Top Stories
ప్రధాన వార్తలు

ప్రజలు, దేవుడు.. అంతా చూసున్నారు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఖండించారు. పోసాని భార్య కుసుమలతను ఫోన్లో పరామర్శించిన ఆయన.. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ‘‘ప్రజలు, దేవుడు అంతా చూస్తున్నారు. పోసాని కృష్ణమురళికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. మేం అందరం మీకు తోడుగా ఉంటాం. పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తాం. సీనియర్ న్యాయవాదులకు ఆ బాధ్యతలు అప్పగించాం. పొన్నవోలు సహా అందరినీ రాజంపేటకు పంపించాం. నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించాం. ఈ కష్టకాలంలో మీరు ధైర్యంగా ఉండండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు’’ అని వైఎస్ జగన్(YS Jagan) అన్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పోసాని పని చేశారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆపై ప్రెస్ మీట్ నిర్వహించి మరీ ఇకపై రాజకీయాలు మాట్లాడబోనని, వాటికి దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు.. ఆయనపై కేసు నమోదైందని చెబుతూ అప్పటికప్పుడే ఆయన భార్యకు నోటీసులు అందజేసి వెంట తీసుకెళ్లారు. తన ఆరోగ్యం బాగోలేదని, భోజనం చేసి తానే వస్తానని చెప్పినా వినలేదు. ఈ క్రమంలో పోసాని కుటుంబ సభ్యులతోనూ రాయచోటి పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం కూడా చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గతంలో.. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని జనసేన(Jana Sena) నేత మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోసానిపై 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: పోసాని అరెస్ట్.. అసలు జరిగింది ఇదే!

అత్యాచార ఘటనపై మాజీ సీజేఐ చంద్రచూడ్ ఏమన్నారంటే..
ఢిల్లీ: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట్ జంక్షన్ బస్టాండ్‌లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్గేట్ బస్టాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు.చంద్రబూడ్ ఏమన్నారంటే..ఈ అత్యాచార ఘటనపై మాజీ సీజేఐ చంద్రచూడ్ స్పందించారు. ‘గతంలో ‘నిర్భయ’ ఉదంతం చోటు చేసుకున్న తర్వాత చట్టంలో అనేక మార్పులు వచ్చాయి. కేవలం చట్టాల వల్లే మహిళలకు రక్షిణ కల్పించలేం. దీన్ని సొసైటీ ఒక పెద్ద బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో చట్టాలు అమలు తీరు కూడా కచ్చితంగా ఉండాలి. మహిళల రక్షణ కోసం చట్టాలను సరైన విధానంలో అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. తాము బయటకు వెళితే రక్షణ ఉంది అనే భావన మహిళలకు రావాలి. ఈ తరహా కేసుల్లో ఇది చాలా ముఖ్యమైన అంశం. విచారణ న్యాయబద్ధంగా జరగాలి.. అలాగే కఠినమైన శిక్షలను అమలు చేయాలి. తొందరగా విచారణ పూర్తి చేసి శిక్షలను కూడా అంతే త్వరగా అమలు చేయాలి. ఇందులో న్యాయ వ్యవస్థతో పాటు పోలీసులది కూడా పెద్ద బాధ్యతే’ అని చంద్రచూడ్ స్పష్టం చేశారు. నిందితుడి కోసం జల్లెడ పడుతున్న పోలీసులుఈ అత్యాచార ఘటనలో నిందితుడిగా చెప్పబడుతున్న 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన అనంతరం తిరిగి తన ప్రాంతానికి వెళ్లే క్రమంలో అతను చెరుకు తోటల్లో ఉన్నాడనే అనుమానంతో అక్కడ పోలీసులు సోదాలు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అత్యాచార ఘటన తర్వాత ఆ నిందితుడు తన డ్రెస్ మార్చుకోవడంతో పాటు షూస్ కూడా మార్చినట్లు తెలుస్తోంది. తొలుత కూరగాయాలు తీసుకెళ్లే వ్యాన్ లో అతను తిరిగి పయనమైనట్లు గుర్తించిన పోలీసులు.. అటు తర్వాత అతని ఇంటికి సమీపంగా ఉన్న చెరుకు తోటల్లో ఉన్నట్లు అనుమానిస్తన్నారు. దాంతో ప్రత్యేకమైన డాగ్ స్క్వాడ్స్‌తో పాటు డ్రోన్లను కూడా ఉపయోగించి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. పుణె బస్టాండ్‌లో దారుణం.. ఒంటరిగా ఉన్న మహిళకు మాయమాటలు చెప్పి

మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌కు వరకట్న వేధింపులు.. భర్త భారత మాజీ కబడ్డీ ప్లేయర్
మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత సవీటి బూరా (Saweety Boora) వరకట్న వేధింపులు ఎదుర్కొంది. ఆమె భర్త, భారత మాజీ కబడ్డీ ప్లేయర్, ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత, అర్జున అవార్డు గ్రహీత అయిన దీపక్ హూడా (Deepak Hooda), అతని కుటుంబం అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని సవీటి కేసు పెట్టింది. సవీటి ఫిర్యాదు మేరకు హిస్సార్‌లోని (హర్యానా) ఓ పోలీస్ స్టేషన్లో దీపక్ హుడా, అతని కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీపక్ హుడా అదనపు కట్నంతో పాటు ఓ ఫార్చూనర్ కార్ డిమాండ్ చేస్తున్నాడని సవీటి తన ఫిర్యాదులో పేర్కొంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 కింద దీపక్ హుడా, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీపక్ హుడాకు రెండు, మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఎలాంటి స్పందన పోలీసులు వెల్లడించారు. దీపక్ హుడాపై అదనపు కట్నం వేధింపులు, హింసించడం మరియు దాడి చేయడం వంటి అభియోగాలు మోపబడ్డాయని పోలీసులు వివరించారు. పోలీసుల వాదనపై హుడాను జాతీయ మీడియా ప్రశ్నించగా.. ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. ఈ కారణంగానే నోటీసులకు వివరణ ఇవ్వలేకపోయానని అన్నాడు. తన అనారోగ్యానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లు పోలీసులకు సమర్పించినట్లు తెలిపాడు. త్వరలో పోలీస్ స్టేషన్‌కు వెళ్తానని అన్నాడు. ఈ సందర్భంగా హుడా తన భార్య సవీటిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుతం ఆమెను కలవడానికి నాకు అనుమతి లేదని అన్నాడు.కాగా, సవీటి బూరా-దీపక్ హుడాల వివాహం 2022లో జరిగింది. దీపక్ హుడా 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రోహ్తక్ జిల్లాలోని మెహమ్ నియోజకవర్గం నుంచి హుడా పోటీ చేశారు. హుడా.. 2016 దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకం, 2014 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకున్న భారత కబడ్డీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతను ప్రో కబడ్డీ లీగ్‌లో కూడా పాల్గొన్నాడు. 32 ఏళ్ల సవీటి 2023లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. గతేడాది ఫిబ్రవరిలో ఆమె భర్తతో కలిసి భాజపాలో చేరింది. గత నెలలోనే సవీటి రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంది.

వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం- పొన్నవోలు సుధాకర్ రెడ్డి
పోసాని అరెస్ట్ అప్డేట్స్.. 👉ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్ట్ చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కుతంత్రంలో తాజా పర్వం. ఏనాడో చేసిన సాధారణ వ్యాఖ్య ఆధారంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడింది. గతంలో కుట్రపూరితంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఆయనపై టీడీపీ, జనసేన పార్టీలు అక్రమ ఫిర్యాదులు చేశాయి.అన్నమయ్య జిల్లాడాక్టర్ గురుమహేష్, ఓబుల వారిపల్లి పి.హెచ్.సి సుదీర్ఘ విచారణ అనంతరం మరోసారి పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులుపోసాని ఆరోగ్య పరిస్థితి నార్మల్ గానే ఉంది,భుజం నొప్పితో బాధపడుతున్నారుకార్డియాక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు, మెడిసిన్స్ వాడుతున్నారుప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గానే ఉందిఓబులవారి పల్లి పోలీస్ స్టేషన్ లో 8 గంటలుగా కొనసాగుతున్న విచారణ..అన్నమయ్య జిల్లా:మరికాసేపట్లో రైల్వే కోడూరు కోర్టుకు పోసాని కృష్ణమురళిని హాజరుపరచనున్న పోలీసులుపోసాని కృష్ణమురళి తరపున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డికక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోసాని కృష్ణమురళి పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారుపోసాని కృష్ణమురళి పై 111 సెక్షన్ నమోదు చేయడం దుర్మార్గంఆర్గనైజ్డ్ క్రైం చేసిన వారిపై మాత్రమే 111 సెక్షన్ నమోదు చేయాలిఉన్నత న్యాయస్థానాలు చంద్రబాబు ప్రభుత్వానికి పదేపదే చివాట్లు పెట్టినా పద్ధతి మార్చుకోలేదువైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో పోస్టింగ్స్ పెట్టినా ఒక్క కేసు నమోదు చేయలేదురాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదువైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం- పొన్నవోలు సుధాకర్ రెడ్డి పీఎస్ వద్ద వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులున్యాయవాదులను పీఎస్‌లోకి అనుమతించడం ేలేదుపోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు:న్యాయవాదులుహైకోర్టులో రిట్ పిటిషన్‌వేస్తాం: వైఎస్సార్సీపీ ప్రస్తుతం పోసాని ఆరోగ్యంగానే ఉన్నారు: డాక్టర్ గురుమహేష్బీపీ, షుగర్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయిగతంలో పోసాని గుండె నొప్కికి ట్రీట్మెంట్ తీసుకున్నారుపోలీసుల విచారణకు పోసాని సహకరిస్తున్నారుపోసాని స్ట్రెస్ ఫీలయితే ఇబ్బందులు ఎదురవుతాయి ఓబులవారిపల్లి పీఎస్‌కు పోసాని..ఎట్టకేలకు పోసానిని ఓబులవారిపల్లి పీఎస్‌కు పోసాని పోలీసులు తీసుకువచ్చారు.ఈ సందర్బంగా ఓబులవారిపల్లి పీఎస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పీఎస్‌లోనే పోసానికి వైద్య పరీక్షలు చేసే అవకాశం.వైద్య పరిక్షల అనంతరం పోసానిని అనంతపురం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. 👉పోసాని అరెస్ట్ విషయంలో ఏపీ పోలీసులు గేమ్ ఆడారు. అరెస్ట్ నోటీసుల్లో 27వ తేదీ(ఈరోజు తేదీ) వేశారు పోలీసులు. పోసాని కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్ట్ సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పీఎస్‌గా పోలీసులు పేర్కొన్నారు. కానీ, పోలీసులు ఇచ్చిన ఫోన్ నెంబర్లో ఓబులాపల్లి పీఎస్ అంటూ చెప్పుకొచ్చారు. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుంచి కేసులను డ్రైవ్ చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పోసాని ఎక్కడ?పోసానిని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు.బుధవారం రాత్రి 8:25 గంటలకు పోసాని అరెస్ట్.13 గంటలుగా పోలీసుల అదుపులోనే పోసాని.ఇప్పటికీ పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే దానిపై కచ్చితమైన సమాచారం ఇవ్వని పోలీసులు.పోసానిని రాజంపేట పీఎస్‌కు తరలిస్తారని సమాచారం.పోసాని ఆరోగ్య పరిస్థితిపై భార్య, కుమారుడు ఆందోళన.ఆయన తరఫు న్యాయవాదులకు సమాచారం ఇవ్వని పోలీసులు.వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లోని ఏ పీఎస్‌కు తీసుకెళ్తారనే దానిపై రాని స్పష్టత. పోసాని కృష్ణ మురళి అక్రమ అరెస్ట్‌తో బట్టబయలైన పోలీసుల కుట్ర బుధవారం రాత్రి పోసానిని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ.. అతని కుటుంబ సభ్యులకి ఇచ్చిన నోటీసుల్లో మాత్రం గురువారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న పోలీసులు ఇది నిబంధనల్ని ఉల్లఘించడం కాదా చంద్రబాబూ? ఇలాంటి పోలీసుల్ని ఏం చేయాలి?… pic.twitter.com/iFcfOCBNU7— YSR Congress Party (@YSRCParty) February 27, 2025👉అన్నమయ్య జిల్లా..పోసానితో ఫోన్లో మాట్లాడిన హైకోర్టు న్యాయవాది బాలన్యాయవాది బాల కామెంట్స్..సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించకుండా రాత్రి అరెస్టు చేయడం చట్ట విరుద్ధంనోటీసులు ముందుగా ఇవ్వకుండా, వయసు రీత్యా ఇబ్బందులు పోలీసులు ఇబ్బందులు పెట్టారుబెయిల్ పిటిషన్, రిజెక్షన్ ఆఫ్ అరెస్టు పిటిషన్‌ను రైల్వే కోడూరు కోర్టులో దాఖలు చేస్తున్నాంకాసేపట్లో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంది.అనంతరం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా..పోసాని అరెస్టును ఖండించిన తిరువూరు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ నల్లగట్ల స్వామి దాస్స్వామి దాస్ కామెంట్స్..రాజ్యాంగ విరుద్ధంగా అరెస్టు చేయటం కక్షపూరిత చర్యలే అనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసులు రాత్రి వేళ తరలించడం అన్యాయంకూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో భవిష్యత్తులో అదే గతి వారికీ పడుతుంది ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అన్యాయంబేషరతుగా పోసానిని విడుదల చేయాలి కృష్ణాజిల్లా..పోసాని అక్రమ అరెస్ట్‌ను ఖండించిన మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ పేర్ని కిట్టుపేర్ని కిట్టు కామెంట్స్..ఏపీలో అరెస్టుల పర్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుర్తుచేస్తోంది ఇలాంటి ఘటనలు ఇంతకుముందెన్నడూ ఎక్కడా జరగలేదుసోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అరెస్టులు చేస్తున్నారుమరి మీరు పెట్టిన పోస్టుల సంగతేంటి?.ఇప్పుడు జరుగుతున్న అరెస్టులకు పర్యవసానం కచ్చితంగా అనుభవిస్తారురూల్స్ దాటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న అధికారులను గుర్తు పెట్టుకుంటాం కర్నూలు జిల్లా..ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి కామెంట్స్..రాష్ట్రంలో అరాచక పాలన తప్ప ప్రజాపరిపాలన లేదురోజుకు ఒకరిని అక్రమ అరెస్ట్ చేస్తున్నారుపోసానిని అరెస్ట్ చెయ్యడం అక్రమంఏ కేసులో ఆయనను అరెస్ట్ చేస్తూన్నారో కుటుంబ సభ్యులకు తెలియ చెయ్యాలి కాని ఏమాత్రం చెప్పడం లేదు.చంద్రబాబు.. రానున్న కాలంలో మీకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిక.విశాఖ..పోసాని అరెస్ట్‌పై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఫైర్..పవన్, లోకేష్ ఇద్దరి దగ్గర రెడ్ బుక్స్ ఉన్నాయి..ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టులేక అక్రమ కేసులు పెడుతున్నారు..పోసాని అరెస్ట్ పవన్ కళ్యాణ్ ఆలోచనే..ప్రపంచ వ్యాప్తంగా ఏపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది.ప్రజలు అన్నీ గమనిస్తున్నారు తగిన గుణపాఠం చెప్తారు..భవిష్యత్ లో ఇంతకంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి..ప్రభుత్వం కేసులు పెడితే.. ఎదురించి నిలబడతాం..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారు? ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసానిపై కేసు నమోదు..ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదుజనసేన నాయకుడు మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుజనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ జోగినేని మణి ఫిర్యాదు నేపథ్యంలో అరెస్టుచెన్నరాజుపోడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జోగినేని మణిపవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదుహైదరాబాద్లోని తన స్వగృహంలో నిన్న రాత్రి పోసాని అరెస్టురాజంపేట కోర్టులో ప్రవేశపెడతామని తెలిపిన పోలీసులువ్యవస్థీకృత నేరమంటూ ఆఘమేఘాలపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు24వ తేదీన ఫిర్యాదు చేస్తే పూర్తి విచారణ జరగకుండానే నిన్న రాత్రి అరెస్టుతన ఆరోగ్యం బాగా లేదని, చికిత్స అనంతరం వస్తానని పోసాని కోరినా వినని పోలీసులు 111, ఇతర సెక్షన్ల కింద కేసులు..సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో 111, 196, 353, 299, 366(3)(4), 341, 61(2) సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు నమోదు చేశారు.శివరాత్రి పూట రెడ్ బుక్ రాజ్యాంగంలో రెచ్చిపోతున్న @ncbn ప్రభుత్వం. రాజకీయ కక్ష సాధింపే లక్ష్యంగా అక్రమ అరెస్టులుపోసాని కృష్ణమురళిని హైదారాబాద్ లోని ఆయన ఇంట్లోకి అక్రమంగా చొరబడి అరెస్టు చేసిన పోలీసులు.. ఇప్పటికే రాజయికీయాలకి దూరంగా ఉన్న పోసాని.. ఆరోగ్యం బాగోలేదని ఆయన సతీమణి… pic.twitter.com/ZnjBhYmwvJ— YSR Congress Party (@YSRCParty) February 26, 2025

TN Vs Centre: భాషా యుద్ధం.. ఇది ఈనాటిదేం కాదు!
జాతీయ విద్యా విధానం(National Education Policy 2020) అమలు విషయంలో.. తమిళనాడు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం వ్యవహారం మరింత ముదురుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా సంచలన ఆరోపణలు చేయగా.. బీజేపీ అంతే ధీటుగా బదులిచ్చింది. బలవంతంగా హిందీ భాషను రుద్ది.. స్థానిక భాషలను కనుమరుగయ్యే స్థాయికి చేర్చారంటూ ఆరోపిస్తున్నారాయన. సోదరీసోదరీమణుల్లారా.. గత 100 సంవత్సరాల్లో ఎన్ని భాషలను హిందీ మింగేసిందో తెలుసా? భోజ్‌పురి, మైథిలీ, అవాదీ, బ్రజ్, బుంధేలీ, ఖుమావోని, మఘాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌ఘడీ, అంగిక, సంతాలి, హో, ఖారియా, ఖోర్థా, కుర్మాలీ, ముండారీ, కురుఖ్.. ఇలా పాతికకుపైగా నాశనం చేసింది. ఇంకోన్ని భాషలు తమ మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఏకపక్షంగా హిందీని రాష్ట్రాలపై రుద్దేయాలన్న నిర్ణయం.. పురాతన భాషలను తుడిచి పెట్టేస్తోంది. ఉత్తర ప్రదేశ్, బీహార్లు హిందీకి గుండెకాయలు అని చెబుతుంటారు. కానీ, ఆ రాష్ట్రాల్లో అసలైన భాషలు అంతరించే స్థితికి చేరుకున్నాయి అని స్టాలిన్ పోస్ట్ చేశారు. హిందీ అమలు విషయంలో తమిళ రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని.. కేవలం 2026 ఎన్నికల్లో లాభం కోసమే పాకులాడుతున్నాయని కేంద్రం డీఎంకే ప్రభుత్వంపై మండిపడుతోంది. అయితే స్టాలిన్ ఈ విమర్శలను కూడా తిప్పికొట్టారు. తమిళనాడుకు మాత్రం ఆ నిర్ణయం(NEP) ఏవైపు దారి తీస్తుందో తెలుసని, అందుకే అమలు చేయబోమంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన.My dear sisters and brothers from other states,Ever wondered how many Indian languages Hindi has swallowed? Bhojpuri, Maithili, Awadhi, Braj, Bundeli, Garhwali, Kumaoni, Magahi, Marwari, Malvi, Chhattisgarhi, Santhali, Angika, Ho, Kharia, Khortha, Kurmali, Kurukh, Mundari and… pic.twitter.com/VhkWtCDHV9— M.K.Stalin (@mkstalin) February 27, 2025ఇదిలా ఉంటే.. స్టాలిన్ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆయన(Stalin) వాదన అసంబద్ధంగా(Silly)గా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తొలుత జాతీయ విద్యావిధానం అమలు చేస్తామని తమిళనాడు కూడా అంగీకరించిందని, ఆపై రాజకీయ లబ్ధి కోసమే యూటర్న్ తీసుకుందని మండిపడ్డారాయన. ఇక.. ఎన్ఈపీ అమలుకు సన్నద్ధంగా లేకపోవడం వల్లే తమిళనాడుకు వచ్చే రూ. 2,400 కోట్ల ఫండ్‌ను కేంద్రం ఆపేసిందన్న ఆరోపణలనూ మంత్రి ధర్మేంద్ర తోసిపుచ్చారు. ఎన్ఈపీ ప్రకారం రాష్ట్రాలు తమకు నచ్చిన భాషలను అమలు చేసే అవకాశం ఉందని, కానీ తమిళనాడు ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.హిందీ భాష అమలు విషయంలో కేంద్రం గనుక తమ రాష్ట్రంపై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే.. మరో భాషా యద్ధానికి(Language War) సిద్ధమంటూ సీఎం స్టాలిన్, ఆయన తనయుడు.. డిప్యూటీ సీఎం ఉదయ్‌నిధి స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాడు ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే..అప్పటి నుంచే అనుమానాలుభారత రాజ్యాంగం ప్రకారం 15 ఏళ్లపాటు హిందీతో పాటు ఇంగ్లీష్‌ను అధికారిక ఉత్తర్వుల కోసం వినియోగించాలని కానిస్టిట్యూట్ అసెంబ్లీ నిర్ణయించింది. దీని ప్రకారం.. జనవరి 26, 1950 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే 1965లో ఆ గడువు పూర్తి కావడంతో.. హిందీయేతర రాష్ట్రాలు ఆందోళన బాట పట్టాయి. బలవంతంగా తమ రాష్ట్రాల్లో హిందీ భాషను అమలు చేస్తారేమో అని ఉద్యమాలు మొదలుపెట్టాయి. తమిళ సంప్రదాయాలతో పాటు భాషప్రతిపాదికన మద్రాస్ గడ్డపై ద్రవిడ ఉద్యమం జరిగింది. అలాంటి చోట హిందీ భాష ప్రవేశపెట్టడంపై దశాబ్దాల నుంచే వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. 1965లో తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో భారీ హిందీ భాష అమలు వ్యతిరేక ఉద్యమం జరగ్గా.. అది హింసాత్మక మలుపు తీసుకుంది. హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ.. ఎంతో మంది బలిదానం చేసుకున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్‌ను తమిళనాడులో అధికార పీఠం నుంచి దించేయడానికి ఓ కారణమైంది. తమిళనాడులో రెండు భాషలే..సీఎన్ అన్నాదురై నేతృత్వంలోని తొలి డీఎంకే ప్రభుత్వం.. 1968లో తమిళనాడు కోసం ఓ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టింది. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం తమిళం, ఆంగ్లం మాత్రమే బోధించాలని ఉంది. అయితే అదే సమయంలో ఇందిరా గాంధీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం కొఠారి కమిషన్(1964-66) నివేదిక ఆధారంగా తొలిసారి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టింది. సమాన విద్యావకాశాలను ప్రొత్సహించడంతో పాటు జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా మూడు భాషల ఫార్ములాను ప్రవేశపెట్టాలని సదరు కమిషన్ సూచించింది. దీని ప్రకారం.. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలను సూచించింది. అయితే ఆ టైంలోనూ హిందీ తప్పనిసరి కాదని కేంద్రం చెప్పినా.. ఆ విద్యావిధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది.👉1968లో ఇందిరా గాంధీ హయాంలో మొదటి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. 14 ఏళ్లలోపు వారికి తప్పనిసరి విద్య, శాస్త్ర విజ్ఞాన రంగాలపై అవగాహన ద్వారా ఆర్థిక అభివృద్ధి, సమాన విద్యావకాశాలు, టీచర్లకు శిక్షణ.. ఇతర అంశాలతో కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఇందులో మూడు భాషల విధానం తీసుకొచ్చింది కేంద్రం. 👉ఇక.. 1986లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న టైంలో మరోసారి ఎన్ఈపీ తెరపైకి వచ్చింది. ఈసారి మూడు భాషల అంశం లేకుండా.. కేవలం విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు అన్ని వయసుల వారికి విద్యను అందించడం మీదనే ఫోకస్ చేసింది.👉ముచ్చటగా మూడోసారి.. పీవీ నరసింహారావు హయాంలో ప్రవేశపెట్టారు. అయితే.. 1986 ఎన్ఈపీకే కొన్ని మార్పులుచేర్పులు చేశారు. సమకాలీన సవాళ్లను ప్రస్తావిస్తూ.. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంపై ఆయన దృష్టిసారించారు.ఇక.. దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చే ఉద్దేశంతో.. 2020, జులై 29వ తేదీన జాతీయ విద్యా విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా 1986 జాతీయ విద్యా విధానాన్ని(ఇప్పుడు అమల్లో ఉన్నదే) సమూలంగా మార్చేసింది. జులై 29, 2020లో అప్పటి కేబినెట్ నూతన విద్యా విధానానికి ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం 10+2గా ఉన్న బేసిక్ అకడమిక్ వ్యవస్థను.. 5+3+3+4గా మార్పు చేయడంతో పాటు పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ ఎన్ఈపీ ప్రకారం.. మూడు లాంగ్వేజ్ ఫార్ములా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో హిందీ కూడా ఉంది. కానీ.. ఇది బలవంతపు నిర్ణయం కాదని కేంద్రం మొదటి నుంచి చెబుతోంది. రాష్ట్రాలు, రీజియన్లు, విద్యార్థులు తమకు నచ్చి భాషలను ఎంచుకునే వీలు ఉంటుందని చెబుతూ వస్తోంది. అయితే ఇది తమ మాతృభాషకు దొడ్డిదారిన ముప్పు కలిగించే ప్రయత్నమేనని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానం అమలు చేయబోమని చెబుతోంది. ఇక 2026లో ఈ విద్యావిధానం అమల్లోకి రానుంది.

సద్గురు ఈవెంట్‌కు డీకే.. ఉలిక్కిపడ్డ కాంగ్రెస్
బెంగళూరు: మహా శివరాత్రి సందర్బంగా నిన్న(బుధవారం) కోయంబత్తూరులో జగ్గీ వాసుదేవ్(సద్గురు) నిర్వహించిన ఈవెంట్ కు కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత డీకే శివ కుమార్ హాజరుకావడం ఆ పార్టీలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఆ ఈవెంట్ కు సద్గురుతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డీకే శివకుమార్ స్టేజ్ షేర్ చేసుకున్నారు. దీనికి కర్ణాటక కాంగ్రెస్ తో పాటు జాతీయ కాంగ్రెస్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావాజాలాలతో ఏర్పాటు చేసిన సద్గురు ఈవెంట్ కు డీకే శివ కుమార్ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనేది కాంగ్రెస్ ప్రశ్నగా ఉంది.దీనిపై ఏఐసీసీ సెక్రటరీ పీవీ మోహన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. శివ కుమార్ ట్యాగ్ చేసి మరీ పీవీ మోహన్ వివరణ అడిగారు. కాంగ్రెస్ సీనియర్ రాహుల్ గాంధీని పదే పదే విమర్శించే వారి ఈవెంట్ వెళ్లడమే కాకుండా, అందుకు థాంక్యూ చెప్పడాన్ని ఇక్కడ పీకే మోహన్ ప్రశ్నించారు.రాహుల్ చెప్పేది అదే.. అలా ఉంటే పార్టీని వదిలేయండని..శివ కుమార్ టార్గెట్ చేస్తూ చేసిన పోస్ట్ పై పీకే మోహన్ వివరణ ఇచ్చారు. ‘ నేను ఇక్కడ ఎవర్నీ విమర్శించడం లేదు. శివ కుమార్ భావజాలంపై నా అభిప్రాయం ఏమిటో నేను చెప్పాను. జగ్గీవాసుదేవ్ భావజాలం.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల భావజాలమే. దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. మాది సెక్యులర్ పార్టీ. మా నాయకుడు రాహుల్ గాంధీ పదే పదే చెప్పేది కూడా అదే. ఎవరైనా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉంటే పార్టీని వదిలేయొచ్చని చెబుతూనే ఉన్నారు. అదే నేను నా పోస్ట్ ద్వారా తెలియజేశాను’ అని పీకే మోహన్ పేర్కొన్నారు. Thanking for an invitation from someone who mocks RG, the hope of the nation&aligns with RSS’s narratives,while serving as a president of a secular party, it misleads party workers. It is Conviction rather than compromise ensures the party’s growth. Otherwise, it damages the core pic.twitter.com/x9hnxhbfF6— PV.MOHAN (@pvmohanINC) February 26, 2025

సత్య వర్ధన్‌కు నార్కో టెస్ట్‌లు చేయిస్తే నిజాలు బయటకొస్తాయి.. కోర్టులో వంశీ
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) పోలీసు కస్టడీ ముగిసింది. కస్టడీ అనంతరం పోలీసులు వంశీని విజయవాడ జిల్లా కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ వద్ద వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.సత్య వర్ధన్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే ఈ కేసులో అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని న్యాయమూర్తికి తెలిపారు. జైల్లో తనను ఒంటరిగా సెల్లో ఉంచారని,తనకు ఆస్తమా సమస్య ఉందని ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఇబ్బందని అని అన్నారు. అందుకే తనతో పాటు వేరే వారిని కూడా సెల్లో ఉంచాలని కోరారు.వంశీ విజ్ఞప్తిపై స్పందించిన న్యాయమూర్తి ఇప్పటికే మీకు దగ్గరలో అటెండర్ సౌకర్యం కల్పించారు కదా? అని ప్రశ్నించారు. అందుకు వంశీ భద్రత దృష్ట్యా మాత్రమే సెల్లో ఒంటరిగా ఉంచామని జైలు అధికారులు వివరణిచ్చారు. హెల్త్ పరిశీలనకు ఒక వార్డెన్‌ను ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో వంశీతో పాటు వేరే వారిని సెల్ ఉంచేందుకు న్యాయమూర్తి జైలు అధికారులకు జారీ చేశారు.

ఇమ్రాన్ ఖాన్ వల్లే నా పేరు చరిత్రలో నిలిచిపోయింది: టీమిండియా దిగ్గజం
మార్చి 7, 1987లో టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar). తద్వారా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు పద్నాలుగు మంది ఈ ఫీట్ నమోదు చేసినా.. ఈ జాబితాలోకి ఎక్కిన మొదటి ఆటగాడిగా గావస్కర్ పేరు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోతుంది.అయితే, ఇంతటి ఘనమైన రికార్డు సాధించడానికి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మాటలే కారణం అంటున్నాడు సునిల్ గావస్కర్. టెన్ స్పోర్ట్స్ షోలో భాగంగా పాక్ మాజీ సారథి వసీం అక్రం(Wasim Akram) అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని తెలిపాడు. ‘‘పదివేల పరుగులు సాధించడం అత్యద్భుతమైన అనుభూతి.వెయ్యి పరుగులు చేసినాక్రికెటర్గా కెరీర్ మొదలుపెట్టినప్పుడు నేను ఇక్కడిదాకా చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. వెయ్యి పరుగులు చేసినా ఇంతే సంతోషంగా ఉండేవాడినేమో!.. నిజానికి ఈ మైల్స్టోన్ చేరుకోవాలనే లక్ష్యం నాకైతే లేదు. ఏదేమైనా.. టెంజింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులుగా ఎలా చరిత్రలో నిలిచిపోతారో.. నేనూ ఈ మైలురాయికి చేరుకున్న మొదటి ఆటగాడిగా అలాగే గుర్తుండిపోతాను.నిజానికి నేను ఈ ఘనత సాధించడానికి ఏకైక కారణం ఇమ్రాన్ ఖాన్. అప్పుడు మేము ఇంగ్లండ్‌లో ఉన్నాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి ఓ ఇటాలియన్ రెస్టారెంట్లో భోజనానికి వెళ్లాము. 1986లో ఇది జరిగింది. ఆరోజు.. నేను ఇమ్రాన్‌తో ఇదే నా చివరి సిరీస్ అని చెప్పాను. ఆ తర్వాతరిటైరైపోతానని అన్నాను.అలా అస్సలు చేయొద్దుఅందుకు అతడు.. ‘లేదు.. లేదు.. అలా అస్సలు చేయొద్దు’ అన్నాడు. అందుకు నేను.. ‘ఎందుకు? ఇది నా ఇష్టం కదా’ అన్నాను. దీంతో ఇమ్రాన్ కలుగుచేసుకుంటూ.. ‘త్వరలోనే పాకిస్తాన్ జట్టు భారత్‌కు రాబోతోంది. అక్కడ మేము మీ జట్టును ఓడిస్తాం. నువ్వున్న భారత జట్టును ఓడిస్తేనే అసలు మజా. నువ్వు లేకుండా టీమిండియాను ఓడించడం నాకైతే నచ్చదు’ అన్నాడు.అవునా.. పాక్ టీమ్ ఇండియాకు వస్తుందా? నిజమా అని అడిగాను. అవును.. ఐసీసీ సమావేశం తర్వాత వచ్చే వారం ప్రకటన వస్తుంది చూడు అన్నాడు. ఒకవేళ ఆ అనౌన్స్మెంట్ వస్తే ఓకే. నేను ఆటలో కొనసాగుతా. లేదంటే రిటైర్ అవుతా అన్నాను. ఇక పాకిస్తాన్‌తో సిరీస్‌కు ముందు మరో రెండో మూడో మ్యాచ్‌లు జరిగాయి. అప్పటికి నేను బహుశా 9200- 9300 పరుగుల వద్ద ఉన్నాననుకుంటా.ఇమ్రాన్ ఖాన్ వల్లే నా పేరు చరిత్రలో నిలిచిపోయిందిఏదేమైనా ఇమ్రాన్ ఖాన్ వల్లే నాకు ఈ అరుదైన రికార్డు దక్కింది’’ అని గావస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా 1971 నుంచి 1987 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన సన్నీ 125 టెస్టులు, 108 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 34 శతకాలు, నాలుగు డబుల్ సెంచరీల సాయంతో 10122 రన్స్ చేసిన గావస్కర్.. వన్డేల్లో ఒక సెంచరీ సాయంతో 3092 పరుగులు సాధించాడు. 75 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. చదవండి: ఆస్ట్రేలియానూ వదలకండి: అఫ్గనిస్తాన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు

భారత్‌లో ఖరీదైన నివాసాలు వీరివే!.. జాబితాలో ఫస్ట్ ఎవరంటే?
ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, వీరిలో దాదాపు అందరూ.. విలాసవంతమైన జీవితాలను గడుపుతూ, ఖరీదైన బంగ్లాలు, వాహనాలు కలిగి ఉన్నారు. అయితే అత్యంత విలాసవంతమైన లేదా ఖరీదైన నివాసాలను కలిగి ఉన్న.. కుబేరులు ఎవరు? వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్స్ వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం..ముఖేష్ అంబానీభారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాసాన్ని కలిగి ఉన్నారు. ముంబైలో ఉన్న 27 అంతస్తుల నివాసం (ఆంటిలియా) విలువ దాదాపు రూ. 15,000 కోట్లు. ఇది కాకుండా దుబాయ్‌లోని పామ్ జుమేరాలో బంగ్లా, యూకేలోని బకింగ్‌హామ్‌షైర్ ఎస్టేట్, మాన్‌హట్టన్‌లో లగ్జరీ హోటల్ (న్యూయార్క్) వంటివి ఉన్నాయి.పంకజ్ ఓస్వాల్2023లో స్విట్జర్లాండ్‌లోని జింగిన్స్లో.. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవనాలలో ఒకటైన 'వరి విల్లా' (Vari Villa)ను కొనుగోలు చేశారు. 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణ కళాఖండాన్ని ఒబెరాయ్ ఉదయవిలాస్, ది లీలా హోటల్స్ వంటి వాటికి ప్రసిద్ధి చెందిన జెఫ్రీ విల్కేస్ రూపొందించారు. దీని ధర రూ. 1,650 కోట్లు.లక్ష్మీ మిట్టల్ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన.. లక్ష్మీ మిట్టల్ లండన్‌లో 'బిలియనీర్స్ రో'లో రెండు విలాసవంతమైన భవనాలను కలిగి ఉన్నారు. వీటి విలువ రూ. 2,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. ఇది మాత్రమే కాకుండా.. ఢిల్లీలో కూడా రూ. 31 కోట్ల ఖరీదైన బంగ్లా కలిగి ఉన్నారు. రియల్ ఎస్టేట్ కాకుండా.. క్వీన్స్ పార్క్ రేంజర్స్ అనే ఫుట్‌బాల్ క్లబ్‌కు యజమానిగా ఉన్నారు.అదార్ పూనవాలాసీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనవల్లా' 2023 చివరిలో లండన్‌లోని హైడ్ పార్క్ సమీపంలోని అబెర్కాన్వే హౌస్‌ను సుమారు రూ. 1,444 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది ఒకప్పుడు డొమినికా కుల్జిక్ యాజమాన్యంలో ఉండేది.హిందూజా బ్రదర్స్హిందూజా సోదరులు ప్రకాష్, అశోక్, శ్రీచంద్, గోపీచంద్.. కార్ల్టన్ హౌస్ టెర్రస్ అనే విలాసవంతమైన ఆరు అంతస్తుల విలాసవంతమైన ప్యాలెస్ కలిగి ఉన్నారు. ఇది లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ దగ్గర ఉంది. దీనిని 2006లో కొనుగోలు చేశారు. ఇది యూకేలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భవనాలలో ఒకటిగా ఉంది.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?రవి రుయాఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు 'రవి రుయా' 2023లో లండన్‌లోని హనోవర్ లాడ్జ్‌ను సుమారు రూ. 1,200 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది కూడా అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనాలలో ఒకటిగా ఉంది.

రాజమౌళిపై సంచలన ఆరోపణలు.. ఆమె కోసం నా జీవితాన్ని నాశనం చేశాడు: శ్రీనివాస్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌పై ఆయన స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి తనను భరించలేనంతగా టార్చర్ చేస్తున్నాడని ఒక సెల్ఫీ వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. తమ మధ్య 34 ఏళ్ల స్నేహ బంధం ఉందని ఆయన చెప్పారు. కానీ, రాజమౌళి చేస్తున్న టార్చర్ వల్ల తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.'భారతదేశంలోనే టాప్ డైరెక్టర్ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. నేను పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఎమ్ ఎమ్ కీరవాణి, గుణ్ణం గంగరాజు, చంద్ర శేఖర్ యేలేటి, హను రాఘవపూడి, మైత్రీ మూవీస్ చెర్రీ ఇలా చాలామందితో కలిసి నేను పనిచేశాను. వీళ్లందరికీ కూడా రాజమౌళితో నా స్నేహం గురించి తెలుసు. 1990 నుంచి మేమిద్దరం స్నేహితులం. రామాయణం, మహాభారతం ఒక మహిళ వల్ల జరిగాయంటే ఏమో అనుకున్నాం. కానీ, ఒక మహిళ వల్ల మా జీవితం ఇలా అవుతుందని కలలో కూడా ఊహించుకోలేదు. అందరి జీవితాల్లో మాదిరే మా లైఫ్‌లోకి ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళితోనే ఆమెకు పరిచయం.. ఆ తర్వాత నాతో కూడా స్నేహం. 'ఆర్య2' సినిమా మాదిరే మా జీవితాల్లోకి ఒక మహిళఆర్య2 సినిమా కథ మాదిరే మా స్టోరీ ఉంటుంది. మేము ముగ్గురం క్లోజ్ కాబట్టి ఏం చేద్దాం అంటూ నేనే రాజమౌళిని అడిగాను. ఆ అమ్మాయిని వదిలేయాలని రాజమౌళినే నన్ను కోరాడు. దానికి నేను ఒప్పుకోలేదు. ముగ్గురం కలిసే ఉందామని చెప్పాను. అలా చేస్తే చాలా చండాలంగా ఉంటుందని రాజమౌళి అన్నాడు. అప్పుడు ఆమెను నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి.. నలుగురం కలిసే ఉందామని కోరాను. దానికి కూడా రాజమౌళి ఒప్పుకోలేదు. కాలం అన్నీ మార్చేస్తుందని చెప్పి ఆమెకు దూరంగా ఉండమని నాకు రాజమౌళి చెప్పాడు. ఈ విషయం నుంచి తప్పుకోవాలని నన్ను కోరడంతో అందుకు ఓకే చెప్పాను. ఇదంతా జరిగింది మా కెరీర్ ప్రారంభం శాంతినివాసం సీరియల్ సమయంలో జరిగింది. అప్పుడు మా అందరి పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి నేను సైలెంట్‌గా ఉండిపోయాను. కొద్దిరోజుల పాటు నాతో రాజమోళి బాగానే ఉన్నాడు. అయితే, స్టార్ డైరెక్టర్‌గా రాజమౌళికి ఎప్పుడైతే స్టార్డమ్ వచ్చిందో గొడవలు మొదలుపెట్టాడు. వాడి కోసం నా 34 ఏళ్ల జీవితాన్ని వదులుకున్నాను. మన ట్రైయాంగిల్ స్టోరీని ఒక సినిమా తీస్తానని వాడితో ఒకరోజు అన్నందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు. వాడి పిల్లలను కూడా నేను దగ్గరుండే పెంచాను. నంబర్ వన్ డైరెక్టర్ కావడంతో నన్ను అడ్డుతొలిగించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు నాకు 54 ఏళ్లు .. పెళ్లి కూడా చేసుకోలేదు. సింగిల్‌గానే ఉంటున్నాను. వాడి వల్ల నా జీవితం నాశనం అయింది. ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయిపోయింది. వాడిని నేను ఏ విషయంలోను డిస్ట్రబ్ చేయలేదు. కానీ, ఈ రహస్యాలన్నీ అందరికీ చెప్పాననుకొని నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఇదంతా మా ముగ్గురి మధ్య జరిగింది. నేను చనిపోతున్నాను. ఆ తర్వాత అయినా సరే రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయండి. అసలు విషయం తెలుస్తుంది. ఇవన్నీ నా మరణ వాగ్మూలంగా తీసుకోవాలని కోరుతున్నాను.' అంటూ వీడియోలో శ్రీనివాసరావు చెప్పాడు. అయితే, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు. కేవలం అతను చెబుతున్న ప్రకారం మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో గురించి దర్శకులు రాజమౌళి రెస్పాండ్ అవుతారేమో చూడాల్సి ఉంది. అయితే, యమదొంగ సినిమా టైటిల్ కార్డ్‌లో తన పేరు కూడా ఉంటుందని శ్రీనివాసరావు చెప్పడం గమనార్హం . వివాదంలో స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి జక్కన్న పై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు. రాజమౌళి టార్చర్ భరించలేని ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందన్న శ్రీనివాసరావు. సెల్ఫీ వీడియో, లెటర్ ఆధారంగా… pic.twitter.com/VKQT3AlfY3— ChotaNews App (@ChotaNewsApp) February 27, 2025
ఐటీ హాబ్‌గా మేడ్చల్ జిల్లా!
సల్మాన్ ఖాన్ యాక్షన్ చిత్రం.. టీజర్ వచ్చేసింది
మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌కు వరకట్న వేధింపులు.. భర్త భారత మాజీ కబడ్డీ ప్లేయర్
‘రాజకీయాలు చేయడం కోసం వెళ్లారా?’
ఇమ్రాన్ ఖాన్ వల్లే నా పేరు చరిత్రలో నిలిచిపోయింది: టీమిండియా దిగ్గజం
అత్యాచార ఘటనపై మాజీ సీజేఐ చంద్రచూడ్ ఏమన్నారంటే..
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు
డాక్టర్లు, ఇంజినీర్లు అవుతారనుకుంటే..
సిద్దార్థ్‌కు, నాకు పడేది కాదు.. 'బాయ్స్'లో నాకే ఎక్కువ పారితోషికం: తమన్
SRH: హైదరాబాదీలకు పండుగే.. సన్‌రైజర్స్ ప్రాక్టీస్ ఆరోజే మొదలు
'ఉండమీరి పెళ్లి జోడ'.. కోయ భాషలో శుభలేఖను చూశారా..?
Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు
అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!
టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ?
కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ..
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
ఇంకెందుకు ఆలస్యం సార్! ఈ ఐడియా నాదేనని.. తొలి లైను అమరావతికేనని చెప్పేయండి!
రాజమౌళిపై సంచలన ఆరోపణలు.. ఆమె కోసం నా జీవితాన్ని నాశనం చేశాడు: శ్రీనివాస్
OTT: 13 వారాలుగా ట్రెండింగ్‌లో తెలుగు సినిమా
బంగారం కొనడానికి ఇది మంచి సమయం!.. మళ్ళీ తగ్గిన గోల్డ్ రేటు
ఐటీ హాబ్‌గా మేడ్చల్ జిల్లా!
సల్మాన్ ఖాన్ యాక్షన్ చిత్రం.. టీజర్ వచ్చేసింది
మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌కు వరకట్న వేధింపులు.. భర్త భారత మాజీ కబడ్డీ ప్లేయర్
‘రాజకీయాలు చేయడం కోసం వెళ్లారా?’
ఇమ్రాన్ ఖాన్ వల్లే నా పేరు చరిత్రలో నిలిచిపోయింది: టీమిండియా దిగ్గజం
అత్యాచార ఘటనపై మాజీ సీజేఐ చంద్రచూడ్ ఏమన్నారంటే..
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు
డాక్టర్లు, ఇంజినీర్లు అవుతారనుకుంటే..
సిద్దార్థ్‌కు, నాకు పడేది కాదు.. 'బాయ్స్'లో నాకే ఎక్కువ పారితోషికం: తమన్
SRH: హైదరాబాదీలకు పండుగే.. సన్‌రైజర్స్ ప్రాక్టీస్ ఆరోజే మొదలు
'ఉండమీరి పెళ్లి జోడ'.. కోయ భాషలో శుభలేఖను చూశారా..?
Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు
అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!
టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ?
కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ..
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
ఇంకెందుకు ఆలస్యం సార్! ఈ ఐడియా నాదేనని.. తొలి లైను అమరావతికేనని చెప్పేయండి!
రాజమౌళిపై సంచలన ఆరోపణలు.. ఆమె కోసం నా జీవితాన్ని నాశనం చేశాడు: శ్రీనివాస్
OTT: 13 వారాలుగా ట్రెండింగ్‌లో తెలుగు సినిమా
బంగారం కొనడానికి ఇది మంచి సమయం!.. మళ్ళీ తగ్గిన గోల్డ్ రేటు
సినిమా

మజాకా హీరోయిన్ మూవీ.. ఏడేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం 'ధృవ నచ్చితిరమ్'(తెలుగులో ధృవ నక్షత్రం ). 2017లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటివరకు థియేట్రికల్ రిలీజ్ కాలేదు. ఈ మూవీని గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో తెరకెక్కించారు. 2018లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు అనివార్య కారణాలతో పాటు ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు ఏడేళ్లుగా ఈ మూవీ విడుదలకు మోక్షం మాత్రం లభించడం లేదు. గతేడాది కూడా రిలీజ్ అవుతుందని వార్తలొచ్చినా అలా మాత్రం జరగలేదు. అయితే ఈ చిత్రంలో మజాకా మూవీ హీరోయిన్ రీతూ వర్మ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై మరోసారి టాక్ వినిపిస్తోంది. అన్ని సజావుగా సాగితే ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుందని తాజా సమాచారం. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్ని కుదిరితే మే 1న కార్మిక దినోత్సవం రోజున ధృవ నచ్చతిరమ్ థియేటర్లలో విడుదలయ్యే అవకాశముంది. అదే జరిగితే సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తోన్న రెట్రోతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. గతంలో ధృవ నచ్చతిరమ్ మూవీని మొదట సూర్యతో ప్లాన్ చేశారు. కానీ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో విభేదాల కారణంగా సూర్య ఈ చిత్రం నుండి వైదొలిగాడు. ఆ తర్వాత చియాన్ విక్రమ్‌ని సినిమాను తెరకెక్కించాడు. కాగా.. 2017లో సెట్స్‌పైకి వెళ్లిన ధృవ నచ్చితిరమ్ ఆర్థికపరమైన సమస్యలతో 2023లో పూర్తయింది. అప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మాత్రం విడుదల కాలేదు. కాగా.. ఈ చిత్రంలో నటుడు సిమ్రాన్, పార్థిబన్, రాధిక శరత్‌కుమార్, వినాయకన్, దివ్యదర్శిని, వంశీకృష్ణ ముఖ్యపాత్రలు పోషించారు.

నాకు పుట్టబోయే పిల్లల్ని కూడా వదల్లేదు: ప్రియమణి
ప్రేమకు కులమతాలతో పట్టింపు లేదు. అది కేవలం హృదయాల్ని తాకుతుంది. మనసుల్ని ఒక్కటి చేస్తుంది. సమాజం విధించిన కట్టుబాట్లను కాదనుకుని మనసు మాట విని పెళ్లి చేసుకున్నవారికి సూటిపోటి మాటలు తప్పడం లేదు. ఈ విషయంలో ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటునే ఉన్నానంటోంది హీరోయిన్ ప్రియమణి (Priya Mani Raj). ఈమె 2017లో ప్రియుడు ముస్తఫ రాజ్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు తనపై ట్రోలింగ్ జరుగుతూనే ఉందని చెప్తోంది.సంతోషాన్ని పంచుకుందామనుకుంటే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ.. నేను నా సంతోషకర క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాను. అలా నా ఎంగేజ్మెంట్ విషయాన్ని ఓ రోజు సోషల్ మీడియాలో వెల్లడించాను. విచిత్రంగా చాలామందికి మా జంటపై విపరీతమైన అనుమానాలు పుట్టుకొచ్చాయి. అతడు నన్ను మతం మార్పిడికి ఒత్తిడి తెస్తాడని ఏవేవో ఊహించుకుని మాపై విషం కక్కారు. జనాలు ఎంతదూరం వెళ్లారంటే.. రేపు మాకు పుట్టబోయే పిల్లలు ఐసిస్‌లో చేరతారని కామెంట్లు చేశారు.ఇప్పటికీ అంతే..నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని అయినంతమాత్రాన మీ నోటికి ఏదొస్తే అది అనేస్తారా? అసలు సంబంధం లేని వ్యక్తుల్ని కూడా విమర్శిస్తారా? ఆ ట్రోలింగ్ వల్ల రెండు, మూడు రోజులపాటు నేను మనిషిని కాలేకపోయాను. ఇప్పటికీ నా భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తే చాలు.. పదిలో తొమ్మిది కామెంట్లు మతం లేదా కులం గురించే ఉంటాయి అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రియమణి చివరగా ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే మలయాళ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం విజయ్ జన నాయగన్ మూవీ చేస్తోంది. అలాగే ద ఫ్యామిలీ మ్యాన్ 3లో నటిస్తోంది.చదవండి: OTTలో తెలుగు సినిమా.. నాలుగు నెలల తర్వాత స్ట్రీమింగ్

హీరోయిన్‌తో సెల్ఫీ కోసం ఎగబడ్డ బాబాలు.. వీడియో వైరల్
సినిమా తారలు బయట కనిపించడం చాలా అరుదు. సినిమా ప్రమోషన్స్ కోసమో లేదా ఏదైనా షాప్ ఓపెనింగ్ సమయంలోనూ వారు బయటకు వస్తారు. అందుకే వాళ్లని ప్రత్యేక్షంగా చూసేందుకు సామాన్య జనం ఆసక్తి చూపిస్తారు. బయట కనిపిస్తే ఫోటోల కోసం ఎగబడతారు. ఇదంతా అభిమానులు, సామాన్యులు చేసే పని. కానీ ఓ హీరోయిన్‌తో ఫోటో దిగేందుకు బాబాలు పోటీ పడ్డారు. ఆమెను సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ఈ విచిత్ర ఘటన హీరోయిన్ ఆమీషా పటేల్(Ameesha Patel)కి ఎదురైంది.శివరాత్రి వేడుకలో..మహా శివరాత్రి సందర్భంగా బుధవారం సినీ నటి ఆమీషా పటేల్ ముంబై జుహూలోని శివాలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం ఆమె బయటకు వస్తుండగా.. అక్కడి భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. సామాన్య భక్తులతో పాటు గుడిలో ఉన్న సాధువులు కూడా ఆమీషాతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ఆమె కాసేపు నవ్వుతూ అందరికి సెల్ఫీలు ఇచ్చింది. అయితే బాబాలు పెద్ద ఎత్తున రావడంతో ఆమెకు ఇబ్బందిగా మారింది. దీంతో అక్కడ సిబ్బంది వారందరిని పక్కకి పంపిస్తూ.. ఆమీషాను కారు వద్దకు తీసుకెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది వద్దని చెప్పినా వినకుండా సాధువులు ఫోటో కోసం ఆమీషా వెంటపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధువులు కూడానా?హీరోయిన్‌తో సెల్ఫీ కోసం సాధువులు ఎగబడడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు వీరంతా నకిలీ బాబాలు అని.. నిజమైన బాబాలకి ఇలాంటి లక్షణాలు ఉండవని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. చివరికి సాధువులు కూడా ఇలా తయారయ్యారేంటి అని మరికొంతమంది ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా ఆమీషాకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఎవరీ అమీషా పటేల్?ముంబైలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ కహో నా.. ప్యార్ హై (2000) సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. అదే ఏడాది బద్రి మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ మరుసటి ఏడాది గదర్: ఏక్ ప్రేమ్ కథ చిత్రంతో స్టార్ స్టేటస్ అందుకుంది. దీంతో వరుసగా హిందీలో అవకాశాలు క్యూ కట్టాయి. యే జిందగీ కా సఫర్, క్రాంతి, హమ్రాజ్, ఆప్ ముజే అచ్చే లగ్నే లగ్నే, తథాస్తు, మంగళ్ పాండే, వాదా, భూల్ భులయ్యా, తోడా ప్యార్ తోడా మ్యాజిక్, రేస్ 2.. ఇలా ఎన్నో చిత్రాలు చేసింది.తెలుగులో మహేశ్‌బాబు సరసన నాని , బాలకృష్ణతో నరసింహుడు పరమవీరచక్ర మూవీస్‌లో నటించింది. 2018లో వచ్చిన భయ్యాజీ సూపర్ హిట్ మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. గదర్ 2తో 2023లో రీఎంట్రీ ఇచ్చింది.హీరోయిన్ అమీషా పటేల్‌తో ఫోటోల కోసం ఎగబడ్డ బాబాలుమహాశివరాత్రి సందర్భంగా ముంబై - జుహూలో ఓ శివాలయానికి వెళ్లిన హీరోయిన్ అమీషా పటేల్‌ను చుట్టుముట్టి ఫోటోల కోసం ఎగబడ్డ బాబాలు pic.twitter.com/iLeZJd9OfE— Telugu Scribe (@TeluguScribe) February 27, 2025

50 ఏళ్లొచ్చాయి మళ్లీ మొగుడ్ని వెతుకు.. నటిపై కంగన ఘాటు వ్యాఖ్యలు
బాలీవుడ్లో కంగనా రనౌత్ (Kangana Ranaut) బాగా స్పెషల్. నటనా పరంగా ఎంచుకునే పాత్రలు మాత్రమే కాదు నిజజీవితంలోనూ ఫైర్ బ్రాండ్‌గానే కనిపిస్తుంది. తన వాగ్భాణాలతో ఆనేకసార్లు వార్తల్లో నిలిచిన కంగన ఇప్పుడు దేశంలో, ముఖ్యంగా సినిమా పరిశ్రమలో నడుస్తున్న విడాకుల ట్రెండ్ మీద విరుచుకుపడింది. తరచుగా భారతీయతను ప్రస్తుతిస్తూ మాట్లాడే కంగన... ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయ వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని వివరించడం విశేషం. మన దగ్గర భార్యాభర్తల బంధాలు ఎంత బలమైనవో చెప్పేందుకు ఆమె పాశ్చాత్య దేశాలతో పోల్చారు. దీని కోసం తాజాగా పాప్ స్టార్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ (Jennifer Lopez) విడాకులు తీసుకున్న ఉదంతాన్ని ప్రస్తావించారు.జెన్నిఫర్ లోపెజ్ మరో హాలీవుడ్ (Hollywood) టాప్ స్టార్ బెన్ అఫ్లెక్‌ను 2022లో వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అధికారికంగా విడాకులు (Divorce) తీసుకున్నారు. తమ రెండేళ్ల వివాహాన్ని ముగించాలని లోపెజ్ పిటిషన్ దాఖలు చేసిన ఆరు నెలల తర్వాత ఫిబ్రవరి 21న విడాకులు అమలులోకి వచ్చాయి. జనవరిలో లాస్ఏంజెలస్ కోర్టు ఆమోదించిన తర్వాత జెన్నిఫర్ లోపెజ్ తన పేరు నుండి ‘అఫ్లెక్‘ని తొలగించింది. నిజానికి లోపెజ్ పిటిషన్ దాఖలు చేయడానికి ఒక సంవత్సరం ముందే వారు విడిపోయారు. అంటే వీరిద్దరూ పట్టుమని రెండేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. అఫ్లెక్‌కు మాజీ భార్య జెన్నిఫర్ గార్నర్ (Jennifer Garner)తో ముగ్గురు పిల్లలు, లోపెజ్కు మార్క్ ఆంథోనీతో కవల పిల్లలు ఉన్నారు.వీరి ఉదంతాన్ని కంగన తన ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్ లో ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ పాప్ ఐకాన్లలో ఒకరైన జెన్నిఫర్ లోపెజ్– బోలెడంత కీర్తి, పుష్కలంగా సంపద జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ పెళ్లి బంధాన్ని నిలబెట్టుకోలేకపోతున్న విషయాన్ని కంగన ఎత్తి చూపింది. ఎందరో మగాళ్లతో సంబంధాలు పెట్టుకుని పలు మార్లు పెళ్లిళ్లు చేసుకున్న లోపెజ్ ఇప్పుడు వయసు యాభై దాటాక కూడా సరైన జీవిత భాగస్వామిని వెదుక్కుంటూనే ఉందనే విషయాన్ని కంగన ప్రస్తావించింది. ఈ సందర్భంగా ఆమె సాంప్రదాయ భారతీయ వివాహాలను పాశ్చాత్యులు ఎగతాళి చేయడాన్ని తప్పుపట్టిం. 'వారు భారతీయ వివాహాలను ఎగతాళి చేసినప్పుడల్లా ఇది గుర్తుంచుకోవాలి. అత్యంత తెలివైన/మంచిగా కనిపించే నటుడు/చిత్రనిర్మాత/రచయిత, భూమిపై అత్యంత హాటెస్ట్ మ్యాన్ అని ఎందరో పొగిడే బెన్ అఫ్లెక్... పిల్లలు పుట్టినా, పెళ్లిళ్లు చేసుకున్నా, ఇప్పటికీ పరిపూర్ణ భార్య కోసం ఎదురుచూస్తున్నాడనీ, అలానే జెన్నిఫర్ లోపెజ్ కూడా స్వీయ నిర్మిత ధనవంతురాలు, గొప్ప పాప్ స్టార్లలో ఒకరైనా ఇప్పటికీ ఓ పరిపూర్ణ వ్యక్తి కోసం వెతుకుతున్నారనీ... వీరిద్దరూ ఎవరికి వారే గొప్ప కాబట్టి వారికి ఎవరూ సరిపోరు కాబట్టి కొంతకాలానికే కనపడే లోపాలతో విసిగిపోతున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్నో ప్రమాణాలు చేసి, కొన్ని నెలల వ్యవధిలోనే బ్రతుకు జీవుడా అంటూ వ్యతిరేక దిశల్లో పరుగెత్తారు' అంటూ కంగన ఎద్దేవా చేసింది.ఈ సందర్భంగా కంగన తన వ్యక్తిగత అనుభవాల నుంచి తన పరిశీలనలను కూడా పంచుకుంది, పాశ్చాత్య సమాజం తరచుగా ‘పరిపూర్ణ‘ మ్యాచ్ కోసం శాశ్వత అన్వేషణను ఎంచుకుంటుందని వెల్లడించింది. అక్కడ వ్యక్తులు సాహచర్యాన్ని కనుగొనడానికి డేటింగ్ యాప్‌లపై ఆధారపడతారనీ, అయితే భారతీయ ఆచారాలు దీనికి విరుద్ధమని చెప్పింది. మన దేశంలో అపరిచితులను వివాహం చేసుకున్నా కూడా వృద్ధాప్యంలో ఒకరినొకరు చేతులు పట్టుకుని కలిసి నడిచే లోతైన బంధాన్ని ఏర్పరచుకుంటారని ఆమె పొగడ్తలు గుప్పించింది. చదవండి: నటుడి లవ్ మ్యారేజ్.. పిల్లల కోసం ఆలోచించేలోపు విడాకుల దిశగా..‘‘పాశ్చాత్య దేశాలలో సంబంధాలు తరచుగా తాత్కాలికంగా మారతాయనీ అయితే, భారతదేశంలో బలమైన సంప్రదాయాల పునాదులపై నిర్మించిన వివాహాలు జీవితకాలం కొనసాగుతాయనీ అన్నారామె. 80 ఏళ్ల వయస్సులో కూడా వృద్ధ జంటలు చేతులు జోడించి విహరించడాన్ని చూస్తున్న మనం పాశ్చాత్య ఆదర్శాలను ఆరాధించే బదులు, కాలక్రమేణా కొంత బలహీనపడినా మన స్వంత సాంస్కృతిక విలువలను పునరుద్ధరించుకోవాలనీ పాశ్చాత్య దేశాల నుంచి మార్గదర్శకత్వం పొందడం మానుకోవాలనీ హితవు చెప్పింది. గతంలో కూడా కంగన బాలీవుడ్ సినిమాల్లో వివాహ చిత్రణ గురించి తన ఆందోళనలను వ్యక్తం చేసింది. వివాహ సంబంధాల సారాంశాన్ని బాలీవుడ్ ప్రేమకథలు తప్పుగా సూచిస్తున్నాయని ఆమె విమర్శించింది.చదవండి: కొన్నేళ్లుగా మాటల్లేవ్.. విడాకులకు కారణం ఇదేనా?కంగన చివరి చిత్రం ఎమర్జెన్సీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. అయితే ఈ చిత్రం చలనచిత్ర విమర్శకుల నుంచి ప్రతికూల సమీక్షలను దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆమె తన తదుపరి చిత్రంలో మాధవన్‌తో కలిసి నటిస్తోంది.
క్రీడలు

Champions Trophy: పాకిస్తాన్‌కు చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాలన్న పాకిస్తాన్ ఆశలపై వరణుడు నీళ్లు చల్లాడు. వర్షం కారణంగా పాక్- బంగ్లాదేశ్(Pakistan vs Bangladesh) మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ రద్దైపోయింది. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ వన్డే టోర్నమెంట్ బరిలో దిగిన పాకిస్తాన్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. అదేమిటంటే....కాగా 2017 తర్వాత చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరగటం ఇదే తొలిసారి. నాడు టైటిల్ గెలిచిన పాకిస్తాన్ ఈసారి ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులను సంపాదించింది. తద్వారా వన్డే వరల్డ్‌కప్-2023(ICC ODI World Cup)లో చెత్త ప్రదర్శన కనబరిచినా ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా అర్హత సాధించింది. ఇక ఈ టోర్నీలో పాక్‌తో పాటు గ్రూప్-‘ఎ’లో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ భాగమయ్యాయి. ఫిబ్రవరి 19న ఈ టోర్నమెంట్ మొదలుకాగా.. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్- న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో కివీస్ జట్టు గెలిచింది. రెండు ఓటములు.. సెమీస్ ఆశలు గల్లంతుఅనంతరం పాకిస్తాన్ దాయాది టీమిండియాతో పోరులోనూ ఓడిపోయింది. ఈ క్రమంలో సెమీస్ చేరే అవకాశాన్ని పోగొట్టుకున్న రిజ్వాన్ బృందం.. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావించింది. లీగ్ దశలో చివరగా బంగ్లాదేశ్‌తో గురువారం మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కాగా.. వర్షం రూపంలో చేదు అనుభవం ఎదురైంది.రావల్పిండిలో ఎడతెగని చినుకుల కారణంగా టాస్ పడకుండానే పాక్- బంగ్లా మ్యాచ్ ముగిసిపోయింది. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో గ్రూప్-‘ఎ’ పాయింట్ల పట్టికలో అట్టడుగున నాలుగో స్థానంతో టోర్నీని ముగించింది. బంగ్లాదేశ్‌తో సమానంగా ఒక పాయింట్ సాధించినప్పటికీ నెట్ రన్‌రేటు పరంగా పాక్ వెనుబడి ఉండటం ఇందుకు కారణం.పాకిస్తాన్ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగాఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో గ్రూప్ దశ(2002 నుంచి) ప్రవేశపెట్టిన తర్వాత.. ఒక్క విజయం కూడా సాధించకుండా.. అదే విధంగా పాయింట్ల పట్టికలో ఆఖరున నిలిచిన తొలి జట్టుగా పాకిస్తాన్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఓవరాల్‌గా ఈ జాబితాలో కెన్యా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. 2000 సంవత్సరంలో చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చిన కెన్యా ఒక్కటీ గెలవకుండానే నిష్క్రమించింది.ఇదే కాకుండా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో చాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఇంటిబాట పట్టిన రెండో జట్టుగానూ పాకిస్తాన్ నిలిచింది. 2009, 2013 ఎడిషన్లలో ఆస్ట్రేలియా కూడా మూడు మ్యాచ్‌లలో ఒక్కటి గెలవలేదు. వర్షం వల్ల ఓ మ్యాచ్ రద్దు కావడంతో ఇప్పుడు పాక్ మాదిరే వరణుడి వల్ల ఒక్క పాయింట్ సాధించగలిగింది.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ ప్రయాణం👉ఫిబ్రవరి 19- కరాచీలో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి👉ఫిబ్రవరి 23- దుబాయ్‌లో టీమిండియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి👉ఫిబ్రవరి 27- రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దుగ్రూప్-‘ఎ’ పాయింట్ల పట్టిక1. న్యూజిలాండ్- ఆడినవవి రెండు- గెలిచినవి రెండు- పాయింట్లు నాలుగు- నెట్ రన్‌రేటు+0.863(సెమీస్‌కు అర్హత)2. ఇండియా- ఆడినవవి రెండు- గెలిచినవి రెండు- పాయింట్లు నాలుగు- నెట్ రన్‌రేటు +0.647(సెమీస్‌కు అర్హత)3. బంగ్లాదేశ్- మ్యాచ్‌లు మూడు- ఓడినవి రెండు- ఒకటి రద్దు ఒక పాయింట్- నెట్ రన్‌రేటు-0.443(ఎలిమినేటెడ్)4. పాకిస్తాన్- మ్యాచ్‌లు మూడు- ఓడినవి రెండు- ఒకటి రద్దు ఒక పాయింట్- నెట్ రన్‌రేటు-1.087 (ఎలిమినేటెడ్).చదవండి: ఆస్ట్రేలియానూ వదలకండి: అఫ్గనిస్తాన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు

రంజీ ట్రోఫీ ఫైనల్.. విదర్భ భారీ స్కోర్.. పోరాడుతున్న కేరళ
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) ఎడిషన్ ఫైనల్లో గతేడాది రన్నరప్ విదర్భ (Vidarbha), తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళ (Kerala) తలపడుతున్నాయి. విదర్భలోని నాగ్‌పూర్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కేరళ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (379) చేసింది. యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (86) అతనికి సహకరించాడు. దురదృష్టవశాత్తు కరుణ్ సెంచరీకి ముందు రనౌటయ్యాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (14), రోహన్ కన్నుమ్మల్ (0) నిరాశపర్చగా.. ఆదిత్య సర్వటే (66 నాటౌట్), అహ్మద్ ఇమ్రాన్ (37) సాయంతో కేరళ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసిన సర్వటే.. కెప్టెన్ సచిన్ బేబితో (7) కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 14 పరుగులకే ఇద్దరు కేరళ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపాడు. యశ్ ఠాకూర్ క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న ఇమ్రాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. కేరళ.. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 248 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఆసీస్‌నూ వదలకండి: అఫ్గన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టుపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్(Afghanistan vs England)తో మ్యాచ్‌లో హష్మతుల్లా బృందం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందని.. ఇదే జోరులో ఆస్ట్రేలియాను కూడా ఓడించాలని ఆకాంక్షించాడు. అఫ్గన్ ఆటగాళ్లను చూస్తుంటే ముచ్చటేస్తుందని... దేశం మొత్తాన్ని గర్వించేలా చేశారని కొనియాడాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా అఫ్గనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్-‘బి’లో ఉంది. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 107 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది అఫ్గనిస్తాన్. అయితే, తదుపరి మ్యాచ్‌లో మాత్రం అద్బుత విజయంతో సెమీస్ రేసులోకి దూసుకువచ్చింది.ఇంగ్లండ్ నిష్క్రమించగా..లాహోర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో అనూహ్య రీతిలో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఎనిమిది పరుగుల తేడాతో బట్లర్ బృందాన్ని ఓడించింది. దీంతో ఇంగ్లండ్ ఈ ఐసీసీ వన్డే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. అఫ్గనిస్తాన్ తదుపరి ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితాన్ని బట్టే గ్రూప్-బి నుంచి సెమీస్ చేరబోయే జట్లు ఖరారు కానున్నాయి.మీరేం బాధపడకండి సోదరా..!ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అఫ్గనిస్తాన్ జట్టును ఆకాశానికెత్తాడు. ‘‘మీకు శుభాకాంక్షలు. మీ విజయం పట్లనాకెంతో సంతోషంగా ఉంది. గుల్బదిన్(అఫ్గనిస్తాన్ ఆల్‌రౌండర్)ను కలిసినపుడు.. ‘మీరు ఇంగ్లండ్‌ను తప్పక ఓడించాలి’ అని అతడితో అన్నాను. అప్పుడు అతడు.. ‘మీరేం బాధపడకండి సోదర.. వాళ్లను మేము అస్సలు ఉపేక్షించం.. ఓడించి తీరతాం’ అన్నాడు.ఆ తర్వాత నేను.. ‘ఆస్ట్రేలియాను కూడా మీరు ఓడించాలి’ అని కోరాను. దుబాయ్‌లో ఉన్నపుడు నేను గుల్బదిన్తో ఈ మాటలు చెప్పాను. ఏం చేసైనా ఇంగ్లండ్‌పై గెలుపొందాలని అతడికి బలంగా చెప్పాను. ఈరోజు అఫ్గనిస్తాన్ ఆ పని చేసి చూపించింది. ఆటలో ఎలా ముందుకు దూసుకువెళ్లాలో చెబుతూ గొప్ప పరిణతి కనబరిచింది.పటిష్ట జట్టును ఓడించింది. ఈరోజు మీదే. అయితే, సెమీ ఫైనల్ చేరాలనే లక్ష్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఏం జరిగిందో గుర్తుంది కదా. ఈసారి అది పునరావృతం కాకూడదు. ఆసీస్‌నూ వదలకండినిజానికి మీరు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లతో కూడిన కఠినమైన గ్రూపులో ఉన్నారు. అయినా, సరే ఈరోజు అత్యద్భుతంగా ఆడారు. మాకు మజానిచ్చే మ్యాచ్ అందించినందుకు ధన్యవాదాలు’’ అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఇంగ్లండ్‌ను ఓడించిన హష్మతుల్లా షాహిది బృందం.. ఈసారి కూడా వారిపై గెలుపొందింది. అయితే, నాటి టోర్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ విజయానికి చేరువైన సమయంలో గ్లెన్ మాక్స్వెల్ భీకర ద్విశతకంతో అఫ్గన్ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ఈ క్రమంలోనే అక్తర్ ఈసారి అఫ్గనిస్తాన్ మరింత జాగ్రత్తగా ఆడాలని సూచించాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: అఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్👉వేదిక: గడాఫీ స్టేడియం, లాహోర్👉టాస్: అఫ్గనిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉అఫ్గనిస్తాన్ స్కోరు: 325/7 (50)👉ఇంగ్లండ్ స్కోరు: 317 (49.5)👉ఫలితం: ఇంగ్లండ్‌పై ఎనిమిది పరుగుల తేడాతో అఫ్గన్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఇబ్రహీం జద్రాన్(146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 177 రన్స్).చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్

Champions Trophy 2025: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy 2025) భాగంగా పాకిస్తాన్ (Pakistan), బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య ఇవాళ (ఫిబ్రవరి 27) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో టాస్ కూడా పడలేదు. ప్రస్తుత ఎడిషన్‌లో వర్షం కారణంగా రద్దైన రెండో మ్యాచ్ ఇది. ఫిబ్రవరి 25న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా ఇలాగే టాస్ కూడా పడకుండా రద్దైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ గ్రూప్-ఏలో భాగంగా జరగాల్సిన నామమాత్రపు మ్యాచ్. ఈ గ్రూప్ నుంచి ఈ రెండు జట్లు ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడాయి. ఆతిథ్య దేశ హోదాలో నేటి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పాకిస్తాన్ భావించింది. అయితే వరుణుడు వారి ఆశలపై నీళ్లు చల్లాడు. ఆతిథ్య దేశంగా పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే పాక్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. పాక్‌తో పోలిస్తే మెరుగైన రన్‌రేట్ కలిగిన బంగ్లాదేశ్ మూడో స్థానంలో ముగించింది. టోర్నీ ప్రారంభానికి ముందు పాక్‌లాగే బీరాలు పలికి బంగ్లాదేశ్ కూడా ఒక్క విజయం కూడా లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏలో చివరి మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ కూడా నామమాత్రంగానే సాగనుంది. ఈ మ్యాచ్ మార్చి 2న దుబాయ్‌లో జరుగనుంది.గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్త్‌లు ఖరారైనా.. గ్రూప్-బిలో పోటీ మాత్రం రసవత్తరంగా సాగుతుంది. నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించడంతో ఈ గ్రూప్ నుంచి సెమీస్ రేసు రంజుగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమితో ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. రెండు సెమీస్ బెర్త్‌ల కోసం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ పోటీపడుతున్నాయి. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలో మ్యాచ్ గెలవగా.. ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ప్రస్తుతం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చెరి 3 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్‌పై గెలుపు.. అంతకుముందు సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఆఫ్ఘనిస్తాన్ 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. రేపు ఆఫ్ఘనిస్తాన్ లాహోర్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరుకుంటుంది. రెండో బెర్త్ మార్చి 1న జరిగే సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే రెండో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లలో మెరుగైన రన్ రేట్ కలిగిన జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది.
బిజినెస్

హైదరాబాద్‌లో ఫనాటిక్స్ విస్తరణ..
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్పోర్ట్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఫనాటిక్స్ భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించనుంది. ఐసీసీతోపాటు పలు దేశాల్లోని లీగ్పోటీలకు, క్రీడాకారులకు జెర్సీలు, జ్ఞాపికలు, ఇతర వాణిజ్య వస్తువుల డిజైనింగ్, తయారీ, మార్కెటింగ్ పనులు ఫనాటిక్స్ వ్యాపారం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 కేంద్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లోనూ ఒక కేంద్రాన్ని ప్రారంభించింది.అయితే పెరుగుతున్న అవసరాలకు తగినట్లుగా ఈ కేంద్రాన్ని విస్తరించేందుకు నిర్ణయించామని, ఇందులో భాగంగా అభిషేక్ దశ్మనాను వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా నియమించామని ఫనాటిక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మథియాస్ స్పైచర్ తెలిపారు. అంతేకాకుండా.. రానున్న రెండేళ్లలో హైదరాబాద్ కేంద్రం ఉద్యోగుల సంఖ్యను 250 నుంచి 500కు పెంచుతామని, వచ్చే ఏడాది తొలినాళ్లలోనే హైటెక్ సిటీ సమీపంలో సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ఆఫీసుకు వెళ్లనున్నామని ఆయన వివరించారు.ఈ కేంద్రం నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పది కోట్ల మంది క్రీడాభిమానులకు ఉత్పత్తులు, సేవలు అందిస్తామని చెప్పారు. సంస్థ కార్యకలాపాలన్నింటికీ హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారనుందని అన్నారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి అనేక అత్యాధునిక టెక్నాలజీలను హైదరాబాద్ కేంద్రంలో ఉపయోగించనున్నామని చెప్పారు. ప్రోడక్ట్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఏఐ అప్లికేషన్స్, ఫనాటిక్స్ గ్లోబల్ కార్యకలాపాలన్నింటికీ అవసరమైన బ్యాక్ఎండ్ టెక్నాలజీలను ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నారు.ఈ సందర్భంగా అభిషేక్ దశ్మనా మాట్లాడుతూ.. భారత్‌లో క్రీడలపై ఆసక్తి ఏటికేడాదీ పెరుగుతోందని.. క్రీడాభిమానుల మనసు గెలుచుకునేందుకు ఫనాటిక్స్ హైదరాబాద్ కేంద్రం కార్యకలాపాలు ఉపకరిస్తాయన్నారు. ఫనాటిక్స్ ద్వారా ప్రపంచంలోని ఏ మూలనున్న స్పోర్ట్స్ టీమ్ తాలూకూ జెర్సీ, ఇతర వాణిజ్యవస్తువులను భారత్‌లో కూర్చుని తెప్పించుకునేందకు అవకాశం ఏర్పడిందని అన్నారు.సుమారు 190 దేశాలకు ఫనాటిక్స్ ఉత్పత్తులు రవాణా అవుతూంటాయని, ఇందుకోసం 80కిపైగా తయారీ కేంద్రాలుండగా.. మొత్తం 900 మంది భాగస్వాములతో కలిసి వీటిని ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. ఐపీఎల్ లాంటి భారతీయ క్రీడల్లో భాగస్వామ్యం వహించే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మెర్చండైజ్ తయారీ వంటివి భవిష్యత్తులో తగిన సమయంలో చేపట్టే అవకాశం లేకపోలేదన్నారు.

యూరప్‌పై యూఎస్ సుంకాల మోత.. ఎంతంటే..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చీరాగానే కార్యనిర్వాహక ఉత్తర్వులను(ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు) జారీ చేసి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఆందోళనలను రేకిత్తించారు. అనుకున్న విధంగానే ప్రమాణ స్వీకారం తర్వాత వరుసగా వివిధ దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. తాజాగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి చేసే దిగుమతులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా, ఈయూ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న వాణిజ్య అసమతుల్యతను పరిష్కరించేందుకు తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్ల దిగుమతులపై ప్రత్యేక దృష్టి సారించి సుంకాలు విస్తృతంగా వర్తిస్తాయని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. వాణిజ్య లోటును ప్రధాన సమస్యగా పేర్కొంటూ ఈయూ అమెరికాను వినియోగించుకుంటుందని తెలిపారు.సుంకాలు తొలిసారి కాదు..ట్రంప్ సుంకాలతో ఈయూను టార్గెట్ చేయడం ఇదేం తొలిసారి కాదు. తన మొదటి పదవీకాలంలో యూరప్ చేసుకున్న ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై సుంకాలు విధించారు. ప్రస్తుతం ‘అమెరికా ఫస్ట్’ అనే విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో యూరప్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్‌లు విధించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఈయూతో అమెరికాకు ఉన్న అంతర్జాతీయ భాగస్వామ్యాల కంటే ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఎఫ్‌సీఐ చూపు.. రుణాల వైపుఆర్థిక ప్రభావాలుప్రతిపాదిత సుంకాలు గణనీయమైన ఆర్థిక ప్రభావాలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అధిక టారిఫ్‌ల వల్ల స్థానికంగా యూఎస్‌లో తయారీ పరిశ్రమను పరుగులు పెట్టించే అవకాశం ఉంటుంది. లేదంటే తప్పకుండా వినియోగదారులు అవే వస్తువులు వాడాలనుకుంటే మాత్రం ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇలా ఉత్పత్తులపై పెరిగే ఖర్చులు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త టారిఫ్‌లపై ‘గట్టిగా, వెంటనే’ ప్రతిస్పందిస్తామని యూరోపియన్ కమిషన్ హెచ్చరించింది. స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్ ట్రంప్ అభిప్రాయాన్ని తప్పుబట్టారు.

ఇన్ఫ్లుయెంజా వైరస్‌కు జైడస్ వ్యాక్సిన్: ఇక వారంతా సేఫ్!
కొత్త రకం ఇన్‌ఫ్లూయెంజా వైరస్ నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్‌ను ప్రవేశపెడుతున్నట్టు ఔషధ తయారీ సంస్థ 'జైడస్ లైఫ్‌సైన్సెస్' (Zydus Lifesciences) బుధవారం తెలిపింది.ఫ్లూ నుంచి రక్షణ కోసం డబ్ల్యుహెచ్ఓ సిఫార్సు చేసిన కూర్పు ప్రకారం దేశంలోనే మొట్టమొదటి క్వాడ్రివలెంట్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాక్సిన్ వ్యాక్సిఫ్లూ-4ను పరిచయం చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ టీకాను సెంట్రల్ డ్రగ్ లాబొరేటరీ (CDL) ఆమోదించిందని కంపెనీ తెలిపింది.రాబోయే ఫ్లూ సీజన్ ప్రబలంగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని నాలుగు ఇన్‌ఫ్లూయెంజా వైరస్ జాతులకు వ్యతిరేకంగా కాలానుగుణ రక్షణను, క్రియాశీల రోగనిరోధకతను అందించేలా క్వాడ్రివాలెంట్ ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ వివరించింది. దీనిని సంస్థ అహ్మదాబాద్‌లోని వ్యాక్సిన్ టెక్నాలజీ సెంటర్ (VTC) అభివృద్ధి చేసింది.ఇన్‌ఫ్లూయెంజా అనేది.. ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వల్ల సోకే దగ్గు, తుమ్ముల వ్యాప్తిని నివారిస్తుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులను ముందుగా గుర్తించి.. కావలసిన వ్యాక్సిన్ తీసుకోకపోతే, తీవ్ర అనారోగ్యం ఏర్పడుతుంది. కొన్ని సార్లు మరణానికి కూడా దారితీయవచ్చు. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు, వృద్ధులకు ఈ వ్యాక్సిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణంగా.. ప్రతి సంవత్సరం 2.9 లక్షల నుంచి 6.5 లక్షల మంచి మరణిస్తున్నారని తెలిసింది. కాబట్టి ఈ వ్యాక్సిన్ మరణాల రేటును తగ్గిస్తుందని చెబుతున్నారు.

హోలీ.. ఉగాది పండుగలు: మార్చిలో బ్యాంక్ హాలిడేస్ ఇవే..
ఫిబ్రవరి 2025 ముగుస్తోంది. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో జాబితాను (Bank Holidays) విడుదల చేసింది. వచ్చే నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు తప్పకుండా ఈ సెలవుల జాబితాను తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.మార్చిలో బ్యాంక్ హాలిడేస్➤మార్చి 7 (శుక్రవారం): 'చాప్చార్ కుట్' పండుగను సందర్భంగా మిజోరాంలో సెలవు దినం.➤మార్చి 13 (గురువారం): మార్చి 13న హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ కారణంగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.➤మార్చి 14 (శుక్రవారం): హోలీ పండుగ సందర్భంగా.. త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సెలవు.➤మార్చి 15 (శనివారం): కొన్ని రాష్ట్రాలు మార్చి 14కి బదులుగా మార్చి 15న హోలీని జరుపుకుంటాయి. ఈ జాబితాలో త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్ ఉన్నాయి.➤మార్చి 22 (శనివారం): 'బీహార్ దివస్' లేదా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మార్చి 22న బీహార్‌లో బ్యాంకులకు సెలవు.➤మార్చి 27-28 (గురువారం-శుక్రవారం): ఇస్లామిక్ క్యాలెండర్లో ముఖ్యమైన రోజు అయిన షబ్-ఎ-ఖదర్ను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్ మార్చి 27న సెలవు దినంగా పాటిస్తుంది. రంజాన్ నెల చివరి శుక్రవారం అయిన జుమాత్-ఉల్-విదాను పురస్కరించుకుని కేంద్రపాలిత ప్రాంతం మార్చి 28న సెలవు దినంగా పాటిస్తుంది.➤మార్చి 31 (సోమవారం): మిజోరం, హిమాచల్ ప్రదేశ్ మినహా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మార్చిలో ఈద్ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తాయి.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది).
ఫ్యామిలీ

అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్
మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటారు. అందుకోసమే యువత అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలకు పయనమవుతోంది. ఆ దేశాలు వారికి వృత్తిపరమైన అబివృద్ధితోపాటు ఆర్థిక స్థైర్యాన్ని కూడా అందిస్తున్నాయి. అయితే ఇది కాస్త సవాళ్లతో కూడినది కూడా. పైగా ఆ దేశాల సంస్కృతికి అనుగుణంగా బతకడం అనేది అంత ఈజీ కూడా కాదు. తమ వాళ్లను వదిలి ఆ కొత్త వాతావరణంలో నెగ్గుకురాక తప్పని స్థితి. అలాంటి పరిస్థితుల్లో ఓవ్యక్తి మాత్రం పదేళ్లకు పైగా విదేశంలో ఉండి మరీ..తాను స్వదేశానికి వచ్చి మంచి పనిచేశానంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అని చెప్పేస్తున్నాడు. విదేశాలకి వెళ్తేనే మంచి లైఫ్ అనుకునేవారి ఆలోచనకు అత్యంత విభిన్నంగా తన మనోభావాలను ఆన్లైన్ వేదికగా షేర్ చేసుకున్నాడు ఈ సీఈవో.ఎందుకంటే..ఆర్క్అలైన్డ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అనిరుద్ధ అంజనా అమెరికాలో ఒక దశాబ్ద కాలం పాటు ఉన్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు భారతదేశానికి తిరిగి రావాలని గట్టిగా నిర్ణయించుకుని మరీ వచ్చేశారు. అయితే వాళ్లు వీసా సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం వంటి రీజన్లు కాకుండా బలమైన కారణాన్ని వివరిస్తూ నెటిజన్ల మనసును దోచుకున్నారు. ఇంతకీ ఎందువల్ల ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడంటే..అనిరుద్ధ తన వృద్ధ తల్లిదండ్రులును చూసుకోవాలనే ఉద్దేశ్యంతో స్వదేశానికి తిరిగి వచ్చేశానని అన్నారు. జాబ్ సెక్యూరిటీ, వలస అనిశ్చితులు, కెరీర్ సమస్యల వల్ల కాదని తేల్చి చెప్పేరు. కేవలం తన కెరీర్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తన తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన తల్లిదండ్రులకు తన అవసరం ఉన్నందున తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశాడు. అయితే తన స్నేహితులు బంధువులు నుంచి తాను ఉద్యోగం కోల్పోవడం, వీసా సమస్యలు వల్ల ఇలా నిర్ణయం తీసుకున్నానంటూ పలు వ్యాఖ్యాలు వచ్చాయి. కానీ అసలు రీజన్ మాత్రం తల్లిదండ్రులతో పూర్తి సమయం వెచ్చించేందుకే ఇలా చేశానంటూ తెలిపారు. వారు నన్ను తిరిగి వచ్చేయమని ఎప్పటికీ అడగరని తెలిసే ఇలా చేశానంటూ ఇన్‌స్టాగ్రాంలో వివరించారు సీఈవో అనిరుద్ధ. తాను జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇదేనని చాలా నమ్మకంగా చెప్పారు. అనిరుద్ధ పోస్ట్ సోషల్‌మీడియా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. అతని పోస్ట్‌పై స్పందిస్తూ..సవాలుతో కూడిన చక్కటి నిర్ణయం అని ఒకరు, బంధాల విలువను తెలిపేలా ఉంది, అందరూ ఇలా ఆలోచిస్తే బాగుండును అంటూ మరొకరు ఇలా అనిరుద్ధ నిరర్ణయాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Aniruddha (@growwith_ani) (చదవండి: 'గైనకాలజీ పితామహుడు': అనస్థీషియా లేకుండా నల్లజాతి మహిళలపై..!)

కొండరాళ్లలో దొరికిన అమ్మ...కొండంత అమ్మ!
కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా శ్రీ కొండలమ్మ తల్లి భక్తుల నమ్మకాన్ని చూరగొంటున్నారు. తల్లి చెంతకు వచ్చి తమ కోర్కెలు కోరినంతనే ఆ కోర్కెలను తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధి గాంచారు ఈ అమ్మవారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం కొండలమ్మ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచారు. కొండరాళ్లలో దొరకటం వలన ఆ తల్లిని కొండలమ్మ అనే పేరుతో భక్తులు పిలుస్తున్నారు.వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వివాహం, రాజకీయ పదవులు, పారిశ్రామికం, సినిమా అవకాశాలు ఒకటేమిటి? ఏ రంగానికి చెందిన వారైనా భక్తితో నమ్మి అమ్మ వద్ద తలచుకుంటే చాలు వారికి వరాల జల్లు కురిపిస్తుంది కొండలమ్మ తల్లి. బిడ్డ పుట్టినా, పెళ్లి జరిగినా పిల్లాపాపలు, నూతన వధూవరులు తమ కోర్కెలు తీరాక తల్లి సన్నిధిలోనే తమతమ మొక్కుబడులను చెల్లించుకోవటం పరిపాటిగా వస్తోంది. భక్తితో కొలవటంతో తృప్తి చెందక తమ ఇంటిలో ఆ తల్లి పేరును అనుకున్నదే తడవుగా స్తుతించాలనే దృక్పథంతో కొండలమ్మను ఆ భక్తులు తలచుకుంటున్నారు. ఆ ఊరిలోనే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కొండా, కొండలమ్మ, కొండయ్య, కొండబాబు వంటి పేర్లతో ఆ దేవత పేరును తమ కడుపున పుట్టిన బిడ్డలకు పెట్టుకుంటున్నారు. ఆ తల్లి చల్లని సన్నిధిలో వివాహాలు, అన్నప్రాశన, ఊయలలో వేయటం వంటి శుభ కార్యక్రమాలను భక్తులు జరుపుకుని దీవెనలను ΄పొందుతున్నారు మహిమలతో తల్లి కీర్తి చాలా తక్కువ కాలంలోనే దశదిశలకు వ్యాపించింది. అమ్మవారి ఆలయానికి ప్రతి ఆదివారం కృష్ణాజిల్లా నుంచే గాక ఇరు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి మొక్కుబడులు చెల్లిస్తున్నారు. ఆది, గురువారాల్లో 25వేల మంది భక్తులు తల్లిని దర్శించుకుంటున్నారు. అమ్మవారు కొలువైన ప్రాంతం మచిలీపట్నం–నూజివీడు–కత్తిపాడు ప్రధాన రహదారి కావటంతో ఎవరు రోడ్డు వెంబడి వెళ్లినా ఆమె దర్శనం కొరకు నిలుస్తున్నారు. వాహనాల్లోనే గాక నడిచి వెళ్లినా రాకపోకల్లో అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. కొండరాళ్లలో దొరికిన అమ్మఈ దేవాలయానికి దాదాపు దశాబ్దాల చరిత్ర ఉంది. వేమవరంలో రహదారి పక్కనే దివాన్ సాహెబ్ కోడ్డు మురుగు కాలువకు రివిట్మెంట్ కడుతున్నారు. ఆ గోడను కొండరాళ్లతో నిర్మిస్తుండగా వాటిలో ఒకరాయి అమ్మవారిని పోలినట్లుగా పనివారికి కనబడింది. ఆ రాయిని నిర్మాణంలో కలపకుండా పక్కన పెట్టారు. కొద్ది రోజులకు ఆ రాయిని రోడ్డు పక్కన నిలబెట్టి... పసుపు, కుంకుమలు చల్లి భక్తులు పూజలు చేసేవారు. అక్కడికి బాతులు పెంచుకునేవారు వచ్చారు. ఆ రాయి పక్కనే కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. అమ్మవారి విగ్రహం పక్కనే ఉండటం వలన ఆ బాతులు విపరీతంగా గుడ్లు పెట్టేవని పెంపకం దారులకు నమ్మకం ఏర్పడింది. ఆ బాతుల యజమానికి విపరీతమైన లాభాలు వచ్చాయి. సీజన్ పూర్తి కావటంతో ఆ బాతుల యజమాని గుంటూరు వలస వెళ్లుటకు నిర్ణయించుకున్నాడు. బాతుల్ని లారీలో వేసుకునేటపుడు వాటితోపాటు అమ్మవారిని కూడా తీసుకెళ్లారు. గుంటూరు వెళ్లగానే అక్కడ బాతుల్ని దించారు. వాటితోపాటు అమ్మవారిని దించగా వెంటనే బాతులు మొత్తం హఠాత్తుగా మృత్యువాతపడ్డాయి. వెంటనే అతను మరలా అమ్మవారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేశాడు. ప్రస్తుతం అమ్మవారు పూజలందుకుంటున్న స్థానంలోనే నిలి΄పాడు. ఈ నిదర్శనం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనతికాలంలో మౌఖికంగా ప్రచారం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విరివిగా వచ్చి పాల పొగగళ్లు సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు.శోభాయమానంగా నవరాత్రులు...తల్లి సన్నిధిలో ఏటా దసరా నవరాత్రి మహోత్సవాలు శోభాయమానంగా జరుçగుతాయి. దుర్గాష్టమి రోజున కనకడప్పుల వాద్యాలు, బాణాసంచా, చిత్ర విచిత్ర వేషధారణలతో చుట్టుపక్కలున్న గ్రామాల్లో అమ్మవారి భారీ ఊరేగింపు సాగుతుంది. ఆ రోజు 20 వేల మంది భక్తులకు అన్నసమారాధన ఉంటుంది. నవరాత్రుల్లో భక్తుల ఉల్లాసం కొరకు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఉంటాయి. తొలుత కొండలమ్మ మూలవిరాట్‌ను దర్శించుకునే ఆలయం చిన్నదిగా ఉండేది. ఆ తర్వాత భారీ ఆలయాన్ని దేవాదాయ శాఖ వారు నిర్మించి అభివృద్ధి చేయటం జరిగింది. అనివేటి మండపాన్ని నిర్మించారు. ఈ మండపంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహానికే దసరా ఉత్సవాలకు దేవతా స్వరూపాలను అలంకరిస్తున్నాం. ఈ తల్లి మూలవిరాట్ నేల మీదనే తల వరకే దర్శనమిస్తుంది. మనసులో మాట అనుకున్నంతనే అవి తీరుస్తున్న అమ్మవారికి భక్తుల నుంచి తాకిడి నానాటికీ పెరిగి΄ోతుంది. సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, రైతులు ఒక్క రంగమే కాదు అన్ని రంగాలకు చెందిన భక్తులు ఏం కోరుకుంటే అది తీరుస్తూ వారి నుంచి పూజలందుకుంటున్నారు అమ్మవారు. మొక్కుబడులు తీర్చుకునే భక్తులు కొండలమ్మకు పాల పొంగళ్లను సమర్పిస్తారు. – అయికా రాంబాబుసాక్షి, గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా

తీవ్రమైన పగటి కలలతో విసిగిపోయారా? నియంత్రణ ఎలా?
డాక్టరు గారూ! నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నాకీ మధ్య పగటి కలలు ఎక్కువగా వస్తున్నాయి. క్లాసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నడుస్తున్నా, ఏ పనిలో ఉన్నా, ఏవేవో పగటి కలలు వస్తున్నాయి. కలెక్టర్‌ను చూస్తే కలెక్టర్ అయినట్లు, పోలీస్ అఫీసర్‌ను చూస్తే ఎస్.పి. ని అయినట్లు, సినిమాలో హీరోయిన్ను చూస్తే నేను కూడా హీరోయిన్ అయినట్లు, ఇలా రకరకాలుగా పగటి కలలు, ఊహలు వస్తున్నాయి. ఆటోలో బస్సులో వెళుతున్నప్పుడు ఇవి మరీ ఎక్కువగా వస్తున్నాయి. అలా వచ్చినప్పుడల్లా చాలా హాయిగా ఉంటుంది. దాంట్లోంచి బయట పడగానే అయ్యో! ఇది నిజం కాదా అని చాలా బాధ కలుగుతుంది. క్లాసులో ఇలా కలలు రావడం వల్ల చదువు కూడా దెబ్బతింటోంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అని ఆందోళనగా ఉంది. ఈ ఊహల్లోంచి బయట పడే మార్గం చెప్పండి – ప్రణీత, మహబూబ్ నగర్ఇలా కలలు, పగటి కలలు కనడం మనిషికి చాలా సహజం. ఈ ప్రపంచంలో అసలు కలలు–పగటి కలలు ఎప్పుడో ఒకసారి కనని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇలా పగటి కలలు... అంటే ‘డే డ్రీమింగ్’ యుక్త వయసులో చాలా సహజం. మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురైనవారు, ‘ఎ.డి.హెచ్.డి.’ అంటే నిలకడ, ఏకాగ్రత లేకుండా ఓవర్ యాక్టివ్‌గా ఉండేవారిలో కూడా ఈ పగటి కలలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. మనం అనుకున్నవన్నీ నిజ జీవితంలో సాధించలేనప్పుడు, కొంత సేపైనా ఊహాలోకంలో విహరించి, నిజజీవితంలో పొందలేనివి ఇలా ఊహల్లోనైనా పొంది మనిషి తృప్తి పొందాలనుకుంటాడు. ఎడారిలాంటి మన జీవితాలకు పగటి కలలు ఒక ‘ఒయాసిస్’ లాగా పనిచేస్తాయి. అసంతృప్తితో ఉన్న మనసుకు ఈ పగటికలలు కొంత ఊరట కలిగించి, మన బాధలకు సమస్యలకు ఒక ‘ఔట్లెట్’ లాగా పనిచేసి మనల్ని సంతృప్తి పరుస్తాయి. మరికొందరికి పగటికలలు, వారిలో ‘క్రియేటివిటీ’ పెరిగేందుకు, జీవిత సమస్యలనుండి కొన్ని పరిష్కారాలు పొందేందుకు కూడా తోడ్పడతాయి. చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!కానీ ‘అతి సర్వత్రా వర్జయేత్!’ అన్నట్లు ఏదైనా అతిగా ఉంటేనే ఇబ్బంది. వాస్తవాన్ని పూర్తిగా మరచి, పగలంతా పగటి కలల్లో, విహరించడమనేది అంత మంచిది కాదు. దీనివల్ల మీ చదువు, ఇతర పనులు దెబ్బతింటాయి. మీరు మీ జీవిత గమ్యాలను ప్రతిరోజు స్మరించుకుంటూ, వాటిని సాధించేందుకు, మీ శక్తియుక్తులను పూర్తిగా వినియోగించండి. ఏకాగ్రత నిగ్రహ శక్తి, పెంచుకునేందుకు సరైన నిద్ర, ధ్యానం, ప్రాణాయామం, మైండ్‌ఫుల్‌నెస్, ఉపయోగపడతాయి. మీకిష్టమైన వేరే వ్యాపకాలపై ధ్యాస పెట్టండి. జీవితంలో పగటి కలలు ఒక భాగమే తప్ప పగటి కలలే జీవితం కారాదు!

వాటర్ ఫిల్టర్ నీళ్లలో స్వచ్ఛత ఎంత? ఎలా ఎంచుకోవాలి?
ఈ రోజుల్లో శుద్ధమైన నీటిని తాగడమూ కొంత ప్రయాసతో కూడిన అంశంగా మారింది. భూగర్భ, నదీ జలాల కాలుష్యం, కొన్నాళ్ల పాటు నిల్వ ఉంచే వాటర్ ట్యాంకుల వల్ల స్వచ్ఛమైన నీటి కోసం వెతుకులాట తప్పడం లేదు. దీంతో చాలా మంది వాటర్ ప్యూరిఫైయర్లను ఎంచుకుంటున్నారు. మార్కెట్లో లభించే రకరకాల వాటర్ ప్యూరిఫైయర్లలో కొన్ని నీటిని వడకట్టేవి, మరికొన్ని నీటి నుంచి పోషకాలు పోకుండా కాపాడేవి, ఇంకొన్ని మోతాదులో పోషకాలు కలిపేవి లభిస్తున్నాయి. ప్రకృతి సిద్ధంగా లభించే నీటిలోఉండే స్వచ్ఛత తెలుసుకోవడానికి అవగాహనే ప్రధానమైనది.ఎంపిక చేసుకున్న ప్యూరిఫైయర్ని ఆపరేటర్లు ఇంట్లో అమర్చాక టిడిఎస్ ఎంత ఉందో నాణ్యత చూపించి, మరీ వాటి గురించి వివరిస్తుంటారు. వరప్రదాయినిగా లభించే నీటిలోపోషకాలు ఏంటి, టిడిఎస్ ఏంటి.. అంటూ కొంత ఆందోళన పడుతుంటాం. ఖనిజాలు, లవణాలు, లోహాలతో సహా నీటిలో కరిగిన పదార్థాల మొత్తాన్ని కొలవడమే టిడిఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్).నీటిలో టిడిఎస్ స్థాయి ఎంత మేరకు ఉండాలంటే...0-50 పిపిఎమ్ (పార్ట్స్ పర్ మిలియన్) ఉంటే... దీనిని స్వేదనజలం అంటారు. అవసరమైన ఖనిజాలు,పోషకాలు లేకపోవడం వల్ల ఈ నీటిని తాగడానికి ఉపయోగించలేం 50-150 పిపిఎమ్ ఉంటే అవసరమైన ఖనిజాలు,పోషకాలు ఉన్నాయని, తాగడానికి మేలైనదని గుర్తించాలి 150 - 300 పిపిఎమ్ ఉంటే తాగడానికి మేలైనది300 - 500 పిపిఎమ్ ఉంటే ఆ నీరు ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి 500-600 పిపిఎమ్ కంటే ఎక్కువ ఉంటే తాగడానికి మేలైనది కాదు.నీటి శుద్ధి యంత్రాల రకాలు: ఆర్వో (రివర్స్ ఓస్మోసిస్):అధిక టిడిఎస్ (300 పిపిఎమ్ కంటే ఎక్కువ)కు ఆర్వో ఉత్తమమైనది. ఇది, నీటిలో భార లోహాలు, రసాయనాలు, అదనపు లవణాలను తొలగిస్తుంది. అయితే, ముఖ్యమైన ఖనిజాలను కూడా తొలగించవచ్చు, కాబట్టి దీనిలోనూ మినరలైజర్ ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం మేలు.యూవీ (అతినీలలోహిత) ఫిల్టర్: బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా, ప్రభావవంతంగా పనిచేస్తుంది. నీటిలో తక్కువ టిడిఎస్ ఉన్నప్పుడు యువి మోడల్ మంచిది.యూఎఫ్ అతినీలలోహిత ఫిల్టర్: ఈ మోడల్ వాటర్ ఫిల్టర్ యూవీ లాగానే ఉంటుంది. కానీ సస్పెండ్ చేయబడిన కణాలను కూడా యుఎఫ్ మోడల్ తొలగిస్తుంది. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు: రుచిని మెరుగుపరచడానికి, క్లోరిన్, సేంద్రీయ మలినాలను తొలగించడానికి ఈ ఫిల్టర్ బాగా ఉపయోగపడుతుంది. సరైన ప్యూరిఫైయర్‌ను ఎంచుకోవడం: అధిక టిడిఎస్ కోసం (300 పిపిఎమ్)RO లేదా RO+UV/UF ఎంచుకోవచ్చు తక్కువ టిడిఎస్ (300 పిపిఎమ్ లోపల ) కోసం UV+UF లేదా గురుత్వాకర్షణ ఆధారిత ప్యూరిఫైయర్లు సరిపోతాయి.మున్సిపల్ నీటి కోసం సాధారణ టిడిఎస్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు బాగా పనిచేస్తా.బోర్వెల్/హార్డ్ వాటర్‌లో అధిక టిడిఎస్ స్థాయిలు ఉంటాయి కాబట్టి ఆర్వో ఫిల్టర్ బాగా పనిచేస్తుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను తిరిగి కలపడానికి మినరలైజర్/టిడిఎస్ కంట్రోలర్ వంటి కొన్ని ఆర్వో ప్యూరిఫైయర్లు ఉన్నాయి ఇంట్లో వాడే వాటర్ ఫిల్టర్ ఎంపికను బట్టి టిడిఎస్ స్థాయిని కొలవడానికి మీరు టిడిఎస్ మీటర్‌ను ఉపయోగిస్తూ ఉండాలి. ఏవైనా మార్పులు కనిపిస్తే సంబంధిత ఆపరేటర్‌కు తెలియజేసి, ఫిల్టర్‌ను మార్చుకోవాలి. చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!శుద్ధమైన నీటిని తాగితే చాలు...గతంలో సంప్రదాయ పద్ధతిలో మరిగించడం అనేది ఒక పద్ధతిగా ఉండేది. దీని వల్ల కూడా కొన్ని పోషకాలు పోతున్నాయి అని గ్రహించారు. వాటర్ క్వాలిటీ కోసం టిడిఎస్‌ను చెక్ చేస్తాం. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని అవలంబిస్తుంది. ఆర్వో సిస్టమ్ అయితే సురక్షితం అనుకుంటాం. ఫిల్టర్ వరకు పర్వాలేదు. కానీ, వీటి ద్వారా కూడా నీటిలో కొన్ని పోషకాలు పోతుంటాయి. 100 శాతం క్లోరిన్, కాలుష్య శుద్ధి చేసి, నీటి నుంచి మనకు కావల్సిన పోషకాలు లభిస్తే చాలు. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ తాగితే చాలా ప్రయోజనాలు అని చెబుతుంటారు. వాటికి సంబంధించిన ఫిల్టర్లు కూడా వస్తున్నాయి. నీటిలో ప్రధానంగా ఉండే పొటాషియం, మెగ్నిషియమ్, ఐరన్ వంటివి ఉంటే చాలు. ఎక్కువ ΄ోషకాలు కలిపి మరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. – సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్
ఫొటోలు
National View all

అత్యాచార ఘటనపై మాజీ సీజేఐ చంద్రచూడ్ ఏమన్నారంటే..
ఢిల్లీ: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట

‘ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు’.. దీదీతోనే నా ప్రయాణం
కోల్‌కతా: ఓపిక ఉన్నంత వరక

‘మోదీ చెప్పినా.. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు’
ఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అభివృద్ధి ఎజెండ

TN Vs Centre: భాషా యుద్ధం.. ఇది ఈనాటిదేం కాదు!
జాతీయ విద్యా విధానం(National Education Policy 2020) అమలు విషయంలో..

‘అతడికి ఉరిశిక్ష సరైందే’.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర పూణేలోని ఓ పోలీస్ స్టేషన్‌కు కూత వే
International View all

‘‘అయ్యా ట్రంప్.. ఇలాంటి బతుకులెందుకు?’’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజన్‌పై అరబ్ దేశాలు భగ్గుమంటున్నాయి.

బందీల విడుదలకు మార్గం సుగమం
జెరూసలెం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య బందీల విడుదలకు మార్గం సు

Russia-Ukraine war: మూడేళ్లలో 1,65,000 మంది రష్యా సైనికులు మృతి
మాస్కో: ఉక్రెయిన్‌తో పోరాడుతూ 165,000 సైనికులు మరణించారని రష

40 ఏళ్ల తరువాత తల్లిని చేరిన కూతురు
ఐదు రోజుల పసికూనగా వెళ్లిపోయిన కూతురు 40 ఏళ్ల తరువాత తల్లి ముందు నిలబడితే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా!

విశ్వం మూలాలపై నాసా అన్వేషణ
వాషింగ్టన్: మనం ఉంటున్న ఈ సువిశాల విశ్వం ఎలా పుట్టింది?
NRI View all

అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్
మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్ క్లియర్
వాషింగ్టన్: ఫిబ్రవ

Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం
డాలస్ : ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం
శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ
క్రైమ్

ఆటోడ్రైవర్ అఘాయిత్యం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక ): ఓ కిరాతక భర్త భార్యను హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన బెంగళూరు తిగళరపాళ్యలోని ముబారక్ నగర్లో చోటుచేసుకుంది. వివరాలు.. సురేశ్ (40), మమత (33) దంపతులు, అతడు ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించేవాడు. అయితే సురేశ్ ఈ మధ్య సరిగా పనికి వెళ్లకపోవడంతో మమత గొడవపడేది. బుధవారం పండుగ అని ఇంట్లోనే ఉన్నాడు. మమత ప్రశ్నించడంతో రగడ మొదలైంది. ఆ సమయంలో వారి కొడుకు (6) అక్కడే ఉన్నాడు. సురేశ్ కోపం పట్టలేక మమతను గొంతు నులిమి చంపి, తరువాత తానూ ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సురేశ్ భార్యకు మొబైల్లో అశ్లీల చిత్రాలు చూపించి వేధించేవాడని, ఈ విషయాన్ని మమత సురేశ్ తల్లికి చెప్పడంతో సహించలేక హత్య చేసినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరి స్వస్థలం తుమకూరు జిల్లా గుబ్బి. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

తాళి కట్టమంటే పాడె కట్టిండు
వర్గల్(గజ్వేల్): వారిది ఒకే గ్రామం.. ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం.. గుట్టుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం.. పెండ్లి చేసుకోవాలని మహిళ ఒత్తిడి జీర్ణించుకోలేక పథకం ప్రకారం హత్య చేసి ఆమెను కాటికి పంపాడు. దర్యాప్తులో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పది రోజుల కిందట జాడ తెలియకుండా పోయిన వర్గల్ మండలం మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం కోమటిబండ అడవిలో మృతదేహాన్ని గుర్తించి హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను బుధవారం గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి వెల్లడించారు.వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన దార యాదమ్మ(40) 15వ తేదీన బ్యాంక్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆమె కుమారుడు దార సాయికుమార్ ఫిర్యాదు మేరకు గౌరారం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదుచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పోలీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజీలు, లోకేషన్లు, కాల్‌డేటాలు విశ్లేషించారు. దర్యాప్తులో భాగంగా అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన బండ్ల చిన్న లస్మయ్య(39)ను మంగళవారం విచారించారు. ఏడాదిన్నర నుంచి అతడికి యాదమ్మతో వివాహేతర సంబంధమున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆరునెలల నుంచి పెండ్లి చేసుకోవాలని యాదమ్మ ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా అడ్డు తొలిగించుకోవాలనుకున్నాడు. 15న మధ్యాహ్నం పథకం ప్రకారం యాదమ్మను బైక్ మీద గజ్వేల్ సమీప కోమటిబండ అడవిలోకి తీసుకెళ్లాడు. తమ వెంట తెచ్చుకున్న కల్లును ఇద్దరు తాగే సమయంలో ఆమెకు తెలియకుండా పురుగుల మందు కలిపాడు. యాదమ్మ తాగిన తర్వాత కింద పడేసి మెడచుట్టూ చీర బిగించి హతమార్చాడు. నిందితుడిపై హత్య నేరంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. గ్రామంలో ఉద్రిక్తత యాదమ్మ హత్యోదంతం నేపథ్యంలో బుధవారం ఆమె కుటుంబీకులు, బంధువులు ఆగ్రహంతో అనంతగిరిపల్లిలోని నిందితుడి ఇంటి ఎదుట బైఠాయించారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా ఏసీపీ పురుషోత్తంరెడ్డి, రూరల్‌సీఐ మహేందర్‌రెడ్డి, గౌరారం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని వారికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

పుణె బస్టాండ్‌లో దారుణం
పుణె: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట్ జంక్షన్ బస్టాండ్‌లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్గేట్ బస్టాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు. గతంలో ఇతనిపై దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు సతారా జిల్లాలోని ఫల్టణ్ పట్టణానికి వెళ్లే బస్సు ఎక్కేందుకు బాధిత మహిళ ఈ బస్టాండ్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ వద్ద వేచిచూస్తోంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన నిందితుడు ‘సోదరీ’ అంటూ ఆమెతో మాటలు కలిపాడు. తాను బస్ కండక్టర్‌ను అని, మీరు ఎక్సాలిన బస్సు సమీపంలో ఆగి ఉందని చెప్పి, సమీపంలో ఆగి ఉన్న ‘శివ్ షాహీ’ ఏసీ బస్సును చూపించాడు. అది మీరు వెళ్లాల్సిన రూట్లో వెళ్తుందని చెప్పి ఆ బస్సు ఎక్కాలని ఆమెకు సలహా ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన ఆమె ఎవరూ లేని ఆ బస్సు ఎక్కింది. లైట్లు ఆఫ్ చేసి, చిమ్మచీకటిగా ఉన్న బస్సును ఎక్కేందుకు తొలుత ఆమె తటపటాయించింది. బస్సులో ప్రయాణికులు నిద్రిస్తుండటంతో లైట్లు ఆర్పివేశారని, నచ్చజెప్పి బస్సులో లోపలిదాకా వెళ్లేలా చేశాడు. వెంటనే వెనకాలే వచ్చిన అతను బస్సు తలుపు మూసేసి, ఆమెను రేప్‌చేసి పారిపోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్మార్థనా పాటిల్ చెప్పారు. ఘటన జరిగినప్పుడు బస్టాండ్‌లో ఎన్నో బస్సులు, ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారు. మహిళ తనకు జరిగిన అన్యాయంపై వెంటనే ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఫల్టణ్కు వెళ్లే బస్సు ఎక్కి మార్గమధ్యంలో తన స్నేహితురాలికి ఫోన్‌చేసి ఘోరాన్ని వివరించింది. ఆమె సలహామేరకు బాధితురాలు వెంటనే బస్సు దిగి సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్ట్చేసేందుకు పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటుచేసి వేట మొదలెట్టారు. పోలీస్‌స్టేషన్‌కు ఈ బస్టాండ్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. నిందితుడు గతంలో ఒక కేసులో బెయిల్ సంపాదించి 2019 ఏడాది నుంచి బయటే ఉన్నాడు.విపక్షాల విమర్శలు‘‘ఏమాత్రం భయం లేకుండా అసాంఘిక శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. పుణెలో నేరాలను అరికట్టడంలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం విఫలమయ్యారు’’ అని ఎన్సీపీ(ఎస్పీ) నాయ కురాలు, ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు.

పుణ్యస్నానాలకు వెళ్లి ఏడుగురి మృతి
కొవ్వూరు/తాళ్లపూడి/శ్రీశైలం ప్రాజెక్ట్/కొళ్లికూళ్ల (పెనుగంచిప్రోలు): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం నదీ స్నానాలకు వెళ్లిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఐదుగురు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువకులు కాగా, ఇద్దరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తండ్రి, కుమారుడు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన 12 మంది యువకులు బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో మోటారు సైకిళ్లపై సమీపంలోని చింతలపూడి పంప్‌హౌస్ వద్ద గోదావరి నదిలో స్నానాలకు వెళ్లారు. అక్కడి ఇసుక ర్యాంపు వద్ద నీరు మూడు అడుగులే ఉండటంతో స్నానాలకు దిగారు. కేరింతలు కొడుతూ ఉత్సాహంగా స్నానాలు చేస్తూ నీరు ఎక్కువగా ఉన్న వైపు వెళ్లారు. కొద్ది దూరం వెళ్లేసరికి ప్రవాహం పెరగడంతో తిరుమలశెట్టి సాయిపవన్ (17), పడాల దుర్గాప్రసాద్ (19), అనిశెట్టి పవన్ గణేష్ (18), పడాల దేవదత్త సాయి (19), గర్రే ఆకాశ్ (19) కొట్టుకుపోయారు. వెంటనే స్థానిక జాలర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు పడవలతో గాలించారు. మృతులంతా పేద కుటుంబాలకు చెందినవారే. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు ఘటనా స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. శ్రీశైలం వద్ద తండ్రి, కుమారుడు మృతి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొళ్లికూళ్ల గ్రామానికి చెందిన పెరుగు చిన్న గురవయ్య (35), ఆయన కుమారుడు వాసు (11) శ్రీశైలం లింగాలగట్టు వద్ద కృష్ణా నదిలో మునిగి మరణించారు. శివ దీక్ష తీసుకున్న గురవయ్య, భార్య తిరుపతమ్మ, కుమారుడు వాసు, ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 40 మంది భక్తులు మంగళవారం బస్సులో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లారు. బుధవారం ఉదయం స్నానాలు చేసేందుకు లింగాలగట్టు వద్దకు వెళ్లారు. కృష్ణా నదిలో స్నానం చేస్తుండగా వాసు కాలు జారి నీటిలో పడిపోయాడు. కుమారుడిని కాపాడబోయిన చిన్న గురవయ్య కూడా నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న తిరుపతమ్మ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని మత్స్యకారులు నదిలో దూకి వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గురవయ్య, వాసు మృతదేహాలను పోలీసులు సున్నిపెంట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.