Top Stories
ప్రధాన వార్తలు

బహిష్కరణకు గురైన కుటుంబాలకు అండగా వైఎస్ జగన్
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసే మంచి ఏమీ లేకపోయినా కక్ష సాధింపు చర్యలు మాత్రం తీవ్రతరమవుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే పల్నాడు జిల్లా పిన్నెళ్లి గ్రామంలోని 400 కుటుంబాలపై బహిష్కరణ వేటు వేసింది. బహిష్కరణకు గురైన వారంతా ఎస్సీ, బీసీ, మైనార్టీలే. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. బహిష్కరణకు గురైన పిన్నెళ్లి గ్రామంలోని కుటుంబాలకు అండగా నిలిచారు వైఎస్ జగన్ఈ క్రమంలోనే అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. గ్రామంలోకి వస్తే తమను చంపుతామని బెదిరిస్తున్నారని వారు వైఎస్ జగన్‌కు విన్నవించుకున్నారు. వీరికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా ‘చలో పిన్నెళ్లి’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ‘ సిద్ధమైంది. రెండు నెలల్లో చలో పిన్నెళ్లి’ కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్సీపీ‘ నిర్ణయించింది. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సహా పిన్నెల్లి, తురకపాలెం, మాదెనపాడు, చెన్నాయపాలెం గ్రామస్తులున్నారు.

ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడే.. ఈ రూపాయి (₹) సింబల్‌ను డిజైన్ చేసింది..
ఢిల్లీ: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాష సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం,తమిళనాడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రతుల్లో రూపాయి (₹) సింబల్‌ను (Rupee symbol row) తొలగించింది. ఆ స్థానంలో తమిళనాడులో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చింది. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది. ఈ క్రమంలో ఆ రూపాయి సింబల్ డిజైన్ ఎవరు తయారు చేశారు? అనే అంశంపై నెట్టింట్లో పెద్ద ఎత్తున జరుగుతోంది.రూపాయి సింబల్‌ను ఎవరు డిజైన్ చేశారు?ఇక ఆ రూపాయి డిజైన్‌ను చేసింది మరెవరోకాదు తమిళనాడు అధికార డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎన్.ధర్మలింగం కుమారుడు ఐఐటీ ప్రొఫెసర్ డీ.ఉదయ్‌కుమార్ ధర్మలింగం. తొలిసారిగా ఈ రూపాయి సింబల్ 2010లో నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ వినియోగంలోకి తెచ్చారు. రూపాయి డిజైన్ ఎలా చేశారంటే?2010 నాటి యూపీఏ ప్రభుత్వం రూపాయి డిజైన్ చేసేందుకు దేశవ్యాప్తంగా పోటీ నిర్వహించింది. అయితే, ఈ కాంటెస్ట్‌లో ఐఐటీ ముంబైలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఉదయ కుమార్ సైతం పాల్గొన్నారు. రూపాయి సంకేతం డిజైన్ చేయడంలో దేవనాగరి, రోమన్ భాషల్ని కలుపుతూ రూపాయి డిజైన్ చేశారు. రూపాయి సింబల్ కోసం దేవనగరి భాషలోని ‘ర’ను రోమన్‌లోని ‘ఆర్’ కలిపి రూ (₹) సింబల్‌ను తయారు చేశారు. సరిగ్గా ఐఐటీ గౌహతి డిజైన్ విభాగంలో కొత్త ఉద్యోగంలో చేరే ఒక రోజు ముందు కేంద్రం రూపాయి సింబల్ కోసం ఏర్పాటు చేసిన పోటీ విజేతల్ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వందల కొద్ది డిజైన్లు పరిశీలించగా.. ఆ డిజైన్లు అన్నింటిల్లో ఉదయకుమార్ డిజైన్ చేసిన రూపాయి డిజైన్‌ను కేంద్రం ఎంపిక చేసింది.భారత కరెన్సీలో రూపాయి సింబల్ 2010 జూలై 15న,మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కరెన్సీ నోట్లపై ఉదయ కుమార్ డిజైన్ చేసిన రూపాయి సింబల్‌ను చేర్చింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారత కరెన్సీ గుర్తింపు అమాంతం పెరిగినట్లు ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో తిరువణ్ణామలై సమీపంలో ఉన్న మారూరు గ్రామంలో జన్మించిన ఉదయ కుమార్ రూపాయి సింబల్‌ను ఎలా డిజైన్ చేశారో వివరించారు. ఇక, ప్రస్తుతం ఉదయ కుమార్ ఐఐటీ గౌహతి డిజైన్ విభాగం హెచ్ఓడీగా ఉన్నారు. ఐఐటీ-హైదరాబాద్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి అనేక సంస్థలకు లోగోలు డిజైన్ చేశారు.

ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
ఐపీఎల్-2025(IPL 2025) సీజన్ కోసం ముంబై ఇండియన్స్(Mumba Indians) తమ సన్నాహకాలను ప్రారంభించింది. వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో ముంబై ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆటగాళ్లు ఇప్పటికే ముంబై శిబిరంలో చేరారు. ఇక ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ మెనెజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.తమ జట్టు స్పిరిట్ కోచ్' గా బాలీవుడ్ ఐకాన్ జాకీ ష్రాఫ్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం నియమించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ముంబై సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ జట్టు ఆటగాళ్లలో ఉత్సాహాన్ని, పట్టుదల పెంచేందుకు ముంబై ఫ్రాంఛైజీ ఈ వినూత్న ఆలోచన చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఏ ఫ్రాంచైజీ కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈ ఏడాది సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతానైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ఐపీఎల్-2024లో గ్రూపు స్టేజికే పరిమితమైన ముంబై ఇండియన్స్.. ఈ ఏడాది సీజన్లో మాత్రం సత్తాచాటాలని భావిస్తోంది.భారీ షాక్.. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బమ్రా గాయం కారణంగా ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. అతడు కోలుకోవడానికి మరో నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌లో బుమ్రా ముంబై జట్టులో చేరనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.ఐపీఎల్-2025కు ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, అల్లా గజన్ఫర్, విల్ జాక్స్, అశ్వని కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టోప్లీ, క్రిష్ణన్ ష్రిజిత్, రాజ్ బవా, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, సీ బోచ్, విగ్నేష్ పుతుర్.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? Saans le lamba & shaanti coz 𝙅𝘼𝙂𝙂𝙐 𝘿𝘼𝘿𝘼 - aapla Spirit Coach is here! 🧘♂️😎#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/md5fnlJKX9— Mumbai Indians (@mipaltan) March 13, 2025

ఫ్రెషర్లకు డిమాండ్: ఐటీలో నియామకాలు డబుల్
గతకొన్ని నెలలుగా దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం.. కొత్త ఉద్యోగులను నియమించుకోకపోవడం మాత్రమే కాకుండా, ఉన్న వారిని కూడా ఉద్యోగాల్లో నుంచి తీసేస్తోంది. అయితే త్వరలోనే ఐటీ రంగం పుంజుకుంటుందని.. ఉద్యోగ నియామకాలు కూడా భారీగా ఉంటాయని రిక్రూటింగ్ సంస్థ టీమ్‌లీజ్ తన నివేదికలో వెల్లడించింది.2026 ఆర్థిక సంవత్సరంలో టెక్నాలజీ సేవల రంగంలో ఫ్రెషర్ల నియామకం దాదాపు రెట్టింపు అవుతుందని, గత సంవత్సరంతో పోలిస్తే నియామకాలు 1,50,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. టీమ్‌లీజ్ డేటా ప్రకారం, మార్చి 2025 నాటికి దాదాపు 85,000 - 95,000 మంది ఫ్రెషర్ల నియమాలకు జరుగుతాయి.అన్ఎర్త్ఇన్సైట్ పరిశోధన ప్రకారం.. యాక్సెంచర్, క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ఐటీ సేవల సంస్థలు కొత్తగా 1.6 లక్షల నుంచి 1.8 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్త ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుంది.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్! 2024 ప్రారంభం నుంచి కూడా చాలా కంపెనీలు.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చాయి. కాబట్టి కొత్త నియమాల విషయం కొంత ఆలోచించి, ప్రస్తుత టెక్నాలజీకు అవసరమైన నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగావకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇండియన్, మల్టి నేషనల్ కంపెనీలు రెండూ కూడా కొత్తవారి నియామకాలను చేపట్టనున్నాయి. అయితే కొత్త నైపుణ్యాలను నేర్చుకున్న.. ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని టీమ్‌లీజ్ సర్వేలో వెల్లడైంది.

‘స్టాలిన్.. అది నీ మూర్ఖత్వానికి నిదర్శనం’
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం రూపాయి సింబల్ ను మార్చడంపై ఆ రాష్ట్ర బీజేపీ తీవ్రంగా మండిపడింది. అది మూర్ఖపు చర్య అంటూ అభివర్ణించారు తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై. భారత మొత్తం తమ కరెన్సీలో 'Rs' అని ఉంటే 'Ru' అని తమిళనాడు ప్రభుత్వం మార్చడం అతి తెలివి తక్కువ పని అంటూ ధ్వజమెత్తారు. దీన్ని మూర్ఖపు చర్య కాకపోతే ఇంకేమనాలి అని ఆయన ప్రశ్నించారు అసలు స్టాలిన్ ఎలా సీఎం అయ్యారో అంటూ విమర్శలు గుప్పించారు.కాగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 2025 - 26 బడ్జెట్లో సాధారణ రూపాయి చిహ్నానికి బదులుగా.. తమిళ చిహ్నంతో భర్తీ చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇప్పటికే జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. తాజాగా ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రూపాయి సింబల్ ను మార్చడమే కాకుండా ‘రు’ అని ఆ సింబల్ పై పేర్కొనడమే వివాదాన్ని మరింత పెంచింది.The DMK Government's State Budget for 2025-26 replaces the Rupee Symbol designed by a Tamilian, which was adopted by the whole of Bharat and incorporated into our Currency. Thiru Udhay Kumar, who designed the symbol, is the son of a former DMK MLA. How stupid can you become,… pic.twitter.com/t3ZyaVmxmq— K.Annamalai (@annamalai_k) March 13, 2025తమిళనాడుపై హిందీ భాష రుద్దుతారా?తాము ఎంతో గౌరవించే తమిళభాషపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతున్నారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు. తమిళనాడులో హిందీ భాషను తీసుకొస్తే తమిళనాడు ఎడ్యుకేషన్ సిస్టం అంతా సర్వనాశనం అవుతుందని మండిపడ్డారు. వారి తీసుకొచ్చే ఎడ్ముకేషన్ పాలసీ.. అది ఎడ్యుకేషన్ పాలసీ కాదు.. కుంకుమ, పసుపు పాలసీ. ఇది భారత్ ను అభివృద్ధి చేయడం కోసం తెచ్చిన పాలసీ ఎంతమాత్రం కాదు. కేవలం హిందీని అభివృద్ధి చేయడం కోసం తీసుకొచ్చిన పాలసీ.’ అని ధ్వజమెత్తారు స్టాలిన్.

అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) సస్పెన్షన్ గురయ్యారు. ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంపై దుమారం చెలరేగింది. దీంతో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు జగదీష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం వరకు ఇదే అంశంపై చర్చ జరిగింది. ఆ సమయంలో అసెంబ్లీ వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌ను ఉద్దేశిస్తూ జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియోని వీక్షించారు.తిరిగి మధ్యాహ్నం సభ ప్రారంభం కావడంతో జగదీష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. ఏ తప్పు చేయకపోయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎథిక్స్ కమిటీకి సిఫార్స్‌లు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని అసెంబ్లీలో ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యుడిని బయటకు పట్టాలని ఆదేశించారు. స్పీకర్ గురించి జగదీష్ రెడ్డి ఏం మాట్లాడారంటే?తొలుత జగదీష్ రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’’ అని వ్యాఖ్యానించారు.

ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. తనపై బాపట్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పోసాని పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. BNS 35(3) సెక్షన్‌ను ఫాలో కావాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.కాగా, పోసానిని సీఐడీ పోలీసులు నిన్న (బుధవారం) రాత్రి( గుంటూరులో ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోసాని అనారోగ్య సమస్యల గురించి విన్నవించుకున్నారు. బెయిల్ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులకు సంబంధించి తనకు ఎటువంటి పాపం తెలియదని, తానేం చేయలేదని న్యాయమూర్తి ఎదుట బోరున విలపించారు.నిజం మాట్లాడినందుకు తన మీద కక్ష కట్టి ఇలాంటి అన్యాయమైన కేసులు పెట్టారని విన్నవించారు. తల్లి మీద, పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని తనకే పాపమూ తెలియదని న్యాయమూర్తిని వేడుకొన్నారు. బెయిల్ ఇవ్వాలని కోరారు. వయసు మీదపడడంతో కూర్చోలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. పోలీసులు ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని, ఇప్పటికే కొన్ని వందల మైళ్లు ప్రయాణం చేయించారని, ఎందుకు నన్ను తిప్పుతున్నారో అర్థం కావడం లేదని, ఇలా చేస్తే తాను ఎక్కువ రోజులు బతకనని మొరపెట్టుకున్నారు.టీడీపీలోకి రమ్మంటే రానందుకు లోకేశ్ తనను వేధిస్తున్నారని, నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతాన్ని ఎత్తిచూపడంతో కక్ష కట్టారని తెలిపారు. అన్నీ నిజాలే చెబుతున్నానని నార్కో ఎనాలసిస్ టెస్టుకూ సిద్ధమన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు.

అవసరమైతే స్పీకర్‌పై అవిశ్వాసం పెడతాం: హరీష్ రావు
హైదరాబాద్, సాక్షి: స్పీకర్‌ను ‘మీ’ అని సంబోధించడం.. అవమానించడం ఎలా అవుతుంది? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలు.. జగదీష్‌రెడ్డి అంశంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను జగదీష్‌రెడ్డి అవమానించలేదు. సభ మీ ఒక్కరిది కాదు.. అందరిదీ అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధమేమీ కాదు. అదేం అన్‌పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌లో పడింది. స్పీకర్‌ను కలిసి రికార్డులు తీయాలని అడిగాం. పదిహేను నిమిషాలు ఎదురు చూసినా.. ఆయన వీడియో రికార్డులు చూపించలేదు. అసలు సభ ఎందుకు వాయిదా వేశారో కూడా తెలియదు. స్పీకర్ గనుక ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే.. అవిశ్వాసం పెట్టడానికైనా మేం సిద్ధం’’ అని హరీష్‌రావు అన్నారు. సభలో సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయని సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలు విచిత్రంగా ఉన్నాయి అని అన్నారాయన. మరోవైపు.. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ అందరికి సమానం.. అందరి తరఫున సభలో కూర్చున్నారని జగదీష్ రెడ్డి అన్నారు మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. అందుకే స్పీకర్ కుర్చీతో డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగింది అని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇదీ చదవండి: స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

Vijayasaireddy: ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం?
విశాఖపట్నం, సాక్షి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను వైఎస్సార్సీపీకి దూరమయ్యానని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు(Vijayasai Kotary Comments) మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు.. ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని అమర్నాథ్ చురకలంటించారు. ‘‘వైఎస్ జగన్(YS Jagan) కోటరీ అంటే అది ప్రజలే. అయినా ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పండి. ఆ మాటకొస్తే చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా?. మొన్నటి వరకు కోటరిలో ఉన్న మనమే.. ఇప్పుడు ఆ కోటరీ గురించి మాట్లాడితే ఏమి బాగుంటుంది?. ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుంది. మరి విజయసాయిరెడ్డికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదు. అయినా పార్టీ మారిన ఆ వ్యక్తి నుంచి ఇంతకంటే ఏమి ఆశిస్తాం?.ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వర్గాలు ఉన్నాయి. ఒకటి కూటమి వర్గం.. రెండోది వైఎస్సార్సీపీ వర్గం. ఇక మూడోది.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గం. గతంలో వైఎస్సార్సీపీలో కీలకమైన పదవులు అనుభవించారు. మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వెళ్లే పోయేవారా?. ఇదే విధంగా మాట్లాడేవారా?. అసలు ఇటువంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా?. ఆ మధ్య రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ఇప్పుడేమో కోటరీ అంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తే తేడాగా కనిపిస్తోంది. ఆయన తాజా వ్యాఖ్యలు మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నారనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది’’ అని గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) అన్నారు. ఒక్క హామీ అమలు చేయలేదుకూటమి ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదు. హామీలు అమలు చేయకపొగా.. వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. కానీ, బడ్జెట్లో నిరుద్యోగ భృతి కోసం రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్ ఇప్పటిదాకా కాలేదు. జగన్ హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. ఈ సమస్యలపై పోరాటంలో యువత పోరు కార్యక్రమం చేపట్టాం.. అది విజయవంతం అయ్యింది. ప్రజలకు ఎల్లప్పుడూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది అని అమర్నాథ్ అన్నారు.

Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ
టైటిల్:'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' నటీనటులు: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి తదితరులుసమర్పణ: నానినిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమానిర్మాత: ప్రశాంతి తిపిర్నేనికథ, దర్శకత్వం: రామ్ జగదీష్సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: మార్చి 14, 2025హీరో నాని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొత్త చిత్రాలను నిర్మిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ద్వారా కొత్త కంటెంట్‌తో పాటు కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఆయన బ్యానర్లో తెరకెక్కిన చిత్రమే ‘కోర్ట్’. ‘‘కోర్ట్’ నచ్చకపోతే నా ‘హిట్ 3’సినిమా చూడకండి’ అంటూ నాని సవాల్ విసరడంతో ఈ చిన్న చిత్రంపై అందరిలో ఆసక్తి పెరిగింది. అంతేకాదు రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడియాకు స్పెషల్ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిలి.. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు(రోషన్)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్ లాయర్ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ అదే చట్టాలను కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలుపాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ‘కోర్ట్’ సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్ యూజ్ చేస్తున్నారు? ఇలాంటి పవర్ఫుల్ చట్టాలలో ఉన్న లొసుగులను పోలీసులతో పాటు ‘లా’ వ్యవస్థ ఎలా వాడుకుంటుంది? పోక్సో చట్టం ఏం చెబుతోంది? అందులో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? తదితర విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్ జగదీష్.దర్శకుడు ఎంచుకున్న టాపిక్ చాలా సెన్సిబుల్. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా చాలా నీట్‌గా ఆ టాపిక్‌ని చర్చించాడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్ మన ఊహకందేలా సాగుతుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే లవ్ స్టోరీని కూడా రొటీన్‌గానే చూపించాడు. కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. బెయిల్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని లొసుగులు ఉపయోగించి లాయర్ దాము(హర్ష వర్ధన్) అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో అవన్నీ అబద్దాలని తేలిపోతాయని తెలిసినా.. తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండాఫ్ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్నచిన్న ట్విస్టులు కూడా ఎంటర్టైన్ చేస్తాయి. ఎమోషనల్ సీన్లను బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే నేచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టేస్తాడు. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టులో ఆయన వినిపించే వాదనలు ఆకట్టుకుంటాయి. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జాబిలిగా కొత్తమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీది అని చెప్పాలి. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. సాయి కుమార్, రోహిణి, శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
ఎవరూ సురక్షితంగా లేరు.. జీ7 దేశాలకు కెనడా హెచ్చరిక..
KKR SWOT: అతడిపై భారం!.. బలాలు, బలహీనతలు ఇవే
హైదరాబాద్ సిటీలో మరిన్ని ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు
హైదరాబాద్‌లో 'రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్'.. ఎప్పుడంటే?
హార్దిక్ పాండ్యా కంటే అతడు ఎంతో బెటర్: పాక్ మాజీ కెప్టెన్
ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడే.. ఈ రూపాయి (₹) సింబల్‌ను డిజైన్ చేసింది..
ఫొటోతో పాటు లొకేషన్ వాట్సాప్ చేయండి
‘జీతాల తేడాలొద్దు.. ఉద్యోగులను మనుషుల్లా చూడండి’
BGT: ‘నేను ఆడితే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ’
‘కూటమి’ కుట్రలు.. గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
లే నాన్నా.. అమ్మా, చెల్లి వచ్చాం
ఓటీటీలో రచిత గ్లామరస్ సినిమా.. మొత్తం 'ఫైర్' అయిపోతారు
ఈ రాశి వారికి వస్తులాభాలు.. స్థిరాస్తి వృద్ధి
ఇంకా నయం! ప్రభుత్వాన్ని హైజాక్ చేస్తారేమోనని భయపడ్డా..!
మేజిస్ట్రేట్ ముందు కన్నీరు పెట్టుకున్న పోసాని
సార్.. ప్రపంచం మీదనే బరువేస్తున్నట్టుంది!
Hyderabad: ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు సొరంగ మార్గం..
Wine Shops Closed : వైన్‌షాపులు బంద్.. ఎందుకో తెలుసా?
Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ
నా బర్త్‌డే కదా.. అమ్మానాన్నలేరీ?
ఎవరూ సురక్షితంగా లేరు.. జీ7 దేశాలకు కెనడా హెచ్చరిక..
KKR SWOT: అతడిపై భారం!.. బలాలు, బలహీనతలు ఇవే
హైదరాబాద్ సిటీలో మరిన్ని ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు
హైదరాబాద్‌లో 'రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్'.. ఎప్పుడంటే?
హార్దిక్ పాండ్యా కంటే అతడు ఎంతో బెటర్: పాక్ మాజీ కెప్టెన్
ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడే.. ఈ రూపాయి (₹) సింబల్‌ను డిజైన్ చేసింది..
ఫొటోతో పాటు లొకేషన్ వాట్సాప్ చేయండి
‘జీతాల తేడాలొద్దు.. ఉద్యోగులను మనుషుల్లా చూడండి’
BGT: ‘నేను ఆడితే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ’
‘కూటమి’ కుట్రలు.. గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
లే నాన్నా.. అమ్మా, చెల్లి వచ్చాం
ఓటీటీలో రచిత గ్లామరస్ సినిమా.. మొత్తం 'ఫైర్' అయిపోతారు
ఈ రాశి వారికి వస్తులాభాలు.. స్థిరాస్తి వృద్ధి
ఇంకా నయం! ప్రభుత్వాన్ని హైజాక్ చేస్తారేమోనని భయపడ్డా..!
మేజిస్ట్రేట్ ముందు కన్నీరు పెట్టుకున్న పోసాని
సార్.. ప్రపంచం మీదనే బరువేస్తున్నట్టుంది!
Hyderabad: ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు సొరంగ మార్గం..
Wine Shops Closed : వైన్‌షాపులు బంద్.. ఎందుకో తెలుసా?
Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ
నా బర్త్‌డే కదా.. అమ్మానాన్నలేరీ?
సినిమా

కుమారుడితో బ్రహ్మానందం నటించిన సినిమా.. ఓటీటీలో ఎప్పుడంటే?
దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ (Raja Gautam) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రహ్మా ఆనందం. ఈ మూవీలో వీరిద్దరూ తాతామనవళ్లుగా యాక్ట్ చేశారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించగా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించాడు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూద సినిమాల ఫేమ్ రాహుల్ యాదవ్ నక్కా నిర్మించాడు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆహాలో రేపటి (మార్చి 14) నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.కథేంటంటే?బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం (రాజా గౌతమ్) ఓ థియేటర్ ఆర్టిస్ట్. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలన్నది తన లక్ష్యం. ఈ ప్రయత్నాల్లో ఉండగా ఢిల్లీలో ఓ నాటకం వేసే ఛాన్స్ దొరుకుతుంది. అయితే అక్కడ పాల్గొనాలంటే రూ.6 లక్షలు ఇవ్వాలని ఆ వేడుక నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు. దానికోసం ప్రయత్నాలు చేసే క్రమంలో వృద్ధాశ్రమంలో ఉన్న తాత ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం) తన దగ్గర ఆరెకరాల భూమి ఉందని చెప్తాడు. అది ఇవ్వాలంటే ఓ కండీషన్ పెడతాడు. మరి బ్రహ్మకు ఆ భూమి దక్కిందా? అతడిన ఎంతో ప్రేమించే తార (ప్రియ వడ్లమాని) తనను వదిలి ఎందుకు వెళ్లిపోయింది? చివరకు కలిశారా? బ్రహ్మ నటుడయ్యాడా? లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ

నాలుగేళ్ల తర్వాత రోషన్ కొత్త సినిమా.. గ్లింప్స్ రిలీజ్
హీరోగా 100కి పైగా తెలుగు సినిమాలు చేసిన శ్రీకాంత్.. ఇప్పుడు విలన్, సహాయ పాత్రలు చేస్తున్నాడు. ఈయన కొడుకు రోషన్.. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందD లాంటి మూవీస్ చేశాడు గానీ బ్రేక్ రాలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని 'ఛాంపియన్' మూవీ చేస్తున్నాడు.(ఇదీ చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ)2021లో పెళ్లి సందడి వచ్చింది. శ్రీలీల తొలి తెలుగు సినిమా ఇది. ఈ నాలుగేళ్లలో ఆమె స్టార్ హీరోయిన్ అయిపోగా.. అదే మూవీలో హీరోగా చేసిన రోషన్.. ఇప్పుడు మరో మూవీ మొదలుపెట్టాడు. ఈ రోజు ఇతడి పుట్టినరోజు. ఈ క్రమంలోనే గ్లింప్స్ రిలీజ్ చేశారు. చూస్తుంటే 90స్ బ్యాక్ డ్రాప్ లో ఫుట్ బాల్ గేమ్ డ్రామాతో నడిచే సినిమా అని అర్థమైంది. మహానటి, సీతారామం చిత్రాల్ని నిర్మించిన వైజయంతీ సంస్థ నిర్మిస్తుండగా.. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. మరి ఈ ఏడాది రిలీజ్ చేస్తారో వచ్చే ఏడాది మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్)

ఓటీటీలో టాప్-10 కోర్ట్ రూమ్ మూవీస్.. ప్రతి క్షణం థ్రిల్లో థ్రిల్
హీరో నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. లెక్కప్రకారం శుక్రవారం రావాలి కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల ప్రీమియర్లు వేయగా స్పందన బాగా వచ్చింది. పోక్సో కేసు గురించి చర్చిస్తూ తీసిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా గురించి అప్పుడే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ)సరే 'కోర్ట్' మూవీ గురించి కాసేపు పక్కనబెడితే ఇంతకుముందు కూడా ఇలా కోర్ట్ బ్యాక్ డ్రాప్ కథలతో పలు అద్భుతమైన సినిమాలు వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైనవి ప్రస్తుతం పలు ఓటీటీల్లో ఉన్నాయి. అలాంటి వాటిలో టాప్-10 గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.జై భీమ్ - సూర్య స్వయంగా నటించి, నిర్మించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులోనే ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీశారు. చూస్తుంటే అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది.పింక్ - తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో దీన్ని రీమేక్ చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి చెడగొట్టేశారు. హిందీలో తీసిన ఒరిజినల్ మూవీ 'పింక్'. చూస్తే మాత్రం మంచి హై ఇస్తుంది. హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ ఉంది. ముల్క్ - హిందీలో తీసిన అవార్డ్ విన్నింగ్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ. టెర్రరిస్టుల వల్ల ఓ ముస్లిం కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందనేదే స్టోరీ. అమెజాన్ ప్రైమ్ లో హిందీలో చూడొచ్చు.నెరు - తెలుగులో డబ్ అయిన మలయాళ మూవీ ఇది. ఓ అంధురాలిపై అత్యాచారం జరుగుతుంది. అసలు అవకాశమే లేని చోట.. నిందితుడిని ఎలా శిక్షించారనేదే స్టోరీ. మోహన్ లాల్, ప్రియమణి ఉంటారు. హాట్ స్టార్ లో తెలుగులోనే ఉంది.జనగణమన - కోర్ట్ రూం డ్రామాల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఒక్కో ట్విస్టు రివీల్ అయ్యే టైంలో మతిపోతుంది. పృథ్వీరాజ్ యాక్టింగ్ కేక. నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోనే చూడొచ్చు.ఓ మై గాడ్ 2 - సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ముఖ్యమో చెప్పే సినిమా. కోర్ట్ సీన్స్ బాగుంటాయి. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది.సెక్షన్ 375 - రేప్ కేసు, దీన్ని ఎలా చెడు కోసం ఉపయోగించుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తీశారు. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లో హిందీలో సినిమా చూడొచ్చు.జాలీ ఎల్ఎల్ బీ - ఓ సాధారణ లాయర్.. బాగా వైరల్ అయిన ఓ హిట్ అండ్ రన్ కేసుని వాదిస్తాడు. అవతల పేరు మోసిన లాయర్. చివరకు ఏమైందనేదే స్టోరీ. హిందీలో హాట్ స్టార్ లో ఉంది. నాంది - అల్లరి నరేశ్ కమ్ బ్యాక్ మూవీ ఇది. చేయని నేరానికి జైలుపాలైన ఓ సామాన్యుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కోర్టులో వాదనలు ఎలా జరిగాయనేదే స్టోరీ. హాట్ స్టార్ లో తెలుగులోనే ఉంది.బంగారు తల్లి - 15 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ ని ఓపెన్ చేసి, కోర్ట్ లో వాదోపవాదాలు జరుగుతాయి. ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామాలో జ్యోతిక లాయర్. ఆహా ఓటీటీలో తెలుగులోనే చూడొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్)

ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం థియేటర్లలోకి నాని నిర్మించిన 'కోర్ట్', కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా' రాబోతున్నాయి. రెండింటిపైనా మంచి అంచనాలే ఉన్నాయి. ఏమవుతుందో చూడాలి? మరోవైపు ఓటీటీల్లో మాత్రం 20కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఓటీటీల్లో శుక్రవారం ఒక్కరోజే రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రామం రాఘవం, ఏజెంట్, రేఖాచిత్రం, వనవాస్, పొన్ మ్యాన్ తదితర చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు కొత్త మూవీస్ కూడా వచ్చే అవకాశముంది.ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు (మార్చి 14న)సన్ నెక్స్ట్రామం రాఘవం - తెలుగు సినిమాసోనీ లివ్ఏజెంట్ - తెలుగు మూవీఆహారేఖాచిత్రం - తెలుగు సినిమాసీ సా - తమిళ మూవీఅమెజాన్ ప్రైమ్బీ హ్యాపీ - హిందీ సినిమాఒరు జాతి జాతకమ్ - మలయాళ మూవీనెట్ ఫ్లిక్స్ద ఎలక్ట్రిక్ స్టేట్ - ఇంగ్లీష్ మూవీకర్స్ ఆఫ్ ద సెవెన్ సీస్ - ఇండోనేసియన్ సినిమాఆడ్రే - ఇంగ్లీష్ మూవీఎమర్జెన్సీ - హిందీ సినిమాఆజాద్ - హిందీ మూవీలవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ సీజన్ 2 - స్వీడిష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)ఆడాలసెన్స్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)జీ5వనవాస్ - హిందీ మూవీహాట్ స్టార్పొన్ మ్యాన్ - మలయాళ సినిమామోనా 2 - ఇంగ్లీష్ చిత్రంఆచారీ బా - హిందీ మూవీబుక్ మై షోమెర్సీ కిల్లింగ్ - తెలుగు సినిమాద సీడ్ ఆఫ్ సేక్రెడ్ ఫిగ్ - పెర్షియన్ మూవీకంపానియన్ - ఇంగ్లీష్ సినిమాఆపిల్ టీవీ ప్లస్డోప్ థీప్ - ఇంగ్లీష్ సిరీస్(ఇదీ చదవండి: 40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

లక్నోకు గుడ్ న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ తన గాయం నుంచి కోలుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా వైద్యబృందం నుంచి మార్ష్ క్లియరెన్స్ పొందాడు. 33 ఏళ్ల మార్ష్ వెన్ను గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు దూరమయ్యాడు.ఈ క్రమంలో నెల రోజుల పాటు క్రికెట్ ఆస్ట్రేలియా రిహాబిలిటేషన్ సెంటర్లో గడిపిన మార్ష్ తిరిగి తన ఫిట్నెస్ను పొందాడు. అయితే మార్ష్ ఈ ఏడాది సీజన్లో కేవలం స్పెషలిస్టు బ్యాటర్‌గానే ఆడనున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం సూచనల మేరకు కొన్నాళ్లపాటు మార్ష్ బౌలింగ్‌కు దూరంగా ఉండనున్నాడు.బౌలింగ్ చేసే క్రమంలో వెన్నెముకపై ఎక్కువగా ఒత్తిడి పడే అవకాశమున్నందన బౌలింగ్‌కు దూరంగా ఉండాలని వైద్యలు సూచించినట్లు ఈఎస్పీఎన్ తమ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అతడిని లక్నో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయెగించుకునే అవకాశముంది.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో మార్ష్‌ను రూ.3.3 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. త్వరలోనే లక్నో జట్టుతో మార్ష్ కలవనున్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్, నికోలస్ పూరన్, మిల్లర్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో మార్ష్ ఆడనున్నాడు. గత రెండు సీజన్లలో మార్ష్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మెగా వేలానికి ముందు అతడిని ఢిల్లీ విడిచిపెట్టింది.ఇక ఐపీఎల్-18 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ తమ మొదటి మ్యాచ్‌లో మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. ఇక మార్ష్‌తో పాటు సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ సైతం పూర్తి ఫిట్నెస్ సాధించారు. త్వరలోనే ఈ ఆసీస్ ఆటగాళ్లు తమ ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లతో కలవనున్నారు. ఐపీఎల్-2025కు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్:డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్రమ్, హిమ్మత్ సింగ్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కీ, ఆర్యన్ జుయల్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, యువరాజ్ చౌదరీ, అబ్దుల్ సమద్, రాజవర్దన్ హంగార్గేకర్, అర్శిన్ కులకర్ణి, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, ప్రిన్స్ యాదవ్, మొహిసిన్ ఖాన్, షమార్ జోసఫ్, ఆకాశ్ సింగ్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ సింగ్, రవి బిష్ణోయ్.చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి

WC 2027: రోహిత్ శర్మ ప్లానింగ్ ఇదే!.. అతడి మార్గదర్శనంలో సన్నద్ధం!
‘‘ఇంకో విషయం చెప్పాలి.. ఈ ఫార్మాట్ నుంచి నేను రిటైర్ కావడం లేదు. ఇకపై వదంతులు ప్రచారం చేయకుండా ఉండాలనే ఈ మాట చెబుతున్నా’’... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చేసిన వ్యాఖ్యలు ఇవి. తాను భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని.. జీవిత ప్రయాణంలో ఎదురైన వాటినే తాను స్వీకరిస్తానని స్పష్టం చేశాడు.ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఆట మీదే ఉందని.. 2027 వన్డే వరల్డ్‌కప్ నాటికి కొనసాగుతానా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేనని రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. రిటైర్మెంట్ గురించి ఇప్పుడు తాను ఎలాంటి కామెంట్లూ చేయలేనని పేర్కొన్నాడు.ఊహాగానాలు ఆగటం లేదుక్రికెట్ ఆడటాన్ని ఇప్పటికీ పూర్తిగా ఆస్వాదిస్తున్నానని.. జట్టుతో సమయం గడపడం తనలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోందని.. సహచర ఆటగాళ్లు కూడా తనతో ఉండేందుకు ఇష్టపడుతున్నారని హిట్‌మ్యాన్ తెలిపాడు. ఇంత చెప్పినప్పటికీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు ఆగటం లేదు. అతడి భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.వన్డేల్లో కొనసాగినా.. టెస్టులకు మాత్రం రోహిత్ దూరం కానున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక యాభై ఓవర్ల ఫార్మాట్లో మరో రెండేళ్లకు అంటే.. 2027 తర్వాత రోహిత్ పక్కకు తప్పుకోవడం లాంఛనమేననే వార్తలు వస్తున్నాయి. కాగా రోహిత్ వచ్చే నెలలో 38వ వసంతంలో అడుగుపెడతాడు.నలభై ఏళ్ల వయసులో ఎలా?వన్డే వరల్డ్‌కప్-2027(ICC ODI World Cup 2027) నాటికి అతడికి నలభై ఏళ్లు వస్తాయి. ఇక సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా ఐసీసీ ఈవెంట్ కంటే ముందు టీమిండియా దాదాపు 27 వన్డేలు ఆడనుంది. సమయాన్ని బట్టి ఇందుకు అదనంగా మరికొన్ని మ్యాచ్‌లు కూడా షెడ్యూల్ కావచ్చు. అయితే, వరల్డ్‌కప్ నాటికి రోహిత్ ఫిట్‌గా ఉండేందుకు ఇప్పటి నుంచే సన్నాహాకాలు మొదలుపెట్టాడని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది.అతడి మార్గదర్శనంలో సన్నద్ధం!టీమిండియా కోచ్ అభిషేక్ నాయర్ మార్గదర్శనంలో రోహిత్ తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రత్యేక షెడ్యూల్ రూపొందించుకున్నట్లు సమాచారం. కాగా ఇంటెలిజింట్, వినూత్న టెక్నిక్‌లకు నాయర్ పెట్టింది పేరు. దినేశ్ కార్తిక్, కేఎల్ రాహుల్ తదితర స్టార్ ప్లేయర్లు నాయర్ విధానాలు పాటించి కష్టకాలం నుంచి బయటపడ్డారు.ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అదే బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది. ఇక హిట్‌మ్యాన్ ప్రస్తుతం ఐపీఎల్-2025కి సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో అతడు ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. కాగా ముంబైకి ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించి.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ తన పేరిట చెక్కుచెదరని రికార్డును లిఖించుకున్నాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్.. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా?

ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
ఐపీఎల్-2025(IPL 2025) సీజన్ కోసం ముంబై ఇండియన్స్(Mumba Indians) తమ సన్నాహకాలను ప్రారంభించింది. వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో ముంబై ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆటగాళ్లు ఇప్పటికే ముంబై శిబిరంలో చేరారు. ఇక ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ మెనెజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.తమ జట్టు స్పిరిట్ కోచ్' గా బాలీవుడ్ ఐకాన్ జాకీ ష్రాఫ్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం నియమించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ముంబై సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ జట్టు ఆటగాళ్లలో ఉత్సాహాన్ని, పట్టుదల పెంచేందుకు ముంబై ఫ్రాంఛైజీ ఈ వినూత్న ఆలోచన చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఏ ఫ్రాంచైజీ కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈ ఏడాది సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతానైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ఐపీఎల్-2024లో గ్రూపు స్టేజికే పరిమితమైన ముంబై ఇండియన్స్.. ఈ ఏడాది సీజన్లో మాత్రం సత్తాచాటాలని భావిస్తోంది.భారీ షాక్.. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బమ్రా గాయం కారణంగా ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. అతడు కోలుకోవడానికి మరో నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌లో బుమ్రా ముంబై జట్టులో చేరనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.ఐపీఎల్-2025కు ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, అల్లా గజన్ఫర్, విల్ జాక్స్, అశ్వని కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టోప్లీ, క్రిష్ణన్ ష్రిజిత్, రాజ్ బవా, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, సీ బోచ్, విగ్నేష్ పుతుర్.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? Saans le lamba & shaanti coz 𝙅𝘼𝙂𝙂𝙐 𝘿𝘼𝘿𝘼 - aapla Spirit Coach is here! 🧘♂️😎#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/md5fnlJKX9— Mumbai Indians (@mipaltan) March 13, 2025

పాకిస్తాన్ క్రికెటర్లకు ఘోర అవమానం
పాకిస్తాన్ క్రికెటర్లకు ఘెర అవమానం జరిగింది. నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్ లీగ్ డ్రాఫ్ట్‌లో ఆ దేశానికి చెందిన ఒక్క క్రికెటర్ కూడా అమ్ముడుపోలేదు. మీడియా కథనం ప్రకారం హండ్రెడ్ లీగ్-2025 డ్రాఫ్ట్‌లో (వేలం) పాకిస్తాన్‌కు చెందిన 45 మంది పురుషులు, 5 మంది మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు. వీరిలో ఒక్కరిపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. గత సీజన్లో అత్యధిక ధర పలికిన పాక్ ఆటగాడు నసీం షాను ఈ సీజన్లో ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు. గత సీజన్లో మంచి ధర దక్కించుకున్న ఇమాద్ వసీం, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, మహ్మద్ హస్నైన్ను ఫ్రాంచైజీలు తిరస్కరించాయి. పాక్ ఆటగాళ్లకు ఈ గతి పట్టడానికి వారి ఫామ్‌లేమితో పాటు మరో కారణం కూడా ఉంది. ఈ ఏడాది హండ్రెడ్ లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టాయి. ఎనిమిదింట నాలుగు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు కొనుగోలు చేశారు. భారతీయ పెట్టుబడులు ఉండటం చేతనే హండ్రెడ్ ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదని టాక్ నడుస్తుంది. హండ్రెడ్ లీగ్‌లో పాక్ ఆటగాడు ఉసామా మిర్ అత్యధికంగా 13 మ్యాచ్‌లు ఆడాడు. హరీస్ రౌఫ్ 12, ఇమాద్ వసీం 10, మహ్మద్ అమిర్ 6, షాహీన్ అఫ్రిది 6, మహ్మద్ హస్నైన్ 5, జమాన్ ఖాన్ 5, షాదాబ్ ఖాన్ 3, వాహబ్ రియాజ్ 2 మ్యాచ్‌లు ఆడారు.బ్రేస్‌వెల్, నూర్ అహ్మద్‌కు జాక్పాట్హండ్రెడ్ లీగ్-2025 డ్రాఫ్ట్‌లో (వేలం) న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్, ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ జాక్‌పాట్ కొట్టారు. ఈ ఇద్దరు ఊహించని ధర 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. బ్రేస్‌వెల్‌ను గత సీజన్ రన్నరప్ సధరన్ బ్రేవ్ దక్కించుకోగా.. నూర్ అహ్మద్‌ను మాంచెస్టర్ ఒరిజినల్స్ సొంతం చేసుకుంది.డ్రాఫ్ట్‌లో బ్రేస్‌వెల్, నూర్ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ను లండన్ స్పిరిట్.. మరో ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లేను ట్రెంట్ రాకెట్స్ సొంతం చేసుకున్నాయి.నిన్నటి డ్రాఫ్ట్‌లో మరో మేజర్ సైనింగ్ ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. గతేడాది డ్రాఫ్ట్‌లో అమ్ముడుపోని వార్నర్‌ను ఈసారి లండన్ స్పిరిట్ 1.2 లక్షల పౌండ్లకు (రూ. 1.35 కోట్లు) సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్, ఛాంపియన్స్ ట్రోఫీ హీరో రచిన్ రవీంద్రను మాంచెస్టర్ ఒరిజినల్స్ ఇదే ధరకు (1.2 లక్షల పౌండ్లు) దక్కించుకుంది.ఈసారి డ్రాఫ్ట్‌కు అందుబాటులో ఉండిన ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు చుక్కెదురైంది. ఆండర్సన్‌ను డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.మహిళల డ్రాఫ్ట్ విషయానికొస్తే.. సోఫి డివైన్, జార్జియా వాల్, పెయిజ్ స్కోల్ఫీల్డ్ మంచి ధరలు దక్కించుకున్నారు. పురుషులు, మహిళల డ్రాఫ్ట్‌లో మొత్తం 66 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. ఈ డ్రాఫ్ట్ తర్వాత కూడా ఫ్రాంచైజీలకు వైల్డ్‌కార్డ్ డ్రాఫ్ట్ ద్వారా ప్లేయర్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ద హండ్రెడ్ లీగ్-2025 (పురుషులు, మహిళలు) ఆగస్ట్ 5 నుంచి ప్రారంభం కానుంది. లార్డ్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో లండన్ స్పిరిట్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ తలపడతాయి.
బిజినెస్

ఫోన్‌పే ఎంతమంది వాడుతున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: నమోదిత వినియోగదారుల సంఖ్య 60 కోట్లు దాటిందని ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే తెలిపింది. 4 కోట్ల మందికిపైగా వర్తకులు ఫోన్‌పే వేదికగా కస్టమర్ల నుంచి డిజిటల్ చెల్లింపులను అందుకుంటున్నారు.10 సంవత్సరాల ప్రయాణంలో కంపెనీ తన కార్యకలాపాలను వెల్త్ మేనేజ్మెంట్, పిన్‌కోడ్ ద్వారా ఈ–కామర్స్ రంగంలోకి ప్రవేశించింది. 2023లో జరిగిన చివరి నిధుల సమీకరణ రౌండ్లో కంపెనీని 12 బిలియన్ డాలర్లుగా విలువ కట్టారు.ఫోన్‌పే డిజిటల్ చెల్లింపుల యాప్ 2016 ఆగస్టులో ప్రారంభమైంది. 2024 మార్చి నాటికి సంస్థ ఖాతాలో నమోదిత వినియోగదారులు దాదాపు 53 కోట్ల మంది ఉన్నారు. ఫోన్‌పే రోజుకు 33 కోట్లకుపైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. వార్షికంగా వీటి మొత్తం చెల్లింపుల విలువ రూ.150 లక్షల కోట్లకుపైగా ఉంటుందని సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా

భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు ఇలా..
మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఎలాన్‌మస్క్ ఆధ్వర్యంలోని స్టార్‌లింక్(Starlink) భారత్‌లో ప్రవేశించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే భారత టెలికాం విభాగానికి అనుమతి పత్రాలను దాఖలు చేసింది. ప్రస్తుతం అవి పరిశీలనలో ఉన్నాయి. కేంద్రం షరతులను సంస్థ ప్రతినిధులు అంగీకరించడంతో భారత్‌లోకి మార్గం సుగమం అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన టాప్ టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, జియో ఆ కంపెనీతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే సామాన్యులకు స్టార్‌లింక్ ఏమేరకు ప్లాన్లను తీసుకొస్తుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కంపెనీ భూటాన్, అమెరికా వంటి దేశాల్లో సర్వీసులు అందిస్తోంది. ఆయా దేశాల్లో ఇంటర్నెట్ ఛార్జీలను అనుసరించి భారత్‌లో రేట్లు ఎలా ఉండవచ్చో నిపుణులు అంచనా వేస్తున్నారు.యూఎస్‌లో ఛార్జీలు ఇలా..స్టార్‌లింక్ యూఎస్‌లో రెసిడెన్షియల్ విభాగంలో నెలకు రూ.6,976 నుంచి ప్లాన్లు అందిస్తోంది. కేబుల్ నెట్‌వర్క్‌కు ఎలాగైతే రూటర్ కొనుగోలు చేస్తామో.. అలాగే శాటిలైట్ సేవల కోసం కూడా పరికరాలకు ఒకసారి చెల్లించాల్సిన సొమ్ము అదనం. యూఎస్‌లో స్టాండర్డ్ ఎక్విప్మెంట్ కిట్ ధర రూ.30,443గా ఉంది.ఇక మొబైల్ సేవలు కావాల్సినవారు నెలకు కనీసం రూ.4,360 చెల్లించాల్సి ఉంటుంది. డేటా అపరిమితంగా అందుకోవచ్చు. 220 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ ఆఫర్ చేస్తోంది.రెసిడెన్షియల్ లైట్, రెసిడెన్షియల్ ప్లాన్లలో కూడా వినియోగదారులు అపరిమిత డేటాను అందుకోవచ్చు.రోమింగ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులు దేశవ్యాప్తంగా, ప్రయాణంలో, అంతర్జాతీయ ప్రయాణ సమయంలో కూడా వినియోగం, తీర ప్రాంతాల్లో కవరేజీ పొందవచ్చు. బిజినెస్ విభాగంలో నెలకు రూ.12,208 నుంచి రూ.4,36,000 వరకు ప్లాన్స్ ఉన్నాయి.భూటాన్‌లో ఇలా..ఇక భూటాన్‌లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ కింద స్టార్‌లింక్ నెలకు రూ.3,000 చార్జీ చేస్తోంది. ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ 23–100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఆఫర్ చేస్తోంది. ఊక్లా నివేదిక ప్రకారం స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగం యూరప్‌లోని హంగరీలో అక్టోబర్–డిసెంబర్ కాలంలో గరిష్టంగా 135.11, కనిష్టంగా సైప్రస్‌లో 36.52 ఎంబీపీఎస్ నమోదైంది.మనదగ్గర ఇప్పటివరకు ఇలా..శాటిలైట్ ఇంటర్నెట్ చార్జీలతో పోలిస్తే మన దేశంలో మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ చాలా చవక. అటూ ఇటూగా రూ.20 చెల్లిస్తే ఒక జీబీ డేటా అందుకోవచ్చు. సుమారు రూ.50 నుంచి అన్లిమిటెడ్ ప్యాక్స్ లభిస్తాయి. హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి ఉన్నాయి. హై–ఎండ్ ప్లాన్ అయితే నెలకు రూ.4,000 వరకు ఉంది. దీనిలో 10 జీబీపీఎస్ వరకు వేగం, అన్ని ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ కూడా అందుతుంది. రూటర్‌కు అయ్యే వ్యయమూ తక్కువే. శాటిలైట్ టెలికం కేవలం ఇంటర్నెట్కే పరిమితం. కాల్స్ చేయాలంటే ఓటీటీ యాప్స్‌పైన ఆధారపడాల్సిందే.ఇండియాలో స్టార్‌లింక్ ఛార్జీలపై అంచనాలు..స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం అవసరమయ్యే హార్డ్‌వేర్‌కు ప్రస్తుతం రూ.25,000-రూ.35,000 మధ్య ఖర్చు అవుతుంది. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.5,000-రూ.7,000గా అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీట్ 25-220 ఎంబీపీఎస్ ఉంటుందని చెబుతున్నారు. ఆ ధర భారతదేశం సగటు బ్రాండ్‌బ్యాండ్ వ్యయం నెలకు రూ.700-రూ.1,500 కంటే చాలా ఎక్కువ. బ్రాండ్‌బ్యాండ్ పోటీదారులకు ధీటుగా విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ఎక్స్ భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: పదేళ్లలో 10 లక్షల స్టార్టప్లుస్టార్లింక్ ప్రత్యేకతలు ఇవీ..లోఎర్త్ ఆర్టిట్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందిస్తారు. ఇందుకోసం స్పేస్ఎక్స్ ఉపగ్రహాలను వినియోగిస్తున్నారు.కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలు: సుమారు 7,000శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తున్న దేశాలు: 100కుపైగావినియోగదారులు: సుమారు 50 లక్షలు (2024 డిసెంబర్ చివరినాటికి) అమెరికాలో దిగ్గజ బ్రాండ్‌బ్యాండ్ కంపెనీలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పోటీనిస్తోంది.రూరల్ కనెక్టివిటీ: మారుమూల ప్రాంతాలు, పల్లెలకు వేగంగా ఇంటర్నెట్ అందిస్తోంది. విద్య, ఆరోగ్య సేవలు, ఈ–కామర్స్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.భారత్‌లో పోటీ: దేశంలో 94.5 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఉన్నారు. అందులో 90.4 కోట్ల మంది వైర్లెస్/మొబైల్ ఇంటర్నెట్ను వాడుతున్నారు.

రూ. 20వేల కంటే తక్కువ ధరలో.. ఇవిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్
మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కథనంలో రూ.20,000 కంటే తక్కువ ధరలో లభించే ఐదు బెస్ట్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం..నథింగ్ సీఎమ్ఎఫ్ ఫోన్ 1మార్కెట్లో తక్కువ ధరకు లభించే ఫోన్లలో 'నథింగ్ సీఎమ్ఎఫ్ ఫోన్ 1' ఒకటి. ఇది రంగు రంగుల బ్యాక్ ప్యానెల్లను కలిగి ఉండటం వల్ల, మీకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు. దీనిని మరింత అందంగా డిజైన్ చేసుకోవడానికి కంపెనీ కొన్ని యాక్సెసరీస్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 15499 మాత్రమే. కెమెరా సెటప్, డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి.రియల్మీ నార్జో 70 టర్బోసాధారణ ఉపయోగం కోసం మాత్రమే కాకుండా.. గేమింగ్ కోసం కూడా ఉపయోగపడే ఫోన్ 'రియల్మీ నార్జో 70 టర్బో'. దీని ధర రూ. 14,999. ఇది డ్యూయెల్ టోన్ బ్లాక్ ప్యానెల్.. ప్రీమియం అండ్ స్పోర్టీ అప్పీల్ ఇస్తుంది. చదరంగం ఆకారంలో ఉండే కెమెరా సెటప్ కూడా అకార్షణీయంగా ఉంటుంది. ఇందులో డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ ఉంటుంది.టెక్నో పోవా 6 ప్రోరూ. 20వేలు కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్లలో.. టెక్నో పోవా 6 ప్రో ఒకటి. దీని ధర రూ. 19999. ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్స్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ గొప్ప గేమింగ్ ఫోన్ కాదు, కానీ ఇందులోని డైమెన్సిటీ 6080 చిప్సెట్ కొంతవరకు గేమ్‌లకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా పొందుతుంది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసాలావా బ్లేజ్ డుయోరూ.16,999 ధర వద్ద లభించే ఈ స్మార్ట్‌ఫోన్.. సెకండరీ డిస్ప్లేతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఫీచర్ కలిగి సరసమైన ధరకు లభించే ఫోన్లలో ఇది బెస్ట్ మోడల్. ముందు నుంచి చూస్తే.. లావా బ్లేజ్ డుయో ఏ హై-ఎండ్ మాదిరిగా కనిపిస్తుంది. ఇది స్లిమ్ బెజెల్స్‌తో కూడిన 3D కర్వ్డ్ డిస్ప్లే పొందుతుంది. ఇది కూడా అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రోఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో అనేది రూ. 20వేల కంటే కొంత ఎక్కువ ధర వద్ద లభిస్తుంది. ఇది డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్, 8GB/12GB RAM, 256GB స్టోరేజ్ వంటి ఆప్షన్స్ పొందుతుంది. దీని ఫ్లాట్ డిస్ప్లే గేమర్లకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇది 5000 mAh బ్యాటరీ పొందుతుంది. ఈ ఫోన్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో సహా వివిధ యాక్సెసరీలకు కూడా సపోర్ట్ చేస్తుంది.

