Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comment On Ap People Mass Trolling Kutami Prabhutvam1
కూటమిపై ఇదెక్కడి మాస్ ట్రోలింగ్ మావా!

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? అని ఓ సామాన్యుడిని ఓ విలేకరి అడిగారు. ‘‘ఓ బ్రహ్మాండంగా ఉందిగా...’’ అన్నది అతడి సమాధానం!. ‘‘ఏ ఏ స్కీములు అందాయి’’ అనే రిపోర్టర్‌ ప్రశ్నకు వచ్చిన జవాబు.. ‘‘ఒకటేమిటి అన్నీ అందాయి కదా!’’ అని!!! ఇదేమిటి ఇలా అంటున్నాడని ఆ విలేకరి మరో ప్రశ్న వేశారు. ‘‘రైతు భరోసా కింద నిధులు వచ్చాయా?’’ అంటే, ‘‘నలభై వేలు వచ్చాయి..’’ అని సమాధానమొచ్చింది. ‘‘హామీ ఇచ్చింది రూ.ఇరవై వేలే కదా..’’ అని రిపోర్టర్ ఆశ్చర్యపోతే.. ‘‘అవునండి.. రైతులు కష్టాలలో ఉన్నారని కూటమి ప్రభుత్వం రూ.నలభై వేలు ఇచ్చిందిలే..’’ అని నిట్టూరుస్తూ చెప్పాడు. అప్పుడు అర్థమైంది ఆ విలేకరికి.. ఆ సామాన్యుడి చమత్కారం!కూటమి ప్రభుత్వంపై ప్రజల మాస్‌ ట్రోలింగ్‌ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఇక కొందరు పిల్లలు ‘‘నాకు పదిహేను వేలు, నాకు పదిహేను వేలు ఎక్కడ ముఖ్యమంత్రి గారూ’’ అంటూ అడిగిన వీడియో కూడా పాపులర్ అయింది. మరో వ్యక్తి పశువులను చూపుతూ ‘‘నీకు పదిహేను వేలు, నీకు పదిహేను వేలు’’ అంటూ మరో వీడియో చేశారు. కొందరు మహిళలు ఒక ఆర్టీసీ బస్సు ఎక్కి గతంలో చంద్రబాబు చెప్పిన డైలాగుల వీడియో ప్రదర్శించారు. అందులో ‘‘మీ చంద్రన్న డ్రైవర్ అయ్యాడు. మీరు ఏ బస్సైనా ఎక్కండి.. పుట్టింటికి వెళ్లండి.. లేదా పని చేసే చోటకు వెళ్లండి.. ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న పేరు చెప్పండి’’ అని చంద్రబాబు చేసిన ప్రకటన ఉంది. ఏపీలో ప్రభుత్వం ఎంత హేళనకు గురి అవుతుందో ఈ ఉదాహరణలన్నీ తెలియ చేస్తాయి. అయితే.. సమాధానం చెప్పవలసిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయకుండా, ఇలా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోంది. పోలీసులు అలా మాట్లాడిన వారిని గుర్తించి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి వేధిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఏపీలో ప్రజలు అత్యధిక శాతం తాము చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతల చేతిలో మోసపోయామని, వారు చేసిన వాగ్దానాలు నమ్మి దెబ్బతిన్నామని, రెండికి చెడ్డ రేవడి అయ్యామని బాధ పడుతున్నారు. ఈ దశలో శాసనసభ్యులు మాత్రం తమ సాంస్కృతిక కార్యక్రమాలలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై స్కిట్లు వేస్తూ తమ కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. జగన్ పేరు నేరుగా చెప్పకపోయినా అగౌరవంగా సంభోధిస్తూ.. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు డైలాగులు చెప్పారు. ఆ క్రమంలో.. ‘‘లే..లే..నా రాజా..’’ అంటూ ఓ ఐటెమ్‌ సాంగ్‌ను పాడుకుని వెకిలి ఆనందం పొందారు. వారిద్దరూ ఏదో పిచ్చి స్కిట్ వేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు పడి, పడి నవ్వుకుంటూ కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇంటికి వెళ్లినా నవ్వు ఆపుకోలేనని చెప్పారు. తోటి ఎమ్మెల్యేలపై ప్రభుత్వ కార్యక్రమంలో ఇలా నీచంగా ప్రదర్శనలు చేయవచ్చా? అనేది చాలామందికి వచ్చిన డౌటు. అందులో హాస్యం కన్నా వెకిలితనం ఎక్కువగా ఉందన్నది విశ్లేషకుల వ్యాఖ్య. 👉చిత్రం ఏమిటంటే.. ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడి వారిలో వారు సంతోషపడుతున్నారు కాని, ఎన్నికలకు ముందు నిజంగానే డ్రామాలు ఆడారు. ప్రజలను మాయ చేశారు. ఎక్కడలేని వాగ్దానాలు చేసి ప్రజలను బోల్తా కొట్టించామన్న ఆనందంలో కూటమి ఎమ్మెల్యేలు ఉండవచ్చు. కానీ ప్రజలు వీరి వికృత విన్యాసాలను జ్ఞప్తికి తెచ్చుకుని నిజంగానే వీరిని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. శాసనసభలో ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ తామిచ్చిన హామీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. గతంలో తాము ఇంటింటికి తిరిగి మరీ బాండ్లు పంచిన ఎమ్మెల్యేలకు, కూటమి నేతలకు ఆత్మ అనేది ఉంటే వాటిని గుర్తు చేసుకోవాలి. 👉ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మాట్లాడుతూ తల్లికి వందనం స్కీము అమలు చేసేస్తున్నామనే భావన కలిగేలా మాట్లాడిన వీడియో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలు ఎందరు ఉంటే అందరికి డబ్బులు ఇస్తున్నామని, పిల్లలు సంపాదించుకుంటున్నారని అంటున్నారు. మరో వైపు ఆయన కుమారుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్ చట్టసభలో మాట్లాడుతూ లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో తగ్గారని ఒక నిజాన్ని వెల్లడించారు. దానికి జగన్ ప్రభుత్వ విధానాలు అనే ఒక అబద్దాన్ని జత చేశారు. అంతే తప్ప తాము తల్లికి వందనం,తదితర పధకాలను హామీ ఇచ్చిన విధంగా అమలు చేయలేకపోతున్నామని మాత్రం చెప్పలేకపోయారు. 👉జగన్ టైమ్ లో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య పెరిగిందన్న విషయం మర్చిపోయి ఉండవచ్చు. కాని ఈ మద్య ఒక వీడియో వచ్చింది. పొలంలో కూలి పని చేసుకుంటున్న ఒక మహిళ ఒక బాలికను చూపుతూ.. డబ్బులు లేక స్కూల్ మాని పొలం పనికి వస్తోందని చెప్పింది. ఈ దృశ్యం హృదయ విదాకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో చేసిన బాసలను అధినేతలకు గుర్తు చేస్తూ స్కిట్‌లు ప్రదర్శించి ఉంటే బాగుండేది. లేదా మరో పని చేసి ఉండాల్సింది. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఎలాంటి స్పీచ్ లు ఇచ్చింది.. ప్రజలను ఎలా బోల్తా కొట్టించింది.. అన్న అంశాలపై నాటికలు ప్రదర్శించి ఉంటే చాలా రక్తి కట్టేవేమో! తాము ఎలా ప్రజలను మోసపూరిత హామీలతో నమ్మించింది చెప్పే స్కిట్‌లను వేసుకుని ఉండాల్సింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎంతెంత ఇచ్చేది లెక్కలు వేసే చెప్పారు కదా. వలంటీర్లను కొనసాగిస్తామని, వారి పొట్టగొట్టమని, పదివేలకు గౌరవ వేతనం పెంచుతామని అధినేతలు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుని సంబంధిత డ్రామాలు ప్రదర్శించుకుని ఉంటే అర్థవంతంగా ఉండేవేమో! లేదా ఆ వీడియోలను తెరపై ఒక్కసారి వేసుకుని చూసుకుని ఉంటే తెగ నవ్వు వచ్చేది కదా!. 'నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు.." ఇది ఆంధ్రప్రదేశ్ లో బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఆ రోజుల్లో ఇంటింటికి సైకిల్ వేసుకుని వెళ్లి మహిళలు, పిల్లలందరిని కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లుగా కబుర్లు చెప్పి వచ్చారు. అలాగే యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా..మీకు పద్దెనిమిది వేలు.. వలంటీర్ల దగ్గరకు వెళ్లి మీకు నెలకు పది వేలు ఖాయం అంటూ ఎన్నికల మానిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చేవారు. అంతేకాదు..ప్రభుత్వం వచ్చిన వెంటనే హామీ అమలు పరుస్తామని, ఆ తర్వాత వలంటీర్లు తనకు స్వీట్లు, పూతరేకులు తెచ్చి తినిపంచాలని కూడా కోరారు.ఆ సన్నివేశం ఒక్కటి చాలు బాగా పండడానికి. ఆ వీడియోలను చూసుకుని ఉంటే వారంత కడుపారా నవ్వుకునే వారేమో! .చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకు వేసి మీకు ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని, వారికి కూడా ఇదే విధంగా ఆర్థిక సాయం చేస్తామని చెప్పేవారు. ఎమ్మెల్యేలు పిల్లలు కనమంటున్న చంద్రబాబుకు సంబంధించి స్కిట్ వేసినట్లున్నారు కాని, ఆ పిల్లలకు తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టిన సంగతి మాత్రం చెప్పలేదు. సాంస్కృతిక ప్రదర్శనలో కొంతమంది వికృత విన్యాసాలకు బాగా సంతోషించిన పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు. పిఠాపురం సభలో.. తనవల్లే టీడీపీ నిలబడిందని స్పీచ్ ఇచ్చినా, ఇక్కడ మాత్రం కారణం ఏమైనా, చంద్రబాబు మరో పదిహేనేళ్లు సీఎంగా కొనసాగాలని అంటూ పవన్‌ తన విధేయత ప్రదర్శించారు. చంద్రబాబు నుంచి చాలా నేర్పుకున్నానని ఆయన చెబుతుంటే బహుశా పరిపాలన కన్నా, ఇలా అబద్దాలు చెప్పి ప్రజలను ఏ విధంగా నమ్మించవచ్చు..ఆ తర్వాత ఎలా ఎగవేయవచ్చన్నది బాగానే నేర్చుకున్నారన్న భావన ఏర్పడుతోంది. సామాన్య ప్రజలు కూటమి ప్రభుత్వంపై వేస్తున్న ఛలోక్తులు సహజంగా ఉంటే.. ఎమ్మెల్యేల స్కిట్‌లు మాత్రం కృత్రిమంగా ఉన్నాయి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Supreme Court Sensational Judgement In TTZ Trees Cut Case 2
అది మనుషుల్ని చంపడం కన్నా ఘోరం: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: పర్యావరణాన్ని తమ కళ్లెదుటే నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని.. ఇలాంటి చర్యలను అడ్డుకట్ట ఎలా వేయాలో తమకు బాగా తెలుసని దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) అంటోంది. చెట్లను నరికిన వ్యవహారంలో ఓ వ్యక్తికి భారీ జరిమానా విధించిన కోర్టు.. ఇలాంటి చర్యలు మనుషుల్ని చంపడం కన్నా ఘోరం అంటూ వ్యాఖ్యానించింది. తాజ్‌ ట్రాపిజెమ్‌ జోన్‌ పరిధిలోని మధుర-బృందావన్‌లో దాల్మియా ఫార్మ్స్‌ నిర్వాహకుడు శివ్‌ శంకర్‌ అగర్వాల్‌.. చెట్లు నరికిన కేసులో ఊరట కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజల్‌ భుయాన్‌ ధర్మాసనం అక్రమంగా నరికిన ప్రతీ చెట్టుకు లక్ష రూపాయాల జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చింది.అనుమతి లేకుండా అన్నేసి చెట్లు నరకడం అన్నింటికంటే ఘోరం. అంత వృక్షసంపదతో పచ్చదనం మళ్లీ కావాలంటే కనీసం వందేళ్లైనా పట్టొచ్చు. ఇది మనుషుల్ని చంపడం కంటే పెద్ద నేరం. ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోలేం. కాలుష్య ప్రభావం రాబోయే తరాల మీద పడకుండా చూడాలంటే చెట్లు అవసరం.వాటిని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని అభిప్రాయపడింది. ఇక.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ కోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే కోర్టు చెట్టుకు లక్ష చొప్పున .. రూ.4 కోట్ల 54 లక్షల జరిమానా కట్టాలని ఆదేశించింది. అయితే.. అగర్వాల్‌ తరఫున వాదనలు వినిపించిన ముకుల్‌ రోహత్గీ.. తన క్లయింట్‌ తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పాడని, అందుకు సంబంధించి అఫిడవిట్‌ కూడా కోర్టుకు సమర్పించామని తెలియజేశారు. అయినప్పటికీ జరిమానా విషయంలో ధర్మాసనం అస్సలు తగ్గలేదు.మరోవైపు సమీపంలోని స్థలంలో తోటలు వేసుకునేందుకు అగర్వాల్‌ అనుమతి కోరగా.. అతనిపై దాఖలైన ధిక్కార పిటిషన్‌ను విచారణ తర్వాతే ఆ అంశంపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా.. జోన్‌లోని అటవీయేతర, ప్రైవేట్ భూములలోని చెట్లను నరికివేయడానికి ముందస్తు అనుమతి పొందాలనే నిబంధనను తొలగిస్తూ 2019లో ఇచ్చిన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు గుర్తుచేసుకుంది.తాజ్‌ ట్రాపిజెమ్‌ జోన్‌ను కేంద్రం 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఏర్పాటు చేసింది. కాలుష్య కోరల్లోంచి తాజ్‌ మహల్‌తో పాటు ఇతర వారసత్వ సంపదలను పరిరక్షించే ఉద్దేశంతో ఈ జోన్‌ను తీసుకొచ్చారు. మొత్తం 10,400 ‍స్క్వేర్‌ కిలోమీటర్ల ప్రాంతం ఇది. ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌లో కొంత భాగం కూడా ఉంది. అత్యంత సున్నిత ప్రాంతంగా పేరున్న టీటీజెడ్‌ పర్యవేక్షణ కోసం ప్రత్యేక కాలుష్య నియంత్రణ మండలి కూడా ఉంది. అయితే..2019లో సుప్రీం కోర్టు టీటీజెడ్‌లో చెట్లను తొలగించడం కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలన్న నిబంధనను ఎత్తేసింది. వ్యవసాయ, పశుపోషణ సంబంధిత కార్యకలాపాల కోసం చెట్లను తొలగిండచంలో తప్పేమీ లేదని అభిప్రాయపడింది. అయితే తర్వాతి రోజుల్లో ఆ ఉత్తర్వులను సమీక్షించిన సర్వోన్నత న్యాయస్థానం 2019 నాటి ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

IPL 2025, GT VS PBKS: Dont Worry About My Hundred,Shreyas Last Over Message To Shashank3
GT VS PBKS: నిస్వార్థమైన కెప్టెన్‌, సెంచరీ ముఖ్యం కాదన్నాడు: శ్రేయస్‌పై శశాంక్‌ ప్రశంసలు

ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీని త్యాగం చేసి మరీ తన జట్టును గెలిపించాడు. శ్రేయస్‌కు సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం శశాంక్‌ సింగ్‌కు స్ట్రయిక్‌ ఇచ్చి నిస్వార్దమైన కెప్టెన్‌ అనిపించుకున్నాడు. కెప్టెన్‌ త్యాగాన్ని శశాంక్‌ వృధా కానివ్వలేదు. సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు సాధించాడు. ఫలితంగా పంజాబ్‌ భారీ స్కోర్‌ చేసింది. చివరి ఓవర్‌లో శశాంక్ చేసిన పరుగులే అంతిమంగా పంజాబ్‌ గెలుపుకు దోహదపడ్డాయి.ఒకవేళ శ్రేయస్‌ జట్టు ప్రయోజనాలు పట్టించుకోకుండా సెంచరీనే ముఖ్యమనుకునే ఉంటే ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓటమిపాలయ్యేది. ఎందుకంటే గుజరాత్‌, పంజాబ్‌ మధ్య పరుగుల తేడా కేవలం 11 పరుగులు మాత్రమే. శ్రేయస్‌ వ్యక్తిగత స్వార్దం చూసుకుని సెంచరీ కోసం ప్రయత్నించి ఉంటే చివరి ఓవర్‌లో మహా అయితే 10-15 పరుగులు వచ్చేవి. ఇదే జరిగి ఉంటే పంజాబ్‌ 230-235 పరుగులకు పరిమితం కావాల్సి వచ్చేది. అప్పుడు గుజరాత్‌ సునాయాసంగా లక్ష్నాన్ని ఛేదించి ఉండేది.పంజాబ్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌కు ముందు శ్రేయస్‌ 97 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఆ ఓవర్‌లో కనీసం ఒక్క బంతి ఎదుర్కొన్నా శ్రేయస్‌ సెంచరీ చేసేవాడు. కానీ అతను స్ట్రయిక్‌ కోసం పాకులాడలేదు. శశాంక్‌ మంచి టచ్‌లో ఉన్న విషయాన్ని గమనించి అతన్నే స్ట్రయిక్‌ తీసుకోమన్నాడు. ​శశాంక్‌కు సైతం స్ట్రయిక్‌ రొటేట్‌ చేసే అవకాశం రాలేదు. భారీ షాట్టు ఆడే క్రమంలో 5 బంతులు బౌండరీలకు తరలి వెళ్లగా.. ఓ బంతికి రెండు పరుగులు (రెండో బంతి) వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ శ్రేయస్‌ స్ట్రయిక్‌ తీసుకుని (సింగిల్‌ తీసుంటే) ఉండవచ్చు. కానీ అతను అలా చేయలేదు.జట్టు ప్రయోజనాల కోసం​ సెంచరీ త్యాగం చేసిన అనంతరం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం శ్రేయస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. శశాంక్‌ సింగ్‌ సైతం మ్యాచ్‌ అనంతరం తన కెప్టెన్‌ను కొనియాడాడు. శశాంక్‌ మాటల్లో.. టీ20ల్లో, ముఖ్యంగా ఐపీఎల్‌లో సెంచరీ చేసే అవకాశం అంత ఈజీగా రాదు. కానీ మా కెప్టెన్‌ సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. చివరి ఓవర్‌ మొత్తం నన్నే స్ట్రయిక్‌ తీసుకొని భారీ షాట్లు ఆడమన్నాడు. తన సెంచరీ గురించి ఆలోచించొద్దని చెప్పాడు. నేను స్వయంగా స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తానని చెప్పాను. కానీ అతను నాకు సెంచరీ ముఖ్యం కాదని చెప్పాడు. ఇలా చెప్పాలంటే ఏ కెప్టెన్‌కు అయినా చాలా గట్స్‌ ఉండాలి. మా కెప్టెన్‌కు ఆ గట్స్‌ ఉన్నాయి. శ్రేయస్‌ నన్ను ప్రతి బంతిని సిక్సర్‌ లేదా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించమని చెప్పాడు. అది నాకు చాలా కాన్ఫిడెన్స్‌ ఇచ్చింది. కెప్టెన్‌ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్‌తో నేను రెచ్చిపోయాను.కాగా, శ్రేయస్‌ (42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు నాటౌట్‌), శశాంక్‌తో పాటు (16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు నాటౌట్‌), ప్రియాంశ్‌ ఆర్య (23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ 232 పరుగులకే పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్‌ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్‌ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటారు. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ 2, జన్సెన్‌, మ్యాక్స్‌వెల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

gold and silver rates today telugu states4
మళ్లీ పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం గడిచిన రెండు రోజుల్ల తగ్గుముఖం పట్టింది. తిరిగి ఈరోజు మళ్లీ ధరలో పెరుగుదల నమోదైంది. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.81,950 (22 క్యారెట్స్), రూ.89,400 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100, రూ.110 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.81,950 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,400 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: పీఎస్‌యూల్లో వాటా విక్రయం వాయిదాదేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 పెరిగి రూ.82,100కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.110 పెరిగి రూ.89,550 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నట్లు వెండి ధరల్లోనూ బుధవారం మార్పులు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి రేటు(Silver Price) మంగళవారంతో పోలిస్తే రూ.1000 పెరిగి రూ.1,11,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Palestinians Hamas Out Slogans In Gaza Streets5
గాజాలో హమాస్‌కు బిగ్‌ షాక్‌..

ఇజ్రాయెల్‌-హమాస్‌ పరస్పర దాడులు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిమాణం చోటుచేసుకుంది. హమాస్‌కు వ్యతిరేకంగా గాజాలో పాలస్తీనియన్లు నిరసనలు తెలుపుతూ భారీ సంఖ్యలో రోడ్లకు మీదకు వచ్చారు. యుద్ధం ఆపాలంటూ నినాదాలు చేస్తూ వీధుల్లోకి వచ్చారు. మేము శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.గాజాలో హమాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా అనేక మంది పాలస్తీనియన్లు ప్రాణ భయంతో శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా వాసులు నిరసనలు తెలిపారు. ఇజ్రాయెల్‌తో ఘర్షణకు ముగింపు పలికి, అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ వందలాది మంది పాలస్తీనియన్లు ఆందోళనలు చేశారు. ఉత్తర గాజాలోని బీట్‌ లాహియాతో సహా వివిధ ప్రాంతాల్లో మంగళవారం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ‘యుద్ధాన్ని ఆపాలి, మేము శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గాజాలోని ప్రజలను రక్షించేందుకు హమాస్‌ తన అధికారాన్ని ఎందుకు వదులుకోదని వారు ప్రశ్నించారు. దీనికి సంబంధిచిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే, హమాస్‌కు వ్యతిరేకంగా నిరసనలకు ఎవరు నేతృత్వం వహించారు అనేది తెలియరాలేదు. టెలిగ్రామ్‌లో వచ్చిన సందేశాల ఆధారంగానే తాము ఆందోళనల్లో పాల్గొన్నామని నిరసనకారుల్లో కొందరు తెలిపారు. ఇదిలా ఉండగా.. 2007 నుంచి గాజాను హమాస్ పాలిస్తోంది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడుల కారణంగా యుద్ధం ప్రారంభమైంది. దాదాపు 17 నెలల నుంచి ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య యుద్ధం సాగుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటివరకు చేసిన దాడులకు 50 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 1.13 లక్షల మంది గాయపడినట్లు వెల్లడించింది.Large protests against Hamas's fascism in Gaza today, with thousands demanding dignity, an end to the war & destruction, and calling on the terror group to "get out." Listen to Palestinians in Gaza; cover these demonstrations; be their voice; amplify their cries. Down with Hamas! pic.twitter.com/c9iHyqvAO5— Ahmed Fouad Alkhatib (@afalkhatib) March 25, 2025ఈ యుద్ధం ప్రారంభం నుంచి గాజాలో హమాస్‌కు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తొలిదశ కాల్పుల విరమణ పొడిగింపును హమాస్ నిరాకరించింది. ఇటీవల కాల్పుల విరమణ ముగిసిన తర్వాత వారం వ్యవధిలోనే మళ్లీ దాడులు మొదలుకాగా.. వీటిలో దాదాపు 673 మంది చనిపోయారు. దీంతో, ఇజ్రాయెల్‌ దాడులను మరింతగా పెంచడంతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఈనెల మొదట్లో గాజాలోకి మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో అక్కడి పరిస్థితులు మరింత క్షీణించాయి."Out, out, out! #Hamas get out!"#Gaza residents pour on the streets chanting slogans against the militant organization that ruled Gaza for 20 years.pic.twitter.com/af9PKVZDhg— Ahmed Quraishi (@_AhmedQuraishi) March 26, 2025

CM Chandrababu Creates Record Over Andhra Pradesh debt6
అప్పులు చేయడంలో రికార్డు సృష్టించిన చంద్రబాబు

సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టించారు. కూటమి ప్రభుత్వానికి అప్పు వారమైన మంగళవారం(నిన్న) రోజున 7.09 శాతం వడ్డీతో మరో రూ.4,548 కోట్లు అప్పు తీసుకుంది కూటమి ప్రభుత్వం. దీంతో, చంద్రబాబు చేసిన అప్పులు రికార్డు స్థాయిలో రూ.1.52లక్షల కోట్లకు చేరుకున్నాయి.అప్పులు చేయడంలో చంద్రబాబు సర్కార్‌ దూసుకెళ్తోంది. తాజాగా కూటమి ప్రభుత్వం రూ.4,548 కోట్లు తీసుకుంది. ఇందుకు గాను 7.09 శాతం వడ్డీతో అ‍ప్పు తీసుకోవడం గమనార్హం. దీంతో, రాష్ట్ర చరిత్రలో ఒక్క ఏడాదిలో ఇంత అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదే. బడ్జెట్‌లో చెప్పిన దానికి మించి కూటమి సర్కార్‌ అప్పులు చేసింది. బడ్జెట్‌ అప్పులు రూ.98,088 కోట్లకు చేరగా.. బడ్జెట్‌ బయట అప్పు రూ.54,700 కోట్లకు చేరుకుంది. దీంతో, బడ్జెట్‌ బయట, లోపల.. చంద్రబాబు చేసిన అప్పులు రూ.1.52లక్షల కోట్లకు చేరుకుంది. అయితే, ఇన్ని అప్పులు చేసినా.. కూటమి ప్రభుత్వం మాత్రం సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయడం లేదు.ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్‌ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్‌ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్‌ గత గురువారం వెల్లడించింది.భారీగా తగ్గిన రెవెన్యూ రాబడులు.. పన్నులు ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు లేనందున సాధారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు పెరగాలి. అందుకు పూర్తి విరుద్ధంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్ర­వరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల కన్నా.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల్లో రూ.11,450­కోట్ల మేర తగ్గుదల నమోదైంది. అంటే చంద్ర­­బాబు పాలనలో సంపదలోనూ, వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అమ్మకం పన్నుతోపాటు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ ఆదాయం కూడా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు అమ్మకం పన్ను ఆదాయం రూ.1,068 కోట్లు తగ్గినట్లు కాగ్‌ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.721 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. భారీగా పెరిగిన అప్పులు... తగ్గిన కేంద్రం గ్రాంట్లు 2024–25 బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్లు కాగ్‌ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకే బడ్జెట్‌ పరిధిలోనే రూ.90,557 కోట్లు అప్పు చేసినట్లు కాగ్‌ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.70 వేల కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా రూ.20 వేల కోట్లు అప్పు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో రూ.16,766 కోట్ల తగ్గుదల నమోదైంది.

Donald Trump US Election Integrity Executive Order Citizenship Ballots United States7
ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పౌరసత్వ రుజువుకు పెద్దపీట

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు చేస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీనిలో ఓటరు నమోదు కోసం పౌరసత్వానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేశారు. ఇటువంటి మార్పులు చేర్పుల కారణంగా చట్టపరమైన సవాళ్లు ఎదురుకానున్నాయి.ట్రంప్‌ సంతకం చేసిన ఉత్తర్వులోని వివరాల ప్రకారం ఇంతవరకూ అమెరికాలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ(Election process)లో అత్యవసమైన ఎన్నికల నిబంధనలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే ఓటరు జాబితాలను వెలువరించడంలో, ఎన్నికల సంబంధిత నేరాలను విచారించడానికి అందరూ సమాఖ్య సంస్థలకు సహకరించాలని ఆ ఉత్తర్వులో కోరారు. ఎన్నికల నిబంధనలను పాటించని రాష్ట్రాలు సమాఖ్య నిధులలో కోతలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆ ఉత్తర్వులో హెచ్చరించారని ఎన్‌డీటీవీ తన కథనంలో పేర్కొంది. సమాఖ్య ఎన్నికలలో ఓటు వేసేందుకు పాస్‌పోర్ట్ వంటి పౌరసత్వ రుజువును తప్పనిసరి చేశారు.ఎన్నికల రోజు తర్వాత అందుకున్న మెయిల్-ఇన్ బ్యాలెట్‌(Mail-in ballot)లను రాష్ట్రాలు ఇకపై అంగీకరించకూడదని దీనిలో స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వం తాము తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల్లో అక్రమాలు, మోసాలను అరికట్టేందుకేనని పేర్కొంది. ముఖ్యంగా మెయిల్-ఇన్ ఓటింగ్‌ సందర్భంలో డాక్యుమెంట్ మోసాలు జరుగుతున్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నప్పుడు ట్రంప్ అమెరికా ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలను ప్రస్తావించారు. ఈ తాజా ఉత్తర్వు ఇటువంటి అవకతవకలను అంతం చేస్తుందని పేర్కొన్నారు.రిపబ్లికన్ చట్టసభ సభ్యులు ఈ ఉత్తర్వుకు మద్దతు ప్రకటించారు. ఇది ఎన్నికల సమగ్రతపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఉపయోపగడుతుందని పేర్కొన్నారు. జార్జియా విదేశాంగ కార్యదర్శి బ్రాడ్ రాఫెన్స్‌పెర్గర్ మాట్లాడుతూ ఈ ఉత్తర్వు అమెరికన్ పౌరులు మాత్రమే ఇక్కడి ఎన్నికల ఫలితాలను నిర్ణయించేలా ఉందని పేర్కొన్నారు. మరోవైపు డెమొక్రాట్లు ఈ ఉత్తర్వును ఖండించారు. కొందరు ఓటర్లు ఓటు హక్కును కోల్పోతారని వారు పేర్కొన్నారు. 2023 నాటి ఒక నివేదిక ప్రకారం అర్హత కలిగిన అమెరికా పౌరులలో తొమ్మిది శాతం మందికి పౌరసత్వ రుజువు అందుబాటులో లేదని తెలుస్తోంది.మరోవైపు ఇప్పటివరకూ ఎన్నికల సమయంలో 18 రాష్ట్రాలు ఎన్నికల రోజు తర్వాత అందుకున్న మెయిల్ బ్యాలెట్‌లను ఆ తేదీకి ముందు పోస్ట్‌మార్క్ చేసినంత వరకు అంగీకరిస్తూ వస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌ ఇకపై ఈ పద్ధతికి స్వస్తి పలికారు. కాగా కొలరాడో డెమోక్రటిక్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెనా గ్రిస్వోల్డ్ మాట్లాడుతూ ఈ ఉత్తర్వు సమాఖ్య ప్రభుత్వం వాడుతున్న చట్టవిరుద్ధమైన ఆయుధంగా అభివర్ణించారు. ట్రంప్ ఓటర్ల సంఖ్యను మరింతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఇది కూడా చదవండి: Kashmir: హురియత్‌ దుకాణం బంద్‌.. వేర్పాటువాదుల నోటికి తాళం

Mother In ICU Jacqueline Fernandez Miss IPL Ceremony8
ఐసీయూలో తల్లి.. IPLకు నో చెప్పిన హీరోయిన్

హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుతున్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తెలుగులోనూ ప్రభాస్ సాహో మూవీలో నటించింది. కెరీర్ పరంగా ఎప్పుడూ ఏదో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉండే ఈమె.. సడన్ గా ఆస్పత్రిలో కనిపించింది. ఈమె తల్లి ఐసీయూలో ఉండటమే దీనికి కారణం.(ఇదీ చదవండి: పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని)శ్రీలంకకు చెందిన జాక్వెలిన్.. చాన్నాళ్ల క్రితమే మన దేశానికి వచ్చేసింది. హిందీ మూవీస్ చేస్తూ ముంబైలో సెటిలైపోయింది. తెలుగు, కన్నడ, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తల్లితో పాటు కలిసుంటోంది. అయితే జాక్వెలిన్ తల్లి కిమ్ కి సోమవారం గుండెపోటు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకా ఆమె ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా పరామర్శించి వెళ్లినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఐపీఎల్ లో గౌహతి వేదికగా గురువారం కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు ప్రారంభోత్సవ వేడుకలకు జాక్వెలిన్ హాజరై ఫెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది. కానీ తల్లి ఐసీయూలో ఉండటంతో దీనికి నో చెప్పేసింది. ప్రస్తుతాకైతే ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: మిలియన్ డాలర్ 'కోర్ట్'.. నానికి ఇది చాలా స్పెషల్)

Police Case Filed Against BRS KTR9
కేటీఆర్‌పై కేసు నమోదు

సాక్షి, నల్లగొండ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. నల్లగొండ జిల్లాలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రజిత ఫిర్యాదు మేరకు నకిరేకల్‌ పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌, మాస్‌ కాపీయింగ్ వ్యవహారంలో నిందితులతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ తమపై కేటీఆర్ ట్వీట్ చేశారని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రజిత తెలిపారు. దీనికి సంబంధించి.. బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ రజిత.. కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలో కేటీఆర్‌తో పాటు క్రిషాంక్, కొణతం దిలీప్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. నిందితుడు చిట్ల ఆకాష్ తన డ్రైవర్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఆమె ఫిర్యాదుతో నకిరేకల్‌ పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. పేపర్ లీకేజీ ఘటనలో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 🚨A Shocking Case of SSC Paper Leak as well as Nexus for Top Rankings - Congress leaders involved with Private School Management to send the SSC 10th Class Examination First Day Question paper through Whatsapp Groups...While 15 people have been involved,only 6 have been… pic.twitter.com/XHBScJBrY7— Dr.Krishank (@Krishank_BRS) March 24, 2025

The Climate Emergency Approach Maintaining Cereal Productivity10
‘క్లైమెట్‌ ఎమర్జెన్సీ’..ఇలాంటప్పడు ఈ సిరి ధాన్య పంటలే మేలు..!

కరువు, భూగర్భ జలాలు అడుగంటడం, సాధారణం కన్నా ఎక్కువగా 4–5 అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో భూతాపం ముందెన్నడూ ఎరుగనంతగా పెరిగిపోతోంది.. 2024 ఏడాదిలో అన్ని నెలలూ మానవాళి చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్‌నినో కారణంగా ఇలా జరిగిందేమో అనుకుంటే.. లానినా దశలో కూడా 2025లో మొదటి 3 నెలలు కూడా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనం ఇప్పుడు క్లైమెట్‌ ఎమర్జెన్సీ స్థాయిలో పర్యావరణ సంక్షోభాన్ని అనుభవిస్తున్నామని చెప్పకతప్పదు. అందుకు తాజా నిదర్శనం.. రిజర్వాయర్లు ఖాళీ అవుతున్నాయి. జీవనదులు ఎండి΄ోతున్నాయి. మట్టి ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. పంటలకు గడ్డు కాలం వచ్చింది. ప్రస్తుత రబీ సీజన్‌లో తెలుగునాట కొన్ని జిల్లాల్లో వరి తదితర పంటలు, పండ్ల తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఇది స్పష్టంగా ‘క్లైమెట్‌ ఎమర్జెన్సీ’ పరిస్థితే! కిం కర్తవ్యం?వాతావరణ మార్పులను తట్టుకునేవి, తక్కువ నీటి అవసరం కలిగినవి అయిన చిరుధాన్యాలను ప్రధాన ఆహార పంటలుగా సాగు చేయాలని హైదరాబాద్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐ.ఐ.ఎం.ఆర్‌.) సూచిస్తోంది. రైతుకు పర్యావరణ, ఆర్థిక, పౌష్టికాహార భద్రతనిచ్చే ఈ పంటలు వినియోగదారులకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తాయి. ప్రకృతి వనరుల ఆధారంగానే వ్యవసాయం సాగేది. వర్షం మన వ్యవసాయానికి ముఖ్యాధారం. వర్షం ఎప్పుడొస్తుందో.. ఎంత తక్కువ కురుస్తుందో.. వర్షాకాలం మధ్యలో ఎన్ని రోజులు వర్షం మొహం చాటేస్తుందో తలపండిన వారికి కూడా అంతుపట్టని దశకు చేరాం. పెద్ద నదులపై ఉన్న రిజర్వాయర్లు సైతం వేసవి అడుగంటిపోవడంతో ఆయకట్టు భూములకు కూడా సాగు నీటి భద్రత కరువైపోయే పరిస్థితులు వచ్చాయి. దీని అర్థం ఏమిటంటే.. ఇంతకుముందు వేస్తున్న అధికంగా నీటి అవసరం ఉండే పంటల్నే గుడ్డిగా ఇక మీదట సాగు చేయలేం. నీటి అవసరం అంతగా అవసరం లేని ఆహార పంటల వైపు దృష్టి మరల్చడం రైతులకు, సమాజానికి శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసే పంటలను విజ్ఞతతో ఎంపిక చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఈ కోవలో ముందు వరుసలో ఉండేవి.. చిరుధాన్య పంటలు. జొన్న, సజ్జ, రాగి, కొర్ర, ఊద, సామ, అరికెలు, ఒరిగెలు.. ఇవీ మనకు ముఖ్యంగా తెలిసిన చిరుధాన్య పంటలు (మిల్లెట్స్‌). దక్షిణ భారతీయులకు వేలాది ఏళ్ల క్రితమే బాగా పరిచయమైన పంటలివి.. కొత్తవి కాదు. హరిత విప్లవం పేరుతో వరి, గోధుమ వంటి ఆహార పంటలను ప్రభుత్వం వ్యాప్తిలోకి తేవడానికి ముందు వేలాది ఏళ్లుగా మన పూర్వీకులు తింటూ ఆరోగ్యంగా జీవించడానికి కారణభూతమైన పంటలివి. పర్యావరణ, వాతావరణ సంక్షోభకాలంలో తిరిగి ఈ పంటల వైపు మన ప్రజలు, రైతులు, ప్రభుత్వాలు దృష్టిసారించాల్సిన అవసరం తోసుకు వచ్చిన తరుణం ఇది.సి–4 రకం పంటలు మేలునీటి వనరులు అందుబాటులో లేని, సారం పెద్దగా లేని తేలిక, ఎర్ర నేలలు వరి, పత్తి వంటి పంటల సాగుకు అనుకూలం కావు. ఈ పంటలను సాంకేతిక పరిభాషలో ‘సి–3’ పంటలు అంటారు. తక్కువ వర్షం తోనే, కరువు కాలంలో సయితం అంతగా సారం లేని తేలిక, ఎర్ర నేలల్లోనూ ఖచ్చితమైన దిగుబడులనిచ్చేవి చిరుధాన్య పంటలు. సాంకేతిక పరిభాషలో వీటిని ‘సి–4’ పంటలు అంటారు.చిరుధాన్య పంటలు వరి కన్నా అనేక రకాలుగా మేలైనవి . సమాజానికి పౌష్టికాహార భద్రతతోపాటు రైతులకు కనీస ఆదాయ భద్రతను ఇవ్వడంతోపాటు, వరి గడ్డి కన్నా అధిక ΄ోషక విలువలున్న పశుగ్రాసాన్ని కూడా అందిస్తాయన్నారు. భూతాపం అసాధారణంగా పెరుగుతున్న సంక్షోభ కాలంలో ఇంతకు ముందు వేసిన పంటే వేస్తామని, ఇంతకు ముందు తినే ఆహారమే తింటామని అనుకుంటూ ఉండకూడదు. వాతావరణ అసమతుల్యతను తట్టుకొని పెరిగే చిరుధాన్యాలను ముఖ్య ఆహారంగా తినటం మొదలుపెడితే రైతులూ పండించడం మొదలు పెడతారు. తెలుగు రాష్ట్రాల వ్యవసాయ శాఖలు, రైతులు అనువుకాని భూముల్లో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలను లక్షల ఎకరాల్లో సాగు చేయడం మాని.. చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. సి–4 పంటల విశిష్టత ఏమిటి?సి–4 రకం పంటల విశిష్టత ఏమిటంటే.. అతి తక్కువ నీటితో, తక్కువ పంట కాలంలోనే కరువును, అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని, అధిక పౌష్టిక విలువలతో కూడిన ఆహార ధాన్యాలను అందిస్తాయి. వాతావరణం నుంచి బొగ్గుపులుసు వాయువును, సూర్యరశ్మిని గ్రహించి అధిక ఉష్ణోగ్రతలు, కరువు పరిస్థితుల్లో సైతం ఆహారాన్ని ఉత్పత్తి చేసుకొని మంచి దిగుబడులు ఇవ్వడంలో సి–4 పంటలు సి–3 రకం పంటలకన్నా అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. భూతాపాన్ని పెంచే హరిత గృహ వాయువులను చిరుధాన్య పంటలతో పోల్చితే వరి పంట 20 రెట్లు ఎక్కువగా విడుదల చేస్తున్నది. అందుకే చిరుధాన్యాలు రైతులకు బీమా ఇవ్వగలిగిన పంటలన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజలతో కలిపి సమీకృత వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసినప్పుడు ఎరువుల అవసరం, చీడపీడల బెడద కూడా చిరుధాన్య పంటలకు పెద్దగా ఉండదు.తేలిక భూముల్లో, ఎర్ర నేలల్లో మొక్కజొన్న, పత్తి సాగు చేస్తే వర్షాలు సక్రమంగా పడనప్పుడు ఈ పంటలు రైతులను తీవ్ర నష్టాల పాలుజేయడానికి అవకాశాలెక్కువ. చెరకు సాగుకు 2,100 ఎం.ఎం, వరికి 1,250 ఎం.ఎం., పత్తికి 600 ఎం.ఎం. నీరు అవసరం. అయితే, జొన్నలకు 400 ఎం,ఎం., సజ్జ, రాగి, కొర్ర తదితర స్మాల్‌ మిల్లెట్లకు 350 ఎం.ఎం. నీరు సరి΄ోతుంది. వేరుశనగకు 450 ఎం.ఎం., పప్పుధాన్యాలకు 300 ఎం.ఎం., మొక్కజొన్నకు 500 ఎం.ఎం. నీరు అవసరమవుతుంది. వ్యవసాయ శాఖలు రైతులను చైతన్య పరచి జొన్న, సజ్జ, రాగి వంటి పంటలను సూచించాలి. స్మాల్‌ మిల్లెట్స్‌ అయిన కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, ఒరిగెలు వంటి పౌష్టిక విలువలు కలిగిన ఈ పంటల సాగును తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖలు విస్తృతంగా ప్రోత్సహించాలి.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రాప్‌ కాలనీలలో ఆయా ప్రాంతాన్ని, నేల స్వభావాన్ని బట్టి కొన్ని రకాల పంటలను ప్రోత్సహించి, దగ్గర్లోనే ప్రాసెసింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది. పంటల కాలనీలలో చిరుధాన్య పంటలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. సి–3 పంటలు 1. వరి, గోధుమ, పత్తి, పొద్దుతిరుగుడు..2. చల్లని వాతావరణం (20–25 డిగ్రీల సెల్షియస్‌) అనుకూలం. 3. భూమ్మీద మొక్కల్లో 95% వరకు సి–3 రకం మొక్కలుంటాయి4. అధిక ఉష్ణోగ్రతను, కరువును తట్టుకునే సామర్థ్యం తక్కువ5. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు వల్ల భూతాపం పెరిగేకొద్దీ దిగుబడి తగ్గుతుంది∙6. పంట కాలం ఎక్కువ.. 100–140 రోజులు7. సాగు నీరు బాగా అవసరం. బెట్ట పరిస్థితులను ఎక్కువ కాలం తట్టుకోలేవు8. వరికి 1,250 ఎం.ఎం., చెరకుకు 2,100 ఎం.ఎం., పత్తికి 600 ఎం.ఎం. వర్ష΄ాతం కావాలి 9. సారవంతమైన, నీటి వసతి ఉండే భూములు అనుకూలం10. వాతావరణంలో భూతాపం పెరుగుతున్నకొద్దీ ఈ పంటల్లో ΄ోషకాలు, ఖనిజ లవణాలు తగ్గుతాయి11. ఎరువుల అవసరం ఎక్కువసి–4 పంటలు1. కొర్ర, అరిక, సామ, అండుకొర్ర, ఊద, జొన్న, సజ్జ, రాగి.2. వేడి వాతావరణ (30–45 డిగ్రీల సెల్షియస్‌) పరిస్థితులను తట్టుకుంటాయి3. భూమ్మీద మొక్కల్లో 5% వరకు సి–4 రకం మొక్కలుంటాయి4. అధిక ఉష్ణోగ్రతను, కరువును తట్టుకునే సామర్థ్యం ఎక్కువ5. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు వల్ల భూతాపం పెరుగుతున్నా దిగుబడి తగ్గదు∙6. పంట కాలం తక్కువ.. 60–95 రోజులు (అరికలు 180 రోజులు)7. సాగు నీటి అవసరం బాగా తక్కువ. నీటి కొరతను ఎక్కువ కాలం తట్టుకోగలవు8. మొక్కజొన్నకు 500 ఎం.ఎం, జొన్నకు 400 ఎం.ఎం., రాగి, సజ్జలకు 350 ఎం.ఎం. చాలు. కొర్ర, సామ, అరిక, ఊద, అండుకొర్రలకు ఇంకా తక్కువ వర్షపాతం చాలు.9. తేలిక భూములు, భూసారం తక్కువగా ఉండే మెట్ట భూములు అనుకూలం10. పౌష్టిక విలువలు ఎక్కువ. పిండి పదార్థంతోపాటు అధిక పీచు, నాణ్యమైన మాంసకృత్తులు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉన్న సిరిధాన్యాలివి 11. ఎరువుల అవసరం లేదు/తక్కువ జీఎస్టీ ఎత్తివేయాలిపర్యావరణానికి హాని కలిగించే వరి, గోధుమ వంటి పంటలకు సబ్సిడీలు ఇస్తున్న ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు దోహదపడే చిరుధాన్యాలపై మాత్రం ప్రభుత్వం జీఎస్టీ విధిస్తుండటం సమంజసం కాదు. జీఎస్టీ రద్దు చేయాలి. చిరుధాన్యాలను ప్రభుత్వాలు మద్దతు ధరకు సేకరించి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సబ్సిడీ ధరకు అందివ్వాలి. సి4 రకం పంటలైన సిరిధాన్యాలతోనే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ, ఆహార, ఆరోగ్య భద్రత చేకూరుతుందని అందరూ గ్రహించాలి.– డాక్టర్‌ ఖాదర్‌ వలి, ప్రముఖ ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత --పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌(చదవండి: పంట పొలాల్లో డ్రోన్‌..! ఇక నుంచి ఆ పనుల్లో మహిళలు..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement