Abdulla Yameen
-
ఓటమిని అంగీకరిస్తున్నా
కొలంబో: మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు, భార త్ విరోధిగా పేరుపడ్డ అబ్దుల్లా యామీన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఎట్టకేలకు అంగీకరించారు. మాల్దీవులతో సాన్నిహిత్యం కోసం భారత్, చైనాల మధ్య పోరు సాగుతున్న ప్రస్తుత తరుణంలో.. ఫలితాన్ని యామీన్ అంగీకరిం చపోవచ్చన్న సందేహాలకు ఆయన తెరదిం చారు. ‘మాల్దీవుల ప్రజలు వారికి కావాల్సింది నిర్ణయించారు. నేను ఫలితాల్ని అంగీకరిస్తు న్నాను’ అని దేశ ప్రజల్ని ఉద్దేశించి యామీన్ ప్రసంగించారు. ఎన్నికల్లో విజయం సాధించిన విపక్షాల అభ్యర్థి ఇబ్రహీం మహ్మద్ సోలిహ్‌ను కలిసి అభినందించానని ఆయన తెలిపారు. 2013లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యామీన్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన అభిసంశనకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతల్ని, వ్యతిరేకంగా తీర్పునిచ్చిన జడ్జీల్ని జైలుకు పంపారు. భారత్ వ్యతిరేకిగా మారి చైనాతో దోస్తీకి ప్రాధాన్యతని చ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన సోలిహ్ భారత్ అనుకూలవాది పేరుపడ్డారు. భారత్‌తో సంబంధాలకు ప్రాధాన్యం ఆదివారం వెలువడ్డ అధ్యక్ష ఫలితాల్లో మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన సోలిహ్‌కు 58.3 శాతం ఓట్లు దక్కగా.. యామీన్‌కు 41.7 శాతం ఓట్లే వచ్చాయి. సోలిహ్ విజయం సాధించారని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించడంతో పాటు, ప్రభుత్వ మీడియా కూడా ప్రసారం చేయడంతో యామీన్ తప్పుకోవడం ఖాయమని ముందుగానే తెలిసిపోయింది. సోలిహ్‌కు భారత్ అభినందనలు తెలిపింది. ‘ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య శక్తుల విజయానికి సంకేతమే కాదు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలన అవసరాన్ని ప్రతిఫలించాయి’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. యామీన్‌ను దెబ్బకొట్టిన చైనాతో దోస్తీ భారత్ ఎత్తుగడ పనిచేసింది. పొరుగునే ఉన్న మాల్దీవుల్లో ఈ ఏడాది రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు సైన్యాన్ని పంపకుండా సంయమనం పాటించడం ఇప్పుడు కలిసొచ్చింది. తమ దేశంలో భారత్ సైనిక జోక్యం చేసుకుంటే చైనా సహాయం కోరదామన్న యామీన్ పన్నిన వ్యూహం పారలేదు. కొన్ని దశాబ్దాలుగా స్నేహహ స్తాన్ని అందిస్తున్న భారత్‌ను కాదని, చైనాకు దగ్గర కావడమే కాకుండా తమ దేశాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన యామీన్‌పై ప్రజల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమైంది. చైనా నుంచి 130 కోట్ల డాలర్ల రుణాలు తీసుకోవడంతో దేశం అప్పుల ఊబిలో కూరుకుని ఆర్థిక సంక్షోభంలో పడింది. దీంతో పాటు మౌలికసదుపాయాలు, ఇతర ప్రాజెక్టులపై చైనా 200 కోట్ల డాలర్ల వరకు ఖర్చుచేసింది. అభివృద్ధి ప్రాజెక్టులను చైనీస్ కంపెనీలకు అప్పగించారు. చైనా చేపట్టిన సిల్క్‌రోడ్డు, భారత్ వ్యతిరేకిస్తున్న బెల్ట్రోడ్డుకు యామీన్ మద్దతు ప్రకటించారు. 2013లో అధికా రాన్ని చేపట్టాక యామీన్ తన రాజకీ య ప్రత్యర్థులను ఖైదు చేయడం లేదా ఇతర దేశాలకు ప్రవాసం వెళ్లేలా చేశారు. రాజకీయ వివాదాలు ముదరడంతో ఈ ఏడాది ఫిబ్రవ రిలో అబ్దుల్ యామీన్ 45 రోజుల పాటు దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. -
మాలీ పీఠంపై మరోనేత
మాలీ : తీవ్ర రాజకీయ సంక్షోభం నడుమ జరిగిన మాల్దీవులు అధ్యక్ష ఎన్నికల్లో విపక్షనేత ఇబ్రహీం మహ్మద్ నల్హీ అఖండ విజయం సాధించారు. మాల్దీవులు ప్రజల్లో నియంతగా ముద్రపడ్డ ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్ యామీన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసి, ఆయన పాలనకు చరమగీతం పాడారు. ఇప్పటి వరకు ముగిసిన 92 శాతం ఓటింగ్ లెక్కింపులో ఇబ్రహీం మహ్మద్‌కు అత్యధికంగా 53 శాతం ఓట్లు వచ్చినట్లు సోమవారం మాల్దీవులు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆయన విజయం దాదాపు ఖరారైంది. మిగిలిన ఫలితాలు అనంతరం ఈసీ ఆయన విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మాల్దీవులు డెమోక్రటిక్ పార్టీకి చెందిన మహ్మద్ ఆ దేశ విపక్షనేతగా గుర్తింపు పొందారు. విజయం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది ప్రజలు అందించిన ప్రజాస్వామ్య విజయం అని అన్నారు. తన గెలుపుకు కృషిచేసిన మాల్దీవులు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా గత రెండేళ్ల నుంచి మాల్దీవులు తీవ్ర అంతర్గత సంక్షోభం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రాజకీయ సంక్షోభం కారణంగా అబ్దుల్ యామీన్ గత ఫిబ్రవరిలో 45 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని విధించారు. ఇబ్రహీం విజయంపై భారత విదేశాంగశాఖ అయనకు అభినందనలు తెలిపింది. మాల్దీవులు గతకొంత కాలంగా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. హిందూమహా సముద్ర ప్రాంతంలో చైనా, మాల్దీవుల మధ్య వివాదం ఉన్న నేపథ్యంలో.. భారత్ మాల్దీవులును దగ్గర చేసుకునేందుకు ఆర్థిక పరంగా సహకారం అందిస్తోంది. -
అత్యవసర పరిస్థితిని ఎత్తేశారు
-
అత్యవసర పరిస్థితిని ఎత్తేశారు
మాలే, మాల్దీవులు : ఆసియా ఖండంలో అతి చిన్న దేశం మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితిని ఎత్తేస్తున్నట్లు దేశాధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ప్రకటించారు. రాజకీయ సంక్షోభం తలెత్తడంతో గత 45 రోజులుగా మాల్దీవుల్లో ఎమర్జెన్సీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు భద్రతా బలగాల సూచనల మేరకు ఎమర్జెన్సీని తొలగించినట్లు యమీన్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఎంపీలను తిరిగి పదవుల్లోకి తీసుకోవాలని దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యక్షుడు యమీన్ తీవ్రంగా వ్యతిరేకించారు. అత్యున్నత న్యాయస్థాన తీర్పును అమలు చేసేందుకు నిరాకరించారు. ఈ క్రమంలోనే యమీన్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఎమర్జెన్సీ సమయంలో మాజీ అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్‌ను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్, మరో న్యాయమూర్తి అలీ హమీద్‌తో పాటు నలుగురు శాసనకర్తలను అరెస్ట్ చేశారు. -
పాక్, చైనాలకు మాల్దీవుల దూతలు
మాలె: మాల్దీవుల అంతర్గత సంక్షోభ పరిష్కారానికి అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ పాకిస్తాన్, చైనా, సౌదీ అరేబియాలకు ప్రత్యేక దూతలను పంపారు. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా తీరికలేని షెడ్యూల్ కారణంగా తమ ప్రతినిధి ఇక్కడికి రావడం లేదని ఢిల్లీలో మాల్దీవుల రాయబారి వెల్లడించారు. తమ దేశంలోని పరిస్థితులను వివరించేందుకు మాల్దీవుల ఆర్థికాభివృద్ధి మంత్రి మహ్మద్ సయీద్ చైనాకు, విదేశాంగ మంత్రి మహ్మద్ ఆసిమ్ పాకిస్తాన్‌కు, వ్యవసాయ మంత్రి మహ్మద్ షైనీ సౌదీ అరేబియాకు వెళ్లారు. ఢిల్లీలో మాల్దీవుల రాయబారి అహ్మద్ మహ్మద్ గురువారం స్పందిస్తూ..తమ ప్రతినిధి పర్యటనకు తొలుత భారత్‌నే ఎంచుకున్నామని కానీ, ఈ వారంలో మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాలు విదేశీ పర్యటనల్లో బిజీగా ఉండబోతుండటం వల్లే విరమించుకున్నామని తెలిపారు. మాల్దీవుల్లో ప్రజాస్వామ్యంపై భారత్ వెలిబుచ్చిన ఆందోళనలపై ఆ దేశం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎవరైనా ప్రతినిధిని పంపే ముందు ప్రత్యేక ప్రొటోకాల్ ఉంటుందని, తమ ప్రతినిధి ఎందుకు రాబోతున్నారో భారత్‌కు మాల్దీవులు తెలియజేయలేదని వెల్లడించాయి. -
సుప్రీం జడ్జీల అరెస్ట్.. ప్రజలు షాక్!
మాలే: హిందూ మహా సముద్రంలోని ద్వీప దేశమైన మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన కొన్ని గంటల్లోనే చీఫ్ జస్టిస్ అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో సీనియర్ జడ్జి జస్టిస్ అలీ హమీద్, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ కీలక నేతను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా సుప్రీం జడ్జీలనే అరెస్ట్ చేయడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. రాజకీయ అనిశ్చితి కారణంగా 15 రోజులపాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ సోమవారం (ఫిబ్రవరి 5న) ప్రకటించారు. ఎమర్జెన్సీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులలో ఇద్దరిని అరెస్ట్ చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏ కారణాలు, సెక్షన్ల కింద అరెస్ట్ చేశారో తెలపలేదు.. కానీ అరెస్ట్ విషయాన్ని ట్వీటర్ ద్వారా పోలీసులు వెల్లడించారు. రాజకీయ సంక్షోభానికి కారణాలివే... 9 మంది ప్రతిపక్ష నేతలను జైలు నుంచి విడుదల చేయాలని మాల్దీవుల సుప్రీంకోర్టు గత గురువారం ఆదేశించింది. ఇందుకు అధ్యక్షుడు యమీన్ నిరాకరించడంతో రాజకీయ సంక్షోభం నెలకొంది. తీర్పును వెనక్కి తీసుకోవాలంటూ యమీన్ ప్రధాన న్యాయమూర్తులకు లేఖ రాశారు. జడ్జీలు తమ తీర్పుపై వెనక్కి తగ్గక పోవడంతో యమీన్ ఎమర్జెన్సీ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భద్రతా దళాలకు విశేషాధికారాలు సంక్రమిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో సీనియర్ జడ్జి జస్టిస్ అలీ హమీద్‌లను అరెస్ట్ చేసి మిగతా ఇద్దరు జడ్జీలు తమ తీర్పును మార్చుకోవాలని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లయింది. -
ముదిరిన సంక్షోభం.. మాల్దీవుల్లో ఎమర్జెన్సీ
-
మాల్దీవుల్లో అత్యవసర స్థితి
మాలే: రాజకీయ సంక్షోభం నెలకొన్న మాల్దీవుల్లో అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ సోమవారం అత్యవసర స్థితి విధించారు. దీంతో భద్రతా దళాలకు విశేషాధికారాలు సంక్రమిస్తాయి. అనుమానితులను వారు అరెస్ట్ చేయొచ్చు. నిర్బంధించొచ్చు. 15 రోజులపాటు అత్యవసర స్థితి అమలులో ఉంటుందని యమీన్ వ్యక్తిగత కార్యదర్శి అజిమా ప్రభుత్వ టీవీ చానల్ ద్వారా ప్రకటించారు. 9 మంది అసమ్మతి నేతలను జైలు నుంచి విడుదల చేయాలని మాల్దీవుల సుప్రీంకోర్టు గత గురువారం ఆదేశించడం, ఇందుకు యమీన్ నిరాకరిస్తున్న నేపథ్యంలో దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. తీర్పును వెనక్కు తీసుకోవాలంటూ యమీన్ తాజాగా న్యాయమూర్తులకు లేఖ రాశారు. అత్యవసరమైతే తప్ప భారతీయులు కొన్నిరోజులు మాల్దీవులకు వెళ్లకూడదని భారత విదేశాంగ శాఖ సూచించింది. -
ముదిరిన సంక్షోభం.. మాల్దీవుల్లో ఎమర్జెన్సీ
మాలే: హిందూ మహా సముద్రంలోని ద్వీప దేశమైన మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. తాజాగా అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు. రానున్న 15 రోజులపాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని ప్రకటించారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అనర్హత వేటు ఎదుర్కొన్న 12 మంది ఎంపీలను మళ్లీ పదవుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధ్యక్షుడు యమీన్ పాటించకపోవడంతో దేశంలో రాజకీయ ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఆందోళనలతో మాల్దీవులు అట్టుడుకుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు యమీన్ ఎమర్జెన్సీ విధించారు. అధ్యక్షుడు యమీన్‌ను అభిశంసించేలా మాల్దీవుల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకూడదంటూ పోలీసులు, భద్రతా దళాలను ప్రభుత్వం తాజాగా ఆదేశించిన సంగతి తెలిసిందే. గతంలో యమీన్ 9 మంది అసమ్మతి నేతలను జైలులో పెట్టించారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి వెళ్లిన మరో 12 మందిపై అనర్హత వేటు వేశారు. జైలులో ఉన్న 9 మందిని విడుదల చేయాలని, అలాగే, 12 మంది సభ్యులపై అనర్హతను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు గత గురువారం ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ ఆదేశాలను పాటించడానికి అధ్యక్షుడు యమీన్ అంగీకరించకపోవడంతో దేశంలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చి.. ఎమర్జెన్సీకి దారితీసింది. -
మాల్దీవులు మాజీ ఉపాధ్యక్షుడికి జైలు
మాలె: మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను హత్య చేసేందుకు కుట్రపన్నిన కేసులో ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్కు 15 ఏళ్ల జైలు శిక్షపడింది. గత సెప్టెంబర్‌లో స్పీడ్ బోటులో బాంబు పెట్టి అబ్దుల్లాను చంపేందుకు అదీబ్ కుట్రపన్నినట్టు నేరం రుజువైంది. అదీబ్తో పాటు ఆయన బాడీగార్డులు ఇద్దరిని కోర్టు దోషులుగా ప్రకటించింది. వీరికి ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్షపడింది. గురువారం తీర్పు వెలువరించిన న్యాయస్థానం ఈ రోజు శిక్షను ఖరారు చేసింది. తాజా తీర్పుతో యమీన్ శత్రువులు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయారు. కొందరు దేశ బహిష్కరణకు గురికాగా, మరికొందరు జైలుపాలయ్యారు. -
మాజీ ప్రధాని భార్యపై భారీ ఆరోపణలు!
పేరుకు ఆమె నడిపింది ఓ మానవ హక్కుల సంస్థ. కానీ ఓ నియంతకు కొమ్ముకాసి.. భారీగా సొంత ఖజానా నింపుకొంది. మానవ హక్కులను నిలువునా పాతరేసి.. తన సొంత ప్రయోజనాలను దండిగా కాపాడుకుంది. తన భర్త ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవి నిర్వర్తించినప్పటికీ, ఆమె అవినీతికి పాల్పడేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఈ మేరకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య చెరీ బ్లెయిర్ నిలువునా అవినీతి ఆరోపణల్లో మునిగిపోయి.. ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మాల్దీవులకు చెందిన అవినీతి నియంత అబ్దుల్లా యమీన్‌తో చెరీ బ్లెయిర్ సాగించిన రహస్య ఆర్థిక వ్యవహారాల గూడుపుఠాణీ బట్టబయలైంది. అబ్దుల్లా యమీన్‌కు అండగా నిలిచినందుకు రోజుకు రెండు వేల పౌండ్ల చొప్పున మొత్తం రెండు లక్షలకుపైగా పౌండ్ల సొమ్ము ఆమె కంపెనీకి ముట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చెరీ కంపెనీ ఒమ్నియా స్ట్రాటెజీకి అక్రమంగా పెద్ద మొత్తం తరలిన ఈ నిధులపై దర్యాప్తు జరిపేందుకు సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్, అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతున్నాయి. మల్దీవులకు నియంత పాలకుడిగా ఉన్నప్పుడు యమీన్ భారీగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన 1700మంది ప్రతిపక్ష కార్యకర్తలను జైళ్లలో బంధించాడు. న్యాయాన్ని అవహేళన చేస్తూ ముగ్గురు ప్రతిపక్ష నేతలను శిక్షించాడు. ఈ నియంత పాలకుడితో చెరీ బ్లేయిర్ సాగించిన అక్రమ ఆర్థిక వ్యవహారాలు తాజాగా డైలీమెయిల్ పత్రిక వెలుగులోకి తెచ్చింది. - నియంతృత్వ పాలకుడైన అబ్దుల్లా యమీన్ తో ఆరు నెలలపాటు పనిచేసేందుకు 4.20 లక్షల పౌండ్లతో చెరీ బ్లెయిర్ ఓ ఒప్పందం చేసుకుంది. - అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నానని చెప్పుకొనే చెరీ.. నియంత పాలనలో ఉన్న మాల్దీవుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంతో పనిచేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. - కానీ నియంత యమీన్‌కు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆమె కంపెనీకి అక్రమమార్గంలో ఏకంగా 2.10 లక్షల పౌండ్లు ముట్టాయి. వీటిని ఆయుధ సరఫరా వ్యాపారి, ఉగ్రవాది, ఇంటర్ పోల్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు మహమెద్ ఆలం లతీఫ్ ఆమె కంపెనీ ఖాతాలో జమచేయడం గమనార్హం. మల్దీవులు అధ్యక్షుడిగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మహమ్మద్ నౌషధ్ను సైనిక చర్య ద్వారా అబ్దుల్లా యమీన్ గద్దె దించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కోర్టు విచారణలో న్యాయసహాయం కోసం చెరీ బ్లెయిర్ లీగల్ కంపెనీ 'ఒమ్నియా స్ట్రాటెజీ'ని అబ్దుల్లా యమీన్ గత ఏడాది వేసవిలో నియమించుకున్నారు. అయితే ఈ సంస్థ మానవ హక్కులకు సంబంధించి న్యాయసహాయం కోసం కాకుండా అంతర్జాతీయ మీడియా ముందు నియంత ప్రభుత్వాన్ని సమర్థించడానికి, అంతర్జాతీయ దౌత్య సంబంధాలు మెరుగుపరచడానికి లోపాయికారి సహకారం అందించిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. -
దేశద్రోహం ఆరోపణలతో ఉపాధ్యక్షుడు అరెస్టు
-
దేశద్రోహం ఆరోపణలతో ఉపాధ్యక్షుడు అరెస్టు
మాల్ (మాల్దీవులు): మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను చంపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై ఆ దేశ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ అరెస్టయ్యారు. దేశద్రోహం ఆరోపణలపై అదీబ్‌ను అరెస్టుచేసి ధూనిధో జైలుకు తరలించామని అధికారులు శనివారం ట్విట్టర్లో తెలిపారు. పదిరోజుల కిందట సౌదీ అరేబియా తీర్థయాత్ర నుంచి తిరిగొస్తుండగా అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ప్రయాణిస్తున్న బోటులో బాంబు పేలింది. ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఆయన వెంటనే రక్షణమంత్రి మూసా అలీ జలీల్‌పై వేటు వేశారు. ఇంతకుపూర్వం ఉపాధ్యక్షుడు మహమద్ జలీల్ కూడా దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన 33 ఏళ్ల అదీబ్ కూడా ప్రస్తుతం అవే ఆరోపణలతో జైలుపాలయ్యాడు. -
జీఎంఆర్‌కు అప్పగించేది లేదు..
న్యూఢిల్లీ: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్‌కు పెద్ద షాక్. మాలె విమానాశ్రయాన్ని విదేశీ కంపెనీకిగానీ, తమ దేశానికి చెందిన కంపెనీకిగానీ అప్పగించేది లేదని మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ స్పష్టం చేశారు. విమానాశ్రయ నిర్వహణ బాధ్యతను తమ ప్రభుత్వానికి చెందిన మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ కంపెనీ చేపడుతుందని ఆయన వెల్లడించారు. దీంతో విమానాశ్రయ నిర్వహణ ప్రాజెక్టు తిరిగి తమకే వస్తుందని ఎదురు చూస్తున్న జీఎంఆర్‌కు పెద్ద ఎదురుదెబ ్బ తగిలినట్టయింది. ‘విమానాశ్రయ పూర్తి నిర్వహణ బాధ్యతలు మాల్దీవుల ప్రభుత్వానికి చాలా ముఖ్యమైంది. జీఎంఆర్కుగానీ భారత కంపెనీలకుగానీ మేము వ్యతిరేకం కాదు. వాణిజ్య, భద్రతాపరంగా ఈ విమానాశ్రయం మాకు అత్యంత ప్రాధాన్యమైంది’ అన్నారు. కొత్త ప్రాజెక్టు చూసుకోండి.. మాలె విమానాశ్రయ ప్రాజెక్టును జీఎంఆర్‌కు తిరిగి అప్పగించేది లేదని తేల్చి చెప్పిన యమీన్.. మాల్దీవుల్లో ఏదైనా కొత్త ప్రాజెక్టును చూసుకోవాలని జీఎంఆర్‌కు సూచించారు. విమానాశ్రయ ప్రాజెక్టు వివాదాన్ని కోర్టు వెలుపల సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైందని చెప్పారు. కాగా, మాలె విమానాశ్రయ ఆధునీకరణ, 25 ఏళ్లపాటు నిర్వహణ ప్రాజెక్టును 2010లో జీఎంఆర్ చేపట్టింది. ఒప్పందంలో లొసుగులు ఉన్నాయని ఆరోపిస్తూ కొత్తగా అధికారంలోకి వచ్చిన మాల్దీవుల ప్రభుత్వం 2012 నవంబర్‌లో కాంట్రాక్టును రద్దు చేసిన సంగతి తెలిసిందే. -
మాల్దీవుల అధ్యక్షుడిగా అబ్దుల్లా యమీన్ ఎన్నిక
మాలె: మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఆర్థికవేత్త అబ్దుల్లా యమీన్(54) ఎన్నికయ్యారు. మాజీ నియంతృత్వ పాలకుడు మౌమూన్ గయూమ్‌కు సవతి సోదరుడైన అబ్దుల్లా ప్రొగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ అభ్యర్థిగా పోటీచేసి 51.39 శాతం ఓట్లు సాధించి, ఊహించని విజయం సొంతం చేసుకున్నారు. సమీప ప్రత్యర్థి మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్‌కు 48. 61 శాతం ఓట్లు లభిం చాయి. ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లోనూ మెజారిటీ సాధించిన నషీద్ ఈ పరాజయం ఊహించలేదు. ఆ రెండు పర్యాయాలు కూడా 50 శాతం ఓట్లు సాధించకపోవడంతో ఆయనను విజేతగా ప్రకటించలేదు. మజ్లిస్(మాల్దీవుల పార్లమెంట్)లో అబ్దుల్లా ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తారు.