పదేళ్లలో 10 లక్షల స్టార్టప్‌లు
దేశంలో రానున్న పదేళ్లలో 10 లక్షల స్టార్టప్‌లు పుట్టుకొస్తాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని అంచనా వేశారు. భారతదేశ వ్యవస్థాపక భవిష్యత్తు(entrepreneurial future) ప్రతిష్టాత్మకంగా ఉంటుందని చెప్పారు. ‘ఆర్‌కామ్ వెంచర్స్ వార్షిక సమావేశం 2025’లో నీలేకని మాట్లాడారు. రానున్న రోజుల్లో స్టార్టప్‌లు సాంకేతికత, మూలధనం, ఆంత్రపెన్యూర్‌షిప్, ఫార్మలైజేషన్ వంటి అంశాలతో వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.ప్రస్తుతం భారత్‌లో 1,50,000 స్టార్టప్‌లు ఉన్నాయని, ఈ రంగంలో 20 శాతం వార్షిక వృద్ధి రేటు ఉంటుందని నీలేకని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న స్టార్టప్‌లు భవిష్యత్తులో మరిన్ని స్టార్టప్‌ల సృష్టికి ఊతమిచ్చేలా ‘బైనరీ విచ్ఛిత్తి(ఒకటి రెండుగా మారడం)’ని పోలి ఉంటాయని చెప్పారు. అందుకు ఉదాహరణగా ఫ్లిప్‌కార్ట్‌ను చెప్పుకొచ్చారు. ఫ్లిప్‌కార్ట్ వంటి విజయవంతమైన కంపెనీల నుంచి ఉద్యోగులు తమ సొంత సంస్థలను స్థాపించినట్లు గుర్తు చేశారు.భాషలు, మాండలికాలకు ఏఐ నమూనాలుఈ వృద్ధికి దోహదపడటంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాత్ర కీలకంగా మారిందని నీలేకని నొక్కి చెప్పారు. ఆధార్, యూసీఐ వంటి కార్యక్రమాలు ఇప్పటికే బలమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పునాది వేశాయని తెలిపారు. భారతీయ భాషలు, ప్రాంతీయ మాండలికాలకు అనుగుణంగా ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాల అవసరాన్ని ఉద్ఘాటించారు. ఇవి సాంకేతిక పరిజ్ఞానం విభాగంలో మరిన్ని అవకాశాలు సృష్టిస్తాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్ కోఫౌండర్ కొత్త కంపెనీ ప్రారంభంఅత్యంత ఆదరణ కలిగే ఐపీఓ మార్కెట్‌గా భారత్2035 నాటికి భారత్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగే ఐపీఓ మార్కెట్‌గా అవతరిస్తుందని, రెండో అతిపెద్ద ఐపీవో మార్కెట్‌గా భారత్ ప్రస్తుత స్థానాన్ని అధిగమిస్తుందని నీలేకని తెలిపారు. ఈ మార్పు భవిష్యత్తులో గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. ఇది ఉద్యోగాల సృష్టిని వేగవంతం చేస్తుందని, సమీప భవిష్యత్తులో ఎనిమిది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే దేశం లక్ష్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
ఫ్యామిలీ

సుర్రుమంటున్న సూర్యుడు.. డీహైడ్రేషన్ బారినపడకూడదంటే..!
ఎండాకాలం మొదలైంది. మార్చి రెండోవారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గతేడాది 47 నుంచి 49 డిగ్రీల సెల్సీయస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా అదేస్థాయిలో మండే ఎండలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఎలాంటి వైద్య సేవలు పొందాలి? తదితర అంశాలను గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీంనగర్ జిల్లా వైద్య అధికారి(డీఎంహెచ్‌వో) వెంకటరమణ వివరించారు.వేసవిలో ఎలాంటి రక్షణ పొందాలి?డీఎంహెచ్‌వో: ఎండ ఎక్కువగా ఉండే 11 నుంచి 3 గంటల మధ్య సమయంలో బయటికి వెళ్లకుండా ఉండడం మంచింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా రుమాలు పెట్టుకుని, తెల్లని దుస్తులు ధరించాలి. రేకులషెడ్లలో నివాసముండే వారు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. రేకులపై గడ్డి, గోనె సంచులను వేసుకొని నీళ్లు చల్లాలి.రోజూ ఎన్ని నీళ్లు తాగాలి? డీఎంహెచ్‌వో: ఎండాకాలంలో నీటిశాతం లోపంవల్ల శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. శరీరంలో శక్తి తగ్గి అలసట కలుగుతుంది. ప్రతీ రోజు 8నుంచి 10గ్లాసుల నీరు తాగాలి. ముఖ్యంగా ప్రయాణం లేదా బయట పనులున్నప్పుడు నీరు తాగడం మరిచిపోవద్దు. అది కూడా సురక్షితమైన నీటిని తీసుకోవాలి.ఆహారం విషయంలో జాగ్రత్తలు?డీఎంహెచ్‌వో: ఎండాకాలంలో మిగిలిన ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. ప్రతీరోజూ తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్, బిర్యానీలు, మసాలాలతో తయారు చేసే ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. మజ్జిగ, ఓఆర్ఎస్, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి.శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు ఏం చేయాలి? డీఎంహెచ్‌వో: శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు, బట్టలు తీసేసి చల్లటి నీటితో ముఖం, చేతులు, కాళ్లు తుడవాలి. గాలి ఆడే స్థలంలో విశ్రాంతి తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.ఆస్పత్రుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీఎంహెచ్‌వో: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. డీహైడ్రేషన్ జరగకుండా ఉండేందుకు 2 లక్షల ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాం. అంగన్వాడీ కేంద్రాల్లో, ఉపాధిహామీ కూలీలకు పనిస్థలాల్లోనూ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైనా వాడుకోవచ్చు.గతేడాది వడదెబ్బ మరణాలు సంభవించాయా? డీఎంహెచ్‌వో: గతేడాది జిల్లాలో ఇద్దరు వడదెబ్బ కారణంగా మరణించారు. వడదెబ్బతో మరణించినట్లు నిర్ధారించేందుకు త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశాం. ఇందులో మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్, పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ సభ్యులుగా ఉంటారు. వీరి ద్వారా వడదెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారణ జరిగితే ప్రభుత్వం నుంచి కలెక్టర్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.గర్భిణులు, పిల్లలు, వృద్ధులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? డీఎంహెచ్‌వో: గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలికవ్యాధులతో బాధపడే వారు హైరిస్క్ గ్రూపులో ఉంటారు. వీరు ఎండలో ఎక్కువ సమయం ఉండొద్దు. ముఖ్యంగా గర్భిణులు డెలివరీకి ముందే ప్లాన్ చేసుకొని ఆసుపత్రికి చేరుకోవాలి. పిల్లలు, వృద్ధులు, బీపీ, షుగర్, కేన్సర్ తదితర వ్యాధులతో బాధపడేవారు ఎండలో తిరిగే సాహసం చేయవద్దు.డీహైడ్రేషన్ అయితే ఏం చేయాలి?డీఎంహెచ్‌వో: డీహైడ్రేషన్ అయితే రీహైడ్రేషన్‌తో చెక్ పెట్టాలి. ఎవరైనా డీహైడ్రేషన్‌కు గురైన వెంటనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఉప్పునిమ్మకాయ కలిపిన నీరు తాగించాలి. ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. (చదవండి: ఆ చెఫ్ చేతులు అద్భుతం చేశాయి..! వావ్ బంగాళదుంపతో ఇలా కూడా..)

Holi 2025 : ఎపుడూ వైట్ డ్రెస్సేనా? కలర్ ఫుల్‌గా, ట్రెండీగా.. ఇలా!
హోలీ (Holi) అంటే.. రంగుల రాజ్యం. ఆద్యంతం హుషారుగా సాగే ఏకైక పండుగ ఇదేనేమో.. డ్యాన్స్, మ్యూజిక్, విందు వినోదాల కలయికగా సాగే ఈ పండుగ సందర్భంగా అనుసరించే ఫ్యాషన్ కూడా కలర్ఫుల్గా ఉండాలి కదా.. కాబట్టి కలర్ ఫెస్ట్‌లో ప్రత్యేకంగా కనబడేందుకు తాను చెప్పే స్టైల్స్‌తో లుక్‌ని కొత్త లెవల్‌కి తీసుకెళ్లండి అని సూచిస్తున్నారు నగరానికి చెందిన ఫ్యాషన్ కన్సెల్టెంట్ సుమన్ కృష్ణ. ఈ ఏడాది ఆరంభం నుంచి ట్రెండింగ్‌లో ఉన్న కలర్.. బ్లాక్‌ని సెంటరాఫ్ ఫ్యాషన్‌గా చేసి హోలీ వేడుకలో త‘లుక్’మనవచ్చని అంటున్నారామె. ఆమె అందిస్తున్న విశేషాలు, సూచనలివీ.. – సాక్షి, సిటీబ్యూరో కలర్ బ్లాకింగ్ అంటే..? ఇది విభిన్న, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ స్టైల్. మామూలు వైట్ కుర్తా బోరింగ్‌గా ఉంటుంది. సో.. ట్రెండీ కలర్ కాంబినేషన్లతో లుక్‌కి ఎక్స్ట్రా గ్లామర్ వస్తుంది.. ఒకే షేడ్‌లో ఉండే డ్రెస్సింగ్ కంటే, రెండు లేదా మూడింటికి పైగా బ్రైట్ కలర్స్ మిక్స్ చేసి ధరించడం ద్వారా మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు. కొన్ని కలర్ కాంబినేషన్స్.. ధరించే దుస్తుల మధ్య సరైన కలర్ కాంబినేషన్ చాలా కీలకం. పింక్–ఆరేంజ్ హోలీకి చాలా ఎనర్జిటిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలాగే..ఎల్లో–పర్పుల్ వంటి బ్రైట్ షేడ్స్ ట్రెడిషనల్ హోలీ లుక్‌కి సరైన ఎంపిక. అంతేకాకుండా బ్లూ–రెడ్ కూడా ట్రెండీ లుక్ అందిస్తాయి. వైట్–రేసింగ్ గ్రీన్‌లు క్లాసిక్‌గా కనపడాలంటే బెస్ట్. పీచ్‌లను సున్నితమైన, పండుగ కళ తెచ్చే కలర్స్‌గా పేర్కొనవచ్చు.స్టైల్–కంఫర్ట్ రెండింటి మేళవింపులా ఇంపుగా అనిపించాలంటే, కాటన్ లేదా లినెన్ ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవడం మంచిది. బ్రైట్ టాప్ + లైట్ బాటమ్ – లేదా ఆపోజిట్ కలర్ బ్లాక్ డ్రెస్సింగ్ ట్రై చేయవచ్చు. బాగీ/లూజ్ కుర్తాస్, ఫ్యూజన్ ధోతి ప్యాంట్స్ హోలీ మూడ్‌కి సరిగ్గా సరిపోతాయి. హోలీ డాన్స్‌లో ఫుల్ ఫన్ కోసం బెస్ట్ ఆప్షన్‌గా పాదాలకు స్నీకర్స్ బెస్ట్. సన్‌గ్లాసెస్, వాటర్ ప్రూఫ్ మేకప్ – హోలీ ఎఫెక్ట్స్ స్టైలిష్‌గా హ్యాండిల్ చేయండి. ఇలా చేయొద్దు.. పూర్తిగా వైట్ డ్రెస్సింగ్ వద్దు. దీనివల్ల రంగుల మిక్స్ తక్కువగా కనిపిస్తుంది. హెవీ మెటీరియల్స్, సిల్క్ ధరిస్తే అన్ ఈజీగా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే కాళ్లకు హీల్స్ ధరిస్తే జారిపడే చాన్స్ ఎక్కువ. మేకప్, హెయిర్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్లడం పెద్ద పొరపాటు అవుతుంది.ఫైనల్ టచ్.. ఈ హోలీలో బ్లాక్ కలర్‌తో మ్యాజిక్ ట్రై చేయవచ్చు. ఫొటోలు మరింత ట్రెండీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఈ హోలీ జ్ఞాపకాలతో ఆనందాన్ని ఏడాది పాటు కొనసాగించవచ్చు.

