ఏపీ సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది:మేధా పాట్కర్
ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూసేకరణ పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందిన ప్రముఖ సంఘ సంస్కర్త మేధా పాట్కర్ విమర్శించారు. సోమవారం సాక్షి టీవీతో మాట్లాడిన ఆమె.. పంట భూముల్లో బిల్డింగ్ లు నిర్మించి పంటలను నాశనం చేస్తారా?అని ప్రశ్నించారు. రైతుల జీవనోపాధి, పర్యావరణానికి జరిగే నష్టాన్ని ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
రకరకాల పేరుతో రైతులను బెదిరించి భూసమీకరణ చేస్తున్నారని ఆమె విమ్శరించారు. త్వరలోనే రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని ఆమె స్పష్టం చేశారు. రైతులంతా ఐకమత్యంగా ఉండి పోరాటానాకి సిద్ధం కావాలని ఆమె సూచించారు.