Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Subramanian Swamy Serious On TTD Chairman Over Goshala Row1
తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలో గోవుల మృతిపై తాను త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి(Subramanian Swamy) ప్రకటించారు. అంతేకాదు ఈ విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఢిల్లీ సాక్షి ప్రతినిధితో ఆయన శుక్రవారం మాట్లాడారు. రాజ్యాంగంలో గోవులకు అత్యున్నత స్థానం కలిపించారు. గోవు అంటే జంతువు మాత్రమే కాదు.. కోట్ల మందికి ఆరాధ్య దైవం కూడా. అలాంటిది గోవుల ఆలనా పాలనా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. తిరుమలలో సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు. పైగా గోవుల మరణాల విషయంలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు నిర్లక్ష్యపూరితంగా మాట్లాడారు. వయసు మళ్లిన మనుషుల్లాగే.. వయసు మళ్లిన ఆవులూ చనిపోతున్నాయని బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారు. రేపు మీరు కూడా చనిపోతారు. అప్పుడు వయసు మల్లారని పట్టించుకోకుండా మీ కుటుంబ సభ్యులు వదిలేస్తారా?. అని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడిన చైర్మన్‌ను సీఎం చంద్రబాబు వెంటనే భర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘వందల సంఖ్యలో గోవులు చనిపోవడం వెనుక కుట్ర ఉంది. టీటీడీలో వ్యాపార ధోరణితో చూడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చనిపోయిన గోవులను రెస్టారెంట్లకు పంపుతున్నారా?. గోవుల మృతి పై దర్యాప్తు జరగాలి. టీటీడీ గోశాలలో గోవుల మృతి పై త్వరలో కోర్టులో కేసులు దాఖలు చేస్తా. ఇప్పుడున్న టీటీడీ బోర్డు పాలన అధ్వాన్నంగా ఉంది. గత టీటీడీ బోర్డు చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు.. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు’’ అని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేసుకున్నారు.

Infosys To Hire 20000 Fresh Engineering Graduates in FY262
'ఇన్ఫోసిస్‌లో 20వేల ఉద్యోగాలు'

గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న సమయంలో.. ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది.ఇన్ఫోసిస్ ఉద్యోగుల వేతనాల పెంపుకు సంబంధించిన ఒక అప్డేట్ గురించి, విలేకర్ల సమావేశంలో సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'జయేష్ సంఘ్రాజ్కా' మాట్లాడుతూ.. ఎక్కువ మందికి జనవరిలోనే జీతాల పెంపు జరిగింది. మిగిలినవారికి జీతాల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఇన్ఫోసిస్‌లోని చాలా మంది ఉద్యోగుల జీతాల పెంపు సగటున 5-8 శాతం వరకు ఉంటుంది. ఇది గడచిన సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే కంపెనీలు అత్యుత్తమ పనితీరును కనపరచిన ఉద్యోగులకు జీతం 10-12 శాతం పెంచినట్లు సమాచారం.నియామకాల అంచనాజీతాల పెంపు గురించి మాత్రమే కాకుండా.. ఉద్యోగ నియామకాలను గురించి కూడా ఇన్ఫోసిస్ సిఎఫ్‌ఓ జయేష్ సంఘ్రాజ్కా వెల్లడించారు. భారతదేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని స్పష్టం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 6,388 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 323,578కి చేరుకుంది.ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాలుగతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ పనితీరు నిరాశ పరచింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 7,033 కోట్లకు పరిమితమైంది. 2023–24 ఇదే కాలంలో రూ. 7,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 40,925 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,923 కోట్ల టర్నోవర్‌ సాధించింది.ఇదీ చదవండి: అల్లుడితో కలిసి ఏడెకరాలు కొన్న నటుడు.. భూమి విలువ ఎన్ని కోట్లంటే?అయితే త్రైమాసికవారీగా(క్యూ3) చూస్తే నికర లాభం 3.3 శాతం పుంజుకోగా.. ఆదాయం 2 శాతం నీరసించింది. కాగా.. పూర్తి ఏడాదికి నికర లాభం 2 శాతం వృద్ధితో రూ. 26,713 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 1,62,990 కోట్లకు చేరింది. వెరసి గత ఆదాయ గైడెన్స్‌ 4.5–5 శాతాన్ని అధిగమించింది. అతిపెద్ద కాంట్రాక్ట్‌తో కలిపి గతేడాది 11.6 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లు సాధించింది. వీటిలో 56 శాతం కొత్త ఆర్డర్లే!

BJP MLA Raja Singh Skips BJP Meeting Again3
రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది..!

హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది. ఈసారి తనకు పార్టీ నేతలు బర్త్ డే విషెస్ చెప్పలేదని రాజాసింగ్ కు అలకబూనారట. రాజాసింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పగా, బీజేపీ నుంచి ముఖ్య నేతల ఎవరూ కూడా ఆయనకు విషెస్ చెప్పలేదట. దాంతో రాజాసింగ్ మళ్లీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హరిత ప్లాజాలో జరిగిన సమావేశానికి రాజాసింగ్ డుమ్మా కొట్టారట. ఈటెల రాజేందర్‌తో సహా పలువురు ప్రముఖ నేతలు ఆ మీటింగ్ కు హాజరు కాగా, రాజాసింగ్ మాత్రం అందుకు దూరంగా ఉన్నారు. అందులోనూ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం నిర్వహించిన సమయంలో రాజాసింగ్ ఇలా దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పలేదనే కారణమా?.. లేక ఇంకేమైనా ఉందా? అనే కోణంలో చర్చ నడుస్తోంది.బండి సంజయ్ రాజీ చేశారు.. కానీకొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి అలక పాన్పు ఎక్కిన రాజాసింగ్ఎం ను ఇటీవల ఎంపీ బండి సంజయ్ స్వయంగా కలిసి ఆయనకు నచ్చజెప్పి వచ్చారు. ప్రధానంగ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతంరావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించిన క్రమంలో బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగారు. గౌతంరావును ఆ స్థానంలో నిలబెట్టడానికి ప్రధాన కారణం బండి సంజయ్ కాబట్టి.. రాజాసింగ్ ను బుజ్జగించి వచ్చారు. అప్పుడు గౌతంరావుతో రాజాసింగ్ ను కరాచలనం చేయించడమే కాకుండా ఇరువురు నేతలు శాలువాలతో సత్కరించుకునే కార్యక్రమం కూడా జరిగింది. ఇంతలోనే రాజాసింగ్ మళ్లీ పార్టీ శ్రేణులపై కోపంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తును ప్రచారం జరుగుతోంది ఇందుకు తన బర్త్ డేకు పార్టీలోని ప్రముఖలు విషెస్‌ చెప్పకపోవడంగా సమాచారం. ప్రత్యర్థి పార్టీలో సీఎంగా ఉన్న సీఎం రేవంత్ విషెస్ చెప్పగా, తమ సొంత పార్టీలోని ముఖ్యులు ఎవరూ కూడా కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదనే కారణంతో రాజాసింగ్‌ కోపంగా ఉన్నారట, నేటి బీజేపీ కీలక సమావేశానికి రాజాసింగ్ దూరంగా ఉండటానికి ఇదే కారణమనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది.

GVMC Motion Updates: YSRCP Coporators Shocks Kutami Leaders4
విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు

విశాఖపట్నం, సాక్షి: అధికార దాహంతో.. గత 11 నెలల పదవి కాలంలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ మేయర్‌పై అవిశ్వాసం వేళ (GVMC No Confidence Motion).. మరోసారి భారీగా ప్రలోభాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు ప్రలోభాల ఉధృతిని పెంచారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. భారీగా డబ్బు ఇస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అలాగే.. శ్రీలంక, కేరళ నుంచి విశాఖకు తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటున్నారు. విమానం కాకపోతే హెలికాప్టర్స్ అయినా ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు చేస్తున్నారు. అయితే.. తాము వైఎస్సార్‌ అభిమానులమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైఎస్‌ జగన్‌(YS Jagan)తోనే ఉంటామని చెబుతూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో బెదిరింపులకు సైతం కొందరు లొంగడం లేదని సమాచారం. దీంతో చేసేది లేక కూటమి నేతలు వెనుదిరుగుతున్నట్లు సమాచారం. జీవీఎంసీ(GVMC) ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్‌ సీపీ కైవసం చేసుకుని మేయర్‌ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచనతో ఉంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బు ఆశ చూపించడం, బెదిరింపులలాంటి అప్రజాస్వామిక ప్రయత్నాలకు దిగింది.

Is There Rift in RR Camp Sanju Dravid Not on the Same Page Rumours Viral Why5
‘ద్రవిడ్‌కు సంజూ నచ్చడు.. అందుకే ఇలా!’.. రాయల్స్‌ క్యాంపులో విభేదాలు?

‘రాజస్తాన్‌ రాయల్స్‌ నాయకత్వ బృందంలో విభేదాలు తలెత్తాయా?.. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid)- కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) మధ్య సఖ్యత కొరవడిందా?.. వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయా?’.. అంటే.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అవుననేందుకు ఆస్కారం ఇస్తున్నాయి.ఐపీఎల్‌-2025లో రాజస్తాన్‌ రాయల్స్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. సీజన్‌ ఆరంభానికి ముందే హెడ్‌కోచ్‌ ద్రవిడ్‌ గాయపడ్డాడు. అయినప్పటికీ వీల్‌చైర్‌లో కూర్చునే జట్టుకు మార్గదర్శనం చేస్తున్నాడు.మరోవైపు.. ఐపీఎల్‌ ఆరంభానికి ముందు కెప్టెన్‌ సంజూ శాంసన్‌ కూడా గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు అతడు కేవలం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా మాత్రమే అందుబాటులో ఉన్నాడు. సారథిగా, వికెట్‌ కీపర్‌గా జట్టు అతడి సేవలను కోల్పోయింది.ఇక సంజూ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌ వచ్చిన రియాన్‌ పరాగ్‌ (Riyan Parag) సారథ్యంలో.. మూడు మ్యాచ్‌లలో రాజస్తాన్‌ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే గెలిచింది. అయితే, సంజూ వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఈ క్రమంలో చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో రాయల్స్‌ తలపడింది.అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సరిగ్గా 188 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయింది. ఈ క్రమంలో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. ఢిల్లీ రాయల్స్‌ను ఓడించి గెలుపు జెండా ఎగురవేసింది. కాగా ఈ మ్యాచ్‌ సందర్భంగా సంజూ పక్కటెముకల నొప్పితో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.ఇదిలా ఉంటే.. సూపర్‌ ఓవర్‌ సమయంలో రాజస్తాన్‌ రాయల్స్‌ తీసుకున్న నిర్ణయం క్రికెట్‌ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. రియాన్‌ పరాగ్‌తో పాటు షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ను రాయల్స్‌ బ్యాటింగ్‌కు పంపింది. వీరిద్దరు రనౌట్‌ అయి ఐదు బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి జట్టు ఓటమికి పరోక్ష కారణమయ్యారు.𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025 PC: BCCIనిజానికి ఈ మ్యాచ్‌లో నితీశ్‌ రాణా అద్భుత అర్ధ శతకం (28 బంతుల్లో 51)తో రాణించాడు. కానీ మేనేజ్‌మెంట్‌ మాత్రం అతడిని సూపర్‌ ఓవర్లో పంపలేదు. ఇక సూపర్‌ ఓవర్‌కు ముందు ద్రవిడ్‌ డగౌట్‌లో తన సహాయక సిబ్బంది, ఆటగాళ్లతో ప్రణాళికల గురించి చర్చించాడు.ఆ సమయంలో కెప్టెన్‌ సంజూ మాత్రం తనకు ఈ విషయం పట్టనట్లుగా ఆటగాళ్ల వెనుక అటూ ఇటూ తిరిగాడు. మధ్యలో సహచర ఆటగాడు రమ్మని పిలిచినా తనకు ఇష్టం లేదన్నట్లుగా వద్దంటూ చేతితో సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాయల్స్‌ క్యాంపులో విభేదాలు అన్న వార్తలు పుట్టుకొచ్చాయి. ఇది చూసిన సంజూ అభిమానులు ద్రవిడ్‌కు సంజూ నచ్చడని.. అందుకే ఇక్కడా తనకు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఐపీఎల్‌-2025లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాజస్తాన్‌ కేవలలం రెండే గెలిచింది.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్‌.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్‌! I knew there was definitely a rift within the setup when there were absolutely no discussions or chat in the dugout before the super over.Everyone was standing quite in a circle in the dugout.Look at Sanju's hand signal in the first video,he is deliberately ignoring everyone. https://t.co/DfxmlwGgBG pic.twitter.com/688ji3MXrS— Delhi Capitals Fan (@pantiyerfc) April 17, 2025

kasu mahesh reddy fire chandrababu government over goshala row6
పవన్‌.. ‘సనాతన ధర్మం అంటే కాషాయ దుస్తులు ధరించడం కాదు’

పల్నాడు జిల్లా,సాక్షి: తిరుమల లడ్డు వ్యవహారంలో కట్టుకథ అల్లి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నెట్టే ప్రయత్నించారు. ఇదే అంశంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన కూటమి ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారుతిరుమల గోశాలలో కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయంపై కాసు మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తిరుపతిలో గోవులు చనిపోవడం బాధాకరం. గోవులు చల్లగా ఉంటేనే ఈ విశ్వం చల్లగా ఉంటుంది. గోవులు చనిపోతున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పేంతవరకు విషయం బయటికి రాలేదు.టీటీడీ ఈవో,ఛైర్మన్ గోవులు చనిపోతున్నాయని చెప్తుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ మాత్రం గోవులు చనిపోవటం లేదని చెబుతున్నారు. తొమ్మిది పది నెలల నుంచి నెలకు 10 నుంచి 15 గోవులు చనిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? గోవుల మరణాలపై చర్చకి సిద్ధమని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.భూమన కరుణాకర్‌రెడ్డి చర్చకు వెళ్తుంటే పోలీసులతో అడ్డుకున్నారు. చర్చ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయం కోసం వాడుకుంటుంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని హడావిడి చేశాడు. సనాతన ధర్మం అంటే కాషాయం బట్టలు వేసుకొని తిరగటం కాదు. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.గతంలో లడ్డు వ్యవహారంలో కట్టు కధ అల్లి రాజకీయం చేసి వైఎస్‌ జగన్‌ మీద వేసే ప్రయత్నించారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదు. ప్రభుత్వం రాజకీయాలు పక్కనపెట్టి గోవులు ఎందుకు చనిపోతున్నాయో కారణాలు కనుక్కోండిగిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి రైతుకు 20 వేలుఇస్తానని ప్రకటించారు. ఇప్పటికి 40 వేలు రైతులకి బకాయి ఉన్నారు. చంద్రబాబు రైతులకు ఇస్తానన్న డబ్బులు చెల్లిస్తే వారికి ఎంతో కొంత ఉపయోగపడతాయి’అని సూచించారు.

Experts Warn Common Cooking Oil Linked To Aggressive Breast Cancer7
అతిగా వంటనూనెలు వాడుతున్నారా..? నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఇన్నాళ్లు వంటలు చేయగా మిగిలిన నూనెని తిరిగి వాడొద్దని హెచ్చరించేవారు. ఇప్పుడు ఏకంగా అసలు వంటనూనెలే వాడొద్దని వార్నింగ్‌ ఇచ్చేస్తున్నారు. పైగా అవి కేన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతాయంటూ.. విస్తుపోయే విషయాలు చెబుతున్నారు. ఇదేంటి ఇంకేం వాడాలి వంటకు అన్న అనుమానం రావడం సహజమే. కానీ తాజా పరిశోధనలు వంట నూనెలు కేన్సర్‌ ప్రమాదాన్ని ప్రోత్సహిత్సాయని చెబుతున్నాయి. అంతేగాదు అదెలా జరుగుతుందో కూడా సవివరంగా వివరించారు పరిశోధకులు.వీల్ కార్నెల్ మెడిసిన్ పరిశోధకుల బృందం చేసిన పరిశోధనల్లో వంట నూనెలు, కూరగాయల నూనెలు అతిగా వాడకూడదని తేలింది. ఆ నూనెల్లో ఉండే లినోలెయిక్ కేన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందట. ముఖ్యంగా రొమ్మ కేన్సర్‌(Breast Cancer)లోని కణాల్లో పెరుగుదల అనూహ్యంగా ఉంటుందని తెలిపాయి. అత్యంత ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ రొమ్ము కేన్సర్‌ ప్రమాదాన్ని ఈ లినోయిక్‌ ఆమ్లం వేగవంతం చేస్తుందట. అంటే సాధారణ రొమ్ము కేన్సర్‌లో కంటే ఈ ట్రిపుల్‌ నెగటివ్‌లో కేన్సర్‌ కణాలు వేగంగా అభివృద్ధి చెందుతుంటాయి. ఇక మనం వాడే ఈ నూనెలు ఆ కేన్సర్‌ కణాలను మరింత అభివృద్ధి చేస్తాయని గుర్తించామని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సోయాబీన్‌, కుసుమ నూనె వంటి సీడ్స్‌ ఆయిల్స్‌, పందిమాంసం, గుడ్లు వంటి జంతువుల్లో కనిపించే ఒమేగా 6 కొవ్వు ఆమ్లం లినోలెయిక్ చికిత్స చేయడానికే కష్టతరమైన ట్రిపుల్‌ నెగిటివ్ రొమ్ము కేన్సర్‌ పెరుగదలను ప్రత్యేకంగా పెంచగలదని పరిశోధనలో నిరూపితమైందన్నారు. లినోలెయిక్ ఆమ్లం FABP5 అనే ప్రోటీన్‌తో బంధించడం ద్వారా కేన్సర్‌ కణితి కణాలను మరింత వేగంగా అభివృద్ధి చెందేలా సక్రియం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. కానీ ఇతర హార్మోన్‌ సెన్సిటివ్‌ ఉప రకాల్లో అలా జరగడం లేదు. అంటే ఇక్కడ లినోలెయిక్ ఆమ్లం అధికంగా ఉన్న ఆహారం కేన్సర్‌ కణితి పెరుగుదల మెరుగ్గా ఉంచుతుందని క్లియర్‌గా నిరూపితమైందన్నారు. ఈ పరిశోధన ఆహార కొవ్వులు, కేన్సర్‌ మధ్య సంబంధాన్ని వివరించడంలో సహాయపడటటేమ గాక నిర్దిష్ట పోషక సిఫార్సులు ఏ రోగులకు ఎక్కువ ప్రయోజనం అనేది క్లియర్‌ నిర్వచించగలమని అంటున్నారు పరిశోధకులు. (చదవండి: నలుగురిలో కలవనివ్వకుండా చేసే వ్యాధి.. ! గంటల్లోనే నయం అయిపోతుందట..)

Arjun son of Vyjayanthi Movie Review And Rating Telugu8
'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' మూవీ రివ్యూ

టైటిల్‌ : అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతినటీనటులు: నందమూరి కల్యాణ్‌రామ్‌, విజయశాంతి, సయీ మంజ్రేకర్‌,పృథ్వి, సోహైల్‌ ఖాన్, శ్రీకాంత్‌ తదితరులునిర్మాణ సంస్థలు: అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌నిర్మాతలు: అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసుఎడిటింగ్: తమ్మిరాజుదర్శకత్వం, కథ: ప్రదీప్‌ చిలుకూరిస్క్రీన్‌ప్లే: శ్రీకాంత్‌ విస్సాసంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌సినిమాటోగ్రఫీ: రామ్‌ ప్రసాద్‌విడుదల: ఏప్రిల్‌ 18, 2025విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) తాజాగా థియేటర్స్‌లోకి వచ్చేసింది. నూతన దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ మాస్‌ చిత్రంతో డైరెక్టర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై అశోక్‌ వర్ధన్‌, సునీల్‌ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చెప్పే అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి చిత్రం ఎలా ఉంది..? ప్రీరిలీజ్‌ వేడుక సమయంలో ఎన్టీఆర్‌ చెప్పినట్లుగా ఈ మూవీ కళ్యాణ్ కెరీర్‌లో ఒక స్పెషల్‌గా మిగిలుతుందా..? ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..?‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ కథ చాలా సినిమాల మాదిరే రొటిన్‌ స్టోరీ.. ఇందులో తల్లీకొడుకుల మధ్య బలమైన ఎమోషన్‌ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో వైజయంతి IPS (విజయశాంతి) డ్యూటీలో భాగంగా ఎన్‌కౌంటర్‌ చేస్తూ తెరపైకి ఎంట్రీ ఇస్తుంది. వైజయంతి ఒక కఠినమైన, నిజాయితీతో కూడిన పోలీసు అధికారిణిగా ఉంటుంది. తన కుమారుడు అర్జున్ (కల్యాణ్‌రామ్‌) కూడా నిజాయితీగల IPS ఆఫీసర్‌ కావాలని, తన అడుగుజాడల్లో నడుస్తాడని ఆశిస్తుంది. అయితే, ఒక మాఫియా డాన్‌తో ఊహించని ఎదురుదెబ్బ అర్జున్‌ను మరో దారిలో నడిచేలా చేస్తుంది. ఉద్దేశపూర్వకంగా అర్జున్‌ నేరస్థుడు కాకపోయినా, ప్రజలను రక్షించడానికి స్థానిక మాఫియాను ఎదుర్కొనే ఆయుధంగా అర్జున్ మారతాడు. అర్జున్‌ చేస్తున్న మంచిపనిని చూసిన పృథ్వి తన పోలీస్‌ ఉద్యోగాన్ని పక్కనపెట్టి అతనితో పాటుగా అడుగులేస్తాడు. అలా వారిద్దరూ ఒక పెద్ద గ్యాంగ్‌నే ఏర్పాటు చేస్తారు. ఏకంగా పోలీస్‌ వ్యవస్థనే సవాల్‌ చేసేంతలా అర్జున్‌ గ్యాంగ్‌ బలోపేతం అవుతుంది. ఇవన్నీ అర్జున్‌కు తన తల్లితో విభేదాలకు దారితీస్తాయి.. దీంతో అర్జున్‌ వెళ్తున్న దారి ఎంతమాత్రం కరెక్ట్‌ కాదంటూ ఆమె హెచ్చరిస్తూనే ఉంటుంది. ఏకంగా అర్జున్‌ను ఇంటి నుంచి బయటకు పంపేసి ఒంటరిగానే ఉంటుంది. అర్జున్ తరువాత విశాఖలోని ఒక కాలనీకి వెళ్లి అక్కడే ఉంటూ నగరంలోనే టాప్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. పేదలజోలికి వచ్చిన వారందరిని వేటాడుతూ ముందుకు వెళ్తుంటాడు. ఐపీఎస్‌కు సెలక్ట్‌ అయిన అర్జున్‌ ప్రజల కోసం కత్తి ఎందుకు పట్టాడు..? ఉద్యోగ రిత్యా ఎన్నో ఎన్‌కౌంటర్లు చేసిన వైజయంతిని నేరస్థుల నుంచి అర్జున్‌ ఎలా కాపాడుకుంటాడు. డ్రగ్స్‌ మాఫీయా అర్జున్‌ తండ్రిని ఎందుకు చంపుతుంది..? చివరకు తన ప్రాణాలను కాపాడిన కొడుకునే వైజయంతి ఎందుకు జైలుకు పంపుతుంది..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కథ చాలా పాత కథే.. ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి అని చెప్పవచ్చు. ఒక శక్తిమంతమైన తల్లి పాత్రలో ఆమె దుమ్మురేపారు. తల్లి ఎంత స్థాయిలో ఉన్నా తన బిడ్డ భవిష్యత్‌ చాలా ముఖ్యం అని ఇందులో చక్కగా చూపించారు. కథలో భాగంగా వైజాక్‌ కమీషనర్‌గా శ్రీకాంత్‌ రావడంతో కథలో స్పీడ్‌ అందుకుంటుంది. గతంలో వైజయంతి టీమ్‌లో అతను పనిచేసిన అనుభవం ఉండటం వల్ల ఆ కుటుంబంతో దగ్గరి సాన్నిహిత్యం ఉంటుంది. ఒక సిన్సియర్‌ ఆఫీసర్‌ కుమారుడు గ్యాంగ్‌స్టర్ అవడం ఏంటి..? అని అర్జున్‌ గతం తెలుసుకుంటాడు. కానీ, ఆ సీన్లు ఏవీ పెద్దగా వర్కౌట్‌ కాలేదు.'అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి ' సినిమా కథ పాతదే అయినా సరే అభిమానులను మాత్రం ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. దర్శకుడు కూడా మాస్‌తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఫస్టాఫ్‌ కొ​ంతమేరకు ఫర్వాలేదనిపిస్తుంది. అయితే, రెండవ భాగంలోకి కథ వెళ్ళే కొద్దీ పాత తరహా కథనే చూపిస్తున్నాడని అభిప్రాయం అందరిలో కలుగుతుంది. మాస్ యాక్షన్ బ్లాక్‌లు బాగానే టేకింగ్‌ చేసిన దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి కథ చెప్పడంలో చాలా వరకు తడబడ్డాడని చెప్పవచ్చు. సులువుగా ఉన్న కథను కొత్తగా చెప్పే క్రమంలో స్క్రీన్‌ప్లే దెబ్బతిందని అర్థం అవుతుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం బాగుంది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చిన బీజీఎమ్‌ పీక్స్‌లో ఉంటుంది. కానీ, పాటల విషయంలో పెద్దగా మ్యూజిక్‌ ప్రభావం లేదు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ ముందు, తర్వాత వచ్చే సీన్లకు కల్యాణ్‌రామ్‌ అభిమానులు పండుగ చేసుకుంటారు. ఆ సమయంలో థియేటర్స్‌ దద్దరిల్లడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. క్లాస్‌ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినప్పటికీ మాస్‌ ఆడియన్స్‌ను మాత్రం మెప్పిస్తుంది. కంటెంట్‌ ఆధారంగా సినిమా చూసే వారికి ఈ చిత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. సినిమా క్లైమాక్స్‌లో విజయశాంతి, కల్యాణ్‌రామ్‌ పోటీ పడి నటించారు. క్లైమాక్స్‌ కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్‌ ఆ స్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కల్యాణ్‌రామ్‌ బలం ఎమోషన్‌.. దాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్‌ బాగా హిట్‌ అయింది. ఆఖర్లో సుమార 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులను 'అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి ' కట్టిపడేస్తుంది.ఎవరెలా చేశారంటే..అర్జున్‌గా కల్యాణ్‌ రామ్ మంచి నటనను కనబరిచాడు. వైజయంతిగా విజయశాంతి దుమ్మురేపింది. ఇద్దరూ భావోద్వేగ, యాక్షన్ సన్నివేశాలలో ఎంతమాత్రం నిరాశపరచలేదు. ఈ వయసులోనూ విజయశాంతి డూప్‌ లేకుండా స్వయంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేయడం అందరినీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. శక్తిమంతమైన తల్లి పాత్రలో ఆమె వంద శాతం న్యాయం చేసింది. పోలీస్‌ ఆఫీసర్‌గా ఆమె మరికొంత సమయం పాటు స్క్రీన్‌ మీద కనిపించి ఉండుండే బాగుండని అభిమానులకు కలుగుతుంది. అర్జున్ భార్య చిత్ర పాత్రలో సాయి మంజ్రేకర్ పరిదిమేరకు మాత్రమే ఉంటుంది. పఠాన్ పాత్రలో సోహైల్ ఖాన్ పాత్ర చిత్రీకరణ చాలా పేలవంగా ఉంటుంది. విలన్‌గా భారీ ఎలివేషన్స్‌కు మాత్రమే ఆయన పాత్ర ఉంటుంది. శ్రీకాంత్ కమిషనర్‌గా చాలా బాగా చేశాడు. తనకు ఇచ్చిన పాత్రలో సమర్థవంతంగా నటించాడు. హీరోకు ఎప్పుడు వెన్నంటి ఉండే మిత్రులలో ఒకరిగా పృథ్వీ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఈ సినిమా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెడుతుంది. బడ్జెట్‌ మేరకు నిర్మాణ విలువలు పర్వాలేదు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మాస్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో మెప్పించాడు. కానీ, కథ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. అర్జున్ S/O వైజయంతి సినిమా మాస్‌ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అభిమానులకు పండుగలాంటి సినిమా అవుతుంది. కామన్‌ ఆడియన్స్‌కు మాత్రం చివరి 30 నిమిషాలు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Bhagavad Gita, Natyashastra get Unesco honour9
Bhagavad Gita: గర్వించ దగ్గ క్షణం.. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు

సాక్షి,న్యూఢిల్లీ: భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో భగవద్గీతకు చోటు దక్కింది. భగవద్గీత,భరతముని రాసిన నాట్య శాస్త్రానికి గుర్తింపు లభించింది.ఈ ఘనతపై ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘భారత నాగరిక వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణం ఇది. భగవద్గీత, భరతముని నాట్యశాస్త్రం ఇప్పుడు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో లిఖించబడ్డాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్‌వేదికగా ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీ స్పందిస్తూ రీట్వీట్ చేశారు.‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం ఇది. యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో గీత, నాట్యశాస్త్రం చేర్చబడటం మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు. భగవత్ గీత,నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయి. అవి ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. A proud moment for every Indian across the world! The inclusion of the Gita and Natyashastra in UNESCO’s Memory of the World Register is a global recognition of our timeless wisdom and rich culture. The Gita and Natyashastra have nurtured civilisation, and consciousness for… https://t.co/ZPutb5heUT— Narendra Modi (@narendramodi) April 18, 2025

Pawan Kalyan Faced Protests Every Where in AP10
ఝూటా వకీల్‌ సాబ్‌ పతనం మొదలైందా?

సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలతో తనకు సంబంధం లేనట్లు, అదేదో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ల బాధ్యత అన్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికే పార్టీని పెట్టానని గొప్పగా చెప్పుకున్న పవన్.. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లను రాజకీయంగా మోయడానికి, తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శ. దీంతో ఆయనకు ఇప్పుడిప్పుడే నిరసన సెగ తగులుతోంది. కొద్ది రోజుల క్రితం విశాఖ, గిరిజన ప్రాంతాలకు వెళ్లినప్పుడు వలంటీర్లు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)ను నిలదీసే యత్నం చేశారు. ఇప్పటికే ఆయా చోట్ల వలంటీర్లు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. అయినా కూటమి ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. కూటమి పెద్దలకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. దాంతో వలంటీర్లు నేతలను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి వీరే కాదు. సూపర్ సిక్స్ తదితర హామీలు ఏమయ్యాయంటూ మహిళలు, నిరుద్యోగులు తదితర వర్గాలు నిరసన ర్యాలీలు చేయడం ఆరంభమైంది.వలంటీర్లకు సంబంధించి పవన్ చేసిన ప్రకటనను గమనిస్తే ఆయన ఎలా మాట మార్చుతున్నది ఇట్టే తెలిసిపోతుంది. గత ప్రభుత్వం వలంటీర్లను అధికారికంగా నియమించలేదని చంద్రబాబు, లోకేశ్‌లు క్యాబినెట్ సమావేశంలో చెప్పారని, వారికి ఇచ్చేది జీతం కాదు.. గౌరవ వేతనం మాత్రమేనని, అందుకే ఏమీ చేయలేదని తెలియ చేశారని పవన్ అన్నట్లుగా మీడియాలో కథనం వచ్చింది. లక్షన్నర మంది జీవితాలను నట్టేట ముంచేసి, అదేదో స్వల్ప విషయమన్నట్లుగా పవన్ వ్యవహరించడం శోచనీయం. 👉ఎన్నికల ప్రణాళికలో వలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని, వారి సేవలను కొనసాగిస్తామని ప్రకటించింది వాస్తవం కాదా? పలు ఎన్నికల ప్రచార సభలలో పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వలంటీర్ల అంశం ప్రస్తావించారో గుర్తు లేదా? వలంటీర్ల కడుపు కొట్టబోమని, అందులోను లక్షమంది యువతులకు అన్యాయం చేస్తానా? అని ప్రసంగించారు. వాస్తవానికి రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండే వారు. కాని ఎన్నికల సమయంలో సుమారు ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు రాజీనామాలు సమర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉంటే వారిని కూడా బాధ్యతలలోకి తీసుకునే వారు. కాని కూటమి ప్రభుత్వం రావడంతో తమకు గౌరవ వేతనం పెరుగుతుందని రాజీనామా చేయని వలంటీర్లు ఆశపడ్డారు. తీరా చూస్తే కూటమి ప్రభుత్వం అసలుకే మోసం తెచ్చింది. 