achuthanandan
-
కేరళకు ఆయనే ఫిడెల్ కాస్ట్రో
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి గా ఎవరిని నియమిస్తారనే విషయంపై కమ్మూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఎం) స్పష్టతనిచ్చింది. 92 ఏళ్ల వయసున్న వీఎస్ అచ్యుతానందన్(వీఎస్) ను నియమించే ఉద్దేశం పార్టీకి లేదని సీపీఎం జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి వ్యాఖ్యలతో స్పష్టమైంది. వీఎస్ ఆయన క్యూబా మాజీ ప్రెసిడెంట్ ఫిడేల్ కాస్ట్రోతో పోల్చారు. కామ్రెడ్ వీఎస్ ఫెడరల్ కాస్ట్రో లలాగా ప్రభుత్వానికి సలహా దారుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కేరళ సీఎంగా పినరయి విజయన్ ను నియమించాలని పార్టీ నిర్ణయించినట్టు ఏచూరి స్పష్టం చేశారు. వీఎస్,విజయన్ లు కేరళ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
92 ఏళ్ల వయసులోనూ ఎన్నికల పోరుకు రెడీ!
ఆయన మార్క్సిస్టు కురువృద్ధుడు. వయసు ఏకంగా 92 ఏళ్లు. అయినా కూడా ఎన్నికల పోరుకు సై అంటున్నారు. ఆయనే కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. తన పార్టీ సరేనంటే తాను పోటీ చేయడం ఖాయమని ఆయన విలేకరులతో అన్నారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఇప్పటికి ఆరుసార్లు శాసనసభలో అడుగుపెట్టారు. ప్రస్తుతం సభలో ప్రతిపక్ష నేత. 1996లో మాత్రం తొలిసారిగా.. పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా ఓడిపోయారు. ప్రజాభిమానం మెండుగా ఉన్న ఆయన.. 2006-11 సంవత్సరాల మధ్య కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2011 నుంచి ఇప్పటివరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఈసారి ముఖ్యమంత్రి పదవికి మరో ప్రధాన నేత పినరయి విజయన్ కూడా పోటీ పడుతున్నారు. ఒకవేళ వామపక్షాలు విజయం సాధిస్తే మాత్రం.. అచ్యుతానందన్, విజయన్ల మధ్య సీఎం పదవికి గట్టిపోటీయే ఉంటుందని చెబుతున్నారు. -
ఆర్థికమంత్రి అవినీతిపై సీబీఐ విచారణ కోరరేం?
కేరళ ఆర్థికమంత్రి కేఎం మణి అవినీతిపై సీబీఐ విచారణ కోరరెందుకని సీపీఎం రాష్ట్ర నాయకత్వంపై సీనియర్ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్ మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్కు ఆయనో లేఖ రాశారు. మణి మీద సీబీఐ విచారణ కోరేందుకు పార్టీలో ఏ కమిటీ వ్యతిరేకంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 418 బార్లను తెరిపించాలంటే 5 కోట్లు ఇవ్వాలని అడిగిన ఆర్థికమంత్రి మణి, కోటి రూపాయలు తీసుకున్నట్లు ఓ బార్ యజమాని ఆరోపించిన విషయం తెలిసిందే. అప్పటినుంచే మణి రాజీనామా చేయాలని అచ్యుతానందన్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించాలని కూడా అడుగుతున్నారు. అయితే, ఈ విషయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పినరయి విజయన్ లాంటి వాళ్లు ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటున్నారు. దాంతో అచ్యుతానందన్ మండిపడుతున్నారు.