ప్రతి పురుషుని విజయం వెనుక ఓ స్త్రీ శక్తి..!
మన పురాణాలలో స్త్రీని శక్తి స్వరూపిణిగా వర్ణిస్తారు. ఒక స్త్రీ శక్తి స్వరూపిణిగా ఉంటూ చుట్టూ అందరి చేత గౌరవింప బడితే అక్కడ దేవతలు నివసిస్తారు అంటారు. అయితే ఆమె శక్తి ఏమిటి? ఆ శక్తికి ఏమైనా కొలమానం ఉందా? అది ఏ విధమైన శక్తి? ఎలా పని చేస్తుంది? ఇటువంటి ప్రశ్నలన్నింటికీ మాతాజీ నిర్మలా దేవి బోధనలలో మనకు సరైన సమాధానం లభిస్తుంది.మన ఇతిహాసాలలో శ్రీ రాముని శక్తి సీత. శివుని శక్తి పార్వతి. శ్రీ కృష్ణుడి శక్తి రాధ. ఈ శక్తులు రాక్షస సంహారం కోసం కానీ యుద్ధం చేయడానికి కానీ రణరంగానికి వెళ్ళలేదు. శ్రీ కృష్ణుడు లేదా శ్రీ రాముడే యుద్ధం చేశారు. కానీ వారి శక్తి ప్రభావం వారి చేత యుద్ధం చేయించింది. దీని గురించి మాతాజీ నిర్మలా దేవి ఎలా వివరిస్తారు అంటే పురుషులది గతి శక్తి... స్త్రీలది స్థితి శక్తి. ఉదాహరణకు స్విచ్ వేసినప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. మనకు బయటకు చూడడానికి ఫ్యాన్ తిరుగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ నిజానికి దానిని తిప్పుతున్నది దాని లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తి. అదే విధంగా పురుషులు బయటకు పనులు చేస్తున్నట్లు కనిపించినా వారి చేత ఆ పనులు చేయించే శక్తి మాత్రం స్త్రీల శక్తియే. అందుకే స్త్రీని శక్తి స్వరూపిణి అంటారు.ఆసక్తికరమైన విషయమేమిటంటే జీవశాస్త్రం ప్రకారం కణంలో ఉండే శక్తి కేంద్రాన్ని మైటోకాండ్రియా అంటారు. ఈ మైటోకాండ్రియా మానవులలో ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించేటప్పుడు తల్లి నుండే లభిస్తుంది. అంటే ప్రతీ మానవునికి శక్తి తల్లి నుండే లభిస్తుంది. కావున సైన్సు ప్రకారం కూడా శక్తికి మూలం స్త్రీ యే. ఈ తల్లులందరికీ మూలమైన తల్లిని హిందూ ధర్మంలో ఆదిశక్తి అని పిలుస్తారు. ఆమెనే గ్రీకులు అథెనా అనే దేవతగా కొలుస్తారు.శక్తి అంటే మొత్తం అన్ని శక్తులు అని, ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి అని కాదు. ఈ శక్తులన్నీ మన సూక్ష్మ శరీరంలో షట్చక్రాలన్నింటిపై ఉంటాయి. ఈ శక్తులు లేకుండా దేవతల ఏ పనీ జరగదు. ఉదాహరణకు శ్రీ కృష్ణుడి శక్తి శ్రీ రాధ, శ్రీ రాముడి శక్తి శ్రీ సీత; శ్రీ మహా విష్ణువు శక్తి శ్రీ లక్ష్మి. అదేవిధంగా శక్తులన్నింటి నివాసం దేవతలతో ఉంటుంది. శక్తి లేకుండా దేవతలు ఏమీ చేయలేరు. ఆ మొత్తం శక్తి అంతా శ్రీ జగదాంబగా మన మధ్య హృదయ చక్రంలో ఉంటుంది. ఈ జగదాంబ శక్తి చాలా ప్రబలమైనది. శక్తి ఆరాధన అంటే అందరు దేవతల అన్ని శక్తులకు పూజ జరుగుతుంది. ఈ శక్తులు చెడి΄ోవడం వలన మన చక్రాలు దెబ్బతింటాయి. అందువల్ల మనకు శారీరక, మానసిక, భావోద్వేగ పరమైన సమస్యలన్నీ వస్తాయి. అందుకే ఈ శక్తులను ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంచుకోవడం ముఖ్యం. అందుకే దేవిని ప్రసన్నం చేసుకోవాలని అంటుంటారు. సహజ యోగ సాధన ద్వారా మన సూక్ష్మ శరీరంలో కుండలినీ శక్తి ని మేల్కొలపడం వలన ఈ శక్తి మరొక శక్తిని పొందుతుంది. ఈ శక్తులలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అవి ఆది శక్తి యొక్క సర్వవ్యాప్త శక్తి అయిన పరమ చైతన్యంతో ఏకమవుతాయి. ఆ విధంగా ఏకమవ్వడం వలన ఆ శక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. ఈ చిన్న చిన్న శక్తులన్నీ ఆ శక్తితో కలిసిపోతాయి. ఉదాహరణకు, మీ హృదయ శక్తి బలహీనంగా ఉంటే, అది పరమ చైతన్యంతో అనుసంధానించబడినప్పుడు, ఈ బలహీనమైన శక్తి తిరిగి బలాన్ని పొందుతుంది. ఆ సందేశం అన్ని శక్తులకు చేరుతుంది, ఇప్పుడు ఈ శక్తి బలాన్ని పొందింది కాబట్టి చింతించాల్సిన పనిలేదు అని. శక్తి స్వభావం స్త్రీ స్వభావం కాబట్టి స్త్రీని గౌరవించడం, గృహిణిని గృహలక్ష్మిగా చూడడమనేది పురుషులు నేర్చుకోవలసిన చాలా ముఖ్యమైన విషయం.స్త్రీలు తమ భర్తను, పిల్లలను గృహ సంబంధ కార్యాలను చూసుకోవాలి. కానీ భర్తకు బయటి కార్యాలకు సంబంధించి, సంపాదన, ఆర్థిక వ్యవహారాలు లాంటి అనేక పనులు ఉంటాయి కాబట్టి. అదే విధంగా పురుషులు కూడా భార్యను బాగా చూసుకోవడం చాలా ముఖ్యం. భార్యను ఒక దేవిలా, తన గృహశక్తిలా చూడడం భర్త బాధ్యత. భార్యతో అతని అనుబంధం ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడే ఆ గృహం స్వర్గసీమ అవుతుంది.– డా. పి. రాకేష్(పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవిప్రవచనాల ఆధారంగా)

ఉభయ దేవతా పుణ్యక్షేత్రం సింగరకొండ..!
ఆంద్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అద్దంకికి చేరువలో ఉన్న పుణ్యక్షేత్రం సింగరకొండలో లక్ష్మీనరసింహస్వామి క్షేత్రపతిగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రపాలకునిగా పూజలు అందుకుంటున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ల ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో అత్యంత వైభవంగా జరుపుతారు. ప్రస్తుతం 70వ తిరునాళ్ల మహోత్సవాలు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి, బుధవారం ఆరంభం అయ్యాయి.ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. శింగరకొండ అద్దంకి నుంచి 6 కి.మీ. దూరంలో భవనాసి చెరువు ఒడ్డున ఉంది. మొదట్లో సింగనకొండ అని పిలిచిన నరసింహ క్షేత్రం తర్వాత తర్వాత సింగరకొండ ఆంజనేయ స్వామి క్షేత్రం గానే ప్రఖ్యాతి గాంచింది. సింగరకొండపై లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉండగా కొండ దిగువన చెరువు ఒడ్డున ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంది. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే భూతప్రేత పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని స్థానికులు చెబుతారు. ఇక కొండ దిగువన ఉన్న ప్రసన్నాంజనేయ స్వామికి స్థల పురాణం ఉంది. తమ తల్లి కోసం వెతుకుతూ దక్షిణాపథం బయలుదేరిన ఆంజనేయుడు, ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నారని నమ్మకం. అందుకే ఇక్కడ ఆంజనేయుడు దక్షిణాముఖుడై కనపడతాడు. అద్దంకి తాతాచార్యులు అనే గొప్ప భక్తుడు సింగరకొండలో కొండపై గల నరసింహ స్వామి గుడియందు ధ్వజారోహణ చేస్తుండగా, కొండకింద ఒక దివ్యపురుషుడు ఒక ఆంజనేయ విగ్రహానికి హారతి ఇస్తూ కనిపించడంతో పరుగు పరుగున కిందికి వెళ్లగా తాతాచార్యుల వారికి ఆ పురుషుడు మాయం అయ్యాడు. దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయ విగ్రహం కనపడింది.అలా మహర్షి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని తాతాచార్యులతోబాటు కొండమీద ఆలయ పనిలో ఉన్నవారెందరో చూశారు. వాళ్ళు కొండ దిగి వచ్చి చూసేసరికి ఆ పుణ్యమూర్తి కనిపించలేదు. మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహోజ్వలంగా వెలిగిపోతూ కనిపించింది. దాంతో ఆ గ్రామస్తులు, చుట్టుపక్కలవారు కలిసి, లక్ష్మీ నసింహ దేవాలయ నిర్మాణం పూర్తయ్యాక కొండ దిగువన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా కట్టించారు. సమీప దర్శనీయ ఆలయాలు: అయ్యప్పస్వామివారి ఆలయం, షిర్డీ సాయిబాబావారి ఆలయం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం, శ్రీ గాయత్రీ మాత ఆలయం, కొండపై నెలకొని ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం, శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం చూడదగ్గవి. వసతి: సింగరకొండలో వసతి పొందాలనుకునేవారు దేవస్థానం ఏర్పాటు చేసిన కాటేజీలలో బస చేయవచ్చు. కనుక ఇక్కడికి వచ్చే యాత్రికులు మారుతి భవన్లో వసతి ΄పొందవచ్చు. తక్కువ ధరకే అద్దెకు లభిస్తుంది. ఈ భవన్ రెండు అంతస్తుల సముదాయం.ఎలా చేరుకోవాలంటే..?హైదరాబాద్ నుంచి 290 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 110 కిలోమీటర్లు, ఒంగోలు నుంచి 36 కిలోమీటర్లు, అద్దంకి నుంచి 5 కిలోమీటర్ల దూరం.విమాన మార్గం ద్వారా: సమీప విమానాశ్రయం విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్. అక్కడ దిగి క్యాబ్ లేదా టాక్సీలలో సింగరకొండ చేరుకోవచ్చు.రైలు మార్గం: ఒంగోలు రైల్వేస్టేషన్ సమీ΄ాన ఉంది. హైదరాబాద్, విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ళన్నీ ఒంగోలు స్టేషన్లో ఆగుతాయి.రోడ్డు/ బస్సు మార్గం: సమీప బస్ స్టాప్ – అద్దంకి. హైదరాబాద్, విజయవాడ, ప్రకాశం నుంచి అద్దంకికి బస్సులు ఉన్నాయి. ఒంగోలు నుంచి: బస్సు ప్రయాణీకులు అద్దంకి వెళ్లే బస్సు ఎక్కాలి. అద్దంకి నుంచి సింగరకొండకు ప్రతి అరగంటకీ బస్సులు ఉన్నాయి. సింగరకొండ తిరునాళ్లగా ప్రసిద్ధికెక్కిన ఈ తిరునాళ్లు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి హోలీపూర్ణిమ వరకు మూడురోజులపాటు జరుగుతాయి. ఇరువురు స్వాములకూ విశేష పూజలు జరుగుతాయి. ( చదవండి: 'మిల్లెట్ కేక్' తయారీతో కోట్ల రూపాయల టర్నోవర్..! మోదీ ప్రశంసతో ఒక్కసారిగా..)
ఫొటోలు
International View all

ఎవరూ సురక్షితంగా లేరు.. జీ7 దేశాలకు కెనడా హెచ్చరిక..
వాణిజ్య యుద్ధ భయాలు జి-7 దేశాలను వెంటాడుతున్నాయి.

Holi 2025: ఈ దేశాల్లోనూ అంబరాన్నంటే హోలీ వేడుకలు
రంగుల పండుగ హోలీని దేశవ్యాప్తంగా మార్చి 14న జరుపుకోనున్నారు.

Brazil: పర్యావరణ సదస్సు కోసం చెట్ల నరికివేత!!
బ్రెజిల్లో ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే ప్రపంచ వాతావరణ సదస్సు(2025 United Nat

Balochistan: జిన్నా చేసిన ద్రోహమే.. పాక్‌కు ముప్పుగా మారిందా?
ఖనిజ సంపద అధికంగా ఉన్న బలూచిస్తాన్(

అమెరికాకు పుతిన్ డిమాండ్స్.. రష్యాకు ట్రంప్ సీరియస్ వార్నింగ్
వాష్టింగన్/మాస్కో: ఉక్రెయిన్-రష్యా కాల్పుల విరమణ ఒప్పందంలో
National View all

ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడే.. ఈ రూపాయి (₹) సింబల్‌ను డిజైన్ చేసింది..
ఢిల్లీ: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాష సూత్ర

ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్.. పేపర్ లీకేజీలపై రాహుల్ ట్వీట్
ఢిల్లీ: ప్రశ్నాపత్రాల లీకేజీలను వ్యవస్థాగత వైఫల్యంగా కాంగ్రె

‘స్వార్గేట్’ కేసు : నిందితుడి పోలీసు కస్టడీ పొడిగింపు
‘స్వార్గేట్’అత్యాచారం కేసు నిందితుడికి కోర్టు మార్చి 26 వరకు పోలీసు కస్టడీ విధించింది.

రూపాయి చిహ్నం మార్చేసిన తమిళనాడు ప్రభుత్వం
జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు - కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరుగుతోంది.

నిర్మలమ్మ వ్యాఖ్యలకు విజయ్ కౌంటర్
చెన్నై: ద్రవిడ ఉద్యమ నేత, తమిళ సామాజికవేత్త పెరియార్‌పై కేంద
NRI View all

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!
ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

సుదీక్ష మిస్సింగ్.. కిడ్నాపైందా?
న్యూఢిల్లీ: కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్లో తెలుగు వి

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస
క్రైమ్

Ameerpet: అరిష్టాలు తొలగిపోతాయని ఆలయంలో చోరీ
హైదరాబాద్: అరిష్టాలు తొలగిపోతాయని గుడిలో పంచలోహ విగ్రహాలు దొంగిలించిన ఇద్దరు మహిళలను ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దొంగతనం చేసిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎస్ఆర్నగర్ సమీపంలోని గురుమూర్తినగర్‌లో శ్రీ వినాయక ఆలయం గర్భగుడిలో శివపార్వతుల పంచలోహ విగ్రహాలు కనిపించడం లేదంటూ ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. శనివారం భక్తుల రూపంలో వచ్చిన మహిళలు తమ మాయమాటలతో అర్చకుడిని బోల్తా కొట్టించి విగ్రహాలు ఎత్తుకుళ్లినట్లు గుర్తించారు. బంజారాహిల్స్ ఎన్బీటీనగర్కు చెందిన స్వర్ణలత, పావని అనే మహిళలు ఆలయానికి వచ్చిన..అర్చకుడు నవీన్‌కుమార్ తీర్థ ప్రసాదాలు పంచి పెడుతుండగా అదును చూసి విగ్రహాలను ఓ సంచిలో వేసుకుని పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత అర్చకుడిని విగ్రహాలు కనిపించక పోవడంతో అధికారులకు సమాచారం అందించారు. గడిచిన రెండేళ్ల కాలంలో స్వర్ణలతో ఇంట్లో వరుసగా నలుగురు మరణించారు. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులు చనిపోవడంతో అరిష్టం వల్లే మృతి చెందారని భావించింది. నిత్యం పూజలందుకునే మహిమాని్వతులైన దేవుళ్ల విగ్రహాలను ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని, సకల శుభాలు జరుగుతాయని నమ్మింది. పావనికి విషయాన్ని చెప్పి పథకం ప్రకారం ఇద్దరు విగ్రహాలను దొంగిలించినట్లు విచారణలో అంగీకరించారు. వారిద్దరికి ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు. విగ్రహాలను స్వా«దీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

సారీ మమ్మీ.. జీవితంలో ఇంకో స్టెప్ తీసుకోలేను..
మంచిర్యాల: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల మేరకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే 6 హట్స్ ఏరియాకు చెందిన మేరుగు సౌమ్య (22)కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. యువతి తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందగా తల్లి కీర్తనతో కలిసి ఉంటుంది. సోమవారం సాయంత్రం కీర్తన సంతకు వెళ్లిన సమయంలో సూసైడ్ నోట్ రాసి ఇంటి పైకప్పుకు ఉరేసుకుంది. తనకు పెళ్లంటే ఇష్టం లేదని, జీవితంలో ఇంకో స్టెప్ తీసుకోలేనని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, సారీ మమ్మీ.. సారీ డాడి అని లేఖలో రాసి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి కీర్తన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపార

అమ్మా.. నీ తప్పుకు నన్ను చంపేశావా?
‘అమ్మా.. ఇంకో మూడు నెలలైతే లోకం చూసేవాడిని కదమ్మా.. ఎందుకమ్మ ఇంత పనిచేశావు. నీ కడుపులో నన్ము మోయలేకపోయావా.. ఆరు నెలలుగా నీ కడుపులో హాయిగా పెరుగుతున్నా.. నీవు మింగిన మాత్రలకు నాకు ఊపిరి ఆడడం లేదమ్మా.. లోకం చూపించి అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది.. తెల్లవారేసరికే నా ఊపిరి తీశావేంటమ్మా.. నీవు చేసిన తప్పుకు నన్ను బలి ఇచ్చావా..’ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గురుజ వాగులో పడేసిన పిండానికి మాటలు వస్తే ఇలాగే ప్రశ్నించేదేమో. క్షణికావేశంలో చేసిన తప్పుకు గర్భం దాల్చిన ఓ యువతి.. బయటి ప్రపంచానికి ఆ విషయం తెలియకుండా ఉండేందుకు ఆరు నెలల గర్భంలోనే పిండాన్ని చంపేశారు. ఈ హృదయ విదారక సంఘటన గురుజ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... మంగళవారం ఉదయం గ్రామ శివారులోని వాగు ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లిన కొందరు గ్రామస్తులకు మృత శిశువు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. స్థానికులు అందించిన వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువతి, ఇద్దరు యువకులతోపాటు ఆర్ఎంపీని అదుపులోని తీసుకున్నట్లు తెలిసింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఓ యువతి.. ఆరు నెలల గర్భాన్ని తీయించుకునేందుకు ఆర్ఎంపీని ఆశ్రయించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి గ్రామంలో తిరిగిన సదరు ఆర్ఎంపీ ప్రాణాపాయమని తెలిసినా.. ఆరు నెలల గర్భాన్ని తొలగించారు. ఆ పిండాన్ని ఇలా వాగులో పడేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు పూర్తి కానందున పూర్తి వివరాలు బుధవారం అందిస్తామని సీఐ భీమేష్ తెలిపారు. మృత శిశువును పరీక్షించిన వైద్యులు మగ శిశువుగా నిర్ధారించారు. పిండం వయస్సు సుమారు 6 నెలలు దాటి ఉండవచ్చని సమాచారం.

ఉద్యోగం కోసం భర్తను చంపిన భార్య అరెస్ట్
నల్లగొండ: ప్రభుత్వ ఉద్యోగం కోసం భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌పురాలో నివాసముంటున్న మహ్మద్ ఖలీల్ నల్లగొండ మండలం చర్లగౌరారం జెడ్పీహెచ్ఎస్లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.అతడికి 2007లో అక్సర్ జహతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఖలీల్ చేస్తున్న అటెండర్ ఉద్యోగం తనకు లేదా పిల్లలకు ఇవ్వాలని అతడిని భార్య అక్సర్ జహ వేధింపులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24న ఖలీల్ అనారోగ్యంతో ఇంట్లో పడిపోయాడని చుట్టుపక్కల వారిని అక్సర్ జహ నమ్మించి, ఆటోలో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. ఖలీల్‌కు ఎటువంటి వైద్యం చేయించకుండానే ఇంటికి తీసుకొచ్చింది. అదే రోజు రాత్రి ఖలీల్ మృతిచెందాడు.మరుసటిరోజు ఖలీల్ తల్లి అహ్మది బేగం తన కుమారుడి మృతికి కోడలే కారణమంటూ నల్లగొండ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ శంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో మృతుడి తలపై మారణాయుధాలతో కొట్టడంతో పాటు ముక్కు, నోటిని బలవంతంగా మూయడంతో ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి అక్సర్ జహను అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన నేరాన్ని అంగీకరించిందని డీఎస్పీ తెలిపారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.