👉వలంటీర్లు(Volunteers) అంటే స్వచ్ఛందంగా సేవలందించే వారని, వారికి గత జగన్ ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చిందన్న సంగతి పవన్ కళ్యాణ్ కు తెలియదా? ఆ విషయం తెలియకుండానే, గుడ్డిగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రణాళికపై సంతకం చేశారని నమ్మాలా? అదే వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ ఈ పదవిలో ఉండడానికి అర్హుడవుతారా? పైగా క్యాబినెట్లో చంద్రబాబు, లోకేశ్‌లు ఏదో చెప్పారని వారిపై నెట్టేసి తప్పించుకునే యత్నం చేస్తారా? ప్రభుత్వంలో వారు ఏమి చేసినా సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్ వలంటీర్ల విషయం తనకు ఏమీ తెలియదన్నట్లుగా నటించడం ధర్మమేనా?. వలంటీర్లకు ఇచ్చేది గౌరవ వేతనం కనుక ,వారికి ఆ బాధ్యతలు అప్పగించడం కుదరదని చంద్రబాబు, లోకేశ్‌ లు చెబితే పవన్ కళ్యాణ్ చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారా?మనం హామీ ఇచ్చాం కదా! ఎందుకు చేయలేం. ప్రభుత్వం అనుకుంటే ఇది ఒక పెద్ద సమస్యా?అ ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించి ఉండాలి కదా? ఉగాది పర్వదినానా పవిత్రమైన పూజలు నిర్వహించి మరీ వలంటీర్లకు హామీ ఇచ్చారు కదా? ఇప్పుడు కాదంటే పాపం కదా అని చంద్రబాబును అడగాలి కదా? అలా అడగలేదంటే ఏమిటి దాని అర్థం? వలంటీర్లు సామాన్యులు కనుక, వారిని ఏమి చేసినా ఏమీ కాదన్న భావనే కదా?. 👉జగన్ ప్రభుత్వం(Jagan Govt) విజయవంతంగా నిర్వహించిన వలంటీర్లు అంటే చంద్రబాబు, లేదా పవన్ కళ్యాణ్‌లకు ఎప్పుడూ గౌరవం లేదు. వారిని అసలు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా చూడడానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు నాయుడు వీరిని మూటలు మోసే వారని, ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు వెళ్లి వేధించేవారని ఒకసారి నీచమైన రీతిలో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా వలంటీర్లను కిడ్పాపర్లతో పోల్చారు. ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు తప్పిపోయారని అంటూ వలంటీర్లపై ఆరోపణలు చేశారు. కాని ప్రజలలో వలంటీర్ల పట్ల ఉన్న సానుకూలత వల్ల అది వైఎస్సార్‌సీపీకి ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుందోనన్న భయంతో, మాట మార్చి తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడమే కాకుండా, గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని ప్రకటించారు. అప్పటికి వారికి అధికారం వస్తుందన్న నమ్మం లేదు. కాని అనూహ్యంగా గెలిచేసరికి, ఇప్పుడు సూపర్ సిక్స్‌తో సహా అనేక అంశాలపై స్వరం మార్చుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు సినీ నటుడు. ఆ తర్వాతే రాజకీయ నేత. సినిమాలలో వకీల్‌ సాబ్‌గా ఆయన నటన అభిమానులను మెప్పించింది. కానీ రాజకీయ జీవితంలో మాత్రం ఆయన వ్యవహారశైలి వకీల్‌సాబ్‌ పాత్రకు భిన్నంగా ఉంది. ఈ సంగతిని ప్రజలూ గుర్తిస్తున్నారు. కరడుకట్టిన, గుడ్డి అభిమానులు మినహా మిగిలిన వారిలో పవన్‌ కళ్యాణ్‌ మాట మార్చేస్తున్నారన్న భావన క్రమేపీ బలపడిపోతోంది. 👉అబద్దాలు బాగా ఆడతారన్న పేరు ఉన్న చంద్రబాబుకు తానా అంటే తందానా అని తబలా వాయిస్తున్న చందంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఆయనతో పోటీ పడి అసత్యాలు చెబుతున్నారు. తాము మాట మార్చుతున్నామని ధైర్యంగా పవన్ కళ్యాణ్ చెప్పి ఉంటే కొంతైనా బెటర్‌గా ఉండేది. అలా కాకుండా చంద్రబాబు, లోకేశ్‌లదే తప్పు అన్నట్లు, తనకేమీ సంబంధం లేదన్నట్లు పవన్ కళ్యాణ్ డ్రామా ఆడినట్లు డైలాగులు చెబితే ప్రజలను పిచ్చివాళ్లను చేసినట్లు కాదా? వలంటీర్లను మోసం చేయడం కాదా? 30 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ గురించి ఏపీ అంతటా తిరిగి చేసిన ప్రచారం అంతా అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దం అని తేలింది కదా! కేవలం 47 మంది మాత్రమే మిస్ అయ్యారని, వారిలో ఎక్కువ మంది తిరిగి వచ్చారని అసెంబ్లీలో సమాధానం చెప్పింది కూటమి ప్రభుత్వమే కదా? పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దం ప్రచారం చేసి ఆంధ్ర సమాజాన్ని చీట్ చేసినట్లు అవుతుందా? అవ్వదా?.చంద్రబాబు, లోకేశ్‌ల పట్ల పవన్ కళ్యాణ్ ఎంత విధేయుడిగా ఉన్నా ప్రజలకు అభ్యంతరం లేదు. కాని ఎన్నికల ప్రణాళికను చంద్రబాబుతో కలిసి ఆయన కూడా విడుదల చేశారన్న సంగతి మర్చిపోకూడదు కదా! వకీల్ సాబ్ పాత్రను సినిమాలలో పోషించడం కాదు.. ప్రజా జీవితంలో ఆ మాదిరి నిలబడితేనే మంచి పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్ కోసం పోలీసులు ఆంక్షలు విధించడం, తత్పలితంగా సుమారు 30 మంది జెఈఈ పరీక్షలు రాయలేకపోయిన ఘటన కూడా కూటమి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుంది. పవన్ కళ్యాణ్ పదవిని ఎంజాయ్ చేసే మోజులో విద్యార్ధుల భవిష్యత్తును కూడా దెబ్బతీశారన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. ఏది ఏమైనా వలంటీర్లను చంద్రబాబు, లోకేశ్‌లే కాదు.. పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసినట్లే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement