addepalli
-
అద్దేపల్లిలో వైఎస్సార్ విగ్రహం పునఃప్రతిష్ట
భట్టిప్రోలు: బాపట్ల జిల్లా భట్టిప్రోలు పంచాయతీ అద్దేపల్లిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆదివారం పునఃప్రతిష్టించారు. ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని టీడీపీ వర్గీయులు పెట్రోలు పోసి దహనం చేసిన విషయం విదితమే. ఈ చర్యను నిరసిస్తూ, ఆ స్థానంలో మరో విగ్రహం ఏర్పాటు చేయాలంటూ వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు శనివారం రాత్రి మౌనదీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు అశోక్బాబును రేపల్లె తరలించారు.ఆయన రాత్రి 12 గంటల వరకు రేపల్లె పోలీస్స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను దీక్ష విరమించేది లేదని చెప్పడంతో బాపట్ల ఎస్పీ వకుల్జిందాల్ ఆదేశాల మేరకు అశోక్బాబును పోలీసులు బలవంతంగా చెరుకుపల్లిలోని ఆదిశంకర వ్యాలీలోగల ఆయన నివాసానికి రాత్రి ఒంటిగంట సమయంలో తరలించారు. అశోక్బాబు ఆదివారం కూడా తన నివాసంలో దీక్షను కొనసాగించారు. ఆదివారం ఉదయం ధ్వంసమైన వైఎస్సార్ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం మూడుగంటలకు దళితవాడ వాసులు పూలమాలలు వేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.దళిత హోంమంత్రి, దళిత డీజీపీని పెట్టి పోలీసులతో దళితులపై లాఠీఛార్జి చేయించిన ఘనత సీఎం చంద్రబాబుకే చెల్లుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాన్ని దహనం చేసిన నిందితులను, వారిని నడిపించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబాను అరెస్టు చేయాలని అశోక్బాబు డిమాండ్ చేశారు. వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసిన వీడియో, ఫొటోలు చూసిన అనంతరమే దీక్షను విరమిస్తామని అశోక్బాబు చెప్పడంతో వాటిని చూపించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ నిమ్మరసం ఇచ్చి అశోక్బాబుతో దీక్ష విరమింపజేశారు. -
జీవితంలో సాహిత్యాన్ని దర్శించిన విమర్శకుడు
‘‘కవిత్వానికి కవి ఇవ్వాల్సిందేమిటి? బహుశః తన రక్తమాంసాలివ్వాలి. సొంత భాషనివ్వాలి. అంతిమంగా తన ప్రాణమివ్వాలి. కవితకి భావాలు, భావ చిత్రాలు, అలంకారాలు ఇవ్వటం వేరు. ఇవి బాహ్య విషయాలు మాత్రమే. కవి రక్తమాంసాల్ని హరించినప్పుడే కవిత జవజీవాలు పొందుతుంది. ఒక మహా శిల్పం రూపొందించిన తర్వాత అంతిమంగా దానికి ప్రాణరేఖ చెక్కే శిల్పిలాంటి వాడే కవి. ప్రతి గొప్ప కవిత ప్రాణమున్న వ్యక్తే’’ – పాపినేని శివశంకర్ పది కాలాలపాటు నిలబడే కవిత్వం గురించి శివశంకర్ వ్యాఖ్యానం ఇది. ఈ వాక్యాలు చెప్పడానికి శివశంకర్ గమనింపు ఏమిటి? ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారు? ఎన్ని అధ్యయనం చేసి ఉండాలి? నాలుగు పుస్తకాలకు సమీక్షలు రాసి ప్రముఖ విమర్శకులుగా చెలామణీ అవుతున్న ఈ కాలంలో తెలుగు సాహిత్య విమర్శకు ‘శివశంకర్’ ఏమి ఇచ్చాడు? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ‘సాహిత్యం– మౌలిక భావనలు’ సిద్ధాంత గ్రంథం, ద్రవాధునికతను తెలుగు సాహిత్యానికి అన్వయించడం, నిశాంత పేరు మీద అందించిన సాహిత్య తాత్విక వ్యాసాలను మనం పరిశీలించినప్పుడు... కొన్ని అన్వయాలను, కొన్ని భావనలను, ధిక్కారం నిసర్గత లాంటి సాహిత్య సారాంశాన్ని తవ్వితీసే సాధనాలను రూపొందించటానికి కృషి చేసినట్టు తెలుస్తుంది. ‘మనిషి–ప్రకృతి–సమాజం’ అనే త్రికానికి సంబంధించిన సారాంశాన్ని రచయిత అర్థం చేసుకొని, ఆవిష్కరించగలగాలి. విలువలేని సాహిత్యాన్ని తూర్పారబట్టగలగాలని అంటారు. ‘విమర్శకుడు’ అనగానే పనిగట్టుకొని లోపాలు వెతకడం కాదు. మంచిచెడుల వివేచన ఉండాలి. సంయమనం ఉండాలి. వస్తువు, శిల్పం, అభివ్యక్తి, రూపం లాంటి నాలుగు పడికట్టు మాటలతో రచనని చూడటం శివశంకర్కి తెలియదు. కవిత్వీకరణకు సంబంధించి ప్రాచీనులు ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అనే మూడు హేతువులు అవసరం అన్నారు. ఇవాళ కవిత్వం రాస్తున్నవారికి ప్రాథమికంగా మూడు మౌలిక విషయాలను శివశంకర్ సూచిస్తున్నారు. ( మాలపల్లి నవల: నూరేళ్ల... విప్లవాత్మక సృజన) 1. భావబలం, 2. భావనాబలం, 3. భాషాబలం. కవిత్వ విమర్శకుడిగా ఆయన చేసిన మరికొన్ని పరిశీలనలు చూస్తే. 1. కవిత్వం వైయుక్తికాన్ని సామాజిక దృక్పథం నుంచి విలువ కట్టే ఆలోచనా ధోరణి ప్రవేశించింది. 2. ఇవాళ కవిత్వంలో కనబడే ఒక ప్రధాన లక్షణం బహుముఖీనత. ఇక్కడ మహాకవి పదవులు, ఏక నాయకత్వాలు లేవు. ఏక సమయంలో ఎన్నో గొంతులు కలివిడిగా, విడివిడిగా వినిపిస్తున్నాయి. వస్తువు విస్తృతమైనది. కవిత్వాకాశ వైశాల్యం పెరిగింది. 3. దేశీయత లేదా స్థానీయత ఇప్పటి కవిత్వంలో ఒక ముఖ్యాంశం అయింది. ‘విశ్వం నుంచి నాదాకా’ అనే సూత్రం ముందుకొచ్చింది. 4. సొంత భాషని ఎంతగా లీనం చేసుకుంటే ఆ కవి కవిత్వం అంత నిసర్గంగా ఉంటుంది. 5. కవిత్వంమంటే భాష యొక్క ఉన్నత వ్యక్తీకరణ కాదు. అందమైన అభివ్యక్తీ కాదు. పదచిత్రాలు, భావ చిత్రాల పొహళింపు కాదు. జీవితాన్ని తార్కికంగా కాదు, తాత్వికంగా వివేచించాల్సి ఉంది. ఇకపోతే జిగ్మంట్ భౌమన్ చెప్పిన లిక్విడ్ మోడల్ని ‘ద్రవాధునికత’గా శివశంకర్ మనదైన జీవన విధానాలకు అనుగుణంగా అన్వయం చేశారు. శరవేగంగా మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ‘ద్రవాధునికత’ను ఒక పరికరంగా మన ముందుంచారు. వ్యక్తి, ప్రకృతి, సమాజం.. వీటిని వ్యాపారమయం చేసిన తీరు తెలిపారు. మనం ఒక ప్రవాహంలో పడిపోయాం. అది క్షణక్షణం మారిపోయే ప్రవాహం. రూపం మార్చుకున్న ప్రవాహం. ఎక్కడా విలువలు కనిపించవు. కొత్తదనంపై తీవ్రమైన మోజు, అర్ధరాహిత్య జీవనం, అమానవీయత, మానవ దూరం.. ఇవన్నీ ద్రవాధునికతలో భాగం. (Mannu Bhandari: రాలిన రజనీగంధ) ఆయన మాటల్లో ద్రవాధునికత లక్ష్యం ఇది – ‘‘ఇవాళ ముఖ్యంగా నాగరిక, విద్యాధిక, ధనాధిక, కార్పొరేట్ వర్గ జీవన విధానంలో ద్రవాధునికత తెచ్చిన సరికొత్త మార్పు తేలిగ్గా గుర్తించగలం. అది మోగించే ప్రమాదఘంటికలు వినగలం. రకరకాల (అడ్డ)దారుల ద్వారా ఉరువైన నూతన సంపన్నవర్గం ఏర్పడింది. దానికి కరెన్సీ స్విమ్మింగ్ పూల్లో ఈదడం మహానందం. స్వసుఖ జీవనంతో తప్ప దానికి ఏ సామాజిక, వైయక్తిక విలువలతో పని లేదు.’’ ‘ద్రవాధునికత’ స్థితిని దాటేందుకు కూడా ఆయన కొన్ని పరికరాల్ని చూపారు. ప్రకృతిలో మైత్రి, సామూహికం, పురానవం, నిరహంకారం, నిబ్బరం, సృజనాత్మకత లాంటి విలువైన మార్గాలు చూపారు. ఆయన ద్రవాధునికతను ఒక పనిముట్టుగా చేసుకున్నారు. దాని సాయంతో సమాజంలోని స్థితిగతులను వ్యాఖ్యానించి, మనం ఇంకా ఎంత మంచి మనుషులుగా మారాల్సి వుంటుందో గుర్తు చేశారు. మానవ జీవితం ఎట్లా ఉంది? ఎట్లా ఉండాలి అనే వైరుధ్యాన్ని పరిష్కరించే దిశగా రచనలు సాగాలని ఈ విమర్శకుడి ఉద్దేశం. ప్రపంచీకరణ సారాంశాన్ని, పతనీకరణ సారాంశాన్ని గుర్తించి ఎరుకతో ఎలా జీవించాలో హెచ్చరిస్తున్నారు. సాహిత్యంలో జీవితం గురించే కాదు, జీవితంలో సాహిత్యం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన విమర్శకుడు పాపినేని. - డాక్టర్ సుంకర గోపాల్ వ్యాసకర్త తెలుగు సహాయాచార్యులు (కాకినాడలో పాపినేని శివశంకర్ ‘అద్దేపల్లి కవిత్వ విమర్శ పురస్కారం’ అందుకుంటున్న సందర్భంగా) -
సాహితీవనంలో తులసిమొక్క ‘అద్దేపల్లి’
సంస్మరణసభలో ప్రముఖుల నివాళి ‘అల్లూరి’ వీరగాథ ఆవిష్కరణ కాకినాడ కల్చరల్ : ప్రజాకవి అద్దేపల్లి రామ్మోహనరావు సాహితీవనంలో తులసి మొక్కవంటి వారని ప్రముఖ సాహితీవేత్త గిడ్డి సుబ్బారావు అన్నారు. స్థానిక రోటరీ క్లబ్లో అద్దేపల్లి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో అద్దేపల్లి సంస్మరణ సభ గిడ్డి అధ్యక్షతన అదివారం జరిగింది. అద్దేపల్లి రచించిన వచనకవితా విప్లవ వీరకథాకావ్యం ‘అల్లూరి సీతారామరాజు’ను గిడ్డి ఆవిష్కరించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా గిడ్డి మాట్లాడుతూ అద్దేపల్లి నడిచే గ్రంథాలయం వంటి వారన్నారు.‘అల్లూరి సీతారామరాజు’ కావ్యంపై సాహిత విమర్శకులు మేడి రవికుమార్ సమీక్ష చేశౠరు. తెల్లదొరల పాలనపై పోరాడి, వీరమరణం పొందిన అల్లూరి సీతారామరాజు గాథ మనందరికి ఆదర్శంగా నిలిచే విధంగా అద్దేపల్లి రచించారన్నారు. అద్దేపల్లి కవిత్వమే శ్వాసగా జీవించారని మరో రచయిత డాక్టర్ శిరీష అన్నారు. దేశ విదేశాల్లో పేరుగాంచిన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’పై అద్దేపల్లి సంధించిన విమర్మనాస్త్రం సంచలనం సృష్టించిందని కవి, విమర్శకులు కె.వి.రమణారెడ్డి అన్నారు. కవనలోకంలో వెలుగులు విరజిమ్మే ధృవతార అద్దేపల్లి మనల్ని వదిలి వెళ్ళి వసంతం గడిచినా, ఆయన రచనల గుబాళింపు తగ్గలేదని విమర్మకులు వాసా భూపాల్ అన్నారు. అద్దేపల్లి సాహిత్య వ్యవసాయంలో ఎందరో కవులు పుట్టుకొచ్చారని రచయిత పి.సీతారామరాజు అన్నారు. మహాకవి అద్దేపల్లి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువేనని కవి సయ్యద్ సాలర్ అన్నారు. తెలుగు సాహిత్యంలో వచ్చిన అభ్యుదయవాదం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళితవాదం, ప్రపంచీకరణ మొదలైన అన్ని అంశాల మీదా, నాటి సమకాలీన పరిస్థితులపై ఆయన వందలాది వ్యాసాలను రచించి ప్రజలను ఉత్తేజపరిచారని కవి పద్మవాణి అన్నారు. అనేక మంది యువకవుల్ని తయారు చేసిన ఘనత అద్దేపల్లి సొంతమని రచయిత అద్దేపల్లి రాధాకృష్ణ అన్నారు. సమకాలీన పరిస్థితులపై అప్పటికప్పుడు రచనలు చేయడం ఆయన శైలి అని వక్తిత్వ వికాస సమాజం కో ఆర్డినేటర్ అద్దేపల్లి ఉదయభాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితివేత్తలు, కవులు దేవదానంరాజు, భగవాన్, పి.వెంకటప్పయ్య, వీరలక్షీ్మదేవి తదితరులు పాల్గొన్నారు. -
కవిత్వమే ఊపిరిగా బతికిన ప్రజాకవి
నేడు ‘అద్దేపల్లి’ ప్రథమ వర్ధంతి ∙ 22న ‘అల్లూరి వీరగాథ’ ఆవిష్కరణ కాకినాడ కల్చరల్ (కాకినాడ సిటీ): కవిత్వమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి అద్దేపల్లి రామ్మోహనరావు. తన సుదీర్ఘ సాహిత్య ప్రస్థానంలో అభ్యుదయ భావాలకు పట్టం కట్టిన ఆయన గత ఏడాది జనవరి 13న తుదిశ్వాస విడిచారు. చివరిగా ఆయన చేతినుంచి జాలువారిన ‘అల్లూరి సీతారామరాజు వీరగాథ’ కావ్యం(వచన కవిత)ను ఈనెల 22న స్థానిక రోటరీ క్లబ్లో జరగనున్న అద్దేపల్లి ప్రథమ వర్ధంతి సభలో ఆవిష్కరించనున్నారు. ‘నిరంతర సాహితీ సంచారి’గా పేరొందిన అద్దేపల్లి 1936లో సెప్టెంబరు 6న మచిలీపట్నంలో అద్దేపల్లి సుందరరావు, రాజరాజేశ్వరి దంపతులకు జన్మించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తెలుగు చదివి, మచిలీ పట్నం, నందిగామలలో అధ్యాపకునిగా పనిచేసారు. తదుపరి 1972లో కాకినాడలోని మల్లాడి సత్యలింగనాయకర్ చారిటీస్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా చేరిన ఆయనకు ఈ నగరమే శాశ్వత నివాసం అయింది. కవిగా, విమర్శకునిగా, వక్తగా, కవిత్వ కార్యకర్తగా రాష్ట్రం అంతా పర్యటించి వందలాది యువకవుల్ని తయారు చేశారు. ‘మధుజ్వాల, అంతరŠాజ్వల, రక్తసంధ్య, అయినా ధైర్యంగానే, పొగచూరిన ఆకాశం, గోదావరి నా ప్రతిబింబం’ మొదలైన ఎన్నో కవితా సంకలనాలు వెలువరించారు. నిరంతరం ముఖంలో చెదరని చిరునవ్వు, వినూత్నమైన హెయిర్ స్టైల్, ఇ¯ŒSషర్ట్లతో కనిపించే ఆయన సాహితీ లోకానికి సుపరిచితుడు. సాహిత్య లోకానికి ఆయన ఒక సంచార గ్రంథాలయం. మహాకవి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’పై అద్దేపల్లి రాసిన విమర్మనాగ్రంథం సంచలనం సృష్టించింది. తెలుగు సాహిత్యంలో వచ్చిన అభ్యుదయవాదం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళితవాదం, ప్రపంచీకరణ మొదలైన అన్ని అంశాల మీదా, నాటి సమకాలీన పరిస్థితులపైనా విమర్శకునిగా వందలాది వ్యాసాలను రచించారు. కవిత్వంలో ప్రతిష్టాత్మకమైన చిన్నప్పరెడ్డి పురస్కారం, నాగభైరవ అవార్డు లాంటి ఎన్నో గౌరవాలు అందుకున్నారు. దాదాపు వెయ్యిమంది నూతన కవుల సంకలనాలకు ముందుమాటలు రాసి ప్రోత్సహించారు. నిరంతరం రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో జరిగే సాహిత్య సభలలో సైతం పాల్గొని కవిత్వాన్ని ప్రచారం చేశారు.