Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Hyderabad Central University Students Protest Against Land Issue1
హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

హైదరాబాద్: హెచ్‌సీయూ భూముల వ్యవహారం మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది. వర్శిటీ భూముల విక్రయాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్శిటీ భూముల విక్రయాన్ని ఆపాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. దాంతో సెంట్రల్ యూనివర్శిటీలో పోలీసుల్ని భారీగా మోహరించారు.అసలు వివాదం ఎందుకంటే..!హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ భూములను ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపి వెనక్కు లాక్కుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. మొదట 2300 ఎకరాల్లో హెచ్‌సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు.తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పోరాటానికి దిగారు. వీరంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ స్థలం హెచ్‌సీయూది కాదని, అందుకే కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే.హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, హెచ్‌సీయూ భూములు (HCU Lands) వర్సిటీ అవసరాలకే వినియోగించేలా చొరవ చూపాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. చుట్టూ ఐటీ కారిడార్‌ ఉండడంతో ఈ భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే మార్కెట్‌ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వ అంచనా వేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

YS Jagan Ugadi Wishes To All Telugu People2
తెలుగువారికి వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు

తాడేపల్లి: రేపు తెలుగు సంవత్సరాది(ఉగాది) పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆయన అభిలషించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ తన సందేశంలో ఆకాంక్షించారు.

IPL 2025: Gujarat titans vs Mumbai indians live updates and highlights3
సిరాజ్ ఆన్ ఫైర్‌.. ముంబై రెండో వికెట్ డౌన్‌

IPL 2025 MI vs GT live updates and highlights: ఐపీఎల్‌-2025లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి.రోహిత్ శ‌ర్మ ఔట్‌.. ముంబై తొలి వికెట్ డౌన్‌రోహిత్ శ‌ర్మ రూపంలో ముంబై ఇండియ‌న్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 ప‌రుగులు చేసిన రోహిత్ శ‌ర్మ‌.. మ‌హ్మ‌ద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి తిల‌క్ వ‌ర్మ వ‌చ్చాడు.సుద‌ర్శ‌న్ హాఫ్ సెంచ‌రీ.. ముంబై ముందు భారీ టార్గెట్‌అహ్మ‌దాబాద్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ బ్యాట‌ర్లు స‌మిష్ట‌గా రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో సాయిసుద‌ర్శ‌న్‌(63) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. శుబ్‌మ‌న్ గిల్‌(38), జోస్ బ‌ట్ల‌ర్‌(39) రాణించారు. ముంబై బౌల‌ర్ల‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. బౌల్ట్‌, దీప‌క్ చాహ‌ర్‌, ముజీబ్ త‌లా వికెట్ సాధించారు.19 ఓవ‌ర్లకు గుజ‌రాత్ స్కోర్‌: 186/6గుజ‌రాత్ టైటాన్స్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. 18 ఓవ‌ర్‌లో ఆఖ‌రి బంతికి బౌల్ట్ బౌలింగ్‌లో సుద‌ర్శ‌న్(63) ఔట్ కాగా.. 19 ఓవ‌ర్‌లో వ‌రుస క్ర‌మంలో రాహుల్ తెవాటియా, రూథ‌ర్ ఫ‌ర్డ్ ఔట‌య్యారు. 19 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ 6 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది.గుజ‌రాత్ మూడో వికెట్ డౌన్‌.. షారూఖ్ ఔట్‌షారూఖ్ ఖాన్ రూపంలో గుజ‌రాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 9 ప‌రుగులు చేసిన షారూఖ్‌.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ మూడు వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగులు చేసింది.గుజ‌రాత్ రెండో వికెట్ డౌన్‌..జోస్ బ‌ట్ల‌ర్ రూపంలో గుజ‌రాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 39 ప‌రుగులు చేసిన బట్ల‌ర్.. ముజీబ్ ఉర్ రెహ్మ‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ రెండు వికెట్ల న‌ష్టానికి 134 ప‌రుగులు చేసింది. క్రీజులో సాయిసుద‌ర్శ‌న్‌(49), షారూఖ్ ఖాన్‌(0) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న జోస్‌ బట్ల‌ర్‌..12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. క్రీజులో సాయి సుద‌ర్శ‌న్‌(42), బ‌ట్ల‌ర్‌(26) ఉన్నారు.తొలి వికెట్ డౌన్‌.. శుబ్‌మ‌న్ గిల్ ఔట్‌శుబ్‌మ‌న్ గిల్ రూపంలో గుజ‌రాత్ తొలి వికెట్ కోల్పోయింది. 38 ప‌రుగులు చేసిన గిల్‌.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి జోస్ బ‌ట్ల‌ర్ వ‌చ్చాడు. 9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్టానికి 79 ప‌రుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న గిల్‌, సుద‌ర్శ‌న్‌గుజ‌రాత్ టైటాన్స్ ఓపెన‌ర్లు సాయిసుద‌ర్శ‌న్‌(32), శుబ్‌మ‌న్ గిల్‌(32) దూకుడుగా ఆడుతున్నారు. 6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్టానికి 66 ప‌రుగులు చేసింది.నిల‌క‌డ‌గా ఆడుతున్న గుజ‌రాత్ ఓపెన‌ర్లుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 26 ప‌రుగులు చేసింది. క్రీజులో ఓపెన‌ర్లు శుబ్‌మ‌న్ గిల్‌(13), సాయిసుద‌ర్శ‌న్‌(13) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. గుజ‌రాత్ మాత్రం త‌మ జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేదు.తుది జ‌ట్లుముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్‌), B సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీప‌ర్‌), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ

Ex High Court Judge Acquitted In Chandigarh 20084
16 ఏళ్ల నిరీక్షణ.. నిర్దోషిగా హైకోర్టు మాజీ జడ్జి

చంఢీగడ్: అదొక పదహారేళ్ల క్రితం కేసు.. అందులోనూ హైప్రొహైల్ కేసు. ఒక జస్టిస్‌ తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి సుదీర్ఘకాలం వేచి చూసిన కేసు. హర్యానా జడ్జిగా పని చేసిన జస్టిస్ నిర్మలా యాదవ్.. భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే కేసు. అయితే ఆ కేసు సుదీర్ఘంగా విచారణ చేసింది సీబీఐ. చివరకు ఆ కేసులో నిర్మలా యాదవ్ ఎటువంటి తప్పుచేయలేదని తేలడంతో ఆమెకు బిగ్ రీలీఫ్ లభించింది. తాజాగా సీబీఐ కోర్టు.. ఆమెను నిర్దోషిగా తేల్చి తీర్పును వెలువరించింది. 2008 జరిగిన ఈ కేసులో తీర్పు తనకు అనుకూలంగా రావడంతో జస్టిస్ నిర్మలా యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా ఈరోజు(శనివారం) సీబీఐ కోర్టుకు హాజరైన ఆమె.. తీర్పు తర్వాత మాట్లాడారు. తనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని, అందుకే ఇంతకాలం ఓపిక పట్టిన దానికి ప్రతిఫలం లభించిందన్నారు. ఒక జడ్జికి ఇవ్వబోయి.. మరొక జడ్జికి క్యాష్ డెలివరీఆ ఇదర్దు జడ్జి పేర్లు ఇంచుమించు ఒకే మాదిరి ఉంటాయి. ఒకరు నిర్మలా యాదవ్ అయితే మరొకకే నిర్మలాజిత్ కౌర్. అయితే హర్యానా మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ సంజీవ్ బన్సాల్ క్లర్క్.. ఓ రూ. 15 లక్షల నగదును ప్యాక్ చేసుకుని నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు విచారణలో తేలింది. తాను ఇవ్వాల్సింది జస్టిస్ నిర్మలాజిత్ కౌర్ కని కాకపోతే పొరపాటున జస్టిస్ నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు ఆ ప్యాక్ తీసుకెళ్లిన అప్పటి క్లర్క్. రోజుల వ్యవధిలో ఆమెపై రెండు ఎఫ్ఐఆర్‌లుఈ కేసుకు సంబంధించి 2008, ఆగస్టు 16వ తేదీన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఆ తర్వాత మళ్లీ ఓ కీలక మలుపు తీసుకుంది. అప్పటి యూనియన్ టెర్రిటరీ జనరల్ ఎస్ఎఫ్ రోడ్రిగ్స్ ఆదేశాలతో ఆ కేసును సీబీఐకి బదిలీ చేశారు. దాంతో 12 రోజుల వ్యవధిలో సీబీఐ మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.2009 జనవరిలో సీబీఐ విచారణ ప్రారంభంజస్టిస్ నిర్మలా యాదవ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల్లో దర్యాప్తు చేపట్టేందుకు తమకు అనుమతి కావాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టుకు విజ‍్క్షప్తి చేసింది సీబీఐ. దీనికి అనుమతి లభించడంతో జస్టిస్ నిర్మలా యాదవ్ పై విచారణ చేపట్టింది సీబీఐ. 2011లో ఆమెపై చార్జిషీట్ నమోదు చేసింది సీబీఐ.దీనిలో భాగంగా మొత్తం 84 మంది సాక్షులను పేర్లను నమోదు చేసింది. ఇందులో 69 మందిని విచారించిన సీబీఐ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 10 మంది సాక్షులను తిరిగి విచారించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే 10 మంది కీలక సాక్షులను మళ్లీ విచారించారు. చివరకు ఆ రూ. 15 లక్షల కేసులో జస్టిల్ నిర్మలా యాదవ్ పాత్ర ఏమీ లేదని తేలడంతో ఆమె నిర్దోషిగా నిరూపితమయ్యారు.

Actress Trisha Krishnan Says Love Always Win5
ఎప్పుడూ ప్రేమే గెలుస్తుంది.. త్రిష పోస్ట్‌కు అర్థమేంటో?

త్రిష (Trisha Krishnan).. తెలుగులోనే కాదు తమిళంలోనూ టాప్‌ హీరోయిన్‌. ఈమధ్య తన హవా కాస్త తగ్గింది కానీ ఒకప్పుడు ఆమె తెరపై కనిపిస్తే విజిల్స్‌ పడాల్సిందే! గత కొన్నేళ్లుగా సినిమాల సంఖ్య తగ్గించేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది మాత్రం చేతి నిండా చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఆమె నటించిన ఐడెంటిటీ, విడాముయర్చి ఇప్పటికే రిలీజయ్యాయి. ‍ప్రస్తుతం గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ, థగ్‌ లైఫ్‌, విశ్వంభర, రామ్‌.. సహా సూర్య 45వ సినిమాలో నటిస్తోంది.ప్రేమదే విజయంతాజాగా త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో చేతి ఉంగరాన్ని చూపిస్తూ ఓ ఫోటో షేర్‌ చేసింది. దీనికి 'ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది' అన్న క్యాప్షన్‌ను జోడించింది. ఆ ఫోటోలో త్రిష ఆకుపచ్చ చీర ధరించి ఉంది. ముక్కుపుడక, మల్లెపూలతో సాంప్రదాయంగా ముస్తాబైంది. చెవికమ్మలకు మ్యాచ్‌ అయ్యే ఉంగరం ధరించింది. ఇది చూసిన కొందరు ఎంగేజ్‌మెంట్‌ జరిగిందా? లేదా పెళ్లికి రెడీ అని హింట్‌ ఇస్తుందా? అని ఆరా తీస్తున్నారు.పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌?తమిళ హీరో విజయ్‌తో త్రిష ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ జీవితాంతం కలిసుందామని ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే త్రిష.. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అల్లరి బుల్లోడు, అతడు, పౌర్ణమి, సైనికుడు, స్టాలిన్‌, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బుజ్జిగాడు, నమో వెంకటేశా.. వంటి పలు చిత్రాలతో తెలుగువారి మనసులో స్థానం సంపాదించుకుంది. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) చదవండి: చరణ్‌ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ

Sell two helmets with every two wheeler says Nitin Gadkari6
బైక్‌ కొంటే రెండు హెల్మెట్లు తప్పనిసరి

దేశంలో రహదారి భద్రతను మెరుగుపరిచే దిశగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ టూవీలర్‌ విక్రేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ద్విచక్ర వాహనాలను తప్పనిసరిగా రెండు ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లతో విక్రయించాలని ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన ఆటో సమ్మిట్ లో చేసిన ఈ ప్రకటనను ఐఎస్ఐ హెల్మెట్ తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంలోని అతిపెద్ద సంస్థ టూ వీలర్ హెల్మెట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీహెచ్ఎంఏ) సంపూర్ణంగా సమర్థించింది.రోడ్డు ప్రమాదాలను నివారించడానికి గడ్కరీ ఆదేశాలను కీలకమైన, దీర్ఘకాలిక చర్యగా భావిస్తున్నారు. ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లను తప్పనిసరిగా వాడాలని ఎప్పటి నుంచో వాదిస్తున్న హెల్మెట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ మంత్రి క్రియాశీల నాయకత్వాన్ని ప్రశంసించింది. 'ఇది కేవలం రెగ్యులేషన్ మాత్రమే కాదు. ఇది జాతీయ అవసరం. ప్రమాదాల్లో ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాలకు ఈ ఆదేశం భవిష్యత్తులో ఇటువంటి నష్టాలను నివారించగలదనే ఆశను కలిగిస్తుంది" అని టీహెచ్ఎంఏ అధ్యక్షుడు రాజీవ్ కపూర్ అన్నారు.హెల్మెట్ లేకపోవడం వల్లే..దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,80,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 1,88,000 మరణాలు నమోదవుతున్నాయి. ఈ గణాంకాలు భారతదేశ రహదారి భద్రత భయంకరమైన పరిస్థితిని తెలియజేస్తున్నాయి. 66 శాతం ప్రమాదాలలో బాధితులు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే. ఏటా 69 వేలకు పైగా ద్విచక్ర వాహన ప్రమాద మరణాలు సంభవిస్తుండగా వీటిలో 50 శాతం హెల్మెట్ లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయి. ద్విచక్ర వాహనాల ప్రయాణాలు ఇకపై ప్రమాదకరంగా ఉండకూడదని పరిశ్రమ నొక్కి చెప్పింది.

Hyderabad Metro Train Timings Extended From April 1st7
హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మెట్రో ప్రయాణికులకు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. మెట్రో సమయం పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉన్న మెట్రో సేవల సమయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఇకపై ఏప్రిల్‌ 1 నుంచి రాత్రి 11.45 గంటల వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ మారిన వేళలు అమల్లో ఉంటాయని తెలిపారు.కాగా, ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న ఆఫర్ మరో ఏడాది పొడిగించారు. విద్యార్థుల 20 ట్రిప్పుల డబ్బులతో 30 ట్రిప్పులు వెళ్లే ఆఫర్ పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. సూపర్ సేవర్ హాలిడే ఆఫర్, ఆఫ్-పీక్ వేళల్లో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు మార్చి 31తో ముగియనుంది. తాజాగా ఈ ఆఫర్‌ను మరో ఏడాది పొడిగిస్తూ మెట్రో నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని మెట్రో ఎండీ పేర్కొన్నారు.

US revoked Hundreds of international students Visas in Overnight Details8
విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

వాషింగ్టన్‌: అమెరికాలో విదేశీ విద్యార్థులపై డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరో బాంబు వేసింది. వందల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ రాత్రికి రాత్రే వీసా రద్దు మెయిల్స్‌​ పంపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీసాలు రద్దయిన విద్యార్థులు తక్షణమే దేశాన్ని వీడాలని లేదంటే బలవంతంగా తరలిస్తామని ఆ మెయిల్స్‌లో హెచ్చరించింది. వీసాలు రద్దైన వాళ్లలో కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఉన్నట్లు సమాచారం. యూనివర్సిటీలలో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ మెయిల్స్‌ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ‘బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ వీసా’ నుంచి విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్‌ పంపింది. కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన విద్యార్థులకు.. ఆఖరికి ఆ పోస్టులకు లైకులు కొట్టినవాళ్లకు కూడా ఈ హెచ్చరికలు పంపించింది.‘‘యునైటెడ్ స్టేట్స్‌ ఇమిగ్రేషన్, అమెరికా జాతీయచట్టంలోని సెక్షన్‌ 221(జీ) ప్రకారం.. మీ వీసా రద్దయింది. ఈ మేరకు స్టూడెంట్‌ ఎక్చ్సేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌కు బాధ్యత వహించే అధికారులకు సమాచారం వెళ్లింది. మీ వీసా రద్దు అంశం గురించి సంబంధిత కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేయవచ్చు’’హెచ్చరిక సందేశాలు వచ్చినవారు.. తమ స్వదేశాలకు వెళ్లేందుకు సీబీపీ హోమ్‌ యాప్‌ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ చర్యతో.. ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉండటం వల్ల కలిగే పరిణామాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిమితులపై ఆందోళన రేకెత్తుతోంది.

AP CM Chandrababu Again U Turn Comments On Super Six Promises9
ఆరోజు అన్నీ హామీలు అమలు చేయగలుగుతాం అనిపించింది

ఎన్టీఆర్‌ జిల్లా, సాక్షి: ఎన్నికల హామీల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్లేటు ఫిరాయించారు. సూపర్‌ సిక్స్‌ను ఎగ్గొట్టేందుకు ఈసారి కొత్త రాగం అందుకున్నారు. ఇందుకు మంగళగిరి ఇవాళ జరిగిన టీడీపీ ఆవిర్భావ సమావేశాలు వేదిక అయ్యింది. ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ సిక్స్ హామీలిచ్చాం. ఆరోజు బయట నుండి చూస్తే అన్నీ చేయగలుగుతాం అనిపించింది. నేను అనేకసార్లు చెప్పా. అభివృద్ధి జరగాలి.. సంపద సృష్టించాలి. ఆదాయం పెంచి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అప్పులు చేసి సంక్షేమపథకాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయాం అంటూ వ్యాఖ్యానించారాయన. అదే సమయంలో అప్పులపైనా మళ్లీ పచ్చి అబద్ధాలు చెప్పారాయన. రాష్ట్రానికి రూ. 9.75 లక్షల కోట్లు అప్పుందంటూ వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు యూటర్న్‌ వ్యాఖ్యలు ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఇలాగే మాట్లాడారాయన. ఇప్పుడు టీడీపీ సభలోనూ అమలు చేయలేకపోతున్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.

Woman Gives Birth On Bangkok Street Amid Earthquake Tremors10
ఆస్పత్రిలో ప్రసవ వేదనతో ఉండగా భూకంపం.. పాపం ఆ మహిళ..!

సరిగ్గా ప్రకృతి విపత్తుల నడుమే అనుకోని విత్కర పరిస్థితులు వస్తుంటాయి. ఓ పక్కా భూప్ప్రకంపనాలతో వణికిపోతున్న తరుణంలో.. ఓ నిండు చూలాలు నొప్పులు పడుతుంటే..దేవుడా..! ఏంటిదీ అనిపిస్తుంది. అక్కడ ప్రాణం పోసే వైద్యులు తమ ప్రాణాలు రక్షించుకోలేని స్థితిలో ఉండగా..మరోవైపు పేషెంట్‌ ప్రసవ వేదనతో అల్లాడుతుంటే..ఏం చేయాలో తోచని స్థితి అది. మనిషి మరచిపోతున్న మానవత్వపు విలువను గుర్తుచేసేందుకు దేవుడి పెట్టిన విపత్కర పరీక్ష ఏమో అనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ మానవత్వమే గెలిచింది. థాయ్‌లాండ్‌, మయన్మార్‌లని శుక్రవారం రెండు భారీ భూకంపాలు ఘోరంగా అతలాకుతులం చేసిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో ఇప్పటిదాకి వెయ్యిమందికి పైగా మృతి చెందారు. అయితే దారుణ భూవిలయంల నడుమ జరిగిన ఓ అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. సరిగ్గా థాయ్‌లాండ్‌లో భూకంపం సంభవిస్తున్న తరుణంలో.. బ్యాంకాక్‌లోని ఓ ఆస్పత్రిని ఖాళీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ విపత్కర సమయంలో పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను కూడా స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చారు. అక్కడ సమీపంలోని పార్క్‌లోనే ఆస్పత్రి సిబ్బంది చుట్టుముట్టి మరీ డెలివరీ చేశారు. ఓ పక్క భూవిలయం మరోవైపు శిశు జననం చోటు చేసుకున్న అరుదైన ఘటన ఇది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. భూకంపం సమయంలో ఓ శిశువు ఊపిరిపోసుకుందంటూ ఓ వీడియోని షేర్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల​ ప్రకారం.. భూప్రకంపన నేపథ్యంలో మయ కింగ్ చులాలాంగ్‌కార్న్ మెమోరియల్ హాస్పిటల్ రోగులను చర్‌లు, వీల్‌చైర్‌లతో దగ్గరలోని పార్కుకి తరలించారు. ఆ సమయంలోనే ప్రసవ నొప్పులతో బాధపడుతున్న మహిళను స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చి పార్క్‌లోనే డెలివిరీ చేశారు. ఆ పార్కులోనే మిగతా రోగులకు కూడా చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా, మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ ఘటనలో సుమారు 694 మంది మరణించగా, వెయ్యిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పైగా ఇంకా 68 మంది ఆచూకి కానరాలేదని సమాచారం. ఏదీఏమైనా ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. విపత్తుల సమయంలోనే మనలోని మంచి మనిషి బయటకు వస్తాడేమో అంతా ఒక్కటే అనే భావనతో మెలుగుతాం కాబోలు. Footage during the earthquake in #Bangkok a baby was born in the park 😭 Waht a story to tell ‘’ I was born during the earthquake ‘’ #แผ่นดินไหว #earthquake #myanmarearthquake #bangkokearthquake #ตึกถล่ม pic.twitter.com/7E0FdzfPEf— Miia 🩵 (@i30199) March 28, 2025 (చదవండి: వరాహరూపం..దైవ వరిష్టం..! 600 ఏళ్ల నాటి ఆది వరాహస్వామి ఆలయం..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement