india vs england
-
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు స్వదేశంలో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వైట్ బాల్ సిరీస్‌లలో తలపడనుంది. 5 టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో పర్యాటక జట్టుతో భారత్ ఆడనుంది. జనవరి 22న కోల్‌కతా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఇంగ్లీష్ జట్టు భారత పర్యటన ప్రారంభం కానుంది.అయితే ఈ సిరీస్‌లకు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కానున్నాడు. ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. అతడు నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు.జస్ప్రీత్ బుమ్రా గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడికి విశ్రాంతి అవసరం. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు మళ్లీ ఐపీఎల్ కూడా ఆడనున్నాడు. కాబట్టి జస్ప్రీత్పై వర్క్‌లోడ్ తగ్గించాలని నిర్ణయించాము. అతడు ప్రస్తుతం టీ20లపై దృష్టి సారించడం లేదు. దీంతో ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నామని సదరు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.వన్డేల్లో ఆడనున్న రోహిత్-కోహ్లిఇక ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆడనున్నారు. తొలుత వీరు విశ్రాంతి తీసుకుంటారని వార్తలు వినిపించినప్పటికి, ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా ఈ సీనియర్ ద్వయం ఇంగ్లండ్‌తో వన్డేల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రస్తుతం పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో రోకో నిరాశపరిచారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడి తమ రిథమ్‌ను పొందాలని కెప్టెన్, మాజీ కెప్టెన్ ఇద్దరూ భావిస్తున్నారు. అదేవిధంగా ఈ వన్డే సిరీస్‌తో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.చదవండి: గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి: టీమిండియా దిగ్గజం -
నితీశ్ రెడ్డి ఒక్కడే కాదు.. అతడూ జట్టులో ఉండాలి!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్ ముంగిపునకు వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా తమ చివరి టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టి.. ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తి చేసుకుంది.పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో గెలిచి శుభారంభం చేసిన టీమిండియా.. తదుపరి అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం ఓడిపోయింది. అనంతరం బ్రిస్బేన్‌లో మూడో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న భారత జట్టు.. మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో దారుణంగా విఫలమైంది. ఆతిథ్య జట్టు చేతిలో 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంఫలితంగా ఆసీస్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో నిలవగా.. రోహిత్ సేన డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించగా.. ఆస్ట్రేలియాకు మార్గం సుగమమైంది. ఏదేమైనా ఆసీస్‌లో టీమిండియా వైఫల్యం కొనసాగుతున్నప్పటికీ ఓ ఆణిముత్యం లాంటి ఆటగాడు దొరకడం సానుకూలాంశం.నితీశ్ రెడ్డి.. ఆణిముత్యం లాంటి ఆటగాడు అతడు మరెవరో కాదు.. నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy). ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తొలి టెస్టు నుంచే బ్యాట్ ఝులిపిస్తున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ఏకంగా శతకం(114)తో సత్తా చాటాడు. తద్వారా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో అత్యంత పిన్న వయసులోనే సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా 21 ఏళ్ల నితీశ్ రెడ్డి చరిత్ర సృష్టించాడు.ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ రెడ్డి టీమిండియా టెస్టు జట్టుతో పాతుకుపోవడం ఖాయమంటూ భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో టెస్టుల తర్వాత.. టీమిండియా 2025లో తొలుత ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది.నితీశ్ రెడ్డితో పాటు అతడినీ ఎంపిక చేయండి!అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి చేసుకుని.. జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నితీశ్ రెడ్డితో పాటు ఇంగ్లండ్ టూర్‌కు మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు.‘‘మెల్బోర్న్ టెస్టు భారత క్రికెట్‌కు అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్‌ను ఇచ్చింది.. అతడి పేరు నితీశ్ కుమార్ రెడ్డి. ఐపీఎల్లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ తరఫున అదరగొట్టడం ద్వారా భారత క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన ఈ కుర్రాడు.. నిజానికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అంత గొప్ప ఏమీ ఆడలేదు. క్రెడిట్ మొత్తం వారికేఅయినప్పటికీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. అతడి బృందం నితీశ్ రెడ్డిపై నమ్మకం ఉంచినందుకు వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. సెలక్టర్ల నమ్మకాన్ని ఈ అబ్బాయి నిలబెట్టుకున్నాడు. ఇక మరో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer)పై కూడా సెలక్టర్లు దృష్టి సారించాలి.అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం మరో సానుకూలాంశం. అయితే, బౌలింగ్ నైపుణ్యాలను కాస్త మెరుగుపరచుకోవాలి. అతడికి ఇప్పటికే ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉంది. కాబట్టి అక్కడ అతడు టెస్టుల్లో రాణించగలడు’’ అని సునిల్ గావస్కర్ స్పోర్ట్స్ స్టార్‌కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.కౌంటీల్లో ఆడిన వెంకటేశ్కాగా 2024లో ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా లంకాషైర్‌కు ప్రాతినిథ్యం వహించాడు వెంకటేశ్ అయ్యర్. మూడు మ్యాచ్‌లు ఆడి 116 పరుగులు చేశాడు. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన వెంకటేశ్ అయ్యర్.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. అదే విధంగా అంతర్జాతీయ టీ20లలో ఐదు వికెట్లు తీయగలిగాడు.చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? -
రోహిత్, కోహ్లి, బుమ్రాకు విశ్రాంతి..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. వర్క్ లోడ్ కారణంగా బుమ్రాను పక్కకు పెట్టాలని భావిస్తున్న సెలెక్టర్లు.. ఫామ్‌లో లేని రోహిత్, విరాట్లను విశ్రాంతి పేరుతో తప్పిస్తారని తెలుస్తుంది. జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే రోహిత్, కోహ్లి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేది కూడా అనుమానంగానే కనిపిస్తుంది. వాస్తవానికి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉంది. అలాంటి ఈ సిరీస్‌కే రోహిత్, కోహ్లిలకు రెస్ట్ ఇస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఆడిస్తారని అనుమానాలు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన ఎనిమిది రోజుల గ్యాప్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. ఈ మెగా టోర్నీలో ఆడకముందు ఫామ్‌లో లేని రోహిత్, కోహ్లి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడాలి. ఈ ఇద్దరు వన్డేలు ఆడి చాలాకాలం అవుతుంది. రోహిత్, కోహ్లి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటే టీమిండియాకే నష్టం వాటిల్లుతుంది. టెస్ట్‌ల్లో ప్రస్తుతం రోహిత్, కోహ్లి మెడపై కత్తి వేలాడుతుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వీరిద్దరినీ వన్డేల నుంచి కూడా తప్పిస్తారేమో అనిపిస్తుంది.కాగా, భారత టెస్ట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 1-2 తేడాతో వెనుకపడి ఉంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. రోహిత్, కోహ్లి, బుమ్రా ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో భాగంగా ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంటే రోహిత్, కోహ్లి దారుణంగా విఫలమవుతున్నారు. బుమ్రా ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీసి సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం బుమ్రాపై ఉన్న వర్క్ లోడ్‌ను బట్టి చూస్తే అతనికి విశ్రాంతినివ్వడం సమంజసమే అనిపిస్తుంది. ఫామ్‌లో లేక జట్టుకు భారమైన రోహిత్, కోహ్లిలను తదుపరి సిరీస్ ఆడించరంటే అది పరోక్షంగా తప్పించడమే అనుకోవాలి.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం భారత్ జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఐదు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తుంది.ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్జనవరి 22- తొలి టీ20 (కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ (వన్డేలు) ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మ్యాచ్‌లు మినహా మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. మెగా టోర్నీలో భారత ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి.ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది.ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (దుబాయ్)గ్రూప్ దశలో ఫలితాల ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీలో తదుపరి మ్యాచ్‌లు (సెమీస్, ఫైనల్) ఉంటాయి. -
T20 World Cup 2024: ఆసీస్‌ను పడగొట్టి సెమీఫైనల్‌కు
ఏడు నెలల క్రితం తగిలిన దెబ్బకు ఇప్పుడు కాస్త ఉపశమనం! ఫైనల్ కాకపోవచ్చు, ఫార్మాట్ వేరు కావచ్చు... కానీ ప్రపంచ కప్‌లో ఆ్రస్టేలియాను ఓడించడం అంటే సగటు భారత అభిమాని ఆనందాన్ని రెట్టింపు చేసే క్షణం! వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మళ్లీ ఇప్పుడే తలపడిన మ్యాచ్‌లో టీమిండియా అలాంటి సంతోషాన్నే పంచింది. ఆసీస్‌ను చిత్తు చేసి సగర్వంగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ భారీ స్కోరుకు బాటలు వేస్తే మన బౌలర్లు సమర్థంగా లక్ష్యాన్ని కాపాడుకోగలిగారు. ఈ ఓటమితో ఆసీస్ సెమీఫైనల్ ఆశలు అడుగంటిపోగా... 2022 తరహాలోనే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధమైంది. గ్రాస్ ఐలెట్: టి20 వరల్డ్‌కప్‌లో వరుసగా రెండోసారి భారత్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. లీగ్ దశలో 3 మ్యాచ్‌లు నెగ్గిన టీమిండియా సూపర్–8లోనూ ఆడిన 3 మ్యాచ్‌లు గెలిచి అజేయంగా సెమీస్ చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు. ఇతర బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), దూబే (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ (17 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. జట్టు ఇన్నింగ్స్‌లో రోహిత్ ఒక్కడే 15 బౌండరీలు బాదితే, మిగతా బ్యాటర్లు కలిపి 14 బౌండరీలు కొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులే చేయగలిగింది. ట్రవిస్ హెడ్ (43 బంతుల్లో 76; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. సమష్టి బ్యాటింగ్ ప్రదర్శన... రెండో ఓవర్లో కోహ్లి (0)ని హాజల్‌వుడ్ అవుట్ చేయడంతో ఆసీస్ సంబరపడింది. కానీ ఆ తర్వాత అసలు కథ మొదలైంది. రోహిత్ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లందరికీ చుక్కలు చూపించాడు. స్టార్క్ ఓవర్లో 29 పరుగులు బాదిన అతను కమిన్స్ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు కొట్టి 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ జోరు చూస్తే సెంచరీ లాంఛనమే అనిపించినా... చక్కటి యార్కర్‌తో స్టార్క్ రోహిత్‌ను బౌల్డ్ చేశాడు! తన తర్వాతి ఓవర్లో సూర్యనూ అతను వెనక్కి పంపించాడు. చివరి 5 ఓవర్లలో భారత్‌ను ఆసీస్ కట్టడి చేసింది. హెడ్ మెరుపులు... ఛేదనలో ఆసీస్ కూడా ఆరంభంలోనే వార్నర్ (6) వికెట్ కోల్పోయింది. అయితే హెడ్, మార్‡్ష ధాటిగా ఆడి రెండో వికెట్‌కు 48 బంతుల్లో 81 పరుగులు జోడించారు. హెడ్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయితే అక్షర్ అద్భుత క్యాచ్‌కు మార్‡్ష వెనుదిరగడంతో ఆసీస్ పతనం మొదలైంది. 38 పరుగుల వ్యవధిలో జట్టు తర్వాతి 5 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) స్టార్క్ 92; కోహ్లి (సి) డేవిడ్ (బి) హాజల్‌వుడ్ 0; పంత్ (సి) హాజల్‌వుడ్ (బి) స్టొయినిస్ 15; సూర్యకుమార్ (సి) వేడ్ (బి) స్టార్క్ 31; దూబే (సి) వార్నర్ (బి) స్టొయినిస్ 28; పాండ్యా (నాటౌట్) 27; జడేజా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–6, 2–93, 3–127, 4–159, 5–194. బౌలింగ్: స్టార్క్ 4–0–45–2, హాజల్‌వుడ్ 4–0–14–1, కమిన్స్ 4–0–48–0, జంపా 4–0–41 –0, స్టొయినిస్ 4–0–56–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) సూర్యకుమార్ (బి) అర్‡్షదీప్ 6; హెడ్ (సి) రోహిత్ (బి) బుమ్రా 76; మార్‡్ష (సి) అక్షర్ (బి) కుల్దీప్ 37; మ్యాక్స్‌వెల్ (బి) కుల్దీప్ 20; స్టొయినిస్ (సి) పాండ్యా (బి) అక్షర్ 2; డేవిడ్ (సి) బుమ్రా (బి) అర్‡్షదీప్ 15; వేడ్ (సి) కుల్దీప్ (బి) అర్‡్షదీప్ 1; కమిన్స్ (నాటౌట్) 11; స్టార్క్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–6, 2–87, 3–128, 4–135, 5–150, 6–153, 7–166. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–37–3, బుమ్రా 4–0–29–1, అక్షర్ పటేల్ 3–0–21–1, హార్దిక్ పాండ్యా 4–0–47–0, కుల్దీప్ యాదవ్ 4–0–24–2, జడేజా 1–0–17–0. ఒకే ఓవర్లో 29 పరుగులు... ఆసీస్ టాప్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రోహిత్ నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్ తొలి నాలుగు బంతుల్లో రోహిత్ వరుసగా 6, 6, 4, 6 కొట్టాడు. ఐదో బంతికి పరుగు రాకపోగా, తర్వాత స్టార్క్ ‘వైడ్’ వేశాడు. దాంతో అదనపు బంతిని కూడా రోహిత్ సిక్సర్‌గా మలిచాడు. -
బర్మింగ్‌హోమ్‌లో బర్నింగ్ మ్యాచ్
-
మేం గెలవడం వారికి ఇష్టం లేదు : ఇంగ్లండ్ ఓపెనర్
లండన్ : ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ జట్టు తమ దేశానికే చెందిన మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలను ఎదుర్కొంటుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సారథి మోర్గాన్ భయపడ్డాడని కెవిన్ పీటర్సన్ చురకలంటించగా.. వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని మాజీ సారథి మైకేల్ వాన్ కామెంట్ చేశాడు. దీంతో ‘కొంతమందికి ఇంగ్లండ్ గెలవడం ఇష్టం లేదు. ఎప్పుడెప్పుడు ఓడిపోతుందా.. అంటూ జట్టుపై విమర్శలు చేయడానికి ఎదురుచూస్తున్నారు’ అని ఓపెనర్ బెయిర్‌స్టో స్పందించాడు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన మైకేల్ వాన్.. ‘బెయిర్ స్టోవి తప్పుడు ఆరోపణలు. ఇంతకుముందెన్నడూ లేనంత మద్దతు ప్రస్తుతం ఇంగ్లండ్‌కు లభిస్తుంది. అయితే నువ్వు, మీ జట్టు నిరాశ పరుస్తున్నారు. రెండు మ్యాచ్‌లు గెలిచి సెమీస్‌కు వెళ్లండి చాలు’ అని అన్నారు. బెయిర్‌స్టో వ్యాఖ్యలు దారుణమైనవి అని, ఇంగ్లండ్ ఓడిపోవాలని ఎవరూ అనుకోవడంలేదని అలా మాట్లాడటం భావ్యం కాదని పేర్కొన్నారు. -
రంగు మార్చడం అవసరమా..!
బర్మింగ్‌హామ్ : ప్రపంచకప్‌లో ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే పోరులో భారత జట్టు ధరించే ‘అవే’ జెర్సీని శుక్రవారం బీసీసీఐ విడుదల చేసింది. ముందు భాగంలో ముదురు నీలం రంగు... భుజాలు, వెనక భాగం పూర్తిగా నారింజ రంగుతో కనిపించేలా ఈ జెర్సీని ‘నైకీ’ సంస్థ డిజైన్ చేసింది. కొన్నాళ్ల క్రితం భారత్ ఉపయోగించిన ప్రాక్టీస్ డ్రెస్ పోలికలు ఇందులో కనిపిస్తున్నాయి. రేపు ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ కొత్త జెర్సీతో బరిలోకి దిగుతుంది. ఫుట్‌బాల్ తరహాలో హోం, అవే మ్యాచ్‌లకు వేర్వేరు జెర్సీలను వేసుకునే సంప్రదాయాన్ని ఐసీసీ తొలిసారిగా ఈ ప్రపంచ కప్‌లో ప్రవేశపెట్టింది. భారత్, ఇంగ్లండ్ రెండు జట్లూ నీలి రంగునే వాడుతుండటంతో వాటి మధ్య తేడా చూపించేందుకు టీమిండియా ఆటగాళ్లు నారింజ రంగు జెర్సీని వేసుకోబోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ‘హోమ్’ టీమ్ కాగా, భారత్‌ను ‘అవే’ జట్టుగా నిర్ధారించారు. రంగు మార్చడం అవసరమా..! ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లు చూసిన తర్వాత సగటు క్రికెట్ అభిమానికి వేర్వేరు జట్ల జెర్సీలు మనసులో ముద్రించుకుపోయే ఉంటాయి. భారత్, ఇంగ్లండ్ టీమ్ రంగులు పేరుకు ‘బ్లూ’ అయినా వీటి మధ్య ఎంతో తేడా ఉంది. అది స్పష్టంగా కనిపిస్తోంది కూడా. పైగా ఫుట్‌బాల్ తరహాలో ఆటగాళ్ల మధ్య గందరగోళానికి కారణమయ్యే ‘కలర్ క్లాషెస్’ క్రికెట్లో కనిపించదు. ఫుట్‌బాల్‌లో 22 మంది ఒకేసారి మైదానంలో ఉండటంతో పాటు సహచరుడికి పాస్‌లు అందిం చడం అతి కీలకమైన అంశం. కాబట్టి ఇబ్బంది లేకుండా పూర్తిగా భిన్నమైన రంగు జెర్సీలను ఆటగాళ్లు ధరిస్తారు. క్రికెట్లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ కూడా పిచ్ వదిలి రారు. ఎదురుగా కనిపించే సహచరుడితో సమన్వయం ఉంటే సరిపోతుంది. ఫీల్డింగ్ జట్టు దృష్టి కూడా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌పైనే ఉంటుంది తప్ప ఇతర ఆటగాళ్లతో గందరగోళానికి తావు లేదు. మొత్తంగా ఈ జెర్సీ రంగు మార్పు వ్యవహారం పటాటోపం, హంగామా కోసం చేసినట్లనిపిస్తుంది. ఏదో ఒక సాకుతో కాస్త ఆకర్షణ తెచ్చే ప్రయత్నం చేయడం తప్ప వాస్తవంగా చూస్తే ఈ మార్పుకు ఎలాంటి అర్థం లేదు. Presenting #TeamIndia's Away Jersey 🤩🤩🇮🇳🇮🇳 What do you make of this one guys? #TeamIndia #CWC19 pic.twitter.com/TXLuWhD48Q — BCCI (@BCCI) June 28, 2019 -
అయ్యా..! జర జాగ్రత్త: రూట్
బర్మింగ్‌హామ్ : వరుసగా రెండు పరాజయాలతో డీలా పడ్డ జట్టు ఆటగాళ్లను ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ అప్రమత్తం చేశాడు. సెమీస్ చేరాలంటే ఆదివారం భారత్‌తో, జూలై 3న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లు నెగ్గాల్సి ఉన్న నేపథ్యంలో ఎడ్జ్‌బాస్టన్ వాతావరణాన్ని తట్టుకుంటూ ప్రశాంతంగా ఉండాలని సూచించాడు. తమకు ఇప్పటికీ సెమీస్ చేరగల సత్తా ఉందని, దానిని సాధిస్తే ఎలా చేరారన్నదానిని ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్యానించాడు. రాబోయే మ్యాచ్‌లను క్వార్టర్ ఫైనల్స్‌గా పరిగణిస్తామని అతడు పేర్కొన్నాడు. ఇలాంటి కఠిన పరిస్థితి ఎప్పుడూ ఉంటుందని, కాకపోతే తమకు అనుకున్నదాని కంటే ముందుగానే వచ్చిందని రూట్ అభిప్రాయపడ్డాడు. -
‘ఇది మా ప్రపంచకప్.. వెనక్కి తగ్గే ముచ్చటే లేదు’
లండన్ : రెండు పరాజయాలు ప్రపంచకప్ నుంచి తమని తప్పించలేవని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తెలిపాడు. ఇది తమ ప్రపంచకప్ అని ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి ఇంగ్లండ్ గట్టెక్కించడానికి ఒంటిరి పోరాటం చేసిన స్టోక్స్(115 బంతుల్లో 89; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మిచెల్ స్టార్క్ అద్భుత యార్కర్‌కు క్లీన్‌బౌల్డై నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో బ్యాట్‌ను తన్ని తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఈ ఓటమి అనంతరం మాట్లాడుతూ.. ‘ ఇది మా ప్రపంచకప్. గత నాలుగేళ్లుగా మాకు లభించిన మద్దతు వెలకట్టలేనిది. ప్రపంచకప్ ఎంత కీలకమో మాకు తెలుసు. క్రికెట్లోనే ఇదో అద్భుత సమయం. (చదవండి : ఇంగ్లండ్‌కు ఛేజింగ్ చేతకాదు) ఈ మెగాటోర్నీకి దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. వెనకడుగేసే ముచ్చటే లేదు. ఇది మా ప్రపంచకప్. ఎలాగైనా సాధిస్తాం. గెలపు కోసం ఒంటరిగా పోరాడినా ఫలితం దక్కనప్పుడు బాధ కలుగుతోంది. మా జట్టులోని ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు చెలరేగితే మాకు తిరుగుండదు. తదుపరి మ్యాచ్‌లపై సరైన ప్రణాళికలు రచిస్తాం. గత రెండు మ్యాచ్‌ల్లో మా ప్రణాళికలు సరిగ్గా అమలు కాలేదు. ఇంగ్లండ్‌లో మాకు భారత్‌పై మంచి రికార్డు ఉంది. కానీ మేం మా అవకాశం కోసం ఎదురు చూస్తాం. బలమైన జట్టును ఢీకొంటున్నప్పుడు మన సాయశక్తుల ప్రదర్శన కనబర్చాలి. మేం మా శక్తిమేరకు పోరాడుతాం.’ అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు.(చదవండి : ఆసీస్ విలాసం ఇంగ్లండ్ విలాపం) 👉 Finch's perfectly timed 4⃣ 👉 Behrendorff's 👌 delivery 👉 Starc's 🔥 inswinging yorker The #CWC19 contest between England and Australia was an absolute entertainer! Which of these moments will get your vote for @Nissan Play of the Day? VOTE HERE: https://t.co/yqTDMl6t9O pic.twitter.com/ORnF6VLgBz — ICC (@ICC) June 25, 2019 -
ఆరెంజ్ జెర్సీలో కోహ్లి సేన!
లండన్ : భారత క్రికెట్ జట్టు జెర్సీ మారనుంది. ఇప్పటి వరకు బ్లూ జెర్సీతో బరిలోకి దిగిన కోహ్లిసేన.. తొలిసారి ఆరెంజ్ జెర్సీ ధరించనుంది. అయితే ఇది కేవలం ఇంగ్లండ్‌తో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌కు మ్రాతమే. ఈ నెల 30న జరిగే ఈ మ్యాచ్‌కు కోహ్లిసేన ఆరెంజ్ జెర్సీలో అభిమానులను కనువిందు చేయనుంది. దీనికి కారణం ఇంగ్లండ్ జట్టే. ఈ ప్రపంచకప్‌కు ఆ జట్టు బ్లూ జెర్సీతో బరిలోకి దిగడం.. భారత్ జట్టు జెర్సీ రంగు కూడా అదే కావడంతో టీవీ ప్రేక్షకులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ.. జెర్సీ రంగులు క్లాష్ కాకుండా ఒక్కో జట్టుకు ప్రత్యామ్నాయ జెర్సీలకు అవకాశం ఇచ్చింది. ‘ఐసీసీ ఈవెంట్స్‌లో పాల్గొనే జట్లన్నీ విభిన్న రంగులున్న రెండు జెర్సీలను కలిగి ఉండాలి. ఈ విషయంలో ఆతిథ్య జట్టుకు మినహాయింపు ఉంది. ప్రత్యామ్నాయ రంగు ఎంపికలో జట్లదే పూర్తి స్వేచ్చ. కానీ ఒక రంగునే టోర్నీ మొత్తం కొనసాగించాలి. ఒకే రంగు జెర్సీ కలిగిన జట్లు తలపడినప్పడు మాత్రం ప్రత్యామ్నాయ జెర్సీని ఎంచుకోవాలి. ఈ విషయం ముందే తెలియజేయాలి’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వడంతో అదే జెర్సీతో బరిలోకి దిగుతుండగా భారత్ మాత్రం ఆరెంజ్ జెర్సీలో ఆడనుంది. వాస్తవానికి శనివారం జరిగే అఫ్గానిస్తాన్ మ్యాచ్‌కే భారత జట్టు జెర్సీ మారనుందని ప్రచారం జరిగింది. కానీ ఈ మ్యాచ్‌కు అఫ్గాన్ జట్టే ప్రత్యామ్నాయ జెర్సీతో బరిలోకి దిగుతుండటంతో భారత్ యధాతథంగా బ్లూజెర్సీలో ఆడనుంది. ఇక ఇప్పటికే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు యెల్లో జెర్సీతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అలాగే పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు కూడా ఆయా జట్లు జెర్సీలు మార్చుకోనున్నాయి. చదవండి : అయ్యో.. అది ఔటా? -
మూడు పరుగులు కొట్టలేక చేతులెత్తేశారు..
గుహవాటి: భారత మహిళలతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ మహిళలు పరుగు తేడాతో గెలిచి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్నారు. కడవరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ మహిళలు పరాజయం చవిచూశారు. చివరి ఓవర్లో భారత్ విజయానికి మూడు పరుగులు అవసరం కాగా, ఆ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్య ఛేదనలో స్మృతీ మంధాన(58; 39 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ సాధించగా, మిథాలీ రాజ్(30 నాటౌట్; 32 బంతుల్లో 4 ఫోర్లు) ఆకట్టుకోవడంతో భారత్ విజయం సాధిస్తుందనే అనుకున్నరంతా. అయితే ఇంగ్లండ్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌ను కట్టడి చేసింది. కేట్ క్రాస్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి మూడు బంతులకు పరుగులేమీ రాకపోగా, నాల్గో బంతికి భారతి ఫుల్మాలి ఔటైంది. దాంతో చివరి రెండు బంతుల్లో భారత్ మూడు పరుగులు సాధించాల్సి వచ్చింది. అయితే ఐదో బంతికి అనుజా పాటిల్ ఔట్ కాగా, చివరి బంతికి శిఖా పాండే పరుగు మాత్రమే చేశారు. ఫలితంగా భారత్ పరుగు తేడాతో ఓటమి పాలై సిరీస్‌లో వైట్‌వాష్ అయ్యింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మహిళలు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేశారు.డానియల్లీ వ్యాట్(24), బీమౌంట్(29) అమీ ఎలెన్ జోన్స్(26), డంక్లీ బ్రౌన్( 14 నాటౌట్), ష్రబ్సోల్(10 నాటౌట్), హీథర్ నైట్(11) తలో చేయి వేసి పోరాడే స్కోరును భారత్ ముందుంచారు. అయితే భారత్ క్రీడాకారిణుల్లో మంధాన, మిథాలీ రాజ్ మినహా మిగతా వారు విఫలమయ్యారు. భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 118 పరుగులకే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. -
అరే.. భయపడకండబ్బా! : మంధాన
గువాహటి : బ్యాటింగ్ చేసేటప్పుడు భయపడకుండా ఆడాలని టీమిండియా మహిళా టీ20 తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన సహచరులకు సూచించారు. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత మహిళలు ఐదు వికెట్ల తేడాతో పరాజయం పొంది మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ.. భయాన్ని పక్కనపెట్టి బ్యాటర్స్ బ్యాటింగ్ చేయాలని అభిప్రాయపడ్డారు. ‘దేశవాళి క్రికెట్లో ఎలా ఆడుతామో.. అంతర్జాతీయ క్రికెట్లో కూడా అలానే రాణించాలి. అలాంటప్పుడే భారీ స్కోర్లు చేయగలం. భయానికి, నిర్లక్ష్యానికి కొంత మాత్రమే తేడా. మా బ్యాటర్స్ది నిర్లక్ష్యమని నేను భావించడం లేదు. నాతో సహా మేం భయాన్ని వీడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా. అంతేకాకుండా మేం డాట్ బాల్స్‌ను కూడా తగ్గించుకోవాలి. సింగిల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేయడంపై కూడా దృష్టి పెట్టాలి. ఆడితే షాట్స్ లేకుంటే డాట్స్.. అన్న తరహాలో మా బ్యాటింగ్ ఉంది. ఇదే మాకు ప్రత్యర్థికి ఉన్న తేడా. దీన్ని ఎలాగైన మార్చుకుంటాం.’ అని వ్యాఖ్యానించారు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 112 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్ మహిళలు 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకున్నారు. భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ ఓపెనర్ డానియల్లీ వ్యాట్(64 నాటౌట్; 55 బంతుల్లో 6 ఫోర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండి విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఆమెకు జతగా లారెన్ విన్ఫీల్డ్(29; 23 బంతుల్లో 4 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేశారు. భారత బ్యాటర్స్‌లో మిథాలీ రాజ్ చేసిన 20 పరుగులకే జట్టు తరఫున అత్యధిక స్కోరు. మంధాన(12), హర్లీన్ డియాల్(14), దీప్తి శర్మ(18), భారతి ఫుల్మాలి(18) ఇలా అంతా విఫలమయ్యారు. -
ఇంగ్లండ్‌దే టీ20 సిరీస్
గువాహటి: భారత మహిళలతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 112 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్ మహిళలు 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకున్నారు. భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ ఓపెనర్ డానియల్లీ వ్యాట్(64 నాటౌట్; 55 బంతుల్లో 6 ఫోర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండి విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఆమెకు జతగా లారెన్ విన్ఫీల్డ్(29; 23 బంతుల్లో 4 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేశారు. భారత బ్యాటర్స్‌లో మిథాలీ రాజ్ చేసిన 20 పరుగులకే జట్టు తరఫున అత్యధిక స్కోరు. మంధాన(12), హర్లీన్ డియాల్(14), దీప్తి శర్మ(18), భారతి ఫుల్మాలి(18) ఇలా అంతా విఫలమయ్యారు. ఐదుగురు క్రీడాకారిణులు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో భారత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రంట్ మూడు వికెట్లు సాధించగా, లిన్సే స్మిత్ రెండు వికెట్లు తీశారు. కేట్ క్రాస్, ష్రబ్‌సోల్‌లకు తలో వికెట్ దక్కింది. -
ఇంగ్లండ్ మహిళలతో టీ20లో భారత్ తడ‘బ్యాటు’
గువాహటి: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత మహిళలు మరోసారి తడబాటుకు గురయ్యారు. తొలి టీ20లో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమై ఓటమి చెందిన భారత మహిళల జట్టు.. రెండో టీ20లో కూడా అదే తరహా బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల కోల్పోయి 111 పరుగులు చేశారు. భారత బ్యాటర్స్‌లో మిథాలీ రాజ్ చేసిన 20 పరుగులకే జట్టు తరఫున అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మంధాన(12), హర్లీన్ డియాల్(14), దీప్తి శర్మ(18), భారతి ఫుల్మాలి(18) ఇలా అంతా విఫలమయ్యారు. ఐదుగురు క్రీడాకారిణులు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో భారత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రంట్ మూడు వికెట్లు సాధించగా, లిన్సే స్మిత్ రెండు వికెట్లు తీశారు. కేట్ క్రాస్, ష్రబ్‌సోల్‌లకు తలో వికెట్ దక్కింది. తొలి టీ20లో ఇంగ్లండ్ మహిళలు 41 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక్కడ చదవండి: పరాజయ పరంపర ఆగేనా! -
తొలి మ్యాచ్‌లోనే మంధానకు చేదు అనుభవం!
గువాహటి : అస్సాంలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు పరాజయం పాలైంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక మంధాన సేన ఓటమి చవిచూసింది. దీంతో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో 1-0 తేడాతో ఆతిథ్య జట్టు వెనుకబడింది. టీమిండియా బ్యాటర్లలో దీప్తి శర్మ(22), అరుంధతి రెడ్డి(18), శిఖా పాండే(23) మాత్రమే రాణించారు. కెప్టెన్ స్మృతి మంధాన(2) సహా సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్(7) స్వల్ప స్కోరుకే పరిమితం కావడంతో.. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 119 పరుగులు మాత్రమే చేసింది. రెండు విభాగాల్లో వైఫల్యం వల్లే మ్యాచ్ అనంతరం కెప్టెన్ మంధాన మాట్లాడుతూ.. ‘ 10 నుంచి 15 ఎక్స్ట్రా పరుగులు ఇచ్చాం. అదే విధంగా మాకు సరైన ఆరంభం కూడా లభించలేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో వైఫల్యం వల్లే ఓటమి పాలయ్యాం. అయితే అరుంధతి, దీప్తి శర్మ, శిఖాలు రాణించడంతో మెరుగైన స్కోరు సాధించాం. భవిష్యత్తు మ్యాచుల్లో ఈ అంశం మాకు సానుకూలంగా మారనుంది. గతం గురించి ఆలోచించకుండా జరుగనున్న మ్యాచులపై దృష్టి సారిస్తాం’ అని వ్యాఖ్యానించింది. కాగా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాయం నుంచి కోలుకోకపోవడంతో... ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టి20 జట్టుకు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తొలిసారిగా నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సోమవారం నాటి మ్యాచులో టాస్ గెలిచిన మంధాన ఇంగ్లండ్ జట్టును తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆది నుంచి దూకుడుగా ఆడిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. బ్యాటర్స్ టామీ బూమంట్ (62), డేనియల్ వ్యాట్(35)తో కెప్టెన్ హెదర్ నైట్(40) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. -
49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినా..
ముంబై: భారత మహిళలతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లండ్ మహిళలు రెండు వికెట్ల తేడాతో గెలుపొందారు. భారత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ మహిళలు 48.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఫలితంగా భారత్ చేతిలో వైట్‌వాష్ నుంచి తప్పించుకున్నారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ హీథర్ నైట్(47), డానియల్లీ వ్యాట్(56)లు రాణించి జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించారు. వీరిద్దరూ 69 పరుగుల జత చేసి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. ఆపై వ్యాట్-ఎల్విస్ల జోడి 56 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో గోస్వామి మూడు వికెట్లు సాధించగా, పూనమ్ యాదవ్, శిఖా పాండేలు తలో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్ రోడ్రిగ్స్ డకౌట్‌గా పెవిలియన్ చేరినప్పటికీ, స్మృతీ మంధాన(66) మరోసారి మెరిశారు. ఆమెకు జతగా పూనమ్ రౌత్(56) రాణించడంతో భారత్ రెండో వికెట్‌కు 129 పరుగులు చేసింది. ఆ తర్వాత దీప్తి శర్మ(27 నాటౌట్), శిఖా పాండే(26)లు మాత్రమే రెండంకెల స్కోరును చేయడంతో భారత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో కేథరిన్ బ్రంట్ ఐదు వికెట్లతో రాణించగా, స్కీవర్, ఎల్విస్, ష్రబ్‌సోల్‌లు తలో వికెట్ తీశారు. ఇప్పటికే భారత్ మహిళలు సిరీస్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. వరుస రెండు వన్డేల్లో భారత్ మహిళలు విజయం సాధించి సిరీస్‌ను ముందుగానే చేజిక్కించుకున్నారు. ఇక్కడ చదవండి: భారత మహిళలదే వన్డే సిరీస్ -
మంధానకు కెప్టెన్సీ పగ్గాలు
ముంబై: రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో... ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల టి20 జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహిస్తుంది. గువాహటిలో మార్చి 4, 7, 9వ తేదీల్లో ఇంగ్లండ్‌తో భారత్ మూడు టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. భారత జట్టులో హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. భారత మహిళల టి20 జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), మిథాలీ రాజ్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, తానియా భాటియా (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, అనూజా పాటిల్, శిఖా పాండే, కోమల్ జన్జాద్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాధ యాదవ్, వేద కృష్ణమూర్తి, హర్లీన్ డియోల్. -
రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం
-
భారత మహిళలదే వన్డే సిరీస్
ముంబై: ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత మహిళలు సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు 41.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించారు. తద్వారా ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్నారు. భారత బ్యాటర్స్‌లో స్మృతీ మంధాన(63), మిధాలీ రాజ్(47 నాటౌట్), పూనమ్ రౌత్(32)లు రాణించి జట్టు ఘన విజయానికి తోడ్పడ్డారు. ఇంగ్లండ్ నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆదిలోనే రోడ్రిగ్స్(0) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో మంధాన-పూనమ్ రౌత్‌ల జోడి రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. ఇక మూడో వికెట్‌కు మంధాన-మిధాలీ రాజ్ జోడి 66 పరుగుల్ని జత చేయడంతో భారత్ సునాయాసంగా గెలుపొందింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది. . ఇంగ్లండ్ మహిళల్లో నటలీ స్కీవర్(85) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. జులన్ గోస్వామి, శిఖా పాండేలు చెరో నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. మూడో వన్డే గురువారం జరుగనుంది. -
చెరో నాలుగు వికెట్లతో చెలరేగిపోయారు..
ముంబై: ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత మహిళలతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. జులన్ గోస్వామి, శిఖా పాండేల బౌలింగ్ ధాటికి విలవిల్లాడింది. వీరిద్దరూ చెరో నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ మహిళల్లో నటలీ స్కీవర్(85) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓ దశలో 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో స్కీవర్ ఆదుకున్నారు. కాగా, భారత మహిళా బౌలర్ల విజృంభణకు మిగతా వారు వరుస పెట్టి క్యూకట్టారు. దాంతో ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 161 పరుగులకే చాపచుట్టేసింది. ప్రధానంగా జులన్, శిఖాల పదునైన బంతులకు ఇంగ్లండ్ దాసోహమైంది. మరొక బౌలర్ పూనమ్ యాదవ్‌కు రెండు వికెట్లు లభించాయి. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడ చదవండి: ఏక్తా మాయాజాలం -
‘ఏక్తా’ ధాటికి ఇంగ్లండ్ ప్యాకప్
ముంబై: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు జయభేరి మోగించింది. ఐసీసీ చాంపియన్ షిప్లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లో మిథాలీ సేన 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యాటక జట్టు స్పిన్ ఉచ్చులో చిక్కుకుపోయింది. టీమిండియా బౌలర్లు ఏక్తా బిస్త్(4/25), దీప్తి శర్మ(2/33), శిఖా పాండే(2/21), గోస్వామి(1/19)ల దెబ్బకు ఇంగ్లండ్ జట్టు 41 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ సారథి హెదర్ నైట్(39 నాటౌట్), ఆల్‌రౌండర్ సీవర్(44)లు మాత్రమే రాణించారు. ఏ దశలోనూ పర్యాటక జట్టను కోలుకోనీయకుండా ఆ జట్టు పతనాన్ని శాసించిన ఏక్తాబిస్త్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. రాణించిన మిథాలీ, రోడ్రిగ్స్ అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. స్మృతి మంధాన (24), రోడ్రిగ్స్ (48)లు తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం ఈ జోడిని ఎల్విస్ విడదీసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(7) వెంటనే వేనుదిరగగా.. రోడ్రిగ్‌తో కలిసి మిథాలీ(44) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. అనంతరం ఇరువురు ఔటైన తర్వాత మిడిలార్డర్ చేతులెత్తేయడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన హర్మన్ ప్రీత్ స్థానంలో జట్టులోకి వచ్చిన హర్లీన్ డియోల్(2) పూర్తిగా నిరాశపరిచింది. చివర్లో తాన్యా భాటియా(25), గోస్వామి(30)లు రాణించడంతో టీమిండియా 202 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎల్విస్, సీవిర్, సోఫీ ఎలెక్‌స్టోన్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ష్రబ్‌షోల్ ఒక్క వికెట్ దక్కించుకున్నారు. -
కెప్టెన్‌గా కోహ్లి రికార్డ్!
అడిలైడ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లిసేన 31 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల్లో కనీసం ఒక టెస్ట్ విజయం సాధించిన తొలి ఆసియా సారథిగా కోహ్లి చరిత్రకెక్కాడు. అంతేకాకుండా ఆసీస్ గడ్డపై సిరీస్ ఆరంభ మ్యాచ్ గెలిచిన భారత కెప్టెన్‌గా.. జట్టుగా అద్భుత ఫీట్‌ను సాధించారు. గతంలో భారత్ ఆసీస్ గడ్డపై ఐదు మ్యాచ్‌లు నెగ్గినప్పటికి ఎప్పుడు తొలి మ్యాచ్‌ను గెలవలేదు. 2008 పెర్త్ టెస్ట్ విజయానంతరం భారత్ ఆసీస్ గడ్డపై గెలుపొందడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత్ తొలి రెండు టెస్ట్‌లు ఓడి సిరీస్ చేజార్చుకున్నప్పటికి చివరి జోహన్నస్ బర్గ్ మ్యాచ్ గెలిచింది. ఈ సిరీస్‌లో కోహ్లి 6 ఇన్నింగ్స్‌ల్లో 47.67 సగటుతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అలాగే ఇంగ్లండ్ సిరీస్‌లోను తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన కోహ్లిసేన నాటింగ్‌హోమ్ టెస్ట్‌ను గెలిచింది. అనంతరం ఇంగ్లండ్ మరో రెండు మ్యాచ్‌లు గెలిచి 4-1 సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2014లో ఇంగ్లండ్ గడ్డపై దారుణంగా విఫలమైన కోహ్లి.. ఈ సిరీస్ తన సత్తా చాటాడు. 10 ఇన్నింగ్స్‌లో 59.3 సగటుతో 593 పరుగలు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించకపోవడంతో భారత్ సిరీస్‌ను కోల్పోయింది. అయితే ఆసీస్‌తో తాజా సిరీస్‌లో కోహ్లి బ్యాట్ మెరవకపోయినప్పటికీ.. పుజారా అద్భుత బ్యాటింగ్‌కు బౌలర్లు రాణించడంతో భారత్ విజయాన్నందుకుంది. టాస్ గెలిస్తే విజయం కోహ్లిదే.. విరాట్ కోహ్లి టాస్ గెలిస్తే.. మ్యాచ్ భారతే నెగ్గుతుంది. ఇప్పటి వరకు కోహ్లి సారథ్యం వహించిన టెస్ట్ మ్యాచ్‌ల్లో 20 సార్లు టాస్ గెలవగా.. ఇందులో భారత్‌ను 17 విజయాలు వరించాయి. మరో మూడు మ్యాచ్‌లు డ్రా అవ్వగా.. ఒక్క ఓటమి లేకపోవడం గమనార్హం. చదవండి: తొలి టెస్టులో టీమిండియా విజయం -
8 వికెట్ల తేడాతో భారత్ పరాజయం
-
టీ20 ప్రపంచకప్: హర్మన్ సేన కథ ముగిసింది!
మళ్లీ అదే తడబాటు.. అదే పొరబాటు.. అప్పుడు.. ఇప్పుడు బ్యాటింగ్ వైఫల్యమే.. భారత మహిళల చిరకాల కోరిక తీరకుండా చేసింది. గ్రూప్ దశలో తిరుగులేని విజయాలు సాధించి.. ఊరించిన హర్మన్ సేన సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో చతికిలపడింది. నాడు 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టైటిల్ ముందు బోల్తాపడ్డ భారత మహిళలు.. నేడు టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో చేతులెత్తేశారు. నార్త్ సాండ్(అంటిగ్వా) : ఇంగ్లండ్‌తో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన సెమీఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ సేన ఇంగ్లండ్ బౌలర్ల దాటికి 19.3 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాట్స్‌వుమెన్స్‌లో స్మృతి మంధాన (34), జెమీమా రోడ్రిగ్స్(26)లవే టాప్ స్కోర్ సాధించారు. హార్డ్ హిట్టర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ (16), కృష్ణమూర్తి (2), బాటియా (11)లు తీవ్రంగా నిరాశ పరిచారు. ఇక ఈ మ్యాచ్‌కు సీనియర్ క్రికెటర్, హైదరబాద్ స్టార్ మిథాలీ రాజ్ దూరం కావడం కూడా భారత్‌ను దెబ్బతీసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్.. అమీ జోన్స్ (53), నటాలీ సివర్ (51)లు అర్ధసెంచరీలతో చెలరేగడంతో 17.1 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్.. ఆసీస్‌ను ఢీకొట్టనుంది. (చదవండి: మహిళా టీ20 ప్రపంచకప్: ఫైనల్లో ఆసీస్) -
మహిళా టీ20 ప్రపంచకప్: భారత్ ప్రత్యర్థి ఇంగ్లండ్
ప్రొవిడెన్స్ (గయానా) : మహిళా టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత మహిళలు సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొట్టనున్నారు. లీగ్ మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో సత్తాచాటిన హర్మన్ సేన గ్రూప్-బి టాపర్‌గా సెమీస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. అనంతరం విండీస్.. డాటిన్ (46),క్యాంప్బెల్లె (45)ల ఇన్నింగ్స్‌తో 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఈ గెలుపుతో విండీస్ సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుండగా.. భారత్, ఇంగ్లండ్‌ను ఢీ కొట్టనుంది. ఇదే ఇంగ్లండ్‌తో 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత మహిళలు ఒత్తిడిని అధిగమించలేక తృటిలో విజయాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇక మరోసారి సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొట్టబోతున్న హర్మన్ సేన అలాంటి తప్పిదాలు పునరావృతం చేయవద్దని భావిస్తోంది. ఇక భారత మహిళల్లో హర్మన్, మంధాన, మిథాలీ రాజ్‌లు బ్యాట్‌తో రాణిస్తుండగా.. స్పిన్ చతుష్టయం అనూజ పాటిల్, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, దీప్తిశర్మలు బౌలింగ్‌లో రాణిస్తున్నారు. ఈ సారి ఎలాగైన టైటిల్ నెగ్గాలనే కసితో భారత మహిళలు బరిలోకి దిగుతున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సెమీస్ పోరు జరుగనుంది.