aatma gourava yatra
-
‘ప్రాణం పోయినా సరే.. రైల్వేజోన్‌కు పోరాటం’
-
‘ప్రాణం పోయినా సరే.. రైల్వేజోన్‌కు పోరాటం’
అనకాపల్లి : తన ప్రాణం పోయినా సరే విశాఖ రైల్వేజోన్ సాధించేవరకూ పోరాటం చేస్తానని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధన కోసం ఆయన ఇవాళ్టి నుంచి 11 రోజులు ఆత్మగౌరవ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ రైల్వేజోన్ కోసం విశాఖ ప్రాంత ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారన్నారు. విశాఖ ప్రజలు ఓడారని, బీజేపీ ఎంపీ హరిబాబు పదేపదే చెబుతున్నారని, అయితే ఇక్కడ గెలిచిన నేతలు ఢిల్లీలో మాత్రం పోరాటం చేయలేకపోతున్నారన్నారు. కాగా అమర్నాథ్ ఆత్మగౌరవ యాత్ర అనకాపల్లి నుంచి మొదలై చిట్టివలస వరకూ సాగుతుంది. రైల్వేజోన్ రావాల్సిందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని వైఎస్ఆర్ సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నాయని, ఇప్పుడు రైల్వే జోన్ రాకుండా చేస్తున్నాయన్నారు. రైల్వేజోన్ కోసం తీవ్రమైన పోరారం చేయాల్సి ఉందని, రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉందని ప్రభుత్వం పదేపదే చెబుతోందని, మరో లక్ష కోట్ల అప్పుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. అప్పులు తెచ్చినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని ధర్మాన అన్నారు. తెలంగాణ కంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రైల్వేజోన్ రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. దీనికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అందరూ పాదయాత్రలో పాల్గొనాలని సూచించారు. విశాఖకు రైల్వేజోన్ రావాలంటే గుడివాడ అమర్నాథ్ పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతు తెలిపాలని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ... వెనుకబాటుతనం ఇక్కడే ఉందని, విశాఖకు రైల్వే జోన్ రావాలని అన్నారు. రైల్వే జోన్ వస్తే కొన్నివేల ఉద్యోగాలు వస్తాయని, అమర్నాథ్ ఆత్మగౌరవ యాత్రకు ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలన్నారు. -
'చూశారా... మాదే బలం..' టీడీపీయే బలంగా ఉందని చంద్రబాబు ప్రచారం
రాష్ట్రంలో తెలుగుదేశం పనైపోయిందని ఆ పార్టీ నేతలంతా దిగాలుపడిపోగా... లేదులేదు మనకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పడానికి ఏం చేయాలని తలపట్టుకున్న అధినేతకు మెరుపులాంటి ఒక ఆలోచన తట్టిందట... అదే అవనిగడ్డ. రాష్ట్రంలో ఒక్క టీడీపీయే బలంగా ఉందని చెప్పడానికి అవనిగడ్డ ఫలితం గురించి ప్రచారం చేయమన్నారట చంద్రబాబు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన టీడీపీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య అనారోగ్యంతో మృతి చెందటంతో ఉప ఎన్నికలో ఆయన కుమారుడు పోటీచేసి గెలిచిన సంగతి తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందిన కారణంగా ఆ కుటుంబం నుంచే అభ్యర్థిని నిలబెడుతున్నామనీ, ఏక గ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని కోరుతూ చంద్రబాబు స్వయంగా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా వంటి అన్ని రాజకీయ పార్టీల అధినేతలందరికీ లేఖలు రాశారు. ఆయన విజ్ఞప్తికి అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించి పోటీకి దూరంగా ఉన్నాయి. అయితే ఇద్దరు స్వతంత్రులు మాత్రం పోటీకి నిలవడంతో ఎన్నిక అనివార్యమై పోలింగ్ జరగ్గా టీడీపీ అభ్యర్థి 61 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్న సమయంలో ప్రజలు ఒక్క టీడీపీని మాత్రమే ఆదరిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణని ప్రచారం చేయాలని చంద్రబాబు ఆదేశించారట. ఇంకేముంది తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. రేపటి రోజున రాష్ట్రమంతా ఇవే ఫలితాలొస్తాయని వియ్యంకుడు బాలకృష్ణ తొడగొట్టారు. ఇక ఢిల్లీలో టీడీపీ ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాలు, లాబీల్లో కలిసిన జాతీయ పార్టీ నేతలందరికీ ఇదే విషయం చెప్పడం ప్రారంభించారు. విషయం తెలియని కొందరు ఇతర రాష్ట్ర నేతలు ఔరా...!అని ఆశ్చర్యపోయారట. పార్లమెంట్లో విభజన గొడవ జరుగుతున్న సమయంలో రాష్ట్రానికి చెందిన నేతలు కొందరు లాబీల్లో కలిసినప్పుడు... ‘మీరెంత చేసినా ఫలితం లేదు. కొద్ది రోజుల కింద మీ రాష్ట్రంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఉపఎన్నిక జరిగితే టీడీపీయే గెలిచింది కదా’.. అని ఉత్తర భారత దేశానికి చెందిన సీనియర్ బీజేపీ నేత ఒకరు చెప్పడంతో అక్కడున్న నేతలంతా ఆశ్చర్యపోయారట. ఉపఎన్నికా... అదెక్కడ జరిగింది? అని కాసేపు బుర్ర బద్దలు కొట్టుకుంటే అవనిగడ్డ గుర్తుకొచ్చిందట. అసలక్కడ ఏ పార్టీ పోటీ చేయలేదు కదా... అని ఒక టీడీపీ ఎంపీని ఆరా తీయగా చంద్రబాబు మంత్రాంగం తెలియడంతో అవాక్కయ్యారట. ‘ఔరా.. బాబూ... ప్రచారంలో నీకు నీవే సాటి’ అనుకుని, ఆ ఇద్దరు ఇండిపెండెంట్లను కూడా వాళ్లే నిలబెట్టారేమో... అని సందేహం వ్యక్తం చేశారట.