'భూసేకరణ' మార్పులను వ్యతిరేకించిన మేథా పాట్కర్
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న భూసేకరణ చట్టంలో మార్పులను సామాజిక ఉద్యమకారణి మేథాపాట్కార్ మంగళవారం న్యూఢిల్లీలో తీవ్రంగా వ్యతిరేకించారు. చట్టంలో మార్పులు తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం ఎందుకు తొందరపడుతుందో అర్థం కావడం లేదన్నారు. మార్పులు చేర్పుల కోసం ఆర్డినెన్స్ మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటోందని ఆమె ప్రశ్నించారు. కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేందుకు మాత్రమే మోదీ ప్రభుత్వం ఈ మార్పులు చేస్తుందని ఆరోపించారు. కేవలం భూసేకరణ చట్టం వల్లే రూ. 20 లక్షల పెట్టుబడులు ఆగిపోయాయనడం సరికాదని మేథాపాట్కర్ అభిప్రాయపడ్డారు.