Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India Scraps 6 percent Google Tax Amid Tariff Threats from Donald Trump1
ట్రంప్‌ ఎఫెక్ట్‌.. కేంద్రం ‘గూగుల్‌ ట్యాక్స్‌’ రద్దు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ నిర్ణయాల వల్ల చాలా దేశాలు తమ విధానాలను సమీక్షించుకోవాల్సి వస్తుంది. భారతదేశం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. టారిఫ్ బెదిరింపులు చాలా దేశాలు అమలు చేస్తున్న విధానాల్లో మార్పులకు దారితీస్తున్నాయి. అందులో భాగంగా భారత్‌ తాజాగా 6 శాతం ‘గూగుల్ ట్యాక్స్’ను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు నేషనల్‌ మీడియాలో వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి.గూగుల్, మెటా.. వంటి విదేశీ టెక్ కంపెనీలు అందించే ఆన్‌లైన్‌ అడ్వర్టైజింగ్ సేవలపై ‘గూగుల్ ట్యాక్స్’ అని పిలువబడే 6 శాతం ఈక్వలైజేషన్ లెవీని భారతదేశం తొలగించే అవకాశం ఉంది. ఫైనాన్స్ బిల్లులో సవరణల నేపథ్యంలో 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ పన్నును రద్దు చేయనున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. 2016లో ప్రవేశపెట్టిన ఈ లెవీ భారత మార్కెట్‌కు గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించే సాధనంగా ఉండేది. విదేశీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ఉనికి భారత్‌లో భౌతికంగా లేకపోయినా కేంద్ర ఖజానాకు తమ వాటాను అందించేలా ప్రత్యేకంగా ఈ లెవీని రూపొందించినట్లు సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ పార్టనర్ తుషార్ కుమార్ తెలిపారు. ఆదాయపు పన్నుకు లోబడి ఉన్న దేశీయ సంస్థలు, సంప్రదాయ అంతర్జాతీయ పన్ను నిబంధనలకు లోబడి ఉన్న విదేశీ సాంకేతిక సంస్థల కార్యకలాపాలను సమతుల్యం చేయడమే ఈ లెవీ ప్రాథమిక లక్ష్యమని వివరించారు.గూగుల్ ట్యాక్స్‌ను కేంద్రం ఎందుకు తొలగిస్తుంది?ఈ లెవీ తొలగింపు భారతదేశం డిజిటల్ పన్నుల చట్రంలో మార్పును సూచిస్తుంది. గూగుల్, మెటా వంటి అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలపై పన్ను వివక్షాపూరితంగా ఉందని నిరంతరం అభ్యంతరం వ్యక్తం చేసిన యూఎస్‌తో వాణిజ్య ఘర్షణలను తగ్గించడానికి ఇది వ్యూహాత్మక చర్యగా పరిగణిస్తుందని కుమార్ అన్నారు. గతంలో ఈ లెవీ విదేశీ డిజిటల్ కంపెనీలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపిందనే వాదనలున్నాయి. భారతీయ వ్యాపారాలకు అందించే ఆన్‌లైన్‌ అడ్వర్టైజింగ్ సేవల ద్వారా వచ్చే ఆదాయంపై 6 శాతం పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. పర్యవసానంగా, ఈ ఖర్చుల భారం ప్రకటనదారులపైనే పడేది. తద్వారా భారతీయ సంస్థలకు డిజిటల్ మార్కెటింగ్ ఖర్చులు పెరిగాయని కుమార్‌ అన్నారు.ఇదీ చదవండి: రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..టెక్ దిగ్గజాలకు ప్రయోజనం చేకూరుతుందా?ఈక్వలైజేషన్ లెవీ రద్దుతో విదేశీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లపై పన్ను భారం తగ్గుతుంది. తద్వారా మరింత అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించవచ్చు. గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ అడ్వర్టైజింగ్ సేవలను పొందే భారతీయ వ్యాపారాలపై మార్కెటింగ్ ఖర్చుల భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మరింత డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది.

Perni Nani Slams Lavu Sri Krishna Devarayalu2
మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు.. లావుకు పేర్ని స్ట్రాంగ్‌ కౌంటర్‌

సాక్షి,గుంటూరు: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరని మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు మెప్పు కోసం ఎంపీ లావు లోక్‌సభలో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్నినాని మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరు. పార్లమెంటును అడ్డు పెట్టుకుని కక్షసాధింపు రాజకీయాలు చేయటం మానుకోవాలి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా లిక్కర్ స్కాం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు లిక్కర్ షాపులను చెరపట్టారు. ప్రతిచోటా బెదిరించి కమీషన్లు, లంచాలు తీసుకుంటున్నారు. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వీటిపై పార్లమెంటులో మాట్లాడాలివైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వేలకోట్లు దేశం దాటి వెళ్లినట్టు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపణలు చేశారు. అప్పుడు ఆయన మా పార్టీలోనే ఉన్నారు కదా? మరెందుకు మాట్లాడలేదు?.లావు శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లెమింగో పక్షిలాంటివాడు.టీడీపీ గూటిలో చేరి చంద్రబాబు మాటలను చిలక పలుకులుగా మాట్లాడుతున్నారు. పల్నాడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని శ్రీకృష్ణ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడితే ఉపయోగ పడుతుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను ఆపటానికి, పోలవరానికి నిధులు తేవటానికి తన అధికారాన్ని వాడుకుంటే మంచిది. రాయలసీమ లిఫ్టు ఎత్తిపోతల పథకం కోసం వాడితే మంచిది.దక్షినాది రాష్ట్రాల్లో తగ్గబోతున్న సీట్ల గురించి మాట్లాడాలి.కనీసం పల్నాడులో నీటి ఎద్దడి గురించి కూడా మాట్లాడటం లేదు.కేవలం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవటమే లావు శ్రీకృష్ణ దేవరాయలు పనిగా పెట్టుకున్నారు.ఇప్పుడు లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని టీడీపీ నేతలే చెరబట్టారు.కమీషన్లు, వాటాల కోసం వ్యాపారుల గొంతు మీద కత్తి పెట్టారు.చంద్రబాబు, లోకేష్ తో సహా అందరూ దోపిడీ చేస్తున్నారు. ఇదికదా అసలైన లిక్కర్ స్కాం అంటే? ఇవేమీ కనపడటం లేదా శ్రీకృష్ణ దేవరాయలూ? అవినీతి, అక్రమాలు చేసిన చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది.దానిపై ఐటీ శాఖ పూర్తి విచారణ ఎందుకు చేయటంలేదో శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నించాలి.పాపపు సొమ్ము చంద్రబాబుకి చేరిందని ఈడీ చెప్పింది.దానిపై శిక్షలు వేయమని శ్రీకృష్ణ దేవరాయలు గట్టిగా అడగాలి.స్కిల్ స్కాం విచారణ మొదలవగానే చంద్రబాబు పిఏ శ్రీనివాస్ దుబాయ్ ఎందుకు పారిపోయాడో ప్రశ్నించాలి. శ్రీనివాస్ పదేపదే దుబాయ్ ఎందుకు వెళ్తున్నాడో? ఆయన వెనుకే లోకేష్ ఎందుకు వెళ్తున్నాడో ప్రశ్నించాలి.బేవరేజ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో తప్పుడు వాంగ్మూలం తీసుకుని వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టు చేయాలని చూస్తున్నారు.ఏదోలా వైఎస్‌ జగన్ మీద అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదని’ స్పష్టం చేశారు.

Couldn't Digest That And Shubman is Bowlers Captain: Siraj3
అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్‌కు అంతా తెలుసు: సిరాజ్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)-2025లో కొత్త ఫ్రాంఛైజీ తరఫున ఆడబోతున్నాడు టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌. దాదాపు ఏడేళ్ల పాటు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)కి ఆడిన ఈ హైదరాబాదీని.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. ఈ క్రమంలో రూ. 12.25 కోట్లకు గుజరాత్‌ టైటాన్స్‌ సిరాజ్‌ను కొనుగోలు చేసింది.బౌలర్ల కెప్టెన్‌ఇక ఐపీఎల్‌-2025లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా గుజరాత్‌ మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ‘బోరియా సీజన్‌ సిక్స్‌’తో ముచ్చటించిన సిరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) బౌలర్ల కెప్టెన్‌. గొప్ప సారథి.బౌలర్లు ఏది అడిగినా.. కాదనడు. వాళ్లకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాడు. స్వేచ్ఛనిస్తాడు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. నేను, రిషభ్‌ పంత్‌, శుబ్‌మన్‌, అక్షర్‌ పటేల్‌.. కలిసి తరచుగా డిన్నర్లకు వెళ్తూ ఉంటాం. గిల్‌, నేను ఒకేసారి టెస్టుల్లో అడుగుపెట్టాము. అందుకే మా బంధం ఇంతగా బలపడి ఉంటుంది’’ అని గిల్‌తో తనకున్న స్నేహం గురించి చెప్పుకొచ్చాడు.ఆయనొక లెజెండ్‌ఇక గుజరాత్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయనొక లెజెండ్‌. నెహ్రా భాయ్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ఎలా ఉండాలో ఆయనను చూసే తెలుసుకున్నా. గతంలో షమీ భాయ్‌ ఈ ఫ్రాంఛైజీకి ఆడాడు.నేను కూడా తనలా అద్భుతంగా ఆడి వికెట్లు తీయడం మీద మాత్రమే దృష్టి పెట్టాను. జట్టు విజయాల కోసం నా శాయశక్తులా కృషి చేస్తా’’ అని సిరాజ్‌ పేర్కొన్నాడు. ఇక ఈ సందర్భంగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025 జట్టులో చోటు దక్కకపోవడం గురించి ప్రస్తావన రాగా.. ఈ హైదరాబాదీ పేసర్‌ హుందాగా స్పందించాడు.అస్సలు జీర్ణించుకోలేకపోయా.. ‘‘జట్టు గురించి ప్రకటన రాగానే తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఐసీసీ ఈవెంట్‌ ఆడే జట్టులో నాకు చోటు లేదే అని బాధపడ్డాను. అయితే, జట్టు ప్రయోజనాల గురించే రోహిత్‌ భాయ్‌ ఆలోచిస్తాడని నాకు తెలుసు.దుబాయ్‌లో పేసర్లకు పెద్దగా పని ఉండదని భాయ్‌కు తెలుసు. ఆయన ఎంతో అనుభవజ్ఞుడైన కెప్టెన్‌. అక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని ఆయనకు తెలుసు. అందుకే నన్ను పక్కనపెట్టాలని వాళ్లు నిర్ణయించుకున్నారు’’ అని సిరాజ్‌ పేర్కొన్నాడు.విశ్రాంతి దొరికిందిఏదేమైనా దేశం కోసం ఆడేటప్పుడు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందని.. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్‌ కోరుకుంటాడని సిరాజ్‌ అన్నాడు. ఇక చాంపియన్స్‌ట్రోఫీ జట్టులో లేనందు వల్ల తనకు చాలాకాలం పాటు విశ్రాంతి లభించిందని.. ఆ సమయాన్ని ఫిట్‌నెస్‌ మెరుగుపరచుకునేందుకు ఉపయోగించుకున్నానని తెలిపాడు.కాగా పాకిస్తాన్‌ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడింది. ఇక ఈ మెగా వన్డే టోర్నమెంట్లో గ్రూప్‌ దశలో బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌లను ఓడించిన రోహిత్‌ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది.ఇక సిరాజ్‌ చివరగా ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌ ఆడాడు. తదుపరి జూన్‌లో ఇంగ్లండ్‌ టూర్‌కు వెళ్లే జట్టుకు అతడు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక మళ్లీ పరిమిత ఓవర్ల జట్టులో తిరిగి స్థానం సంపాదించాలంటే సిరాజ్‌ మియా.. ఐపీఎల్‌-2025లో సత్తా చాటాల్సి ఉంటుంది.చదవండి: ‘గిల్‌ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం’

Sanjith Konda's Success Story: Tea Tycoon In Australia, Once A Dropout4
క్యాంటీన్‌లో గిన్నెలు కడిగాడు : ఇపుడు బిజినెస్‌ టైకూన్‌లా కోట్లు

జీవితంలోని నిరాశ నిస్పృహలు ఎప్పటికీ అలాగే ఉండిపోవు. శోధించి, సాధించాలేగానీ సక్సెస్‌ మన పాదాక్రాంతమవుతుంది. దీనికి కావాల్సిందలా పట్టుదల, శ్రమ, ఓపిక. జీవితంలోని వైఫల్యాల్ని, కష్టాలనే ఒక్కో మెట్టుగా మలుచుకోవడం తెలియాలి. అంతేగానీ నాకే ఎందుకు ఇలా మానసికంగా కృంగిపోకూడదు. కాలేజీ క్యాంటీన్‌లో క్యాంటీన్‌లో గిన్నెలు కడగడం నుండి పెట్రోల్ పంపులో పని చేయడం వరకు. సంజిత్ కష్ట సమయాలను అధిగమించాడు. 40 మంది ఉద్యోగులతో కోట్లకు పడగలెత్తిన కాలేజీ డ్రాపవుట్ గురించి తెలిస్తే.. మీరు కూడా ఫిదా అవుతారు. బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా సక్సెస్‌ స్టోరీ తెలుసుకుందాం రండి.బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా (Sanjith Konda) మెల్‌బోర్న్‌లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలోని బుండూరా క్యాంపస్‌లో తన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్‌ను అభ్యసించడానికి ఆస్ట్రేలియాకు వెళ్లాడు జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలనే కలని సాకారం చేసుకునేందుకు ఇదో అవకాశంగా భావించాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కిక్‌ ఏముంది అన్నట్టు కష్టాలు మొదలయ్యాయి. విశ్వవిద్యాలయ క్యాంటీన్‌లో పాత్రలు శుభ్రం చేశాడు. గ్యాస్ స్టేషన్లలో రాత్రి ఉద్యోగాలు చేశాడు. సెలవు రోజుల్లో గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ వారానికి రూ. 33 వేలు సంపాదించేవాడు. విద్యార్థుల మండలి ఎన్నిక కావడంతో అతని జీవితం మరో మలుపుకు నాంది పలికింది.2019లొ సంజిత్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. దీనికి గాను అతనికి రూ. 1.1 లక్షల స్టైఫండ్ వచ్చేది. ఈ సమయంలోనే విద్యార్థి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఈవెంట్స్‌ ఉత్సవాలను నిర్వహించాడు. ఐదో సెమిస్టర్‌లో కళాశాల చదువు మానేసి సొంత వ్యాపారాన్ని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. ఆస్ట్రేలియన్లు టీ, కాఫీలను ఇష్టంగా తాగుతారని గమనించాడు. పైగా తనకు చిన్నప్పటినుంచీ టీ అంటే ఇష్టం. ఈ క్రేజ్‌నే బిజినెస్‌గా మల్చుకున్నాడు. దీనికి మెల్‌బోర్న్‌లోని తన స్నేహితుడు అసర్ అహ్మద్ సయ్యద్‌తో చర్చించాడు. ఆరో సెమిస్టర్‌లో కాలేజీ నుంచి తప్పుకున్నాడు. ఎలిజబెత్ స్ట్రీట్‌లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించాడు. 'డ్రాపౌట్ చాయ్‌వాలా' గా సంజిత్‌ జర్నీ మొదలైంది. ప్రీతం అకు, అరుణ్ పి. సింగ్ అనే ఇద్దరు కళాశాల సీనియర్‌లను నియమించుకున్నాడు. అలా సంజిత్‌తో సహా కేవలం ఐదుగురు వ్యక్తులతో మరియు ఐదు రకాల చాయ్‌లతో ప్రారంభమైంది. మొదటి మూడు నెలలు అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. ఆ తరువాత ఉద్యోగులు, విద్యార్థులు ఆదరణతో బాగా పుంజుకుంది. ఒక్క ఏడాదిలోనే సంవత్సరంలోనే, చాయ్ ట్రక్‌తో సహా మరో రెండు ప్రదేశాల్లో తన షాపును ఓపెన్‌ చేశాడు. రకరకాల ప్లేవర్లను పరిచయం చేస్తూ ‘డ్రాపవుట్‌ చాయ్‌వాలా’ బాగా పాపులర్‌ అయ్యాడు. 40 మంది కార్మికులతో రూ. 5.57 కోట్లు టర్నోవర్‌ సాధించే స్థాయికి ఎదిగింది. ఫ్యూజన్‌ గ్రీన్‌ టీ, చాయ్‌పుచినో లాంటివాటితోపాటు, టోస్ట్, కుకీలు, బన్ మస్కా, బన్ మసాలా , వివిధ రకాల పేస్ట్రీలతో సహా తేలికపాటి స్నాక్స్‌ను కూడా అందిస్తుంది.సంజిత్ తండ్రి ఒక మెకానికల్ ఇంజనీర్, అతను సౌదీ అరేబియా చమురు వ్యాపారంలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. సంజిత్ తల్లి గృహిణి. ఆమెకు ఇంటి పనుల్లో సాయ పడటం, తల్లి పాస్‌బుక్‌ను అప్‌డేట్‌కోసం బ్యాంకుకు వెళ్లడం, ఇంధన బిల్లు చెల్లించడం, ఇంటి అద్దె వసూలు లాంటి పనులతో అండగా నిలిచిన కొడుకు సక్సెస్‌తో సంజిత్‌ తల్లి చాలా సంతోషంగా ఉంది. View this post on Instagram A post shared by Dropout Chaiwala (@dropout_chaiwala)మూడేళ్ల సంబరం : డ్రాపౌట్ చాయ్‌వాలా ఇటీవల ముచ్చటగా మూడేళ్ల పండుగను పూర్తి చేసుకుంది. ఈ విజయం వెనుక అద్భుతమైన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ బృందం ,సహోద్యోగులు ఉన్నారంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సంజిత్‌.మీ అభిరుచి, కృషి, పట్టుదల, నమ్మకమే ఒక బ్రాండ్‌కు మించి ఎదిగిన కుటుంబం మనది అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు.

