మరీ ఇంత ‘సున్న’ చూపా!
జీవో : 15 ద్వారా జిల్లాకు రూ.43.16 కోట్ల ఎస్సీ సబ్‌ప్లా¯ŒS నిధులు
అమలాపురం, పి.గన్నవరాలకు మొండిచెయ్యి
మరో ఆరు నియోజకవర్గాలదీ అదే పరిస్థితి
అమలాపురం :
కోనసీమకు రాజధాని అమలాపురం. ఎస్సీలకు కేటాయించిన పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్రం. ఇంతటి కీలక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎస్సీ సబ్‌ప్లా¯ŒS నిధుల కేటాయింపు ‘సున్నా’. పక్కనే ఉన్న పి.గన్నవరం ఎస్సీ నియోజకవర్గం పరిస్థితి కూడా ఇంతే. ఈ నియోజకవర్గానికి సైతం కేటాయించింది ఏమీలేదు. ఇదే సమయంలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి జిల్లాలో కేటాయించిన నిధుల్లో నాలుగో వంతు దక్కడం విశేషం.
జిల్లాలో 11 నియోజకవర్గాలకు రూ.43.16 కోట్లు ఎస్సీ సబ్‌ప్లా¯ŒS నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఈనెల మూడవ తేదీన జీవో ఆర్టీ నెం.15 విడుదల చేసింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ నిధులతో నియోజకవర్గంలో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, రహదారులకు అప్రోచ్‌రోడ్ల నిర్మాణం చేయనున్నారు. వీటితోపాటు గతంలో ఉపాధి హామీ పథకంలో నిర్మించిన గ్రావెల్ రోడ్లను ఇప్పుడు సీసీ రోడ్లుగా మార్చేందుకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దశలో ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసింది. అయితే కేవలం 11 నియోజకవర్గాలకు మాత్రమే కేటాయించి మిగిలిన నియోజకవర్గాలను పక్కన బెట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాలైన అమలాపురం, పి.గన్నవరాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇదే సమయంలో రాజోలు ఎస్సీ నియోజకవర్గానికి రూ.5 కోట్లు కేటాయించడం గమనార్హం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి ఏకంగా రూ.11.25 కోట్లు కేటాయించారు.
గతంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టే రోడ్లకు ఎస్సీ సబ్‌ప్లా¯ŒS నిధులను మ్యాచింగ్ గ్రాంట్‌గా కేటాయించారు. తరువాత సబ్‌ప్లా¯ŒS నిధులు విడుదల కావడం ఇదే. త్వరలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మరోసారి నిధులు విడుదల చేస్తారనే నమ్మకం అధికారులకు కలగడం లేదు. దీనితో మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలకు కేటాయింపులు ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గాలైన అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాలకు నిధులు కేటాయింపు లేకపోవడాన్ని ఈ ప్రాంతవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు నిధులు కేటాయించకపోవడంపై ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి టీడీపీకి చెందిన అయితాబత్తుల ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తు న్న నియోజకవర్గాలనే కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలున్న చోట కూడా నిధుల కేటాయింపులో వివక్ష చూపడం విశేషం.
ఎస్సీ సబ్‌ప్లా¯ŒS అందని నియోజకవర్గాలు..
అమలాపురం, పి.గన్నవరం, రామచంద్రపురం, కాకినాడ సిటీ, తుని, రాజానగరం, రంపచోడవరం, రాజమహేంద్రవరం సిటీ.
నియోజకవర్గాల వారీగా కేటాయింపులు ఇలా..
నియోజకవర్గం పేరు రూ.కోట్లలో
పిఠాపురం 4
కాకినాడ రూరల్ 4.50
పెద్దాపురం 1.97
అనపర్తి 3
రాజోలు 5
మండపేట 5
రాజమహేంద్రవరం రూరల్ 11.25
జగ్గంపేట 3.36
కొత్తపేట 1.01
ముమ్మిడివరం 0.70
ప్రత్తిపాడు 3.37