adanki
-
అద్దంకిలో టీడీపీ బరితెగింపు..
అద్దంకి: అద్దంకిలో టీడీపీ బరితెగించింది. ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిని తన కారులో ఎక్కించుకువచ్చి నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. టీడీపీ ఎమ్మెల్యే దిగజారుడుతనాన్ని వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణచైతన్య విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. వివరాల్లోకి వెళ్తే.. అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 8వ వార్డులో వైఎస్సార్సీపీ తరఫున ఇద్దరు, టీడీపీ తరపున ఇద్దరు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కాగా టీడీపీ తరపున 8వ వార్డుకు నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు అదే రోజున స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ తరఫున 8వ వార్డుకు పోటీ లేకపోవడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ తరపున బీఫారం తీసుకుని నామినేషన్ వేసిన అభ్యర్థి పరశురాంను ఉపసంహరణ సమయానికి ఒక నిమిషం మాత్రమే సమయం ఉండగా తన సొంత కారులో తీసుకుని వచ్చి నామినేషన్‌ను ఉపసంహరణ చేయించారు. ఆధారాలున్నాయి, సీరియస్‌గా తీసుకుంటాం.. టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇంతగా దిగజారుతాడని అనుకోలేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన చెంచు గరటయ్య ఖండించారు. 8వ వార్డుకు మా పార్టీ తరఫున బీ ఫారం ఇచ్చిన ఎస్టీ అభ్యర్థిని ప్రలోభపెట్టి తన కారులో ఎక్కించుకుని వచ్చి నామినేషన్ ఉపసంహరణ చేయించడం దారుణమని మండిపడ్డారు. రెండేళ్లుగా ఇంట్లో కూర్చోని ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకొని ఎమ్మెల్యే రవికుమార్..ఇప్పుడు చంద్రబాబు వద్ద షో చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 8వ వార్డుకు నామినేషన్లు వేసిన మీ అభ్యర్థులు వారే వచ్చి నామినేషన్లు ఉపసంహరించుకోవడం నీకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని, ఈ సంఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ మా దగ్గరున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని పేర్కొన్నారు. మిగిలిన 19 వార్డుల్లో వైఎస్సార్ సీపీ విజయబావుటా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చదవండి చంద్రబాబు మాట.. అబద్ధాల మూట కట్టుకథ అల్లేసింది.. సీసీ టీవీ పట్టేసింది.. -
‘సింహం సింగిల్‌గా వస్తుంది.. బంపర్ మెజార్టీ ఖాయం’
-
‘సింహం సింగిల్‌గా వస్తుంది.. బంపర్ మెజార్టీ ఖాయం’
సాక్షి, ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్ధ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదుకాని, తన కుమారుడు నారాలోకేష్‌కు మాత్రం మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు. తన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని, ఇలాంటి సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని షర్మిల గుర్తుచేశారు చేశారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాగలూరులో బహిరంగ సభలో వైఎస్ షర్మిల ప్రసంగించారు. తమకు బీజేపీ,టీఆర్ఎస్తో పోత్తు అవసరంలేదని, వైఎస్ జగన్ సింహంలా సింగిల్‌గా వస్తారని తెలిపారు. ఎన్నికల వేళ మోసం చేయడానికి మరోసారి భూటకపు హామీలతో చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. పసుపు కుంకుమ పథకం పెద్ద కుట్రపూరితమైనదని, చేపలకు ఎర వేసినట్లుగా.. ఓటర్లకు ఎర వేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తుందని.. మళ్లీ రాజన్న రాజ్యం తీసుకువస్తామని ధీమా వ్యక్తంచేశారు. -
అదృశ్యమై.. శవమై కనిపించాడు!
అద్దంకి: ఓ వ్యక్తి రెండు నెలల క్రితం అదృశ్యమై శుక్రవారం శవమై కనిపించాడు. ఈ సంఘటన మండలంలోని వెంపరాల కొండపై వెలుగు చూసింది. ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీలు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు వెల్లడించారు. ఎస్సై కథనం ప్రకారం.. వెంపరాలకు చెందిన నేరెళ్ల యోహాన్ (50)కి భార్య అన్నమ్మ ఉంది. ముగ్గురు కుమార్తెలుకాగా అందరికీ వివాహాలయ్యాయి. కుమారుడు హైదరాబాదులో బేల్దారి పనులు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో యోహాన్ తరచూ మద్యం తాగి భార్యను, గ్రామస్తులను ఇష్టం వచ్చినట్లు తిడుతుండేవాడు. రెండు నెలల క్రితం భార్యపై పోట్లాడి రూ.వెయ్యి తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. పురుగుమందు డబ్బా, మద్యం సీసా కొనుగోలు చేసి కొండపైకి వెళ్లి అక్కడ రెండూ కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త కనిపించకపోవడంతో మతిస్థిమితం లేక ఎటో వెళ్లిపోయి ఉంటాడని భార్య భావించింది. ఈ నేపథ్యంలో ఉపాధి పనుల్లో భాగంగా కొండపై కందకాలు తీసేందుకు వెళ్లిన కూలీలు అక్కడ యోహాన్ మృతదేహం ఆనవాళ్లు గుర్తించి పోలీసులు, ఆయన బంధువులకు సమాచారం ఇచ్చారు.