జస్టిస్ నాగార్జునరెడ్డిపై విశ్వాసం ఉంది
• కొన్ని ప్రయోజనాలు ఆశించే ఆయనపై తప్పుడు ఆరోపణలు
• ఏసీజేకు న్యాయవాదుల వినతి
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభలో 61 మంది ఎంపీలు అభిశంసన నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డికి హైకోర్టు న్యాయవాదులు పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలి పారు. న్యాయమూర్తిగా జస్టిస్ నాగార్జునరెడ్డిపై తమకు పూర్తి విశ్వాసం ఉందంటూ దాదాపు 650 మందికి పైగా న్యాయవాదులు సంతకాలు చేశారు. నిర్ధోషిత్వం నిరూపితమయ్యే వరకు విధులకు దూరంగా ఉండాలన్న ఆయన నిర్ణయాన్ని మార్చుకుని, విధులకు హాజరయ్యేలా చూడాలంటూ వారు శుక్రవారం ఏసీజే జస్టిస్ రమేశ్‌రంగనాథన్‌కు వినతిపత్రం ఇచ్చారు.
సస్పెన్షన్‌లో ఉండటం తో పాటు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొంటు న్న ఓ న్యాయాధికారి తప్పుడు డాక్యుమెంట్ల సృష్టించి దురుద్దేశాలతో జస్టిస్ నాగార్జునరెడ్డిపై నిందలు మోపారు. ఈ కేసులో ఆ న్యాయాధికారి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించేందుకు సైతం నిరాకరించింది.
కోర్టు బయట మీడియాలో న్యాయవ్యవస్థ ప్రతిష ్టను దిగజార్చేలా మాట్లాడినందుకు ఆ అధికారిపై కోర్టు సుమోటోగా ధిక్కార చర్యలు చేపట్టింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. నిర్భయంగా, నిష్పాక్షికంగా విధులు నిర్విర్తిస్తున్న ఓ సిట్టింగ్ జడ్జి నైతిక స్థైర్యాన్ని దెబ్బతిసేందుకు కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్ని ప్రయోజనాలు ఆశించి మచ్చలేని, దేనికి జంకని జస్టిస్ నాగార్జునరెడ్డిపై నిరాధారణ ఆరోపణలు చేశారు. ఈ యత్నాలను న్యాయవాదులందరం ఖండిస్తున్నాం. న్యాయవ్యవస్థకు, న్యాయవాద వృత్తికి ప్రమాదకరమైన ఇలాంటి చర్యలను మొగ్గలోనే తుంచేయాలి అని న్యాయవాదులు ఏసీజేను కోరారు.
దీనిపై ఏసీజే సానుకూలంగా స్పందించినట్లు న్యాయవాదులు తెలిపారు. ఇదిలా ఉంటే, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు కూడా ఇదే అభ్యర్థనతో ప్రత్యేకంగా ఏసీజేను కలిశారు. ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయవాదులుగా జస్టిస్ నాగార్జునరెడ్డిపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈ వినతిపత్రాలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పం పాలని న్యాయవాదులు నిర్ణరుుంచారు.