Visakha Delivery Boy Anil Exclusive Interview For Sakshi5
‘సార్ అని పిలవాలంటూ మెట్లపై పరుగెత్తించి దాడి చేశాడు’

విశాఖ: మూడు రోజుల క్రితం అనిల్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ పై ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. నగరంలోని ఆక్సిజన్ టవర్ లో డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన అనిల్ అనే యువకుడిపై ప్రసాద్ అనే వ్యక్తి దారుణంగా దాడి చేశాడు. అయితే ఈ అవమానం భరించలేక అనిల్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కథనాలు రావడంతో డెలివరీ బాయ్స్ సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఆ యువకుడి అండగా నిలబడింది. ప్రస్తుతం క్షేమంగా ఉన్న ఆ యువకుడు ‘సాక్షి’ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించాడు.‘ అన్నా అనీ పిలిచినందుకు ప్రసాద్ అనే వ్యక్తి నాపై దాడి చేశాడు. సార్ అని పిలవాలి అంటూ విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. డ్యూటీలో జాయిన్ మొదట రోజు మొదటి ఆర్డర్ ఆక్సిజన్ టవర్ లో వచ్చింది. నాకు అడ్రస్ తెలియక వెతుక్కొని వెళ్లాను. ఆక్సిజన్ టవర్ లో ఉన్న 29 ఫ్లోర్ కి వెళ్లి ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ ఒక యువతి తీసుకున్నారు. లిఫ్ట్ వద్దకి వచ్చి ప్రసాద్ అనే వ్యక్తి నా పై దాడికి యత్నించిన్నారులిఫ్ట్ వద్దకి వచ్చిన ప్రసాద్.. మెట్లపై పరుగెత్తించి దాడి చేశాడు. నా బట్టలు విప్పించి కర్రతో కొట్టారు. నాతో బలవంతంగా రెండు లేటర్లు రాయించారు. నా తప్పు ఉంది అని చెప్పి లెటర్ రాయించారు. నాకు తగిన న్యాయం కావాలి. ప్రసాద్ నన్ను ఎవరు ఎం చెయ్యలేరు అని చెప్పి దాడి చేశారు’ అని పేర్కొన్నాడు బాధితుడు అనిల్‌ నిందితుడికి ఏప్రిల్ 7 వరకూ రిమాండ్‌ఈ దాడిలో నిందితుడిగా ఉన్న ప్రసాద్ కు రిమాండ్ విధించారు. ఏప్రిల్ 7 వ తేదీ వరకూ రిమాండ్ విధించింది కోర్టు. దాంతో నిందితుడు ప్రసాద్ ను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.

Supreme Court Telangana BRS MLAs Defection Case March 25th Updates6
అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదు: సుప్రీం కోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో మంగళవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించారని.. ఆ 10 మందిపై అనర్హత వేటు విషయంలో తెలంగాణ స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, కాబట్టి అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌(BRS) తరఫున ఈ జనవరిలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు వింటోంది. మంగళవారం వాదనలు మొదలవ్వగానే.. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ సంగతిని స్పీకర్‌ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహత్గీ వాదనలు ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో స్పీకర్‌ను ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉంటుందా? లేదంటే రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? అని కోరారు. బీఆర్‌ఎస్‌ తరఫున న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫిర్యాదులపై ఏం చేస్తారో.. 4 వారాల్లో షెడ్యూల్‌ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా పార్టీ మారిన వారికి స్పీకర్‌ నోటీసులు ఇవ్వలేదు. ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసు ఇచ్చారు. 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని.. ఫిబ్రవరి 13న స్పీకర్‌ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికి 3 వారాలైంది.. నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదు. మేము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్‌ షెడ్యూల్‌ కూడా చేయలేదు’’ అని సుందరం వాదించారు. బీఆర్‌ఎస్‌ వాదనలు.. కీ పాయింట్స్‌ 2024 మార్చి 18న మొదట ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్‌ ఫిర్యాదు చేశాంమొదటి ఫిర్యాదు చేసినా నోటీసులు ఇవ్వలేదుహైకోర్టుకు వెళ్లేంత వరకు కూడా నోటీసులు ఇవ్వలేదురీజనబుల్‌ టైంలోనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ చెప్పిందిహైకోర్టు చెప్పినా ఎలాంటి చర్యలు లేవుదానం నాగేందర్‌పై ఫిర్యాదు చేసినా.. ఆయనకు నోటీసులు ఇవ్వలేదుదానం ఎంపీగా పోటీ చేసినా చర్యల్లేవ్‌కడియంకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా.. చర్యలు లేవ్‌అనర్హత పిటిషన్‌ విచారణపై షెడ్యూల్ చేయాలని.. హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది‌స్పీకర్‌ 7 రోజుల సమయం ఇస్తూ నోటీసులు ఇచ్చారుముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేరకంగా సమాధానం ఇచ్చారుపార్టీ మారినవాళ్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేశారుముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ప్రచారం చేశారునోటీసులు ఇచ్చామని స్పీకర్‌ అంటున్నారు.. కానీ, ఆ కాపీలు మాకు అందజేయలేదుస్పీకర్‌ అధికారాలు సైతం న్యాయసమీక్ష పరిధిలోనే ఉంటాయిన్యాయ సమీక్షకు స్పీకర్‌‌ అతీతులు కాదుఫిరాయింపులపై స్పీకర్‌ నిర్ణయంపై నిర్దిష్టమైన గడువు విధించాలినాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలిఈక్రమంలో స్పందించిన జస్టిస్‌ గవాయ్‌.. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా? అని వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులు ఉన్నప్పటికీ.. ఎప్పటిలోగా తేల్చాలనే విషయంపైనే స్పష్టత కొరవడిందని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు ఆ తీర్పును కాదని ఎలా ముందుకు వెళ్లగలమని చెప్పింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించింది.ధర్మాసనం ఇంకా ఏమందంటే..ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది?: ధర్మాసనంఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించొద్దుఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు వచ్చి ఎంతకాలమైంది?రీజనబుల్‌ టైం అంటే గడువు ముగిసేవరకా?మొదటి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత టైం గడిచింది.నాలుగు వారాలైనా షెడ్యూల్‌ ఫిక్స్‌ చేయలేదా?అదృష్టవశాత్తూ.. ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదుమూడు వారాల సమయం విషయంలో మాత్రం స్పీకర్‌ రీజనబుల్‌గా ఉన్నారుతెలంగాణ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ జడ్జి ఇచ్చిన తీర్పులో డివిజన్‌ బెంచ్‌ జోక్యం సరైందో కాదో చూస్తాం?కౌంటర్‌ దాఖలుకు ప్రతివాదులు మరింత సమయం కోరగా.. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలి బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ బీఆర్‌ఎస్‌ తరఫున వాదనలు ముగియడంతో తదుపరి విచారణను ఏప్రిల్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు స్పీకర్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. మరోవైపు.. స్పీకర్‌ తరఫున సోమవారం(మార్చి 24వ తేదీన) అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్‌లో.. ‘‘రీజనబుల్ టైం అంటే గరిష్టంగా మూడు నెలలే అని అర్థం కాదు. ఒక్కో కేసు విచారణకు ఒక్కో రకమైన సమయం అవసరం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. కానీ, స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టుకు వెళ్లారు. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే.. న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. .. అనర్హత పిటిషన్ లను విచారించి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం స్పీకర్ కే ఉంది. గత సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే....పిటీషనర్లే దురుద్దేశపూర్వకంగా కోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపులపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం లేదన్నది సరికాదని.. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని.. కాబట్టి ఈ పిటిషన్లను డిస్మిస్‌ చేయాలి’’ అని కోరారు. 👉కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party) జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లపై స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (SLP) దాఖలు అయ్యింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరికెపూడి గాంధీలపై రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది సుప్రీం కోర్టు(Supreme Court). కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతర బీఆర్‌ఎస్‌ నేతలు ఈ పిటిషన్లు వేశారు. అయితే.. 👉ఈ పిటిషన్లకు సంబంధించి.. కొద్దిరోజుల క్రితం మహిపాల్‌రెడ్డి, తాజాగా బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి సుప్రీం కోర్టులో అఫిడవిట్‌లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సీఎంను కలిశామని తెలిపారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్‌కు తాము రాజీనామా చేయ‌లేదని.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేర‌లేదని.. మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌లో నిజం లేదని.. కాబట్టి ఈ అన‌ర్హ‌త పిటీష‌న్ల‌కు విచార‌ణ అర్హ‌త లేదని వాటిల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తో ఉన్న ఫొటోలు, పోస్ట‌ర్ల‌ను, తమ ఫొటోలతో కూడిన పార్టీ ఫ్లెక్సీల ఫొటోలనూ అఫిడ‌విట్‌లో జ‌త చేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యా‍యస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. గతంలో తెలంగాణ స్పీకర్​పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తగినంత సమయం అంటే ఎంతో చెప్పాలని కోరింది. గత విచారణలో.. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదన్న పేర్కొంది.

Tollywood actor  Aadarsh Balakrishna Undergone for Surgery7
హ్యాపీ డేస్ నటుడికి సర్జరీ.. ఐపీఎల్ మ్యాచ్‌ చూస్తూ ప్రాక్టీస్!

టాలీవుడ్‌లో సపోర్టింగ్‌ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆదర్శ్ బాలకృష్ణ. తెలుగులో బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌ కూడా పాల్గొన్నారు. టాలీవుడ్‌లో పలు సినిమాల్లో తనదైన నటనతో ఆదర్శ్‌ బాలకృష్ణ అభిమానులను మెప్పించారు. గతంలో ఝాన్సీ వెబ్ సిరీస్‌తో అభిమానులను మెప్పించిన ఆదర్శ్.. ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఆయనతో దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.‍అయితే తాజాగా ఆదర్శ్ బాలకృష్ణ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సర్జరీ తొలి రోజు చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేసిన వీడియోను పంచుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ మొదటి రోజు చిన్నచిన్న కసరత్తులు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తానని పోస్ట్ చేశారు. అయితే ఇంతకీ ఆదర్శ్ బాలకృష్ణకు అసలేం జరిగిందో తెలియాల్సి ఉంది. మోకాలికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారా? లేదంటే మరేదైనా కారణాలున్నాయా? అనే వివరాలపై క్లారిటీ లేదు.సినీ కెరీర్‌ విషయానికొస్తే హ్యాపీ డేస్‌ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత టాలీవుడ్ పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో మెప్పించారు. గత రెండేళ్లలో రంగమార్తాండ, శాకుంతలం, మిక్సప్‌ సినిమాలలో అభిమానులను అలరించారు.

Who is Vipraj Nigam? UP all-rounder new star for Delhi Capitals8
అశుతోష్ కాదు.. అత‌డు కూడా హీరోనే! ఎవ‌రీ విప్రాజ్ నిగ‌మ్‌?

ఐపీఎల్‌-2025లో సోమ‌వారం వైజాగ్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన‌ ఉత్కంఠ భరిత పోరు అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టింది. ఆఖ‌రి వ‌ర‌కు నువ్వానేనా అన్న‌ట్లు సాగిన ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క వికెట్ తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో ఢిల్లీ ఆట‌గాడు అశుతోష్ శ‌ర్మ‌ది కీల‌క పాత్రం. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బరిలోకి దిగిన అశుతోష్ త‌న ఫైటింగ్ నాక్‌తో ఢిల్లీకి సంచ‌ల‌న విజ‌యాన్ని అందించాడు.ఓట‌మి త‌ప్ప‌ద‌నుకున్న చోటు అశుతోష్ శర్మ అజేయ ఇన్నింగ్స్‌తో అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. అశుతోష్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 66 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఢిల్లీ ఈ సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంలో అశుతోష్ పాత్ర ఎంత కీలకమైందో మ‌రో ఆట‌గాడు విప్రాజ్‌ నిగ‌మ్‌ పాత్ర కూడా అంతే వెల కట్టలేనిది. ఢిల్లీ విజ‌యానికి 45 బంతుల్లో 97 ప‌రుగులు కావాల్సిన స‌మ‌యంలో విప్ర‌జ్ క్రీజులోకి వ‌చ్చాడు. అప్ప‌టివ‌ర‌కు దూకుడుగా ఆడుతున్న ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ ఔట్ కావ‌డంతో ఢిల్లీ ఓట‌మి లాంఛ‌న‌మే అంతా అనుకున్నారు. కానీ క్రీజులోకి వ‌చ్చిన వ‌చ్చిన విప్రాజ్‌త‌న దూకుడైన బ్యాటింగ్‌తో గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఐపీఎల్‍లో తొలి మ్యాచ్‍ ఆడుతున్నాన్న భ‌యం కానీ బెరుకు కానీ అత‌డిలో క‌న్పించ‌లేదు. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను విప్రాజ్ ఊచ‌కోత కోశాడు. విప్రాజ్ కేవ‌లం 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 పరుగులు చేశాడు. విప్రాజ్ బౌలింగ్‍లోనూ ఓ కీల‌క‌ వికెట్ పడగొట్టాడు. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌లోనూ స‌త్తాచాటాడు. ఈ క్ర‌మంలో ఎవ‌రీ విప్రాజ్ నిగ‌మ్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవ‌రీ విప్రాజ్ నిగ‌మ్‌?20 ఏళ్ల విప్రాజ్ నిగ‌మ్‌.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. గ‌తేడాది రంజీ సీజన్‌తో అత‌డు ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. విప్ర‌జ్ బ్యాటింగ్‌లో కంటే బౌలింగ్‌లో ఎక్కువ‌గా అద్భుతాలు చేశాడు. 3 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లో 13 వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తాచాటాడు. సయ్యద్ ముష్తాక్ అలీ 2024-25 ట్రోఫీలోనూ విప్రాజ్ నిగ‌మ్ అద‌ర‌గొట్టాడు. ఈ టోర్నీలో అత‌డు ఏడు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఎనిమిది బంతుల్లో 27 పరుగులు ప‌రుగులు చేసి యూపీకి సంచ‌ల‌న విజ‌యాన్ని అందించాడు.దీంతో ఒక్క‌సారిగా అత‌డు వెలుగులోకి వ‌చ్చాడు. యూపీటీ20 2024 సీజన్‍లో కూడా విప్రాజ్ దుమ్ములేపాడు. ఈ టోర్నీలో యూపీ ఫాల్కన్స్ తరఫున 12 మ్యాచ్‍లు ఆడిన ఈ స్పిన్నర్ 20 వికెట్లు పడగొట్టాడు. ఈ క్ర‌మంలో ఐపీఎల్ 2025 వేలంలో విప్రాజ్ నిగమ్‍ను రూ.50లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ ఆరంభానికి ముందు జ‌రిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ గేమ్‌లో నిగ‌మ్ త‌న బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్ర‌ద‌ర్శించాడు. 29 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఢిల్లీకి మంచి ఆల్‌రౌండ‌ర్ దొరికిన‌ట్లే.ఐపీఎల్‌-2025: ల‌క్నో వ‌ర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉ల‌క్నో- 209/8 (20)👉ఢిల్లీ- 211/9 (16.2)👉ఫలితం- ఒక్క వికెట్ తేడాతో ల‌క్నోపై ఢిల్లీ గెలుపుచ‌ద‌వండి: అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్‌కు అంతా తెలుసు: సిరాజ్‌

7 Minute Workout Can Keep Your total body Fit Hit Hit Hurray9
ఏడు నిమిషాల్లో బాడీ ఫిట్‌ : హిట్‌ హిట్‌ హుర్రే!

ప్రపంచం వేగంగా మారుతోంది. అలా వేగం పెరుగుతున్న కొద్దీ మన శారీరక కదలికలు తగ్గిపోతున్నాయి. మరోవైపు ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామానికి సమయం లేదనడమూ సర్వసాధారణంగా మారింది. అయితే నిజానికి మానవ శరీరం చురుకుగా కదులుతూ ఉండేందుకు అనువుగా రూపొందింది. సమయం లేదంటూ దానిని కదిలించ కపోతే శారీరక సమస్యలతో పాటు ఆరోగ్యానికి చేటు తప్పదు. ఈ నేపథ్యంలో గంటల తరబడి చేయడానికి బదులు కేవలం నిమిషాల్లో ముగించేందుకు వీలుగా కొత్త కొత్త వ్యాయామాలు పుట్టుకొస్తున్నాయి. అలా అందుబాటులోకి వచ్చిందేఈ హిట్‌ పద్ధతి. – సాక్షి, సిటీబ్యూరో అమెరికాకు చెందిన వ్యాయామ మనస్తత్వవేత్త క్రిస్‌ జోర్డాన్‌ ఈ హిట్‌ అనే వ్యాయామ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కదలికలు కురవైన శరీరం తెచ్చిపెట్టే సమస్యలకు.. కేవలం 7 నిమిషాల్లో పరిష్కరించగలదని ఆయన చెబుతున్నారు. సొంత శరీర బరువును ఉపయోగించి సుపరిచితమైన కాలిస్టెనిక్‌ వ్యాయామాలను చేయడమే హై ఇన్‌టెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌ (హెచ్‌ఐఐటీ) ఈ హిట్‌ ఫార్ములా. ప్రతి రౌండ్‌కూ మధ్య ఐదు సెకన్ల విశ్రాంతి తీసుకుంటూ చేసే హై ఇన్‌టెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌ (హెచ్‌ఐఐటీ)గా దీనిని పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి వ్యాయామం 30 సెకన్ల పాటు చేయాలి. ఒక భంగిమ నుంచి మరో భంగిమకు మారేటప్పుడు మధ్యన 5 సెకన్ల చొప్పున గ్యాప్‌ ఉండాలి. పుష్‌–అప్స్‌: నేలపై లేదా చాపపై ‘ప్లాంక్‌’ పొజిషన్‌న్‌లోకి వెళ్లి చేసే ప్రక్రియ. బరువును పాదాలకు బదులుగా మోకాళ్లపై ఉంచడం ద్వారా దీన్ని సులభతరం చేయవచ్చు. వాల్‌ సిటప్స్‌: గోడ దగ్గర వెనుకభాగంలో నిల్చుని కు‍ర్చీలో కూర్చున్నట్లుగా కూర్చునే భంగిమ. ఓ రకంగా గోడకుర్చీ వేయడం అని చెప్పొచ్చు. అబ్‌ క్రంచ్‌: ప్రాథమిక క్రంచ్‌తో ప్రారంభించి, వెనుకభాగంలో చదునుగా ఉంచి పడుకోవాలి, మోకాళ్లను వంచి పాదాలను నేలపై ఉంచి చేయాలి. స్టెప్‌–అప్‌: దృఢమైన కుర్చీ లేదా బెంచ్‌కు ఎదురుగా నిలబడి, ఎడమ కాలితో ఓ సారి కుడికాలితో మరోసారి ప్రారంభించి చేయాలి. 30 సెకన్ల వ్యవధిలో వీలైనన్ని సార్లు చేయాలి. స్క్వాట్‌: పాదాలను భుజం–వెడల్పు వేరుగా చేసి కాలి వేళ్లను ముందుకు ఉంచి నిలబడాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు బరువులో ఎక్కువ భాగాన్ని మడమల మీద ఉంచాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి. ట్రైసెప్‌ డిప్‌: కుర్చీ లేదా బెంచ్‌ ముందు అంచున కూర్చుని, మన అరచేతులను అంచుపై ఉంచి దీనిని చేయాలి. ప్లాంక్‌: చాపపై బోర్లా పొట్టపై పడుకుని దీన్ని చేయాలి. ఈ భంగిమలో మన మోచేతులు మన వైపు దగ్గరగా, అరచేతులు కిందికి వేళ్లు ముందుకు ఎదురుగా ఉంటాయి.చదవండి: 64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లిహై ‘నీస్‌’: 30 సెకన్ల పాటు ఉన్నచోటే పరుగెత్తడంగా దీన్ని చెప్పొచ్చు. ప్రతి అడుగుతో మోకాళ్లను వీలైనంత ఎత్తుకు పైకి తీసుకొస్తూ, అరచేతులను తాకడానికి మన మోకాళ్లను వేగంగా పైకి కందికి ఎత్తుతూ చేయాలి. లంజెస్‌: పాదాలను కలిపి నిలబడి, కుడి పాదం మీద ముందుకు సాగదీయాలి. ముందు, వెనుక మోకాలు రెండూ వీలైనంత 90–డిగ్రీల కోణానికి దగ్గరగా వంగి ఉండే వరకూ చేయాలి.ఇదీ చదవండి: నాలుగు వారాల కొరియన్‌ డైట్‌ ప్లాన్‌ : 6 రోజుల్లో 4 కిలోలుసైడ్‌ ప్లాంక్‌లు: చాపపై కుడి వైపున పడుకుని, ఎడమవైపు పడుకుని చేసే వ్యాయామం.

E Shinde First Reaction On Kunal Kamra Episode Says This10
E Shinde: ముమ్మాటికీ పొలిటికల్‌ సుపారీనే!

ముంబై: ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే స్పందించారు. కునాల్‌ ఆ వ్యాఖ్యలు వ్యంగ్యంగానే చేసినట్లు తాను అర్థం చేసుకోగలనని.. కానీ ప్రతిదానికి ఓ హద్దు ఉంటుందని అన్నారాయన. ఈ క్రమంలో సంచలన ఆరోపణలకు దిగారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు స్టాండప్‌ కమెడియన్‌ కునాల్. ఈ నేపథ్యంలో ఆ షో జరిగిన హబిటాట్‌ స్టూడియోపై షిండే వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అయితే అది ఎవరైనా సరే విధ్వంసానికి తన మద్దతు ఎప్పుడూ ఉండబోదని ఏక్‌నాథ్ షిండే అన్నారు. బీబీసీ మరాఠీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కునాల్‌ ఎపిసోడ్‌పై స్పందించారు.ప్రజాస్వా​మ్యంలో వాక్‌ స్వాతంత్రం అందరికీ ఉంటుంది. దీనిని కాదనలేం. నా సంగతి పక్కన పెట్టండి. ప్రధాని మోదీ, భారత మాజీ న్యాయమూర్తి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, హోం మంత్రి అమిత్‌ షా..వీళ్ల గురించే కాదు ప్రముఖ వ్యాపారులు, గొప్ప గొప్పవాళ్ల గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడాడతను. ఇలాంటి వ్యాఖ్యల కోసం అతనికి ఎవరి నుంచి సుపారీ అందింది?. ఇది కచ్చితంగా రాజకీయ ప్రత్యర్థుల కుట్రే అని అన్నారాయన. ఈ వ్యవహారంలో ప్రజలు కూడా ప్రతిపక్షాలనే వేలెత్తి చూపిస్తున్నారని.. అయినా వాళ్ల విధానాలు మారడం లేదన్నారు. ఇక హబిటాట్‌ స్టూడియోపై జరిగిన దాడిని ఖండించిన షిండే.. అది కార్యకర్తల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ‘‘ఏక్‌నాథ్‌ షిండే అనేది చాలా సున్నితమైన అంశం. నాపై ఎన్నో ఆరోపణలు వస్తుంటాయి. కానీ, నేను నా పనితోనే వాటికి బదులిస్తుంటా. విధ్వంసానికి నేను వ్యతిరేకం. కానీ, పార్టీ కార్యకర్తలు ఊరుకోలేరు కదా. చర్యకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement