Top Stories
ప్రధాన వార్తలు

పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా!
వాషింగ్టన్ : జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి అంశంపై పాకిస్తాన్‌కు అమెరికా షాకిచ్చింది. మతిలేని చర్యను వెనకేసుకు రావొద్దని హెచ్చరించింది. పహల్గాం దాడి విషయంలో చేపట్టే దర్యాప్తులో భారత్‌కు సహకరించాలని సూచించింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ - పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాక్ ప్రధాని హహబాద్ షరీఫ్‌తో ఫోన్లో మాట్లాడారు.ఫోన్ సంభాషణలో రూబియో.. ఉగ్రవాదంపై భారత్ తీసుకునే ప్రతి చర్యలో అమెరికా పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. అదే సమయంలో పహల్గాంలో 26 మంది ప్రాణాలు తీసిన అమానుష చర్యపై భారత్ చేపట్టే దర్యాప్తుకు సహకరించాలని సూచించినట్లు సమాచారం.జైశంకర్‌తో మాట్లాడిన సమయంలో మార్కో రూబియో పహల్గాం దాడి బాధితులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై జరిపే పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముందు నుంచి పహల్గాం ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ విషయంలో ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతి భద్రతలను కాపాడుకోవడానికి పాకిస్తాన్‌తో కలిసి పనిచేయాలని భారత్ కృషి చేయాలని కోరారు. అందుకు ప్రతిస్పందనగా ఎక్స్ వేదికగా జైశంకర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో దాడికి పాల్పడ ఉగ్రవాదుల్ని, వాళ్లను పెంచి పోషిస్తున్న వారిని, పహల్గాం ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన వారిని న్యాయం ముందు నిలబెట్టాలి’ అని పేర్కొన్నారు. రుబియో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌తో జరిపిన సంభాషణల్లో పాకిస్తాన్ పహల్గాం దాడిని ఖండించాలని, దర్యాప్తులో సహకరించాలని కోరారు. ఈ దాడిపై పాకిస్తాన్ బాధ్యత వహించాలని, భారత్‌తో నేరుగా సంభాషణలు పునరుద్ధరించి శాంతి దిశగా కృషి చేయాలని సూచించినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరి తాజా పరిణామలపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

ఎవరి అక్షయపాత్ర అమరావతి?
'అక్షయపాత్ర అమరావతి" ఎల్లో మీడియా ఈనాడులో ప్రధాన శీర్షిక ఇది. ప్రశ్న ఏమిటంటే.. ఇది ఎవరి అక్షయపాత్ర? పేదలకా? లేక ధనికులు, భూస్వాములు, కాంట్రాక్టర్లకా? బాబు గారి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని ఒకరోజు కోసమైనా మళ్లించేందుకు ఇలాంటి శీర్షికలు, కథనాలు ఉపయోగపడతాయేమో కానీ.. అన్నివేళలా మాత్రం కాదు. లేదంటే.. తమ వర్గానికి అనూహ్యస్థాయి లబ్ధి చేకూరుతోందని ఈనాడు యాజమాన్యం సంతోషంతో ఇలాంటి కథనాలు వండి వార్చి ఉండాలి. అయితే... ఈ కథనం వచ్చిన రోజే సాక్షి దినపత్రికలో ఇంకో కథనం వచ్చింది. దీని శీర్షిక 'అవినీతి ఐకానిక్’... అమాంతంగా పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం’’ అని వివరమైన బ్యానర్ కథనం వచ్చింది. నిజానికి పాత్రికేయ వృత్తిలో ఉన్నవారు. ప్రభుత్వ వ్యవహారాలతోపాటు, అధికారంలో ఉన్నవారు చేస్తున్న వాటిలో మంచి,చెడు విశ్లేషించి రాయాలి. ఎల్లో మీడియా ఆ పని మానేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అధికారంలో ఉన్నా, లేకపోయినా, ఆయనపైనే ఏడుపుగొట్టు వార్తలు, అబద్ధాలు రాయడమే పనిగా పెట్టుకుంది. కూటమి వైఫల్యాలను కప్పిపుచ్చుతూ ప్రజలను వంచించడానికి కృషి చేస్తోంది. అందుకే ఆరికి అమరావతిలో అంతా అద్భుతంగానే కనిపిస్తోంది.2014-19 మధ్యకాలంలోనూ అమరావతికి విపరీతమైన హైప్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి అదే బాకా ఊదుతున్నారు. అక్షయపాత్ర అని, ప్రపంచ స్థాయి రాజధాని అని ఊదరగొడుతున్నారు. అయితే వీరి ప్రచార ఆర్భాటానికి మోసపోయి అప్పట్లో భూములు కొన్న వారు ఇప్పటికీ తేరుకోలేదు. మరోసారి మోసపోయేందుకు వారు సిద్ధంగా ఉన్నారా? అన్నది ప్రశ్న. చంద్రబాబు ప్రధానమంత్రి మోడీని కలిసి అమరావతి పనుల పునఃప్రారంభానికి ఆహ్వానించారు. అంతవరకు ఓకే. కాని ఆ సందర్భంగా మోడీతో మాట్లాడిన విషయాలు అంటూ ఈ అక్షయపాత్రను సృష్టించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల వాసుల అవసరాలు తీర్చే నగరంగా తీర్చిదిద్దనున్నామని, విద్య, ఉపాధి, వైద్య అవకాశాలు కల్పించే అక్షయపాత్రలా తయారు చేయాలన్నది ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు ప్రధానితో అన్నారని ఈ కథనంలో చెప్పారు.ఇది ఎంత వరకూ వాస్తవరూపం దాలుస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రజలందరి నెత్తిన రూ. లక్ష కోట్ల రుణ భారమైతే గ్యారెంటీ. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో గతంలో నొక్కి వక్కాణించినట్లు ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ నగరం ఏమాత్రం కాదని ఇప్పటికే స్పష్టమైపోయింది. ఈ నగర నిర్మాణానికి తెచ్చే అప్పులు ఏదో ఒక రూపంలో కట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. లబ్ధి మాత్రం నేతలదవుతుంది. అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణ టెండర్లు పిలిచిన తీరు, కావల్సిన వారికి వాటిని కేటాయించుకున్న వైనం, అమాంతం రేట్లు పెంచేసిన పద్దతి ఇవన్ని చూస్తుంటే కాంట్రాక్టర్లకు, కూటమి పెద్దలకు అమరావతి కచ్చితంగా అక్షయపాత్రే కానుందని చెప్పవచ్చు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సిమెంట్, స్టీల్ రేట్లు 2019 నాటికన్నా తగ్గాయని, అయినా అమరావతిలో నిర్మాణాల వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు పెంచేశారని విమర్శించారు. సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాల అధిపతుల కార్యాలయాల కోసం సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. చదరపు అడుగుకు రూ.8981ల చొప్పున ఖర్చుపెట్టడానికి ఓకే అయింది. మొత్తం రూ.4688 కోట్ల వ్యయం అవుతుంది. 2018లో ఇవే టవర్లకు రూ.2271 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అప్పట్లో చదరపు అడుగుకు రూ.4350లే చాలా ఎక్కువ అని అనుకుంటే, ఇప్పుడు దానిని డబుల్ చేశారు.నిజానికి హైదరాబాద్‌లో భూమి విలువతో లెక్కవేసుకున్నా ఈ స్థాయి ఖర్చు కాదని పలువురు బిల్డర్లు చెబుతున్నారు. అమరావతిలో భూమి ఖర్చు లేదు. ఇసుక ఉచితం. ఇతర నిర్మాణ సామాగ్రీ ధరలు కూడా గతంతో పోలిస్తే తక్కువగా ఉన్న నేపథ్యంలో నిర్మాణ వ్యయం పెరగడం అసాధారణమైన విషయమని చెబుతున్నారు. ఒక ఐకానిక్ టవర్‌లో 49 అంతస్తులు, మరో మూడు టవర్లు 39 అంతస్తులు చొప్పున నిర్మించబోతున్నారు. మొత్తం ప్రభుత్వంలో పర్మనెంట్ సిబ్బంది రెండువేల లోపు ఉంటే, ఇతరత్రా అంతా కలిపి మరో రెండువేల మంది ఉంటారని అనుకున్నా, ఈ స్థాయిలో భవనాల అవసరం ఏమిటో అర్థః కాదు.ప్రస్తుతం తాత్కాలిక సచివాలయంలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. పోనీ దీనికి రెట్టింపు స్థలం అవసరం అనుకుంటే 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు నిర్మిస్తే సరిపోతుంది. అలా కాకుండా ఏకంగా 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు చేపడతారట. నాలుగు టవర్లలో మొత్తం సచివాలం నిర్మిస్తుంటే, ఇన్నివేల ఎకరాల భూమి దేనికో తెలియదు.ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ సచివాలయంతో సహా అన్ని భవనాలు కలిపి కూడా సుమారు 250 ఎకరాలలోపే ఉంటాయని అంటారు. ఇతర రాష్ట్రాల రాజధానులలో సైతం ఎక్కడా రెండు, మూడు వేల ఎకరాలకు మించి కార్యాలయాలకు వాడడం లేదు. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నిర్మించిన సచివాలయానికి సుమారు వెయ్యికోట్లు అయితే, విభజిత ఏపీలో కేవలం రూ.4688 కోట్లు ఖర్చుపెట్టబోతున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందని గ్యారంటీ లేదు. ఇప్పటికే తాత్కాలిక సచివాలయం కోసం వెయ్యి కోట్లకుపైనే వ్యయం చేశారు. అందులో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడం, కేంద్ర ప్రభుత్వ శాఖలు అప్పటి చంద్రబాబు పీఏ ఇంటిపై దాడిచేసి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు దానిని మేనేజ్ చేశారని అంటున్నారు. అందువల్లే అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు తదుపరి అడుగు ముందుకు వేయలేదు. అది వేరే సంగతి.ఇప్పుడు కూడా ఈ స్థాయిలో ఖర్చుపెడితే ప్రజలపైనే భారం పడుతుంది కదా! అసెంబ్లీ, తదితర నిర్మాణాలకు ,భూములు ఇచ్చిన రైతులకు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీరు తదితర అన్ని వసతులు కల్పించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో ఎవరూ చెప్పలేరు. కాంట్రాక్టర్లకు పనుల విలువలో పది శాతం ముందుగానే ప్రభుత్వం చెల్లిస్తుందట. ఇందులో ఎనిమది శాతం వరకు ప్రభుత్వ పెద్దలకు కాంట్రాక్టర్లు ముట్ట చెబుతారని ఇప్పటికే వైసీపీ ఆరోపించింది. గతంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ పద్దతిని వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తోందో చెప్పాలి కదా? మొత్తం మీద ఇది పేదలు, మధ్య తరగతి వర్గాలకు ఉపయోగపడే రాజధాని కాదు. పెత్తందార్లకు, కాంట్రాక్టర్లు, బడాబాబులకు మాత్రమే ఉపయోగపడేదని తేలడం లేదా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

మంచి తరుణం మించి పోరాదు! పసిడి తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఈరోజు తగ్గుముఖం పట్టింది. బుధవారంతో పోలిస్తే గురువారం భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,750 (22 క్యారెట్స్), రూ.97,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.2000, రూ.2180 తగ్గింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.2000, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2180 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.2000 దిగి రూ.87,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2160 తగ్గి రూ.95,880 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లుగానే వెండి ధరలు(Silver Price) కూడా గురువారం తగ్గాయి. బుధవారం ముగింపు ధరలతో పోలిస్తే వెండి ధర కేజీ రూ.2,000 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,07,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ఇజ్రాయెల్‌లో భీకర కార్చిచ్చు.. జెరూసలెంను కమ్మేసిన పొగ
జెరూసలెం శివారులోని అడవుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో వేలాది మంది తమ నివాసాలను ఖాళీ చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. కార్చిచ్చు కారణంగా 13 మంది గాయపడినట్లు సమాచారం. ప్రాణనష్టంపై వివరాలు ఇంకా తెలియరాలేదు. వాతావరణం పొడిగా ఉండటం, బలమైన గాలులతో ఈ మంటలు వేగంగా చెలరేగుతున్నాయి.మంటలకు సంబంధించిన వీడియోలు, రోడ్లపై పలువురు తమ వాహనాలు విడిచి.. పరుగులు పెడుతున్నా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జెరూసలెం చుట్టుపక్కల కొండలపై దట్టమైన పొగ అలముకుంది. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దేశ చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా అధికారులు చెబుతున్నారు.ఈ మంటలు జెరూసలెం నగరానికి చేరుకోవచ్చని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే హెచ్చరికాలు జారీ చేశారు. రహదారులపై దట్టమైన పొగ కమ్ముకోవడంతో టెల్ అవీవ్, జెరూసలెంను కలిపే రహదారిని మూసేశారు. సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. మంటలు చెలరేగుతున్న ప్రాంతాలలోని పర్యాటక ప్రదేశాలను మూసివేశారు.📹1-The fires are spreading over increasingly larger areas as Israeli firefighting units are unable to bring them under control. https://t.co/Ls6gBs07h0📹2-A major highway of the occupying state was closed after #wildfires engulfed it with flames & smoke, forcing drivers &… pic.twitter.com/Ena9kmPjOS— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) May 1, 2025

గెలుపు జోష్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు షాక్!
గెలుపు జోష్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా చేసిన తప్పిదానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున రూ. 12 లక్షల మేర ఫైన్ వేసింది.ఐపీఎల్-2025 (IPL 2025)లో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. చెన్నైతో బుధవారం నాటి మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్లో ఆరో విజయం నమోదు చేసింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ పంజాబ్‌కు ఈ ఎడిషన్‌లో పదో మ్యాచ్.చహల్ మాయాజాలంఇందులో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ చేసిన పంజాబ్.. సీఎస్కేను 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ చేసింది. చెన్నై బ్యాటర్లలో సామ్ కరన్ (88), డెవాల్డ్ బ్రెవిస్ (32) రాణించగా.. పంజాబ్ బౌలర్లలో స్పిన్నర్ యజువేంద్ర చహల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.హ్యాట్రిక్ నమోదు చేసిన చహల్.. మొత్తంగా మూడు ఓవర్లలో కేవలం 32 పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో అర్ష్‌దీప్ సింగ్, మారోక యాన్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నాలుగు వికెట్ల తేడాతో జయభేరిఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ఆకట్టుకున్న పంజాబ్.. చెన్నై బౌలర్ల విజృంభణతో ఆఖరి ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (23), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (54) రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో72) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో శశాంక్ సింగ్ (12 బంతుల్లో 23) వేగంగా ఆడగా.. 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పంజాబ్ 196 పరుగులు సాధించింది. చెన్నైపై నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.అయితే, ఈ మ్యాచ్‌లో పంజాబ్ స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసింది. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ. 12 లక్షల జరిమానా పడింది. ఈ సీజన్లో ఇది తొలి తప్పిదం కాబట్టి.. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ మేర ఫైన్‌తో సరిపెట్టినట్లు ఐపీఎల్ పాలక మండలి తెలిపింది.ఐదుసార్లు చెన్నైని చెపాక్‌లో ఓడించి మరోవైపు.. పంజాబ్ చేతిలో ఓటమితో చెన్నై ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా సీఎస్కే సొంత మైదానం చెపాక్‌లో ఆ జట్టును అత్యధిక సార్లు ఓడించిన జట్టుగా పంజాబ్ రికార్డులకెక్కింది. ఐదుసార్లు చెన్నైని చెపాక్‌లో ఓడించి ముంబై రికార్డును సమం చేసింది. అంతకుముందు ముంబై ఇండియన్స్ తొమ్మిది మ్యాచ్‌లలో ఇదే వేదికపై ధోని సేనను ఓడించగా.. ఇప్పుడు పంజాబ్ కూడా ఆ ఘనత సాధించింది.చదవండి: #Glenn Maxwell: ఐపీఎల్-2025 నుంచి మాక్స్వెల్ ఔట్..Hat-trick 👌Powerful start with the bat 🔥Captain's knock 🫡The Battle of Kings goes the @PunjabKingsIPL way again this season ❤Scorecard ▶ https://t.co/eXWTTv7Xhd #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/Yk1SOZOzip— IndianPremierLeague (@IPL) April 30, 2025

కార్మిక సోదరులకు వైఎస్ జగన్ మేడే శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: మేడే సందర్భంగా కార్మికులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే పట్టుగొమ్మలు. ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సోదర సోదరీమణులందరికీ మే డే శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే పట్టుగొమ్మలు, ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సోదర సోదరీమణులందరికీ మే డే శుభాకాంక్షలు.#MayDay #InternationalLabourDay— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2025

దూసుకొస్తున్న కాస్మోస్ 482
సోవియట్ యూనియన్ ఎప్పుడో అర్ధ శతాబ్దం క్రితం ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘కాస్మోస్ 482’ త్వరలో భూమిపై కూలబోతోంది. మే నెల 8-11 తేదీల మధ్య అది భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. శుక్ర గ్రహాన్ని పరిశోధించడానికి 1972 మార్చి 31న సోవియట్ ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. వాస్తవానికి ‘కాస్మోస్ 482’ ఓ లాండింగ్ మాడ్యూల్. 495 కిలోల ల్యాండరును శుక్రగ్రహంపై దింపడం ఈ మిషన్ ఉద్దేశం. సాంకేతిక లోపం తలెత్తి ప్రయోగం విఫలమవడంతో ‘కాస్మోస్ 482’ స్పేస్ క్రాఫ్ట్ ముందుకు ప్రయాణించడానికి అవకాశం లేక భూకక్ష్యలోనే ఇరుక్కుపోయింది. గత 53 సంవత్సరాలుగా అది భూమి కక్ష్యలోనే పరిభ్రమిస్తోంది. ఇప్పుడు కూలే సమయం ఆసన్నమవడంతో శాస్త్రవేత్తలు దాని ఆర్బిటల్ ఎత్తును నిరంతరాయంగా గమనిస్తున్నారు. అంతరిక్ష నౌక కచ్చితంగా ఏ తేదీన భూమిపై కూలుతుందో త్వరలో తెలుస్తుంది. మే 8-11 తేదీల్లో ‘కాస్మోస్ 482’ భూమిపై కూలవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ... ‘సూర్యుడి క్రియాశీలత’ ప్రభావంతో సదరు తేదీలకు కాస్త ముందుగా గానీ, లేదా ఆ తర్వాత గానీ నౌక కూలే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే సూర్యుడి క్రియాశీలత అధికంగా ఉంటే భూమి ఎగువ వాతావరణం త్వరగా వేడెక్కి వ్యాకోచిస్తుంది. ఫలితంగా దిగువ కక్ష్యలో పరిభ్రమించే వస్తువులను భూ వాతావరణం త్వరితగతిన లాక్కుంటుంది. అంటే ‘కాస్మోస్ 482’ అంతరిక్ష నౌక మనం అనుకున్న సమయం కంటే ముందుగానే కూలిపోవచ్చు. 52 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల్లో కూలవచ్చు!భూ వాతావరణంలోకి అనియంత్రిత ప్రవేశం’ కనుక ‘కాస్మోస్ 482’ స్పేస్ క్రాఫ్ట్ భూమిపై ఏ ప్రాంతంలో కూలిపోతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ ప్రస్తుతం నౌక కక్ష్యను పరిశీలిస్తే భూమిపై 52 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 52 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య గల సువిశాల ప్రదేశంలో... అంటే ఉత్తరాన బ్రిటన్ మొదలుకొని దక్షిణాన న్యూజిలాండ్ దాకా ఎక్కడైనా అది కూలవచ్చు. భూమిపై జలావరణమే అధికం కనుక నౌక నేలపై కాకుండా సముద్రాల్లో కూలిపోయే అవకాశాలే ఎక్కువ. సముద్ర ప్రదేశాలు కాకుండా భూభాగంపై లేదా జనావాస ప్రాంతాలపై అది కూలిపోయే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ ఓ అంశం శాస్త్రవేత్తలను కొంచెం కలవరపెడుతోంది. ‘కాస్మోస్ 482’కు ఓ విశిష్టత ఉంది. అది ‘వెనెరా’ మిషన్ ల్యాండర్ల తరహా అంతరిక్ష నౌక. శుక్ర గ్రహంపై దిగేటప్పుడు అక్కడి కఠినాతి కఠినమైన అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర పీడనాన్ని తట్టుకునేలా ‘కాస్మోస్ 482’ను రూపొందించారు. సాధారణంగా ఖగోళ వస్తువులు భూవాతావరణంలోకి ప్రవేశించాక గాలి ఒరిపిడికి మండిపోయి చిన్న శకలాలుగా రాలిపోతాయి. వాటిలోని పెద్ద, బరువైన భాగాలు మాత్రమే భూమిని తాకుతాయి. డిజైన్ ప్రత్యేకత దృష్ట్యా ‘కాస్మోస్ 482’ మాత్రం భూ వాతావరణంలోకి ప్రవేశించినా ధ్వంసం అవదు. సముద్రాల్లో కాకుండా అది భూభాగంపై కూలిపోవడమంటూ సంభవిస్తే... ఏమాత్రం చెక్కు చెదరకుండా 495 కిలోల ‘కాస్మోస్ 482’ ధడేల్మని ‘ఒకే ముక్క’గా నేల రాలుతుంది! అలా చిన్న ఉల్క మాదిరి ప్రభావం చూపుతుంది. శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తున్న అంశం ఇదే. - జమ్ముల శ్రీకాంత్

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 21 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను అధికారులు జారీ చేశారు.కోస్తాంధ్రలో ఒక్కసారిగా మారిన వాతావరణంకోస్తాంధ్రలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వాతావరణంలో భిన్నమైన మార్పులు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో విపరీతమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక కొన్ని చోట్ల కురిసిన అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!
పిల్లలకు చెప్పాల్సిన పాఠాలు ‘మీరు ఉద్దండ పండితులేగాని ఉండాల్సిన బుద్ధి మాత్రం లేదయ్యా’ అంటాడు శకుని. ర్యాంకులు వేరు... కామన్సెన్స్ వేరు... ఈ సంగతి పిల్లలకు ఎవరు చెప్పాలి? ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అంటాడు ఇదే శకుని. ఈ చిట్కా చెప్పడానికి పెద్దలకు తీరిక ఎక్కడిది? అస్మదీయులు ఎవరో తస్మదీయులు ఎవరో తెలుసుకోకపోతే పిల్లల అడుగులు పడేదెలా? హాయ్ హాయ్ నాయకా.. హోయ్ హోయ్ నాయకా... నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉంటాయి? తెలుగువారికి మాత్రమే ఉన్న వ్యక్తిత్వ వికాస సర్వస్వం ‘మాయాబజార్’ సినిమా. ఈ సెలవుల్లో పెద్దలు పిల్లలతో ఈ సినిమా చూడాలి. వివరించాలి. ‘మాయాబజార్’1957లో విడుదలైన గొప్ప తెలుగు చిత్రం. భారతంలోని పాత్రలకు కొద్దిపాటి కల్పన జత చేసి మలచిన ఈ సినిమా ఎందుకు ఇంతకాలం ఆదరణ పొందుతూ ఉందంటే అది ఎప్పుడూ ఒకేలా ఉండే మానవ స్వభావాలను చిత్రించింది కనుక. నేడు ఎదురుపడే మనుషులు ఎలా ఉంటారో ఈ సినిమాలో పాత్రలు అలా ఉంటాయి. అందుకే వాటితో తమను తాము ఐడెంటిఫై చేసుకున్న ప్రేక్షకులు ఎన్నో సాఠాలు నేర్చుకుంటారు. అర్థం చేసుకుంటారు. పిల్లలకు ఈ సినిమా గొప్ప వినోదంగా ప్రారంభమవుతుంది. ఐదేళ్ల వయసు పిల్లల నుంచి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. చూసేకొద్దీ ఎదిగే కొద్దీ వారికి సినిమా కొత్తగా అర్థమై మరింతగా నచ్చుతుంది. ఈ సినిమాకు ఫ్యాన్స్ అయిపోతారు. అలా తరతరాలుగా ఫ్యాన్స్ అయ్యేలా చేసుకుందీ సినిమా. గతంలో ప్రతి వేసవిలో ఈ సినిమా రీరిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఓటిటీల్లో... యూట్యూబ్‌లో కలర్లో ఉంది. పిల్లలతో ఒకటికి రెండుసార్లు చూసి వారికి చెప్పాల్సిన పాఠాలు చాలానే ఉంటాయి. 1. బాల అభిమన్యు తన విలువిద్య గురించి ఇలా అంటాడు: అత్తయ్యా... నువ్వు జడవకుండా నుంచో... నీ ముక్కుకు తగలకుండా నత్తును కొడతాను. పిల్లలకు చెప్పాలి: నత్తు అంటే ముక్కుకు పెట్టుకునే ఆభరణం. విలువిద్య నేర్చుకుని ఎవరైనా సరే పండునో కాయనో కొట్టగలరు... కాని ముక్కుకు తగలకుండా నత్తును కొడతానంటున్నాడంటే విలువిద్య చాలా గొప్పగా నేర్చుకున్నాడన్న మాట. మనం చదివినా, ఆటల్లో ప్రవేశించినా, కళల్లో ఉన్నా ఆ స్థాయి పరిణితి సాధించాలి. అభిమన్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి. 2. శ్రీకృష్ణుడు ‘సత్యపీఠం’ తీసుకువస్తాడు. అలాగే ‘ప్రియదర్శిని’ కూడా చూపిస్తాడు. పిల్లలకు చెప్పాలి ‘సత్యపీఠం’ ఆనాటి లై డిటెక్టర్. మన పూర్వికులు శాస్త్రపరంగా గొప్ప ప్రయోగాలు చేశారు. ఊహలు చేశారు. శాస్త్రజ్ఞుల ఊహలో లేని కాలంలో ‘సత్యపీఠం’ ఊహ చేయడం మనవారి గొప్పతనం. అలాగే వీడియో కాల్ చేసుకునేలా ల్యాప్‌టాప్‌లాంటి ‘ప్రియదర్శిని’ని చూపించారు. సైన్స్ దృష్టికోణం నుంచి పురాణాలు చూస్తే చాలా ఇంటెరెస్టింగ్ విషయాలు తెలుస్తాయని చె΄్పాలి. 3. శకుని పాచికలు వేస్తూ అంటాడు: ఈ పాచికలతో ఎవరినైనా సర్వనాశనం చేయగలను. పిల్లలకు చె΄్పాలి: జూదం వ్యసనం. అందులో మోసం ఉంటుంది. నష్టం ఉంటుంది. ఒక్కసారి వ్యసనాల్లో దిగితే తిరిగి రావడం కష్టం. నేటి రోజుల్లో ఆన్లైన్ గేమింగ్ కూడా అలాంటి వ్యసనమే. బెట్టింగ్ యాప్‌లు కూడా వ్యసనమే. ఆల్కహాల్, డ్రగ్స్ కూడా వ్యసనాలే. వ్యసనాల వల్ల పాండవులు రాజ్యాలను కోల్పోయారు. అందువల్ల ఎప్పుడూ వ్యసనాల జోలికిపోకూడదు. 4. శర్మ, శాస్త్రి వచ్చి లక్ష్మణ కుమారుణ్ణి పొగుడుతూ ‘పురోగమించుట వారికి తెలుసు... తిరోగమించుట తమకు తెలుసు’ అంటారు. పిల్లలకు చెప్పాలి: గొప్పలు చెప్పుకోవడం, పొగడ్తలకు పడిపోవడం అల్పుల లక్షణం అని, లక్ష్మణ కుమారుడు అలాంటి వాడని చెప్పాలి. మనకు ఎంత ప్రతిభ ఉన్నా గొప్పలు చెప్పుకోకూడదని నేర్పాలి. లేని ప్రతిభ ఉన్నట్టుగా కల్పించి చెప్పి అభాసుపాలు కాకూడదని చెప్పాలి. మన బలహీనతను వాడుకుంటూ కొందరు చుట్టూ చేరి మోసం చేసి పబ్బం గడుపుతారనీ అలాంటి వారిని గుర్తించి దూరం ఉండాలి చెప్పాలి. 5. రాజ్యం పోయాక సుభద్ర వస్తే బలరాముని ఇంట్లో పరాభవం పిల్లలకు చెప్పాలి: కొందరు మనుషులు అభిమానాన్ని బట్టి గాక స్థితిని బట్టి గౌరవిస్తారని, మనం కష్టంలో ఉంటే వారు అసలు రూపు చూపిస్తారని అలాంటి వారిని చూసి జాలి పడాలి తప్ప బాధ పడకూడదని నేర్పాలి. డబ్బుకు అతీతమైన విద్యాబుద్ధులు, వ్యక్తిత్వం శాశ్వతమని, వాటికే లోకంలో విలువ, గౌరవం అని చె΄్పాలి. 6. ఘటోత్కచుడి ప్రవేశం పిల్లలకు చెప్పాలి: మన దేశంలో అడవుల్లో జీవించేవారు ఉంటారని వారిని గిరిజనులు, ఆదివాసీలు అంటారనీ వారి కట్టు, బొట్టు, భాష, యాస, ఆచారాలు వేరని... మనం నాగరికులం అయినంత మాత్రాన వారిని చిన్నచూపు చూడకూడదని. వారెంతో మంచివారని, అడవులు వారి ఆధారం అని వాటిని నరికి లాక్కుని వారికి హాని కలిగించడం తప్పు అని నేర్పాలి. ‘అస్మదీయులు’ అంటే ఫ్రెండ్స్ అనీ, ఆదివాసీలకు మనం అస్మదీయులుగా ఉండాలని చె΄్పాలి. 7. దుష్ట చతుష్టయం పిల్లలకు చెప్పాలి: దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు... వీరు నలుగురిని దుష్ట చతుష్టయం అంటారని చతుష్టయం అంటే నాలుగు అని చెప్పాలి. చెడు ఆలోచనలు చేసేవారితో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవాళ్లం అవుతామని చెడ్డపనులు చేయడం వల్ల ప్రమాదంలో పడతామని హెచ్చరించాలి. 8. గింబళి, గిల్పం కావాలని డిమాండ్ పిల్లలకు చెప్పాలి: స్నేహితులైనా, బంధువులైనా న్యాయమైన సాయం, కోరిక కోరితే నెరవేర్చాలని, అదే మన మంచితనం సాకుగా తీసుకుని గొంతెమ్మ కోరికలు కోరితే వారికి బుద్ధి చె΄్పాలని నేర్పాలి. ‘కంబళి’, ‘తల్పం’ కాదని ‘గింబళి’, ‘గిల్పం’ కోరిన శర్మ, శాస్త్రులకు చిన్నమయ్య బుద్ధి చెప్పే దృశ్యాలు పిల్లలకు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి. 9. శాకంబరీదేవి ప్రసాదం– వివాహ భోజనంబు పిల్లలకు చెప్పాలి: తెలుగువారి భోజనానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ప్రతి ప్రాంతానికీ సమూహాలకు వారివైన ఆహార అలవాట్లు ఉంటాయని, వాటిని గౌరవించాలని మన ఆహారపు అలవాట్లను పాటించాలని నేర్పించాలి. గోంగూరను శాకంబరీ దేవి ప్రసాదం అంటారని తెలుగువారికి గోంగూర ఇష్టమని చెప్పాలి. భక్ష్యాలు, చిత్రాన్నాలు, పానీయాలు, కూరగాయలు అంటే ఏమిటో వాటి తేడాలేమిటో చెప్తే సరదా పడతారు. 10. చినమాయను పెనుమాయ పిల్లలకు చెప్పాలి: ఏ పనైనా నిజాయితీగా చేస్తే ఫలితం ఉంటుందని.. మాయతో కపటంతో శశిరేఖను లక్ష్మణ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని కౌరవులు భావిస్తే శ్రీకృష్ణుడు, ఘటోత్కచుడు పెనుమాయతో ఆ పెళ్లిని పెటాకులు చేశారని... తగిన శాస్తి జరిగిందని... చెడ్డవాళ్లు ఎప్పటికీ ఓడిపోతారని, మంచితనంతో ఉంటేనే గెలుస్తామని బోధించాలి.(చదవండి: అందరికీ కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్ ఎలా ఉండాలంటే..?)

HIT3 X Review: ‘హిట్ 3’ ట్విటర్ రివ్యూ
నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన 'హిట్: ది థర్డ్ కేస్'(HIT3) సినిమా ఎట్టకేలకు నేడు(మే 1) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో చిత్రమిది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమా పై హైప్ క్రియేట్ అయింది. భారీ లంచనాల మధ్య మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. హిట్ 3 కథేంటి? ఎలా ఉంది? నాని ఖాతాలో మరో హిట్ పడిందా లేదా తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో హిట్ 3(HIT3 Review) సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.కొంతమంది నెటిజన్స్ సినిమా మొదటి సగం అద్భుతంగా ఉందని, నాని నటన, రొమాంటిక్ ఎపిసోడ్లు ఆకట్టుకున్నాయని ప్రశంసింస్తే..మరికొంతమంది ఈ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోలేదని, గత హిట్ సినిమాలతో పోలిస్తే ఈ భాగం సాధారణంగా ఉందని అభిప్రాయపడ్డారు. సినిమా రెండో సగం కథలో మెరుగైన ఆలోచనలు, ఎగ్జిక్యూషన్ లోపించాయని కొందరు విమర్శించారు. అయినప్పటికీ, నాని పాత్రలో కొత్త జోన్లో కనిపించాడని, అతని నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చాలామంది కొనియాడారు. #Hit3 is a very violent action crime thriller that has moments that work well but at the same time portions that are too run of the mill and narrated on the slower side.The first half is pretty average and predictable till the pre-interval which starts to engage. The second…— Venky Reviews (@venkyreviews) April 30, 2025 హిట్ 3' ఒక వయలెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్.కొన్ని సీన్స్ భాగా వర్కౌట్ అయ్యాయి.అదే సమయంలో కొన్ని రోటీన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఫస్టాఫ్ రొటీన్‌గా, ఊహించదగిన విధంగా ఉంటుంది. ప్రీ-ఇంటర్వెల్ వరకు, అక్కడ నుండి ఆసక్తికరంగా మారుతుంది. రెండవ సగం స్క్విడ్ గేమ్ నుండి ప్రేరణ పొందిన సెటప్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే, ముందుగా చెప్పినట్లు కథనం ఊహించదగిన విధంగా ఉంటుంది, తక్కువ ట్విస్ట్‌లతో మరియు మాస్ మూమెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. నిర్మాణ విలువలు మరియు సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తాయి. సంగీతం ప్రభావవంతంగా లేదు . నాని అద్భుతంగా నటించాడు అంటూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇచ్చాడు.#Hit3One time watch for NaNiHighlights __________NaNi’s performance Cinematography Climax Negatives__________Forceful violenceNo twists and turnsUneven screenplayBGM— praneeth nukala (@praneethnukala) May 1, 2025 హిట్ 3 ఒక్కసారి చూడొచ్చు. నాని నటన, సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయితే.. వయెలెన్స్ బలవంతగా ఇరికించడం, ట్విస్టులు,మలుపులు లేకపోవడం, స్క్రీన్‌ప్లే, బీజీఎం మైనస్ పాయింట్స్ అని మరో నెటిజన్ అభిప్రాయ పడ్డాడు#HIT3 #HIT3Review RAW..BLOODY..🎯🎯🎯🎯Not for family audiences or kids. What an actor @NameisNani . He is growing as multitalented, big box office star. Best of #Nani movie I have ever watched. Totally new experience 👏🏼👏🏼Strictly NO Kids ⛔️⛔️***BLOCKBUSTER***— Karthik (@meet_tk) April 30, 2025#HIT3 rating : ⭐⭐🌟3/5!!@NameisNani show🔥 an Griping action pack thriller, #SrinidhiShetty and #nani chamestry good overall an watchable.#hit3review #HIT3FromMay1st pic.twitter.com/guu9TKRMsS— its cinema (@iitscinema) April 30, 2025 ఇది నాని షో. గ్రిస్పింగ్ యాక్షన్‌ప్యాక్ థ్రిల్లర్. శ్రీనిధి శెట్టి, నాని కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్‌గా హిట్3 థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా అంటూ మరో నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు.First half Good Second Half & Pre climax 💥💥💥💥💥💥💥💥💥💥💥. #HIT3 pic.twitter.com/8074TXw1v1— Vishnu Varthan Reddy (@RVVR9999) May 1, 2025#hit3review – Gritty & violent thriller with flashes of brilliance. First half dull, second half picks up with Squid Game vibes. Nani excels, but predictable plot, excess violence & weak music pull it down. Not for families.Rating: 2.75/5#Nani #HIT3TheThirdCase #HIT3 #hit3 pic.twitter.com/98Rk6J9tUs— Tha Cinema (@tha_cinema) May 1, 2025#HIT3Review:Positives• Nani🔥💥💥• The Final Act🥵👿• Concept😮• Sailesh's Screenplay👌• Cameos💥Suspenses🙌Investigation💥Final Verdict: An Engaging Suspense Thriller that serves its Purpose.#HIT3 | #NANI | #HIT3TheThirdCase #castesensuspic.twitter.com/eDn379ICBk— IndianCinemaLover (@Vishwa0911) May 1, 2025
పెళ్లికి ముందే చెప్పా.. నాకు లవర్ ఉన్నాడని..
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్ స్టార్.. ఐపీఎల్ హిస్టరీలోనే..
ఎవరి అక్షయపాత్ర అమరావతి?
రెండో కొడుకు... అనాథగా వచ్చి.. సెలబ్రిటీగా ఎవరో తెలుసా?
బంగారమా..? మకొద్దు బాబోయ్..!
భూమికపై విచక్షణా రహితంగా దాడి చేసిన భర్త
హిట్-4లో హీరో ఫైనల్.. ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ
ఎవరు పేద? ధనం లేకపోయినా పరవాలేదు గానీ..!
మంచి తరుణం మించి పోరాదు! పసిడి తులం ఎంతంటే..
కార్మిక సోదరులకు వైఎస్ జగన్ మేడే శుభాకాంక్షలు
పెళ్లికి ముందే చెప్పా.. నాకు లవర్ ఉన్నాడని..
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్ స్టార్.. ఐపీఎల్ హిస్టరీలోనే..
ఎవరి అక్షయపాత్ర అమరావతి?
రెండో కొడుకు... అనాథగా వచ్చి.. సెలబ్రిటీగా ఎవరో తెలుసా?
బంగారమా..? మకొద్దు బాబోయ్..!
భూమికపై విచక్షణా రహితంగా దాడి చేసిన భర్త
హిట్-4లో హీరో ఫైనల్.. ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ
ఎవరు పేద? ధనం లేకపోయినా పరవాలేదు గానీ..!
మంచి తరుణం మించి పోరాదు! పసిడి తులం ఎంతంటే..
కార్మిక సోదరులకు వైఎస్ జగన్ మేడే శుభాకాంక్షలు
సినిమా

HIT3 X Review: ‘హిట్ 3’ ట్విటర్ రివ్యూ
నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన 'హిట్: ది థర్డ్ కేస్'(HIT3) సినిమా ఎట్టకేలకు నేడు(మే 1) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో చిత్రమిది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమా పై హైప్ క్రియేట్ అయింది. భారీ లంచనాల మధ్య మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. హిట్ 3 కథేంటి? ఎలా ఉంది? నాని ఖాతాలో మరో హిట్ పడిందా లేదా తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో హిట్ 3(HIT3 Review) సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.కొంతమంది నెటిజన్స్ సినిమా మొదటి సగం అద్భుతంగా ఉందని, నాని నటన, రొమాంటిక్ ఎపిసోడ్లు ఆకట్టుకున్నాయని ప్రశంసింస్తే..మరికొంతమంది ఈ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోలేదని, గత హిట్ సినిమాలతో పోలిస్తే ఈ భాగం సాధారణంగా ఉందని అభిప్రాయపడ్డారు. సినిమా రెండో సగం కథలో మెరుగైన ఆలోచనలు, ఎగ్జిక్యూషన్ లోపించాయని కొందరు విమర్శించారు. అయినప్పటికీ, నాని పాత్రలో కొత్త జోన్లో కనిపించాడని, అతని నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చాలామంది కొనియాడారు. #Hit3 is a very violent action crime thriller that has moments that work well but at the same time portions that are too run of the mill and narrated on the slower side.The first half is pretty average and predictable till the pre-interval which starts to engage. The second…— Venky Reviews (@venkyreviews) April 30, 2025 హిట్ 3' ఒక వయలెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్.కొన్ని సీన్స్ భాగా వర్కౌట్ అయ్యాయి.అదే సమయంలో కొన్ని రోటీన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఫస్టాఫ్ రొటీన్‌గా, ఊహించదగిన విధంగా ఉంటుంది. ప్రీ-ఇంటర్వెల్ వరకు, అక్కడ నుండి ఆసక్తికరంగా మారుతుంది. రెండవ సగం స్క్విడ్ గేమ్ నుండి ప్రేరణ పొందిన సెటప్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే, ముందుగా చెప్పినట్లు కథనం ఊహించదగిన విధంగా ఉంటుంది, తక్కువ ట్విస్ట్‌లతో మరియు మాస్ మూమెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. నిర్మాణ విలువలు మరియు సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తాయి. సంగీతం ప్రభావవంతంగా లేదు . నాని అద్భుతంగా నటించాడు అంటూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇచ్చాడు.#Hit3One time watch for NaNiHighlights __________NaNi’s performance Cinematography Climax Negatives__________Forceful violenceNo twists and turnsUneven screenplayBGM— praneeth nukala (@praneethnukala) May 1, 2025 హిట్ 3 ఒక్కసారి చూడొచ్చు. నాని నటన, సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయితే.. వయెలెన్స్ బలవంతగా ఇరికించడం, ట్విస్టులు,మలుపులు లేకపోవడం, స్క్రీన్‌ప్లే, బీజీఎం మైనస్ పాయింట్స్ అని మరో నెటిజన్ అభిప్రాయ పడ్డాడు#HIT3 #HIT3Review RAW..BLOODY..🎯🎯🎯🎯Not for family audiences or kids. What an actor @NameisNani . He is growing as multitalented, big box office star. Best of #Nani movie I have ever watched. Totally new experience 👏🏼👏🏼Strictly NO Kids ⛔️⛔️***BLOCKBUSTER***— Karthik (@meet_tk) April 30, 2025#HIT3 rating : ⭐⭐🌟3/5!!@NameisNani show🔥 an Griping action pack thriller, #SrinidhiShetty and #nani chamestry good overall an watchable.#hit3review #HIT3FromMay1st pic.twitter.com/guu9TKRMsS— its cinema (@iitscinema) April 30, 2025 ఇది నాని షో. గ్రిస్పింగ్ యాక్షన్‌ప్యాక్ థ్రిల్లర్. శ్రీనిధి శెట్టి, నాని కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్‌గా హిట్3 థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా అంటూ మరో నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు.First half Good Second Half & Pre climax 💥💥💥💥💥💥💥💥💥💥💥. #HIT3 pic.twitter.com/8074TXw1v1— Vishnu Varthan Reddy (@RVVR9999) May 1, 2025#hit3review – Gritty & violent thriller with flashes of brilliance. First half dull, second half picks up with Squid Game vibes. Nani excels, but predictable plot, excess violence & weak music pull it down. Not for families.Rating: 2.75/5#Nani #HIT3TheThirdCase #HIT3 #hit3 pic.twitter.com/98Rk6J9tUs— Tha Cinema (@tha_cinema) May 1, 2025#HIT3Review:Positives• Nani🔥💥💥• The Final Act🥵👿• Concept😮• Sailesh's Screenplay👌• Cameos💥Suspenses🙌Investigation💥Final Verdict: An Engaging Suspense Thriller that serves its Purpose.#HIT3 | #NANI | #HIT3TheThirdCase #castesensuspic.twitter.com/eDn379ICBk— IndianCinemaLover (@Vishwa0911) May 1, 2025

అడవి పిలిచింది!
‘అడవి పిలిచింది... నేను సమాధానం చెప్పాను’ అని అంటున్నారు హీరోయిన్ తమన్నా. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా అరుణభ్ కుమార్–దీపక్ మిశ్రా దర్శకత్వంలో ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే మైథలాజికల్ మూవీ తెరకెక్కుతోంది. బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో తమన్నా నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆమెపాత్ర తాలూకు ప్రీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రాత్రి వేళ ఎర్రటి చీర ధరించిన తమన్నా కారు దిగి, అడవిలోకి వెళ్లి, అక్కడ ఓ దీపం వెలిగించడం, అక్కడ ఏదో దృశ్యాన్ని చూసి కళ్లు పెద్దవి చేయడం వంటి విజువల్స్ ఈ వీడియోలో కనిపించాయి. ‘‘అడవి పిలిచింది. నేను సమాధానం చెప్పాను. ‘వ్వాన్’లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉంది’’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు తమన్నా. ఈ సినిమా 2026లో విడుదల కానుంది.

పెళ్లి రోజు గుర్తు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. బిందు మాధవి నేచురల్ లుక్!
గ్రీన్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ హోయలు..పెళ్లి రోజును గుర్తు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ..ఐపీఎల్ క్రికెట్ స్టేడియంలో చాహల్ ప్రియురాలు ఆర్జే మహ్వశ్ సందడి..హీరోయిన్ బిందు మాధవి లేటేస్ట్ లుక్.. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by प्रेrana kambam (@prerana.kambam) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah)

OTT: రాధికా ఆప్టే బోల్డ్ మూవీ ‘ది వెడ్డింగ్ గెస్ట్’ రివ్యూ
రాధికా ఆప్టే.. అందం, నటనతో ఆకట్టుకునే నటి. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో తన ప్రతిభను చాటుతూ, 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 2019లో విడుదలైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. ఫ్రెండ్ కోసం పెళ్లికూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చే హీరోలు తెలుగు తెర మీద చాలా మందినే చూశాం. ఈ సినిమాలో హీరో మాత్రం పెళ్లికూతురిని కిడ్నాప్ చేసేది ఫ్రెండ్ కోసం కాదు డబ్బు కోసం. జై (దేవ్ పటేల్) అనే లండన్ వాసి పాకిస్తాన్ లోని లాహోర్ సమీపంలో ఉన్న యోంగానాబాద్ అనే గ్రామానికి చేరుకుంటాడు. అంతకు ముందే తనను ఎవరూ గుర్తించకుండా, సిమ్ కార్డులు, కార్లు మార్చుకుంటూ అక్కడ దాకా వస్తాడు. ఆ తర్వాత రెండు గన్స్ ను కొనుగోలు చేస్తాడు. ఆ గ్రామానికి వచ్చాక పెళ్లికి రెడీ అవుతున్న సమీరా (రాధికా ఆప్టే) అనే యువతిని కిడ్నాప్ చేస్తాడు. ఆ క్రమంలో అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డ్ని హత్య చేయాల్సి వస్తుంది. ఆమెను దేశం దాటించి తీసుకువెళ్లడానికి ముందు...ఆమె ప్రేమికుడు దీపేశ్ (జిమ్ సర్భ్) తనతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఈ పనిచేయించాడనే విషయం జై బయటపెడతాడు.ఆ తర్వాత ఇద్దరూ కలిసి మారుపేర్లతో , దొంగ పాస్‌పోర్ట్‌లతో ఇండియాకు వస్తారు. అయితే సెక్యూరిటీ గార్డ్ హత్య కారణంగా ఈ కిడ్నాప్ రెండు దేశాల మీడియాలో వైరల్ అవుతుంది, దాంతో సమీరా ప్రేమికుడు దీపేశ్ భయపడతాడు, సమీరాను తిరిగి పాకిస్తాన్ కు పంపేయమని దేవ్‌ని కోరతాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు సన్నిహితంగా గడిపిన జై, సమీరా మధ్య అనుబంధం పెరుగుతుంది. ముఖ్యంగా సమీరా అతనిపై మోజుపడుతుంది. వారిద్దరూ శారీరకంగా ఒకటవుతారు. అదే సమయంలో దీపేశ్ దగ్గర ఖరీదైన వజ్రాలు ఉన్నాయని తెలుసుకున్న జై, వాటిని పొందేందుకు ప్రయత్నిస్తాడు. రకరకాల మలుపుల మధ్య సాగే ఈ లవ్–క్రైమ్–రొమాంటిక్ కథ చివరికి ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది.జై పాత్రలో మిస్టీరియస్ ప్రొఫెషనల్ కిల్లర్‌గా జై పూర్తి గా మెప్పిస్తాడు. బోల్డ్ సీన్లకు పెట్టింది పేరైన రాధికా ఆప్టే(తెలుగులో లెజెండ్‌లో బాలకృష్ణ సరసన హీరోయిన్) ఈ సినిమా హాలీవుడ్ రూపకర్తల సమర్పణలో రావడంతో...పూర్తి స్థాయి హాలీవుడ్ హీరోయిన్లా రెచ్చిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్లలో ఆమె దాదాపు పూర్తి న్యూడ్‌గా కనిపించడం విశేషం.హాలీవుడ్ చిత్రం చేసినప్పటికీ మన ఇండియన్ హీరోయిన్లు మరెవ్వరూ ఈ స్థాయిలో బోల్డ్ సీన్స్ చేసి ఉండరు... సమీరా పాత్ర భావోద్వేగాలను కూడా బాగా ప్రదర్శించింది. ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ మరో ఆకర్షణ. పాకిస్తాన్, ఇండియా మధ్య ప్రయాణం, మారుమూల ప్రాంతాల చిత్రీకరణ బాగా చూపించారు. సంగీత పరంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ మూమెంట్లను ఎలివేట్ చేస్తుంది. అక్కడక్కడా సాగదీసినట్టు అనిపించినా.. ఆ ఫీలింగ్ ముదరకముందే ఆసక్తికరమైన మలుపులు పేర్చుకుంటూ రావడం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు. ఐఎమ్‌డిబి 6.0 రేటింగ్ ఇచ్చిన ఈ సినిమా ఓ కాలక్షేపం యాక్షన్, థ్రిల్లర్, లవ్, రొమాంటిక్ సీన్లను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది. చూడాలనుకున్నవారు నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

‘టాప్స్’లో జ్యోతి సురేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకు టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో చోటు దక్కింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని కూడా చేర్చడంతో... ఈ విభాగంలో పోటీ పడుతున్న జ్యోతి సురేఖకు మరింత మెరుగైన శిక్షణ తీసుకునేందుకు ‘టాప్స్’ ఉపయోగపడనుంది. ఈ మేరకు బుధవారం మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) 155వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, వీరేన్ రస్కిన్హా, ప్రశాంతి సింగ్, సోమయ్య, సిద్ధార్థ్ శంకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జ్యోతి సురేఖతో సహా ఏడుగురు కాంపౌండ్ ఆర్చర్లకు ‘టాప్స్’లో చోటు కల్పించారు. ఇందులో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేతలు అభిషేక్ వర్మ, పర్ణీత్ కౌర్, ప్రవీణ్ ఒజస్, ప్రపంచ చాంపియన్ అదితి గోపీచంద్, ప్రియాన్‡్ష, ప్రథమేశ్ ఉన్నారని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో జ్యోతి సురేఖ మూడు స్వర్ణ పతకాలతో మెరిసింది. గత ఆసియా క్రీడల్లో మిక్స్డ్, టీమ్, వ్యక్తిగత విభాగాల్లో విజేతగా నిలిచింది. ‘2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని చేర్చాలని ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయించింది. దీంతో ఎంఓసీ భేటీ నిర్వహించి కాంపౌండ్ ఆర్చర్లకు టాప్స్‌లో అవకాశం కల్పించాం. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచకప్‌లలో ప్రదర్శన ఆధారంగా ఆర్చర్లను టాప్స్‌కు ఎంపిక చేశాం. అలాగే టాప్స్‌లో ఉన్న ఇతర క్రీడాకారులకు కూడా నిధులు విడుదల చేశాం’ అని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఒక ప్రకటనలో తెలిపింది. » ‘టాప్స్’లోని 56 మంది అథ్లెట్లకు సంబంధించిన రూ. 4.37 కోట్ల నిధులను బుధవారం విడుదల చేశారు. » తాష్కెంట్లో 17 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ శిక్షణలో పాల్గొనేందుకు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు ఆమోదం లభించింది. ఈ నెల 8 నుంచి 23 వరకు ఉజ్బెకిస్తాన్ జట్టుతో ఈ ట్రైనింగ్ సాగనుంది. » టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్లు ఆకుల శ్రీజ, మనిక బత్రా ఐటీటీఎఫ్ ప్రపంచ చాంపియన్ షిప్లో పాల్గొనేందుకు ముందస్తు నిధులు విడుదల చేశారు. ఖతర్ వేదికగా ఈ నెల 17 నుంచి 25 వరకు ఈ టోర్నీ జరగనుంది. » ఈ నెల 9 నుంచి యూఏఈ వేదికగా జరుగుతున్న అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రిలో పాల్గొనేందుకు లాంగ్ జంపర్ శైలి సింగ్‌కు ఆర్థిక సాయం కూడా అందించారు. » ఇక టెన్నిస్ యువ సంచలనం మాయా రాజేశ్వరన్కు కూడా ‘టాప్స్’ నిధులు అందించింది. స్పెయిన్‌లోని రఫా నాదల్ అకాడమీలో శిక్షణ పొందేందుకు అవసరమైన నిధులు విడుదల చేసింది.

భారత బాక్సర్ల పసిడి పంచ్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా జూనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ అండర్–15 విభాగంలో భారత బాక్సర్లు ఏకంగా 25 పతకాలతో అదరగొట్టారు. ఇందులో 11 స్వర్ణాలు, మూడు రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. ఫలితంగా ఈ విభాగంలో భారత్ ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. బాలికల విభాగంలో భారత బాక్సర్లు కోమల్ (33 కేజీలు), ఖుషీ (35 కేజీలు), తమన్నా (37 కేజీలు), సువీ (40 కేజీలు), మిల్కీ (43 కేజీలు), ప్రిన్సీ (52 కేజీలు), నవ్య (58 కేజీలు), సునైనా (61 కేజీలు), తృష్ణ (67 కేజీలు), వన్షిక (ప్లస్ 70 కేజీలు)... బాలుర విభాగంలో సంస్కార్ వినోద్ (35 కేజీలు) బంగారు పతకాలు గెల్చుకున్నారు. బాలుర విభాగంలో రుద్రాక్ష్ (46 కేజీలు), అభిజీత్ (61 కేజీలు), లక్షయ్ (64 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలు దక్కించుకున్నారు.

చెన్నై ఖేల్ ఖతం
సొంతగడ్డపై వరుసగా ఐదో మ్యాచ్‌లో పరాజయంతో ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. పేలవ ప్రదర్శనతో ఎనిమిదో ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న ఐదుసార్లు చాంపియన్ మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ రేసుకు దూరమైంది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ కీలక విజయాన్ని నమోదు చేసింది. ముందుగా చహల్ ‘హ్యాట్రిక్’...బ్యాటింగ్‌లో శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్ కలిసి జట్టును గెలిపించారు. చెన్నై: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోరులో పంజాబ్ 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. స్యామ్ కరన్ (47 బంతుల్లో 88; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, బ్రెవిస్ (26 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. యుజువేంద్ర చహల్ (4/32) ఒకే ఓవర్లో ‘హ్యాట్రిక్’ సహా నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసి గెలిచింది. శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్ (36 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. ఒకే ఓవర్లో 26 పరుగులు... చెన్నైకి ఓపెనర్లు సరైన ఆరంభం ఇవ్వలేకపోయారు. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ (11) తనకు లభించిన మరో అరుదైన అవకాశాన్ని వృథా చేసుకోగా, ఆయుశ్ మాత్రే (7) విఫలమయ్యాడు. హర్‌ప్రీత్ ఓవర్లో జడేజా (17) మూడు ఫోర్లు కొట్టినా అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఈ దశలో కరన్, బ్రెవిస్ భాగస్వామ్యంలో జట్టు నిలదొక్కుకుంది. కరన్ చెలరేగిపోగా, బ్రెవిస్ కొన్ని ఆకట్టుకునే షాట్లు ఆడాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 50 బంతుల్లో 78 పరుగులు జోడించారు. 15 ఓవర్లలో జట్టు స్కోరు 134/4. సూర్యాంశ్ షెడ్గే వేసిన తర్వాతి ఓవర్లో కరన్ చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో కరన్ వరుసగా 6, 6, 2 (నోబాల్), 2, 4, 4, 1 బాదడంతో మొత్తం 26 పరుగులు రావడం విశేషం. ఈ జోరులో కరన్ సెంచరీ, సీఎస్కే 200 దాటడం ఖాయంగా అనిపించాయి. అయితే చివరకు ఈ రెండూ జరగలేదు. యాన్సెన్ బౌలింగ్‌లో కరన్ అవుట్ కాగా...చహల్ వేసిన 19వ ఓవర్‌తో అంతా మారిపోయింది. 11 బంతుల వ్యవధిలో చెన్నై 6 వికెట్లు కోల్పోయింది. కీలక భాగస్వామ్యాలు... పంజాబ్ ఇన్నింగ్స్ మెరుగ్గా మొదలైంది. ప్రియాన్ష్ ఆర్య (15 బంతుల్లో 23; 5 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్ చక్కటి షాట్లతో 28 బంతుల్లో 44 పరుగులు జోడించారు. తొలి 6 ఓవర్లలో స్కోరు 51 పరుగులకు చేరింది. ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్ రెండో వికెట్‌కు 50 బంతుల్లో 72 పరుగులు జత చేశారు. నూర్ ఈ జోడీని విడదీయగా, వధేరా (5) విఫలమయ్యాడు. మరోవైపు కరన్ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో శ్రేయస్ 32 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ప్రభ్‌సిమ్రన్ వెనుదిరిగినా...శశాంక్ (23; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి శ్రేయస్ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రషీద్ (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 11; ఆయుశ్ (సి) శ్రేయస్ (బి) యాన్సెన్ 7; స్యామ్ కరన్ (సి) ఇన్‌గ్లిస్ (బి) యాన్సెన్ 88; జడేజా (సి) ఇన్‌గ్లిస్ (బి) హర్‌ప్రీత్ 17; బ్రెవిస్ (బి) అజ్మతుల్లా 32; శివమ్ దూబే (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 6; ధోని (సి) వధేరా (బి) చహల్ 11; హుడా (సి) ఆర్య (బి) చహల్ 2; కంబోజ్ (బి) చహల్ 0; నూర్ (సి) యాన్సెన్ (బి) చహల్ 0; ఖలీల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 190. వికెట్ల పతనం: 1–21, 2–22, 3–48, 4–126, 5–172, 6–184, 7–186, 8–186, 9–186, 10–190. బౌలింగ్: అర్ష్ దీప్ 3.2–0–25–2, యాన్సెన్ 4–0– 30–2, అజ్మతుల్లా 4–0–39–1, హర్‌ప్రీత్ 2–0– 21–1, చహల్ 3–0–32–4, సూర్యాంశ్ 3–0– 40–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) ధోని (బి) అహ్మద్ 23; ప్రభ్‌సిమ్రన్ (సి) బ్రెవిస్ (బి) నూర్ 54; శ్రేయస్ (బి) పతిరణ 72; వధేరా (సి) జడేజా (బి) పతిరణ 5; శశాంక్ (సి) బ్రెవిస్ (బి) జడేజా 23; ఇన్‌గ్లిస్ (నాటౌట్) 6; సూర్యాంశ్ (సి) నూర్ (బి) అహ్మద్ 1; యాన్సెన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–44, 2–116, 3–136, 4–180, 5–188, 6–190. బౌలింగ్: ఖలీల్ 3.4–0–28–2, కంబోజ్ 2–0–20–0, జడేజా 3–0–32–1, నూర్ 4–0–39–1, స్యామ్ కరన్ 3–0–27–0, పతిరణ 4–0–45–2. చహల్ ‘హ్యాట్రిక్’ యుజువేంద్ర చహల్ తన తొలి 2 ఓవర్లలో 23 పరుగులిచ్చాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసే అవకాశం దక్కింది. వైడ్‌తో ఓవర్ మొదలు పెట్టగా తొలి బంతిని ధోని (11) సిక్సర్‌గా మలిచాడు. అయితే తర్వాతి బంతికే ధోని వెనుదిరగ్గా, మూడో బంతికి హుడా 2 పరుగులు తీశాడు. ఓవర్ చివరి మూడు బంతుల్లో వరుసగా హుడా (2), కంబోజ్ (0), నూర్ (0)లను చహల్ అవుట్ చేశాడు. ‘హ్యాట్రిక్’ పూర్తి కాగానే తనపై ఎన్నో మీమ్‌లకు కారణమైన ట్రేడ్ మార్క్ పొజిషన్లో కూర్చొని అతను సంబరాలు చేసుకున్నాడు. ఐపీఎల్లో చహల్ ‘హ్యాట్రిక్’ తీయడం ఇది రెండోసారి. 2022 సీజన్లో రాజస్తాన్ తరఫున ఆడుతూ కోల్‌కతాపై అతను హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఐపీఎల్లో ఒకటికంటే ఎక్కువసార్లు హ్యాట్రిక్ తీసిన మూడో ఆటగాడిగా అతను నిలిచాడు. గతంలో అమిత్ మిశ్రా 3 సార్లు, యువరాజ్ 2 సార్లు హ్యాట్రిక్ సాధించారు. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X ముంబై వేదిక: జైపూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే ఔట్
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది.సీఎస్కే బ్యాటర్లలో సామ్ కుర్రాన్(88) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు బ్రెవిస్(32) పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో చాహల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. చాహల్‌తో పాటు అర్ష్‌దీప్, జాన్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్..అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్రభ్సిమ్రాన్ సింగ్(54) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సీఎస్కే బౌలర్లలో పతిరానా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్,ఖాలీల్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన చాహల్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా
బిజినెస్

ఐపీవోతో ప్రభుత్వ షేర్ల జోరు
కొద్ది నెలలుగా దేశీ స్టాక్ మార్కెట్లో కేంద్ర ప్రభు త్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లు లాభాల దుమ్ము రేపుతున్నాయి. గతేడాది అక్టోబర్ మొదలు విదేశీ ఇన్వెస్టర్లు భారీస్థాయిలో అమ్మకాలు చేపట్టడంతో సెకండరీ మార్కెట్లు క్షీణపథం పట్టాయి. అయినప్పటికీ గత 8ఏళ్ల కాలాన్ని పరిగణిస్తే ఐపీవోకు వచ్చిన పలు ప్రభుత్వ రంగ కౌంటర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పంచాయి. వివరాలు చూద్దాం.. పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా గత 8 ఏళ్లలో లిస్టయిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు(సీపీఎస్ఈ) జోరు చూపుతున్నాయి. కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఉన్నట్టుండి పెట్టుబడుల ఉపసంహరణకు దిగడంతో మార్కెట్లు ఏప్రిల్ తొలి వారం వరకూ క్షీణ పథంలో సాగాయి. అయితే తిరిగి ఇటీవల ఎఫ్‌పీఐల పెట్టుబడులు పెరగడంతో మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీవోలు చేపట్టిన 18 సీపీఎస్ఈలలో 15 కంపెనీలు భారీ రిటర్నులు అందించడం గమనార్హం! వీటిలో రక్షణ, రైల్వే రంగ కౌంటర్ల హవా కొనసాగుతోంది. ఈ జాబితాలో ప్రధానంగా మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఏకంగా 3,700 శాతం లాభపడటం విశేషం! పీఎస్‌యూ గుర్రాలు స్టాక్ మార్కెట్ల లాభాల రేసులో పలు ప్రభుత్వ రంగ సంస్థలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. సీపీఎస్ఈలలో బీమా రంగ సంస్థలను మినహాయిస్తే షిప్ బిల్డింగ్, రైల్వే రంగ కౌంటర్లు రేసు గుర్రాల్లా దౌడు తీస్తున్నాయి. 2017 మే నుంచి పరిగణిస్తే ఐపీవోల ద్వారా స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టయిన మెజారిటీ సీపీఎస్ఈలు ఇప్పటివరకూ పెట్టుబడులు కొనసాగించిన ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. ఈ జాబితాలో మజగావ్ డాక్సహా.. రైల్ వికాస్ నిగమ్(ఆర్వీఎన్ఎల్), గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్(జీఆర్ఎస్ఈ), ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) 1000 శాతందాటి రిటర్నులు సాధించాయి. ఐపీవో ధర రూ. 19 మజగావ్ డాక్ రూ. 145 ధరలో 2020లో ఐపీవోకు వచ్చింది. 2024 డిసెంబర్లో షేరు విభజన(రూ. 10 నుంచి రూ.5కు) చేపట్టింది. 2025 ఏప్రిల్ 28న రూ. 2,786కు చేరింది. వెరసి రూ. 5,500ను అధిగమించింది. ఈ బాటలో గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ 2018లో రూ. 118 ధరలో ఐపీవో చేపట్టింది. ప్రస్తుతం రూ. 1,750ను తాకింది. అంటే 1,370 శాతానికి మించి పరుగుతీసింది. 2017లో రూ. 432 ధరలో ఐపీవో చేపట్టి లిస్టయిన కొచిన్ షిప్‌యార్డ్ రూ. 1,502 వద్ద కదులుతోంది. 2024 జనవరిలో షేర్ల విభజన(రూ. 10 నుంచి రూ.5కు) చేపట్టింది. 600 శాతం జంప్‌చేసింది. రైల్వే రంగ కౌంటర్లలో ఆర్వీఎన్ఎల్ 2019లో రూ. 19 ధరలో ఐపీవోకు వచ్చి ప్రస్తుతం రూ. 361కు చేరింది. 1865 శాతం దూసుకెళ్లింది. 2019లో రూ. 320 పలికిన ఐఆర్సీటీసీ 2021 అక్టోబర్‌లో షేర్ల విభజన(రూ. 10 నుంచి రూ.2) చేపట్టింది. ప్రస్తుతం రూ. 765 వద్ద ట్రేడవుతోంది. 1,110 శాతం రాబడి సాధించింది. ఇతర కౌంటర్లలో 2018లో లిస్టయిన రైట్స్(ఆర్ఐటీఈఎస్), ఇర్కాన్ ఇంటర్నేషనల్ సగటున 230 శాతం లాభపడ్డాయి. 2021లో లిస్టయిన రైల్‌టెల్ రూ. 310కు చేరి 238 శాతం ఎగసింది. 600 శాతం అప్ డిఫెన్స్ రంగ కౌంటర్లలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్), భారత్ డైనమిక్స్(బీడీఎల్), మిశ్రధాతు నిగమ్(మిధాని) సైతం వరుసగా 605%, 558 %, 227% చొప్పున లాభపడ్డాయి. 2023లో రూ. 32 ధరలో ఐపీవోకు వచి్చన ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఇరెడా) రూ. 170కు చేరడం ద్వారా 450 శాతానికిపైగా బలపడింది. హౌసింగ్, పట్టాణాభివృద్ధి కార్పొరేషన్(హడ్కో) 2017లో రూ. 60 ధరలో ఐపీవో చేపట్టి ప్రస్తుతం రూ. 226కు చేరింది. 280% రాబడి అందించింది. రూ. 120 ఐపీవో ధరతో పోలిస్తే ఎంఎస్టీసీ రూ. 528ను తాకడం ద్వారా 350% పురోగమించింది. న్యూ ఇండియా అస్యూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్ప్(ఎల్ఐసీ), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(జీఐసీ) మాత్రం ఐపీవో ధరతో పోలిస్తే వెనుకంజలో ఉన్నాయి. 2018 జూన్, జులైలలో న్యూ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయడం గమనార్హం.! – సాక్షి, బిజినెస్ డెస్క్

అమ్మకాలు 'అక్షయం'!
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆభరణాల విక్రయాలు సానుకూలంగా నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ అక్షయ తృతీయ రోజున పసిడి కొంటే కలిసొస్తుందన్న విశ్వాసం అమ్మకాలకు అండగా నిలిచింది. విలువ పరంగా 35 శాతం అధిక అమ్మకాలు ఉంటాయని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. పరిమాణం పరంగా గతేడాది మాదిరే 20 టన్నులుగా ఉండొచ్చని పేర్కొన్నారు. మరోపక్క, బుధవారం బంగారం, వెండి ధరలు కాస్త శాంతించడం కూడా కలిసొచ్చింది. దక్షిణాదిన జ్యుయలరీ దుకాణాలకు ఉదయం నుంచే వినియోగదారులు క్యూకట్టారు. ఉత్తరాదిన మధ్యాహ్నం నుంచి వినియోగదారులు రావడం పెరిగింది. అయినప్పటికీ దక్షిణ భారత్‌లోనే కస్టమర్ల రాక అధికంగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా మంగళ సూత్రాలు, చైన్లు, వెండి ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగినట్టు వర్తకులు తెలిపారు. వివాహాల సీజన్ ఆరంభం కావడంతో మంగళసూత్రాల కొనుగోలుకు కస్టమర్లు ఆసక్తి చూపించినట్టు చెప్పారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు ధోరణి సాధారణంగా దక్షిణాదిన కనిపించేది. క్రమంగా ఇది ఉత్తరాదికీ విస్తరించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 25–40 ఏళ్ల వయసులోని కస్టమర్లు సైతం బంగారం కొనుగోళ్లకు ముందుకొచ్చినట్టు రోక్డే తెలిపారు. ముఖ్యంగా ఆభరణాలు, కాయిన్లు, బార్లు కొనుగోలుకు ఆసక్తి చూపించినట్టు చెప్పారు. ‘‘ధరల పెరుగుదలతో కొనుగోలు శక్తిపై ప్రభావం పడింది. అయినప్పటికీ అక్షయ తృతీయ రోజున బలమైన కొనుగోళ్ల సెంటిమెంట్ ఉంది’’ అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా సీఈవో సచిన్ జైన్ తెలిపారు. 2024 అక్షయ తృతీయ రోజున రూ.72,300గా ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర ఇటీవలే రూ. లక్ష స్థాయిని అధిగమించి... ప్రస్తుతం 99,000 స్థాయిలో ఉంది. అంటే దాదాపు 37 శాతం ఎగసింది. పాత ఆభరణాల మార్పిడి.. అక్షయ తృతీయ రోజున అమ్మకాల్లో 50 శాతం మేర పాత బంగారం మార్పిడితోనే ఉన్నట్టు పీఎన్జీ జ్యుయలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు బడ్జెట్ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. మొత్తం మీద గతేడాది అక్షయ తృతీయతో పోల్చి చూస్తే అమ్మకాలు 10–15 శాతం పెరిగాయని కామా జ్యుయలర్స్ ఎండీ కొలిన్‌షా తెలిపారు. దేశవ్యాప్తంగా కీలక మార్కెట్లలో స్టడెడ్ జ్యుయలరీ అమ్మకాలు పెరిగినట్టు జీఎస్ఐ ఇండియా ఎండీ రమిత్ కపూర్ వెల్లడించారు.దిగొచ్చిన బంగారం ధర అక్షయ తృతీయ రోజున బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కలిసొచ్చింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.900 తగ్గి రూ.98,550 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు ఒకదశలో 43 డాలర్ల వరకు క్షీణించి 3,274 డాలర్లను తాకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆటో టారిఫ్‌ల ప్రభావం తగ్గించే దిశగా ఆదేశాలు జారీ చేయడం.. పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి చర్చల్లో పురోగతి ఉందని ప్రకటించడం బంగారం ధరలు తగ్గేందుకు కారణమైనట్టు కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కేనత్ చైన్వాలా తెలిపారు.

హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి బిస్కెట్ ఫ్యాక్టరీ
ప్రముఖ వ్యాపార సమ్మేళనం లోహియా గ్రూప్ హైదరాబాద్ శివారు మేడ్చల్ లో బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందుకోసం వచ్చే నాలుగేళ్లలో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు, 6,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఏడు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త హైస్పీడ్ ఆటోమేటెడ్ ఫెసిలిటీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 1,000 టన్నులు కాగా దీన్ని 5,000 టన్నులకు పెంచుకునే వీలుందని సంస్థ వెల్లడించింది. బిస్కెట్ల ఉత్పత్తికి కావాల్సిన పిండి, చక్కెర, బెల్లం, తేనె, పాల ఉత్పత్తులు, ఇతర సహజ పదార్ధాలను స్థానికంగా సేకరించనున్నారు. ఉత్పాదక రంగంలో మహిళల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన 'ఉమెన్ ఫస్ట్ ఎంప్లాయిమెంట్ డ్రైవ్'కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం 40 శాతానికి పైగా సిబ్బంది మహిళలేనని కంపెనీ తెలిపింది.బిస్కెట్ల తయారీ ప్రక్రియ వెనుక అధిక నాణ్యత పదార్థాలు, సంక్లిష్టమైన డిజైన్లు, అధునాతన బయోటెక్నాలజీ ఉన్నాయని లోహియా కన్ఫెక్షనరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా లోహియా లహోటి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్ గఢ్ లలో కార్యకలాపాలను ఏర్పాటు చేసిన ఈ సంస్థ త్వరంలో ఎగుమతులను ప్రారంభించాలని యోచిస్తోంది.

ఏటీఎం కొత్త ఛార్జీలు.. రేపటి నుంచే..
ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. ఏటీఎం విత్‌డ్రావల్ కొత్త ఛార్జీలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఉచిత పరిమితిని మించి చేసే ఏటీఎం లావాదేవాలపై ఛార్జీల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. ఈ రుసుములో ఏటీఎం కొనుగోలు, నిర్వహణ, ఇతర బ్యాంకుల కస్టమర్లకు సేవలను అందించడానికి అయ్యే ఖర్చు కూడా ఉంటుంది.సవరించిన ఏటీఎం ఛార్జీలు ఇవే..మే 1 నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు తమ ఉచిత ఉపసంహరణ పరిమితిని దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ.2 అదనంగా రూ .23 చెల్లించాల్సి ఉంటుంది. ఇది గతంలో రూ .21 ఉండేది. దీన్ని 2022 నుంచి అమలు చేస్తున్నారు.ఉచిత లావాదేవీలుఏటీఎం ఛార్జీల పెంపు ఉన్నప్పటికీ ఉచిత లావాదేవీ పరిమితుల్లో ఎలాంటి మార్పులు లేవు. సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు 5 ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఇక ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికి వస్తే.. మెట్రో గరాల్లో అయితే 3 లావాదేవీలు, నాన్ మెట్రో నగరాల్లో 5 లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సిఫారసుల మేరకు ఆర్బీఐ సవరణలో భాగంగా ఏటీఎం ఫీజులను పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటంతో వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు, బ్యాంకులు ఈ పెంపునకు మొగ్గుచూపుతున్నాయి.చిన్న బ్యాంకులపై ప్రభావంలావాదేవీ రుసుముల పెరుగుదల చిన్న బ్యాంకుల కస్టమర్లపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే వాటికి తక్కువ సంఖ్యలో ఏటీఎంలు ఉన్నాయి. దీంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులు నగదు ఉపసంహరణ కోసం పెద్ద బ్యాంకుల ఏటీఎంలపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి కస్టమర్లు అధిక ఛార్జీలను భరించాల్సి ఉంటుంది.
ఫ్యామిలీ

జీవామృత కేంద్రానికి రూ. లక్ష : కేంద్రం కొత్త మార్గదర్శకాలు తెలుసా?
Bio-input Resource Centres (BRC) ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడే సేంద్రియ ఎరువులు, ద్రావణాలు, కషాయాలను ఏ రైతుకు ఆ రైతు స్వయంగా తయారు చేసుకోవటం చాలా కష్టసాధ్యమైన పని. నిన్నటి వరకు రసాయనిక వ్యవసాయంలో వాడే ఎరువులు, పురుగుమందులు వంటి ఉత్పాదకాలన్నీటినీ కొని వినియోగించడానికి అలవాటు పడిన రైతులు ఇప్పుడు అన్నీ ఎవరికి వారు తయారు చేసుకోవటం కష్టమే. ఈ ఇబ్బందిని అధిగమించకుండా ప్రకృతి సేద్యం విస్తరించడం అంత తేలిక కాదు. అందుకే ప్రకృతి సేద్యంలో వాడే ఘనజీవామృతం, జీవామృతం వంటి అన్ని రకాల ఉత్పాదకాలను తయారు చేసి విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం బయో–ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ (బిఆర్‌సిలు) ఏర్పాటు చేయిస్తోంది. వీటిని సులువుగా ఉండటం కోసం ‘జీవామృత కేంద్రాలు’ అని చెప్పుకుందాం. తొలి విడద దేశవ్యాప్తంగా 10 వేల బిఆర్‌సిలు ఏర్పాటు చేయాలని 2023–24 బడ్జెట్లోనే పేర్కొన్నారు. అయితే, వీటిని ఏర్పాటు చేయటానికి మార్గదర్శకాలను తాజాగా (ఏప్రిల్ 23న) విడుదల చేసింది. ఆ వివరాలు: ప్రతి బిఆర్సి ఏర్పాటుకు ర. లక్ష చొప్పున (ర. 50 వేల చొప్పున రెండు విడతలుగా) ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఉత్పాదకాలను తయారు చేసి రైతులకు అందుబాటులోకి తేవటంతో ΄ాటు వాటిని ఎలా ఉపయోగించాలో, ఎంత మోతాదులో వాడాలో కూడా ఈ జీవామృత కేంద్రాల నిర్వాహకులే రైతులకు తెలియజెప్పాల్సి ఉంటుంది. బయో–ఇన్పుట్ రిసోర్స్ సెంటర్(బిఆర్సి) లను నెలకొల్పే వ్యక్తులు / సంస్థలు / బృందాలు మొదట తాము ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఈ ఉత్పాదకాలను వారు వాడుతున్న అనుభవం కలిగి ఉండాలి. స్థానిక రైతుల అవసరాలకు, స్థానిక భూములకు తగిన, స్థానికంగా సాగయ్యే పంటల సరళికి అవసరమైన రీతిలో ద్రావణాలు, కషాయాలను తయారు చెయ్యాలి. వీటి ధరలు స్థానిక చిన్న, సన్నకారు రైతులకు సైతం అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత రాష్ట్ర స్థాయి ప్రకృతి సేద్య విభాగం, జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలపై ఉంది. బీఆర్‌సి ఏర్పాటు కోసం ర. లక్షతో భూమిని, షెడ్డును, డ్రమ్ములు, ఇతరత్రా యంత్ర పరికరాలను సమకర్చుకోవటం ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తూతూ మంత్రంగా కాకుండా.. దీర్ఘకాలంపాటు బిఆర్‌సిలకు వెన్నుదన్నుగా ఉండేలా ప్రభుత్వం ఆలోంనప్పుడే ఆశింన ప్రయోజనం నెరవేరుతుందని నిపుణులు సూస్తున్నారు.

ఆమె నమ్మకమే కాపాడింది..! తృటిలో బయటపడ్డ పహల్గామ్ పర్యాటకుడి ఫ్యామిలీ
ఆ పహల్గాం దారుణ ఘటన ప్రత్యక్షంగా చూసిన పర్యాటకులెవ్వరికీ కంటిమీద కునుకుపట్టనివ్వడం లేదు. తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుట్టి..బతికే ఉన్నామా..! అనే ఆందోళనలకు లోనవ్వుతున్నారు. ఆ ఘటనలో తమవాళ్లను తమ కళ్ల ముందే చంపేస్తున్న హృదయవిదారక దృశ్యాలు కనులముందు మెదులుతూనే ఉన్నాయంటున్నారు కొందరు బాధితులు. వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలు వింటున్న మనకే గుండె తరుక్కుపోతుంటే..ఇక ఆ బాధితులకు బాధ వర్ణనాతీతమే. ఇప్పట్లో దాన్నుంచి బయటపడటం కూడా కష్టమే. అయితే ఇదే దుర్ఘటనలో వెంట్రుకవాసిలో ఓ కుటుంబం సురక్షితంగా బయటపడింది. వాళ్ల భయానక అనుభవం వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ స్టోరీ ఏంటో చకచక తెలుసుకుందామా..!కర్ణాటక చెందిన ప్రదీప్ హెగ్డే,అతని భార్య శుభ హెగ్డే, వారి కుమారుడు సిద్ధాంత్ ఏప్రిల్ 21న శ్రీనగర్‌కు చేరుకున్నారు. ఆ మరుసటి రోజు పహల్గామ్కు బయలుదేరారు. ఆ కుటుంబం టూర్లో 'మినీ స్విట్జర్లాండ్'గా ప్రసిద్ధి చెందిన బైసరన్ ఉంది. అందుకోసం మూడు గుర్రాలు అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు రోడ్డంతా భయానకంగా, బురదగా జారేలా ఉండటంతో. పైకి చేరుకోవడానికి ఒక గంట 15 నిమిషాలు పట్టేసిందట వారికి. అయితే అప్పటికే కొంతమంది పర్యాటకుల గుంపు ఉంది. ఇక ప్రదీప్ హెగ్డే కుటుంబం కూడా వారితో జాయిన్ అవ్వాలనుకున్నారు. అయితే రైట్‌సైడ్ జిప్‌లైన్ ప్రారంభమయ్యే చోట ఖాళీ ప్రాంతం ఉండటంతో అక్కడే పోటోలు తీస్తూ.. గడిపిందట ఆ కుటుంబం. ఆ తర్వాత కొంతసేపటికి లోయలోని సాహస కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతం వైపు ఉన్న స్టాళ్లువై పుగా సాగారు. సరిగ్గా అప్పటికే మధ్యాహ్నం 1.45 అయ్యింది. వాళ్ల కుమారుడు సిద్ధాంత్ ఆకలిగా ఉందని గొడవ చేయడం మొదలు పెట్టినట్లు తెలిపారు ప్రదీప్. నచ్చచెబుతున్నా.. వినకపోవడంతో చేసేదేమి లేక ఇక అక్కడ ఓ స్టాల్ వద్ద మ్యాగీ ఆర్డర్ చేశామని అన్నారు. ఇక తన భార్య ఈలోగా వాష్‌రూమ్‌కి వెళ్లి వచ్చిందన్నారు. సరిగ్గా ఆ టైంలోనే ఒక రౌండ్ కాల్పులు వినిపించాయి. అప్పుడే టీ కూడా ఆర్డర్ చేసినట్లు తెలిపారు ప్రదీప్. అయితే అవి క్రాకర్ల శబ్దాలు కావచ్చని దుకాణ యజమాని చెప్పడంతో తేలిగ్గా తీసుకున్నామని చెప్పారు ప్రదీప్. పైగా అవి బుల్లెట్ శబ్దాలని మాకస్సలు తెలియదని అన్నారు. ఇక సుమారు 15-20 సెకన్ల తర్వాత, పెద్ద తుపాకులు పట్టుకున్న ఇద్దరు వ్యక్తులను చూశామన్నారు. అందులో ఒక ఉగ్రవాది లోయ దిగువ భాగం వైపు వెళ్తుండగా, మరొక ఉగ్రవాది తమ వైపుకి దూసుకు వస్తున్నాడంటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు ప్రదీప్. వెంటనే తమ కుటుంబం అంతా నేలపై పడుకుని ఉన్నాం. ఇంతలో తన భార్య టేబుల్‌పై తమ ఐడెంటిలన్నీ ఉన్న బ్యాగ్‌ని తీసుకునేందుకు పైకి లేచింది. అంతే ఒక తూటా ఆమె కుడి చెవి నుంచి దూసుకుపోయింది. అయితే ఆమె వంగడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇక ప్రదీప్ భార్య శుభ హెగ్డే కూడా మాట్లాడుతూ..తన వెంట్రుకలను రాసుకుంటూ ఏదో వెళ్తున్నట్లు అనిపించిందన్నారు. ఏంటా అని పక్కకు చూసేంతవరకు తెలియలేదు అది బుల్లెట్ అని అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఒక్క క్షణం అసలేం జరగుతుందో అర్థంకానీ భయాందోళన ఎదురైంది. ఇంతలో ఎవరో గట్టిగా అరిచి గేటువైపుకి పరిగెత్తమని చెప్పారు. నూరుశాతం చనిపోతామనే అనుకున్నాం..అదంతా చూశాక కచ్చితంగా తన కుటుంబం అంతా చనిపోతుందనే అనుకున్నానని అన్నారు ప్రదీప్. అయితే తన భార్య మాత్రం ఏం జరగదు అని ధైర్యం చెబుతూనే ఉంది. నిజానికి ఆమె నమ్మకమే మమ్మల్ని కాపాడింది. అక్కడున్న పర్యాటకులంతా ఒకేసారిగా గేటు వద్దకు వచ్చేయడంతో తమ కొడుకు కింద పడిపోయాడన్నారు. అలా బయటకు వచ్చాక ఎటు వెళ్లాలి అనేది తెలియని గందరగోళానికి గురయ్యాం. గుర్రపుస్వారీ సైనికులు కనిపంచడంతో వాళ్లని రక్షించమని ప్రాధేయపడినట్లు చెప్పుకొచ్చారు. వాళ్లు మాకు రెండు గుర్రాలని అందించి కిందకు వచ్చేందుకు సహాయం చేశారంటూ ఆ బాధకరమైన అనుభవాన్ని వివరించారు ప్రదీప్ హెగ్డే. ఆ పర్యాటకుడి అనునభవం విపత్కర పరిస్థితుల్లో మసులుకోవాల్సిన విధానం తోపాటు..ఒకరు భయపడుతుంటే మరొకరు ఎలా సానుకూలంగా వ్యవహరించాలో చెబుతోంది. ఆ పరిస్థితుల్లో శుభా హెగ్డేలా ఏదో రకంగా ధైర్యం చెప్పాలే కానీ బ్యాలెన్స్ తప్పకూడదు. ఆ దృక్పథమే మనల్ని ఆపద నుంచి గట్టేక్కేలా చేస్తుందనడానికి ఆ పర్యాటకుడి కుటుంబమే ఓ ఉదహరణ. (చదవండి: పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...)

Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!
రక్తశాలి బియ్యం దాని ప్రత్యేకమైన ఎరుపు రంగు, గొప్ప పోషక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఆరోగ్యాభిలాషులైన వినియోగదారులకు దీని విలువ తెలుసు. సాంప్రదాయకంగా దీన్ని కేరళలోని వయనాడ్ జిల్లాలోని సహజమైన, జీవవైవిధ్య వాతావరణంలో పెంచుతారు. ఇది తరచుగా ఈ ప్రాంతపు వ్యవసాయ వారసత్వానికి హ్నంగా చెబుతుంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొందరు ప్రకృతి వ్యవసాయ దారులు పండిస్తున్నారు. రక్తశాలి అనే పేరు సంస్కృత పదం నుం వచ్చింది. ‘రక్త’ అంటే రక్తం. ‘శాలి’ అంటే బియ్యం. రక్తశాలి జిగురు లేనిది. గ్లూటెన్ సెన్సిటివ్ వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. దాని అధిక పోషక, ఔషధ లక్షణాల కారణంగా ఆరోగ్య ప్రయోజనాభిలాషులకు ఇది చాలా విలువైనది.విశేష పోషకాలురక్తశాలి పోషకాలతో కూడిన ఆహారం. వంద గ్రాముల ముడి బియ్యం.. 363.49 కిలో కేలరీల శక్తిని అందిస్తుంది. ్ర΄ోటీన్ (8.96 గ్రా.), పిండి పదార్ధం (71.18 గ్రా.), కొవ్వు (4.77 గ్రా.), జింక్ 15.75 మి.గ్రా., ఐరన్ (0.99 మి.గ్రా.) కలిగి ఉంటుంది. ఈ బియ్యాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ కింది ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాల నిపుణులు చెబుతున్నారు.రక్తశాలి బియ్యాన్ని పాలిష్ చేయకుండా ముడి బియ్యం వండుకొని తింటారు. ఇది ముఖ్యంగా రక్తహీనత ఉన్న మహిళలకు ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే ఇది రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. దీన్ని ఆహారంగా తీసుకుంటుంటే రక్తం హెచ్చుతగ్గులను స్థిరంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది.అంకితభావంతో కూడిన సేంద్రియ/ప్రకృతి రైతుల సంరక్షణలో సాగవుతున్న అరుదైన రకాల్లో ఇదొకటి. ఆయుర్వేదంలో శరీర త్రిదోషాల(వాత, పిత్త, కఫ) సమతుల్యం చేయగలదన్న గుర్తింపు పొందింది. కాలేయం, మూత్రపిండాలు, నాడీ రుగ్మతలతో సహా వివిధ ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుందని, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులు దీన్ని సిఫార్సు చేస్తున్నారు.110 రోజుల ఖరీఫ్ పంటరక్తశాలి వరి పంట ప్రధానంగా కేరళలో వర్షాధార వ్యవసాయంలో సాగవుతోంది. సేంద్రియ పద్ధతుల్లో, పర్యావరణహిత పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. జూన్/జూలై నుండి నవంబర్/డిసెంబర్ వరకు ‘శాలి’ సీజన్లో పండిస్తారు. దాదాపు 110 రోజుల పంట. జాగ్రత్తగా నీటి నిర్వహణ అవసరం. అయితే, అననుకూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని దిగుబడి నిస్తుంది. సారవంతమైన ఎర్ర ఒండ్రు నేలల్లో రక్తశాలి వరి బాగా పెరుగుతుంది. తగినంత వర్షపాతంతో కూడిన ఉష్ణమండల తేమ వాతావరణం దీనికి అనువైనది. అధిక నాణ్యత గల స్థానికంగా సాగయ్యే రక్తశాలి విత్తనాలను ఎంచుకుంటే మంచి దిగుబడి రావటంతో పాటు తెగుళ్ళు, పురుగుల బెడద ఉండదు. ఇదీ చదవండి: Akshaya tritiya 2025 దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయిఔషధ విలువలు, పోషకాల కారణంగా రక్తశాలి బియ్యానికి మార్కెట్లో ధర ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, దీని సాగు విస్తృతం కాక΄ోవటానికి అనేక సవాళ్లు ఆటకంగా ఉన్నాయి. రక్తశాలి సాగు, వినియోగం పెరగడానికి ఎదురవుతున్న సవాళ్లు... ఈ సవాళ్లలో నాణ్యమైన విత్తనాల లభ్యత ఒకటి. విత్తన బ్యాంకులు లేదా కమ్యూనిటీ విత్తన నిధుల ఏర్పాటు ద్వారా రక్తశాలి వంటి అపురూప దేశీ విత్తనాల లభ్యతను పెంచవచ్చు. ఖర్చులు తగ్గించడానికి, నాణ్యమైన విత్తనాలను అందించేందుకు రైతుల విత్తన సహకార సంఘాలను ప్రోత్సహించాలి. రక్తశాలి దిగుబడి ఇతర రకాలతో పోల్చితే తక్కువ. ఈ కారణంగా, సేంద్రియ వ్యవసాయంలో అధిక శ్రమ వల్ల సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి పోషక, ఔషధ గుణాలు పోకుండా చూసుకుంటూనే దిగుబడి పెంచేందుకు పరిశోధనలు చేపట్టాలి. సేంద్రియ బియ్యం నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్థానిక రైతులతో బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతుల ఆదాయం పెంచే ప్రయత్నం చెయ్యాలి. ఎక్కువ మంది రైతులు రక్తశాలి బియ్యాన్ని సాగు చేసి విక్రయించేలా ప్రోత్సాహకాలు లేదా సబ్సిడీలను అందించాలి. కొత్త సాగుదారులకు ఉత్తమ పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. పంట ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ పనులను సహకార సంఘాలు లేదా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం లేదా అనుసంధానించడం ద్వారా సాగును విస్తరింపచేయవచ్చు. రక్తశాలి బియ్యంతో లభించే ఆరోగ్య ప్రయోజనాలు సాధారణ ప్రజలకు బాగా తెలియక΄ోవటం లేదా అర్థం చేసుకోకపోవటం వల్ల వినియోగం తక్కువగా ఉంది. సోషల్ మీడియా, స్థానిక ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణులను ఉపయోగించి ఔషధ పోషక ప్రయోజనాలను హైలైట్ చేస్తూ అవగాహన ప్రచారం ప్రారంభించడం అవసరం. వర్క్‌షాప్‌లు, సెమినార్లు లేదా స్థానిక సంతలు నిర్వహించాలి. స్వచ్ఛంద సంస్థలను ఈ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి.స్థానిక వంటకాల్లో రక్తశాలి బియ్యాన్ని వాడేలా ప్రోత్సహించేలా వంటల ఉత్సవాలు నిర్వహించాలి. ఈ బియ్యంతో తయారు చేసిన సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించే ఆహార ఉత్సవాలను నిర్వహించాలి. మార్కెటింగ్ గొలుసులను, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను అన్వేషించడం ద్వారా మార్కెటింగ్‌ను మెరుగుపరచవచ్చు. రక్తశాలి బియ్యానికి సేంద్రియ ధృవీకరణ కల్పిస్తే సాగుదారులు ప్రీమియం మార్కెట్లలో అధిక ధర పొందేందుకు సహాయపడుతుంది.మరో విశేషం ఏమిటంటే...ఇది కండగల ఎర్ర నేలల్లో వర్షాధారంగా, సేంద్రియంగా సాగుకు అనువైనది. అయితే, దిగుబడి తక్కువ. కేవలం మహిళల ఆరోగ్యంకోసమైనా దీన్ని తిరిగి మన పంట పొలాల్లోకి, మన వంటిళ్లలోకి, పళ్లాలోకి తెచ్చుకోవటం అత్యవసరం. దిగుబడి పెంచే పరిశోధనలు చేపట్టాలి. అయితే, ఔషధ గుణాలు ΄ోకుండా చూడాలి. రక్తశాలి సాగును ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ పథకాల ద్వారా ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చి ప్రోత్సహించాలి. ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాల ద్వారా నేరుగా దేశంలో మహిళలందరికీ అందేలా చెయ్యాలి!చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో ఇన్ని వేలు పెరిగిదా? కొందామా? వద్దా?ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!విటమిన్లు: మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు (బి విటమిన్లు వంటివి), ఖనిజాలు (ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటివి) రక్తశాలి బియ్యంలో ఉన్నాయి.అధిక ఫైబర్: రక్తశాలి బియ్యంలో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో తోడ్పడుతుంది. కడుపు నిండిన భావనను కలిగించటం ద్వారా శరీర బరువు నిర్వహణలో సహాయపడుతుంది.యాంటీ ఆక్సిడెంట్లు: అధిక సాంద్రతలో ఎరుపు రంగు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.తక్కువ గ్లైసెమిక్ సూక: ఇది తెల్ల బియ్యం కంటే తక్కువ గ్లైసెమిక్ సూకను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. డయాబెటిస్ లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.గుండె ఆరోగ్యం: ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.గ్లూటెన్–ఫ్రీ: గ్లూటెన్ అసహనం లేదా సెలియాక్ వ్యాధి ఉన్న వ్యక్తులకు ఇది ఒక గొప్ప వరం. సురక్షితమైన, పోషకాలతో కూడిన బియ్యం. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వృద్ధాప్యపు ఛాయలు కనపడకుండా సహాయపడతాయి.రోగనిరోధక శక్తి: రక్తశాలి బియ్యంలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తాయి.రక్త వృద్ధి: రక్తశాలి బియ్యం రక్త వృద్ధిని మెరుగుపరుస్తుంది. రక్తహీనత ఉన్న మహిళలకు వరప్రసాదం వంటిది. రక్తం స్థాయిని స్థిరీకరించడానికి లేదా నిలుపుకోవడానికి కూడా సహాయపడుతుంది. రక్తశాలి బియ్యం రక్తంలో చక్కెరను నిర్వహించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.ముగింపురక్తశాలి అనేది స్వదేశీ వరి రకం. ఔషధగుణాలు, పోషకాంశాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఇప్పటికీ సాధారణ ప్రజలకు అంతగా తెలియదు. అందువల్ల ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేయాలి. రైతులు, పరిశోధకులు, విధాన రూపకర్తలు ఉమ్మడిగా పనిచేసి దీన్ని మళ్లీ వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది.రక్తశాలి అద్భుతమైన అధిక పోషక, ఔషధ గుణాలున్న పురాతన వరి వంగడం. పేరుకు తగ్గట్టే ముదురు ఎరుపు రంగులో ఉంటుంది రక్తశాలి బియ్యపు గింజ. అంతేకాదు, రక్తహీనతను పారదోలటంతో పాటు రక్తం తగ్గి΄పోకుండా స్థిరీకరించగలిగిన అద్భుత గుణం రక్తశాలి సొంతం. రక్తహీనతకు గురయ్యే మహిళలకు ఇది చక్కటి ఆరోగ్యవంతమైన పరిష్కారం. ముడి రక్తశాలి బియ్యం తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. చాలా రకాల వరి బియ్యంలో ఉన్నట్లు ఇందులో గ్లుటెన్ లేదు. గ్లుటెన్ ఇన్టాలరెన్స్ / సెలియక్ వంటి ఆరోగ్య సమస్యలున్న వారికి ఇది వరం.

అక్షయ తృతీయ.. దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి
అక్షయ తీజ్ లేదా పరశురామ జయంతి అని కూడా పిలిచే అక్షయ తృతీయ (Akshaya tritiya 2025) అనేది వైశాఖ మాసం చివర్లొ శుక్ల పక్ష తదియ నాడు జరుపుకునే వసంత పండుగ. అక్షయ అంటే శ్రేయస్సు, నాశనం లేనిది ఆశ, విజయంతో పాటు ఆనందం పరంగా శాశ్వతత్వం ,తృతీయ అంటే చంద్రుని మూడవ దశ.ఈ రోజు ద్రౌపది, కృష్ణుడు , అక్షయ పాత్రకు సంబంధించిన పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ప్రముఖ గాయని చిన్మయి (Chinmayi Sripada) ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది.అక్షయ తృతీయ అంటే దానం, ధర్మం చేయాల్సిన రోజని గుర్తు చేసింది.ద్రౌపది అక్షయ పాత్ర విశేషం తరువాత అక్షయ తృతీయను ఆచరణలోకి వచ్చిందని పేర్కొంది. ఈ రోజు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, పేదలకు ఒక్క రూపాయి అయినా దానం ఇవ్వాలని సూచించింది. మనుషులు, జంతువులు, మొక్కలు, పక్షులకు కాసింత ఆహారాన్ని పెట్టండి. ఈ దానమే ఇక చాలు అనే తృప్తి నిస్తుంది అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)ద్రౌపది అక్షయ పాత్రకథద్రౌపది, రాజకుమారులైన పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, సూర్యుడు తన తపస్సు ఫలితంగా పాండవులలో పెద్దవాడైన యుధిష్టురుడికి అక్షయ పత్రం ప్రసాదించాడు. పాండవ అగ్రజుడు ధర్మరాజు ద్రౌపద్యాదిత్యుడినే ఉపాసించి ఆ స్వామి నుంచి 'అక్షయ పాత్ర' వరంగా పొందినట్టు స్కాందపురాణంలోని 'కాశీఖండం' ద్వారా మనకు తెలుస్తోంది. అలాగే పాండవులు వనవాస కాలంలో కృష్ణుడి నుండి అక్షయ పాత్రను పొందారు. ఇది ఒక మాయా పాత్ర, ఇది ఎల్లప్పుడూ వారికి ఆహారాన్ని అందించేది. ఆ అక్షయ పాత్ర ద్రౌపది భోజనం చేసే వరకు ఎల్లప్పుడూ ఆహారం ఉంటుంది , ఆ తరువాత తలక్రిందులుగా ఉంచుతుంది. అంటే అప్పటికి ఆహారం అయిపోతుంది. ఒకసారి కోపానికి, శాపానికి పేరుగాంచిన దుర్వాస ముని తన వేలాది మంది శిష్యులతో కలిసి పాండవుల ఇంటికి భోజనానికి వచ్చాడు. కానీ అప్పటికి ఆహారం అంతా అయిపోయింది . తినడానికి ఏమీ లేదు. బ్రాహ్మణులు వచ్చినప్పుడు పాత్ర ఖాళీగా ఉండటంతో ద్రౌపది శ్రీకృష్ణుడి సహాయం కోసం ప్రార్థించింది.అలా శ్రీకృష్ణుడికి అనుగ్రహంతో బ్రాహ్మణులందరూ స్వయంచాలకంగా పూర్తిగా సంతృప్తి చెందడంతో, దూర్వాసుడి శాపం నుంచి తప్పించుకుంటుంది ద్రౌపది. ద్రౌపదిని కృష్ణుడు దుశ్శాసనుని బారి నుండి కాపాడాడిన రోజే అక్షయ తృతీయ అని పురాణాల ద్వారా తెలుస్తోంది.ఇదీ చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా?అక్షయ తృతీయ రోజును విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు ఆవిర్భవించిన రోజుగా కూడా పరిగణిస్తారు. అందుకే ఈ రోజును కొన్నిసార్లు ప్రశురామ జయంతి అని కూడా పిలుస్తారు. మరొక పురాణం ప్రకారం, వేద వ్యాసుడు గణేశుడికి మహాభారతం పారాయణం చేయడం ప్రారంభించిన రోజు ఇదేనని నమ్ముతారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యత:అక్షయ తృతీయ రోజున ఏదైనా శుభకార్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అక్షయ తృతీయ రోజున దానం చేయడం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుంది. విష్ణుమూర్తి పాదాలకు అక్షతలతో అర్చించి, ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని విశ్వసిస్తారు. అక్షయ తృతీయను స్వయంసిద్ధ ముహూర్తంగా పరిగణిస్తారు. అంటే ఈ రోజున ఎలాంటి ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు, ఏ పని మొదలుపెట్టినా మంచి ఫలితాలుంటాయని, . ఈ రోజున దానం, ధర్మం, పుణ్యకార్యాలు చేయడం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం.
ఫొటోలు
అంతర్జాతీయం

లిబరల్ పార్టీ విజయం
టొరంటో: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి మార్క్ కార్నీ సారథ్యంలోని అధికార లిబరల్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. జస్టిన్ ట్రూడో హయాంలో ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆక్రమణ హెచ్చరికలు, ఆ దేశంతో వాణిజ్య యుద్ధం వంటివి కలిసొచ్చాయి. దీనికి తోడు ఆర్థిక నిపుణుడిగా పేరున్న కార్నీ అమెరికాకు వ్యతిరేకంగా కెనడా ప్రజలను ఏకం చేయడంలో విజయం సాధించారు. అధికార పార్టీ అనుకూల పవనాలను ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ గట్టిగా ఎదుర్కొనలేక రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ట్రంప్ మాదిరిగా కెనడా ఫస్ట్ అంటూ ఆ పార్టీ నేత పియెర్రె తీసుకువచ్చిన నినాదాన్ని జనం నమ్మలేదు. మొన్నమొన్నటిదాకా ప్రజాదరణలో ముందుండి, కెనడా తదుపరి ప్రధాని, ఫైర్‌బ్రాండ్ అంటూ ప్రచారం జరిగిన పియెర్రె స్వయంగా ఒట్టావా నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. పార్లమెంట్‌లోని మొత్తం 343 స్థానాలకు గాను కన్జర్వేటివ్‌ల కంటే లిబరల్స్‌కే అత్యధికంగా దక్కుతాయనే అంచనాలున్నాయి. ఫలితాలు వెలువడే సమయానికి లిబరల్ పార్టీకి చెందిన అభ్యర్థులు 168 సీట్లలో గెలుపు/ఆధిక్యం సాధించారు. మెజారిటీ మార్కు 172కు మరో నాలుగు సీట్ల దూరంలో ఆ పార్టీ నిలిచింది. ఒకవేళ 168 సీట్లకే పరిమితమైన పక్షంలో అధికారంలో కొనసాగాలన్నా, చట్టాలు చేయాలన్నా ఏదో ఒక చిన్న పార్టీని కలుపుకుని వెళ్లాల్సి ఉంటుంది. కెనడా ఆక్రమణ ట్రంప్ తరంకాదు: మార్క్ కార్నీ లిబరల్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ప్రధాని మార్క్ కార్నీ విజయోత్సవ ప్రసంగం చేశారు అమెరికా నుంచి ముప్పు ఎదురవుతున్న తరుణంలో కెనడా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కెనడా–అమెరికాలు పరస్పరం సహకరించుకుంటూ ప్రయోజనం పొందే విధానం రెండో ప్రపంచ యుద్ధం నుంచి అమలవుతోందని గుర్తుచేశారు. అది ఇటీవలే ముగిసిందని అన్నారు. అమెరికా తమను దగా చేసిందని మండిపడ్డారు.అమెరికా తీరుపట్ల దిగ్భ్రాంతికి గురైనప్పటికీ ఆ పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. కొన్ని నెలలుగా హెచ్చరికలు వస్తున్నాయని, మన భూమి, మన వనరులు, మన నీరు, మన దేశాన్ని ఆక్రమించుకుంటామని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కెనడాను విచి్ఛన్నం చేసి, సొంతం చేసుకోవాలన్నదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నాగమని ధ్వజమెత్తారు. అది ఎప్పటికీ సాధ్యం కాదన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. అయితే, ప్రపంచం మారుతోందన్న నిజాన్ని మనం గుర్తించాలని కెనడా పౌరులకు మార్క్ కార్నీ సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించడంతో ఆయన మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కెనడాతో బంధం బలోపేతం చేసుకుంటాం: మోదీ కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మార్క్ కార్నీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అభినందనలు తెలియజేశారు. కెనడాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. రెండు దేశాల పౌరులకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలనలకు ఇరుదేశాలూ కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. సత్తా చాటిన భారత సంతతి అభ్యర్థులుకెనడా ఎన్నికల్లో పలువురు భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు. లిబరల్, కన్జర్వేటివ్ పార్టీల నుంచి రికార్డు స్థాయిలో 22 మంది అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం కెనడా పార్లమెంట్ దిగువ సభలో 17 మంది భారత సంతతి ఎంపీలున్నారు. ఈ సంఖ్య 22కు చేరుకుంది. పంజాబ్ నుంచి వలసవెళ్లిన కుటుంబంలో జన్మించిన సుఖ్ దలీవాల్(లిబరల్) ఆరోసారి నెగ్గడం విశేషం. బర్నాబై సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేసిన న్యూ డెమొక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) నేత జగ్మీత్‌సింత్(46) పరాజయం పాలయ్యారు. 18.1 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ లిబరల్ పార్టీ అభ్యర్థి వేడ్ చాంగ్ గెలిచారు. కెనడా జనాభాలో 3 శాతానికిపైగా భారత సంతతి ప్రజలు ఉన్నారు.

చైనా రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
చైనాలోని లియావోయాంగ్ నగరంలోని ఓ రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. రెండు, మూడు అంతస్తుల భవనాల నుంచి భారీగా మంటలు చెలరేగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మంటలను అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ నెలలో చైనాలో జరిగిన రెండో అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇది.ఏప్రిల్ 9న ఓ నర్సింగ్ హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. చెంగ్డే నగరంలోని లాంగ్హువా కౌంటీలో రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం 20 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు చెలరేగిన సమయంలో ఈ హోమ్‌లో మొత్తం 260 మంది వృద్ధులు ఉన్నారు.#BREAKING 🚨First images from the restaurant fire 🔥22 people dead and 3 injured after a #fire broke out at a restaurant near a resettlement housing complex in Liaoyang, #Liaoning Province. The investigation is ongoing. #China #fire pic.twitter.com/WRelu9T8ov— Nazlı Özdemir (@nazliiozdemr) April 29, 2025

భారత్‌లో పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత
ఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై పాక్ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఎక్స్ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పాక్ జర్నలిస్టుల ఎక్స్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది.భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడమరోవైపు, భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్ ఐఎస్ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు.. భారతీయ సైనిక్ స్కూల్ ఉద్యోగులమంటూ ఐఎస్ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది.కాగా, పహల్గాం దాడి తర్వాత పాక్ రక్షణ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ కోరుకునేది ఎన్నటికీ జరగదు.. విక్టరీ స్పీచ్‌లో మార్క్ కార్నీ
టొరంటో: కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ(Liberal Party of Canada) విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో మార్క్ కార్నీ(Mark Carney) మద్ధతుదారుల్ని ఉద్దేశిస్తూ విజయ ప్రసంగం చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.‘‘కెనడా చరిత్రలో కీలకమైన క్షణం ఇది. అమెరికా(America)తో మన పాత ఏకీకరణ సంబంధం ఇప్పుడు ముగిసింది. ఇకపై అమెరికాను స్థిరమైన మిత్రదేశంగా నమ్మలేం. అమెరికా చేసిన ద్రోహం నుండి మనం తేరుకుంటున్నాం. నెలల తరబడి నుంచి నేను ఈ విషయంలో హెచ్చరిస్తూ వస్తున్నా. అమెరికా మన భూమిని, మన వనరులను, మన నీటిని, మన దేశాన్ని కోరుకుంటోంది. మనల్ని విచ్ఛిన్నం చేసి తద్వారా కెనడాను సొంతం చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. కానీ, అది ఎప్పటికీ జరగదు’’ అని కార్నీ అన్నారు.అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెనడా పార్లమెంట్లో 343 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు 172 మెజారీటీ అవసరం. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు. అయితే లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఆర్థిక వేత్త అయిన మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన కార్నీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.ఇదీ చదవండి: ట్రంప్‌తో కయ్యం.. ఎవరీ మార్క్ కార్నీ?
జాతీయం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జనగణనలోనే కుల గణన కూడా చేయడానికి కేబినెట్ అంగీకారం తెలిపింది. వచ్చే జనాభా లెక్కల్లో కులగణనను చేరుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. దీనిలో భాగంగా జనగణనతో కలిపి కులగణన కూడా చేయడానికి నిశ్చయించింది. 2019లోనే జనగణన చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా అప్పుడు ముందుడగు పడలేదు. దాంతో పాటు షిల్లాంగ్-సిల్చారు జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 22,864 కోట్ల రూపాయల ఖర్చుతో 166 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా త్రిపుర, మిజోరం, మణిపూర్, అస్సాంలోని బరాక్ వ్యాలీకి కనెక్టివిటీ పెరగనుంది. అదే సమయంలో చెరకు మద్దతు ధర క్వింటా రూ. 350 పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మండలి నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.పహల్గామ్ పై నో డిస్కషన్.. ఓన్లీ సైలెన్స్‌అయితే ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే నేటి భేటీలో ఆ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఎటువంటి చర్చ లేకుండా భేటీ ముగిసింది. దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. దాంతో దాడికి సంబంధించి ప్రతిచర్యలపై కేంద్రం మౌనం పాటిస్తూ ముందుకెళ్లడం కూడా వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారంటే..జన గణనలో కులగణన చేయాలని క్యాబినెట్ నిర్ణయంవచ్చే జనాభా లెక్కల్లో కుల గణన కాలమ్ చేర్చాలని నిర్ణయంబీహార్, బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ కీలక నిర్ణయంకుల గణన కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్న బిసి సంఘాలుకుల గణనను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జరిగిన అన్ని జనాభా గణన కార్యకలాపాలలో కులాన్ని చేర్చలేదు.కుల గణన అంశాన్ని కేబినెట్లో పరిశీలిస్తామని 2010లో అప్పటి ప్రధాని దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ లోక్‌సభకు హామీ ఇచ్చారు.ఈ అంశాన్ని పరిశీలించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. చాలా రాజకీయ పార్టీలు కుల గణనను సిఫార్సు చేశాయి.కుల గణనకు బదులు సర్వే మాత్రమే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సర్వేనే SECC అంటారు.కాంగ్రెస్ మరియు దాని భారత కూటమి భాగస్వామ్య పక్షాలు కుల గణనను రాజకీయ సాధనంగా మాత్రమే ఉపయోగించుకున్నాయని బాగా అర్థమైంది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం, సబ్జెక్ట్ సెన్సస్ ఏడవ షెడ్యూల్లోని యూనియన్ జాబితాలో 69గా జాబితా చేయబడింది. భారత రాజ్యాంగం ప్రకారం, జనాభా గణన అనేది యూనియన్ సబ్జెక్ట్.కొన్ని రాష్ట్రాలు కులాలను లెక్కించేందుకు సర్వేలు నిర్వహించాయి. కొన్ని రాష్ట్రాలు దీన్ని బాగా చేశాయి, మరికొన్ని పారదర్శకంగా రాజకీయ కోణం నుండి ఇటువంటి సర్వేలను నిర్వహించాయి.ఇలాంటి సర్వేలు సమాజంలో అనుమానాలకు తావిస్తున్నాయి.ఈ వాస్తవాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, రాజకీయాల వల్ల మన సామాజిక వ్యవస్థకు భంగం కలగకుండా చూసేందుకు, కుల గణనను సర్వేలకు బదులు పారదర్శకంగా జనాభా గణనలో చేర్చాలి.ఇది దేశం పురోగమిస్తూనే మన సమాజం యొక్క సామాజిక మరియు ఆర్థిక నిర్మాణాన్ని బలోపేతం చేస్తుంది.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ నేతృత్వంలో, రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, ఈ రోజు (30 ఏప్రిల్, 2025) రాబోయే జనాభా గణనలో కుల గణనను చేర్చాలని నిర్ణయించింది.గతంలో మా ప్రభుత్వం సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పుడు సమాజంలోని ఏ వర్గానికి ఒత్తిడి కలిగించకుండా మన ప్రభుత్వం మన సమాజం మరియు దేశం యొక్క విలువలు మరియు ప్రయోజనాలకు కట్టుబడి ఉందని ఇది నిరూపిస్తుంది.

జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా అలోక్ జోషి
ఢిల్లీ: జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా ‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. ఏడుగురు సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరించింది. సభ్యులుగా మాజీ ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆర్మీ అధికారులను నియమించింది. కాగా, ప్రధాని నివాసంలో బుధవారం.. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ భేటీ నిర్వహించారు.ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలకు ఇప్పటికే భద్రత బలగాలకు ప్రధాని మోదీ సంపూర్ణ స్వేచ్ఛనిచ్చిన సంగతి తెలిసిందే. సీసీఎస్ అనంతరం సీసీపీఏ, సీసీఈఏ సమావేశాలు నిర్వహించారు. చివర్లో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. భద్రత వ్యవహారాలను సీసీఎస్ చర్చించింది. రాజకీయ పరిస్థితులను సీసీపీఏ చర్చించింది. ఆర్థిక అంశాలపై సీసీఈఏ పలు నిర్ణయాలు తీసుకుంది.సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ మరిన్ని ఆంక్షలు విధించనుంది. ఫార్మా ఎగుమతులను నిలిపివేసే అవకాశం, భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాల నిషేధం.. అరేబియా సముద్రంలో పోర్టుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఆంక్షలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే వ్యూహంలో భారత్ ఉంది. ఇవాళ 3 గంటలకు సీసీఎస్, సీసీపీఏ, సీసీఈఏ, కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ప్రెస్మీట్లో వెల్లడించనున్నారు.

అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ .. పాకిస్తాన్‌ను ఆర్ధికంగా మరింత ఇబ్బందే పెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దాయాది దేశంపై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది.పాకిస్తాన్‌కు అప్పు ఇవ్వొద్దంటూ భారత్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) పై ఒత్తిడి చేస్తోంది. ఆ మేరకు అభ్యంతరం తెలిపింది. గతేడాదిలో ప్రకటించిన పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ విషయంలో సమీక్షించాలని కోరింది. పాక్‌కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్ళిస్తోందని ఐఏఎఫ్ మెంబర్స్‌కు భారత్ వివరిస్తోంది.మే 9న పాకిస్తాన్‌కు అప్పు ఇచ్చే అంశంపై ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది. ఈ తరుణంలో పాక్‌కు ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వొదని భారత్ వాదిస్తోంది. ఇదే అంశంపై భద్రతామండలి నాన్ పర్మినెంట్ మెంబర్స్‌తో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని సమీక్షించాలని కోరనున్నారుIndia can voice opposition to Pakistan’s $1.3 billion IMF loan, but its 2.63% voting share limits its influence. The IMF typically approves loans by consensus, and a formal vote only needs a simple majority, not an 85% supermajority. To block the loan, India would need to build…— Grok (@grok) April 29, 2025

Kolkata: హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బుర్రాబజార్ ఏరియా ఫల్పట్టి మచ్చువా అనే పండ్ల మార్కెట్ సమీపంలో ఉన్న హోటల్ రుతురాజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద మరణాల్ని కోల్‌కతా సీపీ మనోజ్ కుమార్ వర్మ అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 8:15 గంటలకు జరిగినట్లు సమాచారం. VIDEO | Kolkata hotel fire: Police Commissioner Manoj Verma says, "A fire incident was reported at Ritu Raj Hotel in Mechuapatti area at about 8:15 am on Tuesday evening. At least 15 casualties have been reported so far and several people were rescued from rooms and roof of the… pic.twitter.com/8YkIfq6oSe— Press Trust of India (@PTI_News) April 30, 2025ఈ దుర్ఘటనపై సీపీ మనోజ్ కుమార్ మాట్లాడారు.‘ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన పద్నాలుగు మృతదేహాలను వెలికితీశాం. గాయపడిన బాధితులను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాం. మంటలు అదుపులోకి వచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని అన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన పలువురు ప్రమాదంపై మాట్లాడారు. ముందుగా హోటల్ కారిడార్లలో దట్టమైన పొగకమ్ముకుంది. ఆ తర్వాత కరెంట్ పోయిందని చెప్పారు. హోటల్లో ఉన్న పలువురు ప్రాణాల్ని రక్షించుకునేందుకు హోటల్ కిటికీలను పగలగొట్టి బయటపడేందుకు ప్రయత్నించారు. మరి కొంతమంది ప్రమాదం నుంచి బయటపడే దారిలేక అలాగే గదుల్లోనే ఉండిపోయారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకు సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు మంగళవారం అరెస్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. హవాలా నెట్వర్క్ మీద దృష్టి పెట్టిన పోలీసులు సహకరించిన వారి కోసం ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీíÙయల్ రిమాండ్‌లో ఉన్న అభిష్ క్, హర్షవర్థన్, ధావల్, రాహుల్‌లను పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఓజీ కుష్ పండించేదీ అతడేనా..? ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్, మారువానా, హైడ్రాపోనిక్ గాంజా, ఓజీ కుష్ ఇలా వివిధ పేర్లతో పిలిచే గంజాయితో పాటు మ్యాజిక్ మష్రూమ్స్‌ను ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ సరఫరా చేస్తున్నాడు. ఈ గంజాయి థాయ్లాండ్లోనే ఎక్కువగా పండుతుంది. జబల్పూర్కు చెందిన హర్షవర్థన్‌కు ఓడల ద్వారా చేరింది కూడా థాయ్‌లాండ్ నుంచే. దీన్నిబట్టి ఈ ఓజీ కుష్‌ను హ్యాండ్లరే పండించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి ఈ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. హైడ్రోఫోనిక్ టెక్నిక్ విధానంలో కృత్రిమ కాంతితో పండిస్తుంటారు. ఆన్లైన్లో విత్తనాలు ఖరీదు చేసి, ఎల్ఈడీ లైట్లను ఉపయోగించి గంజాయి మొక్కలను పెంచుతారు. ఏమాత్రం మట్టితో అవసరం లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కుండీలు, ట్రేల్లో ఇసుక, కంకర లేదా నీటిలో అదనపు పోషకాలతో ఉపయోగించి సాగు చేస్తుంటారు. కొందరు మాత్రం కొబ్బరి పొట్టు నారలు, గులకరాళ్లు కూడా వాడతారు. నేలమీద పండే గంజాయి కంటే ఈ ఓజీ నాణ్యత ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఈ మొక్కలు ఓపెన్–రూట్ వ్యవస్థ ద్వారా పోషకాలు, ఆక్సిజన్‌ను నేరుగా తీసుకోవడమే దీనికి కారణం. వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యాపారం... ఈ డ్రగ్స్ క్రమవిక్రయాల దందా మొత్తం పక్కా వ్యవస్థీకృతంగా సాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఎన్‌క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఇండియా నుంచి తనకు వచ్చిన ఆర్డర్ల విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ ఆయా యాప్స్ ద్వారానే హర్షవర్థన్‌కు చేరవేస్తాడు. ఇతడు జబల్పూర్లో ఉన్న హవాలా ఏజెంట్‌కు ఆ కస్టమర్ వివరాలు పంపిస్తాడు. అతగాడు సదరు కస్టమర్ నివసించే ప్రాంతానికి చెందిన మరో హవాలా ఏజెంట్‌కు ఇవి అందిస్తాడు. ఆ వినియోగదారుడిని సంప్రదించే ఈ ఏజెంట్ డబ్బు ముట్టిన తర్వాత జబల్పూర్ ఏజెంట్‌కు బదిలీ చేస్తాడు. అతడి ద్వారా విషయం తెలుసుకునే హర్షవర్థన్ విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’కు చెప్తాడు. ఔన్స్ (28.34 గ్రాములు) డ్రగ్‌కు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో అతడికి పంపిస్తాడు. ఆపై డ్రగ్ హ్యాండ్లర్ నుంచి హర్షవర్థన్‌కు వచి్చ... అక్కడ నుంచి డీటీడీసీ, శ్రీ తిరుపతి, శ్రీ ఆంజనేయులు కొరియర్స్‌లో కస్టమర్‌కు చేరుతుంది. హర్షవర్థన్ కూడా పోలీసుల నిఘాకు చిక్కకుండా ఈ పార్శిల్ బుక్ చేస్తున్నాడు. అక్కడ కస్టమర్ చిరునామా, ఫోన్ నెంబర్ తప్పుగా ఇస్తాడు. దాని ట్రాకింగ్ ఐడీని వినియోగదారుడికి పంపిస్తాడు. దీని ద్వారా ట్రాక్ చేసే కస్టమర్ ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరిందని గుర్తించిన వెంటనే అక్కడకు వెళ్లి తీసుకుంటారు. ఈ హవాలా, కొరియర్ నెట్వర్క్ పైనా హెచ్–న్యూ దృష్టి పెట్టింది. ఈ ముఠాలో కీలక పెడ్లర్‌గా ఉన్న హర్షవర్థన్‌కు చెందిన క్రిప్టో వాలెట్లో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన బిట్కాయిన్లు డిపాజిట్ అవుతున్నట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు.

ఫ్రెండ్‌కి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్తూ..
మక్కువ(విజయనగరం): మండలంలోని తూరుమామిడి గ్రామానికి చెందిన నూకమ్మ అలియాస్ ఉమ మంగళవారం తమ ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమానికి తనతోపాటు డిగ్రీ చదువుతున్న ఫ్రెండ్స్‌ను ఆహ్వానించింది. స్నేహితులంతా కలిసి మంగళవారం ఆటపాటల్లో మునిగితేలారు. బుధవారం తన ఫ్రెండ్ షర్మిలకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై మక్కువ వెళ్తుండగా టాక్టర్ రూపంలో మత్యువు నూకమ్మను కబళించింది. అంతవరకు గ్రామంలో అందరితో కలివిడిగా ఉండి, ఫ్రెండ్‌ను మక్కువలో డ్రాప్ చేసి వస్తానని చెప్పి, తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తూరుమామిడి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినికురసాన నూకమ్మ అలియాస్ ఉమ(20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై హెడ్ కానిస్టేబుల్ ఎస్. శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నూకమ్మ తన ఫ్రెండ్ షర్మిలకు సెండాఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి మక్కువకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మార్గమధ్యంలోని శాంతేశ్వరం గ్రామం సమీపంలో ఎదురుగా ట్రాక్టర్ మితిమీరిన వేగంతో వచ్చింది. టాక్టర్ను తప్పించే ప్రయత్నంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో నూకమ్మ తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందింది. నూకమ్మ బొబ్బిలిలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తండ్రి జనార్దనరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సాలూరు ఆస్పత్రికి తరలించారు.

ప్రియుడి ఇంటి ముందు ట్రాన్స్‌జెండర్ ధర్నా
ఆదోని రూరల్(కర్నూలు): తనను మోసం చేశాడంటూ ఆదోని మండలం బైచిగేరికి చెందిన యువకుడి ఇంటి ఎదుట ఓ ట్రాన్స్‌జెండర్ ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం మేరకు.. నాలుగేళ్ల క్రితం ఆదోని మండలం బైచిగేరికి చెందిన గణేష్ అనే యువకుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ అన్నమయ్య జిల్లా మదనపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు హాసినిగౌడ్ ఊరఫ్ రామకృష్ణ(24) అనే ట్రాన్స్‌జెండర్‌తో పరిచయం ఏర్పడి, సహజీవనం చేస్తూ వచ్చాడు. గతేడాది గణేష్‌కు పెళ్లి కుదరడంతో ట్రాన్స్‌జెండర్ హాసినిని వదిలేసి సొంత గ్రామానికి రావడంతో 2024 జూన్ 10న బైచిగేరి గ్రామానికి వచ్చి తనకు న్యాయం చేయాలని హాసినిగౌడ్ నిరసన తెలిపింది. ఆదోని తాలూకా పోలీసులు ఆమె నివాసముంటున్న హైదరాబాద్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ మేరకు హాసినిగౌడ్ అక్కడ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే మరలా బుధవారం వచ్చి బైచిగేరిలో గణేష్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. ‘‘నువ్వే నా ప్రాణం, నా సర్వస్వం.. నువ్వు లేనిదే నేను లేనంటూ నా వెంట పడ్డాడు. నేను ఒక ట్రాన్స్‌జెండర్. నాతో నీవు సావాసం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పాను. అయినా వినకుండా, తననే పెళ్లి చేసుకుంటాని వెంట బడ్డాడు. నాకు పిల్లలు పుట్టరని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మా ఇంటి నుంచి రూ.5 లక్షలు తీసుకెళ్లి ఇద్దరం పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో నివాసముంటున్నామని హాసినిగౌడ్ వాపోయింది. తన డబ్బులు రూ.5 లక్షలు అయినా ఇప్పించాలని, లేకపోతే గణేష్‌తో కాపురం అయినా చేయించాలని డిమాండ్ చేసింది. సమాచారం అందుకున్న తాలూకా ఎస్ఐ రామాంజనేయులు గ్రామానికి చేరుకుని విచారించారు. హాసినిగౌడ్ గణేష్‌పై ఇదివరకే కేసు హైదరాబాద్‌లో నమోదయ్యిందని, ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయం చేస్తామని ఎస్ఐ చెప్పడంతో వారు హాసినిగౌడ్, ఇతర ట్రాన్స్జెండర్లు ధర్నా విరమించారు.

నెల్లూరులో కారు బీభత్సం.. ఆరుగురి దుర్మరణం
నెల్లూరు, సాక్షి: కారు బీభత్సంతో బుధవారం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్లోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులంతా నారాయణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్‌గా తెలుస్తోంది. పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం ఘటనలో మృతులు మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న నరేష్, అభిషేక్, జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా పోలీసులు ప్రకటించారు. గాయపడిన నవనీత్ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక.. ఈ దుర్ఘటనలో షాప్‌లో ఉన్న రమణయ్య సైతం మృతి చెందాడు. బుచ్చిరెడ్డిపాలెం లో ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరై కారులో విద్యార్థులు తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.