Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Make Yuvatha Poru a grand success YSRCP State Coordinator Sajjala1
12న జరిగే 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం: సజ్జల

తాడేపల్లి : ఈ నెల 12వ తేదీన వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీద్దామని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.. ఈ మేరకు ఆయన టెలికన్ఫరెన్స్ లో మాట్లాడారు. దీనికి వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు, విద్యార్థి, యువజన విభాగం నేతలు, 13 యూనివర్శిటీల విద్యార్థి నాయకులు, మేధావులు, విద్యారంగం ప్రముఖులు హాజరయ్యారు.‘12న జరిగే 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఫీజు రీయంబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ పోరాడదాం. రేపు యూనివర్శిటీల లోపల లేదా బయట "యువత పోరు" పోస్టర్‌ ఆవిష్కరణ చేయాలి. యూనివర్శిటీల నుంచి విద్యార్థులు ర్యాలీలో పాల్గొనేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి వారి సమస్యలు పరిష్కారమవుతాయి వైఎస్సార్‌సీపీ విద్యార్ధి, యువజన విభాగాలు సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించాలి’ సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతీ పల్లెలో ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు

Posani Krishna Murali Granted Bail2
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి బెయిల్

పల్నాడు జిల్లా: ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణమురళిపై నరసరావుపేటలో నమోదైన కేసులో బెయిల్ మంజూరైంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నరసారావుపేటలో కేసు నమోదు చేశారు పోలీసులు. మార్చి మొదటి వారంలో పోసానిపై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు పిటి వారెంట్‌పై నరసరావుపేట కోర్టులో పోసాని హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు పోసానికి 10 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను నరసరావుపేట టూటౌన్‌ పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు. తాజాగా, నరసరావుపేట కోర్టులో పోసాని బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు.పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్‌ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్‌ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్‌ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేశారు. ఆదోని కేసులో భాగంగా పోలీసులు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేయగా, నరసారావుపేట కేసులో బెయిల్‌ మంజూరైంది. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ దశలో ఉంది.

verbally tortured and threatened, Not Physical Torture Ranya Rao3
మాటలతో హింసిస్తున్నారు.. బెదిరిస్తున్నారు: కోర్టులో రన్యారావు

బెంగళూరు: గోల్డ్ స్మగ్మింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావును ఈరోజు(సోమవారం) బెంగళూరు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. తన మొహంపై గాయాలు కనిపిస్తున్న క్రమంలో ఆమెను కోర్టుకు తీసుకెళ్లారు డీఆర్ఐ అధికారులు. అయితే కస్టడీలో ఏమైనా భౌతిక దాడులు జరిగాయా అని కోర్టు ప్రశ్నించగా.. తనను శారీరకంగా ఏమీ ఇబ్బందులు గురి చేయడం లేదని, కానీ మాటలతో మానసికంగా హింసిస్తున్నారని కోర్టులో కన్నీటి పర్యంతమైంది. అయితే మానసికంగా మాటలతో హింసిస్తున్నారని ఆమె చెబుతున్న వాదనను డీఆర్ఐ ఖండించింది. అందులో ఎటువంటి వాస్తవం లేదని, తమ నిబంధనల మేరjo దర్యాప్తు చేస్తున్నామన్నారు. తమ దర్యాప్తును మొత్తం రికార్డు చేస్తున్నామని డీఆర్ఐ పేర్కొంది.వైరల్‌గా మారిన ఫోటోరన్యారావుకు చెందిన ఓ ఫోటో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. ఆమె కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో ఉంది. ఆమెను కస్టడీలో తీసుకుని విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై కర్ణాకట మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రధానంగా వైరల్ గా మారిన ఫోటోను ఉటంకిస్తూ మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మీ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెపై అధికారులు దాడికి పాల్పడ్డారా? అనే ప్రశ్న లేవనెత్తారు. అయితే దీనిపై తాము నేరుగా దర్యాప్తు చేసే అవకాశం లేదన్నారు. రన్యారావు తముకు ఏమైనా ఫిర్యాదు చేస్తే ఆమెకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు నాగలక్ష్మి,‘మాకు ఆమె లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె నుంచి ఫిర్యాదు అందిన పక్షంలో తమ పరిధిలో ఉన్న ఆయా విభాగాలను అప్రమత్తం చేస్తాం. సరైన రీతిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె ఏమైనా దాడికి గురయ్యిందా అనేది ఆమె ఫిర్యాదు రూపంలో ఇస్తేనే మేము ఏమైనా చేయగలం. ఒకవేళ ఆమె మమ్మల్ని సంప్రదించకపోతే దీనిపై కనీసం కామెంట్ కూడా చేయలేం’ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే ఆమెను స్పెషల్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడింది. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.

ICC announces Champions Trophy 2025 Team of the Tournament No Rohit4
CT 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు

పాకిస్తాన్‌ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్‌ ట్రోఫీ-2025(Champions Trophy) ఎడిషన్‌ మార్చి 9న దుబాయ్‌లో ముగిసింది. టైటిల్‌ పోరులో న్యూజిలాండ్‌తో తలపడ్డ టీమిండియా జయకేతనం ఎగురవేసి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్‌ దశలో మూడు.. సెమీస్‌, ఫైన​‍ల్‌ గెలిచి అజేయంగా ఈ వన్డే టోర్నమెంట్‌ను ముగించింది.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ICC) తాజాగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఈ పదకొండు మంది సభ్యుల జట్టులో భారత్‌ హవా కొనసాగింది. టీమిండియా నుంచి ఈ జట్టులో ఏకంగా ఐదుగురు క్రికెటర్లు స్థానం సంపాదించారు.పాకిస్తాన్‌కు మొండిచేయిమరోవైపు.. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి గెలుపన్నదే లేకుండా నిష్క్రమించిన పాకిస్తాన్‌కు మొండిచేయి ఎదురైంది. అంతేకాదు.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌ జట్ల నుంచి కూడా ఒక్క ఆటగాడూ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఇక టీమిండియా తర్వాత న్యూజిలాండ్‌ నుంచి అత్యధికంగా నలుగురు ఐసీసీ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా అఫ్గనిస్తాన్‌ నుంచి ఇద్దరు ఇందులో ఉన్నారు. అయితే, ఇందులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టుకు సారథిగా కివీస్‌ నాయకుడు మిచెల్ సాంట్నర్‌ ఎంపికయ్యాడు.‌నాలుగు వికెట్ల తేడాతో ఓడించికాగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ పోటీపడగా.. టీమిండియా, కివీస్‌ సెమీస్‌ చేరాయి. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, అఫ్గనిస్తాన్‌ బరిలో దిగగా.. ఆసీస్‌, ప్రొటిస్‌ జట్లు సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టాయి.ఈ క్రమంలో తొలి సెమీస్‌ మ్యాచ్‌లో భారత్‌- ఆసీస్‌ను... రెండో సెమీస్‌లో కివీస్‌ ప్రొటిస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో దుబాయ్‌ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో రోహిత్‌ సేన సాంట్నర్‌ బృందాన్ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో 76 పరుగులతో రాణించిన భారత సారథి రోహిత్‌ శర్మ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. మొత్తంగా రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించిన కివీస్‌ యువ ఆటగాడు రచిన్‌ రవీంద్రకు ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు దక్కింది.ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ‘టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’రచిన్‌ రవీంద్ర(న్యూజిలాండ్‌), ఇబ్రహీం జద్రాన్‌(అఫ్గనిస్తాన్‌), విరాట్‌ కోహ్లి(ఇండియా), శ్రేయస్‌ అయ్యర్‌(ఇండియా), కేఎల్‌ రాహుల్‌(ఇండియా), గ్లెన్‌ ఫిలిప్స్‌(న్యూజిలాండ్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్‌(అఫ్గనిస్తాన్‌), మిచెల్‌ సాంట్నర్‌(కెప్టెన్‌, న్యూజిలాండ్‌), మ్యాట్‌ హెన్రీ(న్యూజిలాండ్‌), వరుణ్‌ చక్రవర్తి(ఇండియా)12వ ఆటగాడు: అక్షర్‌ పటేల్‌(ఇండియా)చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో వీరి ప్రదర్శన👉రచిన్‌ రవీంద్ర- రెండు శతకాల సాయంతో 263 రన్స్‌. స్పిన్‌ బౌలర్‌గానూ రాణించిన రచిన్‌. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా ఎంపిక👉ఇబ్రహీం జద్రాన్‌- ఒక సెంచరీ సాయంతో 216 పరుగులు. ఇంగ్లండ్‌పై అఫ్గన్‌ గెలుపొందడంలో కీలక పాత్ర👉విరాట్‌ కోహ్లి- ఒక శతకం సాయంతో 218 పరుగులు. పాకిస్తాన్‌పై అజేయ సెంచరీ. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల మార్కు అందుకున్న క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు.👉శ్రేయస్‌ అయ్యర్‌- రెండు అర్ధ శతకాల సాయంతో 243 రన్స్‌. టీమిండియా చాంపియన్‌గా నిలవడంతో కీలక మిడిలార్డర్‌ బ్యాటర్‌గా రాణింపు.👉కేఎల్‌ రాహుల్‌- 140 పరుగులు. వికెట్‌ కీపర్‌గానూ సేవలు.👉గ్లెన్‌ ఫిలిప్స్‌- 177 పరుగులు. రెండు వికెట్లు, ఐదు క్యాచ్‌లు.👉అజ్మతుల్లా ఒమర్జాయ్‌- 126 రన్స్‌, ఏడు వికెట్లు.👉మిచెల్‌ సాంట్నర్‌- 4.80 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉మహ్మద్‌ షమీ- 5.68 ఎకానమీతో తొమ్మిది వికెట్లు. ఇందులో ఓ ఫైవ్‌ వికెట్‌ హాల్‌.👉మ్యాట్‌ హెన్రీ- 5.32 ఎకానమీతో పది వికెట్లు👉వరుణ్‌ చక్రవర్తి- 4.53 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉అక్షర్‌ పటేల్‌- 4.35 ఎకానమీతో ఐదు వికెట్లు.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్‌ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్‌ కెప్టెన్‌ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)

Did Not File ITR You May Get Tax Notice For IT Department5
గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు?

నిర్దిష్ట ఆదాయం కంటే ఎక్కువ సంపాదన ఉన్నప్పుడు.. మన దేశంలో ట్యాక్స్ చెల్లించాలి. పాత ఆదాయపు పన్ను విధానం ప్రకారం.. ట్యాక్స్ రిబేట్ రూ. 5 లక్షలుగా ఉండేది. కొత్త పన్ను విధానం ప్రకారం ఇది రూ. 12 లక్షలకు చేరింది. ఆదాయపన్ను చట్టం 1961 కింద.. కొత్త, పాత పన్ను విధానాల కింద ఏది ఎంచుకుంటే.. ఆ శ్లాబుల ప్రకారం ట్యాక్స్ చెల్లించాలి.పన్ను మినహాయింపు పరిమితి దాటితే.. ఐటీఆర్ ఫైల్ చేయాలి. కొందరు దీనిని పెడచెవిన పెడుతున్నారు. అంటే ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. అలాంటి వారిని ఇప్పుడు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటికే ట్యాక్స్ కట్టకుండా ఉన్నవారి లిస్ట్ కూడా తయారు చేసుకుంది. సదరు వ్యక్తులకు నోటీసులు కూడా అందుతాయి.ఎవరైతే ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నారో.. వారిపైన సెక్షన్ 148ఏ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు లిస్ట్ చేసిన వారు 2018-19, 2019-20, 2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ చెల్లించకుండా ఉన్నవారు అని తెలుస్తోంది. ఇప్పటికే కొందరికి నోటీసులు పంపినట్లు చెబుతున్నారు.పన్ను కట్టకుండా తప్పించుకునే వారిని గుర్తించడానికి ఏఐఎస్, టీడీఎస్/టీసీఎస్ స్టేట్‌మెంట్స్, ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్ స్టేట్‌మెంట్‌ వంటి వాటిని ఆదాయపన్ను శాఖ తనిఖీ చేస్తుంది. వీటి ద్వారానే ఎవరు పన్ను కడుతున్నారు, ఎవరు కట్టడం లేదనే విషయాలను తెలుసుకుంటుంది. పన్ను ఎగ్గొట్టే వారిని గుర్తించి.. వారికి నోటీసులు జారీ చేస్తుంది.ఇదీ చదవండి: రన్యా రావు కేసు.. దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చంటే?ఎవరైతే పన్ను చెల్లించకుండా.. తప్పించుకుంటున్నారో వారికి నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే కండొనేషన్ ఆఫ్ డిలేకు అప్లై చేసుకుని లేదా వడ్డీతో కలిపి ట్యాక్స్ పూర్తిగా చెల్లించినట్లయితే.. బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Bollywood actress Avneet Kaur Relation with cricketer Shubman Gill6
హీరోయిన్‌తో శుభ్‍మన్ గిల్‌ డేటింగ్‌.. ఆ ఒక్క ఫోటో వల్లే !

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి సగర్వంగా ముద్దాడింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించిన. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఫైనల్ ‍మ్యాచ్‌లో నువ్వా నేనా అన్నట్లు సాగిన ‍మ్యాచ్‌లో విజయం భారత్‌ను వరించింది. దీంతో టీమిండియా ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరింది. దుబాయ్‌లో జరిగిన పలువురు బాలీవుడ్ సినీ తారలు సైతం ఈ మ్యాచ్‌ను వీక్షించారు.అయితే ఈ మ్యాచ్‌ తర్వాత భారత ఓపెనర్ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అవనీత్‌ కౌర్‌తో శుభ్‌మన్‌ గిల్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూసిన ఫోటోలను అవనీత్ కౌర్‌ ఇన్‌స్టాలో పంచుకుంది. అయితే ఆ ఫోటోలు భారత్- ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్‌ సందర్బంగా అవనీత్ కౌర్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.తాజాగా టీమిండియా కప్ గెలవడంతో మరోసారి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అంతేకాకుండా గతేడాది శుభ్‌మన్ బర్త్‌ డే సందర్భంగా అవనీత్‌ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపింది. గిల్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో వీరిద్దరిపై మరోసారి డేటింగ్‌పై చర్చ మొదలైంది. ఈ రూమర్స్ నేపథ్యంలో ఆమె రాఘవ్ శర్మ అనే నిర్మాతతో డేటింగ్ చేస్తున్నట్లు కొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా.. క్రికెటర్‌ గిల్‌పై గతంలో కూడా సారా అలీ ఖాన్‌తో పాటు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. 26 ఏళ్ల అవనీత్‌ కౌర్ ‍బాలీవుడ్‌లో పలు సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ల్లోనూ కనిపించింది. ఎనిమిదేళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అవనీత్ కౌర్ మొదటిసారిగా 2010లో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ షోలో కనిపించింది. ఆ తర్వాత ఆమె 'డ్యాన్స్ కే సూపర్‌స్టార్స్'లో పాల్గొంది. ఆ తర్వాత 2012లో 'మేరీ మా' టీవీ షోతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఝలక్ దిఖ్లా జా (2012), మసావిత్రిక్, ఏక్ ముత్తి ఆస్మాన్ లాంటి సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత 'మర్దానీ' మూవీతో బిగ్ స్క్రీన్‌లోకి అడుగుపెట్టింది. 2023లో కంగనా రనౌత్ నిర్మించిన టికు వెడ్స్ షేరు చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన రొమాంటిక్ పాత్రలో కనిపించింది. కౌర్ చివరిసారిగా 2024లో వచ్చిన 'పార్టీ టిల్ ఐ డై'అనే మర్డర్ మిస్టరీలో నటించింది. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13)

Hydra Ranganath Reveals SHOCKING Truth About Amrutha Pranay Case7
ప్రణయ్‌ కేసు.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

నల్లగొండ, సాక్షి: సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్‌(24)ను దారుణంగా చంపిన సుభాష్‌ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.అయితే ప్రణయ్‌ హత్య కేసులో విచారణ అధికారిగా ఉన్న అప్పటి అప్పటి నల్గొండ ఎస్పీ, ఐపీఎస్ అధికారి రంగనాథ్ (ప్రస్తుతం హైడ్రా కమిషనర్) కీలక వ్యాఖ్యాలు చేశారు. ప్రణయ్‌- అమృతల ప్రేమ అంశం టీనేజీ యువతకు గుణ పాఠంలాంటిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. టీనేజీ వయస్సులో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అదే సమయంలో ఈ కేసు దర్యాప్తులో ఎదురైన సవాళ్లు, మారుతీరావు ప్రవర్తన, కేసును ఛేదించిన విధానం గురించి ఆయన వివరించారు. కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య..ప్రణయ్‌ హత్య సమయంలో నేను నల్లగొండ జిల్లా ఎస్పీగా ఉన్న ఆ సమయంలో ప్రణయ్‌ హత్యకేసులో మొదటి నుంచి సాక్షలు బలంగా ఉన్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయం గెలిచింది. ఈ కేసులో అన్ని కోణాలు ఉన్నాయని, కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్థులు చాలా తెలివిగా వ్యవహరించారు. కేసు మొదట్లో చాలా గందరగోళంగా ఉంది. మారుతీరావు కూడా తనకు ఏమీ తెలియదనే అన్నారు. చాకచక్యంగా ఛేదించాండీఎస్పీగా శ్రీనివాస్‌, ఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి, ధనుంజయ్‌,టాస్క్‌ ఫోర్స్‌,కానిస్టేబుల్స్‌, ఎస్సైలు,రైటర్స్‌తో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నరసింహ, సీనియర్‌ అధికారురు ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర,అప్పటి డీజీ మహేందర్‌రెడ్డిల సూచనలు,సలహాలతో ఈ కేసును చాకచక్యంగా ఛేదించాం. ప్రణయ్‌ హత్య తర్వాత నిందితులు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. అయినప్పటికీ టెక్నాలజీ, విచారణ సాయంతో నిందితుల్ని కేవలం వారం రోజుల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నాం.ముందు లైఫ్‌లో సెటిల్‌ అవ్వండిప్రణయ్‌ -అమృత కేసు నేటి తరం బాల్యం నుంచి యవవ్వనంలోకి అడుగు పెట్టే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఒక గుణపాఠం లాంటింది. టీనేజీ నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. టీనేజీలోకి అడుగు పెట్టాం కదా అని ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవద్దని, జీవితంలో కొంత పరిణితి సాధించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ముందు పిల్లలు లైఫ్‌లో స్థిరపడిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.నేటి యువతకు ఓ గుణపాఠం లాంటిందిలేదంటే ప్రణయ్‌ హత్య కేసుతో ఏం జరిగిందో మనం అందరం చూశాం. బాలస్వామి తన కుమారుణ్ని(ప్రణయ్‌),అమృత తన తండ్రిని కోల్పోయింది. వాళ్లు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరూ సంతృప్తిగా లేరు. ఈ కేసు ద్వారా సమాజం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.అమృతమీద అమితమైన ప్రేమేప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఏ1 గా ఉన్న మారుతిరావు చనిపోవడం బాధాకరం. మారుతి రావుకి కుమార్తె అమృత అంటే అమితమైన ప్రేమ. లేక లేక పుట్టిన సంతానం. అమృత ఫొటోల్ని 15 నుంచి 20 అడుగల మేర ఫ్లెక్సీ కట్టించుకునేంత ప్రేముంది. ఆ ప్రేమే ఇన్ని అనార్ధాలకు దారి తీసింది. మారుతిరావు రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేస్తున్నారు. ఎవరైతే ప్రణయ్‌ హత్యకేసులో ఉన్న ఏ4 బారీ సాయంతో రియల్‌ ఎస్టేట్‌లో సమస్యల నుంచి బయటపడేవారు.అలాగే అమృత విషయంలో అలాగే ఆలోచించారు. డబ్బు, పరపతి ఉండొచ్చేమో.. కానీ పిల్లల టీనేజీ పెంపకం ఎలా ఉండాలనే అంశంలో అవగాహన లేకుండా పోయింది. మన పెంపకంలో ఏదైనా తప్పుంటే దానికి వేరే వాళ్లని బాధ్యుల్ని చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అనే అంశంపై మారుతి రావుతో మాట్లాడాను’ అని అన్నారు.పైకోర్టుకు వెళ్లినా లాభం ఉండదుఇదే కేసులో పైకోర్టులకు వెళ్లినా న్యాయం పరంగా ఎలాంటి మార్పులు ఉండదు. అంత పకడ్బందీగా ఈ కేసులో 1600 పేజీల ఛార్జ్‌ షీట్‌ వేశామని, కేసు విచారణ సమయంలో పోలీసులు మేనేజ్ చేశారంటూ కొందరు నిరాధార ఆరోపణలు చేశారని, వాటిని పట్టించుకోకుండా నిజం నిలకడ మీద తెలుస్తుందనే నమ్మకంతో ముందుకు సాగామని రంగనాథ్‌ ముగించారు.

Gulmargs Controversial Fashion Show: Shivan And Narresh 8
కశ్మీర్‌ వివాదాస్పద ఫ్యాషన్‌ షో: ఆ డిజైనర్లు ఎవరంటే..?

పవిత్ర రంజాన్‌ మాసం వేళ జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఫ్యాషన్‌ షో తీవ్ర దుమారం రేపింది. ఫ్యాషన్‌ షోలో మహిళలు, పురుషులు పొట్టి పొట్టి దుస్తులతో తెల్లటి మంచుపై ర్యాంప్‌ వాక్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఈ ఈవెంట్‌పై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాదు ఫ్యాషన్‌ షో దూమారం జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీని కూడా అట్టుడికించింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు ఒమర్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నెల మార్చి 7న గుల్మార్గ్‌లో జరిగిన ఈ ఫ్యాషన్‌ షోపై తారాస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వివాదాస్పదంగా మారిన ఈ షో వెనుకున్న డిజైనర్లు ఎవరంటే..?ఎవరా డిజైనర్‌ ద్వయం..?ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డిజైనర్లు శివన్‌ భాటియా, నరేష్ కుక్రేజా. ఈ ఇద్దరు స్థానిక సున్నితత్వాన్ని విస్మరించి పవిత్ర రంజాన్‌ మాసంలో అశ్లీల దుస్తులతో ప్రదర్శన ఇవ్వడంతోనే ఈ షో వివాదాస్పదమైంది. అయితే డిజైనర్ల ద్వయం ఫ్యాషన్‌ పరిశ్రమలో తమ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గుల్మార్గ్‌లోని ప్రఖ్యాత స్కీ రిసార్ట్‌లో ఈ ఫ్యాషన్‌ షోని నిర్వహించారు. వాళ్ల బ్రాండ్‌కి సంబంధించిన శిల్పకళా స్కీ సూట్‌లు, అప్రెస్-స్కీ దుస్తులు, ఆర్ట్ ప్రింట్‌లు ఉన్న ట్రాన్స్‌పరేంట్‌ దుస్తులు ధరించారు ఇందులో పాల్గొన్న పురుషులు, మహిళలు. అయితే వాళ్లు సరిగ్గా రంజాన్‌ పర్వదినం సమయంలో దీన్ని నిర్వహించడతో ఇంతలా స్థానిక ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను దారితీసింది. పైగా ఈ ఈవెంట్‌ సాంస్కృతిక విలువలకు తిలోదాకలిచ్చే రీతిలో దారుణంగా ఉందంటూ మత పెద్దలు, ప్రజలు, రాజకీయనాయకులు మండిపడ్డారు. అయితే ఈ షోని నిర్వహించింది ప్రఖ్యాత ఫ్యాషన్‌ బ్రాండ్‌ హాలిడే. ఇది కేన్స్‌లోని 'మారే డి మోడా'లో భారతదేశపు తొలి లగ్జరీ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. అధునాతన సౌందర్యానికి చెందిన ఈ బ్రాండ్‌ హాలిడే రిసార్ట్‌, స్విమ్‌ దుస్తుల పరంగా ఫ్యాషన్‌లో సంచలనాలు సృష్టించింది. వారి కలెక్షన్లు డీఎల్‌ఎఫ్‌ ఎంపోరియో (ఢిల్లీ), కలఘోడా (ముంబై), బంజారా హిల్స్ (హైదరాబాద్), ఎంబసీ చాంబర్ (బెంగళూరు) లలో అందుబాటులో ఉన్నాయి.ఇద్దరు డిజైనర్లు ఫ్యాషన్‌ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థానాన్ని దక్కించుకున్నారు. వారిలో శివన్ NIFT ఢిల్లీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఇస్టిట్యూట్‌​ యూరోపియో డి డిజైన్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. కాగా నరేష్ అదే సంస్థ నుంచి లగ్జరీ అండ్‌ మార్కెటింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ చేశారు. ఈ బ్రాండ్‌ని ఎక్కువగా బాలీవుడ్‌ నటులు కిమ్ కర్దాషియాన్, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు నిర్వహించారు. ఈ బ్రాండ్‌కి వరించిన అవార్డులు..స్వరోవీస్కీ మోస్ట్ క్రియేటివ్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ (2007)ఉత్తమ ఎమర్జింగ్ డిజైనర్లు (మేరీ క్లైర్ ఫ్యాషన్ అవార్డ్స్, 2010)ఉత్తమ రిసార్ట్ వేర్ (ఎల్లే స్టైల్ అవార్డ్స్, 2010)ఉత్తమ క్రూయిజ్ వేర్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2011)‘మేడ్ ఇన్ ఇండియా’ లేబుల్ టు ది వరల్డ్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2012)యంగ్ అచీవర్స్ అవార్డు (ఎంబసీ ఆఫ్ ఇండియా, ఖాట్మండు అండ్‌ టుడేస్ యూత్ ఆసియా)ఇంత మంచి పేరు, కీర్తీ దక్కించుకున్న ఈ ఫ్యాషన్‌ డిజైనర్లు గుల్మార్గ్‌ ఫ్యాషన్‌ షోతో ఒక్కసారిగా వివాదాస్పద వ్యక్తులుగా అపకీర్తిని మూటగట్టుకున్నారు, విమర్శలపాలయ్యారు. View this post on Instagram A post shared by SHIVAN & NARRESH (@shivanandnarresh) (చదవండి: వర్కౌట్లకు టైం లేదా..? ఐతే ఇలా బరువు తగ్గించుకోండి..)

Pranay Case Final verdict: Nalgonda SC/ST Court Sensational Judgement9
ప్రణయ్‌ కేసులో ఒకరికి ఉరి.. ఆరుగురికి జీవితఖైదు

నల్లగొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్‌(24)ను దారుణంగా చంపిన సుభాష్‌ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది. అమృత వర్షిణి-ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్‌ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్‌ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్‌ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను అంతమొందించాడు.👉ఆరేళ్లకు పైగా ప్రణయ్‌ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్‌ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.👉2018లో ప్రణయ్‌- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్‌ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు. 👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్‌(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది. 👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది. 👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్‌), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్‌ ఓనర్‌)గా ఉన్నారు. 👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్‌ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్‌ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్‌ చేసింది.👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు👉నిందితుల్లో అస్ఘర్‌ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్‌ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్‌ హత్య స్కెచ్‌ను అస్ఘర్‌ అమలు పరిచాడు.

Minister Nadendla Manohar On SVSN Varma Episode10
‘వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్.. కానీ’: నాదెండ్ల మనోహర్‌

కాకినాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదుజఈ అంశంపై పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఎస్పీఎస్ఎన్ వర్మ ఒక సీనియర్ పొలిటిషియన్ అంటూనే, ఆయన ఎమ్మెల్సీ టికెట్ అంశమనేది వారి పార్టీనే నిర్ణయిస్తుందన్నారు మనోహర్. ఇక్కడ తాము వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంటందన్నారు మనోహర్.‘పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్. వాళ్ళ పార్టీ ఆయన విషయం లో నిర్ణయం తీసుకుంటుంది, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. వర్మ ని గౌరవించడం లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుంది’ అని అన్నారు.ఇక ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు మనోహర్ పేర్కొన్నారు. పవన్ సెక్యూరిటీ విషయంలో డిపార్ట్మెంట్ తో పాటు పార్టీ పరంగా మేము కూడా చూసుకుంటాం. సభా ప్రాంగణం లో 75 సి సి కెమెరా లు ఏర్పాటు చేస్తాం. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేశాం. ఈ నెల 14 న సాయంత్రం 4 గంటలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమవుతుంది’ అని పేర్కొన్నారు మంత్రి మనోహర్.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
ఈసీ తీరుపై... అన్నీ  అనుమానాలే! 

సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా అవకతవకలు, నకిలీ ఓటర్‌ కార్డ

title
మాటలతో హింసిస్తున్నారు.. బెదిరిస్తున్నారు: కోర్టులో రన్యారావు

బెంగళూరు: గోల్డ్ స్మగ్మింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం డీఆర్ఐ క

title
పట్టపగలే దొంగల ముఠా బీభత్సం.. భారీ దోపిడీ!

పాట్నా: బీహార్ రాష్ట్రంలో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం స్ప

title
దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు?

కన్నడ నటి 'రన్యా రావు' 14.2 కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమా

title
Ranya Rao : రన్యారావు వ్యవహారంలో మరో బిగ్‌ ట్విస్ట్‌

బెంగళూరు: గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ దొరికి పోయిన కన్ననటి రన

NRI View all
title
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు  ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి  పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

title
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’

అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో  మెడికల్‌ కాన్ఫరెన్స్‌ ఘనంగా జరిగింది.

title
డాక్టర్‌ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!

డొమినికన్ రిపబ్లిక్‌లో  కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

title
ఈ ఏడాది హెచ్‌1బీ వీసాలు కష్టమే

సాక్షి, అమరావతి: అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్‌ ఉన్న హెచ్

Advertisement

వీడియోలు

Advertisement