ఆడవారిని మాత్రమే తప్పు పట్టడం అన్యాయం: కమెడియన్‌ | Kusha Kapila: Society is Unkind to Women | Sakshi
Sakshi News home page

Kusha Kapila: విడాకులు.. నాకన్నా అమ్మ ఎక్కువ ఇబ్బందిపడుతోంది

Published Wed, Aug 7 2024 12:33 PM | Last Updated on Wed, Aug 7 2024 1:31 PM

Kusha Kapila: Society is Unkind to Women

కామెడీ కంటెంట్‌ క్రియేటర్‌ కుష కపిల గతేడాది జోరావర్‌ సింగ్‌ అహ్లువాలియా నుంచి విడాకులు తీసుకుంది. ఇది తన వ్యక్తిగత విషయం అయినప్పటికీ ఓ షోలో తన విడాకుల మీద సెటైర్లు వేశారు. అది భరించలేకపోయిందీ కమెడియన్‌. కామెడీ హద్దులు దాటొద్దని హెచ్చరించింది.

అమ్మకు ఎక్కువ ఇబ్బంది
అయినప్పటికీ జనాలు ఏదో ఒకటి కామెంట్‌ చేస్తూనే ఉన్నారని మండిపడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ సమాజం మహిళల పట్ల కాస్తయినా దయ చూపదు. విడాకుల వల్ల నాకన్నా మా అమ్మ ఎక్కువ ఇబ్బందిపడుతోంది. అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తోంది. అటు బంధువులకు ఇటు సమాజానికి వివరణ ఇస్తోంది.

అన్యాయం
నేనంటే బయట సాధారణంగా తిరగలేను, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండి ఇదంతా తప్పించుకోవచ్చు. కానీ అమ్మకు అలా కాదుగా.. తను సాధారణ జీవితం గడుపుతోంది. అందరూ నిర్మొహమాటంగా నా గురించి అడుగుతూ ఉంటే తను చెప్పలేక చెస్తోంది. ఈ సమాజం కాస్త మారింది. కానీ మారాల్సింది ఇంకా చాలా ఉంది. ఎప్పుడు ఏం జరగాలనేది మన చేతిలో లేదు కదా.. అయినా ఆడవారిని మాత్రమే తప్పు పట్టడం అన్యాయం, క్రూరం అని చెప్పుకొచ్చింది.

 చదవండి: ఫైట్స్‌ చేయడం సవాల్‌గా అనిపించింది: కావ్యా థాపర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement