Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Harish Rao Meets Cm Revanth Reddy1
సీఎం రేవంత్‌రెడ్డితో హరీష్‌రావు భేటీ.. కారణం ఇదే!

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డితో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు భేటీ అయ్యారు. ఆయన వెంట పద్మారావు, మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. సీఎంతో అరగంటకు పైగా హరీష్‌రావు మాట్లాడారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. భేటీ అనంతరం పద్మారావు మీడియాతో మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో ఉన్న సమస్య కోసం సీఎం దగ్గరకు వెళ్లామని పేర్కొన్నారు.‘‘మేము వెళ్లేసరికి సీఎం రూమ్ నిండా మంది ఉన్నారు. 15 నిమిషాల పాటు సీఎంతో ఏమీ మాట్లాడలేదు. పద్మారావు నియోజకవర్గంలో కేసీఆర్ మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కోరాం. సీఎం వెంటనే వేం నరేందర్ రెడ్డికి ఆ పేపర్ ఇచ్చి చేయమని చెప్పారు’’అని పద్మారావు తెలిపారు. పద్మారావు రమ్మన్నారని తాను కూడా వెళ్లినట్లు హరీష్‌రావు పేర్కొన్నారు.డీలిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టిన మీటింగ్‌ను బహిష్కరించాం. చెన్నైలో జరిగే మీటింగ్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేయట్లేదు. డీఎంకే వాళ్ళు పిలిచారని మేము వెళ్తున్నాం. డీఎంకే మాకు ఫ్రెండ్లీ పార్టీ. ఘోష్ కమిటీ నివేదిక గురించి నాకు తెలియదు’’ అని హరీష్‌రావు చెప్పారు.కాగా, అంతకు ముందు.. సీఎం రేవంత్‌ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లు మర్రి రాజశేఖరరెడ్డి చెప్పారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి చెన్నై బయలుదేరారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ అధ్యక్షతన డీలిమినేషన్‌పై రేపు(శనివారం) చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ అఖిలపక్ష సమావేశానికి రేవంత్‌ హాజరుకానున్నారు.

Allahabad High Court Lawyers Reject Justice Yashwant Varma2
‘ఇదేమీ చెత్త బుట్ట కాదు.. మాకెందుకు ఆ జడ్జి?’

న్యూఢిల్లీ: భారీ అవినీతి ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్ వర్మ((Justice Yaswant Varma) ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలిజీయం((Supreme Court Collegium) ) తీసుకున్న నిర్ణయంపై సదరు హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక హైకోర్టులో అవినీతిని చేసిన జడ్జిని తమకెందుకు బదిలీ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. అలహాబాద్ హైకోర్టుకు యశ్వంత్ వర్మను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసింది అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.‘సుప్రీంకోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయం చాలా సీరియస్ అంశం. అలహాబాద్ హైకోర్టు ఏమైనా చెత్త బుట్టా.. ప్రస్తుతం యశ్వంత్ వర్మ అంశం చాలా తీవ్రమైనది. ప్రస్తుత పరిస్థితిపై విచారణ జరగాలి. అసలే అలహాబాద్ హైకోర్టుకు జడ్జిలు తక్కువగా ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి అలహాలబాద్ హైకోర్టులో జడ్జిల కొరత తీవ్రంగా ఉంది. ఆ తరుణంలో అవినీతి మరకలు అంటుకున్న యశ్వంత్ సిన్హా మాకెందుకు? అంటూ సీజేఐకి రాసిన లేఖలో పేర్కొంది.రూ. 15 కోట్లు పైమాటే..?అయితే అగ్ని ప్రమాదంతో బయటపడిన జస్టిస్ యశ్వంత్ వర్మ కరెన్సీ కట్ల వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ నోట్ల కట్టలు విలువ ఎంత ఉంటుందని ఇప్పటివరకూ అధికారంగా ప్రకటించకపోయినా, వాటి విలువ రూ. 15 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. నిజంగా ఒకవేళ ఆ నోట్ల కట్టల విలువ భారీ స్థాయిలో ఉంటే జడ్జి యశ్వంత్ వర్మ చిక్కుల్లో పడినట్లే. ఈ అంశంపై సీజేఐ సంజీవ్ ఖన్నా తీవ్రంగా దృష్టి సారించినట్లు సమాచారం.మార్చి 14వ తేదీన జస్టిస్‌ వర్మ ఇంట్లో లేని సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్ని మాపక సిబ్బంది నోట్ల కట్టలు కనిపించాయి. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలపడంతో సీజ్ చేసి ఉన్నతాధికారులకు అందించారు. ఈ వ్యహహారం కాస్తా ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది.గతంలో అలహాబాద్ హైకోర్టు జడ్జిగా పని చేసిన అనుభవం ఉన్న యశ్వంత్ వర్మ.. బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. తాజాగా నోట్ల కట్టల వ్యవహారం బయటపడటంతో వర్మ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకూ యశ్వంత్ వర్మ స్పందించకపోవడంతో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు మరింత బలం చేకూర్చున్నట్లే అవుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.బదిలీకి దర్యాప్తునకు సంబంధం లేదుజస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టు స్సష్టం చేసింది. దర్యాప్తునకు, బదిలీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయనే కారణం చేత అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేశామని వార్తల్లో నిజం లేదన్నారు. ఈ రెండు అంశాలకు ఎటువంటి సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది.

Karnataka legislators salary hike bill passed3
సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు శాలరీ డబుల్‌..!

బెంగళూరు: హనీ ట్రాప్ అంశం ఓవైపు కర్ణాటక అసెంబ్లీని కుదిపేస్తున్న వేళ.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఈరోజు(శుక్రవారం) ఓ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. సీఎం, ఎమ్మెల్యేల శాలరీని వంద శాతం హైక్ చేసే బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం రూ. 10 కోట్లు అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది. తాజా శాలరీ హైక్ బిల్లు ఆమోదంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతం భారీగా పెరగనుంది. ప్రస్తుతం కర్ణాటక సీఎం జీతం రూ. 75 వేలు ఉండగా, అది ఇప్పుడు రూ. 1 లక్షా యాభై వేలకు చేరనుంది. ఇక మంత్రుల జీతం 108 శాతం హైక్ తో రూ. 60 వేల నుంచి లక్షా పాతికవేలకు చేరింది.ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం రూ. 40 వేల నుంచి రూ. 80 వేలకు చేరనుంది.ఇక వీరందరికీ వచ్చే పెన్షన్ కూడా పెరగనుంది. రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు వీరికి పెన్షన్ లభించనుంది.దీనిపై కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. శాలరీ వంద శాతం హైక్ చేయడాన్ని సమర్థించారు. సామాన్యుడు ఎలా ఇబ్బందులు పడతాడో చట్ట సభల్లో ఉన్న తాము కూడా అలానే ఇబ్బందులు పడతామనే విషయం గ్రహించాలన్నారు. దీనికి సంబంధింంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు పరమేశ్వరన్‌. బీజేపీ ఎమ్మెల్యేల నిరసన.. సస్పెన్షన్‌ఈరోజు చర్చకు వచ్చిన అంశాలతో పాటు పల్లు బిల్లులకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం తెలిపే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారుఆగ్రహంతో స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ సభ్యులు తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు(Muslim Quota Bill) ప్రతులను చించి స్పీకర్‌ ముఖంపైకి విసిరి కొట్టారు. దాంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ కు గురయ్యారు. కర్ణాటక అసెంబ్లీని మళ్లీ కుదిపేసిన హనీ ట్రాప్‌

Kane Williamson To Don A New Role In IPL 2025 After Going Unsold In Mega Auction4
మెగా వేలంలో ఎవరూ పట్టించుకోలేదు.. అయినా ఐపీఎల్‌ను వదలని కేన్‌ మామ

ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను ఎవరూ పట్టించుకోని విషయం తెలిసిందే. 34 ఏళ్ల కేన్‌ మామ నిదానంగా ఆడతాడన్న కారణంగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు అతన్ని చిన్న చూపు చూశాయి. ఆటగాడిగా ఎంపిక కాకపోయినా ఏ మాత్రం నిరాశ చెందని విలియమ్సన్‌.. ఐపీఎల్‌లో కొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు.రేపటి నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్‌ 18వ ఎడిషన్‌లో కేన్‌ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నాడు. స్టార్లతో నిండిన కామెంటేటర్ల ప్యానెల్‌ను ఐపీఎల్‌ ఇవాళ (మార్చి 21) విడుదల చేసింది. ఇందులో కేన్‌తో పాటు హర్ష భోగ్లే, రవిశాస్త్రి, సునీల్‌ గవాస్కర్‌, ఇయాన్‌ బిషప్‌, నవజ్యోత్ సింగ్ సిద్ధూ లాంటి ప్రముఖ వ్యాఖ్యాతల పేర్లు ఉన్నాయి. ఈ ఐపీఎల్‌ సీజన్‌తో కామెంటేటర్‌గా అరంగేట్రం చేస్తున్న కేన్‌ మామ నేషనల్‌ ఫీడ్‌ను అందిస్తాడు.ఐపీఎల్‌ విడుదల చేసిన వ్యాఖ్యాతల జాబితాలో రెండు విభాగాలు ఉన్నాయి. ఒ‍కటి నేషనల్‌ ఫీడ్‌ కాగా.. రెండోది వరల్డ్‌ ఫీడ్‌. నేషనల్‌ ఫీడ్‌లో దేశీయ వ్యాఖ్యాతలతో పాటు విదేశీ వ్యాఖ్యాతలు ఉండగా.. వరల్డ్‌ ఫీడ్‌లో ఎక్కువ శాతం విదేశీ వ్యాఖ్యాతలే ఉన్నారు.ఐపీఎల్‌ జాతీయ ఫీడ్ వ్యాఖ్యాతల జాబితా..సునీల్ గవాస్కర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్, మైకేల్ క్లార్క్, మాథ్యూ హేడెన్, మార్క్ బౌచర్, ఆర్పీ సింగ్, షేన్ వాట్సన్, సంజయ్ బంగర్, వరుణ్ ఆరోన్, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ జడేజా, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్‌, శిఖర్‌ ధావన్, అనిల్‌ కుంబ్లే, సురేశ్‌ రైనా, కేన్‌ విలియమ్సన్, ఏబీ డివిలియర్స్, ఆరోన్ ఫించ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మహ్మద్ కైఫ్, పీయూష్ చావ్లా.ఐపీఎల్‌ ప్రపంచ ఫీడ్ వ్యాఖ్యాతల జాబితా..ఇయాన్ మోర్గాన్, గ్రేమ్ స్వాన్, హర్ష భోగ్లే, సైమన్ డౌల్, ఎంపుమలెలో ఎంబాంగ్వా, నిక్ నైట్, డానీ మారిసన్, ఇయాన్ బిషప్, అలన్ విల్కిన్స్, డారెన్ గంగా, కేటీ మార్టిన్, నటాలీ జర్మానోస్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, దీప్దాస్‌ గుప్తా, షేన్‌ వాట్సన్‌, మైకేల్‌ క్లార్క్‌, ఆరోన్ ఫించ్, వరుణ్ ఆరోన్, అంజుమ్ చోప్రా, డబ్ల్యూవీ రామన్, మురళీ కార్తీక్.కాగా, 79 మ్యాచ్‌ల ఐపీఎల్‌ అనుభవం ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్న కేన్‌ విలియమ్సన్‌ను గతేడాది జరిగిన ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ పట్టించుకోకపోవడం బాధాకరం. కేన్‌ మామను గత సీజన్‌లో ఆడిన గుజరాత్‌ టైటాన్స్‌ సహా అతని మాజీ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా లైట్‌గా తీసుకుంది. అంతర్జాతీయ వేదికపై కేన్‌ తన సొంత జట్టు న్యూజిలాండ్‌కు ఆడుతుండటంతో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌కు.. ద హండ్రెడ్‌ లీగ్‌లో లండన్‌ స్పిరిట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2025 సీజన్‌ రేపటి నుంచి ప్రారంభం​ కానుంది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ కేకేఆర్‌ ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కేకేఆర్‌ సొంత మైదానమైన ఈడెన్‌ గార్డెన్స్‌లో జరుగనుంది.

Guntur Court Issued Bail To Posani Krishna Murali5
పోసానికి బెయిల్ మంజూరు

గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరు చేసింది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు.. బెయిల్ ను మంజూరు చేసింది. బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు.. ఈరోజు(శుక్రవారం) బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పోసాని బెయిల్‌ పిటిషన్‌పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా .. న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు.. గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆయన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సీఐడీ పోలీసులు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌క్లాస్‌ ఫర్‌ ప్రొహిబిషన్‌/ఎక్సైజ్‌ కోర్డులో హాజరుపరిచారు. అక్కడ్నుంచి పోసానిని తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలిం­చారు. ఈ కేసులో బుధవారం కోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం తిరిగి విచారించిన కోర్టు.. పోసానికి బెయిల్ మంజూరు చేసింది.ఫిబ్రవరి 26వ తేదీ అరెస్టు.. ఆపై వేధింపులుకాగా, ఫిబ్రవరి 26వ తేదీని పోసానిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అనంతరం కూటమి సర్కార్ ఆదేశాలతో రోజుకో కేసు పెట్టి పోసానిని వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తూ తమ అహంకార పూరిత వైఖరిని ప్రదర్శిస్తోంది కూటమి ప్రభుత్వం. పోసానికి ఆరోగ్యం బాగోలేకపోయినా వరుస కేసులు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకూ 19 కేసులు పెట్టింది కూటమి ప్రభుత్వం.

Rani Mukerji: 100 Surya Namaskars Avoided Carbs To Achieve Toned Figure6
Rani Mukerji: టోన్డ్‌ బాడీ సీక్రెట్‌..! వంద సూర్య నమస్కారాలు ఇంకా..!

బాలీవుడ్‌లో అత్యంత ప్రసిద్ధ తారల్లో రాణి ముఖర్జీ ఒకరు. బెంగాలీ చిత్రంలో సహాయ నటి పాత్రతో సినీ రంగంలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాజా కీ ఆయేగీ బారాత్ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారామె. ఈ రోజు ఆమె 46వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 2013లో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటించిన అయ్యా మూవీ కోసం ఎంతలా కష్టపడి స్లిమ్‌గా మారిందో తెలుసుకుందామా. ఆ మూవీలో సన్నజాజి తీగలాంటి దేహాకృతితో హీరో పృథ్వీరాజ్‌తో కలిసి చేసిన నృత్యం ప్రేక్షకుల మదిని దోచుకోవడమే గాక ఇప్పటకీ హైలెట్‌గా ఉంటుంది. ఆ సినిమాలో రాణి ముఖర్జీ టోన్డ్‌ బాడీతో మెస్మరైజ్‌ చేస్తుంది. అందుకోసం ఎలాంటి డైట్‌ ప్లాన్‌, వర్కౌట్‌లు ఫాలో అయ్యేదో రాణి ముఖర్జీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సత్యజిత్ చౌరాసియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవేంటంటే..ఆ సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ గ్లాస్‌ ఫిగర్‌ని పొందేందుకు ఎలా కష్టపడిందో వింటే విస్తుపోతారు. తన శరీరాకృతి మెరుపు తీగలా ఉండేందుకు ఎలాంటి డైట్‌-వర్కౌట్‌ ప్లాన్‌ని అనుసరించిందంటే. రాణి ముఖర్జీ దినచర్య ఎలా ఉండేదంటే...తెల్లవారుజామున 60 మి.లీ కలబంద రసం.ఒక గిన్నె బొప్పాయి, సగం ఆపిల్‌రెండు గంటలు వ్యాయామంఅల్పాహారం: ముయెస్లీ/ఓట్స్ స్కిమ్డ్ మిల్క్ మధ్యాహ్నం: రెండు మల్టీగ్రెయిన్ ఆట రోటీలు, పప్పు.సాయంత్రం: మొలకలు, రెండు గుడ్డులోని తెల్లసొన, మల్టీ-గ్రెయిన్ బ్రెడ్ .రాత్రి భోజనం: 1 రోటీ, కాల్చిన కూరగాయలు, 150 గ్రాముల తందూరీ చేపలు.100 సూర్య నమస్కారాలు, మైదా కార్బోహైడ్రేట్లు లేవుచివరగా టైనర్‌ సత్యజిత్‌ చౌరాసియా మాట్లాడుతూ..ఈ మూవీ ప్రారంభించడానికి రెండు వారాల ముందు తనను సంప్రదించి విల్లలాంటి శరీరాకృతి కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆ మూవీలోని కొన్ని సన్నివేశాలకు పొట్ట భాగాన్ని, వెనుక భాగాన్ని వొంపైన తీరులో చూపించాల్సి ఉంటుందని చెప్పిందన్నారు. సులభంగా బాడీ కదలికలు కూడా ఉండాలని తెలిపిందన్నారు. కాబట్టి ఆమెను టోన​్‌గా కనిపించేలా చేసేందుకు యోగా, చక్కటి డైట్‌ ప్లాన్‌ని ఆమెకి ఇచ్చినట్లు తెలిపారు. నటి రాణి కూడా తాను సూచించినట్లుగానే దాదాపు 50 నుంచి 100 సూర్యనమస్కారాలు చేసేది. అలాగే ప్రతి రెండు మూడు గంటలకొకసారి తినేదన్నారు. వీటి తోపాటు రెండు మూడు లీటర్ల నీరు తాగాలని, కార్బోహైడ్రేట్లు, మైదాను పూర్తిగా తొలగించాలని చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆహారంలో ఒక చెంచాకు మించి నూనె ఉండకుండా కేర్‌ తీసుకున్నట్లు తెలిపారు. అయితే అప్పడప్పుడు చాక్లెట్‌ పేస్ట్రీల వంటివి తీసుకునేదన్నారు. ఇక్కడ రాణి కూడా అలాంటి దేహాకృతి కోసం చాలా అంకితభావంతో కష్టపడిందని చెప్పుకొచ్చారు. (చదవండి: 'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..!)

Aadi Saikumar Latest Thriller Shanmukha Review In Telugu7
ఆది సాయికుమార్‌ లేటేస్ట్ థ్రిల్లర్‌ మూవీ.. ఎలా ఉందంటే?

టైటిల్: షణ్ముఖనటీనటులు: ఆది సాయికుమార్, అవికా గోర్, ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు, అరియానా గ్లోరీ తదితరులుదర్శకత్వం: షణ్ముగం సప్పని నిర్మాతలు: తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మాణ సంస్థ: సాప్‌బ్రో ప్రొడక్షన్స్సంగీతం: రవి బస్రూర్విడుదల తేదీ: మార్చి 21, 2025టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్‌ భిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. మరోసారి డిఫరెంట్‌ స్టోరీతో అభిమానుల ముందుకొచ్చారు. గతంలో ప్రేమకథా చిత్రాలు ఎక్కువగా చేసిన ఆది సాయికుమార్‌.. టాప్‌ గేర్‌ తర్వాత గేర్ మార్చాడు. వరసగా క్రైమ్, యాక్షన్‌ జోనర్‌తో అభిమానులను మెప్పిస్తున్నారు. సీఎస్‌ఐ సనాతన్‌ క్రైమ్ థ్రిల్లర్‌ తర్వాత ఆది హీరోగా నటించిన మరో యాక్షన్‌ అండ్ డివోషనల్ థ్రిల్లర్ 'షణ్ముఖ'. ఈ మూవీలో ఆది సరసన ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.షణ్ముఖ కథేంటంటే..చిరాగ్ జానీ(విగాండ) దంపతులకు ఓ విచిత్రమైన రూపంలో కుమారుడు జన్మిస్తాడు. ‍అతన్ని అలా చూసిన తండ్రి కొడుకు రూపాన్ని మార్చాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్లి క్షుద్ర పూజలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత తిరిగొచ్చిన అతను తన కుమారుడి సాధారణ రూపం కోసం బామ్మర్ది సాయంతో తాంత్రిక పూజలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఎస్సైగా పనిచేస్తున్న కార్తీ వల్లభన్(ఆది సాయికుమార్‌) ఓ డ్రగ్‌ మాఫియాను పట్టుకునే క్రమంలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతాడు. వారం రోజుల్లోనే తన తప్పును సరిదిద్దుకోవాలని కార్తీని కమిషనర్ ఆదేశిస్తాడు. ఆ తర్వాత బెంగళూరులో జర్నలిజం చేస్తున్న సారా మహేశ్(అవికా గోర్) తన ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్‌కు వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఎస్సై కార్తీ వల్లభన్ సాయం కోరుతుంది. ఆ సమయంలోనే సారా తన రీసెర్చ్‌ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని కార్తీకి చెబుతుంది. అసలు ఆమె చేస్తున్న రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ ఏంటి? ఆరేళ్లుగా చేస్తున్న ఆ పరిశోధనలో కనిపెట్టిన అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్‌లకు ఏంటి సంబంధం? దీని వెనక ఏదైనా హ్యుమన్ ట్రాఫికింగ్ మాఫియా ఉందా? అసలు సారాను చంపాలనుకున్నది ఎవరు? చివరికీ ఈ ఇన్‌స్టిగేషన్ ప్రాజెక్ట్‌లో కార్తీ, సారా సక్సెస్ ‍అయ్యారా? లేదా? అన్నదే అసలు స్టోరీ.ఎలా ఉందంటే.. మనదేశంలో మూఢ నమ్మకాలు, క్షుద్రపూజలను నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తమ స్వార్థం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారనే పాయింట్‌ను కథగా ప్రేక్షకుల ముందుకొచ్చారు డైరెక్టర్‌ షణ్ముగం. గతంలోనూ ఇలాంటి జోనర్‌లో ఎన్నో సినిమాలు వచ్చినా ఈ స్టోరీని కాస్తా భిన్నంగా చూపించారు. కథను అడవుల్లో మొదలుపెట్టిన షణ్ముగం.. చివరికీ అడవుల్లోనే ముగించాడు. ఫస్ట్ హాఫ్ అంతా రోటీన్‌గా అనిపిస్తుంది. అద్భుతమైన ఫైట్ సీన్‌తో ఆది సాయి కుమార్‌ను ప్రేక్షకులను పరిచయం చేస్తాడు. ఆ తర్వాత జరిగే సీన్స్ ప్రేక్షకులకు ఊహకందేలా ఉంటాయి. ఆది సాయికుమార్, అవికా గోర్ లవ్ స్టోరీ కూడా అంతగా ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేదు. మొదటి భాగం అంతా ఇన్‌స్టిగేషన్‌ చుట్టే తిరుగుతుంది. కథలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ కాలేదు. అక్కడక్కడ కృష్ణుడు(సుబ్రమణ్యం)తో వచ్చే కామెడీ సీన్స్‌ కాస్తా నవ్వించినా అంతగా మెప్పించలేదు. కార్తీ, సారాల ఇన్‌స్టిగేషన్‌ ప్రాజెక్ట్ ట్విస్ట్‌లతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.సెకండాఫ్‌కు వచ్చేసరికి కథ మొత్తం సారా, కార్తీ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ చుట్టే తిరుగుతుంది. అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్‌ ట్విస్ట్‌లతో ఆడియన్స్‌లో కాస్తా కన్‌ఫ్జూజన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్‌. కొన్ని చోట్ల సీరియస్‌గా కథ సాగుతున్న సమయంలో కామెడీని తీసుకొచ్చి ప్రేక్షకుల్లో కనెక్షన్ మిస్సయ్యేలా చేశాడు. డైరెక్టర్‌ తీసుకున్న పాయింట్‌ మంచిదే.. కానీ తెరపై ఆవిష్కరించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. లాజిక్‌ పరంగా ఆలోచిస్తే కొన్ని చోట్ల సన్నివేశాల్లోనూ అది పూర్తిగా మిస్సయినట్లు కనిపించింది. కొన్ని సీన్స్ ఆడియన్స్‌ ఊహకందేలా ఉండడంతో కథనంలో క్యూరియాసిటీ మిస్సయింది. కథను మరింత ఆసక్తిగా మలచడంలో డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడు. క్లైమాక్స్ సీన్‌లో వచ్చే ట్విస్ట్‌లతో ప్రేక్షకులను కాసేపు కట్టిపడేశాడు. కానీ కొన్ని లాజిక్ లెస్ సీన్స్‌తో కథలో సీరియస్‌నెస్‌ అలాగే కొనసాగించలేకపోయాడు. ఓవరాల్‌గా దర్శకుడు తాను చెప్పాలనుకున్నా సందేశం మంచిదే అయినప్పటికీ.. కథనం, స్క్రీన్‌ప్లేపై మరింత ఫోకస్ చేసుంటే ఇంకా బాగుండేది. ఎవరలా చేశారంటే..ఆది సాయికుమార్ ఎస్సై పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. పోలీస్‌గా తన అగ్రెసివ్‌నెస్‌ చూపించాడు. చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇ‍చ్చిన అవికా గోర్ తెరపై కొత్తగా కనిపించింది. అయినప్పటికీ తన నటనతో మెప్పించింది. ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని కృష్ణుడు, అరియానా గ్లోరీ తమ పాత్రల పరిధిలో ఫర్వాలేదనిపించారు. సాంకేతికత విషయానికొస్తే ఆర్ఆర్ విష్ణు సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎంఏ మాలిక్ ఎడిటింగ్‌లో తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన నేపథ్యం సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.-మధుసూధన్, సాక్షి వెబ్‌ డెస్క్

Bihar CM Nitish Kumar Caught Laughing During National Anthem8
వింత చేష్టలు.. సీఎం నితీష్‌కు ఏమైంది?

పాట్నా: బీహార్‌ సీఎం నితిష్‌ కుమార్‌ (Bihar Cm Nitish Kumar) వివాదంలో చిక్కుకున్నారు.గురువారం పాట్నాలో జరిగిన స్పోర్ట్స్‌ ఈవెంట్‌ జరిగింది. ఆ ఈవెంట్‌కు హాజరైనవారందరూ జాతీయ గీతం (National Anthem) ఆలాపన చేస్తుంటే సీఎం నితీష్‌ వింతగా ప్రవర్తించారు. పక్కన ఉన్న వారిని కదిలిస్తూ, వారితో మాట కలుపుతూ, అభివాదం చేస్తూ కనిపించారు. ప్రస్తుతం, ఆ ఘటన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మన ముఖ్యమంత్రికి ఏమైంది? ఆయన బాగానే ఉన్నారు కదా? బాగుంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని బీహార్‌ ప్రజలు ప్రశ్నిస్తుంటే.. నెటిజన్లు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకి ఏమైందంటే?మార్చి 20 నుండి 25 వరకు పాట్నాలోని పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సెపక్ తక్రా ప్రపంచ కప్ -2025 (SepakTakraw World Cup 2025)పోటీలు ప్రారంభమయ్యాయి. గురువారం ఈ పోటీల్ని సీఎం నితీష్‌ కుమార్‌ ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయన చేసిన చేష్టలతో ప్రతిపక్షాల నుంచే కాదు,రాష్ట్ర ప్రజల నుంచి విమర్శలు చేయించుకునేలా ప్రవర్తించారు.कम से कम कृपया राष्ट्र गान का तो अपमान मत करिए मा॰ मुख्यमंत्री जी।युवा, छात्र, महिला और बुजुर्गों को तो आप प्रतिदिन अपमानित करते ही है।कभी महात्मा गांधी जी के शहादत दिवस पर ताली बजा उनकी शहादत का मखौल उड़ाते है तो कभी राष्ट्रगान का!PS: आपको याद दिला दें कि आप एक बड़े प्रदेश… pic.twitter.com/rFDXcGxRdV— Tejashwi Yadav (@yadavtejashwi) March 20, 2025 అసలేమైందంటే?సెపక్ తక్రా ప్రపంచ కప్ - 2025 ప్రారంభ వేడుకల్లో జాతీయ గీత ఆలాపన కార్యక్రమం జరిగింది. అందరూ జాతీయ గీతం ఆలపిస్తుంటే వేదికపై ఉన్న సీఎం నితీష్‌ మాత్రం తన పక్కనే జాతీయ గీతం ఆలాపన చేస్తున్న ఐఏఎస్‌ అధికారి, సీఎం నితీష్‌కుమార్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దీపక్‌ కుమార్‌ను కదిలించారు. దీంతో ఐఏఎస్‌ దీపక్‌ కుమార్‌.. నితీష్‌ను వద్దని వారించే ప్రయత్నించారు. బదులుగా ఇక చాలు.. చాలు అని సంజ్ఞలు చేస్తూ కనిపించారు.మీరు ముఖ్యమంత్రన్న విషయం మరిచిపోకండిఈ ఘటనపై ఆర్‌జేడీ నేత,మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. సీఎం సార్‌ మీరు ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రన్న విషయం మరిచిపోకండి. మానసికంగా, శారీరకంగా స్థిరంగా లేరు. ఈ స్థితిలో ఉండటం రాష్ట్రానికి చాలా ఆందోళన కలిగించే విషయం. ఇలా పదే పదే బీహార్‌ను అవమానించకండి. దయచేసి జాతీయగీతాన్నైనా గౌరవించండి. మీరు ప్రతిరోజూ యువత, విద్యార్థులు, మహిళలు, వృద్ధులను అవమానిస్తారు. కొన్నిసార్లు మహాత్మా గాంధీ అమరవీరుల దినోత్సవం నాడు చప్పట్లు కొడతారు. అమరవీరులను అపహాస్యం చేస్తారు.కొన్నిసార్లు మీరు జాతీయ గీతంపై చప్పట్లు కొడతారు’అని దుయ్యబట్టారు.

18 BJP MLAs suspended from Karnataka Assembly9
Karnataka : అసెంబ్లీలో గందరగోళం.. 18 మంది ఎమ్మెల్యేలపై వేటు

బెంగళూరు: హనీ ట్రాప్‌ (honey trap) దుమారంతో కర్ణాటక (Karnataka) అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. హనీట్రాప్‌ అంశంపై విచారణ చేపట్టాలని అసెంబ్లీలో ఆందోళన చేపట్టిన 18 మంది బీజేపీ (bjp) ఎమ్మెల్యేలపై స్పీకర్‌ యుటి ఖాదర్‌ సస్పెన్షన్‌ వేశారు. కాంట్రాక్ట్‌లలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానించింది. అయితే, ఆ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హనీట్రాప్‌పై సిట్టింగ్‌ జడ్జీతో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. హనీట్రాప్‌ను డైవర్ట్‌ చేసేందుకు ముస్లిం రిజర్వేజన్‌ అంశాన్ని సీఎం సిద్ధరామయ్య తెరపైకి తెచ్చారని ఆరోపణలు గుప్పించారు అంతేకాదు, హనీట్రాప్‌పై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ స్పీకర్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ముస్లిం రిజర్వేషన్ల పేపర్లను చించి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్‌ ముఖంపై విసిరేశారు. అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పోటాపోటీగా పేపర్లు చించి బీజేపీ ఎమ్మెల్యేలపై విసరడంతో గందరగోళం నెలకొంది. దీంతో అసెంబ్లీ స్పీకర్‌ బీజేపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు గాను బీజేపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు. సభ నుంచి 18 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆరు నెలల పాటు సభలో పాల్గొనకుండా అనర్హత వేటు వేస్తూ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ ప్రవేశపెట్టారు.

No love Keep Distance Bengaluru Cab Driver Warning Note goes viral10
ఇది ఓయో కాదు.. దూరం ప్లీజ్‌ : క్యాబ్‌ డ్రైవర్‌ నోట్‌ వైరల్‌

ప్రేమికులు ప్రైవసీ కోసం పార్క్‌లు, సినిమా థియేటర్లను వెతుక్కుంటారు. కాసేపు అచ్చిక బుచ్చికలు, మాటా ముచ్చట కావాలంటే ఇదొక్కటే మార్గం. ఆశ్చర్యకరంగా ఇపుడు ఈ జాబితాలో ప్రైవేట్‌ క్యాబ్‌లు కూడా చేరాయి. అటు భార్యాభర్తలకు కూడా మనసు విప్పిమాట్లాడుకునేందుకు ఇదో బెస్ట్‌ ఆప్షన్‌గా కనిపిస్తోంది హద్దు మీరనంతవరకు ఏదైనా బాగానే ఉంటుంది కానీ మరికొంతమంది మితి మీరుతున్నారు. తాజాగా ఒక క్యాబ్‌ డ్రైవర్‌ పెట్టిన నోటు దీనికి ఉదాహరణగా ని లుస్తోంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్‌అవుతోంది. తన క్యాబ్‌లో ప్రేమికుల వ్యవహారాలతో విసిగిపోయాడో ఏమోగానీ బెంగళూరు క్యాబ్ డ్రైవర్ తన కారులో ఒక నోట్‌ పెట్టాడు. జంటలను నో రొమాన్స్‌.. దూరంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి ఒకరికొకరు దూరం పాటించాలని హెచ్చరించారు. "హెచ్చరిక!! నో రొమాన్స్‌.. ఇది క్యాబ్, ప్రైవేట్ ప్లేసో, OYO కాదు.. సో దయచేసి దూరంగా, కామ్‌గా ఉండండి." అంటూ ఒక నోట్‌ పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. ఆలోచన రేకెత్తించింది. డ్రైవర్ ముక్కుసూటి తనం తెగ నచ్చేసింది నెటిజనులకు. హ్హహ్హహ్హ.. పాపం ఇలాంటివి ఎన్ని చూసి ఉంటాడో అని ఒకరు, డ్రైవర్లను తలచుకుంటే జాలేస్తోంది. కొంతమంది జంటలు క్యాబ్‌లో గొడవలు పెట్టుకోవడం, కొట్టుకోవడం గురించి విన్నాను.. అని ఒకరు వ్యాఖ్యానించగా, కనీసం ఇంటికి లేదా హోటల్‌కు చేరుకునే వరకు వేచి ఉండండ్రా బాబూ మరొకరు వ్యాఖ్యానించారు. బెంగళూరులోని డ్రైవర్లు క్యాబ్‌లో ఏదైనా రొమాంటిక్ ప్లాన్‌లను పునరాలోచించుకునేలా చేసే విషయాలను చూశారు. ఇది పూర్తిగా భిన్నమైన పట్టణ జీవితం!" అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. భారతదేశ స్టార్టప్ రాజధాని బెంగళూరు నగరంలో మాత్రమే జరిగే ఇలాంటి ఉదంతాలు హైలైట్‌గా నిలుస్తాయి. ఆన్‌లైన్ మీమ్‌లకు కేంద్రంగా ఉంటాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement