ఆంధ్రా బ్యాంకు నుంచి మొబైల్ యాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ తాజాగా తమ ఖాతాదారుల కోసం మొబైల్ యాప్ ఆవిష్కరించింది. ఏబీ తేజ్ (తొలి దశ) యాప్‌ను సెంటర్ ఫర్ టెలికమ్యూనికేషన్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ వ్యవస్థాపకులు టి. హనుమాన్ చౌదరి ఆవిష్కరించినట్లు బ్యాంకు తెలిపింది. ఈ యాప్‌తో కస్టమర్లు మొబైల్ బ్యాంకింగ్ సదుపాయానికి సత్వరం నమోదు చేసుకోవచ్చని, యాక్టివేట్ కూడా చేసుకోవచ్చని వివరించింది.
అలాగే రోజంతా లావాదేవీలు జరిపేందుకు, మొబైల్.. డీటీహెచ్ మొదలైన వాటికి రీచార్జ్ చేసుకునేందుకు కూడా యాప్ ఉపయోగపడుతుందని బ్యాంకు తెలిపింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా ఆంధ్రా బ్యాంక్ పథకాలు, సర్వీసుల గురించి దీని ద్వారా తెలుసుకోవచ్చని వివరించింది. మరిన్ని ఫీచర్స్‌తో రెండో దశ యాప్‌ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు ఆంధ్రా బ్యాంకు తెలిపింది.