Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Big Relief To Posani Krishna Murali From Cases Of AP Govt1
పోసానికి బిగ్ రిలీఫ్.. రేపు విడుదలయ్యే అవకాశం!

తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసుల్లో ప్రముఖ నటుడు, ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి రేపు(బుధవారం) విడుదలయ్యే అవకాశం ఉంది. పోసానిపై పెట్టిన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈరోజు(మంగళవారం), ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్ లభించగా, నిన్న(సోమవారం) నర్సారావుపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతకుముందు రాజంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అయితే పోసానిపై పెట్టిన మొత్తం 17 కేసుల్లో మిగత వాటిల్లో బీఎన్ఎస్ చట్టం 35(3) కింద నోటీసులు ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. దాంతో పోసానికి బిగ్ రిలీఫ్ లభించింది. కాగా, మహాశివరాత్రి రోజు, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో పోసానిని అరెస్టు చేశారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు. ఏపీ ప్రభుత్వం కుట్రలు..ఏళ్ల కిందట ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలకు ఇప్పడు కేసులు పెట్టారు. పోసానికి న్యాయపరమైన ఊరట లభించకుండా ప్రభుత్వం పన్నాగం పన్నింది. అన్నమయ్య పోలీసుల అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై కేసులు నమోదు చేశారు. ఎక్కడెక్కడ కేసులు పెట్టింది కూడా బయటకు రానీయకుండా పోలీసులతో సర్కారు కుట్రలు చేసింది. తద్వారా బెయిల్స్ పిటిషన్లు వేయకుండా ప్రయత్నాలు చేసింది. వందల కిలోమీటర్లు తిప్పారు..ఒక్కో కేసులో పీటీ వారెంట్‌ కోరుతూ పోసానిని వందలకొద్దీ కిలోమీటర్లు తిప్పారు పోలీసులు.హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా రాజంపేటకు..తర్వాత అక్కడ నుంచి నర్సరావుపేటకు, తర్వత గుంటూరుకు, అక్కడ నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి, అదోని నుంచి మళ్లీ విజయవాడలోని సూర్యారావుపేటకు తిప్పారు. అపై అక్కడ నుంచి మళ్లీ కర్నూలు జైలుకు తరలించారు. అయితే 67 ఏళ్ల వయసులో, హృద్రోగ సమస్యలతో బాధ పడుతున్న పోసానిని అనారోగ్య సమస్యలున్నా వేధించింది ప్రభుత్వం. ఈ కుట్రను వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ హైకోర్టుకు నివేదించి సమర్థవంతంగా వాదనలు వినిపించింది. పోసానిపై నమోదైన కేసులో 35(3)నోటీసు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. విశాఖపట్నం ఒన్‌టౌన్లో నమోదైన కేసులో పూర్తిగా విచారణను నిలిపేయాలని ఆదేశాలిచ్చింది.పోసానికి అండగా వైఎస్సార్‌సీపీహైకోర్టు ఆదేశాల తర్వాత చురుగ్గా దిగువ కోర్టుల్లో న్యాయ స్థానాలను వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ ఆశ్రయించింది. పోసానికి పూర్తిగా అండగా ఉంది వైఎస్సార్ సీపీ. దాంతో అన్ని కేసుల్లోనూ పోసాని బెయిల్ పొందడంతో రేపు విడుదలయ్యే అవకాశం కనబడుతోంది.

AB de Villiers Turns Back The Clock, Slams 15 Sixes, Completes Century In 28 Balls2
ఏబీ డివిలియ‌ర్స్ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచ‌రీ

ద‌క్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియ‌ర్స్‌ త‌న ప్రొఫెషనల్ క్రికెట్ రీ ఎంట్రీ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్‌-2021 తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్‌.. తిరిగి సీఎస్‌ఎ లీగ్‌తో పునరాగమనం చేశాడు. ఈ లీగ్‌లో టైటాన్ లెజెండ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డివిలియర్స్‌.. బుల్స్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.ఏబీడీ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటినుంచే బౌండరీల వర్షం కుర్పించాడు. ఈ క్రమంలో డివిలియర్స్ కేవలం 28 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 15 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడి తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో బుల్స్ లెజెండ్స్ 14 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఆ తర్వాత వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో టైటాన్ లెజెండ్స్‌ను విజేతగా ప్రకటించారు.డివిలియర్స్ ద‌క్షిణాఫ్రికా త‌రుపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. మే 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి త‌ప్పుకుని అంద‌రికి ఏబీడీ షాకిచ్చాడు. ఆ త‌ర్వాత 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఆడాల‌ని డివిలియ‌ర్స్ భావించాడు. కానీ అత‌డి అభ్య‌ర్థ‌న‌ను క్రికెట్ దక్షిణాఫ్రికా తిరస్కరించింది. డివిలియ‌ర్స్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 20,014 ప‌రుగులు ఉన్నాయి. అదేవిధంగా 47 ఇంట‌ర్ననేష‌న‌ల్ సెంచ‌రీలు అత‌డి పేరిట ఉన్నాయి.డివిలియ‌ర్స్‌కు ఐపీఎల్‌లో కూడా మంచి రికార్డు ఉంది. 2011-2021 వరకు 11 ఏళ్లపాటు రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bengaluru) తరఫున ఆడాడు. అంత‌కుముందు కొన్ని సీజన్ల పాటు ఢిల్లీ డెర్‌డేవిల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఐపీఎల్‌లో మొత్తం 184 మ్యాచ్‌ల్లో 39.71 సగటు, 151.69 స్ట్రైక్‌రేట్‌తో 5,162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 అర్ధ సెంచరీలున్నాయి.చదవండి: #R Ashwin: ఛాంపియ‌న్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్‌.. రోహిత్ శ‌ర్మ‌కు షాక్‌

Amrutha Responds to Verdict in Pranay Case3
Amrutha : ప్రణయ్‌ కేసులో కోర్టు తీర్పు.. అమృత ఏమన్నారంటే

సాక్షి,హైదరాబాద్‌ : నల్లగొండలో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసు (Pranay Murder case) నిందితులకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు శిక్ష విధించింది. ప్రణయ్‌ను దారుణంగా చంపిన సుభాష్‌ శర్మకు ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పుపై అమృత తొలిసారి స్పందించారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత తమకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ తీర్పుతోనైనా పరువు పేరిట జరిగే దారుణాలు ఆగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తన బిడ్డ పెరుగుతున్నాడని, అతడి భవిష్యత్తును, తన మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీడియా ముందుకు రాలేకపోతున్నట్లు తెలిపారు. దయచేసి తమను అర్థం చేసుకోవాలని కోరారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి అమృత కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు సంచలన తీర్పుతెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్‌(24)ను దారుణంగా చంపిన సుభాష్‌ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.అమృత వర్షిణి-ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్‌ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్‌ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్‌ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను అంతమొందించాడు. 👉ఆరేళ్లకు పైగా ప్రణయ్‌ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్‌ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.👉2018లో ప్రణయ్‌- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్‌ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు.👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్‌(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది.👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది.👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్‌), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్‌ ఓనర్‌)గా ఉన్నారు.👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్‌ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్‌ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్‌ చేసింది.👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు👉నిందితుల్లో అస్ఘర్‌ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్‌ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్‌ హత్య స్కెచ్‌ను అస్ఘర్‌ అమలు పరిచాడు.

Andhra Pradesh Coalition Government Copies Disha App And Replaces It With The Sakthi App4
మక్కీకి మక్కీ దిశ యాప్‌ను కాపీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం

సాక్షి, విజయవాడ : వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా తన హయాంలో దిశ యాప్‌కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం అందుబాటులోకి తెచ్చిన యాప్‌ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ యాప్‌ను నిర్విర్యం చేసింది. తాజాగా అదే యాప్‌ను కూటమి ప్రభుత్వం కాపీ కొట్టింది. మక్కీకి మక్కీ దిశ యాప్ ఫీచర్ల తోనే శక్తి యాప్ రూపొందించింది. ఆ యాప్‌ వివరాల్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో దిశ యాప్‌ని చంద్రబాబు, హోంమంత్రి అనిత ఎగతాళి చేశారు. అదే దిశ యాప్‌ని కాపీ కొట్టి నేడు అమలు చేయడం గమనార్హం

Largest drone attack of war hits Moscow region5
రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ అటాక్‌

మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడికి దిగిన కొన్ని గంటల వ్యవధిలోనే దానికి ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంది. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది. ఉక్రెయిన్. 337 డ్రోన్లతో ఉక్రెయిన్ మెరుపు దాడులకు దిగింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన ముగ్గురు మృతిచెందగా 18 మంది తీవ్రంగా గాయపడినట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ దాడితో రష్యా అప్రమత్తమైంది. 337 డ్రోన్లలో 91 డ్రోన్లను కూల్చేసింది. ఒకవైపు శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూనే రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు పరస్పరం మెరుపు దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శాంతి చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది. రష్యా సైన్యం భీకర దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రాజధాని కీవ్‌ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పై వైమానిక దాడులకు తెగ బడింది. అయితే.. ఆ దాడుల్ని తమ దేశ వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంటోందని కీవ్‌ మేయర్‌ విటాలి కీచ్‌కోస్‌ తెలిపారు. తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని కీవ్‌(Kyiv)లోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. మరోవైపు.. సౌదీ అరేబియాలో ఉక్రెయిన్‌, అమెరికా అధికారులుశాంతి చర్చలు(జరపనున్నారు. ఈ నేపథ్యాన్ని పట్టించుకోకుండా రష్యా దాడుల ఉధృతిని పెంచింది. రెండు రోజుల కిందట ఖర్‌కీవ్‌ రీజియన్‌లోని డోబ్రోపిలియా నగంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో విధ్వంసం చోటు చేసుకుంది. దాడుల్లో 14 మంది మరణించగా.. 37 మంది గాయపడ్డారు. ఈ దాడులతో రష్యా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ.. తమ పౌరుల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామన్నారు.

YSRCP In Parliament Raises Its Voice On AP Issues6
‘పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?’

ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, బడ్జెట్ లో పోలవరంకు కేటాయించిన నిధులు, పెరిగిన పోలవరం ప్రాజెక్టు ఖర్చు, విద్యారంగం తదితర అంశాలపై వైఎస్సార్‌సీపీ తన గళం వినిపించింది. ఉభయ సభల్లోనూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు కొన్ని కీలకాంశాలు లేవనెత్తారు.ఈరోజు(మంగళవారం) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీ గురుమూర్తి.. లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘పోలవరం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించారు. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 194 నుంచి కేవలం 115 టీఎంసీలకే పరిమితమవుతుంది. దీనివల్ల సాగునీరు, తాగు నీటికి , విద్యుత్తు ఉత్పత్తి పైన తీవ్ర ప్రభావం పడుతుంది. ఒరిజినల్ పోలవరం డ్యాం ఎత్తు ప్రకారమే నిర్మించాలి.ఇటీవల బడ్జెట్‌లో పోలవరంకు అరకొరగా రూ. 5936 కోట్లు మాత్రమే కేటాయించారు. పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?, పోలవరం సిఈఓ ఆఫీస్ ను ఏపీకి తరలించాలి. ఏపీలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతులు తీసుకుంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం లేఖతో కడప మెడికల్ కాలేజీ పర్మిషన్ ను ఉపసంహరించారు.మౌలిక వసతులు లేవనే రాష్ట్ర ప్రభుత్వం లేఖతో ..మెడికల్ కాలేజీలకు పర్మిషన్ వెనక్కి తీసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకూడదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తారా లేదన్న అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇస్తారా లేదో చెప్పాలి. దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ హామీని నిలుపుకోకపోవడం ప్రజలను మోసం చేయడమే. అమరావతికి ఇచ్చే 15000 కోట్ల రూపాయలను ఎవరు చెల్లిస్తారు?, అమరావతి అప్పులను ఎవరు చెల్లిస్తారనేది స్పష్టం చేయాలి’ అని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ విద్యారంగం అభివృద్ధి కృషి చేశారురాజ్యసభలో విద్యాశాఖ పద్దులపై వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ‘ వైఎస్ జగన్ హయాంలో ఏపీలో విద్యారంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విద్యా దీవెన, విద్యా వసతి దీవెన కింద రూ. 73 వేల కోట్లు రూపాయిలు విద్యార్థుల కోసం ఖర్చు చేశారు. 45 వేల ప్రభుత్వ పాఠశాలలను నందనవనంగా తీర్చిదిద్దారు. దీన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేశాయి. కాలేజీ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాలేజీలో కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలుగా మారిపోయాయి. ఎలాంటి నైపుణ్యాలు లేకుండా విద్యార్థులు బయటకు వస్తున్నారు’ అని ఎంపీ గొల్ల బాబురావు స్పష్టం చేశారు.

Janhvi Kapoor Not Sleep 3 Days For Song Shoot7
ఆ పాట వల్ల మూడురోజులు నిద్రపోలేదు: జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీలో పలు సినిమాలు చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఎన్టీఆర్ 'దేవర'తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీలో నటిస్తోంది.తాజాగా తాను నటించిన రూహి సినిమాకు నాలుగేళ్లు పూర్తయిన సందర్బంగా ఈ మూవీలో 'నదియో పార్' పాట చిత్రీకరణ అనుభవాల్ని పంచుకుంది. దీని షూటింగ్ టైంలో తాను చాలా టెన్షన్ పడ్డాడని, మూడు రోజులు నిద్రపోలేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)'రూహి సినిమా తీసే సమయానికి నటిగా నాకున్న అనుభవం చాలా తక్కువ. దీంతో నదియో పార్ పాట విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. భారీ లైట్స్ వెలుగులో కళ్లు తెరిచి చూడలేకపోయేదాన్ని. ఓవైపు 'గుడ్ లక్ జెర్రీ' షూటింగ్ లో పాల్గొంటూనే ఈ పాట రిహార్సల్స్ చేసేదాన్ని. పటియాలాలో రాత్రంతా షూట్ చేసి.. పేకప్ తర్వాత ప్రయాణం చేసొచ్చి పాట షూటింగ్ లో పాల్గొనేదాన్ని.''నిద్రలేకపోయినా 7 గంటల్లో ఆ పాట పూర్తిచేయగలిగాను. మళ్లీ వెంటనే గుడ్ లక్ జెర్రీ షూటింగ్ కి వెళ్లేదాన్ని. అలా మూడురోజుల పాట నిద్రపోలేకపోయాను. కానీ కెమెరా ముందుకొచ్చేసరికి మాత్రం ఎనర్జీ వచ్చేసేది' అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Health Tips: Why You Should Pair Beetroot With Buttermilk8
బీట్‌రూట్‌ని మజ్జిగతో కలిపి తీసుకోవచ్చా..?

మాములుగా బీట్‌రూట్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. దీన్ని జ్యూస్‌ రూపంలో లేదా కూర రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే కొన్నింటిని కొన్ని రకాల ఆహారాలతో జత చేసి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!.బీట్‌రూట్‌ ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్ల మూలం. దీన్ని మజ్జిగతో జత చేసి తీసుకుంటే శరీరంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ శోషణ పెరుగుతుందని చెబుతున్నారు న్యూట్రిషన్లు. ఇలా తీసుకుంటే ఐరన్‌ శోషణ తోపాటు, గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందట. చలవ చేయడమే గాక మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. బీట్‌రూట్‌లో ఉండే కొన్ని రకాల ఐరన్‌లను మన శరీరం గ్రహించలేదు. అదే దాన్ని మజ్జిగతో కలిపి తీసుకున్నట్లయితే.. అందులో ఉండే లాక్టిక్ ఆమ్లం మంచి ప్రోబయోటిక్‌లను అందిస్తుంది. మంచి గట్‌ ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతేగాదు ఇందులోని ఆమ్లత్వం పేగులోని ఐరన్‌ శోషణను మరింత పెంచుతుంది. ఎర్రరక్తకణాలు ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తహీనతను కూడా నివారిస్తుంది. దీనిలో నైట్రిక్‌ ఆక్సైడ్‌లుగా మార్చే నైట్రేట్లు ఉంటాయి. రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉండవని చెబుతున్నారు నిపుణులు. ఇది హృదయనాళ పనితీరుకి మద్దతిచ్చే బయోయాక్టివ్‌ పెప్టైడ్‌లను అందిస్తుంది. వీటన్నింటి తోపాటు కాలేయ పనితీరుకి కూడా సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్‌లను తొలగిస్తుంది. ఇలా బీట్‌రూట్‌ బట్టర్‌మిల్క్‌ మిక్సింగ్‌ అనేది శక్తిమంతమైన రిఫ్రెష్‌ టానిక్‌లా పనిచేస్తుంది. (చదవండి: 'ఎగ్‌ ఫ్రీజింగ్‌' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్‌ , తానీషా ముఖర్జీ అంతా..!)

Chandrababu Government Revises Stand on Annadata Sukhibhava Scheme9
రైతన్న దగా.. అన్నదాత సుఖీభవపై చంద్రబాబు సర్కార్‌ యూటర్న్‌

సాక్షి,విజయవాడ : రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ రైతన్నను దగా చేసింది. అన్నదాత సుఖీభవపై యూటర్న్‌ తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. ఇప్పుడు రైతులకు ఇచ్చేది రూ.14వేలేనని తేల్చి చెప్పింది. అన్నదాత సుఖీభవపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన ఇచ్చారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలుతో కలిపి రూ.20 వేలు ఇస్తామని, మేనిఫెస్టోలో కూడా అదే చెప్పాము అంటూ అబద్ధాలు చెప్పారు. అయితే, మేనిఫెస్టోలో రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎక్కడ కేంద్రం సహాయం ఇస్తేనే అన్నదాత సుఖీభవ ఇస్తామని ప్రస్తావించలేదు. ఇప్పుడు అధికారంలోకి రాగానే రైతులకు ఎగనామం పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.14 వేలే ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రైతన్నులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Airtel tied up with Elon Musk Starlink to provide internet in India10
భారత్‌లో స్టార్‌లింక్‌.. ఎలాన్‌ మస్క్‌తో ఎయిర్‌టెల్ డీల్‌

ఢిల్లీ : ప్ర‌ముఖ టెలికాం దిగ్గ‌జం ఎయిర్‌టెల్ శుభ‌వార్త చెప్పింది. త‌న వినియోగ‌దారుల‌కు హైస్పీడ్ ఇంట‌ర్నెట్‌ను అందించేందుకు అపరకుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని భారత్‌లో ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు అందించనున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. ఈ సంద‌ర్భంగా ఎయిటెల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్, వైస్ ఛైర్మ‌న్ గోపాల్ మిట్ట‌ల్ మాట్లాడుతూ.. భార‌త్‌లో ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని అందించేందుకు స్పేఎక్స్‌తో ప‌నిచేయ‌డం ఓ మైలురాయి. ముఖ్యంగా క‌స్ట‌మ‌ర్ల‌కు శాటిలైట్ ఇంట‌ర్నెట్‌ను అందించేందుకు సంస్థ క‌ట్టుబ‌డి ఉంది. ఎయిర్‌టెల్, స్పేస్‌ఎక్స్ ఒప్పందంలో భాగంగా ఎయిర్‌టెల్ రిటైల్ స్టోర్లలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని పొందేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఎక్విప్‌మెంట్ పొంద‌వ‌చ్చు. దీంతో పాటు భార‌త్‌లో మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, తదితర వాటిని కనెక్ట్ చేసేందుకు ఈ డీల్ ఉప‌యోగ‌ప‌డనుంద‌ని తెలిపారు. ఎలాన్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్ర‌పంచ వ్యాప్తంగా స్టార్‌లింక్ పేరుతో శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని అందిస్తోంది. దీంతో పాటు మొబైల్ బ్రాడ్ బ్యాండ్‌ను అందించే ల‌క్ష్యంతో ప‌నిచేస్తోంది. త‌ద్వారా యూజ‌ర్లు స్ట్రీమింగ్, వీడియో కాల్స్, ఆన్‌లైన్ గేమింగ్, రిమోట్ వర్కింగ్ కార్య‌క‌లాపాలు సులభతరం కానున్నాయి. ఇప్పుడే ఈ సంస్థతో ఎయిర్‌టెల్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
Ranya Rao : రన్యారావు కేసులో భారీ ట్విస్ట్

బెంగళూరు : కన్నడ నటి రన్యారావు కేసులో భారీ ట్విస్ట్‌ వెలుగుల

title
‘పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?’

ఢిల్లీ:  పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు,  బడ్జెట

title
జట్కా మ‌ట‌న్ అంటే ఏంటి, ఎక్క‌డ దొరుకుతుంది?

హ‌లాల్ గురించి మాంసం ప్రియుల‌కు తెలిసే ఉంటుంది. ముస్లింల దుకాణాల్లో హ‌లాల్ చేసిన మాంసాన్ని విక్ర‌యిస్తుంటారు.

title
‘పెద్దల’ సభలో మల్లికార్జున్ ఖర్గే క్షమాపణలు

న్యూఢిల్లీ:  ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే రాజ

title
రాజధానికి కేంద్రం నిధులపై స్పష్టత లేదు: వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి

ఢిల్లీ: ఏపీ రాజధాని నిర్మాణం కోసం కేంద్రం అందించే నిధులపై స్

NRI View all
title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

title
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు  ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి  పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

title
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’

అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో  మెడికల్‌ కాన్ఫరెన్స్‌ ఘనంగా జరిగింది.

title
డాక్టర్‌ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!

డొమినికన్ రిపబ్లిక్‌లో  కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

Advertisement

వీడియోలు

Advertisement