలపై చర్చ అనంతరం.. ముందస్తు పన్నాగం ప్రకారం రంగన్న మృతిపై చర్చకు తెరతీశారు. ఏకంగా డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను మంత్రి మండలి సమావేశ మందిరంలోకి పిలిపించి రంగన్న మృతిపై ఆరా తీసినట్టు హైడ్రామా నడిపారు. ముందు ఇచి్చన స్క్రిప్టు ప్రకారమే డీజీపీ తన పాత్రలో నటించారు. రంగన్నది అనుమానాస్పద మృతేనని ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే, పోస్టుమార్టం నివేదిక రాకుండానే ఆయన ఏకపక్షంగా ప్రకటించడం విడ్డూరం. బాబు గూటిలో చిలుకే దస్తగిరి స్వయంగా వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశానని అంగీకరించిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం న్యాయ నిపుణులను విభ్రాంతికి గురి చేసింది. తద్వారా తాము లక్ష్యంగా చేసుకున్న వారి పేర్లను అతనితో వాంగ్మూలం ద్వారా చెప్పించడం అన్నది టీడీపీ పకడ్బందీ కుట్రకు తార్కాణం. అప్రూవర్‌గా మారక ముందు అతను ఇచ్చిన వాంగ్మూలం, అప్రూవర్‌గా మారిన తర్వాత ఇచ్చిన వాంగ్మూలం పూర్తి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అత్యంత నేర చరిత్ర కలిగిన దస్తగిరి వైఎస్ వివేకా హత్యకు కొన్ని రోజుల ముందు వరకు రూ.500 కోసం కూడా అప్పులు చేసే దయనీయ స్థితిలో ఉండేవాడు. స్నేహితుడు సునీల్ యాదవ్‌తో అతని వాట్సాప్ చాటింగులే ఆ విషయాన్ని నిర్ధారించాయి. అటువంటి దస్తగిరి అప్రూవర్‌గా మారిపోగానే... అతని వద్దకు కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయన్నది ఈ కేసులో అత్యంత కీలకం. ఇతను బహిరంగంగా సాగిస్తున్న దందాగిరీ అంతా ఇంతా కాదు. ఇలాంటి కిరాయి రౌడీకి సిద్ధార్థ లూథ్రా వంటి ఢిల్లీ స్థాయి లాయర్లు కేసు వాదిస్తుండటం గమనార్హం. గురువారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు లూథ్రాతో రహస్యంగా భేటీ కావడం గమనార్హం. అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను నియమించింది.వివేకా రెండో భార్య వాంగ్మూలాన్ని పట్టించుకోరా? వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య షమీమ్ ఆవేదనతో ఇచి్చన వాంగ్మూలాన్ని అటు సీబీఐ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్నాయి. ఆమెతో రెండో వివాహంతోనే వివేకా కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పడంతోపాటు ఆమె కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పడాన్ని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. షమీమ్‌ను సునీత తీవ్రంగా దూషిస్తూ అవమానించారు. వారిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్‌లు ఆ విషయాన్ని బయట పెట్టాయి. వివేకా హత్య వెనుక ఆయన సొంత కుటుంబ సభ్యులు.. అంటే కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి పాత్ర ఉందని షమీమ్ వాంగ్మూలం ఇచ్చారు. మరి ఆ అంశానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. తద్వారా వైఎస్ వివేకా హత్య వెనుక కారణాలను కప్పిపుచ్చి, తమ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్లాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోందనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టంసిట్ పర్యవేక్షణలో 4 గంటలపాటు నిర్వహణపులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మేన్ రంగన్న మృతదేహానికి శనివారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో తీవ్ర అనారోగ్యానికి గురైన రంగన్న కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహానికి గురువారం కడప రిమ్స్‌లో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని పులివెందులలోని భాకరాపురం శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే, రంగన్న మృతి పట్ల సీఎం చంద్రబాబు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనుమానం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సిట్, వైద్య బృందం సభ్యులు కలిసి భాకరాపురం శ్మశానంలో పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికితీయించారు. శ్రీకాకుళం జిల్లా ఏఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో కడపకు చెందిన వైద్య బృందం, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం సభ్యులు.. రెవెన్యూ అధికారుల సమక్షంలో 4గంటలపాటు రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. ముఖ్యమైన శరీర భాగాలను సేకరించి తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.

'అప్పుడే అలా ప్రతిజ్ఞ చేశాను': గౌతమ్ అదానీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' (Gautam Adani) లింగ సమానత్వం, అన్ని రంగాలలో మహిళల సాధికారత పట్ల తన నిబద్ధతను వెల్లడించారు. తన ప్రయాణాన్ని రూపొందించిన బలమైన మహిళల గురించి మాట్లాడుతూ.. ''బనస్కాంత నుండి బోర్డ్‌రూమ్‌ల వరకు: నా ప్రపంచాన్ని తీర్చిదిద్దిన మహిళలు" అనే పేరుతో ఓ పోస్ట్ చేశారు.లింగ సమానత్వం అంటే..తన మనవరాళ్లు.. తమ కలలను సాధించడంలో మహిళలు ఎటువంటి అడ్డంకులు ఎదుర్కోని ప్రపంచాన్ని నిర్మించాలనే తన సంకల్పాన్ని ఆదానీ వివరించారు. నన్ను, నా ప్రయాణాన్ని దృఢంగా రూపందించుకోవడంలో.. నా తల్లి, భార్య సహాయం చేశారని చెప్పారు. లింగ సమానత్వం అంటే.. ''కేవలం మహిళలకు అవకాశాలు కల్పించడం మాత్రమే కాదు, ఇది మానవ మనుగడకు ఎంతో అవసరం'' అని నొక్కి చెప్పారు.అవధులు లేని ప్రపంచాన్నిదశాబ్దం క్రితం, నా మొదటి మనవరాలి సున్నితమైన వేళ్లను నేను పట్టుకున్నప్పుడు, నేను నిశ్శబ్దంగా ఒక ప్రతిజ్ఞ చేసాను. ఆమె ఆకాంక్షలకు అవధులు లేని ప్రపంచాన్ని నిర్మించడంలో సహాయం చేయాలని అనుకున్నాను. ఇప్పుడు అందమైన ముగ్గురు మానవరాళ్లను చూస్తుంటే.. నా వాగ్దానం మరింత గుర్తుకొస్తోందని అదానీ చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?క్యాలెండర్లో ఒక తేదీఅంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం క్యాలెండర్లో ఒక తేదీ కాదు, మనం సాధించిన పురోగతిని.. ముందుకు సాగుతున్న ప్రయాణాన్ని గుర్తుచేస్తుంది. వ్యక్తిగతంగా.. తల్లి నుంచి ప్రేరణ పొందిన చిన్న పిల్లవాడిగా, నాయకత్వంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను చూస్తున్న వ్యాపారవేత్తగా, నా భార్య ప్రీతి అదానీ ఫౌండేషన్ పట్ల అచంచలమైన అంకితభావంతో ప్రేరణ పొందిన భర్తగా.. నన్ను దాదూ అని ఆప్యాయంగా పిలిచే అమ్మాయిల కోసం పరిమితులు లేని ప్రపంచం గురించి కలలు కంటున్న తాతగా నన్ను నేను చూసుకుంటున్నాను.ప్రతిభకు హద్దులు లేవుగౌతమ్ అదానీ.. తన కంపెనీ ఓడరేవులలో ఒకదానిని సందర్శించినప్పుడు తనకు ఎదురైన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. అక్కడ నాయకత్వ పాత్రల్లో మహిళలు లేకపోవడాన్ని గమనించారు. ఇదే ఆయనలో మార్పు తీసుకురావడానికి దోహదపడింది. నాయకత్వ పాత్రల్లో మహిళలు లేకపోవడానికి కారణం.. సామర్థ్యం లేకపోవడం కాదు, పురుషాధిక్యంతో వివిధ రంగాలలో మార్గాలు లేకపోవడం అని తెలుసుకున్నారు. మహిళల ప్రతిభకు హద్దులు లేవు, వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. కాబట్టి అన్ని రంగాల్లోనూ మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించాలని మహిళా దినోత్సవం సందర్భంగా అదానీ సంకల్పించారు.

SLBC: కాంక్రీట్‌లో కూరుకుపొయిన మృతదేహం గుర్తింపు
Slbc Tunnel Rescue Operation Updates:👉జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంటున్నారు.👉ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.👉కాగా, ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు. 👉కన్వేయర్ బెల్ట్ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది. 👉ప్రమాదం జరిగిన సొరంగంలో పరిశోధన చేసేందుకు కేరళ నుంచి వచ్చిన కాడవర్ డాగ్స్ కూడా ఇది వరకు గుర్తించిన డాగ్స్ స్థానాల్లోనే గుర్తించాయి. 13.500 కి.మీ., అవుతల ఒకే దగ్గర ముగ్గురు వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించాయి. కారి్మకులు చిక్కుకున్నట్లు డాగ్స్ చూపించిన ప్రదేశాల్లో శనివారం రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం పరికరాలు గ్యాస్ కట్టర్‌తో కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటికి పంపించారు. కూలిపడిన పైకప్పు మట్టి దిబ్బలను హిటాచీతో ఒకవైపు తరలిస్తున్నారు. రోజుకో బృందాన్ని సింగరేణి నుంచి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సొరంగంలో వస్తున్న దుర్వాసన సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తోంది.👉టన్నెల్లో జరిగిన ప్రమాదం జాతీయ విపత్తు అని, అందులో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికత ఉపయోగిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం టన్నెల్‌ను సందర్శించిన ఆయన రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.👉సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోభివృద్ధి గురించి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యల్లో అవంతరాలను అధిగమిస్తూ వేగంగా ముందుకెళ్తున్నామని, సొరంగం లోపల ఆక్సిజన్ సరిగా లేకపోవడం, నీటి ఊట అధికంగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 👉టీబీఎం దృఢమైన లోహ శకలాలు, రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇబ్బందులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిత్చయంతో ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేసే కారి్మకులకు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిలటరీ ఇంజినీర్ వికాస్‌సింగ్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్నకుమార్, ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రభాకర్, సింగరేణి, రైల్వే, ఎన్జీఆర్ఐ, హైడ్రా తదితర బృందాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సిరియాలో మళ్లీ మారణహోమం.. 1000 మంది మృతి
బీరుట్: సిరియా అట్టుడుకుతోంది. మాజీ అధ్యక్షుడు అసద్ మద్దతుదారులు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా దాదాపు 1000 మంది మరణించారు. వీరిలో 750 మంది పౌరులు ఉన్నట్టు స్థానిక మీడియా సంస్థలు చెబుతున్నాయి.గత రెండు రోజులుగా సిరియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ మద్దతుదారులు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య ప్రతీకార దాడుల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. అసద్ మద్దతుదారులు జాబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని హత్య చేయడం కారణంగా ఈ ఘర్షణలు మొదలయ్యాయి. శుక్రవారం నుంచి ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో అసద్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రతీకార దాడులకు దిగాయి. అలవైట్లను ఊచకోత కోశారని స్థానికులు తెలిపారు.దీంతో, సిరియా మరోసారి అతలాకుతలమైంది. దాడుల నేపథ్యంలో మృతదేహాలు వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం ప్రభుత్వ భద్రతా బలగాలకు చెందిన 125 మందితో పాటు అసద్‌కు మద్దతుగా పోరాడిన 148 మంది ప్రాణాలు కోల్పోయారు. తీరప్రాంత నగరం లటాకియా చుట్టుపక్కల ప్రాంతాలలో విద్యుత్ , తాగునీటిని నిలిపివేశారని, బేకరీలను మూసివేశారని అబ్జర్వేటరీ పేర్కొంది.ఇదిలాఉండగా.. 14 ఏళ్ల సిరియా సంక్షోభంలో ఇది భయంకరమైన మారణకాండ అని యుద్ధ నియంత్రణ సంస్థ ఒకటి తెలిపింది. అసద్‌ను పదవి నుంచి దించేసి తిరుగుబాటుదారులు అధికారాన్ని చేజిక్కించుకున్న మూడు నెలల తర్వాత డమాస్కస్‌లో ఏర్పడిన ఘర్షణలు నూతన ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. 🚨🇸🇾 THIS IS HAPPENING IN SYRIA!THE WEST CAUSED THIS! pic.twitter.com/oWbU2oOhVl— Jackson Hinkle 🇺🇸 (@jacksonhinklle) March 8, 2025

ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తే ఎలా.. డ్రాగన్ బ్యూటీపై సెటైర్స్
సినిమా రంగంలోనైనా, రాజకీయరంగంలోనైనా చెప్పేదొక్కటి చేసే దొక్కటి. ఈ రంగాల్లో సందర్భాన్ని బట్టి మాట మార్చడం చాలా మంది విషయంలో సహజమే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, డ్రాగన్ నటి కయాదు లోహార్నే కారణం. ఈ అస్సామీ బ్యూటీ 21 ఏళ్ల పరువంలోనే నటిగా ఎంట్రీ ఇచ్చారు. అలా మొదట్లో కన్నడంలో ముగిల్పేట అనే చిత్రంలో కథానాయకిగా నటించారు. ఆ తరువాత మలయాళంలో పథోన్పత్తం నూత్తాండు అనే చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఆపై తెలుగులో 2022లో అల్లూరి అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే విధంగా మరాఠీ భాషలోనూ ప్రేమ్ యు అనే చిత్రంలో నటించారు. అలా రెండేళ్లలోనే నాలుగు భాషలను చుట్టేసిన ఈ అమ్మడికి తాజాగా తమిళంలో నటించిన డ్రాగన్ చిత్రంతో సంచలన విజయం వరించింది. ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ కథానాయకిగా మారిపోయారు. కాగా తాజాగా అధర్వకు జంటగా ఇదయం మురళి అనే చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా తెరపై అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడని ఈ అమ్మడి తన నోటీకొచ్చింది మాట్లాడేస్తుండటంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గన కయాదు లోహర్‌ను సెలబ్రిటీ క్రష్ ఎవరు అన్న ప్రశ్నకు దళపతి విజయ్ తన సెలబ్రిటీ క్రష్ అని చెప్పారు. ఆన నటన తనకు చాలా ఇష్టం అని కూడా పేర్కొన్నారు. ఆయన నటించిన చిత్రాల్లో తెరి అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అయితే అలా అన్న కొద్ది రోజుల్లోనే తన ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులతో ముచ్చటిస్తూ తనకు నచ్చిన హీరో ధనుష్ అనీ, ఈ విషయంలో మరొకరికి చోటు లేదు అని చెప్పారు. దీంతో ఈ బ్యూటీ వ్యవహారాన్ని గమనించిన నెటిజన్లు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నటి అంటూ ఆడేసుకుంటున్నారు. అలా కయాదు లోహర్ వారికి దొరికిపోయారు. అయినా, సినిమాల్లో ఇదంతా సహజమే అంటున్నారు సినీ ప్రముఖులు.

సెలవు లేదన్న హెడ్మాస్టర్.. లెక్కల టీచర్ ఏం చేశారంటే?
భువనేశ్వర్: తీవ్ర అనారోగ్యం పాలైన ఓ ఉపాధ్యాయుడు సెలవు కోసం పెట్టుకున్న దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు తిరస్కరించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సెలవివ్వడం కుదరదంటూ తెగేసి చెప్పారు. పాపం ఆ ఉపాధ్యాయుడు విధిలేక చేతికి ఐవీ డిప్ సెలైన్ పెట్టుకునే విధులకు హాజరయ్యారు. ఆయన ఆరోగ్యం విషమించడం చూసి తోటి వారే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఒడిశాలోని బొలంగీర్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. బొలంగీర్ ప్రభుత్వ పాఠశాలలో విజయలక్ష్మి ప్రధాన్ హెడ్మాస్టర్ కాగా, ప్రకాశ్ భోయి గణితం టీచర్. ఇటీవల తన తాత అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన అనంతరం ప్రకాశ్ ఆరోగ్యం దెబ్బతింది. విధులకు హాజరు కాలేనందున, సెలవు ఇప్పించమంటూ ఆయన ప్రధానోపాధ్యాయినికి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి, మ్యాథ్స్ టీచర్ అవసరం ఎంతో ఉంటుందని చెబుతూ ఆమె ఆ వినతిని తిరస్కరించారు.అయితే, ఎన్ని సార్లు కోరినా హెడ్మాస్టర్ వినిపించుకోకపోవడంతో ప్రకాశ్ భోయి చేతికి సెలైన్ పెట్టుకునే విధులకు వచ్చారు. ఆయన పరిస్థితి చూసి తోటి టీచర్లే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పటన్గఢ్ బ్లాక్ విద్యాధికారి(బీఈవో) ప్రసాద్ మాఝి స్పందించారు. కాజువల్ లీవ్ కోసం ప్రకాశ్ భోయి పంపించిన దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మీ ప్రధాన్ ఎందుకు తిరస్కరించారనే విషయమై విచారణ చేపట్టామన్నారు. ఆమెదే తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. #ମିଳିଲାନି_ଛୁଟି #ସାଲାଇନ୍_ଧରି_ସ୍କୁଲରେ_ଶିକ୍ଷକଦେହ ଖରାପ ସତ୍ତ୍ବେ ମିଳିଲାନି ଛୁଟି। ମାନିଲେନି ପ୍ରିନ୍ସିପାଲ୍, ଶିକ୍ଷକ ହେଲେ ଗୁରୁତର। ସାଲାଇନ୍ ଲଗାଇ ସ୍କୁଲ ଦୁଆରେ ଛାଡ଼ିଲେ ପରିବାର। ଦେଖନ୍ତୁ ଏ ଦୃଶ୍ୟକୁ, ସ୍କୁଲ ଦୁଆରେ ଛିଡ଼ା ହୋଇଛନ୍ତି ଶିକ୍ଷକ। #Teacher #Leave #Saline #Controversy #Balangir #OTV pic.twitter.com/tlnV7Sxlvj— ଓଟିଭି (@otvkhabar) March 8, 2025
భారత్ వ్యతిరేక రాతలు.. అమెరికా టెంపుల్ ధ్వంసం
సమ్మర్ కష్టాలకు స్మార్ట్‌గా చెక్పెట్టేద్దాం ఇలా..!
ఆటోనే ఆధారమైంది!
మణిశంకర్ అయ్యర్ (కాంగ్రెస్) రాయని డైరీ
'ఛావా' తెలుగు వర్షన్.. రెండో రోజు కలెక్షన్ల జోరు
భారీ కీటకం.. దాంతోనే వంటకం..!
ఈ ఫీలింగ్ ఎంత బాగుందో.. నమ్రత నోట కూడా అదే: శిల్ప శిరోద్కర్
'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడు అడుగుపెట్టారో..
పాకిస్థాన్, భారత్ సరిహద్దులకు వెళ్లకండి.. అమెరికా పౌరులకు హెచ్చరిక
న్యూజిలాండ్‌తో ఫైనల్.. రోహిత్ మరో కప్‌ను అందిస్తాడా?
‘అమ్మానాన్నా.. ఐ యామ్ సారీ’
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు.. పనుల్లో కొంత పురోగతి
కలిసి పనిచేయండీ.. కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎంలకు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం
Chhaava Review: ‘ఛావా’(తెలుగు వెర్షన్) మూవీ రివ్యూ
చెల్లెలితో అన్న శారీరక సంబంధం
నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదు: పోసాని
తెలంగాణలో 40 అసెంబ్లీ సీట్లు మహిళలకే
'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్‌కు ముప్పు'
నాన్న.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు..
భారత్ వ్యతిరేక రాతలు.. అమెరికా టెంపుల్ ధ్వంసం
సమ్మర్ కష్టాలకు స్మార్ట్‌గా చెక్పెట్టేద్దాం ఇలా..!
ఆటోనే ఆధారమైంది!
మణిశంకర్ అయ్యర్ (కాంగ్రెస్) రాయని డైరీ
'ఛావా' తెలుగు వర్షన్.. రెండో రోజు కలెక్షన్ల జోరు
భారీ కీటకం.. దాంతోనే వంటకం..!
ఈ ఫీలింగ్ ఎంత బాగుందో.. నమ్రత నోట కూడా అదే: శిల్ప శిరోద్కర్
'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడు అడుగుపెట్టారో..
పాకిస్థాన్, భారత్ సరిహద్దులకు వెళ్లకండి.. అమెరికా పౌరులకు హెచ్చరిక
న్యూజిలాండ్‌తో ఫైనల్.. రోహిత్ మరో కప్‌ను అందిస్తాడా?
‘అమ్మానాన్నా.. ఐ యామ్ సారీ’
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు.. పనుల్లో కొంత పురోగతి
కలిసి పనిచేయండీ.. కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎంలకు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం
Chhaava Review: ‘ఛావా’(తెలుగు వెర్షన్) మూవీ రివ్యూ
చెల్లెలితో అన్న శారీరక సంబంధం
నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదు: పోసాని
తెలంగాణలో 40 అసెంబ్లీ సీట్లు మహిళలకే
'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్‌కు ముప్పు'
నాన్న.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు..
సినిమా

రన్యారావు కేసు కీలక మలుపు.. ఆమె శరీరంపై గాయాలు
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావు(34) కేసు కీలక మలుపు తిరిగింది. తాజాగా ఆమెపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక నుంచి ఆమె సీబీఐ బోనులోకి వెళ్లాల్సిందే. వారు అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. మరో రెండు రోజుల్లో ఆమెను సీబీఐ అధికారులు విచారించనున్నారు. రన్యారావును పోలీసులు విచారిస్తున్న క్రమంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం బంగారం అక్రమ రవాణా మాత్రమే కాకుండా సంఘవిద్రోహ శక్తులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంతోనే సీబీఐ రంగంలోకి దిగింది.రన్యారావు నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.3 కోట్ల నగదును డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం రూ. 18 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన ఫోన్స్‌తో పాటు ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం ఆమె డీఆర్ఐ అధికారుల విచారణలో ఉంది. త్వరలో సీబీఐ అధికారులు కూడా ఆమెను ప్రశ్నించనున్నారు. వారు ఇప్పటికే పలు ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.రన్యారావును విచారించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంచలన విషయాలను తెలిపింది. ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని తెలిపింది. అయితే, దుబాయ్‌కి వెళ్లక ముందే తనకు ఈ గాయాలు అయినట్లు ఆమె తెలియజేసిందని అధికారులు చెప్పారు. దీంతో ఆమెకు అవసరం అయితే వైద్య సాయం అందించాలని జైలు అధికారులను కోర్టు సూచించింది. రన్యారావు విచారణలో భాగంగా తమకు సహకరించడం లేదని డీఆర్ఐ అధికారులు కోర్టుకు తెలిపారు.

ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తే ఎలా.. డ్రాగన్ బ్యూటీపై సెటైర్స్
సినిమా రంగంలోనైనా, రాజకీయరంగంలోనైనా చెప్పేదొక్కటి చేసే దొక్కటి. ఈ రంగాల్లో సందర్భాన్ని బట్టి మాట మార్చడం చాలా మంది విషయంలో సహజమే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, డ్రాగన్ నటి కయాదు లోహార్నే కారణం. ఈ అస్సామీ బ్యూటీ 21 ఏళ్ల పరువంలోనే నటిగా ఎంట్రీ ఇచ్చారు. అలా మొదట్లో కన్నడంలో ముగిల్పేట అనే చిత్రంలో కథానాయకిగా నటించారు. ఆ తరువాత మలయాళంలో పథోన్పత్తం నూత్తాండు అనే చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఆపై తెలుగులో 2022లో అల్లూరి అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే విధంగా మరాఠీ భాషలోనూ ప్రేమ్ యు అనే చిత్రంలో నటించారు. అలా రెండేళ్లలోనే నాలుగు భాషలను చుట్టేసిన ఈ అమ్మడికి తాజాగా తమిళంలో నటించిన డ్రాగన్ చిత్రంతో సంచలన విజయం వరించింది. ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ కథానాయకిగా మారిపోయారు. కాగా తాజాగా అధర్వకు జంటగా ఇదయం మురళి అనే చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా తెరపై అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడని ఈ అమ్మడి తన నోటీకొచ్చింది మాట్లాడేస్తుండటంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గన కయాదు లోహర్‌ను సెలబ్రిటీ క్రష్ ఎవరు అన్న ప్రశ్నకు దళపతి విజయ్ తన సెలబ్రిటీ క్రష్ అని చెప్పారు. ఆన నటన తనకు చాలా ఇష్టం అని కూడా పేర్కొన్నారు. ఆయన నటించిన చిత్రాల్లో తెరి అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అయితే అలా అన్న కొద్ది రోజుల్లోనే తన ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులతో ముచ్చటిస్తూ తనకు నచ్చిన హీరో ధనుష్ అనీ, ఈ విషయంలో మరొకరికి చోటు లేదు అని చెప్పారు. దీంతో ఈ బ్యూటీ వ్యవహారాన్ని గమనించిన నెటిజన్లు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నటి అంటూ ఆడేసుకుంటున్నారు. అలా కయాదు లోహర్ వారికి దొరికిపోయారు. అయినా, సినిమాల్లో ఇదంతా సహజమే అంటున్నారు సినీ ప్రముఖులు.

తెలుగు హీరో... హిందీ విలన్
తెలుగు తెరపై బాలీవుడ్ హీరోయిన్ల హవా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ నటులు కూడా తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేసేందుకే బాలీవుడ్ యాక్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా తొలిసారిగా తెలుగు తెరపై విలన్‌గా కనిపించనున్న కొందరు బాలీవుడ్ యాక్టర్స్, వారు ఓకే చేసిన సినిమాలు వివరాలు ఇలా ఉన్నాయి.మల్టీ మిలియనీర్‘నీర్జా, పద్మావత్, సంజు, గంగుభాయి కతియావాడి’ వంటి చిత్రాలతో నటుడిగా బాలీవుడ్లో నిరూపించుకున్నారు జిమ్ సర్భ్. ఈ నటుడికి టాలీవుడ్ ఎంట్రీ చాన్స్ లభించింది. నాగార్జున–ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఓ మల్టీ మిలియనీర్ పాత్రను జిమ్ సర్భ్ చేస్తున్నారు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ పీరియాడికల్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హైప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్ భిక్షగాడిగా కనిపిస్తారని, ఓ ఆఫీసర్‌గా నాగార్జున, మల్టీ మిలియనీర్ పాత్రలో జిమ్ సర్భ్ కనిపిస్తారని తెలిసింది. ఓ బలమైన సామాజిక అంశం, డబ్బు ప్రధానాంశాలుగా ‘కుబేర’ కథనం సాగుతుందని సమాచారం.ఇటు ఓజీ... అటు జీ2‘మర్డర్, గ్యాంగ్‌స్టర్, ముంబై సాగ, టైగర్ 3, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ వంటి పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఇమ్రాన్ హష్మి గురించి తెలుగు ఆడియన్స్‌కు తెలిసిందే. ఈ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు ఖరారైంది. ప్రజెంట్ రెండు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటిస్తున్నారు ఇమ్రాన్ హష్మి. పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలోని గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ – ప్రచారంలో ఉన్న టైటిల్)లో ఇమ్రాన్ హష్మీ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఓమి భావ్ అనే పాత్రలో హష్మి కనిపించనున్నట్లుగా తెలిసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ΄్లాన్ చేస్తోంది. మరోవైపు అడివి శేష్ ‘జీ 2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ నటి వామికా గబ్బి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. కాగా ‘జీ 2’ సినిమా షూటింగ్లో ఆల్రెడీ ఇమ్రాన్ హష్మీ జాయిన్ అయ్యారు. గత ఏడాది అక్టోబరులో ‘జీ 2’ కోసం ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ఇమ్రాన్ గాయపడ్డారు. కానీ ఆ తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. కాగా అడివి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘జీ 2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకేసారి రెండు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటిస్తూ, డబుల్ విలన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇమ్రాన్ హష్మి.ఇన్స్పెక్టర్ స్వామిఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం విజయ్ సేతుపతి ‘మహారాజా’, మలయాళ చిత్రం ‘రైఫిల్ క్లబ్’ వంటి చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో అనురాగ్ కశ్యప్ యాక్టర్‌గా తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని కొందరు తెలుగు ఆడియన్స్ ఆశపడ్డారు. వారి ఆశ నిజమైంది. అడివి శేష్ హీరోగా ‘డెకాయిట్: ఓ ప్రేమకథ’ అనే సినిమా రూపొందుతోంది.ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ఇన్స్పెక్టర్ స్వామి అనే కీలక పాత్రలో అనురాగ్ కశ్యప్ నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ మహారాష్ట్రలో ఉంటుందని తెలిసింది. కథ రీత్యా... ఇద్దరు ప్రేమికులు బ్రేకప్ చెప్పుకుంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారికి ఇష్టం లేకపోయినా... వీరిద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి ఉంటుంది.ఈ క్రైమ్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత ఇన్స్పెక్టర్ స్వామిది. మరి... క్రిమినల్స్ అయిన ఈ ప్రేమికులను పోలీసాఫీసర్‌గా ఇన్స్పెక్టర్ స్వామి పట్టుకున్నాడా? అనేది ‘డెకాయిట్’ సినిమా చూసి తెలుసుకోవాలి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, భావోద్వేగం వంటి అంశాల మేళవింపుతో రూపొందుతున్న ‘డెకాయిట్’ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు నటుడిగానే కాదు... ‘పాంచ్, బాంబే టాకీస్, అగ్లీ, మ్యాడ్లీ, దో బార’ వంటి హిందీ చిత్రాలతో అనురాగ్ కశ్యప్ బాలీవుడ్లో దర్శకుడిగా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. అలాగే నిర్మాతగానూ, రైటర్‌గానూ ఆయన రాణిస్తున్న విషయం కూడా విదితమే.అర్జున్‌కు విలన్‌గా...స్క్రీన్‌పై నందమూరి కల్యాణ్‌రామ్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు బాలీవుడ్ యాక్టర్ సోహైల్ ఖాన్. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, సోహైల్ ఖాన్, శ్రీకాంత్, ‘యానిమల్’ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీలో ఐపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు విజయశాంతి. ఇక ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నారు సోహైల్ ఖాన్. ‘పార్ట్నర్, వీర్, దబాంగ్ 3’ వంటి చిత్రాల్లో నటుడిగా అభినందనలు అందుకున్న సోహైల్ ఖాన్‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టాకీ పార్టు పూర్తయింది. రామ్‌చరణ్‌కు విలన్‌గా...రామ్‌చరణ్‌కు విలన్‌గా కనిపించనున్నారు బాలీవుడ్ యంగ్ హీరో దివ్యేందు. హీరో రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలోప్రారంభం కానుందని తెలిసింది.కాగా ఈ మల్టీ స్పోర్ట్స్ (క్రికెట్, కుస్తీ తదితర క్రీడలు) డ్రామాలో దివ్యేందు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ దివ్యేందు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. కాగా ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు విలన్‌గా కనిపిస్తారట దివ్యేందు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కావొచ్చని, దీపావళికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందనీ సమాచారం. మరోవైపు ‘ప్యార్‌కా పంచనామా, టాయిలెట్: ఏక్ ప్రేమకథ, ఓల్డ్ కపుల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటుడిగా రాణించారు దివ్యేందు. కాగా ‘మిర్జాపూర్, సాల్ట్ సిటీ, ది రైల్వే మెన్’ వంటి వెబ్ సిరీస్‌లతో దివ్యేందు మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. కొందరు బాలీవుడ్ యాక్టర్స్ ఆల్రెడీ తెలుగులో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా చేసిన ‘భగవంత్ సింగ్ కేసరి’లో అర్జున్ రామ్‌పాల్, ‘డాకు మహారాజ్’లో బాబీ డియోల్ విలన్స్‌గా నటించారు. కాగా పవన్ కల్యాణ్ ‘హరిహరవీర మల్లు’ చిత్రంలో ఎంతో కీలకమైన ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర 2’ చిత్రంలోనూ బాబీ డియోల్ విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. గత ఏడాది విడుదలైన రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేశారు సంజయ్ దత్. ఇప్పుడు ప్రభాస్ ‘రాజా సాబ్’, సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాల్లోనూ లీడ్ రోల్స్ చేస్తున్నట్లుగా తెలిసింది. అలాగే ప్రభాస్ ‘ఫౌజి’ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ లీడ్ యాక్టర్స్‌గా చేస్తున్నారు. నాగార్జున–నానీల ‘దేవదాసు’ (2018)లో విలన్‌గా యాక్ట్ చేసిన కునాల్ కపూర్ ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’లో మళ్లీ విలన్‌గా యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ప్రభాస్ ‘కల్కి’లో అమితాబ్ బచ్చన్ ఎంతటి బలమైన రోల్ చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కల్కి 2’లోనూ అమితాబ్ బచ్చన్ రోల్ కొనసాగుతుందని తెలిసిందే... ఇలా విలన్స్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్స్ మరికొందరు ఉన్నారు.– ముసిమి శివాంజనేయులు

కల్యాణ్ రామ్.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి
కల్యాణ్ రామ్ కొత్త మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే ఓ పేరుని టైటిల్ గా అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు. ఈ మేరకు క్రేజీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు.'బింబిసార'తో హిట్ కొట్టిన కల్యాణ్ రామ్.. దీని తర్వాత రెండు ఫ్లాప్స్ చవిచూశాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వీళ్లిద్దరూ తల్లికొడుకులుగా నటిస్తున్నారని క్లారిటీ వచ్చింది. ఈ మేరకు 'అర్జున్ సన్నాఫ్ వైజయంతీ' అనే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ లుక్ పై ఎందుకింత ట్రోలింగ్?)పోలీస్ డ్రస్సులో విజయశాంతి, పక్కనే కల్యాణ్ రామ్ నడుస్తున్నట్లు ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. 'ప్రతి స్త్రీ ఒక కొడుకును పెంచుకుంటుంది. వైజయంతి ఐపీఎస్ ఇక్కడ అర్జున్ అనే సైన్యాన్ని పోషిస్తోంది'' అని పేర్కొన్నారు. .గతంలోనూ విజయశాంతి.. వైజయంతి పేరుతో ఓ సినిమా చేశారు. అందులో ఆర్మీ ఆఫీసర్ కాగా.. ఇప్పుడు పోలీస్ గా నటిస్తున్నారు. ఇందులో కల్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. త్వరలో రిలీజ్ వివరాలు వెల్లడిస్తారు.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్‌కు ముప్పు'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తుంటే.. న్యూజిలాండ్ మాత్రం మరోసారి టీమిండియాను మట్టికర్పించాలని పట్టుదలతో ఉంది.ఇప్పటివరకు భారత్-కివీస్ రెండు సార్లు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలపడ్డాయి. ఛాంపియన్స్ ట్రోఫీ-2000, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2021 ఫైనల్లో కివీస్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. ఇక ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకున్నాయి.మరోసారి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు కూడా స్పిన్నర్లను నెట్స్‌లో ఎక్కువగా ఎదుర్కొన్నారు. న్యూజిలాండ్ అయితే ప్రత్యేకంగా శశ్వత్ తివారీ అనే ఓ స్పిన్నర్‌ను నెట్‌బౌలర్‌గా ఎంపిక చేసి మరి ప్రాక్టీస్ చేసింది.వరుణ్ కాదు.. అతడితోనే ముప్పు?అయితే న్యూజిలాండ్ టీమ్ ఆందోళన చెందుతుంది మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం కాదంట. రవీంద్ర జడేజా వంటి ఎడమచేతి వాటం స్పిన్నర్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వారు సిద్దమవుతున్నారంట. ఈ విషయాన్ని స్వయంగా కివీస్ నెట్‌బౌలర్‌గా ఉన్న శశ్వత్ తివారీ వెల్లడించాడు."ఈ రోజు న్యూజిలాండ్ జట్టుకు నెట్స్‌లో చాలా సమయం పాటు బౌలింగ్ చేశాను. వారు రవీంద్ర జడేజాను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నారు. జడేజా బౌలింగ్‌లో వేరియేషన్స్ ఉంటాయి. అతడు చాలా వేగంతో బంతిని స్పిన్ చేస్తాడు. ఆ స్పీడ్‌ను అలవాటు చేసుకునేందుకు నన్ను 18 యార్డ్స్ నుంచి బౌలింగ్ చేయమన్నారు.నేను వారి చెప్పినట్లగానే ఆ పాయింట్ నుంచి బౌలింగ్ చేశారు. కొద్దిసేపు వారు ప్రాక్టీస్ చేశారు. కానీ బంతి చాలా త్వరగా డెలివరీ అవుతుండడంతో 22 గజాల నుంచే తిరిగి బౌలింగ్ చేయమని చెప్పారు. వారు ముఖ్యంగా ఎడమచేతి వాటం బౌలర్లపై ఎక్కువగా దృష్టిపెట్టారు. ప్రాక్టీస్‌లో స్పిన్‌ను ఎదుర్కొవడంలో వారు ఎక్కడా ఇబ్బంది పడలేదు.కానీ భారత జట్టులో టాప్-క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి భారత స్పిన్నర్ల నుంచి మరోసారి వారికి కఠిన సవాలు ఎదురు కానుంది" అని శశ్వత్ తివారీ ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా కివీస్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చక్రవర్తి 5 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో అతడి నుంచి మరోసారి కివీస్‌కు ముప్పు పొంచి ఉందని అంతా భావిస్తున్నారు.చదవండి: చాంపియన్ నువ్వా.. నేనా

వోల్ కమాల్... బెంగళూరు ఢమాల్
లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చరిత్రకెక్కిన పరుగుల పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు పోరాడి ఓడింది. డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్స్‌కు దూరమైంది. గెలిస్తే రేసులో నిలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 12 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ చేతిలో పరాజయం చవిచూసింది. తాజా ఫలితంతో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఢిల్లీ ఇదివరకే ప్లేఆఫ్స్ చేరింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో ఇదే అత్యధిక స్కోరు కాగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జార్జియా వోల్ (56 బంతుల్లో 99 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. కిరణ్ నవ్‌గిరే (16 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ ఆట ఆడేసింది. ఆర్సీబీ బౌలర్లలో జార్జియా వేర్హమ్ 2 వికెట్లు తీసింది. అనంతరం కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ 19.3 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్ (33 బంతుల్లో 69; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), స్నేహ్ రాణా (6 బంతుల్లో 26; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులతో యూపీ శిబిరాన్ని వణికించారు. సోఫీ ఎకిల్‌స్టోన్, దీప్తిశర్మ చెరో 3 వికెట్లు తీశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా యూపీ ప్లేయర్ తమ రెగ్యులర్ టీమ్ కిట్‌కు బదులుగా గులాబీ రంగు జెర్సీలను ధరించారు. జార్జియా ‘జిగేల్’ సొంత మైదానంలో ఆఖరి పోరులో బ్యాటింగ్‌కు దిగిన యూపీ ఓపెనర్లు గ్రేస్ హారిస్, జార్జియా వోల్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. బంతిని అదేపనిగా బౌండరీని దాటించడంతో స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. పవర్‌ప్లేలో 67 పరుగులు రాబట్టింది. గ్రేస్ హారిస్ (22 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్) రనౌట్ కావడంతో తొలి వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే కిరణ్ నవ్‌గిరే రావడంతో మరో మెరుపు భాగస్వామ్యం నమోదైంది. 9.3 ఓవర్లలోనే వారియర్స్ స్కోరు వందకు చేరుకుంది. 13వ ఓవర్లో కిరణ్ అవుట్ కావడంతో రెండో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడగా... మరోవైపు జార్జియా వోల్ కడదాకా అజేయంగా క్రీజులో నిలిచింది. పరుగు తేడాతో సెంచరీ భాగ్యాన్ని దక్కించుకోలేక పోయింది. ఆఖరి బంతికి రెండో పరుగు తీసే క్రమంలో దీప్తి రనౌటైంది. రిచా ధనాధన్ షో వృథా మూడో ఓవర్లో కెప్టెన్ స్మృతి మంధాన (4), మరుసటి ఓవర్లో మేఘన (12 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), పవర్ ప్లే తర్వాత ఎలిస్ పెర్రీ (15 బంతుల్లో 28; 6 ఫోర్లు), రాఘ్వి బిస్త్ (14), కనిక (8) ని్రష్కమించడంతో 107/5 స్కోరు వద్ద బెంగళూరు ఆశలు ఆడుగంటాయి. ఈ దశలో హిట్టర్ రిచా ఘోష్ అసాధారణ పోరాటం చేసింది. భారీ సిక్స్‌లు, చూడచక్కని బౌండరీలతో విజయంపై ఆశలు రేపింది. 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసుకుంది. 22 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన దశలో రిచా అవుటైంది. చార్లీ డీన్ (9), జార్జియా వేర్హామ్ (17) నిరాశపరిచారు. 4, 6, 6, 4, 6, అవుట్ 19వ ఓవర్లో స్నేహ్ రాణా మెరుపులు బెంగళూరులో ఆశలు రేపాయి. దీప్తి వేసిన ఈ ఓవర్లో కిమ్‌గార్త్ సింగిల్ తీసి స్నేహ్కు స్ట్రయిక్ ఇచ్చింది. తర్వాతి ఐదు బంతుల్లో ఆమె 4, 6, 6, 4(నోబాల్), 6లతో చకచకా 26 పరుగులు చేసింది. 7 బంతుల్లో 15 పరుగుల సమీకరణం సులువనిపించింది. కానీ ఆఖరి బంతికి స్నేహ్ రాణా భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద పూనమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో యూపీ ఊపరి పీల్చుకుంది. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: గ్రేస్ హారిస్ రనౌట్ 39; జార్జియా వోల్ నాటౌట్ 99; కిరణ్ (సి) పెర్రి (బి) వేర్హామ్ 46; చినెల్లీ హెన్రీ (సి) స్మృతి (బి) వేర్హామ్ 19; సోఫీ (బి) చార్లీడీన్ 13; దీప్తిశర్మ రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 225. వికెట్ల పతనం: 1–77, 2–148, 3–191, 4–223, 5–225. బౌలింగ్: కిమ్ గార్త్ 4–0–42–0, రేణుక సింగ్ 3–0–42–0, చార్లీ డీన్ 4–0–47–1, ఎలీస్ పెర్రి 4–0–35–0, జార్జియా వేర్హామ్ 4–0–43–2, స్నేహ్ రాణా 1–0–13–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: మేఘన (సి) వోల్ (బి) సోఫీ 27; స్మృతి మంధాన (సి) వోల్ (బి) హెన్రీ 4; ఎలిస్ పెర్రి (బి) అంజలి 28; రాఘ్వి బిస్త్ (సి) ఉమాఛెత్రి (బి) హెన్రీ 14; రిచా ఘోష్ (సి) హెన్రీ (బి) దీప్తిశర్మ 69; కనిక (బి) దీప్తి శర్మ 8; జార్జియా వేర్హమ్ (సి) సబ్–ఆరుశ్రీ (బి) సోఫీ 17; చార్లీ డీన్ (సి) కిరణ్ (బి) సోఫీ 9; కిమ్‌గార్త్ నాటౌట్ 3; స్నేహ్ రాణా (సి) పూనమ్ (బి) దీప్తిశర్మ 26; రేణుక రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 213. వికెట్ల పతనం: 1–29, 2–43, 3–76, 4–80, 5–107, 6–171, 7–182, 8–183, 9–211, 10–213. బౌలింగ్: చినెల్లీ హెన్రీ 4–0–39–2, గ్రేస్ హారిస్ 1–0–22–0, సోఫి ఎకిల్‌స్టోన్ 4–0–25–3, క్రాంతి గౌడ్ 3–0–35–0, అంజలి శర్వాణి 3–0–40–1, దీప్తిశర్మ 4–0–50–3, జార్జియా వోల్ 0.3–0–2–0.

క్లాసికల్ అంటేనే ఇష్టం
న్యూఢిల్లీ: చదరంగంలో ఎన్ని ఫార్మాట్లు వచ్చినా... క్లాసికల్‌కు ఉన్న ప్రాధాన్యత వేరని ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ అన్నాడు. ఇటీవలి కాలంలో అన్నీ ఫార్మాట్లలో సత్తా చాటుతున్న గుకేశ్... తనకు స్వతహాగా సంప్రదాయ క్లాసికల్ గేమ్ అంటేనే ఎక్కువ ఇష్టమని వెల్లడించాడు. ‘ఏ ఫార్మాట్లో ఆడాలి అనే దాని గురించి పెద్దగా ఆలోచించను. ఫ్రీ స్టయిల్ ఉత్తేజకరమైన ఫార్మాట్... ఆడేటప్పుడు ఎంతో బాగుంటుంది. ఇప్పటి వరకు ఫ్రీస్టయిల్ విభాగంలో రెండు టోర్నీలు మాత్రమే జరిగాయి. ఇప్పుడే దానిపై వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది. ఫ్రీస్టయిల్ ఫార్మాట్ మరింత ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. అదే సమయంలో క్లాసికల్ విభాగానికి ఉన్న ప్రాధాన్యత వేరు. ఘన చరిత్ర ఉన్న క్లాసికల్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ అన్నిటి కంటే అత్యున్నతమైంది. క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్కు ఫ్రీస్టయిల్ అదనం. నేను అన్నింట్లో ఆడాలని అనుకుంటున్నా’ అని గుకేశ్ శనివారం ఓ కాన్క్లేవ్లో అన్నాడు. వచ్చే నెల 7–14 వరకు జరగనున్న పారిస్ అంచె ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్ టూర్లో పాల్గొననున్నట్లు గుకేశ్ వెల్లడించాడు. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్తో పాటు 12 మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొంటున్న ఈ చెస్ గ్రాండ్‌స్లామ్ తొలి అంచె జర్మనీ పోటీల్లో విన్సెంట్ కెయిమెర్ విజేతగా నిలిచాడు. కెరీర్ తొలి నాళ్లలో ఎదుర్కొన్న ఆరి్థక కష్టాలను గుకేశ్ కాన్ క్లేవ్లో గుర్తుచేసుకున్నాడు. టోర్నమెంట్లలో పాల్గొనేందుకు డబ్బులు లేని సమయంలో తల్లిదండ్రుల స్నేహితులు అండగా నిలిచారని అన్నాడు. ‘ఒకప్పుడు పోటీలకు వెళ్లేందుకు తగినంత డబ్బు లేకపోయేది. కుటుంబ సభ్యులు ఎంతో ప్రయతి్నంచి నిధులు సమకూర్చేవారు. నిస్వార్ధపరమైన కొందరి సాయం వల్లే ఈ స్థాయికి వచ్చా. ఇప్పుడు ఆరి్థక ఇబ్బందులు తొలగిపోయాయి’ అని గుకేశ్ అన్నాడు. కొవిడ్–19 ప్రభావం తర్వాత దేశంలో చెస్‌కు మరింత ఆదరణ పెరిగిందని గుకేశ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ 100 మంది చెస్ ప్లేయర్లలో భారత్ నుంచి 13 మంది ఉన్నారని అది చదరంగంలో మన ప్రగతికి చిహ్నమని గుకేశ్ అన్నాడు. వీరందరికీ దారి చూపింది విశ్వనాథన్ ఆనంద్ అని... ఆయన బాటలోనే మరింత మంది గ్రాండ్‌మాస్టర్లు వచ్చారని పేర్కొన్నాడు. దేశంలో చెస్‌కు మంచి ఆదరణ లభిస్తోందని... స్పాన్సర్లతో పాటు ప్రభుత్వాలు కూడా అండగా నిలుస్తున్నాయని గుకేశ్ వివరించాడు.

అరవింద్... కొత్త చాంపియన్
న్యూఢిల్లీ: భారత చదరంగంలో నేటితరం సంచలన విజేతలతో పోల్చుకుంటే అరవింద్ చిదంబరం ఆలస్యంగా వికసించిన చాంపియన్. ఇప్పటికే టీనేజ్లోనే దొమ్మరాజు గుకేశ్, ఆర్.ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేశి అంతర్జాతీయ చెస్ టోర్నీలు, ఎలో రేటింగ్స్‌లో సత్తా చాటుకున్నారు. కానీ 64 గడుల బరిలో అరవింద్ 25 ఏళ్ల వయసులో వార్తల్లోకెక్కాడు. ప్రాగ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలువడం ద్వారా భారత్‌లో కొత్త చదరంగ చక్రవర్తిగా అవతరించాడు. వయసు రీత్యా అతను లేటే కావొచ్చు... కానీ లేటెస్ట్ చాంపియన్‌గా భారత క్రీడాఖ్యాతిని పెంచాడు. గుకేశ్, ప్రజ్ఞానంద, అర్జున్‌లతో కలిసి ఇప్పుడు నాలుగో స్తంభమయ్యాడు. విజేతగా మలచిన తల్లి మధురైలో పుట్టిన అరవింద్ పసిప్రాయంలోనే తండ్రిని కోల్పోయాడు. మూడేళ్ల వయసులోనే కన్నతండ్రి లోకాన్ని వీడితే... కన్నతల్లే అన్నీ తానై పెంచింది. జీవితబీమా (ఎల్ఐసీ) ఏజెంట్‌గా పనిచేస్తూ మదురై నుంచి చెన్నైకి మారి బతుకుబండిని లాగించింది. ఏడేళ్ల వయసులో తాత చెస్‌లో ఓనమాలు నేర్పితే అందులోనే కెరీర్‌ను ఎంచుకున్నాడు. విఖ్యాత వేలమ్మాళ్ స్కూల్లో విద్యనభ్యసించిన అరవింద్ చదువుకునే రోజుల్లో ఇప్పటి ప్రపంచ చాంపియన్ గుకేశ్‌కు సీనియర్. గుకేశ్ కూడా వేలమ్మాళ్ విద్యార్థే! ప్రాగ్ మాస్టర్స్లాంటి మేటి టోర్నీల్లో సాధారణంగా టాప్–20 ర్యాంకింగ్ ప్లేయర్లకు పాల్గొనే అవకాశముంటుంది. అంతకుమించి ర్యాంకుల్లో ఉంటే నిర్వాహకుల నుంచి వైల్డ్కార్డ్లాంటి ఎంట్రీలు ఉండాల్సిందే. అలా వచ్చిన అవకాశాన్ని అరవింద్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. 2013లో తొలి జీఎమ్ నార్మ్ భారత విఖ్యాత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 2013లో మాగ్నస్ కార్ల్‌సన్‌కు ప్రపంచ చెస్ చాంపియన్ కిరీటాన్ని కోల్పోయిన ఏడాదే పాఠశాల విద్యనభ్యసిస్తున్న అరవింద్ తొలి గ్రాండ్‌మాస్టర్ (జీఎమ్) నార్మ్ పొందాడు. అక్కడి నుంచి అతని ఆట మరో దశకు చేరడంతో 2015లో గ్రాండ్‌మాస్టర్ హోదా లభించింది. అడపాదడపా టోర్నీల్లో గెలుస్తున్నప్పటికీ 2019 అతని కెరీర్‌ను మలుపుతిప్పింది. భారత ఓపెన్‌లో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఇలా మూడు విభాగాల్లోనూ అరవింద్ విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. దాంతో పాటే తొలిసారి 2700 ఎలో రేటింగ్లోకి వచ్చేశాడు. ఇప్పుడు ప్రాగ్ టైటిల్‌తో లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అరవింద్ 14వ స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున నాలుగో ర్యాంకర్‌గా ఎదిగాడు.
బిజినెస్

'గంటకు రూ. 67కే జీపీయూలు'
న్యూఢిల్లీ: ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్‌లో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు) అత్యంత తక్కువ ధరకి, గంటకు రూ. 67కే అందుబాటులో ఉంటాయని కేంద్ర ఐటీ మంత్రి 'అశ్విని వైష్ణవ్' తెలిపారు. ఇండియా ఏఐ మిషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్, డేటాసెట్ ప్లాట్‌ఫాం ఏఐకోశ మొదలైనవి ఆయన ఆవిష్కరించారు.అంకుర సంస్థలు, విద్యార్థులు, పరిశోధకులకు మొదలైన వారికి ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్‌లో 18,000 జీపీయులు, క్లౌడ్ స్టోరేజ్, ఇతరత్రా ఏఐ సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు. సొంత ఫౌండేషనల్ మోడల్స్‌ను రూపొందించుకోవడంపై భారత్ పురోగతి బాగుందన్నారు. ఇందుకు సంబంధించి 67 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు.ఏఐ అప్లికేషన్స్, సొల్యూషన్స్‌ను తయారు చేయడంలో పరిశోధకులు, ఎంట్రప్రెన్యూర్లు, స్టార్టప్‌లకు ఉపయోగపడేలా డేటాసెట్లు, సాధనాలు మొదలైనవన్నీ ఏఐకోశలో ఉంటాయి. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఏఐ ఆవిష్కరణలకు తోడ్పడే సమగ్ర వ్యవస్థను తయారు చేసే దిశగా కేంద్ర క్యాబినెట్ గతేడాది మార్చిలో రూ. 10,372 కోట్ల బడ్జెట్‌తో ఇండియాఏఐ మిషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.

నూకల ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: నూకల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తెలిపింది. ప్రభుత్వ గోడౌన్లలో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉండటంతో పాటు రిటైల్ ధరలూ అదుపులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిల్వలు భారీగా పెరగడంతో ఎగుమతులకు ఆమోదం ఇవ్వాలంటూ ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని గతంలో కోరారు. కాగా 2022 సెప్టెంబర్‌లో నూకల ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. గత ఏడాది బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతుల కోసం నిర్దేశించిన టన్నుకు 490 డాలర్ల కనీస ఎగుమతి ధరను (ఎంఈపీ) ప్రభుత్వం తొలగించింది. అలాగే ఈ రకం ఎగుమతులపై ఉన్న పూర్తి నిషేధాన్ని ఉపసంహరించుకుంది. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో గాంబియా, బెనిన్, సెనెగల్, ఇండోనేషియా తదితర దేశాలకు 194 మిలియన్ డాలర్ల విలువైన నూకలు ఎగుమతి చేసింది. 2022–23లో 983 మిలియన్ డాలర్లు, 2021–22లో 1.13 బిలియన్ డాలర్ల విలువ చేసే నూకలు భారత్ నుంచి విదేశాలకు చేరాయి.

రూ. 1.5 లక్షల కోట్లకు రష్యా చమురు కొనుగోళ్లు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్ దాదాపు 112.5 బిలియన్ యూరోల (సుమారు రూ. 1.5 లక్షల కోట్లు) ముడి చమురు కొనుగోలు చేసినట్లు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (క్రియా) ఒక నివేదికలో తెలిపింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైన 2022 ఫిబ్రవరి 24 నుంచి శిలాజ ఇంధనాలకు సంబంధించి రష్యాకు లభించిన చెల్లింపుల వివరాలను ఇందులో పొందుపర్చింది. దీని ప్రకారం యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా శిలాజ ఇంధన ఎగుమతుల ద్వారా 835 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జించినట్లు వివరించింది. చైనా అత్యధికంగా 235 బిలియన్ యూరోల (170 బిలియన్ యూరోల చమురు, 34.3 బిలియన్ యూరోల బొగ్గు, 30.5 బిలియన్ యూరోల గ్యాస్) ఇంధనాలు కొనుగోలు చేసింది. భారత్ 205.84 బిలియన్ యూరోల ఇంధనాలను కొనుగోలు చేసింది. ఇందులో 112.5 బిలియన్ యూరో క్రూడాయిల్, 13.25 బిలియన్ డాలర్ల బొగ్గు ఉంది. యుద్ధం వల్ల విధించిన ఆంక్షలతో రష్యా చమురు చౌకగా లభిస్తున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి భారత్ గణనీయంగా కొనుగోళ్లు పెంచుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు బ్యారెల్‌కి 18–20 శాతం వరకు లభించిన డిస్కౌంటు ఇటీవలి కాలంలో 3 డాలర్ల దిగువకు పడిపోయింది.

మందగమనంలోకి అమెరికా!
వాషింగ్టన్: తీవ్ర అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి అడుగుపెట్టొచ్చని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల వ్యయంలో మందగమనం సంభవించే అవకాశముందని, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అనిశ్చితి కొన సాగుతోందని వ్యాపార వర్గాల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఫెడ్ చైర్మన్ వ్యా ఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన ఆర్థిక ఫోరంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు. → కొత్త ట్రంప్ ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో ఏ మాత్రం తొందరపడబోదు. → కొత్త ప్రభుత్వం 4 ప్రధాన రంగాల్లో గణనీయమైన విధాన మార్పులను అమలు చేసే ప్రక్రియలో ఉంది. వాణిజ్యం, వలస, ద్రవ్య, నియంత్రణ విధానాల్లో మార్పులు చోటుచేసుకునే వీలుంది. ఈ మార్పులు, వాటి ప్రభావాలపై అనిశ్చితి తీవ్రంగా ఉంది. → పరిస్థితులు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడంపై మేము దృష్టి సారిస్తాము. మేము తొందరపడాల్సిన అవసరం లేదు. స్పష్టత కోసం ఎదురుచూడడానికే మేము మొగ్గు చూపిస్తాము. → ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితిలో ఉంది. అయితే చోటుచేసుకుంటున్న పరిణామాలు భవిష్యత్తులో వ్యయాలు, అలాగే పెట్టుబడులపై ఎలా ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. → కీలక సూచీలు స్థిరంగానే ఉన్నాయని. అయితే ద్రవ్యోల్బణం విషయంలో ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. ఉపాధి కల్పనలో మాత్రం వృద్ధి ధోరణి కొనసాగుతోంది. → ద్రవ్యోల్బణం అంచనాలను మించిన వేగంతో తగ్గినా లేదా ఆర్థిక వ్యవస్థ బలహీనపడినా ద్రవ్య విధానంలో అవసరమైన మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. → ఫిబ్రవరి నెలలో అమెరికా ప్రభుత్వం 1,51,000 ఉద్యోగాల వృద్ధిని నమోదుచేసింది. అయితే సెపె్టంబర్ నుంచి చూస్తే నెలకు సగ టున 1,91,000 ఉద్యోగ కల్పన జరుగుతోంది. మార్కెట్లపై ప్రతికూలతలు.. ట్రంప్ ప్రభుత్వం మెక్సికో, కెనడా వంటి ప్రధాన వ్యాపార భాగస్వాములపై భారీ దిగుమతి సుంకాలను ప్రకటించడం, అలాగే చైనా నుండి దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేయడం వంటి పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ మార్చి 18–19 తేదీల్లో జరిపే తన పాలసీ సమావేశంలో 4.25%–4.50% శ్రేణిలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశం ఉంది. పాలసీ నిర్ణేతలు ఆవిష్కరించే కొత్త ఆర్థిక అంచనాలు.. ట్రంప్ ప్రభుత్వ తొలి రెండు నెలల విధానాలు, ఇవి ద్రవ్యోల్బణం, ఉపాధి, ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్ల మార్గాన్ని ఎలా ప్రభావితం చేశాయనే అంశంపై స్పష్టత నిచ్చే అవకాశం ఉంది. కాగా, మార్కెట్లో పెట్టుబడిదారులు ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఫెడ్ మూడు దఫాలుగా పావు శాతం (మొత్తం 0.75%) చొప్పున రేటు కోతలు ఉండే అవకాశం ఉందని భావిస్తుండడం గమనార్హం.
ఫ్యామిలీ

లేడీస్ బ్యాంక్ ఎక్కడుందో తెలుసా?
సనత్‌నగర్: ఇంటిని అందంగా తీర్చిదిద్దడమే కాదు.. కుటుంబాన్ని నడిపించడంలోనూ మహిళల పాత్ర ఎనలేనిది. ఓ వైపు ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూ.. మరోవైపు ఉద్యోగ విధులను బాధ్యతాయుతంగా చేపడుతున్న మహిళలు కోకొల్లలు. అయితే అందరి ఆర్థిక అవసరాలు తీర్చే బ్యాంకింగ్ రంగంలోనూ మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే నగరంలోని సుందర్‌నగర్ బ్రాంచ్‌లో మాత్రం నూటికి నూరు శాతం మహిళా ఉద్యోగులే ఖాతాదారులకు సేవలందిస్తున్నారు. క్యాషియర్ దగ్గర నుంచి మేనేజర్ వరకూ అందరూ మహిళామణులే విధులు నిర్వహిస్తుండడంతో దీనికి లేడీస్ బ్యాంక్‌గా ముద్ర పడింది. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!2023 డిసెంబర్లో మేనేజర్‌గా సునీత బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని పోస్టుల్లోనూ మహిళలే భర్తీ అయ్యారు. ప్రస్తుతం ఈ బ్యాంకులో రమ్య, శృతి, సృజన, లక్ష్మీ, జ్యోతిర్మయి, ధీరజ తదితర మహిళా ఉద్యోగులు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ.. ఖాతాదారులకు ఎంతో ఓపిగ్గా సేవలందిస్తున్నారు.

‘మూల సంత’ సూర్యకళ : మహిమాన్వితం
మనం జీవించి ఉన్నాం, జీవిస్తున్నాం.. అంటే అనుక్షణం ప్రకృతి నుంచి తీసుకుంటూనే ఉన్నామని అర్థం. మనం తీసుకున్నంత తిరిగి ఇవ్వాలని ప్రకృతి కోరుకోదు. విధ్వంసం చేయకపోతే చాలనుకుంటుంది. ప్రకృతి తనను తాను స్వస్థత పరుచుకుంటుంది. కానీ ఆ సమయం కూడా ఇవ్వనంత వేగంగా కాలుష్యభరితం చేస్తున్నాం. ప్రకృతిని పరిరక్షిస్తూ సాగిన మన భారతీయ జీవనశైలిని మర్చిపోయాం. మనం మరిచిపోయిన ఆరోగ్యకరమైన జీవనశైలిని గుర్తు చేయాలి, ఆచరణలోకి తెచ్చే వరకూ చైతన్యవంతం చేస్తూనే ఉండాలనే ఉద్దేశంతో పదిహేనేళ్లుగా గ్రీన్ వారియర్‌గా మారారు సూర్యకళ మోటూరి. జీవనశైలి మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలని, అది మహిళ నుంచే ప్రారంభం కావాలని, అందుకోసం ఆమె మహిళలను చైతన్యవంతం చేయడానికి పూనుకున్నారు. గ్రామభారతి అధ్యక్షబాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక మహిళ సూర్యకళ మహిళాదినోత్సవం సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సూర్యకళ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ చేసి నగరంలోని ఓ ఎమ్ఎన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. జాతీయోధ్యమ నాయకుల జీవితగాథలను చదివినప్పుడు ఆ కాలంలో పుట్టనందుకు ఆవేదన చెందేవారామె. రాజీవ్ దీక్షిత్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు.. ‘దేశం కోసం పని చేయడానికి ఎప్పుడూ ఏదో ఒక సామాజిక అవసరం ఉండనే ఉంటుంది. దానిని తెలుసుకుని పని చేయాలి’ అనే ఆలోచన రేకెత్తింది. సుభాష్ పాలేకర్ శిక్షణలో వాలంటీర్‌గా పని చేసినప్పుడు జరిగిన సంఘటన ఆమెను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లించింది. అక్కడికి వచ్చిన ఒక మహిళారైతు ఇచ్చిన కందిపప్పును ఇంటికి తెచ్చుకుని వండుకున్నారు. ఆ రుచి అమృతంలా అనిపించిందన్నారు సూర్యకళ. ప్రతి ఒక్కరూ అలాంటి ఆహారాన్ని తినాలని కోరుకున్నారు. సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో పని చేయసాగారు. ‘శిక్షణా తరగతులు నిర్వహించి సేంద్రియ వ్యవసాయంపై ‘మా గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ’ విజయవంతమైంది. కానీ ఆ ఉత్పత్తులకు మార్కెట్ లేకపోతే ఆ రైతు నిలదొక్కుకునేదెలా అనే ప్రశ్నకు సమాధానంగా ఒక వేదికను రూపొందించాను. ఆర్గానిక్ ఫుడ్ విషయంలో అవగాహన కల్పించడంలో మీడియా చాలా బాగా పని చేస్తోంది. చైతన్యం వచ్చింది కానీ ఉత్పత్తులు అందుబాటులో లేవు. దాంతో ‘మూలసంత’ పేరుతో వాటిని నగరానికి తీసుకొచ్చే బాధ్యత చేపట్టాను. కార్పొరేట్ కంపెనీల్లో మూలసంతలు పెడుతున్నాం. ఇటీవల ఇన్ఫోసిస్‌లో 30 స్టాళ్లతో సంత పెట్టాం. మహిళలను సంఘటిత పరిచి ఆర్గానిక్ ఉత్పత్తులను వారి వంటింటి వరకూ తీసుకెళ్లేలా చేయగలిగాం. నీటి వృథాను అరికట్టడం వంటి విషయాల్లో ఆలోచన రేకెత్తించడం నుంచి పెళ్లి, ఇతర వేడుకల్లో పర్యావరణ హితమైన వేదికల ఏర్పాటు వరకూ కృషి చేశాం. పదిహేనేళ్ల నా ప్రస్థానంలో ఏమి సాధించానని చూసుకుంటే మన వేడుకలు కనిపిస్తాయి. ఆహ్వాన పత్రికల, రిటర్న్ గిఫ్ట్‌లు, భోజనం వడ్డించే ప్లేట్ల వరకూ ప్రతిదీ బయో డీగ్రేడబుల్ థీమ్‌ని అనుసరిస్తున్నారు. మా ప్రయత్నం ఏ మాత్రం వృథా కాలేదు. ఒక మంచి బాట వేయగలిగాం’ అన్నారు సూర్యకళ. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!చోదకశక్తి మనమే! ఇంటిని నడిపేది మహిళే. ఇంట్లోకి వచ్చే ఏ వస్తువూ ప్రకృతికి హానికలిగించేదిగా ఉండకూడదు.. అనే నియమాన్ని మహిళలు పాటిస్తే చాలు. ప్రకృతిని కాపాడుకోడం కోసం మేము వేదికల మీద మాట్లాడితే ఆ ప్రయత్నం చైతన్యవంతం వరకే పరిమితం. ఆచరణ ఇంటి నుంచే మొదలు కావాలి, అది మహిళతోనే మొదలు కావాలి. అందుకే సమాజహితమైన ఏ పని అయినా మహిళల నుంచి మొదలైతే అది విజయవంతమవుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం నిధులు, పొలాలు సమకూరుస్తుంటాం. అంతకంటే ముఖ్యమైన పని పిల్లలకు ఆరోగ్యకరమైన భూమిని అందించడం. మహిని రక్షించే మహిమాని్వతమైన శక్తి మహిళకే ఉంది. మహిళలుగా మనం చేయాల్సిన సమాజసేవ, దేశసేవ ఇది. – సూర్యకళ మోటూరి, గ్రీన్ వారియర్, అధ్యక్షురాలు, గ్రామభారతి

Trekker Sindhu: తనయ నడిచే.. తండ్రిని గెలిపించే!
ఆధునిక మహిళల విజయాలు వ్యక్తిగతానికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమ పిల్లల నుంచి పేరెంట్స్ వరకూ సక్సెస్ ఫుల్ అనిపించుకునేలా కూడా చేస్తున్నాయి. అలాంటి ఓ యువతి.. కృష్ణా రామా అనుకుంటూ కూర్చోవాలి అని సమాజం నిర్దేశించిన వయసులో ఉన్న తండ్రిని యువకులతో సమానంగా ట్రెక్కింగ్‌లో రాణించేలా తీర్చిదిద్దింది. సాక్షి, సిటీబ్యూరో రిటైర్మెంట్ తర్వాత శ్రమ పడకూడదని తల్లిదండ్రులను ఇంటి దగ్గరే ఉంచి ఇల్లు, నౌకర్లు, కారు వగైరా సౌకర్యాలన్నీ అమర్చి జాగ్రత్తగా చూసుకునే కూతుళ్లు, కొడుకులను చూసి ఉంటాం. కానీ 60 ఏళ్ల వయసులో తండ్రిని కొండలు, గుట్టలు ఎక్కించి వేల కిలోమీటర్లు తనతోపాటు నడిపించిన కూతుర్ని చూశామా? అంటే.. ‘మా అమ్మాయే నా చేత తొలి అడుగులు వేయించింది..’ అంటూ సంతోషంగా చెబుతారు ఆమె తండ్రి ఏబీఆర్పీ రెడ్డి. కొండాపూర్‌లో నివసించే సింధు రెగ్యులర్‌గా కొండలు, గుట్టలు ఎక్కేసే సిటీ ట్రెక్కింగ్ లవర్స్‌లో ఒకరు. వ్యాపార వ్యవహారాల నుంచి విశ్రాంతికి షిఫ్ట్ అయిన వెంటనే తన ట్రెక్కింగ్ హాబీని తండ్రికి వారసత్వంగా అందించారు. తద్వారా ఓ మంచి ట్రెక్కర్‌గా మారేందుకు మాత్రమే కాదు 73 ఏళ్ల వయసులో రికార్డ్స్ సృష్టించేందుకు కూడా దోహదపడ్డారు. మార్కెటింగ్ రంగంలో ఉన్న సింధు ఇప్పటి వరకూ ఎనిమిది చెప్పుకోదగ్గ సాహసవంతమైన ట్రెక్స్ని పూర్తి చేశారు. సింధు ఇటు ఆటలు, అటు సాహసాలతో ఆత్మ సంతృప్తికే ప్రాధాన్యత ఇస్తూ.. విలాసాల వెనుక పరుగులు తీసేవారికి ఓ గుణపాఠంలా నిలుస్తున్నారు. ‘వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అంతా మైండ్‌సెట్‌లోనే ఉంది అని నేను నమ్ముతాను’ అంటారు సింధు. అందుకే అరవైలో ఉన్న తండ్రిని సైతం తనతో పాటు సాహస యాత్రలవైపు నడిపించారు. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!‘నాన్న మొదటి నుంచీ చాలా ఫిట్‌గా ఉంటారు. బిజినెస్ నుంచి ఫ్రీ కాగానే జిమ్‌లో చేరడమే కాకుండా నాతో పాటు ట్రెక్కి రమ్మని ప్రోత్సహించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు.. తాను 23 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్ ప్రారంభించిన సింధు.. రన్నింగ్, సైక్లింగ్ ఇలా ప్రతి హాబీనీ తండ్రితో కలిసి పంచుకున్నారు. ‘నాన్నకు చిన్నప్పుడు సాహస యాత్రలు చేసే అలవాటు ఉండేది, అయితే వర్క్‌లో పడిపోయాక దాన్ని మరచిపోయారు. నేను దానిని మళ్లీ గుర్తు చేశా అంతే’ అంటూ చెప్పారామె. గత డిసెంబర్లో తన తండ్రితో కలిసి చేసిన ట్రెక్.. ఎప్పటికీ మరచిపోలేనిదని అంటారామె. అప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రెక్కింగ్ అనుభవం లేని తండ్రి తొలిసారే ఉత్తరాఖండ్‌లో 12వేల కిమీ అధిరోహించి రికార్డ్ సృష్టించారు. అయితే నాన్న ఫిట్నెస్ గురించి నాకు తెలుసు. అలాగే ఎప్పుడైతే మా అడ్వెంచర్ గ్రూప్‌లో జాయిన్ చేశానో.. దాని నుంచి నాన్న కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు.’ అంటూ వివరించారామె.మైండ్‌సెట్‌లోనే అంతా ఉంది.‘వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అంతా మైండ్‌సెట్‌లోనే ఉంది అని నేను నమ్ముతాను’ అంటారు సింధు. అందుకే అరవైలో ఉన్న తండ్రిని సైతం తనతో పాటు సాహస యాత్రలవైపు నడిపించారు. ‘నాన్న మొదటి నుంచీ చాలా ఫిట్‌గా ఉంటారు. బిజినెస్ నుంచి ఫ్రీ కాగానే జిమ్‌లో చేరడమే కాకుండా నాతో పాటు ట్రెక్కి రమ్మని ప్రోత్సహించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు.. తాను 23 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్ ప్రారంభించిన సింధు.. రన్నింగ్, సైక్లింగ్ ఇలా ప్రతి హాబీనీ తండ్రితో కలిసి పంచుకున్నారు. ‘నాన్నకు చిన్నప్పుడు సాహస యాత్రలు చేసే అలవాటు ఉండేది, అయితే వర్క్‌లో పడిపోయాక దాన్ని మరచిపోయారు. నేను దానిని మళ్లీ గుర్తు చేశా అంతే’ అంటూ చెప్పారామె. గత డిసెంబర్లో తన తండ్రితో కలిసి చేసిన ట్రెక్.. ఎప్పటికీ మరచిపోలేనిదని అంటారామె. అప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రెక్కింగ్ అనుభవం లేని తండ్రి తొలిసారే ఉత్తరాఖండ్‌లో 12వేల కిమీ అధిరోహించి రికార్డ్ సృష్టించారు. అయితే నాన్న ఫిట్నెస్ గురించి నాకు తెలుసు. అలాగే ఎప్పుడైతే మా అడ్వెంచర్ గ్రూప్‌లో జాయిన్ చేశానో.. దాని నుంచి నాన్న కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు.’ అంటూ వివరించారామె.

సమానత్వం,సాధికారతకోసం కలిసి పనిచేద్దాం : అపోలో సునీతా రెడ్డి
అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్బంగా అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు అందించారు. 1995 బీజింగ్ డిక్లరేషన్ , ప్లాట్‌ఫామ్ ఫర్ యాక్షన్ నుండి ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కులను ముందుకు తీసుకెళ్లడంలో సాధించిన పురోగతిని గుర్తించాలన్నా ఈ సందర్బంగా పేర్కొన్నారు. అయితే, ఎక్కువ మంది బాలికలు పాఠశాలలో చదువుతున్నప్పటికీ మరియు కీలకమైన సేవలను పొందుతున్నప్పటికీ, పురోగతి సమానంగా లేదనీ, గణనీయమైన సవాళ్లు ఇంకా కొనసాగుతు న్నాయని గుర్తు చేశారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలలోని బాలికలకు, కొన్ని సంఘర్షణ ప్రాంతాలకు , వాతావరణ సంక్షోభం,మహమ్మారి ద్వారా ప్రభావితమైన బాలికలకు చేరడం లేదన్నారు.‘మన సమిష్టి బలాన్ని పెంపొందించుకుంటూ, మహిళలు, బాలికలు తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకునేవ్యవస్థాగత అడ్డంకులను తొలగించుకునేందుకు, నిజంగాసమానమైన, సమ్మిళిత వాతావరణాలను సృష్టించడానికి మనం కలిసి పనిచేయాలి. తరువాతి తరానికి సాధికారత కల్పించడం చాలా ముఖ్యం. శాశ్వత మార్పుకు ఉత్ప్రేరకాలు , భవిష్యత్తును నడిపించడానికి రూపొందించడానికి హక్కులు, వనరులు మరియు అవకాశాలతో వారి సన్నద్ధం కావాలి’’ అన్నారామె.మహిళల హక్కులు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే చొరవలలో వ్యూహాత్మక పెట్టుబడులు ఏ బాలికను వదిలి వెళ్ళకుండా చూసుకోవడంలో సహాయపడతాయి.తమ స్వాభావిక ప్రభావ మూలధనాన్ని ఉపయోగించుకోని, రాబోయే తరాలకు సాధికారత , సమానత్వం యొక్క వారసత్వాన్నిఅందించాలని ఆమె మహిళా నాయకులను కోరారు.. అందరికీ న్యాయమైన సమానమైన ప్రపంచాన్ని నిర్మించేక్రమంలో మహిళలు, బాలికలందరికీ 'హక్కులు, సమానత్వం, సాధికారత'ను స్పష్టమైన వాస్తవికతగా మార్చేలా కలిసి పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!
ఫొటోలు
International View all

భారత్ వ్యతిరేక రాతలు.. అమెరికా టెంపుల్ ధ్వంసం
కాలిఫోర్నియా: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది.

పాకిస్థాన్, భారత్ సరిహద్దులకు వెళ్లకండి.. అమెరికా పౌరులకు హెచ్చరిక
వాషింగ్టన్: పాకిస్థాన్ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీ

కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనకున్న పాక్ మతపెద్ద హతం
ఇస్లామాబాద్: ఇరాన్లో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జ

ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన

సిరియాలో మళ్లీ మారణహోమం.. 1000 మంది మృతి
బీరుట్: సిరియా అట్టుడుకుతోంది.
National View all

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు
ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్(Jagdeep Dhankar) అస

సెలవు లేదన్న హెడ్మాస్టర్.. లెక్కల టీచర్ ఏం చేశారంటే?
భువనేశ్వర్: తీవ్ర అనారోగ్యం పాలైన ఓ ఉపాధ్యాయుడు సెలవు కోసం

వీడియో: అమ్మాయిని పగబట్టిన కుక్కలు.. భయానక దాడి
జైపూర్: ఓ యువతి ఫోన్ మాట్లాడుతూ ఇంట్లో నుంచి బయటకు రావడమే

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ప్లాట్‌ఫామ్‌పై ఎంట్రీకి కొత్త రూల్!
సాక్షి, న్యూఢిల్లీ: రైలులో ప్రయాణించాలనుకునే వారు ఇకపై కన్ఫా

మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు
ఇంఫాల్: మణిపూర్ వ్యాప్తంగా శనివారం నుంచి అన్ని రకాల వాహనాల
NRI View all

ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్

న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చ

అమెరికాలో కాల్పులు.. కేశంపేట యువకుడి మృతి
కేశంపేట: ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి..

గిఫ్ట్ సిటీ ఫండ్స్‌లో భారీగా ఎన్నారైల పెట్టుబడులు
ముంబై: గిఫ్ట్ సిటీలోని ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌లో ప్రవాస భారతీయులు దాదాపు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (Investments) ప
క్రైమ్

బ్యాంకింగ్ సంస్థల పేరిట బురిడీ!
సాక్షి, అమరావతి: బ్రాండింగ్ ముసుగులో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేర్లతోనే అత్యధికంగా నిధులు కొల్లగొడుతున్నారు. రిటైల్, టెక్నాలజీ రంగాల పేరిట మోసాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక సైబర్ నేరస్తులు నిధులు కొల్లగొట్టేందుకు ఫిషింగ్ యాప్‌లు, లింక్‌లనే ప్రధాన సాధనంగా చేసుకుంటున్నారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘క్లౌడ్ సేక్’ దేశంలో సైబర్ నేరాల తీవ్రతపై తాజా నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2025లో దేశంలో సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోయే అవకాశాలున్నాయని కూడా అంచనా వేసింది. నివేదికలోని ప్రధాన అంశాలివి..» బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో 39.5 శాతం సైబర్ నేరాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిటæ బురిడీ కొట్టించి నిధులు కొల్లగొడుతున్నారు. » రెండు, మూడు స్థానాల్లో రిటైల్/ఈ–కామర్స్, టెక్నాలజీ సంస్థలున్నాయి. రిటైల్ సంస్థల పేరుతో 21.4 శాతం, టెక్నాలజీ సంస్థల పేరిట 12.5శాతం సైబర్ నేరస్తులు బురిడీ కొట్టిస్తున్నారు. ఇక టెలీ కమ్యూనికేషన్ల సంస్థలు(9.1శాతం), ట్రావెల్ సంస్థలు(8.6శాతం), రియల్ ఎస్టేట్ సంస్థలు(2.5శాతం), బీమా కంపెనీలు(1.9%) పేరిట కూడా సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు.» సైబర్ ముఠాలు అత్యధికంగా ఫిషింగ్ యాప్‌లు/లింకులనే తమ మోసాలకు సాధనంగా చేసుకుంటున్నాయి. ఫిషింగ్ యాప్‌లు/ లింకులు పంపి వాటిని క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాల్లో నిధులు కొల్లగొడుతున్నాయి. మొత్తం సైబర్ నేరాల్లో ఈ తరహా మోసాలు ఏకంగా 58% ఉండటం గమనార్హం. » తర్వాత స్థానాల్లో సోషల్ మీడియా మాధ్యమాలున్నాయి. ఫేక్ ఫేస్బుక్ ఐడీల పేరిట 25.7శాతం, యూట్యూబ్ ద్వారా 5.8శాతం, ఎక్స్( ట్విట్టర్) ఖాతాల ద్వారా 3.2శాతం, ఇన్స్టాగామ్ ద్వారా 2.5శాతం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. » సైబర్ నేరస్తులు 2025లో దేశంలో ఏకంగా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని అంచనా. దేశంలో సైబర్ మోసాలపై ఏకంగా 25 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యే అవకాశం ఉంది. వాటిలో 41 శాతం వరకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే ఉంటాయని భావిస్తున్నారు. ఇక దేశంలో మోసపూరితమైన యాప్‌లు 83 శాతం, ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు 65 శాతం పెరగొచ్చని అంచనా.

‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’
తిరుపతి: మండల కేంద్రమైన సైదాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సైదాపురం–తిప్పవరపాడు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురానికి చెందిన దొడ్డగా మునెయ్య, భార్య జ్యోతి అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తె వైష్ణవి రక్తగాయాలతో బయటపడింది. ఈ క్రమంలో శుక్రవారం సైదాపురంలో మృతదేహాలకు అంతిమ వీడ్కోలు పలికారు.కంటతడి పెట్టించిన కుమార్తెల మాటలుకళ్లెదుటే తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడంతో ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’ అంటూ వారిపై పడి గుండెలు బాదుకోవడం అక్కడి వారిని కలచివేసింది. గాయపడిన వైష్ణవి చివరగా తల్లిదండ్రుల అంతిమయాత్రలో టాటా చెప్పడం స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది.గోకుల బృందావనంలో పుట్టి..మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోనే ఉన్న గోకుల బృందావనం గ్రామంలో దొడ్డగ మునెయ్య జన్మించారు. ఆయనకు అన్నలు భాస్కర్, చంద్రయ్య ఉన్నారు. వారంతా గోకులబృందావనం గ్రామం వీడి సైదాపురానికి చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. మునెయ్యకు పెళ్లి చేసి సైదాపురంలోనే ఇల్లు కటించి బాగోగులు చూసుకునే వారు. ఈ క్రమంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునెయ్యతోపాటు భార్య జ్యోతి మరణించడంతో విషాదంలో మునిగిపోయారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డలను వదిలివెళ్తున్నారా..! అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మృతుని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్ పరామర్శించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..!

యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోకవరం మండలం కొత్తపల్లి శివారున పెట్రోల్‌బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో(road accident) ఉపాధ్యాయుడు(Govt School Teacher) మృతి చెందగా అటవీశాఖ ఉద్యోగిని తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం దొలిపాడుకు చెందిన వలాల చిన్నబ్బాయి (52) జగ్గంపేట మండలం గోవిందపురం జిల్లా పరిషత్ హైసూ్కల్లో 2023 నుంచి సాంఘిక శాస్తం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కొంత కాలంగా గోకవరంలో నివాసం ఉంటూ బైక్‌పై వెళ్లి వస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన వెళ్తుండగా అటవీశాఖలో గార్డుగా పని చేస్తున్న రెడ్డి విజయదుర్గ లిఫ్ట్ అడగడంతో ఆమెను ఎక్కించుకుని మళ్లీ ముందుకు సాగిపోయారు. కొత్తపల్లి శివారున పెట్రోల్ బంకు సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్‌ను జగ్గంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నబ్బాయి అక్కడికక్కడే మృతి చెందగా విజయదుర్గ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై పవన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలను పాఠశాల వద్ద దించి.. చిన్నబ్బాయికి భార్య పార్వతి, తొమ్మిదో తరగతి చదువుతున్న మేఘవర్షిణి, ఎనిమిదో తరగతి చదువుతున్న స్నేహిత ఉన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారిని పాఠశాల వద్ద దించి, అనంతరం ఇంటి నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఆయన మృత్యువాతపడ్డారు. యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే.. ఆ చిన్నారులు చదువుతున్న పాఠశాల వార్షికోత్సవం శనివారం జరగనుంది. తన పిల్లలు ఆ కార్యక్రమానికి రావాలి డాడీ అని పిలవగా నేను రాను అన్న ఆయన మాటే నిజమైందని చిన్నబ్బాయి భార్య రోదించారు. యాన్యువల్డేకి వెళ్లాలి లే డాడీ అంటూ చిన్నారులు పోలీసులు వద్ద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీస్‌స్టేషన్ వద్ద నుంచి ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వాహనాన్ని నిలపగా భార్య, కుమార్తెలు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలో వారిని ఎవరూ వారించలేకపోయారు. హెల్మెట్ ఉన్నా.. బైక్ నడిపే సమయంలో చిన్నబ్బాయి హెల్మెట్ కచ్చితంగా వాడతారు. ప్రమాదం జరిగినపుడు కూడా హెల్మెట్ ధరించినప్పటికీ కారు ఢీకొట్టిన వేగానికి హెల్మెట్ ముక్కలైపోయి తలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయుడి మృతి విషయం తెలుసుకున్న సహచర ఉపాధ్యాయులు భారీగా అక్కడకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు.

ఆనందంగా పెళ్లి ఊరేగింపు.. అంతలోనే ప్రమాదం..!
కరీంనగర్ జిల్లా: పెళ్లి బరాత్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన బాకారపు ఉమ (35) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్సై రవి తెలిపారు. మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన బాకారపు ప్రభా కర్ కూతురు నవ్య వివాహం మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన జినుక అశోక్‌తో గురువారం జరిగింది. రాత్రి పెళ్లి బరాత్ జరుగుతుండగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లకు చెందిన కారు డ్రైవర్ శ్రవణ్ కారు దిగి ఫోన్ మాట్లాడుతున్నాడు. బరాత్‌లో కొందరు డ్యాన్స్ చేస్తుండగా పెళ్లికొడుకు అశోక్ కారు నడిపాడు. ఒక్కసారిగా బాకారపు ఉమ, ఆమె కూతురు నిఖితతోపాటు మరి కొందరిని కారు ఢీకొనడంతో గాయపడ్డారు. తీవ్రగాయాలైన ఉమ, నిఖితను హుజూ రాబాద్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఉమ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి పెళ్లి కొడుకు జినుక అశోక్ కారణమంటూ ఉమ భర్త పర్శరాములు కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారికి పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. హుజూరాబాద్ రూరల్ సీఐ వెంకటి, ఎస్సై రవి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు.