Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP In Parliament Raises Its Voice On AP Issues1
‘పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?’

ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, బడ్జెట్ లో పోలవరంకు కేటాయించిన నిధులు, పెరిగిన పోలవరం ప్రాజెక్టు ఖర్చు, విద్యారంగం తదితర అంశాలపై వైఎస్సార్‌సీపీ తన గళం వినిపించింది. ఉభయ సభల్లోనూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు కొన్ని కీలకాంశాలు లేవనెత్తారు.ఈరోజు(మంగళవారం) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీ గురుమూర్తి.. లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘పోలవరం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించారు. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 194 నుంచి కేవలం 115 టీఎంసీలకే పరిమితమవుతుంది. దీనివల్ల సాగునీరు, తాగు నీటికి , విద్యుత్తు ఉత్పత్తి పైన తీవ్ర ప్రభావం పడుతుంది. ఒరిజినల్ పోలవరం డ్యాం ఎత్తు ప్రకారమే నిర్మించాలి.ఇటీవల బడ్జెట్‌లో పోలవరంకు అరకొరగా రూ. 5936 కోట్లు మాత్రమే కేటాయించారు. పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?, పోలవరం సిఈఓ ఆఫీస్ ను ఏపీకి తరలించాలి. ఏపీలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతులు తీసుకుంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం లేఖతో కడప మెడికల్ కాలేజీ పర్మిషన్ ను ఉపసంహరించారు.మౌలిక వసతులు లేవనే రాష్ట్ర ప్రభుత్వం లేఖతో ..మెడికల్ కాలేజీలకు పర్మిషన్ వెనక్కి తీసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకూడదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తారా లేదన్న అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇస్తారా లేదో చెప్పాలి. దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ హామీని నిలుపుకోకపోవడం ప్రజలను మోసం చేయడమే. అమరావతికి ఇచ్చే 15000 కోట్ల రూపాయలను ఎవరు చెల్లిస్తారు?, అమరావతి అప్పులను ఎవరు చెల్లిస్తారనేది స్పష్టం చేయాలి’ అని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ విద్యారంగం అభివృద్ధి కృషి చేశారురాజ్యసభలో విద్యాశాఖ పద్దులపై వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ‘ వైఎస్ జగన్ హయాంలో ఏపీలో విద్యారంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విద్యా దీవెన, విద్యా వసతి దీవెన కింద రూ. 73 వేల కోట్లు రూపాయిలు విద్యార్థుల కోసం ఖర్చు చేశారు. 45 వేల ప్రభుత్వ పాఠశాలలను నందనవనంగా తీర్చిదిద్దారు. దీన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేశాయి. కాలేజీ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాలేజీలో కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలుగా మారిపోయాయి. ఎలాంటి నైపుణ్యాలు లేకుండా విద్యార్థులు బయటకు వస్తున్నారు’ అని ఎంపీ గొల్ల బాబురావు స్పష్టం చేశారు.

Baloch Liberation Army hijacking Jaffar Express in Bolan2
పాక్‌లో ట్రైన్‌ హైజాక్‌.. బందీలుగా 100 మందికి పైగా ప్రయాణికులు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌కు చెందిన ట్రైన్‌ హైజాక్‌ కలకలం రేపుతోంది. బలూచిస్థాన్‌ వేర్పాటు వాదులు పాక్‌ జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను (Jaffar Express) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు మొత్తం ప్రయాణికుల్లో 100కి పైగా బంధించారు. ఆరుగురు పాకిస్థాన్‌ జవాన్లను హ‌త‌మార్చారు. పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుండి పెషావర్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాకు తొమ్మిది బోగీలలో 450 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై వేర్పాటు వాదులు కాల్పులు జరిపారు. అనంతరం హైజాక్‌ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.ట్రైన్‌ హైజాక్‌పై బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (Baloch Liberation Army) అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రకటన మేరకు.. జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్రయాణికుల్ని హైజాక్ చేశాం. వారిలో పా​క్‌ సైన్యం, పోలీసులు, యాంటీ-టెర్రరిజం ఫోర్స్ (ఏటీఎఫ్‌), ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)యాక్టివ్ డ్యూటీ సిబ్బంది ఉన్నారు. వీరందరూ సెలవుపై పంజాబ్‌కు ప్రయాణిస్తున్నారు. ఈ విషయంలో పాకిస్థాన్ సైనిక జోక్యానికి ప్రయత్నిస్తే బందీలందరిని ఉరితీస్తామని హెచ్చరించింది.

JFCM Court In Kurnool Grants Bail To Posani Krishna Murali3
పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు

కర్నూల్: ఆదోని కేసులో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. నిన్న(సోమవారం) పోసానిని కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ కొట్టివేసిన జేఎఫ్‌సీఎం కోర్టు.. ఈ రోజు(మంగళవారం) బెయిల్ మంజూరు చేసింది. ఆదోని త్రీటౌన్ పీఎస్ లో జనసేన నేత రేణువర్మ ఫిర్యాదుతో 2024 నవంబర్ 14న కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 353(1) , 353(2), 353(సి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విజయవాడ నుంచి పిటి వారెంట్ పై అరెస్టు చేశారు. ఈనెల 5వ తేదీ నుంచి కర్నూలు జైలులో ఉన్నారు పోసాని. బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనల తరువాత నిన్న తీర్పు రిజర్వు చేశారు మేజిస్ట్రేట్. అయితే పోసానికి బెయిల్ పిటిషన్‌ను ప్రభుత్వ న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. పోసానిని మరింత విచారించాల్సి ఉందని, దూషణల వెనుక ఎవరు ఉన్నారో తేలాల్సి ఉందని, కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిన్ననే కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసిన మేజిస్ట్రేట్.. ఈ రోజు బెయిల్ మంజూరు చేశారు.దాంతో పోసాని కృష్ణమురళికి ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ లభించింది. నరసరావుపేటలో నమోదైన కేసులో పోసానికి నిన్న బెయిల్ మంజూరైంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో నరసరావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్‌ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్‌ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్‌ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన పిటిషన్లు వేశారు. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ దశలో ఉంది.

Chandrababu Government Revises Stand on Annadata Sukhibhava Scheme4
రైతన్న దగా.. అన్నదాత సుఖీభవపై చంద్రబాబు సర్కార్‌ యూటర్న్‌

సాక్షి,విజయవాడ : రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ రైతన్నను దగా చేసింది. అన్నదాత సుఖీభవపై యూటర్న్‌ తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. ఇప్పుడు రైతులకు ఇచ్చేది రూ.14వేలేనని తేల్చి చెప్పింది. అన్నదాత సుఖీభవపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన ఇచ్చారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలుతో కలిపి రూ.20 వేలు ఇస్తామని, మేనిఫెస్టోలో కూడా అదే చెప్పాము అంటూ అబద్ధాలు చెప్పారు. అయితే, మేనిఫెస్టోలో రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎక్కడ కేంద్రం సహాయం ఇస్తేనే అన్నదాత సుఖీభవ ఇస్తామని ప్రస్తావించలేదు. ఇప్పుడు అధికారంలోకి రాగానే రైతులకు ఎగనామం పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.14 వేలే ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రైతన్నులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Hardik Pandya Gives Tear-Jerking Homage To Father After CT Win5
Hardik Pandya: ఈ విజయం ఆయనకే అంకితం.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం

భార‌త క్రికెట్ జ‌ట్టు.. 12 ఏళ్ల త‌ర్వాత ఛాంపియ‌న్స్ ట్రోఫీని అందుకుంది. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ను సొంతం చేసుకున్న టీమిండియా.. న్యూజిలాండ్‌పై పాతికేళ్ల నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. భార‌త్‌కు ఇది మూడో ఛాంపియ‌న్స్ ట్రోఫీ టైటిల్ కావ‌డం విశేషం. 2002లో తొలిసారిగా ఈ మెగా టోర్నీ టైటిల్‌ను భార‌త్‌కు సౌర‌వ్ గంగూలీ అందించ‌గా.. ఆ త‌ర్వాత 2013 ఎంస్ ధోని సార‌థ్యంలో తిరిగి మ‌ళ్లీ ఛాంపియ‌న్స్‌గా నిలిచింది. మ‌ళ్లీ ఇప్పుడు పన్నెండేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో ఈ ట్రోఫీ భార‌త్ సొంత‌మైంది. టీమిండియా ఛాంపియ‌న్స్‌గా నిల‌వ‌డంలో స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)ది కీల‌క పాత్ర‌. ఈ టోర్నీ అసాంతం త‌న ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌త్‌కు వెన్న‌ముక‌గా నిలిచాడు.ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన సెమీఫైన‌ల్లో హార్దిక్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్ప‌టికి అభిమానుల‌కు గుర్తుండిపోతుంది. అంతేకాకుండా పాకిస్తాన్‌పై కూడా సంచ‌ల‌న స్పెల్‌ను పాండ్యా బౌల్ చేశాడు. ఇక ఈ విజ‌యాన్ని త‌న దివంగ‌త తండ్రికి హార్దిక్ పాండ్యా అంకిత‌మిచ్చాడు. తను సాధించిన ప్రతీ విజయం వెనుక తన తండ్రి దీవెనలు ఉన్నాయి పాండ్యా చెప్పుకొచ్చాడు."నేను, నా సోదరుడు ఏ స్ధాయి నుంచి ఇక్కడికి చేరుకున్నామో మాకు బాగా తెలుసు. ఇప్పటికీ మాకు ఇది ఒక కలలానే ఉంది. కానీ ఈ విషయం గురుంచి మేము ఎప్పుడూ ఎక్కువ‌గా ఆలోచించలేదు. ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, కష్టపడి పనిచేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. మేము సాధించిన విజ‌యాల‌ను చూసి మా త‌ల్లిదండ్రులు సంతోషించారు. మా నాన్న బౌతికంగా మాకు దూర‌మైన‌ప్ప‌టికి.. ఆయ‌న ఆశీర్వాదాలు మాకు ఎప్ప‌టికి ఉంటాయి. ఆయన పై నుంచి అన్ని చూస్తున్నారు" అంటూ హార్దిక్ ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భావోద్వేగానికి లోన‌య్యాడు. కాగా హార్దిక్‌, కృనాల్‌ తండ్రి 2021లో గుండెపోటుతో మరణించారు.అదేవిధంగా 2017 ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ ఓట‌మిపై కూడా హార్దిక్ మాట్లాడాడు. "ఈ ఎనిమిదేళ్ల కాలంలో భార‌త క్రికెట్ జ‌ట్టు చాలా విజ‌యాలు సాధించింది. ఏదేమైన‌ప్ప‌టికి ఎట్ట‌కేల‌కు ఛాంపియన్స్ ట్రోఫీని సొంతంచేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. అందరూ స్వదేశానికి తిరిగి వెళ్లి సంబరాలు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. భార‌త జ‌ట్టులో సీనియర్లు, జూనియ‌ర్లు అంటూ తార‌తామ్యాలు ఉండ‌వు.. డ్రెసింగ్ రూమ్‌లో అంద‌రం క‌లిసిమెలిసి ఉంటాము. నా ప‌దేళ్ల కెరీర్‌లో చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఇప్పటివరకు నేను నేర్చుకున్నది, నా అనుభవాలను కొత్త‌గా వ‌చ్చిన ఆట‌గాళ్ల‌తో పంచుకుంటూ ఉంటాను. అది అత‌డికి మాత్ర‌మే కాకుండా జ‌ట్టుకు కూడా ఉప‌యోగప‌డుతుందని పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2017 ఫైన‌ల్లో పాకిస్తాన్ చేతిలో భార‌త్ ఓట‌మి చూసిన సంగ‌తి తెలిసిందే.339 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో టీమిండియా చ‌తిక‌ల‌ప‌డింది. హార్దిక్ పాండ్యా 76 ప‌రుగులతో ఫైటింగ్ నాక్ ఆడిన‌ప్ప‌టికి జ‌ట్టును మాత్రం ఓట‌మి నుంచి త‌ప్పించ‌లేక‌పోయాడు. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్‌ను చిత్తు చేసి గ‌త ఓట‌మికి భార‌త్ బ‌దులు తీర్చుకుంది.చదవండి: IPL 2024: ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్‌ అయ్యర్‌

Airtel tied up with Elon Musk Starlink to provide internet in India6
భారత్‌లో స్టార్‌లింక్‌.. ఎలాన్‌ మస్క్‌తో ఎయిర్‌టెల్ డీల్‌

ఢిల్లీ : ప్ర‌ముఖ టెలికాం దిగ్గ‌జం ఎయిర్‌టెల్ శుభ‌వార్త చెప్పింది. త‌న వినియోగ‌దారుల‌కు హైస్పీడ్ ఇంట‌ర్నెట్‌ను అందించేందుకు అపరకుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని భారత్‌లో ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు అందించనున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. ఈ సంద‌ర్భంగా ఎయిటెల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్, వైస్ ఛైర్మ‌న్ గోపాల్ మిట్ట‌ల్ మాట్లాడుతూ.. భార‌త్‌లో ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని అందించేందుకు స్పేఎక్స్‌తో ప‌నిచేయ‌డం ఓ మైలురాయి. ముఖ్యంగా క‌స్ట‌మ‌ర్ల‌కు శాటిలైట్ ఇంట‌ర్నెట్‌ను అందించేందుకు సంస్థ క‌ట్టుబ‌డి ఉంది. ఎయిర్‌టెల్, స్పేస్‌ఎక్స్ ఒప్పందంలో భాగంగా ఎయిర్‌టెల్ రిటైల్ స్టోర్లలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని పొందేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఎక్విప్‌మెంట్ పొంద‌వ‌చ్చు. దీంతో పాటు భార‌త్‌లో మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, తదితర వాటిని కనెక్ట్ చేసేందుకు ఈ డీల్ ఉప‌యోగ‌ప‌డనుంద‌ని తెలిపారు. ఎలాన్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్ర‌పంచ వ్యాప్తంగా స్టార్‌లింక్ పేరుతో శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని అందిస్తోంది. దీంతో పాటు మొబైల్ బ్రాడ్ బ్యాండ్‌ను అందించే ల‌క్ష్యంతో ప‌నిచేస్తోంది. త‌ద్వారా యూజ‌ర్లు స్ట్రీమింగ్, వీడియో కాల్స్, ఆన్‌లైన్ గేమింగ్, రిమోట్ వర్కింగ్ కార్య‌క‌లాపాలు సులభతరం కానున్నాయి. ఇప్పుడే ఈ సంస్థతో ఎయిర్‌టెల్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

Take Back Words If Derogatory M Kharge7
‘పెద్దల’ సభలో మల్లికార్జున్ ఖర్గే క్షమాపణలు

న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఈరోజు(మంగళవారం) చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ఆయన ఎట్టకేలకు దిగిచ్చారు. తాను చేసినవ్యా ఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, అందుకు క్షమాపణలు తెలుపుతున్నానని అన్నారు. దీనిలో భాగంగా డిప్యూటీ చైర్మన్ హ‌రివంశ్‌ నారాయణ్‌ సింగ్‌క​ఉ క్షమాప‌ణ‌లు చెప్పారు.జాతీయ ఎడ్యుకేషన్ పాలసీపై తాము చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మంత్రి ధర్మంద్ర ప్రదాన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆ క్రమంలోనే ప్రభుత్వాని తోసి వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఆయన వ్యాఖ్యలు అవమానకంగా ఉన్నాయని, అసభ్య పదజాలాన్ని వాడారని, అది క్షమించరానిదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.ఆ వ్యాఖ్యలకు కచ్చితంగా ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిం‍దేనని డిమాండ్ చేశారు అదే సమయంలో ఆయన వాడిన పదాన్ని కూడా రికార్డులనుండి తొలగించాలన్నారు. దాంతో దిగి వచ్చిన ఖర్గే.. రాజ్యసభ చైర్మన్ కు క్షమాపణలు తెలియజేశారు. ‘నేను ఇక్కడ సభను ఉద్దేశించో, లేక మిమ్మల్ని( రాజ్యసభ చైర్మన్ చైర్)ను ఉద్దేశించో ఆ వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ప్రభుత్వ విధానాలపైనే ఆ వ్యాఖ్యలను చేశాను. ఆ వ్యాఖ్యలు మీకు అభ్యంతరకరంగా ఉంటే వెనక్కి తీసుకుంటాను. అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని ఖర్గే పేర్కొన్నారు.ఇదిలా ఉంటే, తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్‌ మోషన్ ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తమిళిలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది మా ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు.

IndusInd Bank CEO Views Crisis as a Defining Moment8
ఒకేరోజు 27 శాతం కుప్పకూలిన బ్యాంకు స్టాక్‌.. కారణం..

దేశీయ ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు ధర మంగళవారం ఒక్కరోజే సుమారు 27 శాతం కుప్పుకూలింది. నిన్నటి సెషన్‌లో షేరు ధర రూ.900.5 ముగింపు నుంచి ఈ రోజు ముగింపు సమయానికి రూ.655 వద్దకు చేరింది. బ్యాంకు ఎదుర్కొంటున్న సవాళ్లపై సీఈఓ సుమంత్ కత్పాలియా మాట్లాడుతూ ప్రస్తుతం బ్యాంకుకు ఇది ‘లిట్మస్‌ టెస్ట్‌’గా అభివర్ణించారు. బ్యాంకు పాలన, నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తిన కీలక పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కత్పాలియా పదవీకాలాన్ని మూడేళ్ల పాటు పొడిగించాలని బోర్డు సిఫారసు చేసినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక సంవత్సరం వరకు మాత్రమే తన పదవీకాలం పొడిగింపును ఆమోదించింది. తన నాయకత్వ నైపుణ్యాల గురించి ఆర్‌బీఐకి ఆందోళనలు ఉండవచ్చునని కత్పాలియా అన్నారు. ఏదేమైనా ఆర్‌బీఐ నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు బ్యాంకు షేర్‌ ధర పడిపోవడానికి కారణమైనట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీఈఓ స్థాయి వ్యక్తే ఇలా తన సామర్థ్యాలను అంగీకరించడంపట్ల​ ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తం అయినట్లు తెలిపారు.ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ మోసాల కట్టడికి వినూత్న విధానంఅంతర్గత ఆడిట్‌లో బ్యాంక్ డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో వ్యత్యాసాలున్నట్లు గుర్తించారు. ఇది డిసెంబర్ 2024 నాటికి ఉన్న లెక్కల ప్రకారం బ్యాంకు నికర విలువలో సుమారు 2.35% అంటే సుమారు రూ.1530 కోట్లుగా ఉన్నట్లు తేల్చారు. ఈ వ్యత్యాసాలపై స్వతంత్ర సమీక్ష నిర్వహించడానికి ఇండస్ ఇండ్ బ్యాంక్ బాహ్య ఆడిటర్‌ను నియమించింది. బ్యాంక్ వృద్ధి ఎజెండా చెక్కుచెదరకుండా ఉందని, ఈ సవాళ్లను పారదర్శకంగా పరిష్కరించడానికి నాయకత్వ బృందం కట్టుబడి ఉందని కత్పాలియా వాటాదారులకు హామీ ఇచ్చారు.

AP High Court Dismissed Avuthu Sridhar Custody Petition9
ఏపీ హైకోర్టులో కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ

అమరావతి, సాక్షి: కూటమి సర్కార్‌కు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ అవుతు శ్రీధర్‌ రెడ్డి రిమాండ్‌ పోలీసులు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని ఆదేశిస్తూ.. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.శ్రీధర్‌ రెడ్డి అరెస్టులో పోలీసులు అత్యుత్సాహం చూపించారన్న న్యాయస్థానం.. రిమాండ్‌ విధించిన కింది కోర్టు తీరును కూడా తప్పుబట్టింది. ఇదిలా ఉంటే.. అక్రమ కేసులో అవుతు శ్రీధర్ రెడ్డిని ఫిబ్రవరి 24వ తేదీన విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టు ఆయనకు మార్చి 10వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది.

Director Shankar Gets Relief As Madras High Court From Enthiran Copyright Case10
కాపీరైట్‌ కేసు.. హైకోర్టులో డైరెక్టర్‌ శంకర్‌కి భారీ ఊరట!

కోలీవుడ్‌ డైరెక్టర్‌ శంకర్‌( Shankar )కు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు మద్రాస్‌ కోర్టు ఊరట కల్పించింది. రోబో సినిమా కథ విషయంలో కాపీరైట్‌(Copyright Case) ఉల్లంఘనకు పాల్పడ్డారని శంకర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయనకు సంబంధించిన సుమారు రూ. 10 కోట్ల ఆస్తులను కొద్దిరోజుల క్రితమే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. అయితే, ఈడీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ.. మరోసారి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. గతంలో తనకు అనుకూలంగా ఇచ్చిన కోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ఈడీ చర్యలు తీసుకోవడం ఏంటి అంటూ మరోసారి కోర్టుకు వెళ్లారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది.తాను ఎలాంటి కాపీరైట్‌ ఉల్లంఘనకు పాల్పడలేదని మద్రాస్‌ హైకోర్టులో కొద్దిరోజల క్రితమే శంకర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈరోజు (మార్చి 11) న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, ఎన్. సెంథిల్‌కుమార్‌ల సెషన్‌లో విచారణకు వచ్చింది. ఆ సమయంలో శంకర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పీఎస్ రామన్.. రోబో సినిమా కథ విషయంలో శంకర్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించలేదని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి వారు గతంలోనే శంకర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారని గుర్తుచేశారు. అయినప్పటికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వారు శంకర్‌ ఆస్తులను జప్తు చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సినిమాకు సంబంధంలేని ఆస్తులను కూడా ఈడీ ఎలా జప్తు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. దీంతో కేసును విచారించిన న్యాయమూర్తులు.. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం సాధ్యమేనా..? అని ఈడీని ప్రశ్నించారు.దర్శకుడు శంకర్‌కు అనుకూలంగా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చినప్పుడు తుది ఫలితం వచ్చే వరకు వేచి చూడకుండా ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లాయర్ స్పందిస్తూ.. నేరం రుజువైతే ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కేసు నమోదు చేయవచ్చని తెలిపారు. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ చర్యల వల్ల డైరెక్టర్ శంకర్‌కు ఎలాంటి నష్టం జరగలేదని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌తో ఈ కేసును ఎదుర్కోవచ్చని ఆయన తెలిపారు. కానీ, ఈడీని కోర్టు తప్పబట్టింది. శంకర్‌ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖను ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేశారు.ఏం జరిగిందంటే..?సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సైంటిఫిక్‌ యాక్షన్‌ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్‌ పేరుతో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. అయితే, ఈ కథను ‘జిగుబా’ను కాపీ కొట్టిసినిమా తెరకెక్కించారంటూ అరూర్‌ తమిళనాథన్‌ అనే వ్యక్తి 2011లోనే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాపీరైట్‌ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని పిటిషన్‌లో తెలిపారు. ఈ కేసు విషయంలో ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నివేదిక శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. దీంతో శంకర్‌ కాపీరైట్‌ చట్టంలోని సెక్షన్‌ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
‘పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?’

ఢిల్లీ:  పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు,  బడ్జెట

title
జట్కా మ‌ట‌న్ అంటే ఏంటి, ఎక్క‌డ దొరుకుతుంది?

హ‌లాల్ గురించి మాంసం ప్రియుల‌కు తెలిసే ఉంటుంది. ముస్లింల దుకాణాల్లో హ‌లాల్ చేసిన మాంసాన్ని విక్ర‌యిస్తుంటారు.

title
‘పెద్దల’ సభలో మల్లికార్జున్ ఖర్గే క్షమాపణలు

న్యూఢిల్లీ:  ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే రాజ

title
రాజధానికి కేంద్రం నిధులపై స్పష్టత లేదు: వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి

ఢిల్లీ: ఏపీ రాజధాని నిర్మాణం కోసం కేంద్రం అందించే నిధులపై స్

title
నటి రన్యారావు కేసులో కీలక మలుపు

సినీ నటి రన్యారావు కీలక నిందితురాలిగా ఉన్న బంగారం అక్రమ రవాణా కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

NRI View all
title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

title
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు  ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి  పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

title
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’

అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో  మెడికల్‌ కాన్ఫరెన్స్‌ ఘనంగా జరిగింది.

title
డాక్టర్‌ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!

డొమినికన్ రిపబ్లిక్‌లో  కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

International View all
title
పాక్‌లో ట్రైన్‌ హైజాక్‌.. బందీలుగా 100 మందికి పైగా ప్రయాణికులు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌కు చెందిన ట్రైన్‌ హైజాక్‌ కలకలం రేప

title
బెలూచిస్తాన్‌ ఎందుకు భగ్గుమంటోంది?

బెలూచిస్తాన్‌ , ఖైబర్‌ పక్తున్‌ఖ్వాల మీద పాకిస్తాన్‌ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని ఫిబ్రవరి 18న అక్కడి మత, రాజకీయ నాయకుడు

title
రాజా.. ఐ లవ్ యూ రాజా!

బూజు పట్టిన రాజరికాన్ని నేపాల్ ప్రజలు 19 ఏళ్ల క్రితమే వదిలించుకున్నారు.

title
స్వర్గం భూమ్మీదకు వచ్చిందా?.. అందాల లోకం.. వారెవ్వా వనాటు

స్వర్గం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు?.

title
శాంతి చర్చల వేళ.. ఎయిర్‌స్ట్రైక్స్‌తో భీకర దాడులు

కీవ్‌: శాంతి చర్చల వేళ రష్యా సైన్యం(Russia Military) భీకర దా

Advertisement

వీడియోలు

Advertisement