‘తెలుగు కవిత్వం’లో జోహార్ వైఎస్సార్!
జాతీయ సదస్సులో వైఎస్సార్‌పై కవితలు వినిపించిన ఆచార్య హరికృష్ణ
కడప కల్చరల్(కడప): తాను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వం, పాలనకు అద్దం పట్టే కవితలను ద్రవిడ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎం.హరికృష్ణ వినిపించారు. 20 మంది ప్రముఖ కవులు డాక్టర్ వైఎస్సార్‌పై రాసిన కవితలను ఆయన భావయుక్తంగా, భావోద్వేగంతో వివరించారు. వైఎస్సార్ జిల్లా కడపలో సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, యోగి వేమన వర్సిటీతో కలసి ‘70 ఏళ్ల భారత స్వాతంత్య్రం–తెలుగు కవిత్వం’ అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు.
శనివారం సదస్సు ముగింపు సందర్భంగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్‌పై పలువురు రాసిన కవితలను ఆచార్య ఎం.హరికృష్ణ వినిపించారు. ‘ప్రజాకాంక్షలతో నేసిన ఖద్దరు బట్టల్లో నిలువెత్తు పావురంలా మా రాజన్న నడుస్తుంటే.., ప్రముఖ కవి శిఖామణి రాసిన ‘ఒక్క సూర్యుడు’ కవితను ఉటంకిస్తూ ‘ఎవరు అలవోకగా అరచేతిని అలా గాలిలోకి ఎత్తి అటూ, ఇటూ సుతారంగా ఊపితే... కవితలు ఆలపించి అలరించారు.