Peter Handscomb
-
ఇదేమి బుద్దిరా బాబు.. ఔటైనా గ్రౌండ్లో నుంచి వెళ్లలేదు! వీడియో వైరల్
ఆస్ట్రేలియా దేశీవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ 2023-24లో భాగంగా ఆడిలైడ్ వేదికగా విక్టోరియా- సౌత్ ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విక్టోరియా బ్యాటర్ పీటర్ హ్యాండ్‌కాంబ్ ఔటైనప్పటికీ మైదానం నుంచి బయటకు వెళ్లేందుకు సముఖత చూపలేదు. ఏం జరిగిందంటే? విక్టోరియా ఇన్నింగ్స్ 13 ఓవర్లో తొలి బంతిని సౌత్ ఆస్ట్రేలియా బౌలర్ బెన్ డగెట్ అద్బుతమైన అవుట్ స్వింగర్‌గా సంధించాడు. ఈ క్రమంలో హ్యాండ్‌కాంబ్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించగా.. బంతి ఎడ్జ్ తీసుకుని థర్డ్ స్లిప్‌లో ఉన్న జేక్ లెమాన్ చేతికి వెళ్లింది. దీంతో బౌలర్‌తో పాటు సౌత్ ఆస్ట్రేలియా ఫీల్డర్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. అయితే హ్యాండ్‌కాంబ్ మాత్రం అది క్యాచ్ కాదు, నాటౌట్ అని మైదానం విడిచి వెళ్లనని పట్టుబట్టాడు. రిప్లేలో క్లియర్‌గా క్యాచ్‌ను అందుకున్నట్లు తేలినప్పటికి హ్యాండ్‌కాంబ్ మైదానం నుంచి బయటకు వెళ్లకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది. ఆఖరికి ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకుని అతడి దగ్గరకు వెళ్లి మాట్లాడి ఫీల్డ్ నుంచి బయటకు పంపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "ఇదేమి బుద్దిరా బాబు.. అదేమైనా గల్లీ క్రికెట్ అనుకున్నావా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా -
శతక్కొట్టిన టర్నర్.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఖాతాలో 17వ షెఫీల్డ్ షీల్డ్ టైటిల్
వెస్ట్రన్ ఆస్ట్రేలియా.. షెఫీల్డ్ షీల్డ్ 2022-23 టైటిల్‌ను 17వ సారి సొంతం చేసుకుంది. విక్టోరియాతో జరిగిన ఫైనల్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆట నాలుగో రోజైన ఇవాళ (మార్చి 26) విక్టోరియా నిర్ధేశించిన 91 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్రన్ ఆస్ట్రేలియా వికెట్ కోల్పోయి ఛేదించింది. కెమారూన్ బాన్‌క్రాఫ్ట్ (39), టీగ్ వైల్లీ (43) వెస్ట్రన్ ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చారు. Western Australia clinched their 17th #SheffieldShield title with a thumping nine-wicket win over Victoria! Full recap from @ARamseyCricket at the WACA + full highlights 👇https://t.co/uAEk4nL5CL — cricket.com.au (@cricketcomau) March 26, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విక్టోరియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులు సాధించి 120 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌ను దక్కించుకుంది. విక్టోరియా తొలి ఇన్నింగ్స్‌లో ఆష్లే చంద్రసింఘే (46) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆస్టన్ టర్నర్ (128) సెంచరీతో కదం తొక్కాడు. What a way to go back-to-back!! Western Australia are the 2022-23 #SheffieldShield champions! #PlayOfTheDay | @MarshGlobal pic.twitter.com/gdsFuNWgqb — cricket.com.au (@cricketcomau) March 26, 2023 అనంతరం విక్టోరియా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమై 210 పరుగులకే చాపచుట్టేసి, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ముందు 91 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ ఛేదించారు. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ జోష్ ఫిలిప్స్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరుగురిని, రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరిని ఔట్ చేయడంలో భాగం కావడం విశేషం. -
షమీ సూపర్ డెలివరీ.. దెబ్బకు ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్ హ్యాండ్స్‌కాంబ్‌ను ఓ సంచలన బంతితో షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 71 ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో నాలుగో బంతిని హ్యాండ్స్కాంబ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే మంచి లైన్ అండ్ లెంగ్త్‌లో పడ్డ బంతి బ్యాట్‌ను మిస్స్ అయి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో బ్యాటర్ చేసేది ఏమీ లేక క్రీజులో అలా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా ఇదే ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను కూడా షమీ ఓ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇప్పటివరకు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ నిలకడగా ఆడుతోంది. 75 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి ఆసీస్ 191 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(80) సెంచరీ దిశగా ప్రయాణిస్తున్నాడు. Bowled him what a delivery by mohammed shami.( shami magic🔥)#Shami #INDvAUS pic.twitter.com/ehda3vdCdH — Naaz Ahmad (@NaazAhm6229) March 9, 2023 చదవండి: PSL 2023: క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద సిక్స్.. స్టేడియం బయటికి బంతి! వీడియో వైరల్ -
ఆస్ట్రేలియా ఫీల్డర్ అద్భుత విన్యాసం.. షాక్‌లో శ్రేయాస్! వీడియో వైరల్
ఢిల్లీ వేదికగా భారత్‌తో జరగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు పీటర్ హ్యాండ్‌కాంబ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. హ్యాండ్‌కాంబ్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పెవిలియన్‌కు పంపాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ 25 ఓవర్ వేసిన నాథన్ లియోన్ బౌలింగ్‌లో రెండో బంతిని అయ్యర్ లెగ్‌సైడ్ ఫ్లిక్ చేశాడు. ఈ క్రమంలో ఫస్ట్ షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హ్యాండ్‌కాంబ్ డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే బంతి తొలుత నేరుగా అతడి చేతికి తగిలి కాస్త పైకి వెళ్లింది. వెంటనే అతడు వెంటనే డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను తీసుకున్నాడు. ఇక ఇది చూసిన అయ్యర్ ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ సంచలన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో లియోన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు 15 ఓవర్లు బౌలింగ్ చేసిన లియోన్.. 33 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక 45 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(30), రవీంద్ర జడేజా(25) భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. చదవండి: ENG vs NZ: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా Very good catch by Peter Handscomb in IND vs AUS 2nd test match #IndVsAus2023 #IndvsAus2ndtest #BGT2023 #BGT23 pic.twitter.com/jNYjnqBixL — sportsliveresults (@Ashishs92230255) February 18, 2023 -
షమీ, అశ్విన్, జడ్డూ అదుర్స్.. మొదటి రోజే ముగిసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్
India vs Australia, 2nd Test: టీమిండియాతో రెండో టెస్టులో మొదటి రోజే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగించింది. అయితే, నాగ్‌పూర్‌లో 177 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ ముగించిన కమిన్స్ బృందం.. ఢిల్లీ మ్యాచ్‌లో 263 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(81), ఆరో స్థానంలో వచ్చిన పీటర్ హ్యాండ్స్కోంబ్(72 నాటౌట్) రాణించారు. చెలరేగిన షమీ, అశూ, జడ్డూ దీంతో 78.4 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌట్ అయి తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది ఆస్ట్రేలియా. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(15)ను అవుట్ చేసి తొలి వికెట్ తీసిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ.. మొత్తంగా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లతో సత్తా చాటారు. వార్నర్, ట్రావిస్ హెడ్, నాథన్ లియోన్, మాథ్యూ కుహ్నెమన్ వికెట్లు షమీ తన ఖాతాలో వేసుకోగా.. జడేజా ఖవాజా రూపంలో కీలక వికెట్ సాధించి పలు రికార్డులు నమోదు చేశాడు. ఖవాజా ఒంటరి పోరాటం అదే విధంగా ప్యాట్ కమిన్స్, టాడ్ మర్ఫీ వికెట్లను జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అశ్విన్ మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ వికెట్లు సాధించాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా(81) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 33 పరుగులతో రాణించాడు. హ్యాండ్స్కోంబ్ విలువైన అర్ధ శతకం ఇక ఆరో స్థానంలో వచ్చిన హ్యాండ్స్కోంబ్(72) అజేయ అర్ధ శతకంతో మెరిసి ఆసీస్ మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా వాళ్లంతా కనీసం 20 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగులతో టీమిండియా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అరుణ్‌జైట్లీ స్టేడియంలో శుక్రవారం (ఫిబ్రవరి 17) మొదలైన రెండో టెస్టులోనూ పట్టు బిగించి.. విజయం సాధించి ఆధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలని పట్టుదలగా ఉంది. చదవండి: IND Vs AUS: షమీ చెవులు పిండిన అశ్విన్.. ఫోటో వైరల్ BGT 2023: గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో రాహుల్ అద్భుత క్యాచ్.. బిత్తరపోయిన ఖవాజా.. వీడియో వైరల్ ICYMI - WHAT. A. CATCH 😯😯 WOW. A one-handed stunner from @klrahul to end Usman Khawaja’s enterprising stay!#INDvAUS pic.twitter.com/ODnHQ2BPIK — BCCI (@BCCI) February 17, 2023 -
ఆసీస్ క్రికెటర్‌కు కరోనా.. ఆందోళనలో సహచర క్రికెటర్లు
లండన్: అంతర్జాతీయ క్రికెటర్లు ఒక్కొక్కరుగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తొలుత ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు వైరస్ బారిన పడగా, ఆతర్వాత శ్రీలంక ఆటగాడు వీరక్కోడి, తాజాగా ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్‌మన్ పీటర్ హాండ్స్‌కాంబ్ మహమ్మారి బారిన పడినట్టు నిర్ధారణ అయ్యింది. ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న హాండ్స్‌కాంబ్.. మిడిల్సెక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. హాండ్స్‌కాంబ్ తన తదుపరి మ్యాచ్‌లో లీస్టర్‌షైర్‌తో తలపడాల్సి ఉంది. అయితే, రెగ్యులర్‌గా నిర్వహించే పరీక్షల్లో భాగంగా అతడికి కోవిడ్ టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతని సహచర క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో అతను తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని మిడిల్సెక్స్ యాజమాన్యం ప్రకటించింది. అతని స్థానంలో ఐరిష్ ఆటగాడు టిమ్ ముర్తగ్ సారథిగా ఎంపిక చేసింది. కాగా, 2019 జనవరిలో చివరి సారిగా ఆస్ట్రేలియా టెస్టు జట్టుకి ఆడిన హ్యాండ్స్‌కబ్.. అదే ఏడాది ఫిబ్రవరిలో భారత్‌పై బెంగళూరు వేదికగా చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అదే ఏడాది జులైలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్.. ఇంటర్నేషనల్ క్రికెట్లో అతనికి ఆఖరి సిరీస్. 2016లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హ్యాండ్స్‌కబ్.. ఆసీస్ తరఫున 16 టెస్టులు, 22 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో మూడు సెంచరీలు నమోదు చేసిన హ్యాండ్స్కాంబ్.. ఐపీఎల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇదిలా ఉంటే, ఇటీవల శ్రీలంకతో సిరీస్ ఆడిన ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు క్రికెటర్లు సహా మొత్తం ఏడుగురు కరోనా బారిన పడ్డారు. ఆతర్వాత వీరితో తలపడిన శ్రీలంక బృందంలో బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేటా అనలిస్టు జీటీ నిరోషన్, శ్రీలంక రిజర్వ్ బెంచ్ ఆటగాడు వీరక్కోడికి పాజిటివ్ అని తేలింది. -
కామెరాన్.. సూపర్మ్యాన్లా పట్టేశాడు..!
మెల్బోర్న్: మార్ష్ వన్డే కప్‌లో విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా పరుగు తేడాతో గెలిచింది. అత్యంత ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేయగా, విక్టోరియా ఐదు వికెట్ల నష్టానికి 321 పరుగులే చేసి ఓటమి పాలైంది. విక్టోరియా కెప్టెన్ అరోన్ ఫించ్ 119 పరుగులు చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు. మూడో వికెట్‌కు హ్యాండ్స్కాంబ్తో కలిసి 147 పరుగులు చేయడంతో విక్టోరియా గెలుస్తుందనే అనుకున్నారంతా. అయితే హ్యాండ్ స్కాంబ్(87) ఔటే విక్టోరియా కొంపముచ్చింది. విక్టోరియా ఇన్నింగ్స్‌లో భాగంగా 28 ఓవర్‌ను కేన్ రిచర్డ్సన్ వేశాడు. ఆ ఓవర్ ఐదో బంతిని హ్యాండ్ స్కాంబ్ మిడ్ ఆఫ్- ఎక్స్ ట్రా కవర్ మీదుగా షాట్ ఆడగా, ఆ ఫీల్డింగ్ పొజిషన్లోనే కాస్త దూరంగా ఉన్న కామెరాన్ వాలెంటే అద్భుతమైన ఫీల్డింగ్‌తో అదరొగొట్టాడు. ఆ సమయంలో బంతి పైకి లేవగా పరుగెత్తుకుంటూ వెళ్లి గాల్గోనే డైవ్ కొట్టి మరీ ఒక్క చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దాంతో హ్యాండ్ స్కాంబ్ షాకయ్యాడు. అసాధ్యం అనుకున్న క్యాచ్‌ను కామెరాన్ సూపర్మ్యాన్లా ఎగిరి పట్టడంతో హ్యాండ్ స్కాంబ్ భారంగా పెవిలియన్ చేరుకున్నాడు. ఇది మ్యాచ్‌కు కీలక మలుపు. ఫలితంగా చివర వరకూ పోరాటం చేసిన విక్టోరియా పరుగు తేడాతో ఓడి పోవడంతో ఈ క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. -
ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ..!
ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ షాన్‌మార్ష్ స్థానంలో పీటర్ హ్యాండ్స్కోంబ్ ప్రపంచకప్ తుది జట్టుతో చేరతాడని ఐసీసీ పేర్కొంది. ఈ మేరకు...‘ ప్రపంచకప్‌లో భాగంగా గాయపడిన షాన్‌మార్ష్ స్థానాన్ని పీటర్ హ్యాండ్స్కోంబ్తో భర్తీ చేసేందుకు, ఆస్ట్రేలియా తదుపరి మ్యాచ్‌లలో అతడు ఆడే విషయాన్ని ఐసీసీ ధ్రువీకరించింది’ అని గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచిన ఆసీస్ తమ తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న సంగతి తెలిసిందే. శనివారం జరిగే ఈ మ్యాచ్ కోసం ఓల్డ్ ట్రఫార్డ్‌లో నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న షాన్ మార్ష్ గాయపడ్డాడు. పాట్ కమిన్స్ బంతులను ఎదుర్కొనే క్రమంలో అతడి మణికట్టుకు తీవ్ర గాయమైంది. దీంతో సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ కుడి ముంజేతికి కూడా గాయమైంది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అతడు గాయపడ్డాడు. అయితే శనివారం నాటి మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తాడని కోచ్ జస్టిన్ లాంగర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక షాన్‌మార్ష్ స్థానంలో హ్యాండ్స్‌కోంబ్‌ను ఎంపిక చేయడం గురించి మాట్లాడుతూ..‘ పీటర్‌పై నమ్మకం ఉంది. మిడిల్ ఆర్డర్లో రాణించగలడనే భావిస్తున్నాం. ఇండియా, యూఏఈ టూర్లలో అతడు గొప్ప ప్రదర్శన కనబరిచాడు’ అని లాంగర్ పేర్కొన్నాడు. కాగా హ్యాండ్స్కోంబ్ ఆస్ట్రేలియా తరఫున ఇప్పటివరకు 21 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు చేశాడు. -
ట్యాంపరింగ్‌తో సంబంధం లేదు: ఆసీస్ ఆటగాడు
సిడ్నీ : దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్సందర్భంగా చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ వివాదం యావత్ క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు ఆస్ట్రేలియా ఆటగాడు పీటర్ హ్యాండ్స్కాంబ్. గత మార్చిలో సఫారీతో మూడో టెస్టు సందర్భంగా ఆసీస్ యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ సాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసి కెమెరాలకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో హ్యాండ్స్‌కాంబ్‌కు సంబంధం ఉందని ప్రచారం జరిగింది. అప్పటి కోచ్ డారెన్ లీమన్ సూచనల మేరకు హ్యాండ్స్కాంబ్ బాన్‌క్రాఫ్ట్‌ను అప్రమత్తం చేశాడని ఓ వీడియో నెట్టింట్లో హల్చల్ చేసింది. తాజాగా ఈ ఆరోపణలను హ్యాండ్స్కాంబ్ ఖండించాడు. ఆ వీడియో ఎడిట్ చేసిందని, ఆ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నాడు. ఆ వీడియోలో ఏముందంటే.. బాన్‌క్రాఫ్ట్ సాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుండగా.. అది కెమెరాల్లో స్పష్టమైంది. దీన్నిగమనించిన కోచ్ లీమన్ వాకీటాకీ ద్వారా హ్యాండ్స్‌కాంబ్‌కు తెలియజేశాడు. దీంతో అతను నవ్వుతూ.. ఎదో మాట్లాడుతున్నట్లు చేస్తూ బాన్‌క్రాఫ్ట్‌ను హెచ్చరించగా.. అతను సాండ్‌పేపర్‌ను లోదుస్తుల్లో దాచాడు. అయితే తను ఎలాంటి హెచ్చరికలు చేయలేదని, అతన్ని అప్రమత్తం కూడాచేయలేదని, ఓ జోక్ వేసనంతేనని హ్యాండ్స్కాంబ్ స్పష్టం చేశాడు. ఇక ఈ వివాదంతో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డెవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేదం విధించగా.. బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
రెండున్నర గంటల్లో 4.5 కేజీలు తగ్గిన క్రికెటర్
సాక్షి, హైదరాబాద్: భారీ కాయస్తులు బరువు తగ్గడానికి చేయని ప్రయత్నం ఉండదు. నెలల తరబడి శిక్షణ తీసుకుంటూ ఉంటారు. టీవీల్ల వచ్చే ప్రకటనలను అనుసరిస్తారు. జిమ్‌లకు వెళ్తారు, ఎక్సర్సైజ్లు చేస్తారు. గ్రౌండ్లో పరుగులు తీస్తారు. అయినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ ఓ క్రికెటర్ మాత్రం ఒక్కరోజులోనే ఏకంగా 4.5 కేజీల బరువు తగ్గాడు. వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ పీటర్ హ్యాండ్స్కంబ్ చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో రెండో రోజు బ్యాటింగ్ చేశాడు. రెండున్నర గంట క్రీజులో ఉన్న పీటర్ 113 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఆరోజు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఆటగాళ్లు గ్రౌండ్లో చెమట చిందించారు. అలాగే ఈ రెండున్నర గంటల్లో ఏకంగా 4.5 కేజీల బరువు తగ్గాడు. దీంతో ఇతర ఆటగాళ్లు పీటర్ మీద జోకులు పేలుస్తున్నారు. -
పాకిస్తాన్‌కు ఒకే ఓవర్లో డబుల్ షాక్!
సిడ్నీ: పాకిస్తాన్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ హజెల్ వుడ్ విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్ కు దిగిన పాక్‌కు నాలుగో ఓవర్లో షాకిచ్చాడు. ఆ ఓవర్లో ఓపెనర్ షార్జిల్ ఖాన్(4)ను, బాబర్ అజమ్(0) ను పేసర్ హజెల్ వుడ్ పెవిలియన్బాట పట్టించాడు. దీంతో 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన పాక్‌ను మరో ఓపెనర్ అజహర్ అలీ, యూనిస్ ఖాన్ హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. అజహర్ అలీ(123 బంతుల్లో 58 నాటౌట్: 5 ఫోర్లు), వెటరన్ ప్లేయర్ యూనిస్ ఖాన్ (112 బంతుల్లో 64 నాటౌట్: 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 2 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్ 538/8 కి డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హ్యండ్స్‌కోంబ్ సెంచరీ(215 బంతుల్లో 110, 9 ఫోర్లు) సాధించాడు. మరోవైపు మాట్ రెన్షా (293 బంతుల్లో 184 ; 20 ఫోర్లు) కెరీర్లో తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మలచలేకపోయాడు. రెన్షా, హ్యాండ్స్కోంబ్, వార్నర్(113) సెంచరీలు సాధించడంతో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 538/8 కి తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. హ్యాండ్స్కోంబ్కు కార్ట్ రైట్(37), కీపర్ మాథ్యూ వేడ్(29) నుంచి సహకారం లభించింది. స్టార్క్(16) ఔట్ అయ్యాక కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. పాక్ బౌలర్లలో వహాబ్ రియాజ్ మూడు వికెట్లు సాధించాడు. ఇతర బౌలర్లలో ఇమ్రాన్ ఖాన్, అజహర్ అలీ చెరో రెండు వికెట్లు తీశారు. -
ఆసీస్ కు మరో ఎదురుదెబ్బ
లండన్: ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆటకు దూరం కాగా, తాజాగా సీనియర్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్, ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్-నిలె కూడా గాయాలతో సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వీరిద్దరి స్థానంలో పీటర్ హ్యాండ్స్ కొబ్, జాన్ హాస్టింగ్స్ లను జట్టులోకి తీసుకున్నారు. ఐదు వన్డేల సిరీస్ లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గి ఆసీస్ దూకుడు మీద ఉంది. ఇలాంటి సమయంలో కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడడం ఆస్ట్రేలియా టీమ్ ను కలవరపరుస్తోంది. వార్నర్, వాట్సన్, కౌల్టర్ లేకపోవడం తమకు ప్రతికూలం అయినప్పటికీ ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయడం ద్వారా వారి స్థానాన్ని భర్తీ చేశామని ఆసీస్ కోచ్ డారెన్ లెహమాన్ తెలిపారు. కాగా, టెస్టు క్రికెట్ కు వాట్సన్ ఆదివారం గుడ్ బై చెప్పాడు.