ACJ
-
ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసు కుంటున్న చర్యల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. లోకాయుక్త నియామకానికి చర్యలు ప్రారం భించింది. రాష్ట్ర లోకాయుక్తగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించాలని నిర్ణయించింది. ఇటీవల తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం ప్రకారం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించుకునే వెసులు బాటు ప్రభుత్వానికి ఉంది. లోకాయుక్త నియామకం విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిం చాల్సి ఉంటుంది. ఇటీవల లోకాయుక్త నియామక ఫైలును పరిశీలించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్.. లక్ష్మణ్‌రెడ్డి నియామకానికి ఆమోదముద్ర వేశారు. తర్వాత ప్రభుత్వం కూడా ఆయన నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో ఉత్తర్వులు వెలువ డనున్నాయి. లోకాయుక్త పరిధి.. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటరీ కార్య దర్శులపై వచ్చే ఫిర్యాదులను విచారించే పరిధి లోకాయుక్తకు ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్ విప్‌లతో పాటు.. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం నియమించే ఏ అధికారిపైనైనా కూడా ఫిర్యాదు చేయ వచ్చు. జెడ్పీ, మండల పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు సభ్యులు, మునిసిపాలిటీ చైర్పర్సన్, ఇతర సభ్యులు తదితరులపై వచ్చే ఫిర్యాదుల న్నింటిపై లోకాయుక్త విచారణ జరపవచ్చు. న్యాయమూర్తులు, జ్యుడీషియల్ సర్వీసు సభ్యులు.. లోకాయుక్త పరిధిలోకి రారు. రాష్ట్రంలోనే ఏదైనా కోర్టు అధికారి, ఉద్యోగి కూడా లోకాయుక్త పరిధిలోకి రారు. ఏపీ అకౌంటెంట్ జనరల్, ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు, ఎన్నికల అధికారులు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఏపీఏటీ చైర్మన్, ఇతర సభ్యులను విచారించే పరిధి లోకాయుక్తకు ఉండదు. అవినీతి, అధికార దుర్వినియోగం తదితరాల విషయంలో ఏ వ్యక్తి అయినా లోకాయుక్తను ఆశ్రయించవచ్చు. ఫిర్యాదుదారు తన పూర్తి వివరాలతో ఫారమ్ 1, 2ను పూర్తిచేసి.. లోకాయుక్త రిజిస్ట్రార్ పేరిట రూ.150 ఫీజు చెల్లించాలి. తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు తేలితే ఫిర్యాదుదారుని ప్రాసిక్యూషన్ చేయవచ్చు. గరిష్టంగా ఏడాది జైలు శిక్ష కూడా విధించవచ్చు. -
జస్టిస్ నాగార్జునరెడ్డిపై విశ్వాసం ఉంది
• కొన్ని ప్రయోజనాలు ఆశించే ఆయనపై తప్పుడు ఆరోపణలు • ఏసీజేకు న్యాయవాదుల వినతి సాక్షి, హైదరాబాద్: రాజ్యసభలో 61 మంది ఎంపీలు అభిశంసన నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డికి హైకోర్టు న్యాయవాదులు పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలి పారు. న్యాయమూర్తిగా జస్టిస్ నాగార్జునరెడ్డిపై తమకు పూర్తి విశ్వాసం ఉందంటూ దాదాపు 650 మందికి పైగా న్యాయవాదులు సంతకాలు చేశారు. నిర్ధోషిత్వం నిరూపితమయ్యే వరకు విధులకు దూరంగా ఉండాలన్న ఆయన నిర్ణయాన్ని మార్చుకుని, విధులకు హాజరయ్యేలా చూడాలంటూ వారు శుక్రవారం ఏసీజే జస్టిస్ రమేశ్రంగనాథన్కు వినతిపత్రం ఇచ్చారు. సస్పెన్షన్‌లో ఉండటం తో పాటు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొంటు న్న ఓ న్యాయాధికారి తప్పుడు డాక్యుమెంట్ల సృష్టించి దురుద్దేశాలతో జస్టిస్ నాగార్జునరెడ్డిపై నిందలు మోపారు. ఈ కేసులో ఆ న్యాయాధికారి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించేందుకు సైతం నిరాకరించింది. కోర్టు బయట మీడియాలో న్యాయవ్యవస్థ ప్రతిష ్టను దిగజార్చేలా మాట్లాడినందుకు ఆ అధికారిపై కోర్టు సుమోటోగా ధిక్కార చర్యలు చేపట్టింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. నిర్భయంగా, నిష్పాక్షికంగా విధులు నిర్విర్తిస్తున్న ఓ సిట్టింగ్ జడ్జి నైతిక స్థైర్యాన్ని దెబ్బతిసేందుకు కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్ని ప్రయోజనాలు ఆశించి మచ్చలేని, దేనికి జంకని జస్టిస్ నాగార్జునరెడ్డిపై నిరాధారణ ఆరోపణలు చేశారు. ఈ యత్నాలను న్యాయవాదులందరం ఖండిస్తున్నాం. న్యాయవ్యవస్థకు, న్యాయవాద వృత్తికి ప్రమాదకరమైన ఇలాంటి చర్యలను మొగ్గలోనే తుంచేయాలి అని న్యాయవాదులు ఏసీజేను కోరారు. దీనిపై ఏసీజే సానుకూలంగా స్పందించినట్లు న్యాయవాదులు తెలిపారు. ఇదిలా ఉంటే, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు కూడా ఇదే అభ్యర్థనతో ప్రత్యేకంగా ఏసీజేను కలిశారు. ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయవాదులుగా జస్టిస్ నాగార్జునరెడ్డిపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈ వినతిపత్రాలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పం పాలని న్యాయవాదులు నిర్ణరుుంచారు. -
పెండింగ్ సమస్యలు పరిష్కరించండి
ఏసీజేకు న్యాయశాఖ ఉద్యోగుల సంఘం వినతి సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్‌కు న్యాయశాఖ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి నేతృత్వంలో తెలంగాణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు జగన్, రాజశేఖర్‌రెడ్డి మంగళవారం ఏసీజేను కలసి వినతిపత్రం సమర్పించారు. న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలపై సంఘం ప్రతినిధులతో చర్చించాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. శెట్టి కమిషన్ సిఫార్సుల మేరకు కొత్తగా ఇవ్వాల్సిన పోస్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలని అక్కడే ఉన్న న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డిని ఏసీజే ప్రశ్నించారు. కాగా, తమ సమస్యలపై ఏసీజే సానుకూలంగా స్పందించారని, సమ్మె కాలాన్ని లీవుగా పరిగణించాలన్న తమ అభ్యర్థనను పరిశీలిస్తామని హామీ ఇచ్చారని లక్ష్మారెడ్డి తెలిపారు. ఏసీజే ఆదేశాల మేరకు తమ సమస్యలపై చర్చించేందుకు రిజిస్ట్రార్ (పరిపాలన) నాగార్జున ఈనెల 14న సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. -
అలహాబాద్ సీజేగా జస్టిస్ బొసాలే
ఉమ్మడి హైకోర్టు ఏసీజే పదోన్నతిపై బదిలీ * రేపు కొత్త బాధ్యతలు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే పదోన్నతిపై అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేర కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం ఉదయం 9.30 గంటలకు ఆయన అలహాబాద్ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపడతారు. బదిలీ సందర్భంగా ఆయనకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు, రిజి స్ట్రార్లు, సిబ్బంది, న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మొదటి కోర్టు హాలులో జరిగిన వీడ్కోలు సమావేశంలో జస్టిస్ బొసాలే మాట్లాడారు. న్యాయాధికారులు రోడ్లెక్కడం బాధాకరం న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాపై నిరసన తెలియచేస్తూ తెలంగాణ న్యాయాధికారులు రోడ్డెక్కి ర్యాలీ నిర్వహించడం బాధాకరమని జస్టిస్ బొసాలే ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయాధికారులు రోడ్లపైకి వచ్చారని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థలో క్రమశిక్షణకే అత్యధిక ప్రాధాన్యతని, ఇందుకు విరుద్ధంగా న్యాయాధికారులు వ్యవహరించినందునే వారి పై సస్పెన్షన్ వేటు వేశామని చెప్పారు. వ్యవస్థలు మనపై ఆధారపడి మనుగడ సాగించడం లేదని, వ్యవస్థలపై మనమే ఆధారపడ్డామన్న విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. వ్యవస్థపై నమ్మకం ఉంచి ఓపికతో ఉన్నప్పుడు సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎన్.వి.రమణ పలు సందర్భాల్లో కీలక సలహాలు, సూచనలు చేసి, విధి నిర్వహణలో సాయపడ్డారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన హైకోర్టు వార్షిక నివేదికను విడుదల చేశారు. అంతకుముందు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ మాట్లాడుతూ, హైకోర్టు సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులకు జస్టిస్ బోసాలేనే కారణమని కొనియాడారు. అనంతరం తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, లోక్ అదాలత్‌ల ద్వారా వేల కేసులను పరిష్కరించిన ఘనత జస్టిస్ బొసాలేకే దక్కుతుందన్నారు. పెండింగ్ కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు జస్టిస్ బొసాలే చేసిన కృషి మరువలేనిదని ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అన్నారు. ఘనంగా సన్మానం: అనంతరం ఉమ్మడి రాష్ట్రాల జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలో జస్టిస్ బొసాలేకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, అకాడెమీ డెరైక్టర్ రఫీ తదితరులు పాల్గొన్నారు. -
బెట్టు సడలించి.. మెట్టు దిగి
- నేటి నుంచి విధుల్లోకి న్యాయాధికారులు - సస్పెన్షన్లపై తుది నిర్ణయం ఏసీజే కమిటీదే - సమ్మె విరమించిన న్యాయశాఖ ఉద్యోగులు - సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ - నేటి నుంచి కోర్టుల్లో కార్యకలాపాలు యథాతథం - న్యాయవాదుల ఆందోళనలపై నేడు ప్రకటన! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ న్యాయాధికారులు బెట్టు సడలించారు. మెట్టు దిగొచ్చి విధుల్లో చేరేందుకు నిర్ణయించారు. సెలవులకు ఫుల్స్టాప్ పెట్టి గురువారం నుంచే విధుల్లో చేరుతామని ప్రకటించారు. 11 మంది న్యాయాధికారులపై హైకోర్టు విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తేనే విధుల్లో చేరుతామని వారు తొలుత ప్రకటించినా, తరవాత మనసు మార్చుకున్నారు. బేషరతుగా విధుల్లో చేరాల్సిందేనని హైకోర్టు నుంచి స్పష్టమైన సంకేతాలు అందడంతో తీవ్ర తర్జనభర్జనల అనంతరం, సస్పెన్షన్ ఎత్తివేత షరతు లేకుండానే విధుల్లో చేరేందుకు నిర్ణయించారు. తమ సమస్యల పరిష్కారానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హామీ, గవర్నర్ చొరవ, కక్షిదారులకు ఇబ్బందులు కలిగించవద్దన్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) ప్రకటనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంఘం నేతలు తెలిపారు. సమస్యలు తప్పక పరిష్కారమవుతాయన్న నమ్మకం తమకుందని, సస్పెన్షన్ల ఎత్తివేతను పరిశీలిస్తామని ఏసీజే చెప్పారని, ఈ నేపథ్యంలో సెలవుల్లో కొనసాగడం సరికాదన్న అభిప్రాయం తమ సమావేశంలో వ్యక్తం కావడంతో విధుల్లో చేరికకు నిర్ణయించామని వివరించారు. విధులకు హాజరవని కాలాన్ని సెలవులుగా పరిగణించాలని, తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు. దీంతో 9 రోజులుగా కొనసాగుతున్న న్యాయాధికారుల నిరసనలకు తెరపడినట్లయింది. న్యాయవాదులు ఆందోళనలను ఇంకా కొనసాగిస్తారా, లేదా అన్నదానిపై స్పష్టత రాలేదు. తదుపరి కార్యాచరణపై వారు బుధవారం ప్రకటన విడుదల చేసే అవకాశముంది. శెట్టి కమిషన్ సిఫారసుల అమలు కోసం సమ్మెకు దిగిన న్యాయశాఖ ఉద్యోగులు కూడా సమ్మెను విరమించినట్లు ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో తమ చర్చలు ఫలించినట్లు సంఘం నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో కింది కోర్టులన్నీ బుధవారం నుంచి యథావిధిగా పనిచేయనున్నాయి. ఉలిక్కిపడ్డ న్యాయవ్యవస్థ న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపు జాబితాపై నిరసనలు ప్రారంభించిన తెలంగాణ న్యాయాధికారులకు న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు కూడా జత కలిసి వివిధ కార్యక్రమాలు చేపట్టారు. న్యాయాధికారులు గవర్నర్, ఏసీజేలను స్వయంగా కలిశారు. జూన్ 26న ఏకంగా రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. 120 మందికి పైగా న్యాయాధికారులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. రాజ్‌భవన్‌కు ప్రదర్శనగా వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. వారిలా రోడ్డెక్కి నిరసనలు తెలియచేయడం న్యాయవ్యవస్థ చరిత్రలో అదే మొదటిసారి! దీన్ని క్రమశిక్షణారాహిత్యం, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించిన హైకోర్టు 11 మంది న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. సమ్మెకు దిగిన న్యాయశాఖ ఉద్యోగుల్లో 11 మందిని కూడా సస్పెండ్ చేసింది. న్యాయాధికారుల్లో అత్యధికులు మూకుమ్మడి సెలవులపై వెళ్లి హైకోర్టుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. దాంతో కింది కోర్టుల్లో కేసుల విచారణకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. న్యాయ శాఖ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగడంతో కోర్టుల్లో తాళాలు తేరిచేవారు కూడా లేకుండాపోయారు. న్యాయవాదుల జేఏసీ బృందం వేర్వేరుగా సీజేఐ జస్టిస్ ఠాకూర్‌ను కలిశారు. న్యాయాధికారుల కేటాయింపు జాబితా సమస్యను పరిష్కరిస్తారని ఆయన హామీ ఇవ్వడంతో నిరసనలు, ఆందోళనల తీవ్రత బాగా తగ్గింది. తరువాత ఏసీజే, మిగతా హైకోర్టు న్యాయమూర్తులు జూలై 1న ప్రకటన విడుదల చేశారు. కక్షిదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నందున వెం టనే విధుల్లో చేరాలని సూచించారు. లేదంటే ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామన్నారు. గవర్నర్ చొరవ... సస్పెన్షన్లు ఎత్తివేస్తే తప్ప విధులకు హాజరయ్యేది లేదని న్యాయాధికారులు, న్యాయవాదులు, ఉద్యోగులు తేల్చి చెప్పడంతో గవర్నర్ నరసింహన్ స్వయంగా చొరవ తీసుకుని న్యాయాధికారులను సోమవారం పిలిపించుకుని మాట్లాడారు. వెంటనే విధుల్లోకి చేరాలని స్పష్టం చేశారు. సీజేఐ, ఏసీజే ప్రకటన, గవర్నర్ చొరవతో వారు మెత్తబడ్డారు. గవర్నర్ సూచన మేరకు సోమవారం రాత్రి న్యాయాధికారుల బృందం ఏసీజే వద్దకు వెళ్లి న్యాయాధికారుల సస్పెన్షన్ వ్యవహారంపై చర్చించింది. సస్పెన్షన్లను ఎత్తివేయాలని కోరగా ఏసీజే హామీ ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పలు అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. అన్ని విషయాలు తాను చూసుకుంటానని, బేషరతుగా విధుల్లో చేరాల్సిందేనని ఏసీజే వారికి తేల్చి చెప్పారు. న్యాయాధికారులు రోడ్డెక్కడాన్ని హైకోర్టు తీవ్ర క్రమశిక్షణరాహిత్యంగా భావిస్తున్నందునే ఏసీజే హామీ ఇవ్వలేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. దాంతో న్యాయాధికారులు మంగళవారం ఉదయం అత్యవసరంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. విధుల్లో చేరాలని తీర్మానించారు. -
‘విభజన’ మార్గదర్శకాలు అమలు చేయండి
ఏసీజేకు తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కింది కోర్టుల విభజన నిమిత్తం ఫిబ్రవరిలో జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితం గా అమలయ్యేలా చూడాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం, న్యాయవాదుల జేఏసీ బుధవారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బొసాలేకు విజ్ఞప్తి చేశా యి. సంఘం అధ్యక్షుడు జి.మోహనరావు, జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు ఏసీజేకు వినతిపత్రం సమర్పించారు. కింది స్థాయి న్యాయ వ్యవస్థ విభజన నిమిత్తం న్యాయాధికారుల నుంచి హైకోర్టు ఆప్షన్లు కోరిందని, ఇందుకు మార్గదర్శకాలూ జారీ చేసిందని వారు తెలిపారు. అయితే ఏపీకి చెందిన న్యాయాధికారులు తెలంగాణకు ఆప్షన్ ఇచ్చినట్లు తెలిసిందని, దీనివల్ల తెలంగాణ న్యాయాధికారులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు.