act amendments
-
370 రద్దు వల్లే కశ్మీర్లో భారీ పోలింగ్
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్లనే జమ్మూకశ్మీర్‌లో గురువారం జరిగిన బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్(బీడీసీ) ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆ ఎన్నికల్లో 98.3 శాతం పోలింగ్ నమోదైంది. ‘ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్న భారత పార్లమెంటుకు కృతజ్ఞతలు. ఆ నిర్ణయానికి పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపిన ఎంపీలకు ధన్యవాదాలు. ఇక యువకులు, ఉత్సాహవంతులైన ప్రజా ప్రతినిధులు జమ్మూకశ్మీర్ రాత మారుస్తారు’ అని శుక్రవారం మోదీ ట్వీట్ చేశారు. ఎలాంటి హింసాత్మక, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఎన్నికలు జరిగిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ‘జమ్మూ, కశ్మీర్, లేహ్, లదాఖ్‌ల్లో గురువారం బీడీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి హింస చోటు చేసుకోలేదు. 98% పైగా పోలింగ్ నమోదైంది. అక్కడి ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల ఉన్న విశ్వాసానికి ఇదే రుజువు’ అని మోదీ పేర్కొన్నారు. గత సంవత్సరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లే ఈ బీడీసీ ఎన్నికల్లో ఓటర్లు. ఆ ఎన్నికల్లో 22 మంది బీజేపీవారు సహా 27 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఆగస్ట్‌లో జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370 ని రద్దు చేసిన విషయం తెలిసిందే. -
సాధారణ పౌరుడిగానే సవాలు విసిరా
న్యూఢిల్లీ: తన ఆధార్ వివరాలు దుర్వినియోగం చేసి చూపాలని నెటిజన్లకు సవాలు విసిరిన టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఆదివారం వెనక్కు తగ్గారు. తాను ఓ సాధారణ భారతీయుడిగానే ఈ సవాలు విసిరాననీ, ట్రాయ్ చైర్మన్‌గా కాదని వివరణ ఇచ్చారు. సమాచార గోప్యతపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో.. పౌరుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం ఆధార్ చట్టానికి సవరణలు చేయాలని ఆదేశించింది. దీంతో తన ఆధార్ నెంబర్‌ను బయటకు వెల్లడించిన శర్మ.. దమ్ముంటే దాన్ని దుర్వినియోగం చేయాలని సవాలు విసిరారు. శర్మ సవాలుకు స్పందించిన పలువురు హ్యాకర్లు.. ఆధార్‌తో లింక్ అయిన 2 ఈ–మెయిల్స్, ఫోన్ నంబర్, పాన్, వ్యక్తిగత చిరునామా, ఎయిర్ఇండియా ఆయనకు కేటాయించిన ఫ్రీక్వెంట్ ఫ్లయర్ నంబర్(103546250)ను బయటపెట్టారు. కొందరైతే ఆయన నంబర్‌తో నకిలీ ఆధార్‌ను తయారుచేసి ఫేస్బుక్, అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్‌లో రిజిస్టర్ కాగా, మరికొందరు ఆయనకు ఖరీదైన మొబైల్ ఫోన్లను క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ పెట్టి కసి తీర్చుకున్నారు. -
స్వప్రయోజనాల కోసమే చట్ట సవరణలు
ఒంగోలు : కార్పొరేట్ వర్గాల స్వప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తోందని పలువురు వక్తలు ధ్వజమెత్తారు. 2013లోని భూసేకరణ చట్టంలో గల ప్రజానుకూల అంశాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎల్బీజీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డు అడిషనల్ జాయింట్ కలెక్టర్ షంషీర్ అహ్మద్ మాట్లాడుతూ నిర్మాణం చేసే ప్రాజెక్టు ప్రభుత్వానికి సంబంధించినది అయితే భూమి కోల్పోయేవారు 70 శాతం మంది, ప్రైవేట్ ప్రాజెక్టు అయితే 80 శాతం మంది ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. భూములు కోల్పోయిన వారికి పరిహారం, పునరావాసం విషయంలో మార్కెట్ రేటుకు నాలుగురెట్లు పెంచి ఇవ్వాలన్నారు. నిర్మాణం చేసే పరిశ్రమలో బాధిత కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్నారు. పనులు కోల్పోయిన వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు పింఛన్లు ఇవ్వాలని 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్నారన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రయోజనం పేరుతో సామాజిక అధ్యయనాన్ని 60 రోజుల నుంచి 15 రోజులకు కుదించేసిందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండున్నరేళ్ల కాలంలో 40 దేశాలకుపైగా తిరిగారన్నారు. మేకిన్ ఇండియా పేరుతో కార్పొరేట్ శక్తులు దేశాన్ని దోచుకునేందుకు చట్టాలు సవరిస్తున్నారన్నారు. కార్మిక చట్టాలు, భూసేకరణ చట్టాలను ప్రజాప్రయోజనాల కోసం కాకుండా కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తున్నారన్నారు. దీన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘ జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.వెంకట్రావు, కంకణాల ఆంజనేయులు, రైతు కూలీ సంఘ జిల్లా కార్యదర్శి కే నాంచార్లు, గిరిజన సంఘ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాసులు పాల్గొన్నారు. -
'భూసేకరణ' మార్పులను వ్యతిరేకించిన మేథా పాట్కర్
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న భూసేకరణ చట్టంలో మార్పులను సామాజిక ఉద్యమకారణి మేథాపాట్కార్ మంగళవారం న్యూఢిల్లీలో తీవ్రంగా వ్యతిరేకించారు. చట్టంలో మార్పులు తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం ఎందుకు తొందరపడుతుందో అర్థం కావడం లేదన్నారు. మార్పులు చేర్పుల కోసం ఆర్డినెన్స్ మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటోందని ఆమె ప్రశ్నించారు. కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేందుకు మాత్రమే మోదీ ప్రభుత్వం ఈ మార్పులు చేస్తుందని ఆరోపించారు. కేవలం భూసేకరణ చట్టం వల్లే రూ. 20 లక్షల పెట్టుబడులు ఆగిపోయాయనడం సరికాదని మేథాపాట్కర్ అభిప్రాయపడ్డారు.