acquaintances
-
అయినవారిపైనే అకృత్యాలు
ఆఫీస్ పని ముగించుకుని ధరణి (పేరు మార్చాం) ఇంటికెళ్లింది. భర్త పవన్ ఓ పెద్దాయనతో మాట్లాడుతున్నాడు. ఆ పెద్దాయన ఎవరా అనుకుంటూ గదిలోకి వెళ్లబోయింది ధరణి. ఇంతలో భర్త పవన్.. ‘ధరణీ.. ఈయన నీకు మావయ్య అవుతారట. చిన్నప్పుడు మీ ఇంటి పక్కనే ఉండేవారట. నువ్వు ఈయన చేతుల్లోనే పెరిగావట. ఈ ఊళ్లో బంధువుల ఇంటికి వచ్చారట. నువ్వు ఇక్కడే ఉంటున్నావని తెలిసి చూసి పోదామని వచ్చారట’ అన్నాడు. ధరణి లోనికి వెళ్లిపోయింది. చిన్ననాటి ఘటనలు ఆమె కళ్లముందు కదలాడాయి. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు.. పక్కింట్లో ఉండే ఆ పెద్దాయన తనను ఆడించేవాడు. ఆ ముసుగులో ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు. అలా రోజురోజుకు అతడి అకృత్యాలు పెరుగుతూ వచ్చాయి. ఆ విషయాలు గుర్తొచ్చి ధరణి వళ్లు జలధరించింది. కళ్లు కోపంతో ఎరుపెక్కాయి. ఆ పెద్దాయనకు భార్య కాఫీ తీసుకొస్తుందనుకున్నాడు పవన్. ఎంతసేపటికీ ధరణి బయటకు రాలేదు. ‘తనకు నేను గుర్తు రాలేదనుకుంట’ అంటూ ఆ పెద్దాయన మెల్లగా జారుకున్నాడు. ధరణి లాంటి బాలికలు, మహిళలు తెలిసిన వారి చేతిలోనే అత్యాచారాలకు గురవుతున్నారని జాతీయ నేర గణాంకాల సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. సాక్షి, అమరావతి: కుటుంబ సభ్యులు.. బంధువులు.. స్నేహితులు.. సహోద్యోగులు.. సోషల్ మీడియా ఫ్రెండ్స్.. అందరూ తెలిసినవారే. కానీ.. అందరూ తమ మంచి కోరుకునే వారేనని బాలికలు, మహిళలు అనుకుంటే పొరపాటే. బాగా తెలిసిన ఆ గోముఖాల మాటున ఎన్నో వ్యాఘ్రాలుంటాయి. అవకాశం చిక్కితే.. ఒంటరిగా ఉంటే కబళించేందుకు ఏమాత్రం వెనుకాడవు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక మరోసారి ఈ విషయంలో బాలికలు, మహిళలను అప్రమత్తం చేస్తోంది. దేశంలో బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిలో అత్యధికులు వారికి బాగా తెలిసిన వారేనని నివేదిక వెల్లడించింది. ఏకంగా 96 శాతం అత్యాచార కేసుల్లో దోషులు బాధిత మహిళలకు బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారు, సహోద్యోగులేనని సవివరంగా నివేదించింది. 2022లో దేశంలో మహిళలపై అత్యాచారాలకు సంబంధించి ఎన్సీఆర్బీ తాజాగా విడుదల చేసిన ఈ నివేదిక విస్మయపరిచే వాస్తవాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా సగటున రోజుకు 88 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని ఆ నివేదిక తెలిపింది. స్నేహం.. ప్రేమ.. పెళ్లి పేరిట 2022లో దేశవ్యాప్తంగా 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. వాటిలో 14,582 కేసుల్లో స్నేహం, ప్రేమ, పెళ్లి పేరిట నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారు. 248 కేసుల్లో లైంగిక దాడి / సామూహిక లైంగిక దాడి, హత్యలకు బరితెగించారు. ఈ కేసుల్లో మొత్తం 29,900 మంది దోషులుగా తేలారు. వారిలో ఏకంగా 28,873 మంది లైంగిక వేధింపులకు గురైన బాలికలు, మహిళలకు తెలిసిన వారే అకృత్యాలకు పాల్పడటం గమనార్హం. కేవలం 1,027 మంది మాత్రమే బాధిత మహిళలకు ఏమాత్రం పరిచయం లేనివారు లేదా ఇప్పటికీ ఇంకా గుర్తించనివారు ఉన్నారు. అత్యధికంగా రాజస్థాన్‌లో.. దేశంలో విస్తీర్ణం, జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలుగా గుర్తింపు పొందిన 13 రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాల్లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో అత్యాచార కేసుల్లో 5,399 మంది దోషులుగా అభియోగాలు నమోదదయ్యాయి. వారిలో బాధిత మహిళలకు తెలిసిన వారు 5,131 మంది ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో నమోదైన అత్యాచార కేసుల్లో తెలంగాణ 814 మంది నిందితులతో 12వ స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ చివరి (15వ స్థానం)లో ఉంది. 2022లో ఏపీలో అత్యాచార కేసుల్లో 621 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో బాధిత మహిళలకు తెలిసిన వారే 604 మంది ఉన్నారు. వారిలో కుటుంబ సభ్యులు 39 మంది, స్నేహితులు, విడిపోయిన భర్తలు 294 మంది, కుటుంబ స్నేహితులు, ఇరుగుపొరుగు వారు, సహోద్యోగులు 271 మంది ఉన్నారు. అవగాహన పెంపొందించాలి బాగా పరిచయం ఉన్నవారే బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వారిలో కుటుంబ సభ్యుల నుంచి సహోద్యోగుల వరకు ఉంటున్నారు. బాలికలు, మహిళల్లో సరైన అవగాహన పెంపొందిచడమే ఈ సమస్యకు సరైన పరిష్కారం. ప్రధానంగా బాలికలతో తల్లిదండ్రులు వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. లైంగిక దాడులకు గురికాకుండా ఉండేలా అవగాహన కల్పించాలి. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి తెలియజేయాలి. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తే వెంటనే ప్రతిఘటించేలా.. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలనే అవగాహన పెంపొందించాలి. సోషల్ మీడియాలో స్నేహాలు, ఆన్లైన్ ఛాటింగ్‌లలో విషయంలో తగిన పరిధిలో ఉండటం, అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఇబ్బందికర పరిస్థితులు తెలెత్తితే వెంటనే రక్షణ ఎలా పొందాలన్నది బాలికలకు, మహిళలకు తెలియజేయాలి. మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ వంటి వాటిని సద్వినియోగం చేసుకోవడంపై అవగాహన కల్పించాలి. – కేజీవీ సరిత, ఎస్పీ, మహిళా భద్రత విభాగం, సీఐడీ -
సొత్తు కోసం గొంతు కోశాడు
సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి పోలీసుస్టేషన్ పరిధిలో గత గురువారం జరిగిన మహిళ దారుణ హత్య కేసును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఆమె ఒంటిపై ఉన్న సొత్తు కోసం పరిచయస్తుడైన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడైన దండు రాముడు అలియాస్ కూర్మను అరెస్టు చేసినట్లు నార్త్‌జోన్ డీసీపీ జి.చందనా దీప్తి మంగళవారం వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా, బండ్రావల్లికి చెందిన కూర్మ తొలినాళ్లల్లో తన స్వస్థలంలోనే కూలీగా జీవనం సాగించాడు. ఆపై తెలుగు గంగ కాలువ పనుల కోసం కుటుంబంతో సహా కర్నూలు జిల్లాకు వలసవెళ్లాడు. మూడేళ్ల క్రితం నగరానికి వచి్చన అతగాడు సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో నెలకు రూ.3 వేల జీతానికి పని చేశాడు. అప్పట్లో ఇతడికి తన సహోద్యోగినితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో ఆమె పేరుతో తన కుడి చేతిపై పచ్చ»ొట్టు వేయించుకున్నాడు. అనివార్య కారణాల నేపథ్యంలో ఆమె దూరం కావడంతో కూర్మ మద్యానికి బానిసగా మారాడు. నిర్మాణ రంగంలో కూలీగా మారిన ఇతగాడు ఆ పనుల కోసం కామారెడ్డితో పాటు కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాలకు వెళ్లి వస్తుండేవాడు. ప్రస్తుతం బోయిన్‌పల్లిలో ఉంటున్న అతడికి అక్కడి కూరగాయల మార్కెట్లో పని చేసే రత్లావత్ దేవమ్మతో పరిచయమైంది. ఇద్దరూ కలిసి తరచు కల్లు కాంపౌండ్లకు వెళ్లి కల్లు తాగేవారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆఖరణాలపై కన్నేసిన అతను గత గురువారం పథకం ప్రకారం బోయిన్పల్లి ఆర్టీసీ కాలనీలోని కాంపౌడ్‌కు తీసుకువెళ్లి ఎక్కువ కల్లు తాగించాడు. మత్తులో ఉన్న ఆమెను తిరుమలగిరి ఎల్ఐసీ చౌరస్తా సమీపంలోని ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్లాడు. అక్కడే పిడిగుద్దులు గుద్ది కింద పడిపోయేలా చేశాడు. అచేతనంగా పడి ఉన్న ఆమెపై కూర్చున్న కూర్మ తన వద్ద ఉన్న బ్లేడ్‌తో గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న రూ.8 వేల నగదు, పుస్తెల తాడు, కాళ్ల పట్టీలు తేలిగ్గానే అతడి చేతికి చిక్కినా చెవులకు ఉన్న కమ్మెలు మాత్రం తీయడం కష్టమైంది. దీంతో ఏకంగా చెవుల కింది భాగాన్ని కోసేసి దాంతో సహా కమ్మెలు పట్టుకుపోయాడు. దేవమ్మ హత్యపై తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రంగంలోకి దిగిన టాస్‌్కఫోర్స్ పోలీసులు నిందితుడిని పట్టుకుని సొత్తు రికవరీ చేయడంతో పాటు అతడిని తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు. (చదవండి: అంబులెన్స్ దొంగ అరెస్టు) -
మాటకు బానిస
పాదుషా గారు తన తలపై నుంచి కిరీటాన్ని ఒక్క క్షణం పాటు కూడా తొలగించే వారు కాదు. మంత్రులు, సన్నిహితులు పాదుషా గారిని కాసేపు కిరీటం తీసి ఉపశమనం పొందండి అని చెప్పినా ససేమిరా అనేవారు. ఒకరోజు పాదుషా గారికి అత్యంత సన్నిహితుడైన మంత్రి ఈ రహస్యాన్ని తెలుసుకునేందుకు పాదుషాగారిని గుచ్చిగుచ్చి అడగడం మొదలెట్టాడు. పాదుషా గారు ఎంతగా దాటవేయాలనుకున్నా కుదరలేదు. చివరికి ఒక షరతుతో తన రహస్యాన్ని చెప్పారు. ‘‘నా తలపై ఒక కొమ్ము మొలిచింది అందుకే నేను ఎప్పుడూ కిరీటం తీయడానికి ఇష్టపడను’’ అని చెప్పారు. ఈ సంగతి మూడో మనిషికి చెప్పకూడదనే షరతుతో మంత్రిగారి ముందు బట్టబయలు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే రాజ్యమంతా ఈ విషయం దావానలంలా పాకింది. అది తెలిసి పాదుషా గారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వెంటనే ఫలానా మంత్రిని హాజరుపరచాలని హుకుం జారీచేశారు. తన షరతును ఉల్లంఘించినందుకు శిక్షించేందుకు పాదుషాగారు ఒరలోనుంచి కత్తిని తీసి మంత్రిపై ఒక్క వేటు వేయబోయారు. అంతలోనే మంత్రి ఆ కత్తిని అడ్డుకుని ‘‘మీరు పాదుషా అయి ఉండి కూడా మీ వ్యక్తిగత రహస్యాన్ని గుట్టుగా ఉంచలేకపోయారు. మరి మేమెలా ఈ రహస్యాన్ని గుట్టుగా ఉంచగలుగుతామనుకున్నారు? నన్నెలా శిక్షించదలిచారో మీకూ అంతే శిక్ష పడాలి.’’ అని అన్నాడు. పాదుషాగారు ఆలోచనలో పడ్డారు. మాట, విల్లునుంచి వదిలిన బాణం తిరిగి రాలేవు. అంతరంగంలో ఉన్నంతవరకూ మాటలు మన బానిసలవుతాయి. అవి బయటికి రాగానే వాటికి మనం బానిసలవ్వాల్సి ఉంటుందన్నది ఇందులోని నీతి. – ముహమ్మద్ ముజాహిద్ -
పరిచయస్తులతోనే మహిళలకు ముప్పు
రోజూ దేశంలో ఎక్కడో ఒకచోట లైంగిక దాడి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే ఇరుగుపొరుగు వాళ్లు, పరిచయస్తులే మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2015లో లైంగికదాడి బాధితులు చేసిన ఫిర్యాదుల్లో 50 శాతమందికి పైగా నిందితుల్లో ఇరుగుపొరుగువారే ఉన్నారు. ఇక గతేడాది నమోదైన మొత్తం లైంగిక దాడి కేసుల్లో 95 శాతం మంది నిందితులు పరిచయస్తులే కావడం విస్తుగొలిపే విషయం. దేశ రాజధాని ఢిల్లీ సహా హిమచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, చండీగఢ్ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మహిళలకు కుటుంబ సభ్యుల నుంచే రక్షణ లేకుండా పోతోంది. ఇంట్లో మామ, తండ్రి, ఇతర మగవాళ్ల వేధింపులకు బలైన మహిళలు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని ఓ మహిళా కార్యకర్త చెప్పారు. ఇక యుక్తవయసులో ఉన్న మహిళలకు లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో తెలియడం లేదని డీపీఎస్ బొకరా డైరెక్టర్ హేమలతా ఎస్ మోహన్ తెలిపారు. 'కుటుంబ సభ్యులు ఇలాంటి విషయాల్లో పిల్లలకు చైతన్యం కలిగించడం లేదు. స్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది' అని హేమలత చెప్పారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో తండ్రి నుంచే అక్కాచెల్లెల్లకు వందలసార్లు వేధింపులు ఎదురయ్యాయి. ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని తల్లి కూతుళ్లను వారించింది. చివరకు మహిళా కమిషన్ చొరవతో ఈ విషయం వెలుగుచూసింది.