Kusha Kapila
-
ఆడవారిని మాత్రమే తప్పు పట్టడం అన్యాయం: కమెడియన్
కామెడీ కంటెంట్ క్రియేటర్ కుష కపిల గతేడాది జోరావర్ సింగ్ అహ్లువాలియా నుంచి విడాకులు తీసుకుంది. ఇది తన వ్యక్తిగత విషయం అయినప్పటికీ ఓ షోలో తన విడాకుల మీద సెటైర్లు వేశారు. అది భరించలేకపోయిందీ కమెడియన్. కామెడీ హద్దులు దాటొద్దని హెచ్చరించింది.అమ్మకు ఎక్కువ ఇబ్బందిఅయినప్పటికీ జనాలు ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉన్నారని మండిపడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ సమాజం మహిళల పట్ల కాస్తయినా దయ చూపదు. విడాకుల వల్ల నాకన్నా మా అమ్మ ఎక్కువ ఇబ్బందిపడుతోంది. అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తోంది. అటు బంధువులకు ఇటు సమాజానికి వివరణ ఇస్తోంది.అన్యాయంనేనంటే బయట సాధారణంగా తిరగలేను, సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఇదంతా తప్పించుకోవచ్చు. కానీ అమ్మకు అలా కాదుగా.. తను సాధారణ జీవితం గడుపుతోంది. అందరూ నిర్మొహమాటంగా నా గురించి అడుగుతూ ఉంటే తను చెప్పలేక చెస్తోంది. ఈ సమాజం కాస్త మారింది. కానీ మారాల్సింది ఇంకా చాలా ఉంది. ఎప్పుడు ఏం జరగాలనేది మన చేతిలో లేదు కదా.. అయినా ఆడవారిని మాత్రమే తప్పు పట్టడం అన్యాయం, క్రూరం అని చెప్పుకొచ్చింది. చదవండి: ఫైట్స్ చేయడం సవాల్‌గా అనిపించింది: కావ్యా థాపర్ -
కామెడీ పేరుతో అవమానించారు, ఇంత నిర్దయగా ప్రవర్తిస్తారా?: నటి
కామెడీ పండించడం అంత ఈజీ కాదు. కానీ ఇది తనకు కొట్టిన పిండి అన్నట్లుగా అవలీలగా నవ్వులు పూయించగలదు కుశా కపిల. సోషల్ మీడియాతో స్టార్డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లో, ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’, ‘సెల్ఫీ’, ‘థాంక్యూ ఫర్ కమింగ్’ వంటి పలు చిత్రాల్లోనూ నటించింది. ఇటీవల ప్రెట్టీ గుడ్ రోస్ట్ షోలో పాల్గొంది.అది నా తప్పేఅక్కడ స్టాండప్ కమెడియన్లు తన మీద కుళ్లు జోకులు వేయడాన్ని సహించలేకపోయింది. తన వ్యక్తిగత విషయాలైన విడాకుల గురించి కూడా సెటైర్లు వేయడాన్ని తట్టుకోలేకపోయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ ఒకరు చెప్పారని ఆ షోకి వెళ్లాను. నన్ను ఈరేంజ్‌లో రోస్ట్ చేస్తారనుకోలేదు. వాళ్లు ఏం ప్లాన్ చేశారనేది ముందుగానే అడిగి తెలుసుకోవాల్సింది. నా ఫ్రెండ్ మీద నమ్మకంతో నేనా పని చేయలేదు. అది నా తప్పే!అందరి ముందు చులకనగాఅక్కడున్న ప్రేక్షకులు, సాంకేతిక నిపుణుల ముందు నన్ను చులకన చేసి మాట్లాడారు. నాపై వేసిన జోక్స్ కూడా నన్ను అవమానించేట్లుగా ఉన్నాయి. వీరికి మానవత్వమే లేదా అనిపించింది. కామెడీ పేరుతో ఒక మనిషిని ఇంత దారుణంగా హేళన చేయడం కరెక్ట్ కాదు. ఆ ఎపిసోడ్ ప్రసారం చేసేందుకు కూడా నా మనసు అంగీకరించలేదు. కానీ దాన్ని అడ్డుకుంటే నేను పిరికిదాన్నని ట్రోల్ చేసేవారు. అందుకే ఆ ఎపిసోడ్ ప్రసారం కానిచ్చాను.అదే గమనించాఅయితే నా తర్వాత షూట్ చేసిన ఎపిసోడ్లలో మాత్రం వారు హద్దులు దాటలేదు. ముఖ్యంగా మహిళల విషయంలో నోటికొచ్చిన జోక్స్ వేయలేదు. ఈ ఆరు నెలల్లో నేను గమనించిందేంటంటే విడాకులు తీసుకున్న మహిళలను ఏమైనా అంటారు. వారిని విలన్లలాగా చూస్తారు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కుష కపిల లైఫ్ హిల్ గయి అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.చదవండి: నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు: ధనుష్ -
World Laughter Day: మీ నవ్వుల చల్లదనాన్ని మంచుకొండ అప్పడిగింది...
ఒకరు జోక్ వేస్తే నవ్వడం చాలా వీజీ. నవ్వించడం మాత్రం నవ్వినంత ఈజీ కాదు. టోటల్‌గా చెప్పొచ్చేదేమిటంటే... నవ్వించడం అనేది అత్యంత కష్టతరమైన టాస్క్. ఈ నవ్వుల మహారాణులు మాత్రం అవలీలగా నవ్వులు పూయిస్తూ సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులను సం΄ాదించుకున్నారు.నిఫ్ట్ గ్రాడ్యుయేట్ అయిన కుష కపిల బిల్లీ మసి, సౌత్ దిల్లీ గర్ల్స్లాంటి క్యారెక్టర్లతో నవ్వుల వర్షం కురిపిస్తోంది. ఆమెకు 1.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. నిత్యజీవిత సంఘటనల ఆధారంగా దిల్లీకి చెందిన డాలీసింగ్ కామేడినీ మేడ్ ఈజీ చేసింది. ముంబైకి చెందిన ప్రజక్తా కోలి కామెడీ వీడియోలు మోస్ట్ ΄ాపులర్ అయ్యాయి. అబ్జర్వేషనల్ కామెడీకి ఆమె వీడియోలు అద్దం పడతాయి. కోలికి యూట్యూబ్‌లో 6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. స్టాండ్–అప్ కమెడియన్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది ప్రశస్తి సింగ్. అమెజాన్ ప్రైమ్ వీడిమో సిరీస్ ‘కామిక్‌స్థాన్’ సూపర్ హిట్ అయింది. ఎంబీఏ చేసిన ప్రశస్తి ‘నవ్వించడం’ తన ΄్యాషన్ అంటోంది. వీరు మాత్రమే కాదు కనీజ్ సుర్క, శ్రిష్ఠి దీక్షిత్, నిహారిక ఎన్ఎం, సుప్రియ జోషి, సుముఖి సురేష్, ఐశ్వర్య మోహన్‌రాజ్, సుమైర... లాంటి ఎంతోమంది నవ్వుల ప్రపంచంలో మహారాణులుగా వెలిగి΄ోతున్నారు. -
ఎందెందు వెదికినా కరివేపాక్ కలదు
‘కరివేపాకులా తీసేయకు’ అని అంటాంగానీ ‘కరివేపాక్ మైసూర్‌పాక్ కంటే మహాగ్రేట్ సుమీ’ అంటుంది సోషల్ మీడియా ఫేమ్ కుశల కపిల. ఫ్యాషన్ ఎడిటర్, ఎంటర్టైన్మెంట్ రైటర్, కామెడీ కంటెంట్ క్రియేటర్‌గా ప్రతిభ చాటుకున్న కుశల తాజాగా కరివేపాకుపై దృష్టి పెట్టింది. ‘ఇందు గలదు. అందు లేదు అనే సందేహం వలదు’ టైప్‌లో కపిల కరివేపాకు గురించి ఇన్స్టాగ్రామ్ ‘రీల్’ చేసింది. ఈ రీల్ 8 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడమే కాదు ‘కడి పట్ట’ ట్రెండ్‌గా వైరల్ అయింది. -
సోషల్ మీడియా సెన్సేషన్ కుశా కపిలా గురించి ఈ విషయాలు తెలుసా?
కుశా కపిలా... సోషల్ మీడియాతో స్టార్డమ్ తెచ్చుకున్న నటి. కామెడీ కంటెంట్‌తో చిన్న చిన్న వీడియోలు షేర్ చేస్తూ వచ్చిన ఫాలోయింగ్‌తో సినీ అవకాశాలను సొంతం చేసుకుంది. అలా సినిమాలతో పాటు వరుస వెబ్ సిరీసుల్లోనూ నటిస్తోన్న ఆమె గురించి కొన్ని విషయాలు.. కుశా కపిలా.. న్యూఢిల్లీకి చెందిన పంజాబీ అమ్మాయి. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. చదువు పూర్తికాగానే.. ఫ్యాషన్ రంగంలోనే పలు సంస్థల్లో ఉద్యోగం చేసింది. కొంత కాలం కాపీ రైటర్‌గానూ పని చేసింది. ఆ తర్వాత ‘ఐదివా’ అనే ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వెబ్సైట్లో కంటెంట్ రైటర్‌గా చేరింది. సోషల్ మీడియాలో ఢిల్లీ పంజాబీ గాసిప్ ఆంటీ ‘బిల్లీ మాసి’ అనే పాత్రను క్రియేట్ చేసి.. నటించింది. దాంతో కుశా పాపులర్ అవడమే కాక సోషల్ మీడియా సెన్సేషన్గానూ మారింది. ‘సన్ ఆఫ్ అబిష్’ అనే టీవీ షోతో బుల్లితెర ప్రవేశం చేసింది. నటనపై ఉన్న ఆసక్తితో ‘ఘోస్ట్ స్టోరీస్’తో వెబ్ తెరపైనా మెరిసింది. అమెజాన్ ఒరిజినల్ కామెడీ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’లో కీలక పాత్ర పోషించి సినిమా ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ‘సెల్ఫీ’, ‘థాంక్యూ ఫర్ కమింగ్’ సినిమాల్లోనూ నటించింది. ∙ ప్రస్తుతం ‘మైనస్ వన్: న్యూ చాప్టర్’, ’సోషల్ కరెన్సీ’ వెబ్ సిరీస్‌లతో అలరిస్తోంది. జీవితంలో ఎన్నో అవమానాలు, విమర్శలను ఎదుర్కొంటేనే మనకేం కావాలో తెలుస్తుంది. – కుశా కపిలా